కావేరి సీడ్స్‌లో ఎఫ్‌పీఐల వాటా పెంపునకు ఆర్‌బీఐ ఓకే
ముంబై: విత్తన తయారీ సంస్థ కావేరి సీడ్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) వాటాను 49 శాతానికి పెంచుకునేందుకు ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. 2015 మార్చి చివరి నాటికి కంపెనీలో ఎఫ్‌ఐఐల వాటా 22.26 శాతం ఉంది. వాటా కొనుగోలుకు ఉన్న పరిమితులను తొలిగిస్తున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కింద ఎఫ్‌ఐఐలు లేదా ఆర్‌ఎఫ్‌పీఐలు 49 శాతం వరకు పెట్టుబడి పెట్టొచ్చని తెలిపింది. ఎఫ్‌ఐఐల పరిమితిని ప్రస్తుతమున్న 24 నుంచి 49 శాతానికి చేర్చేందుకు బోర్డుతోపాటు వాటాదారుల నుంచి కంపెనీ మే నెలలో సమ్మతి పొందింది.