యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీరేట్లను మరింత తగ్గించనుందనే అంచనాలతో భారత ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను పెంచుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారీగా అమ్మకాలు చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) రెండు వారాలుగా తిరిగి ఇండియన్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ను పెంచుతున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
డిసెంబరు మొదటి రెండు వారాల్లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.22,766 కోట్లను భారతీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. నవంబర్‌లో వీరు రూ.21,612 కోట్లు, అక్టోబర్‌లో భారీగా రూ.94,017 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు సెప్టెంబరులో ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్ తొమ్మిది నెలల గరిష్టానికి చేరడం విశేషం. ఆ నెలలో నికర పెట్టుబడి రూ.57,724 కోట్లుగా ఉంది.
ఇదీ చదవండి: క్లెయిమ్ చేసుకోని నిధులు రూ.880 కోట్లు
ఎఫ్‌పీఐలు పెరగడానికిగల కారణాలు..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతపై అంచనాలు: ఇప్పటికే ఫెడ్ వడ్డీరేట్లను దాదాపు 50 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. డిసెంబర్ 19న విడుదలయ్యే ఫెడ్ సమావేశంలో మరో 25 బేసిస్ పాయింట్లను తగ్గించనున్నట్లు అంచనా వేస్తున్నారు. దాంతో ఇతర ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లను మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
మార్కెట్ సెంటిమెంట్: సానుకూల రాజకీయ పరిణామాలు, కార్పొరేట్ ఆదాయాల్లో రికవరీ, ప్రైమరీ, సెకండరీ మార్కెట్లలో పెరిగిన పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచాయి.
సీఆర్ఆర్ తగ్గింపు: క్యాష్ రిజర్వ్ రేషియో(సీఆర్‌ఆర్) తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం వల్ల మార్కెట్‌లో లిక్విడిటీ, సెంటిమెంట్ మెరుగుపడనుంది.
ద్రవ్యోల్బణం తగ్గుదల: భారత వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 6.21 శాతం నుంచి నవంబర్‌లో 5.48 శాతానికి తగ్గింది. ఇది ఆర్‌బీఐ ద్రవ్య విధాన సడలింపుపై ఆశలను పెంచింది.
చైనా మార్కెట్లలో అనిశ్చితి: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనా వస్తువులపై ప్రతిపాదిత సుంకాల పెంపు అంచనాలు భారతీయ ఈక్విటీలకు పాజిటివ్‌గా నిలుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment