rewards
-
బహుమతి పుచ్చుకుంటున్నారా..?
పెళ్లి, నామకరణం.. వేడుక ఏదైనా బోలెడన్ని బహుమానాలు వచ్చి పడుతుంటాయి. ఉద్యోగుల పనితీరుకు మెచ్చి యాజమాన్యాలు సైతం పలు రూపాల్లో ఉచిత కానుకలు అందిస్తుంటాయి. నగదు రూపంలో లేదా వస్తు రూపంలో లేదా పర్యటనల రూపంలో ఈ ప్రయోజనాలు ఉండొచ్చు. ఇలాంటి బహుమతులన్నీ ఆదాయపన్ను పరిధిలోకి వస్తాయన్నది వాస్తవం. ఈ విషయంలో చట్టంలో పలు మినహాయింపులు కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే వచ్చిన కానుకలను చట్టబద్దం చేసుకోవచ్చు. ఇవి తెలియకపోతే ఆదాయపన్ను విభాగం నుంచి తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే కథనం ఇది. బహుమానం ఎవరి నుంచి వచ్చిందన్న దానితో సంబంధం లేదు. దాని విలువ రూ.50,000కు మించకుండా ఉంటే ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ ఈ బహుమానం స్నేహితులు, లేదా ఇతరుల నుంచి అందుకుంటే, దాని విలువ రూ.50,000కు మించి ఉంటే ఆ మొత్తంపై తప్పకుండా పన్ను చెల్లించాలి. ఒకవేళ ఈ బహుమానం విలువ రూ.50,000కు మించి ఉన్నా సరే.. దాన్ని సమీప బంధువుల నుంచి అందుకుంటే ఎలాంటి పన్ను వర్తించదని ఆదాయపన్ను చట్టం చెబుతోంది. రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ఒక ఆర్థిక సంవత్సరానికే పరిమితం. అంటే ఒకే సారి కాకుండా, ఏటా రూ.50,000 విలువకు మించకుండా బంధువులు కాని వారి నుంచి బహుమతి స్వీకరించడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. ప్రత్యేక మినహాయింపులు పెళ్లి సందర్భంగా బంధు మిత్రుల నుంచి వివిధ రూపాల్లో కానుకలు వస్తుంటాయి. విలువతో సంబంధం లేకుండా ఇలాంటివన్నీ కూడా పన్ను మినహాయింపు కిందకే వస్తాయి. బంగారం, వ్రస్తాలు, ప్రాపర్టిలు, షేర్లు, బాండ్లు.. ఇలా బహుమతి ఏదైనా, ఎంత విలువ అయినా పెళ్లి సమయంలో అందుకుంటే పన్ను పడదు. వీలునామా ద్వారా సంక్రమించిన కానుకలు (ఆస్తులు/మరేవైనా) లేదా వారసత్వంగా సంక్రమించిన ఆస్తులపైనా లేదా ఒకరి మరణంతో దానంగా సంక్రమించే వాటికి కూడా బహుమతి పన్ను మినహాయింపు ప్రయోజనం వర్తిస్తుంది. గిఫ్ట్ ట్యాక్స్‌ను మొట్టమొదటగా 1958 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు. దీన్ని 1998లో రద్దు చేశారు. అనంతరం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 56(2) కింద బహుమతి పన్నును ప్రవేశపెట్టారు. విలువతో కూడిన ఏ బహుమానం అయినా, అది ఏ రూపంలో ఉన్నా ఈ సెక్షన్ కింద పన్ను పరిధిలోకి వస్తుంది. బహుమతి స్వీకరించిన వారికే పన్ను బాధ్యత. ఇచ్చిన వారిపై ఉండదు. తప్పకుండా వెల్లడించాల్సిందే.. సమీప బంధువులు, బంధువులు కాని వారి నుంచి బహమతులు అందుకున్నా కానీ, ఈ వివరాలను ఆదాయపన్ను రిటర్నుల్లో వెల్లడించాల్సిందే. ‘ఎగ్జెంప్ట్ ఇన్కమ్’ షెడ్యూల్ కింద వివరాలు తెలియజేయాలి. ఉచిత బహుమతులే అయినప్పటికీ, వీటిని భవిష్యత్తులో విక్రయించినప్పుడు మూలధన లాభాల పన్ను బాధ్యత ఎదురవుతుంది. కనుక బహుమతుల స్వీకరణను ఐటీఆర్‌లో తప్పకుండా వెల్లడించడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాదు గిఫ్ట్ స్వీకరణకు సంబంధించి ఆధారాలను సైతం జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి. భవిష్యత్తులో ఆదాయపన్ను శాఖ అధికారులు వివరాలు కోరితే ఇవ్వడానికి ఉంటుంది. విలువైన, ఖరీదైన బహమతుల విషయంలో స్టాంప్ పేపర్‌పై గిఫ్ట్ డీడ్ రాసుకోవాలన్నది నిపుణుల సూచన. ఆదాయపన్ను శాఖ అదికారుల నుంచి పిలుపు వస్తే నిరూపించుకునేందుకు ఆధారంగా పనికొస్తుంది. ‘‘పన్ను పరిధిలోకి రాని బహుమతుల వివరాలు వెల్లడించేందుకు ప్రస్తుత ఐటీఆర్ షెడ్యూల్స్‌లో నిబంధనల్లేవు. అయినా కానీ, రక్షణాత్మక ధోరణితో వాటిని ‘షెడ్యూల్ ఎగ్జెంప్ట్ ఇన్కమ్’ కింద వెల్లడించడం సూచనీయం’’అని ఇండస్ లా పార్ట్నర్ శృతి కె.పి సూచించారు. అన్ని ఐటీఆర్ పత్రాల్లోనూ షెడ్యూల్ ఈఐ ఉంటుంది. కనుక ఆదాయ వనరుల ఆధారంగా ఐటీఆర్‌ను ఎంపిక చేసుకుని, అందులో బహమతుల వివరాలు వెల్లడించాలి. తల్లిదండ్రుల నుంచి బహుమతి తీసుకున్నప్పుడు, వారి ఆదాయ వనరుల గురించి ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. సమీప బంధువులు ఎవరు? చట్టంలో ‘రిలేటివ్’ (బంధువు)కు వివరణ ఉంది. భార్య లేదా భర్త; తల్లి దండ్రులు; అమ్మ వైపు అమ్మమ్మ, తాతయ్య; నాన్న వైపు నాయనమ్మ, తాతయ్య; భార్య లేదా భర్త వైపు సహోదరులు; తల్లి, తండ్రి తోడబుట్టిన వారు.. వీరంతా బంధువు కిందకే వస్తారు. సెక్షన్ 56 ప్రకారం మరింత వివరంగా చెప్పుకోవాలంటే..? భార్యకు భర్త, భర్తకు భార్య బంధువే. వీరిలో ఒకరి సోదరులు, సోదరీమణులు మరొకరికి బంధువే అవుతారు. సోదరుడు, సోదరుడి భార్య, అలాగే సోదరి, సోదరి భర్తను కూడా చుట్టంగానే చట్టం పరిగణిస్తోంది. తండ్రి లేదా తల్లి తోడబుట్టిన వారు, వారి జీవిత భాగస్వాములు సైతం (అత్త, మామ, బాబాయి, పిన్ని) బంధువులే అవుతారు. అలాగే భార్య తన భర్త తండ్రి (మామ), తల్లి (అత్త) నుంచి, ఆ అత్తా మామల తల్లిదండ్రుల నుంచి తీసుకునే కానుకలు.. ఇదే మాదిరి భర్త తన భార్య తల్లిదండ్రులు (అత్త, మామ), ఈ అత్తా మామల తల్లిదండ్రుల నుంచి పొందే కానుకల విలువ ఎంత ఉన్నా చట్టం పరిధిలో పన్ను చెల్లించక్కర్లేదు. కానుకలు అన్నీ ఒక్కటేనా? ఉచితంగా ఇచ్చేవి ఏవైనా సరే కానుకల కిందకే వస్తాయి. వాస్తవ విలువలో కొంత మొత్తాన్ని తీసుకుని ఇచ్చినా చట్ట పరిధిలో బహుమతి అవుతుంది. బంగారం కావచ్చు. లేదా భూమి, ఫ్లాట్, ఆభరణాలు, కళాకృతులు (స్థిర, చరాస్తులు), గృహోపకరణాలు, ఇతర వస్తువులు ఏవైనా సరే చట్టం పరిధిలో బహుమతే అవుతుంది. నగదు రూపంలో వచ్చే బహుమానం విషయంలో, విలువ ఎంతన్న దానిపై గందరగోళం ఉండదు. కానీ, బంగారం లేదా షేర్లు, లేదా భూములు తదితర కానుకల విలువ నిర్ణయించే విషయంలో నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. అంటే వీటికి చట్టపరిధిలో విలువను ఖరారు చేయాలి. లిస్టెడ్ కంపెనీల షేర్లు అయితే బహుమతి ఇచ్చే నాటికి ఉన్న ధరను పరిగణనలోకి తీసుకుంటారు. భూమి, ఫ్లాట్, ప్లాట్ తదితర స్థిరాస్తిని రూపాయి కూడా తీసుకోకుండా బహుమతి కింద ఇస్తే.. ఆ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ స్థిరాస్తిని (భూమి/భవనం) ఉచితంగా కాకుండా, మార్కెట్ విలువ కంటే తక్కువకు బహుమతి కింద ఇచ్చారని అనుకుందాం. అటువంటప్పుడు స్వీకర్త చెల్లించిన మొత్తం, స్టాంప్ డ్యూటీ విలువ నుంచి తీసివేసిన తర్వాత, దాని విలువ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మొత్తం స్టాంప్ డ్యూటీలో 10 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తికి రూ.10 లక్షల ప్రాపర్టీని రూ. 5లక్షలు తీసుకుని బహుమతి కింద ఇచ్చారని అనుకుందాం. ఆ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువ రూ.8 లక్షలు ఉంది. ఈ కేసులో మార్కెట్ విలువ రూ.8 లక్షల నుంచి, స్వీకర్త చెల్లించిన రూ.5 లక్షలు మినహాయించగా, మిగిలిన రూ.3లక్షలు.. రూ.50,000 పరిమితిని దాటింది. కనుక ఈ కేసులో స్టాంప్ ట్యూటీ విలువ రూ.8 లక్షల్లో 10 శాతం అంటే.. రూ.80,000పై పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక ఆభరణాలు, పెయింటింగ్‌లు, శిల్పాలు తదితర చరాస్తులను బహమతిగా పొందినప్పుడు, వాటి ఫెయిర్ మార్కెట్ ప్రైస్ (సహేతుక మార్కెట్ ధర) రూ.50,000 మించితే, ఆ మొత్తంపై పన్ను చెల్లించాలి. ఒకవేళ సహేతుక మార్కెట్ ధర కంటే తక్కువ మొత్తానికి కానుకగా పొందారనుకుంటే.. అప్పుడు సహేతుక మార్కెట్ ధర నుంచి, చెల్లించిన ధర తీసివేయగా మిగిలిన వ్యత్యాసంపై పన్ను చెల్లించాలి. స్థిరాస్తిని రూపాయి కూడా చెల్లించకుండా ఉచిత బహమతిగా పొందితే, విడిగా ప్రతి లావాదేవీకి రూ.50,000 పరిమితి వర్తిస్తుందని ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఎఫ్ఏక్యూ స్పష్టం చేస్తుంది. దీని ఆధారంగా ఎక్స్ అనే వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు స్థిరాస్తులను బహమతిగా స్వీకరించాడని అనుకుందాం. విడిగా ప్రతి ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువ రూ.50,000 మించి లేదు. ఇలాంటప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఏర్పడదు. హెచ్‌యూఎఫ్‌లకు కూడా ఇదే వర్తిస్తుంది. గిఫ్ట్ ద్వారా ఆదాయం..→ నామకరణం, ఇతర సందర్భాల్లో పిల్లల పేరిట కూడా బహమతులు సంక్రమిస్తుంటాయి. అ లాంటి బహుమతులపై వచ్చే ఆదాయం వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. → కొంత మంది పన్ను భారం తప్పించుకోవచ్చన్న ఉద్దేశంతో.. ప్రాపర్టిపై తమకు వస్తున్న అద్దె ఆదాయాన్ని తమ పిల్లలు లేదా మనవళ్లు/మనవరాళ్లకు (బంధువులు) ఏ నెలకానెల బహుమతి కింద ఇచ్చేస్తుంటారు. చట్టం దీన్ని బహుమతిగానే పరిగణిస్తుంది. కానీ, దీనికంటే ముందు బహుమతిగా ఇస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయానికి అద్దె ఆదాయం కలుస్తుందని మర్చిపోవద్దు. అంటే చట్ట ప్రకారం సంబంధిత అద్దె ఆదాయాన్ని తమ వార్షిక రిటర్నుల్లో చూపించి, పన్ను పరిధిలోకి వస్తే పన్ను చెల్లించాల్సిందే. → తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల పేరిట బ్యాంక్ ఖాతా తెరిచి అందులో నగదు డిపాజిట్ చేస్తుంటారు. తల్లిదండ్రులు తమ ఆదాయంపై పన్ను చెల్లిస్తారు. కానీ, ఇలా మైనర్ పేరిట చేసిన డిపాజిట్‌పై వచ్చే ఆదాయం సంబంధిత తల్లితండ్రి లేదా సంరక్షకుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. డిపాజిట్‌ను బహమతిగా చూపించినప్పటికీ.. చిన్నారులు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటారు. వారికి ఏ విధమైన ఆదాయం ఉండదు. కనుక ఆ బహమ తులపై ఆదాయం వారి తల్లిదండ్రుల ఆదాయానికే కలుస్తుంది. → ఒకవేళ ప్రత్యేక నైపుణ్యాలు, మరేదైనా స్టార్టప్ రూపంలో చిన్నారులు సంపాదిస్తుంటే వారి వ్యక్తిగత ఆదాయమే అవుతుంది. అలాంటి కేసుల్లో చిన్నారుల తరఫున తల్లిదండ్రులు రిటర్నులు వేసి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆదాయానికి కలిసే విషయంలో.. దంపతులు ఇద్దరూ సంపాదనా పరులైతే వారి లో ఎక్కువ ఆర్జించే వారికి ఇది కలుస్తుంది. → ఉదాహరణకు షేర్లను పిల్లలకు గిఫ్ట్‌గా ఇస్తే, వాటిపై వచ్చే డివిడెండ్ తల్లిదండ్రుల ఆదాయానికే కలుస్తుంది. యాజమాన్యం నుంచి బహమతులు మన దేశంలో ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉద్యోగులకు పలు సందర్భాల్లో బహమతులు ఇస్తుంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే బహుమతుల విలువ రూ.5,000 మించకపోతే, దానిపై పన్ను చెల్లించక్కర్లేదు. నగదు, గిఫ్ట్ వోచర్, ఈ–వోచర్, ప్రీపెయిడ్కార్డ్ ఇలా ఏ రూపంలో ఉన్నా, వాటి విలువ రూ.5,000 మించితే ఆ మొత్తం వేతన ఆదాయానికి కలిపి చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ‘‘ఒక ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం చెల్లించే అన్ని రకాల బహుమతుల విలువ రూ.5,000 మించితే అది పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది’’అని బీడీవో ఇండియా పార్ట్నర్ (ట్యాక్స్) ప్రీతి శర్మ తెలిపారు. ఎంత పన్ను చెల్లించాలి? ఆదాయపన్ను చట్టం ప్రకారం పన్ను మినహాయింపుల్లేని కేసుల్లో.. ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న కానుకల విలువను ఇతర ఆదాయం (ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్) కింద చూపించాల్సి ఉంటుంది. అంటే సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వారి మొత్తం ఆదాయానికి ఇది తోడవుతుంది. శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వారి ఆదాయం బేసిక్ పన్ను మినహాయింపు (పాత విధానంలో రూ.2.5 లక్షలు, కొత్త విధానంలో రూ.3 లక్షలు) పరిధిలోనే ఉండి, బహుమానం విలువ కలిపిన తర్వాత కూడా బేసిక్ పరిమితి దాటకపోతే.. అప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం రాదు. ఒక్కో బహుమతికి విడిగా రూ.50,000 పరిమితి వర్తించదని, ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న అన్ని బహుమతులకు (నిబంధనల మేరకు) రూ.50,000 పరిమితి వర్తిస్తుందని మనీఎడ్యుసూ్కల్ వ్యవస్థాపకుడు ఆర్ణవ్ పాండా తెలిపారు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
SBI రివార్డ్ పాయింట్ల తనిఖీ & రీడీమ్: ఇలా సింపుల్..
మీరు క్రెడిట్ కార్డ్‌తో లావాదేవీ జరిపిన ప్రతిసారీ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) ప్రత్యేకమైన రివార్డ్‌లను అందిస్తుంది. ఈ రివార్డ్ పాయింట్లను ఇష్టమైన బ్రాండ్లపై అద్భుతమైన డీల్‌లు లేదా ఆఫర్ల కోసం రీడీమ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్లతో మీకు కావాల్సిన వాటిని కొనుగోలు చేస్తూ.. ఖర్చులను కూడా ఆదా చేయవచ్చు. అయితే కొందరికి ఈ రివార్డ్ పాయింట్లను ఎలా చెక్ చేసుకోవాలి? ఎలా రీడీమ్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుండకపోవచ్చు. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకోవచ్చు..ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, కస్టమర్ కేర్ ద్వారా కూడా రీడిమ్ చేసుకోవచ్చు.ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking)➤కస్టమర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి ఎస్బీఐ అధికారిక కార్డ్ పోర్టల్ లాగిన్ చేసిన తరువాత.. మెను బార్లో 'రివార్డ్‌లు' ఎంచుకుని, ఆపై 'రివార్డ్‌లను రీడీమ్ చేయి' ఆప్షన్ ఎంచుకోండి.➤రివార్డ్ పాయింట్స్, సిటీ, కేటగిరీ వంటి వాటిని ఎంచుకోవాలి.➤'రివార్డ్స్ కేటలాగ్' నుంచి మీకు కావలసిన వస్తువును ఎంచుకున్న తరువాత.. 'రీడీమ్ నౌ'పై క్లిక్ చేయడం ద్వారా మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు.మొబైల్ యాప్ (Mobile App)●మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎస్బీఐ కార్డ్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.●యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత.. కస్టమర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయాలి.●లాగిన్ పూర్తయిన తరువాత 'రివార్డ్‌లు' విభాగానికి వెళ్లి, ఆపై 'రివార్డ్‌లను రీడీమ్ చేయి' ఎంచుకోవాలి.●రివార్డ్ పాయింట్స్, సిటీ, కేటగిరీ వంటి వాటిని ఎంచుకోవాలి.●'రివార్డ్స్ కేటలాగ్' నుంచి మీకు కావలసిన వస్తువును ఎంచుకున్న తరువాత.. 'రీడీమ్ నౌ'పై క్లిక్ చేయడం ద్వారా మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు.ఇదీ చదవండి: ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?కస్టమర్ కేర్ ద్వారా ఆఫ్‌లైన్▶ఎస్బీఐ కార్డ్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి.. మీ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయడంలో సహాయం కోసం అడగండి.▶కస్టమర్ ఎగ్జిక్యూటివ్ మీకు రీడీమ్ చేసుకోవడంలో సహాయం చేస్తారు.▶పూర్తిగా రీడీమ్ చేసుకున్న తరువాత మీకు కావలసిన వస్తువును కొనుగోలు చేసుకోవచ్చు.ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను చెక్ చేసుకోవడం ఎలా?ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను చెక్ చేసుకోవడానికి ఏఐ చాట్‌బాట్‌ను, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా కాల్ చేయడం, వెబ్సైట్ లేదా మొబైల్ యాప్స్ సాయంతో చెక్ చేసుకోవచ్చు. -
ఉద్యోగుల రివార్డుల్లో ‘నవ’శకం!
ఉద్యోగుల శ్రమకు గుర్తింపుగా సర్టిఫికెట్లు, గిఫ్టుల వంటివి ఇవ్వడం పరిపాటే. అయితే, అన్ని రంగాల్లో ఇప్పుడు నవతరం జెన్ జెడ్ అడుగుపెట్టడంతో ఈ ట్రెండ్ క్రమంగా మారుతోంది. సిబ్బందికి రివార్డుల్లో భారత కార్పొరేట్ కంపెనీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సాంప్రదాయ బహుమతులు, సరి్టఫికెట్లకు బదులు డిజిటల్ బాట పడుతూ ‘సోషల్’ కల్చర్‌తో వారిలో నూతనోత్తేజాన్ని నింపుతున్నాయి.భారత కార్పొరేట్ రంగంలో కొత్త రివార్డుల సంస్కృతికి తెరలేచింది. కంపెనీలు తమ ఉద్యోగులకు అందించే బహుమతుల ప్రోగ్రామ్‌ను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పుడంతా డిజిటల్ రివార్డులకే ఓటేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా యువ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటంతో వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి కంపెనీలు. ఉద్యోగుల విజయాలు, కొత్తగా నేర్చుకున్న స్కిల్స్‌కు గుర్తింపుగా బ్యాడ్జ్‌లు, పాయింట్లు, నోట్స్ వంటివి అందిస్తుండటంతో ఎంప్లాయీస్ మూడు షేర్.. ఆరు లైక్‌లతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎప్సిలాన్ ఇండియా ‘సిటిజన్ ఆఫ్ ‘యూ’నివర్స్’ పేరుతో ‘పాస్‌పోర్ట్’ను ప్రవేశపెట్టింది. యువతరం కోరుకునే వినోదం, సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చింది. ‘ఈ రోజుల్లో ప్రజలు, ముఖ్యంగా యువత దేన్నైనా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసేస్తున్నారు. ఆఫీస్ సమావేశం లేదా ఈవెంట్లో పాల్గొన్న ప్రతిసారి ‘పాస్‌పోర్ట్’పై స్టాంప్ పడుతుంది. ఈ గుర్తింపును వారు షేర్ చేసుకోవడం ద్వారా ఇతరులతో పంచుకోవచ్చు’ అని కంపెనీ హెచ్ఆర్ హెడ్ సోనాలి దేసర్కార్ పేర్కొన్నారు. రోషె ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఇండియా కూడా అప్లాజ్ పేరుతో అంతర్గత స్టోర్‌ను ఉద్యోగులకు అందుబాటులోకి తెచి్చంది. గుర్తింపులో భాగంగా లభించే పాయింట్లతో సిబ్బంది హెడ్ఫోన్ల నుంచి ఈవెంట్ టిక్కెట్ల వరకు ఏదైనా కొనుక్కునే అవకాశాన్ని కలి్పస్తున్నట్లు కంపెనీ ఎండీ రాజా జమలమడక చెప్పారు.అంతా ‘సోషల్’మయం... ఉద్యోగులు, ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో మునిగితేలుతుండటంతో.. కంపెనీలు తప్పనిసరిగా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ‘యువతరంలో సోషల్ ఆరాటం, భావోద్వేగాలు చాలా ఎక్కువ. అందుకే వారు సాధించే విజయాలను సీనియారిటీతో సంబంధం లేకుండా సహచరులు ఒకరికొకరు అభినందించుకోవడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి లీడర్షిప్బోర్డ్లు వీలు కలి్పస్తున్నాయి’ అని థ్రైవ్ డిజిటల్ ప్రెసిడెంట్, సీఈఓ శంకరనారాయణన్ చెప్పారు. ఇక మెర్క్ ఇండియా వార్షిక గుర్తింపు వారం, ప్యానెల్ ఆధారిత అవార్డులు, స్పాట్ అవార్డులు.. ఇలా మూడు రకాలను అమలు చేస్తోంది. ఆల్స్టేట్ ఇండియా ప్రతి ఉద్యోగికి నెలనెలా 100 పాయింట్లు అందిస్తోంది. వీటిని ఒకరికొకరు ఇచి్చపుచ్చుకోవచ్చు, అంతర్గత స్టోర్‌లో రిడీమ్ చేసుకోవచ్చు.డిజిటల్ బ్యాడ్జ్‌లకు ప్రాచుర్యంఉద్యోగుల విజయాలు, నైపుణ్యాలకు అద్దంపట్టే డిజిటల్ బ్యాడ్జ్‌లకు అన్ని కంపెనీల్లోనూ బాగా ప్రాచుర్యం లభిస్తోంది. సిబ్బంది తమ సాఫల్యాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసుకునే విధంగా కంపెనీలు ఈ బ్యాడ్జ్‌లను రూపొందిస్తున్నాయి. ‘ఉద్యోగులు పనిలో మరింత ఎంగేజ్ అయ్యేలా, స్ఫూర్తి నింపడంలో గేమిఫికేషన్ సమర్థ సాధనంగా మారుతోంది. ముఖ్యంగా ప్రస్తుత గ్లోబల్ కేపబిలిటీ ఎకోసిస్టమ్‌లో ఇది చాలా కీలకం. ఒకరినొకరు అభినందించుకోవడం, రివార్డులను షేర్ చేసుకోవడం వంటివి పరస్పర గౌరవాన్ని పెంచడంతో పాటు టీమ్‌లను బలోపేతం చేస్తుంది’ అని ర్యాండ్‌స్టాడ్ డిజిటల్ ఇండియా ఎండీ మిలింద్ షా అభిప్రాయపడ్డారు. → ఎప్సిలాన్ ఇండియా కొత్తగా ‘పాస్‌పోర్ట్’ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఆఫీస్ సమావేశాల్లో పాల్గొన్న ప్రతిసారీ ఉద్యోగులకు ‘స్టాంప్’ పడుతుంది. సోషల్ మీడియాలో ప్రతిదీ షేర్ చేసుకోవాలని పరితపించే నవతరం ఉద్యోగులకు ఇది తెగ నచ్చేస్తోందట!→ రోషె ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ‘అప్లాజ్’ పేరుతో అంతర్గత స్టోర్ తెరిచింది. ఉద్యోగులకిచ్చే పాయింట్లను రీడీమ్ చేసుకొని ఇక్కడ హెడ్‌ఫోన్స్, టిక్కెట్ల వంటివి కొనుక్కోవచ్చు.→ కొత్త స్కిల్స్, బాధ్యతల్లో విజయాలకు ప్రతిగా టాలెంట్‌ను గుర్తించేందుకు ఇస్తున్న డిజిటల్ బ్యాడ్జ్‌లు (బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ వంటివి) కంపెనీల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.→ మెర్క్ ఇండియా, ఆల్స్టేట్ ఇండియా, థ్రైవ్ డిజిటల్లీడర్షిప్ బోర్డులను అమలు చేస్తున్నాయి. సీనియారిటీతో సంబంధం లేకుండా సహోద్యోగులు ఒకరికొకరు అభినందనలు తెలియజేసేందుకు ఇది తోడ్పడుతోంది. -
భారీ ఎన్కౌంటర్.. అయిదుగురు మావోయిస్టులు మృతి
రాంచీ: జార్ఖండ్‌లో సోమవారం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతిచెందారు. ఛాత్రా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎన్కౌంటర్ స్థలం నుంచి ఏకే47 తుపాకులతోపాటు భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు హతమైనట్లు తెలుస్తోంది. ఇద్దరు నక్సల్స్‌పై రూ.25 లక్షల రివార్డు,మరో ఇద్దరు నక్సల్స్‌పై 5 లక్షల రివార్డు ఉన్నట్లు జార్ఖండ్ పోలీసులు తెలిపారు. సంఘటన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆదివారం ఉదయం చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని సుమన్ సింగ్ అంచల(42), సంజయ్ కుమార్ ఉసెండి(27), పరుశరాం ధనుగల్(57)గా గుర్తంచారు.. ఈ ముగ్గురిపై చాలా కేసులు ఉన్నట్లు అదనపు ఎస్పీ కోమన్ సిన్హా తెలిపారు. -
మోరల్ పోలీసింగ్ వద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: పోలీసు అధికారులు మోరల్ పోలీసింగ్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితుల నుంచి వస్తు తదితర రూపేణా ప్రతిఫలాలు ఆశించడం, డిమాండ్ చేయడం తగదంటూ హితవు పలికింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జె.కె.మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. సంతోష్ కుమార్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగిస్తూ క్షమశిక్షణ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. సంతోష్ 2001 అక్టోబర్ 26న అర్ధరాత్రి వడోదరలో నైట్ డ్యూటీ సందర్భంగా నిశ్చితార్థమైన ఓ జంట రోడ్డుపై వెళ్తుండగా ఆపి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలొచ్చాయి. తనకు కాబోయే భార్యతో కాసేపు గడుపుతానంటూ వెకిలిగా ప్రవర్తించాడని బాధితుడు మర్నాడు ఫిర్యాదు చేశాడు. అది నిజమని విచారణలో తేలడంతో అతన్ని డిస్మిస్ చేశారు. అతడు హైకోర్టులో సవాలు చేయగా, విధుల్లోకి తీసుకోవడంతో పాటు డిస్మిస్ కాలానికి 50 శాతం వేతనమివ్వాలని 2014లో కోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సుప్రీం ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘దోషి తీవ్ర నేరానికి పాల్పడ్డాడు. ఇంతా చేస్తే అతను లా అండ్ ఆర్డర్ పోలీస్ కాదు. వాళ్లయినా సరే, ఇలా మోరల్ పోలీసింగ్‌కు దిగకూడదు. భౌతిక తదితర ప్రతిఫలాలు డిమాండ్ చేయకూడదు’’ అని స్పష్టం చేసింది. -
గూగుల్ పే పై యూజర్స్ ఫైర్
-
గుడ్ న్యూస్.. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే రివార్డ్స్ వస్తాయ్!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ రివార్డ్ పాయింట్స్ విధానాన్ని భారత్‌లో వచ్చే వారం పరిచయం చేయనుంది. గూగుల్ ప్లే (Google Play స్టోర్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల సంఖ్యను పెంచేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఏంటి ఈ పాయింట్స్ ప్రోగామ్ గూగుల్ ప్లే స్టోర్‌లో కస్టమర్లు చేసే ప్రతి డౌన్లోడ్ ద్వారా వారు పాయింట్లను సంపాదించవచ్చు. ఆ తర్వాత వాటిని రీడీమ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్‌లో ఇన్–యాప్ ఐటెమ్స్, యాప్స్, గేమ్స్, సబ్స్క్రిప్షన్స్ కోసం జరిపే కొనుగోళ్లలో ఈ పాయింట్స్‌ను వినియోగదార్లు రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ ప్రోగాం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యాప్‌లు, గేమ్‌ల డెవలపర్లతో ఒప్పందం కుదర్చుకున్నట్లు గూగుల్ తెలిపింది. ఇప్పటికే 28 దేశాల్లో గూగుల్ ప్లే పాయింట్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. చదవండి: భారీగా ఉద్యోగులపై వేటు..ఇంటెల్ చరిత్రలోనే తొలిసారి!! -
లక్కీ బాయ్.. 5 నిమిషాల వీడియో పంపి, రూ.38 లక్షల రివార్డ్ అందుకున్నాడు!
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ని వాడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ కోట్లలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇన్‌స్టా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో చాలామంది ఇందులో సమయ గడిపే వారు కూడా ఉన్నారు. అయితే ఓ విద్యార్థి మాత్రం ఇన్‌స్టాని వాడడంతో అందులో బగ్ ఉన్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని కంపెనీకి తెలియజేసి లక్షల రివార్డ్ గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జైపూర్‌కు చెందిన విద్యార్థి నీరజ్ శర్మ.. తన ఫోన్లో ఇన్‌స్టా వాడుతుండగా అందులో ఓ బగ్ ఉన్నట్లు గుర్తించాడు. అదేంటంటే.. అవతలి యూజర్ లాగిన్, పాస్వర్డ్ లేకుండా అతని ఖాతాలోని ఇన్స్టాగ్రామ్ రీల్స్ థంబ్‌నైల్స్ మార్చేందుకు ఈ బగ్ అనుమతిస్తోంది. దీంతో శర్మ ఈ విషయాన్ని జనవరిలో కంపెనీకి తెలియజేశాడు. ఇందుకు స్పందనగా.. ఈ బగ్‌కు సంబంధించిన డెమో వీడియోను పంపాలని కంపెనీ శర్మను కోరింది. బగ్ ఎలా పనిచేస్తుందనే తెలిపే 5 నిమిషాల డెమో వీడియోని చిత్రీకరించి అతను కంపెనీకి పంపాడు. దీనిపై క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత, ఫేస్బుక్ శర్మకి $45,000 రివార్డ్‌ను ప్రకటించింది (అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 38 లక్షలు). అంతేకాకుండా రివార్డ్‌ని నాలుగు నెలలు ఆలస్యం చేసినందుకు కూడా $4500 అంటే రూ.3.6 లక్షలు ఆఫర్ చేసింది. చదవండి: క్రెడిట్,డెబిట్ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్! -
దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే 25లక్షల రివార్డ్
-
రుస్తంను కనిపెట్టాడు.. జాక్‌పాట్ కొట్టాడు
వైరల్: రుస్తం.. పర్షియన్ పురాణాల్లో ఓ వీరుడి పేరు. అలాంటి పేరును ఇక్కడో వ్యక్తి తాను ప్రేమగా పెంచుకున్న చిలుకకు ఆ పేరు పెట్టుకున్నాడు. కానీ.. అది కనిపించకుండా పోయేసరికి అల్లలాడిపోయాడు. ఆచూకీ చెప్పినా.. తెచ్చి ఇచ్చినా మంచి పారితోషకం ఇస్తానని ప్రకటించాడు. అంతేకాదు పోస్టర్లతో పాటు నగరం అంతటా ప్రకటన ఇచ్చాడు. కనిపించకుండా పోయిన తను రుస్తంను పట్టి తెచ్చిస్తే యాభై వేల రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించాడు కూడా. ఆ ప్రకటన చూసి శ్రీనివాస్ అనే ఓ స్థానికుడు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఫలితంగా.. రుస్తం దొరక్కగా.. ఓ ఓనర్ మరో 35 వేల రూపాయలను అదనంగానే ఇచ్చాడు. కర్ణాటక తుమ్మకూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్జున్ అనే వ్యక్తి ఓ ఆఫ్రికన్ చిలుకను రెండున్నరేళ్లుగా పెంచుకుంటున్నాడు. దానికి రుస్తం అని పేరు పెట్టారు. అది ఆ కుటుంబంతో మమేకం అయిపోయింది. అయితే జులై 16వ తేదీ ఇంట్లోంచి ఎగిరిపోయి.. అది మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అర్జున్ ఒక ప్రకటన ఇచ్చాడు. అయితే ఆ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో చెట్లలో గాయపడి.. ఆకలితో, భయంతో ఉన్న తన రుస్తంను శ్రీనివాస్ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చారని, అందుకే అదనంగా పారితోషకం ఇచ్చానని అర్జున్ చెప్తున్నాడు. ఇన్స్టంట్ అదృష్టం కూడా ఊరికే రాదు.. అందుకూ ఏదో ఒక ప్రయత్నం చేయాల్సిందే అని అంటున్నారు ఈ ఘటన చూసిన కొందరు. -
బంపర్ ఆఫర్.. పట్టిస్తే పది లక్షలు మీవే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: పన్ను వసూళ్లలో పురోగతి కోసం ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పన్ను ఎగవేతదారులను పట్టిస్తే రూ. 10 లక్షల వరకు బహుమానం ఇస్తామని ప్రకటించింది. అధికారులకు కనీసం సమాచారం ఇచ్చినా తగిన బహుమతి అందుకోవచ్చని వెల్లడించింది. ఇందుకు సంబంధించి వాణిజ్య పన్నులశాఖ కార్యదర్శి జ్యోతి నిర్మలస్వామి ఓ జీఓను ఇటీవల విడుదల చేశారు. ప్రోత్సాహకాలకు ప్రత్యేక నిధి పన్నులు ఎగవేసేవారి గురించి సమాచారం ఇచ్చేవారికి బహుమానం, ఇతర ఖర్చుల కోసం 2022–23 ఆర్థిక సంవత్సరానికి వాణిజ్యపన్నుల శాఖకు రూ.1.65 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి మూర్తి ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు. ఇందులో చేసిన సిఫార్సులు ఇలా ఉన్నాయి.. పన్ను ఎగవేసిన వారి గురించి అందిన సమాచారం ఆధారంగా రూ.లక్షకు పైగా వసూలైతే ఆ మొత్తం నుంచి 10 శాతం బహుమతిగా ఇస్తారు. పన్ను చెల్లింపులో చోటుచేసుకున్న జాప్యాన్ని బట్టీ సదరు మొత్తంలో 5 శాతం లేదా రూ.10 వేలు బహుమానంగా ఇస్తారు. రూ.4 లక్షలకు పైగా పన్ను బకాయి పడిన వారి సమాచారం ఇచ్చే వ్యక్తి లేదా బృందానికి ప్రభుత్వ అంగీకారంపై 10 శాతాన్ని బహుమతి పొందుతారు. ప్రభుత్వ సిబ్బందే సమాచారం ఇచ్చినట్లయితే రూ.లక్ష అనే పరిమితి లేకుండా బహుమానం ఉంటుంది. సమాచారం ఇచ్చిన అ«ధికారి ఇలా రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బహుమతి పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం చెన్నై జోన్– 1, జోన్– 2, తిరుచ్చిరాపల్లి, మదురై, తిరునల్వేలి, కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూరు, సేలం, వేలూరు తదితర జిల్లాల్లోని వాణిజ్యపన్నులశాఖకు అవసరమైన నిధులు సమకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. సమాచారం ఇచ్చే సిబ్బందికి రూ.62 లక్షలు, అధికారులైతే రూ.1.04 కోట్లు నుంచి రూ.1.66 కోట్ల వరకు నిధులు బహుమానం నిమిత్తం కేటాయించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని 2022–23 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నులశాఖకు వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: భార్య చేసిన పనికి.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు -
సహకరిస్తే భారీగా నగదు ఇస్తాం.. ప్రజలకు చైనా బంపరాఫర్
National Security' Tip-Offs: చైనా సంచలన ప్రకటన చేసింది. తన పౌరులను జాతీయ భద్రతకు సహకరించాల్సిందిగా అభ్యర్థించింది. ఇలా చేస్తే పౌరులకు సుమారు రూ. 11 లక్షల రివార్డును, సర్టిఫికేట్లను అందజేస్తానని చెప్పింది. జాతీయ భద్రతకు మద్దతిచ్చేలా.. భద్రతా ఉల్లంఘనలకు పాల్పడే వారి గురించి సమాచారం ఇస్తే పౌరులకు మంచి రివార్డులు అందిస్తామని ప్రకటించింది. అంతేకాదు నేరాలను నివారించడం లేదా ఏదైనా కేసు పరిష్కరించడంలో సహకరించి మంచి తెగువ చూపించనవారికి పెద్ద మొత్తంలో నగదు, సర్టిఫికేట్లు ఇస్తామని తెలిపింది. ఇది ఒక రకంగా జాతీయ భద్రతకు సహకరించేలా పౌరుల్లోని ధ్యైర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని సమీకరించే చర్యగా పేర్కొనవచ్చు. చైనా గత కొన్ని సంవత్సరాలుగా భద్రతా ఉల్లంఘనల గురించి సమాచారం అందించినవారికి మంచి నగదు బహుమతులను అందిస్తోంది. అయితే.. ఇప్పుడు చైనా భద్రతా మంత్రిత్వ శాఖ పౌరులందరూ ఆచరించేలా జాతీయ భద్రతకు సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. జాతీయ భద్రతా ఉల్లంఘనలకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండమని బీజింగ్ తమ దేశా ప్రజలకు సూచించింది. చైనా మీడియా సంస్థలు కూడా ప్రజలను మన మధ్య ఉండే గూఢచారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. మన మధ్యే గూఢచారులుగా తిరిగే వాళ్లు ఎలా ఉంటారో కూడా సూచనలిచ్చింది. ఈ మేరకు చైనా ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ చెంగ్ లీ జాతీయ భద్రతా ఉల్లంఘనల అనుమానంతో 2020లో నిర్బంధించింది ఐతే ఆమెను నిర్బంధించిన సమయంలో వచ్చిన ఆరోపణల గురించి స్పష్టత లేకపోవడంతో ఈ కేసు రాజకీయంగా ప్రేరేపించబడిందా లేక ప్రతికారం తీర్చుకుంటుందా అనే ఊహాగానాలకు తెరలేపింది. అలాగే ఆస్ట్రేలియాలో జన్మించిన చైనీస్ రచయిత యాంగ్ జున్ గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్నారు. హాంకాంగ్ నగరంలో చెలరేగిన హిసాత్మక ప్రజాస్వామ్య అనుకూల నిరసనల అసమ్మతిని తొలగించడానికి చైనా 2020లో విధించిన జాతీయ భద్రతా చట్టం ఉపయోగపడింది. అప్పటి నుంచి చైనా జాతీయ భద్రతను మరింత పటిష్టంగా ఉంచుకునే దిశగా గట్టి చర్యలు తీసుకుంటోంది. (చదవండి: మంటల్లో వేసినా కాలిపోని పుస్తకం...వేలంలో ఎంత పలికిందంటే..?) -
గూగుల్ కు దిమ్మ తిరిగే షాకిచ్చాడు, రూ.65కోట్ల జాక్ పాట్ కొట్టేశాడు!!
మనదేశానికి చెందిన ఓ యువకుడు గూగుల్‌కు భారీ షాకిచ్చాడు. గూగుల్ కు చెందిన వివిధ ప్రొడక్ట్‌లలో భారీ ఎత్తున లోపాల్ని(బగ్స్) గుర్తించాడు. లోపాల్ని గుర్తించడమే కాదు గూగుల్ నుంచి కోట్ల రూపాయిల రివార్డ్‌లును అందుకున్నాడు. భారత్‌కు చెందిన అమన్ పాండే ఎన్ఐటీ భోపాల్ లో పట్టభద్రుడయ్యాడు. అనంతరం ప్రముఖ కంపెనీలకు చెందిన సాఫ్ట్వేర్లలో లోపాల్ని గుర్తించేందుకు గతేడాది బగ్స్ మిర్రర్ పేరిట కంపెనీని స్థాపించాడు. ఈ నేపథ్యంలో గూగుల్ తమ సంస్థలకు చెందిన సాఫ్ట్వేర్లలో లోపాల్ని గుర్తించిన వారికి భారీ ఎత్తున ప్రోత్సాహకాల్ని అందిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం వల్నరబిలటీ రివార్డ్ ప్రోగ్రామ్ 2021 ను నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమన్ పాండే.. గూగుల్, ఆండ్రాయిండ్, గూగుల్ క్రోమ్, గూగుల్ ప్లేస్టోర్ తో పాటు ఇతర ప్రొడక్ట్‌లలో వందల సంఖ్యలో బగ్స్‌ను గుర్తించాడు. ఒక్క ఏడాదిలోనే గూగుల్ తో పాటు ఆ సంస్థకు చెందిన మిగిలిన కంపెనీలకు చెందిన పలు సాఫ్ట్వేర్లలో మొత్తం 232 లోపాల్ని గుర్తించాడు. ఈ నేపథ్యంలో అమన్‌ను గూగల్ ప్రత్యేకంగా అభినందించింది. బగ్స్ ను గుర్తించినందుకు రూ.65కోట్ల రివార్డ్‌ను అందిస్తున్నట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో ప్రధానంగా హైలెట్ చేసింది. కాగా, 2019లో సారా జాకోబస్ అనే వ్యక్తి అండ్రాయిడ్ వల్నరబిలిటీస్ రివార్డ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 280కి పైగా బగ్స్‌ను నివేదించి తొలిస్థానంలో నిలిచాడు. -
అక్కడ చెట్లను తొలగిస్తే.... బహుమతులు ఇస్తారట!
Callery Pear Tree Smells Bad In US state of Maine: చెట్లను నాటండి అంటూ మన దేశాల్లో పచ్చదనం, హరిత విప్లవం అంటూ రకరకాల కార్యక్రమాలను చేపడుతుంటారు. అయితే అందుకు విరుద్ధంగా యూఎస్‌లోని మైనే రాష్ట్రంలోని అధికారులు మొక్కలను తొలగిస్తే బహుమతులు ఇస్తాం అంటున్నారు. అసలే ప్రపంచ దేశాలన్ని కాలుష్యం కోరల్లో చిక్కుకుని బెంబేలెత్తుతుంటే ఏంటిది వెటకారంగా అని అనుకోకండి. (చదవండి: బాప్రే!.... నెపోలియన్ ఖడ్గం వేలంలో రూ. 21 కోట్లు పలికిందట!) అసలు విషయంలోకెళ్లితే... మానవుల మనగడ చెట్లతోనే సాధ్యం అని అందరికి తెలిసి విషయమే. కానీ యూఎస్‌కి తూర్పున ఉన్న మైనే రాష్ట్రంలోని కాలరీ పియర్ చెట్లు మాత్రం ప్రజలకు సమస్యగా మారి ఇబ్బందులకు గురిచేస్తోంది. అంతేకాదు సౌత్ కరోలినా ఫారెస్ట్రీ కమిషన్ కాలరీ పియర్ చెట్లను తొలగించాలనుకునే వారికి ఐదు కొత్త చెట్ల బహుమతిగా ఇస్తానని ప్రకటించింది. అయితే ఈ కాలరీ పియర్ చెట్టు యూఎస్‌కి చెందినది కాదు. అంతేకాదు ఈ చెట్టు చైనా, వియత్నాంకు చెందిన పియర్ చెట్టు జాతి. ఈ మేరకు ఇది 1900లలో అనేక ఆసియా దేశాల నుండి యూఎస్ దేశానికి వచ్చింది. అయితే 1960ల నాటికల్లా ఈ చెట్లు వాటికి పూచే ఆకర్షణీయమైన తెల్లని పువ్వుల కోసం రాష్ట్రాలలోని అనేక శివారు ప్రాంతాల్లో విస్తారంగా వీటిని నాటారు. పైగా యూఎస్‌లో విస్తృతంగా సాగు చేయబడిన 'బ్రాడ్ఫోర్డ్' పియర్ చెట్టుగా కూడా పిలుస్తారు. ఏ ఆకర్షణీయమైన పువ్వుల కోసం అయితే ఈ మొక్కలను నాటారో ఆ పువ్వులు అత్యంత భయంకరమైన వాసనను కలిగి ఉన్నాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించలేకపోయారని మైనే వ్యవసాయ సంరక్షణ అటవీ శాఖకు చెందిన ఉద్యానవన నిపుణులు అన్నారు. అంతేకాదు ఈ పియర్ చెట్లు వల్ల స్థానిక జాతి చెట్ల పై తీవ్ర వినాసకరమైన ప్రభావాన్ని చూపాయని చెప్పారు. దీంతో అక్కడి అధికారులు 2024 నాటికల్లా ఈ పియర్ మొక్కలను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. పైగా అక్కడి అధికారులు ఇప్పటికే ఉన్న కాలరీ పియర్ చెట్లను తొలగించినందుకు ఇంటి యజమానులకు బహుమతులు అందించే వరకు వెళ్లడం గమనార్హం (చదవండి: జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!) -
ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జెరోదా..!
న్యూఢిల్లీ: ప్రముఖ ఫైనాన్షియల్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఉద్యోగులు ఫిట్‌గా ఉండడం కోసం సరికోత్త ఛాలెంజ్‌ను కంపెనీ విసిరింది. ఛాలెంజ్‌లో భాగంగా ఏడాది కాలంలో లక్ష్యాన్ని చేరుకున్నఉద్యోగులకు ఒక నెల జీతాన్ని బోనస్‌గా అందించనుంది. అంతేకాకుండా ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ. 10 లక్షలను ఇవ్వనుంది. కోవిడ్-19 రాకతో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంకు పరిమితమవ్వడంతో వారి జీవన విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. లాక్డౌన్ మొదలైనప్పటినుంచి ఉద్యోగులు ఇంటికే పరిమితమవ్వడంతో శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని కంపెనీ సీఈవో నితిన్ కామత్ పేర్కొన్నారు. ఉద్యోగుల జీవన విధానంలో, ఆహార విషయంలో గణనీయమైన మార్పులు వచ్చినట్లు తెలిపారు. ఫిట్‌గా ఉండేందుకు ఉద్యోగులకు ఈ ఛాలెంజ్‌ను విసిరినట్లు నితిన్ కామత్ వెల్లడించారు. కంపెనీ తీసుకొచ్చిన ఛాలెంజ్ ద్వారా ఉద్యోగుల జీవనా విధానంలో కచ్చితంగా మార్పులు వస్తాయని నితిన్ కామత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన ప్రతి ఉద్యోగికి ఒక నెల జీతం బోనస్, లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ.10 లక్షలు అందిస్తామని నితిన్ ట్విటర్లో వెల్లడించారు. On our internal forum(@discourse), we asked everyone to set a 12-month get-healthy goal & update the progress every month, to create accountability. To increase participation, we said everyone who reaches the goal will get a 1-month salary as bonus & 1 lucky draw for Rs 10lks 2/3 — Nithin Kamath (@Nithin0dha) August 28, 2021 చదవండి: 90 నిమిషాల్లో ఢిల్లీ టూ ముంబై -
ఇక తేడాలుండవ్, అంతా సమానమే
రియో: ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే బ్రెజిల్ దేశంలో నిర్వహణాపరంగా ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. ఇకపై పురుష ఫుట్‌బాల్ ఆటగాళ్లతో సమానంగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే మహిళా ఆటగాళ్లకు వేతనాలు ఇవ్వాలని బ్రెజిల్ ఫుట్‌బాల్ సంఘం (సీబీఎఫ్) నిర్ణయించింది. జాతీయ ఫుట్బాలర్లందరికీ వేతనాలతో పాటు ప్రైజ్‌మనీ కూడా సమానంగా ఇవ్వనున్నట్లు సీబీఎఫ్ అధ్యక్షుడు రోజెరియో కబోల్కో ప్రకటించారు. ‘ఈ ఏడాది మార్చి నుంచి జాతీయ పురుషులు, మహిళల ఫుట్‌బాలర్లకు ప్రతీది సమానంగా ఇవ్వాలని నిర్ణయించాం. ఇక ఏ అంశంలోనూ లింగ వివక్ష ఉండబోదు. పురుషులకు, మహిళలకు సీబీఎఫ్ సమాన ప్రాధాన్యతనిస్తుంది. వరల్డ్‌కప్, ఒలింపిక్స్ వేదికల్లో ప్రదర్శనలకు కూడా సమాన బహుమతులు లభిస్తాయి’ అని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, నార్వే, న్యూజిలాండ్ జట్లు మాత్రమే పురుష, మహిళా క్రీడాకారులకు సమాన వేతనాలు అందజేస్తున్నాయి. ఇప్పుడు వీటి సరసన బ్రెజిల్ చేరింది. 2007 ప్రపంచ కప్‌లో ఫైనల్ చేరడం బ్రెజిల్ మహిళల జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత ఏడాది ప్రపంచకప్‌లో గ్రూప్ దశకే పరిమితమైన జట్టు... సొంత గడ్డపై జరిగిన 2016 ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. (చదవండి: అయ్యో...ముర్రే) -
ఆ కుక్క ఆచూకీ చెబితే 5 లక్షల రివార్డ్
కాలిఫోర్నియా : చాలామంది పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకుంటారు. కొందరు అయితే వాటిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఎక్కడికి వెళ్లినా తోడు- నీడలా వెంట తీసుకెళ్తారు. అలాంటి వాటికి ఏమైనా జరిగితే వారు విలవిల్లాడిపోతారు. సరిగ్గా అలాంటి ఘటనే తాజాగా కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. సాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఎమిలీ టాలెర్మో అనే మహిళ ఆస్ట్రేలియన్ షెఫర్డ్ డాగ్‌ను పెంచుకుంటోంది. దాని పేరు జాక్సన్. గత వారం కిరాణ దుకాణం నుంచి వస్తుండగా ఆ కుక్క కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి ఎమిలీ తన స్నేహితులతో కలిసి కుక్కను వెతికినా.. ఎంతకీ దాని ఆచూకీ లభించకపోవడంతో కావాలనే ఎవరో దాన్ని అపహరించి ఉంటారని భావించిన మహిళ దాన్ని వెతకడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించింది. కుక్కను వెతికి ఇచ్చిన వారికి రూ. 5 లక్షల నజరానాను ప్రకటించింది. అంతేగాక కుక్కను వెతకడానికి సహాయంగా ఓ విమానాన్ని సైతం అద్దెకు తీసుకుంది. విమాన ఖర్చులకు అదనంగా 1200 డాలర్లను కేటాయించింది. జాన్సన్‌ను వెతికి పట్టుకోడానికి కావాల్సిన ఆర్థిక సహాయం కోసం ఎమిలీ ఒక గోఫండ్‌మేను ప్రారంభించింది. అందుకు ఆమెకు 7వేల డాలర్ల కంటే ఎక్కువగానే సేకరించడంతో అదనంగా వచ్చిన డబ్బును డాగ్ రెస్క్యూకి విరాళంగా ఇవ్వాలని యోచిస్తోంది. ఇక ఈ విషయంపై కుక్క యాజమాని ఎమిలీ మాట్లాడుతూ.. ‘జాన్సన్ ఎప్పుడూ నాతోనే ఉండేది. మాది నిజమైన ప్రేమ. నేను నా అయిదేళ్ల జాక్సన్‌ను వెతకడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాను. దాన్ని కనుగొనడానికి నాకు సహాయం కావాల’ని ఆవేదనతో కోరుకుంది. -
‘దిశ’ ఎన్కౌంటర్.. ఆ పోలీసులకు రివార్డు!
హిసార్(హరియాణా): ‘దిశ’ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులకు రివార్డు అందించనున్నట్లు హరియాణాకు చెందిన రాహ్ గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ సెల్పార్ తెలిపారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులకు రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నట్టు చెప్పారు. రాహ్ గ్రూప్ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఇవేం రివార్డ్స్!
సాక్షి, సిటీబ్యూరో: సంచలనాత్మక, కీలక కేసుల దర్యాప్తులో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసులను ఉన్నతాధికారులు మెచ్చుకోవడంతో పాటు నగదు రివార్డు కూడా అందిస్తారు. 1905 నుంచి అమలవుతున్న ఈ రివార్డ్స్ విధానంలో ఎవరికి? ఎంత? ఇవ్వాలనేది ఎప్పటికప్పుడు సవరణ అవుతూ ఉండాలి. అయితే 17 ఏళ్లుగా ఈ ప్రక్రియ జరుగకపోవడంతో రివార్డ్స్ కింద ఇచ్చే నగదు నామమాత్రంగా మారింది. దీన్ని పెంచాలని ప్రతిపాదిస్తూ రూపొందించిన ఫైల్‌ను నగర పోలీసు విభాగం దాదాపు ఏడాది క్రితం ప్రభుత్వానికి పంపింది. అయితే దీనిపై స్పందించకపోవడంతో ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఈ సవరణలు కేవలం రాజధానిలోని మూడు కమిషనరేట్లకే కాకుండా రాష్ట్రం మొత్తం వర్తించే విధంగా ఫైలు రూపొందించారు. వారే అర్హులు... ఏళ్లుగా నామ్‌కే వాస్తేగా ఉండిపోయిన ఈ రివార్డుల మొత్తాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఒకవేళ ఎవరైనా ఆ ప్రయత్నం చేసినా... రివార్డు అనేది గుర్తింపు మాత్రమే, అది ఎంత అన్నది లెక్కకాదు అంటూ అధికారులు బుజ్జగిస్తూ వస్తుంటారు. పోలీసు విభాగంలో ప్రస్తుతం కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు మాత్రమే క్యాష్ రివార్డులు అందుకోవడానికి అర్హులు. ఆపై స్థాయి వారికి వీటిని అందుకునే అవకాశమే లేదు. ఒకప్పుడు ఈ మొత్తాలు మరీ దారుణంగా ఉండేవి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 2002లో ఆఖరిసారిగా సవరించారు. ఆ తర్వాత సవరణ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం రివార్డు అందుకున్నట్లు వారి సర్వీసు రికార్డుల్లోకి వెళ్తోంది. అయితే ఆ మొత్తం ఎంతన్నది మాత్రం ఎదుటి వారికే కాదు కనీసం కుటుంబీకులకు కూడా చెప్పుకోవడానికే సిగ్గుపడేలా ఉంది. ఈ రివార్డు మొత్తాన్ని డీసీపీ (ఎస్పీ) నుంచి జేసీపీ (డీఐజీ), అదనపు సీపీ (ఐజీ), కమిషనర్ (అదనపు డీజీ) స్థాయి అధికారులు ప్రకటిస్తుంటారు. కానిస్టేబుల్‌కు డీసీపీ, ఎస్సైలకు జేసీపీ, ఇన్స్పెక్టర్లకు ఐజీలు రివార్డులు ప్రకటిస్తారు. పోలీసు కమిషనర్‌కు వీరిలో ఏ స్థాయి వారికైనా రివార్డు ఇచ్చే అధికారం ఉంది. కనీస మొత్తం రూ.3వేలు... ఓ కేసు ఛేదన, నేరగాడిని పట్టుకోడానికి సంబంధించి ఒకరికైనా, బృందానికైనా డీసీపీ గరిష్టంగా రూ.750, సంయుక్త పోలీసు కమిషనర్ (జేసీపీ) రూ.1,000, అదనపు సీపీ రూ.1,500, సీపీ రూ.2,000 మాత్రమే మంజూరు చేయలగలరు. డీసీపీ నుంచి సీపీ వరకు అంతా కలిసి పెద్ద మొత్తం కింద ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు. ఒక పనికి సంబంధించి ఒకరు మాత్రమే రివార్డు ప్రకటించాలి. సాధారణంగా కమిషనరేట్లలో డీసీపీ, జిల్లాల్లో ఎస్పీలే నగదు రివార్డులు ప్రకటిస్తుంటారు. దీని ప్రకారం వీరు గరిష్టంగా రూ.750 మాత్రమే మంజూరు చేయగలరు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు డీసీపీ రూ.3వేలు, జేసీపీ రూ.4వేలు, అదనపు సీపీ రూ.6వేలు, సీపీ రూ.8వేల వరకు మంజూరు చేసేలా ప్రతిపాదనలు రూపొందించి డీజీపీ కార్యాలయానికి పంపారు. డీజీపీ స్థాయి అధికారి తాను కోరుకున్న స్థాయి అధికారులకు గరిష్టంగా రూ.50 వేల వరకు రివార్డు ఇచ్చేలా ప్రతిపాదించారు. ఎన్నికలతో ఆగిన ఫైల్... హైదరాబాద్‌లో మూడేళ్లుగా ‘కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్’ (కేపీఐ) పేరుతో నెలనెలా ప్రతిభ కనబరిచిన అధికారులను గుర్తించే విధానం అమలులో ఉంది. దీన్ని ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. పోలీసు విధుల్ని మొత్తం 16 విభాగాలుగా విభజించారు. ఒక్కో విభాగం నుంచి కొందరిని ఎంపిక చేసి కేపీఐ అవార్డు కింద సర్టిఫికెట్ మాత్రమే ఇస్తున్నారు. వీరిలో ఎవరికైనా రివార్డు ఇవ్వాలంటే ఎస్పీలు, కమిషనర్లు వారి కార్యాలయ నిధుల నుంచి ఇవ్వాల్సి వస్తోంది. అలా కాకుండా వీరికీ రివార్డులు అందించేలా ప్రతిపాదనలు చేశారు. నగర పోలీసులు పంపిన వీటిని పరిగణనలోకి తీసుకున్న డీజీపీ కార్యాలయం కొన్ని మార్పుచేర్పులు చేస్తూ దాదాపు ఏడాది క్రితం ప్రభుత్వానికి నివేదించింది. ఈ ఫైల్ పరిశీలనలో ఉండగానే శాసనసభ, ఆ తర్వాత పార్లమెంట్‌కు ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఆ క్రతువు ముగిసినప్పటికీ ఈ ఫైల్‌ను పట్టించుకునే నా«థుడే కరవయ్యాడు. దీంతో సిబ్బందికి ఎదురుచూపులే మిగిలాయి. -
దోంగ క్యాషియర్ అరెస్టు!
సాక్షి, కంచికచర్ల(నందిగామ): కంచికచర్ల మండలం పరిటాల స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాష్ ఇన్చార్జి జి.శ్రీనివాసరావును అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ, విజయవాడకు చెందిన గొడవర్తి శ్రీనివాసరావు గత కొంతకాలంగా కంచికచర్ల మండలం పరిటాల స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాష్ ఇన్చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే సమయంలో బ్యాంకు మేనేజర్ కాకొల్లు యోగిత వద్ద ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించాడు. ఇద్దరి బాధ్యత కలిగిన క్యాష్ లావాదేవీలు, గోల్డ్‌లోన్స్ లావాదేవీల తాను ఒక్కడే నిర్వర్తించే విధంగా నమ్మించాడు. మేనేజర్ వద్ద ఉన్న తాళం కూడా తీసుకుని లాకర్లను ఓపెన్ చేసి పనులు చక్కబెడుతున్నాడు. మేనేజర్‌తో సంబంధం లేకుండా.. శ్రీనివాసరావు ఒకరోజు మేనేజర్‌కు తెలియకుండా లాకర్ నుంచి రూ.19లక్షలు, 3 గోల్డ్బ్యాగ్లు లాకర్లో నుంచి దొంగిలించాడు. తాకట్టు పెట్టిన ఒకరి బంగారు ఆభరణాలపై మరొకరి పేరుమీద లోన్ అకౌంట్ ఓపెన్ చేసి గోల్డ్‌లోన్ నగదు మొత్తం తీసుకున్నాడు. రెన్యువల్ కోసం ఖాతాదారుల వద్ద డెబిట్, క్రెడిట్ ఓచర్‌పై సంతకాలు తీసుకుని కొత్తఖాతాను తయారుచేసి పాత ఖాతాలో డబ్బులు చెల్లించకుండా ఆ సొమ్మును సొంతానికి, విలాసానికి వాడుకున్నాడు. బ్యాంకు మేనేజర్ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని లాకర్లోని బంగారాన్ని దొంగిలించి ఆ బంగారం నగలను ఆప్కాబ్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ, నగలు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చే ప్రైవేటు వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టి ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుని సొంతానికి ఉపయోగించుకున్నాడు. మేనేజర్ నిలదీయడంతో.. నగలు మయం కావడంతో విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావును నిలదీయగా నగదుతో పాటు బంగారం కూడా తీసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. తాను దొంగిలించిన సొత్తును, నగలను రెండురోజులలో తిరిగి బ్యాంకుకు అందజేస్తామని నమ్మబలికాడు. కాని నాటి నుంచి విధులకు రాకుండా శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు. బ్యాంకులో జరిగిన విషయాల గురించి బ్యాంకు మేనేజర్ యోగిత బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బ్యాంకు మేనేజర్ యోగితను ఇతర బ్యాంకుకు బదిలీచేశారు. క్యాష్ ఇన్చార్జి శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. గల్లా ఓం ప్రకాష్‌ను బ్యాంకు మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాసరావుపై కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి నుంచి రికవరీ..... నిందితుడు శ్రీనివాసరావు నుంచి నగదు రూ.20,75 లక్షలు, 2,200 గ్రాముల బంగారం నగలు, కారు రూ.6,25లక్షలు మొత్తం రూ.88లక్షలు రికవరీ చేసుకోవటం జరిగిందని తెలిపారు. శ్రీనివాసరావును అరెస్ట్‌చేసి నందిగామ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో నందిగామ డీఎస్పీ షేక్ అబ్దుల్ రజీజ్, సర్కిల్ సీఐ కే సతీష్, ఎస్ఐ శ్రీహరిబాబు, ఏఎస్ఐలు ఎంవీ కోటేశ్వరరావు, షేక్ జమీల్ పాల్గొన్నారు. పోలీసులకు రివార్డులు అందజేత నగదుతోపాటు బంగారు నగలు దొంగతనం కేసులో బ్యాంక్ క్యాష్ ఇన్చార్జి గొడవర్తి శ్రీనివాసరావును త్వరగా అరెస్టు చేయటం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు పేర్కొన్నారు. కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు ఆదివారం వచ్చిన జిల్లా ఎస్పీ, అనతికాలంలో బ్యాంకులో నగలు, నగదు దొంగతనానికి పాల్పడిన శ్రీనివాసరావును అరెస్ట్ చేసినందుకు 8 మందికి రివార్డులు అందజేశారు. రివార్డులు అందుకున్న వారిలో సర్కిల్ సీఐ కే సతీష్, ఎస్ఐ శ్రీహరిబాబు, హెడ్‌కానిస్టేబుళ్లు ఆలి, నాగరాజు, ప్రభాకర్, రఘు, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు కే రామారావు, హనుమంత్ ఉన్నారు. -
ఆచూకీ తెలిపితే బహుమతి
కూకట్పల్లి: తాము పెంచుకుంటున్న కుక్కపిల్ల ‘డ్యూక్’ అదృశ్యం కావడంతో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. 24 గంటలు గడిచినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు వీధుల్లో గాలిస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో కుక్క ఫొటోతో కూడిన పోస్టర్లను కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో అంటించి ప్రచారం చేశారు. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి ప్రాంతంలో ఉంటున్న ప్రసాద్ ‘డ్యూక్’ అనే కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. అయితే బుధవారం సదరు కుక్క అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఈ విషయాన్ని ప్రసాద్ రాంచీలో ఉంటున్న తన కుమార్తె సబితకు తెలియజేయడంతో ఆమె హుటాహుటిన విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంది. రెండు రోజులుగా గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. డ్యూక్ ఆచూకీ తెలిపిన వారికి విలువైన బహుమతి ఇవ్వనున్నట్లు పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. డ్యూక్ ఆచూకీ తెలిసిన వారు 98666 94700 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు. -
రివార్డు.. రికార్డు
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీ, పురానీహవేలీలోని హిజ్ ఎగ్జాల్డెడ్ హైనెస్ (హెచ్‌ఈహెచ్) నిజాం మ్యూజియంలో వెలకట్టలేని విలువైన వస్తువులను చోరీ చేసిన దొంగలను పట్టుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌కు నగర పోలీసు కమిషనర్ మంగళవారం రూ.5 లక్షల రివార్డును అందించారు. నగర పోలీసు కమిషనరేట్ చరిత్రలో ఇదే భారీ రివార్డు మొత్తం కావడం గమనార్హం. ఈ ఏడాది సెప్టెంబర్ 4 తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ నేరంలో నిందితులుగా ఉన్న ఇద్దరు దొంగల్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదే నెల 11న అరెస్టు చేసిన విషయం విదితమే. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన వెల్డర్ మహ్మద్ ముబిన్, సెంట్రింగ్ వర్కర్ మహ్మద్ గౌస్ పాషా పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడ్డారు. సెప్టెంబర్ 4 తెల్లవారుజామున స్క్రూడ్రైవర్లు, కటింగ్ ప్లేయర్, మేకులు పీకే ఉపకరణం, తాడు, పది హాక్సా బ్లేడ్లతో బైక్‌పై మ్యూజియం వద్దకు చేరుకున్న వారు, వాటిని వినియోగించి లోపలకు దిగారు. ఓ అల్మారాను పగులకొట్టి అందులో ఉన్న అతి పురాతనమైన బంగారంతో చేసిన, వజ్రాలు పొదిగిన టిఫిన్ బాక్స్, కప్పు–సాసర్, స్ఫూన్ ఎత్తుకెళ్లారు. వీరి కోసం టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ నేతృత్వంలో దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి తన బృందంతో ముమ్మరంగా గాలించారు. దేశంలోనే మ్యూజియాల్లో జరిగిన వాటిలో భారీ చోరీ అయిన ఈ కేసును సెప్టెంబర్ 11న ఛేదించి నిందితులను అరెస్టు చేయడంతో పాటు మొత్తం సొత్తు యథాతథంగా రికవరీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మ్యూజియంలలో జరిగిన చోరీలు ఇంత త్వరగా కొలిక్కి రావడం, మొత్తం సొత్తు రికవరీ కావడం జరుగలేదని పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అప్పట్లోనే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రతిభ కనబరిచిన చైతన్యకుమార్, మధుమోహన్రెడ్డిలతో పాటు మొత్తం బృందానికి రూ.5 లక్షల రివార్డు అందించారు. కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అదనపు సీపీలు డీఎస్ చౌహాన్, టి.మురళీకృష్ణ, సంయుక్త సీపీ తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు. -
పన్ను కట్టండి.. గవర్నర్‌తో ఛాయ్ తాగండి
న్యూఢిల్లీ : గవర్నర్‌తో కూర్చుని ఓ కప్పు కాఫీ తాగాలని ఉందా.. ఎయిర్‌పోర్టులో ప్రియారిటీ చెక్-ఇన్ చేయించుకోవాలని ఉందా, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సస్ కావాలని ఉందా.. అయితే పన్నులు సక్రమంగా కట్టండి. ఉత్తమమైన పన్ను చెల్లింపుదారులకు పలు రివార్డులను అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులను ప్రభుత్వం గుర్తిస్తోంది. దీని కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఈ స్కీమ్ కింద అర్హులయ్యే పన్ను చెల్లింపుదారులను గుర్తిస్తుందని సీబీడీటీ ఉన్నతాధికారులు చెప్పారు. ఎక్కువ మంది ఇన్కమ్-ట్యాక్స్ రిటర్నులను ఫైల్ చేయడానికి, నిజాయితీగా పన్నులు చెల్లించడానికి ఈ రివార్డు ప్రొగ్రామ్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న రివార్డు ప్రొగ్రామ్‌లను కమిటీ పరిశీలిస్తోంది. అయితే ఉత్తమమైన పన్ను చెల్లింపుదారుల్లో కేవలం, పన్నులు కట్టే ప్రక్రియనే మాత్రమే కాక, రిటర్నులను దాఖలు చేసే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. అంతకముందు కూడా పన్ను చెల్లింపుదారుల కోసం సమ్మాన్ అనే స్కీమ్‌ను ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2004 తర్వాత దీన్ని క్లోజ్ చేశారు. పలు దేశాల్లో ఉన్న రివార్డు ప్రొగ్రామ్‌లు... పలు దేశాల్లో నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు రివార్డు ప్రొగ్రామ్‌లను అవలంభిస్తున్నాయి. చక్రవర్తితో ఫోటోలు తీసుకునే అవకాశాన్ని జపాన్ కల్పిస్తోంది. దక్షిణ కొరియా సర్టిఫికేట్లను, ఎయిర్‌పోర్టులో వీఐపీ రూమ్‌ల యాక్సస్‌ను, ఫ్రీ పార్కింగ్‌ను అందజేస్తుండగా.. పాకిస్తాన్ ప్రతేడాది టాప్ 100 పన్ను చెల్లింపుదారులకు ఎయిర్‌పోర్టుల్లో వీఐపీ లాంజ్‌ల యాక్సస్‌ను ఆఫర్ చేస్తోంది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో త్వరగా క్లియరెన్స్, ఉచిత పాస్‌పోర్టులను, బ్యాగేజీ అలవెన్స్‌ను అందిస్తోంది. ఇలా పలు దేశాల్లో పన్ను రివార్డుల స్కీమ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా మన దేశంలో కూడా ఉత్తమమైన పన్ను చెల్లింపుదారులను గుర్తించి, వారికి రివార్డులను అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
భీముడిని పట్టుకున్నందుకు రివార్డులు
కూసుమంచి: న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన గుండాల ఏరియా దళ కమాండర్ బోడ భీముడు అలియాస్ సుధాకర్‌ను పట్టుకున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి రివార్డులను మంగళవారం పోలీస్ కమిషనర్(సీపీ) తఫ్సీర్ ఇక్బాల్ అందించారు. మండలంలోని చౌటపల్లి శారు బండమీదితండాలో ఈ నెల 9న బీముడు అలియాస్ సుధాకర్‌ను ఖమ్మం రూరల్ ఏసీపీ నరేష్‌రెడ్డి మార్గదర్శకత్వంలో కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకుగాను ఏసీపీ నరేష్రెడ్డితోపాటు కూసుమంచి సీఐ వసంత్‌కుమార్, ఎస్ఐ రఘు, కానిస్టేబుల్ కృష్ణకు రివార్డులను సీపీ అందజేశారు. వారిని అభినందించారు. -
రైల్వే వినూత్న ఆఫర్ : వాటిపై క్యాష్‌బ్యాక్
వడోదర : దేశీయ రైల్వే మరో వినూత్న ఆఫర్ ప్రకటించింది. ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి రైల్వే రివార్డ్స్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ బాటిల్స్‌ను రీసైకిల్ చేయడానికి ఉపయోగపడితే ప్రయాణికులకు రివార్డులను ఇవ్వనున్నట్టు తెలిపింది. దీనికోసం వడోదర రైల్వే స్టేషన్లో బాటిల్ క్రషర్లను ఇన్స్టాల్ చేసింది. ఈ స్కీమ్ కింద క్రషింగ్ మిషన్‌లో ప్లాస్టిక్ బాటిల్ వేస్తే, ఒక్కో బాటిల్‌కు ఐదు రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ప్రయాణికుల పేటీఎం అకౌంట్లో క్రెడిట్ చేయనుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి, బాటిల్‌ను వేసిన తర్వాత ప్రయాణికులు మొబైల్ నెంబర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ మొబైల్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న పేటీఎం అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్తాయి. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా దేశీయ రైల్వే ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. దీంతో కొంతమేర ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించవచ్చని దేశీయ రైల్వే యోచిస్తోంది. వడోదరతో పాటు మరికొన్ని రైల్వే స్టేషన్లలో కూడా ఇలాంటి మిషన్లనే ఏర్పరించింది. -
ఉత్తమ అధికారులకు రివార్డులు
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ బుధవారం కేపీఐ రివార్డ్స్ అందించారు. కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాలకు సంబంధించి ట్రాఫిక్ ఏసీపీ–3 బి.కోటేశ్వరరావు, ఈస్ట్, సౌత్‌జోన్ల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఎస్.మోహన్‌కుమార్, కె.మధుమోహన్‌రెడ్డి బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు తదితరులు వీటిని అందుకున్నారు. ఈ రెండు నెలలకు కలిపి మొత్తం 291 మందిని కేపీఐ రివార్డ్స్ వరించాయి. -
పోలీసులు బండి ఆపగానే...
దుబాయ్ : నడి రోడ్డుపై వాహనాన్ని అడ్డుకుని పక్కకు తీసుకోమని పోలీసులు ఆదేశిస్తే... ఏదో తప్పు జరిగింది... ఫైన్ తప్పదని బెంబేలెత్తిపోవడం డ్రైవర్ల వంతవుతుంది. దుబాయ్ లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే, అందుకు భిన్నంగా జరిగిన ఒక ఘటన ఒక్కసారిగా డ్రైవర్ ను ఆశ్చర్యచకితుడిని చేసింది. కేరళకు చెందిన అనిల్ కుమార్ కొన్నేళ్లుగా దుబాయ్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. దుబాయ్ లో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణ కలిగిన డ్రైవర్ గా పేరుతెచ్చుకున్న అనిల్ కుమార్ కు ఎదురైన ఆ ఘటన ఏమంటే... అనిల్ కుమార్ దుబాయ్‌లో ఒక స్కూల్ బస్ డ్రైవర్. ప్రతి రోజులాగే సోమవారం కూడా యథావిధిగా పిల్లలతో బస్సులో స్కూల్‌కు బయలుదేరాడు. వెనకాల పోలీసులు ఫాలో అవుతున్నారు. బస్ స్కూల్ చేరుకున్న దశలోనే చుట్టుముట్టిన పోలీసులు బస్సు దిగాల్సిందిగా అనిల్ కుమార్‌ను ఆదేశించారు. ఏం తప్పు చేశానో అనుకుని హైరానా పడుతూనే బస్సు దిగిన అనిల్ ఎంత ఫైన్ వేస్తారోనని భయపడిపోయాడు. జరుగుతున్న సంఘటన చూడటానికి అక్కడికి జనాలు, పాఠశాల ఉద్యోగులు గుమ్మిగూడారు. ఏం జరుగుతుందో బస్ డ్రైవర్‌కి అర్థం కాలేదు. సమాచారం అందిన వెంటనే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోడానికి స్కూల్ యాజమాన్యం సైతం అక్కడికి చేరుకుంది. అయితే, అందరి అంచనాలకు భిన్నంగా... బస్సు దిగిన డ్రైవర్ ను ఒక్కసారిగా అభినందించడం ప్రారంభించారు. దుబయ్ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ గడిచిన ఆరు సంవత్సరాలుగా ఏ ఒక్కరోజూ రూల్స్ అతిక్రమించకుండా క్రమశిక్షణతో వాహనాన్ని నడిపిస్తున్నందుకు అనిల్ ను పోలీసులు అభినందించడమే కాకుండా వెయ్యి దిర్హమ్ ల నగదు ప్రోత్సాహకంతో పాటు ఒక సర్టిఫికేట్ ఇచ్చి అక్కడికక్కడే సత్కరించారు. గడిచిన 6 సంత్సరాలుగా మంచి డ్రైవింగ్ గుర్తింపు తెచ్చుకున్న మరో మహిళకు, గత 40 సంవత్సరాలుగా సొంత వాహనం నడుపుకుంటూ ట్రాఫిక్ రూల్స్‌ను సక్రమంగా పాటిస్తున్న ఖలీఫా అనే వ్యక్తిని కూడా పరిచయం చేసి వారికి కూడా బహుమతి అందించి సత్కరించారు. మొత్తంగా షెల్ గోల్డ్ స్టార్ పేరుతో సురక్షిత డ్రైవింగ్ చేసిన వారిని ఈ తరహాలో నగదుతో పాటు ప్రోత్సహకాలను అందించి సత్కరించింది. -
రైల్వే ఉద్యోగులకు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఉద్యోగుల్లో మనోధైర్యం, ఉత్సాహం పెంచడానికి ప్రత్యేక రివార్డులు, ప్రోత్సాహకాలు, బోనస్‌లు ఇవ్వాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఉత్తమ పనితీరు కనబరిచే వారికి మెరుగైన రివార్డులు ఇచ్చేలా పదోన్నతుల ప్రాతిపదికల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. నిపుణుల కమిటీ పలు సిఫార్సులతో సమర్పించిన నివేదిక రైల్వే బోర్డుకు చేరింది. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు వార్షిక పనితీరు మదింపు నివేదికలకు బదులు చివరి ఏడేళ్లలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఐదేళ్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సిబ్బంది తల్లిదండ్రులకూ వైద్య, ఉచిత ప్రయాణ సదుపాయాలు కల్పించాలంది. ఉన్నత విద్య కొనసాగించే ఉద్యోగులకు ఆర్థిక సాయం, దిగువ స్థాయి సిబ్బందికే కాకుండా ఏ, బీ గ్రేడ్ ఉద్యోగులకు బోనస్‌లు ఇవ్వాలని పేర్కొంది. కాగా, రైల్వేల్లో నిర్వహణ సమయంలో పాటిస్తున్న ప్రమాదకరమైన పద్ధతుల గురించి తెలియజేయాలని ఉద్యోగులందరికీ రైల్వే బోర్డు చైర్మన్ లేఖ రాశారు. -
రైల్వే టిక్కెట్ల బుకింగ్‌పై రివార్డ్స్
నగదు రహిత మాధ్యమాల ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు దేశీయ రైల్వే ప్రోత్సాహకాలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే నెలవారీ ట్రావెల్ పాస్‌పై 0.5 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్లు చేసేవారికి ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఇదే మాదిరి సౌకర్యాన్ని అన్రిజర్వ్డ్ కేటగిరీలకు విస్తరిస్తోంది. నగదు రహితంగా టిక్కెట్లను కొనుగోలు చేసే వారికి ఉచితంగా ప్యాసెంజర్ ఇన్సూరెన్స్‌ను కూడా రైల్వే అందించనుంది. నగదు లావాదేవీలను తగ్గించడానికి తమవంతు సహకరిస్తున్నామని, ఇప్పటికే ప్రయాణికులకు పలు ప్రోత్సాహకాలను ప్రారంభించినట్టు రైల్వే బోర్డు మెంబర్-ట్రాఫిక్ మహ్మద్ జంషెడ్ చెప్పారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసే ప్రయాణికులకు సర్వీసు ఛార్జీలను రద్దు చేయడంతో, దేశీయ రైల్వే ఇప్పటికే రూ.400 కోట్లను కోల్పోయింది. ప్రస్తుతం 60 శాతం లావాదేవీలు నగదురహితంగానే జరుగుతున్నట్టు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు నుంచి 20 శాతం మాత్రమే పెరిగాయి. 2016 నవంబర్‌కు ముందు వరకు చాలా డిజిటల్ లావాదేవీలు ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా జరిగేవి. డిమానిటైజేషన్ తర్వాత రైల్వే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లను టిక్కెట్ కౌంటర్ల వద్ద అందించింది. అంతేకాక డిజిటల్ వాలెట్ల ద్వారా కూడా చెల్లింపులను అంగీకరిస్తోంది. 15వేల టిక్కెట్ కౌంటర్లలో పీఓఎస్ మిషన్లను రైల్వే అందించింది. మొత్తం చెల్లింపుల్లో 85-90 శాతం నగదురహితంగా జరగాలని దేశీయ రైల్వే టార్గెట్‌గా పెట్టుకుంది. -
మోదీకి బ్యాంకు ఉద్యోగుల లేఖ
న్యూఢిల్లీ: ప్రసంశలు కాదు పైసలు కావాలి అంటున్నారు బ్యాంకు ఉద్యోగులు. కొత్త సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించిన ప్రధాని నరేంద్ర మోదీ... బ్యాంకు ఉద్యోగుల సేవలను కొనియాడారు. పాత పెద్ద నోట్ల రద్దును చేసిన నేపథ్యంలో తీవ్ర ఒత్తిడులు ఎదురైనా ఉద్యోగులు బాగా పనిచేశారని ప్రశంసించారు. రాష్ట్ర నాయకులు కూడా బ్యాంకు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. అయితే తమ శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఓవర్ టైమ్ డ్యూస్ కూడా తక్షణమే ఇవ్వాలని జాతీయ బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఎన్‌ఓబీడబ్ల్యూ) డిమాండ్ చేసింది. భారతీయ మజ్దూర్ సంఘ్ కు అనుబంధంగా ఉన్న ఎన్‌ఓబీడబ్ల్యూ ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసింది. చాలా బ్యాంకులు ఓవర్ టైమ్ డ్యూస్ చెల్లించలేదని లేఖలో పేర్కొన్నారు. ‘బ్యాంకు ఉద్యోగులు బాగా పని చేశారని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. కానీ ఉద్యోగుల సంక్షేమానికి కచ్చితమైన ప్రకటన చేయలేదు. ఈ విషయాన్ని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లామ’ని ఎన్‌ఓబీడబ్ల్యూ ఉపాధ్యక్షుడు అశ్వనీ రాణా తెలిపారు. ఉద్యోగుల భద్రతకు యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) డిమాండ్ చేసింది. -
సరిత.. కీలక నేత
ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళా మవోస్టులు లొంగుబాటు ఇద్దరిపై నాలుగేసి లక్షలు, మరొకరిపై రూ.లక్ష రివార్డు పెదవాల్తేరు (విశాఖ): పోలీసులకు బుధవారం లొంగిపోయిన ముగ్గురు మహిళా మవోయిస్టులపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. వీరంతా దళంలో చురుగ్గా పనిచేసిన వారే. లొంగిపోయినవారిలో ఫస్ట్ సి ఆర్ సి కంపెనీ కమాండర్ కుడబాల లక్ష్మి ఎలియాస్ సరిత, ఏసీఎం కేడర్ నేత బోనంగి రాములమ్మ ఎలియాస్ భారతి, దళ సభ్యురాలు తాంబేలు తుమ్ము, ఎలియాస్ విజయకుమారి ఉన్నారు. వీరిలో సరిత అత్యంత కీలక మహిళా నేతగా పనిచేశారు. వీరి వివరాలను ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ బుధవారం మీడియాకు వివరించారు. సరితపై 33 కేసులు, రూ.4 లక్షల రిమాండ్ డీసీఎం స్థాయి నేత సరిత (29) ఎంతో చురుగ్గా పనిచేశారు. ఏవోబీ తొలి మహిళ కమాండర్ స్థాయికి ఎదిగారు. జి.కె.వీధి మండలం, వంచుల పంచాయితీ శ్యామగెడ్డ ఈమె స్వగ్రామం. 2000లో దళంలో చేరారు. ఏకే 47 కలిగిన తొలి మహిళా నేత. సీలేరు సంతలో 2008 మే 28న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడి చేసి తుపాకులు ఎత్తుకు వె ళ్లడం, 2004లో కోరాపుట్ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్ పైదాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లడం, 2015 జనవరి 1న జై సర్పంచ్ సాగిన వెంకటరమణ హత్య తదితర సంఘటల్లో ఆమె పాల్గొంది. భారతక్క కూడా కీలక నేతే : మరో మహిళా కీలకనేత, జి.కె.వీధి మండలం బలపం పంచాయతీ లబడంపల్లి గ్రామానికి చెందిన బోనంగి రాములమ్మ ఎలియాస్ భారతక్క, ఎలియాస్ సరోజపై కూడా రూ.4 లక్షల రివార్డ్, 34 కేసులున్నాయి. అనకాపల్లి పోలీసుస్టేషన్ పైదాడి, దారకొండ పోలీసు అవుట్‌పోస్ట్‌పై దాడి వంటి కేసులున్నాయి. కోరుకొండ, గాలికొండ, పెదబయలు, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో పనిచేసింది. 2005లో ఏసీఎం క్యాడర్‌గా పదోన్నతి పొంది 20 ఏళ్ళు విశాఖ ఏవోబీలో పనిచేసింది. విజయపై లక్ష రివార్డ్ : జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయితీ పనసగొంది గ్రామానికి చెందిన తాంబేలు తుమ్ము, ఎలియాస్ విజయ సొంత అన్న తాంబేలు నాగేశ్వరరావు, బావ అప్పారావు మావోయిస్టు పార్టీలో ఉండడంతో దళంలో చేరింది. ఈమెపై రూ. లక్ష రివార్డుతో పాటు 8 నేరాలున్నాయి. -
అతడికి ఫేస్బుక్ భారీ నజరానా
న్యూయార్క్ : సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ దిగ్గజం ఫేస్బుక్ పదేళ్ల బాలుడికి బగ్ బౌంటీ నజరానా ప్రకటించింది. ఫేస్ బుక్ సొంతమైన ఫోటో షేరింగ్ వేదిక ఇన్ స్టాగ్రామ్ లోపాన్ని సవరించింనందుకుగాను ఫిన్ లాండ్ కు చెందిన జానీకి 6.65 లక్షలు (10,000 డాలర్లు) చెల్లించింది. వెంచర్ బీట్.కాం ఈ విషయాన్ని రిపోర్టు చేసింది. సెక్యూరిటీ రీసెర్చర్ కావాలని కలలు కంటున్న జానీ దీనిపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సొమ్ముతో తనకొక కొత్తబైక్, ఫుట్ బాల్ గేర్, తన సోదరుల కోసం రెండు కంప్యూటర్ లను కొనుగోలు చేయనున్నట్టు తెలిపాడు. ఫోటో షేరింగ్ ఇన్ స్టాగ్రామ్ లో వున్న సెక్యూరిటీ లోపాన్ని జానీ గుర్తించాడు. ఈ లోపానికి స్వయంగా పరిష్కారాన్ని కనుగొన్నాడు. కంటెంట్ ను, కమెంట్లను తొలగించడానికి అనుమతిస్తున్న ఒక బగ్ ని కనుగొన్నాడు. దానికి సంబంధించిన కోడ్ రూపొందించాడు. ఈ కోడ్ మార్చడం ద్వారా ఈ సామాజిక మీడియా వేదికలోని ఎవరి కమెంట్ నైనా తాను డిలిట్ చేయగలనని చెప్పాడు. ఈ విషయాన్ని ఈ మెయిల్ ద్వారా కంపెనీకి రిపోర్టు చేశాడు. దీంతో అతనికి ఫేస్ బుక్ భారీ బహుమతిని అందజేసింది. అంతేకాదు...ఈ బహుమతిని అందుకున్న అతిచిన్నవాడిగా జానీ అవతరించాడు. కాగా బగ్ బౌంటీ (వితరణ) కార్యక్రమంలో భాగంగా దాదాపు 800 మంది పరిశోధకులకు 4.3 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు ఇటీవల ఫేస్బుక్ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక భద్రతా పరిశోధకులు (205) భారత్‌లోనే ఉన్నారు అని పేర్కొంది. -
వ్యక్తిగత ప్రశంసలతో టీం వర్క్ కు ప్రోత్సాహం
మనిషికి ఇచ్చే వ్యక్తిగత గుర్తింపు.. ప్రశంసలు... వారిని టీం వర్క్ చేయడానికి ప్రోత్సహిస్తుందని, వారిలో మంచి శక్తినిస్తుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. చైనాలోని ఓ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లో పనిచేసేవారిపైనా, కొందరు విద్యార్థులపైనా జరిపిన అధ్యయనాల్లో ఈ కొత్త వివరాలు వెల్లడయ్యాయి. ప్రయోగశాలలు, ఫీల్డ్ ప్రయోగాల ద్వారా అధ్యయనాల్లో... వ్యక్తిగత గుర్తింపు.. టీమ్ వర్క్ కు ఎంతగానో సహకరిస్తుందని కనుగొన్నారు. వ్యక్తి పని తీరుపై అతడికి ఇచ్చే ప్రశంసల ప్రభావం ఉంటుందని చైనాలో జరిపిన కొత్త పరిశోధనల్లో తెలుసుకున్నారు. ఒక్కొక్కరి పనిని వ్యక్తిగతంగా గుర్తించడం, ప్రశంసలు తెలియజేయడం టీం వర్క్ ను ప్రోత్సహిస్తుందని అమెరికా నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పూలే కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ సహ అధ్యయనకారుడు ప్రొఫెసర్ బ్రాడ్లీ కిర్క్ మాన్ తెలిపారు. అధ్యయనకారులు చైనా విశ్వవిద్యాలయానికి చెందిన 256 మంది విద్యార్థులపై జరిపిన అధ్యయనాల్లో ఒక్కొక్కరి పనులను విడివిడిగా గుర్తించడంతోపాటు, సమూహాలతో కలసికూడ గుర్తించారు. వ్యక్తిగత పనుల్లో ప్రశంసలు పొందిన వారే సమూహాల్లో శక్తివంతంగా పనిచేసినట్లు గుర్తించామని తమ అధ్యయనాల వివరాలను అప్లైడ్ సైకాలజీ జర్నల్ లో ప్రచురించారు. రెండవ రౌండ్ లోనూ వ్యక్తిగత ప్రశంసలు పొందిన వ్యక్తి... ఇటు వ్యక్తిగతంగానూ, సమూహాలతో కలసి కూడా పనిలో గణనీయమైన మెరుగును కనబరచినట్లు అధ్యయనకారులు గుర్తించారు. అంతేకాక వ్యక్తిగత గుర్తింపులేని వ్యక్తి టీమ్ మెంబర్ గా కూడ ఎటువంటి మెరుగుదలను చూపించలేకపోయినట్లు తెలుసుకున్నారు. ఉత్తర చైనాలోని ఓ ఉత్సత్తి సంస్థ కూలీలపై కూడ పరిశోధకులు ఈ కొత్త ప్రయోగాలను నిర్వహించారు. కంపెనీలోని కొన్ని విభాగాల్లో 'ఎంప్లాయీ ఆఫ్ ద మంత్' పేరుతో టీమ్ లోని అత్యధిక పనిమంతులను గుర్తించి మిగిలిన విభాగాల్లో గుర్తించకుండా వదిలేశారు. అయితే ఇక్కడకూడా ప్రత్యేక గుర్తింపునివ్వకుండా వదిలేసిన టీమ్ లలో అటు వ్యక్తిగతంగా గాని, టీమ్ వర్క్ లో గాని పనిలో ఎటువంటి ప్రత్యేక ఫలితాలూ కనిపించకపోవడాన్ని తెలుసుకున్నారు. -
కాల్చేస్తే 11 లక్షలు.. నాలుక కోస్తే 5లక్షలు
* ఢిల్లీలో కన్హయ్యపై ‘కాల్చివేత’ పోస్టర్లు.. కేసు నమోదు * నాలిక కోస్తే ఆఫర్ ఇచ్చిన బీజేపీ నేత న్యూఢిల్లీ/బదాయూ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ లక్ష్యంగా రివార్డుల ప్రకటనలు వెలువడ్డాయి. ఆయనను కాల్చేస్తే రూ. 11 లక్షలు ఇస్తామని ఢిల్లీలో ‘పూర్వాంచల్ సేన’ పేరుతో శుక్రవారం పోస్టర్లు వెలిశాయి. మరోవైపు.. ఆయన నాలుక కోస్తే రూ. 5 లక్షలు ఇస్తామని యూపీ బీజేపీ నేత ప్రకటించారు. ఢిల్లీ ప్రెస్‌క్లబ్ గోడపై పూర్వాంచల్ సేన పోస్టర్లు అతికిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. కేసు నమోదు చేసి, వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పోస్టర్లో పూర్వాంచల్ సేన అధ్యక్షుడిగా పేర్కొంటూ ఆదర్శ్ శర్మ పేరు, ఫోన్ నంబరు ఉన్నాయి. కాగా, కన్హయ్య విడుదలయ్యాక బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, అతని నాలుక కోసిన వారికి రివార్డు ఇస్తానని బాదాయూ జిల్లా బీజేపీ యువమోర్చా చీఫ్ కులదీప్ వర్షనయ్ ప్రకటించారు. దీంతో ఆయన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్ల పాటు బీజేపీ అధిష్టానం బహిష్కరించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోనివ్వం: రాహుల్ జేఎన్‌యూలోని 8 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడానికి బీజేపీని అనుమతించబోమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అస్సాం ఎన్నికల సభలో అన్నారు. ‘కన్హయ్య ప్రసంగాన్ని 20 నిమిషాలు విన్నాను. ఒక్క పదమూ దేశానికి వ్యతిరేకంగా లేదు’ అని చెప్పారు. * కన్హయ్యకు భద్రతలో లోపాలు తలెత్తకుండా వర్సిటీ వెలుపలికి సంబంధించి ఆయన కదలికల వివరాలను తమకు అందించాలని ఢిల్లీ పోలీసులు జేఎన్‌యూ అధికారులను కోరారు. * విడుదలైన తర్వాత కన్హయ్య ఇచ్చిన ప్రసంగం బావుందని, అది దేశానికి వ్యతిరేకంగా లేదని బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కొనియాడారు. * రాహుల్ జేఎన్యూకు వెళ్లినందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ అన్నారు. * రోహిత్ వేముల.. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు మద్దుతుగా సభ నిర్వహించాడని కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. * భావప్రకటన స్వేచ్ఛపై కన్హయ్య తనతో చర్చలకు రావాలని లూధియానాకు చెందిన జాహ్నవి బెహల్ అనే 15 ఏళ్ల విద్యార్థిని సవాల్ విసిరింది. ఇక అలహాబాద్ వర్సిటీ వంతు! అలహాబాద్: తనను వర్సిటీ అధికారులు వేధిస్తున్నారని అలహాబాద్ వర్సిటీ విద్యార్థి నాయకురాలు రిచా సింగ్ ఆరోపించారు. వర్సిటీలో కొందరు అధికారుల నియామకాన్ని తాను వ్యతిరేకించడంతో లక్ష్యంగా చేసుకున్నారన్నారు. వర్సిటీలో బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కార్యక్రమాన్ని వ్యతిరేకించినందుకు తనను బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్రపతికి లేఖ రాశారు. -
ఆరుగురు ఉగ్రవాదుల తలలకు వెల
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఉదంపూర్ హైవేపై గత నెల 5న బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి చేసి తప్పించుకున్న ఉగ్రవాదుల తలలకు ఎన్ఐఏ వెల ప్రకటించింది. ఈ దాడిలో పాల్గొన్న ఆరు ఉగ్రవాదుల గురించి సమాచారం అందిస్తే లక్షలాది రూపాయలను బహుమతిగా అందజేస్తామని వెల్లడించింది. ఉగ్రవాదుల వివరాలు.. 1.అబు దుజనా (లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాది, పాకిస్థాన్, వెల రూ. 8 లక్షలు) 2. అదిల్ షేర్ గుజ్రి (లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాది, జమ్ముకశ్మీర్, వెల రూ.8 లక్షలు) 3. మొయిన్ కచ్రు (హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, జమ్ముకశ్మీర్, వెల రూ. 8 లక్షలు) 4. మాజిద్ జర్గర్ (లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాది, జమ్ముకశ్మీర్, వెల రూ.5 లక్షలు) 5.మంజుర్ అహ్మద్ బట్ (లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాది, జమ్ముకశ్మీర్, వెల రూ.5 లక్షలు) 6.ఆషిఖ్ హుస్సన్ బట్ (లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాది, జమ్ముకశ్మీర్, వెల రూ.5 లక్షలు) -
కుండీలో చెత్తవేస్తే.. వైఫై ఫ్రీ
న్యూఢిల్లీ: ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ అవసరాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సమస్త సమాచారాన్ని చిటికెలో అందిస్తూ విజ్ఞానానికి, వినోదానికి వేదికగా నిలుస్తోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ప్రాథమిక అవసరంగా మారింది. అపరిశుభ్రత.. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇదీ ఒకటి. సగం రోగాలు అపరిశుభ్రత కారణంగానే వ్యాపిస్తాయి. ప్రస్తుతం దేశానికి ఇది ప్రాథమిక సమస్యగా మారింది. తమ వినూత్న ఆలోచనతో ఈ రెండింటికీ ఒకే పరిష్కారం కనుగొన్నారు ముంబైకి చెందిన ఇద్దరు కామర్స్ గ్రాడ్యుయేట్లు. అదెలాగో మీరూ చూడండి. 'వైఫై ట్రాష్ బిన్' పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే.. వైఫై ఉచితంగా అందించే ఓ సరికొత్త ప్రయత్నం చేశారు ముంబైకి చెందిన ప్రతీక్ అగర్వాల్, రాజ్ దేశాయ్. ఇందుకోసం 'వైఫై ట్రాష్ బిన్'పేరుతో డస్ట్‌బిన్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో చెత్తవేస్తే వైఫై ఉచితంగా ఉపయోగించుకునేందుకు అవసరమైన కోడ్ వస్తుంది. ఈ కోడ్ ద్వారా వైఫైని ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆలోచన ఇలా ముంబైలో ఓ వారంతంలో వారు వెళ్లిన ఓ పార్టీ ఈ ఆలోచనకు కారణమైంది. విశాలమైన ప్రాంతంలో జరిగిన ఆ మ్యూజిక్ ఫెస్టివల్.. మ్యూజిక్, ఫుడ్, డ్రింక్స్‌తో పాటు పెద్ద మొత్తంలో చెత్తకు కూడా వేదికైంది. నెట్వర్క్ కూడా లేని కారణంగా అక్కడ తమ స్నేహితులను గుర్తించేందుకు తమకు ఆరుగంటలకు పైగా పట్టినట్లు అగర్వాల్ తెలిపారు. దీంతో హాట్‌స్పాట్స్ ద్వారా ఉచితంగా వైఫై ఎందుకు అందించకూడదు అనే ఆలోచన ఆ సమయంలో తనకు వచ్చినట్లు చెప్పారు. ఈ ఆలోచనకు డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్ తదితర దేశాల్లో శుభ్రతకు చేపట్టిన సరికొత్త పద్ధతులు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. సొంత నిధులతో టెలికం ఆపరేటర్ ఎంటీఎస్ సహాయంతో బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో జరిగే వారాంతపు వేడుకల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించాలని భావించినా అది అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం గెయిల్ నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు, చర్చలు జరుగుతున్నట్లు అగర్వాల్ తెలిపారు. కనెక్టివిటీ, మొబిలిటీ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు వెలికితీసేందుకు ఎరిక్సన్, సీఎన్ ఎన్ ఐబీఎన్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన 'నెట్వర్కడ్ ఇండియా'కార్యక్రమంలో ఇటీవల ఈ వైఫై బిన్స్‌ను ప్రదర్శించారు. -
ఆ కానిస్టేబుళ్లకు, డ్రైవర్లకు రివార్డులు
ఒంగోలు: నిన్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ సంఘటనలో నిందితులను పట్టుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన పోలీస్ ఉద్యోగులకు రివార్డులు ప్రకటించారు. నిందితులను పట్టుకోవడంలో నలుగురు కానిస్టేబుళ్లు, 8 మంది జీపు డ్రైవర్లు ధైర్యసాహసాలతోపాటు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. వారి తెలివితేటలను గుర్తించి డిఎస్పీ రివార్డులు ప్రకటించారు. కేసు పూర్వాపరాలు... శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన బంగారు వ్యాపారులు వేమూరి రాము, సునీల్ రూ. 82 లక్షల నగదుతో కావలి రైల్వే స్టేషన్ నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు వెళ్తున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు పోలీసులమని చెప్పి తుపాకీ చూపించి వారిని బెదిరించారు. పడుగుపాడు స్టేషన్ సమీపంలో ఆ రైలు నెమ్మదిగా వెళుతున్న సమయంలో విచారణ పేరుతో ఇద్దరు వ్యాపారులను కిందకు దించారు. వారిని నెల్లూరు ఆత్మకూరు బస్టాండు వద్దకు తీసుకెళ్లి, అక్కడ నుంచి అంబాసిడర్ కారును బాడుగకు తీసుకుని, దగదర్తి మండలం దామవరం వద్దకు వెళ్లిన తరువాత వారి వద్ద ఉన్న 82 లక్షల రూపాయలను తీసుకుని వ్యాపారులను వదిలి పారిపోయారు. బంగారు వ్యాపారుల ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు ప్రయాణించిన అంబాసిడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద ఓ కారులో వెళ్తున్న వారిని సినీఫక్కీలో వెంబడించి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.ముగ్గురిలో వెంకటసుబ్బయ్య, నాగరాజు ఒంగోలు కానిస్టేబుళ్లుగా, రవి అనే వ్యక్తి చీరాల కానిస్టేబుల్‌గా అనుమానిస్తున్నారు. పారిపోయిన వ్యక్తి స్టువర్ట్‌పురానికి చెందిన వాడిగా తెలుస్తోంది. -
టార్గెట్ పూర్తయింది..వెళ్లండి!
వర్గల్: నిన్న మొన్నటి దాకా రివార్డులు, అవార్డులంటూ మహిళలను బతిమాలి కుటుంబ నియంత్రణ శిబిరానికి తరలించిన వైద్యులు తమ వైఖరి మార్చుకున్నట్లు తెలిసింది. మంగళవారం వర్గల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం వచ్చిన సగానికి పైగా మహిళలను టార్గెట్ పూర్తయిందని, మలి విడత క్యాంపులో ఆపరేషన్లు చేయించుకోవాలని తిప్పి పంపారు. ఉదయం నుంచి ఆస్పత్రి ఎదుట పసిపాపలతో పడిగాపులు గాసిన మహిళలు వైద్యాధికారుల వ్యాఖ్యలతో దిగ్భ్రాంతికి గురయ్యారు. శస్త్ర చికిత్స చేయించుకోకుండానే ఉసూరుమంటు వెళ్లిపోయారు. సాధారణంగా వర్గల్లో నిర్వహించే కుటుంబ నియంత్రణ ప్రత్యేక శిబిరానికి మండలంతోపాటు, ములుగు, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల నుంచి కూడా మహిళలు వస్తుంటారు. లక్ష్యాన్ని సాధించేందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్న మహిళలకు నగదు పారితోషికాన్ని ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందజేస్తోంది. మరోవైపు శిబిరానికి మహిళలను తరలించే విధంగా ఏఎన్ఎం, ఆశాజ్యోతి వర్కర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అర్హులైన తల్లులకు నచ్చచెప్పి, బతిమాలి శిబిరాలకు తరలిస్తుండడం ఏఎన్ఎం, ఆశ వర్కర్ల విధిలో ప్రధానమైంది. ఈ క్రమంలో మంగళవారం వర్గల్ శిబిరానికి 150 మందికి పైగా మహిళలు వచ్చారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఆర్టీసీ బస్సు సౌకరం లేకపోవడంతో తెల్లవారే సరికి ఆటోల్లో చంటిపిల్లలతో వర్గల్ చేరుకున్నారు. వారిలో 75 మందికి మాత్రమే ఆపరేషన్లు చేసేందుకు రిజిష్టర్ చేసుకున్నారు. క్యాంపునకు సరిపడిన సంఖ్య పూర్తయిందని, ఇక ఖాళీలు లేవని, తరువాత నిర్వహించే క్యాంపునకు రావాలని వైద్యులు వారితో కరాఖండిగా చెప్పారు. దీంతో జగదేవ్‌పూర్, గజ్వేల్ తదితర ప్రాంతాలనుంచి వచ్చిన మహిళలు కొద్దిసేపు వైద్య సిబ్బందితో వాదనకు దిగారు. ఉదయం నుంచి పడిగాపులు గాశామన్నారు. వారి బాధలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు. గింత అన్యాలమా..పద్మ (ఎర్రవల్లి) వర్గల్ క్యాంపుల ఆపరేషన్ చేస్తరంటె పొద్దుగాల పొద్దుగాలనే ఆటోల వర్గల్‌కు వచ్చినం. పగటాల్దాక దవాఖాన ముందర నిర్ర నీలిగినం. ఆపరేషన్లకు ఎక్కువ మంది ఒచ్చిన్రని నన్ను పట్టించుకోలె. చంటి పిల్లను పట్టుకుని గింత దూరం ఈడ్సుకుంట వస్తె మల్ల క్యాంపునకు రమ్మని ఎల్లగొట్టిండ్రు. పైసల్ ఖర్సాయే..కష్టం తప్పకపాయె. ఊరుగాని ఊరునుంచి వస్తే తమాం గింత అన్యాలమా. ముందే చెపితె గింత తిప్పల పడకపోతుంటిమి. గరీబోల్లను గిట్ల పరేషాన్ చేయకుండ్రి. అధికారుల ఆదేశాల మేరకే... - డాక్టర్ సిల్వియా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం వచ్చిన మహిళలను తిప్పిపంపిన మాట వాస్తవమే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కు.ని. ప్రత్యేక శిబిరాలు నిర్వహించి గతంలో 150కి పైగా శస్త్ర చికిత్సలు జరిపిన సందర్భాలున్నాయి. ఇటీవల జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సంఖ్యను 80కి మించకుండా జిల్లా అధికారులు కుదించారు. వారి ఆదేశాలకు అనుగుణంగానే వర్గల్ శిబిరంలో 75 మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు జరిపాం. మిగతా వారు తరువాతి శిబిరంలో శస్త్ర చికిత్స జరిపించుకోవాలని నచ్చచెప్పి పంపించాం. -
కళలే ఆమెకు ప్రాణం
తిరుపతి క్రైం : ఆమెకు చిన్ననాటి నుంచి కళలంటే పంచప్రాణాలు. తండ్రి స్ఫూర్తితో బాల్యం నుంచే కళల పట్ల మక్కువ పెంచుకున్నారు. కథక్‌లో శిక్షణ తీసుకుని అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుని అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. ఆమే తిరు పతికి చెందిన ధర్మవరం శ్రీదేవి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీ పరిపాలనా భవనం శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె తండ్రి డాక్టర్ కృష్ణమూర్తి (డిక్కి) ఎస్వీ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి దివంగతులయ్యారు. తండ్రి హిందూస్తానీ సింగర్. తన పిల్లలూ ఏదో ఒక కళలో నైపుణ్యం సంపాదించాలని కలలుగనేవారు. అందులో భాగంగా కుమార్తె శ్రీదేవి నృత్యం పట్ల మక్కువ ఉన్నట్లు గ్రహించారు. కథక్‌లో ఆయనే స్వయంగా శిక్షణ ఇచ్చారు. ఆమె పాఠశాల స్థాయి నుంచే అనేక ప్రదర్శలిచ్చారు. పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు శ్రీదేవి హైదరాబాద్, ఢిల్లీ, గుంటూరు, శ్రీకాళహస్తి, తిరుమల, తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అనేక మార్లు కథక్ నృత్య ప్రదర్శనలిచ్చారు. ఉత్తమ డాన్సర్‌గా అవార్డులను సొంతం చేసుకున్నారు. డాన్స్ అకాడమీ స్థాపన తిరుపతి సిరిపురం కాలనీలో తన సొంత ఇం ట్లోనే శ్రీదేవి తండ్రి స్వర్గీయ డాక్టర్ డిక్కిస్ అకాడ మీ ఆఫ్ డాన్స్ పేరుతో అకాడమీని స్థాపించా రు. ఇప్పటి వరకు 38 మందికి శిక్షణ ఇచ్చా రు. ప్రముఖ నాట్యకళాకారిణి శోభరాజ్, నాగేశ్వరనాయుడు ఆమె దగ్గర శిక్షణతీసుకున్న వారే. నాటా ఆహ్వానం శ్రీదేవి ప్రతిభను గుర్తించి నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు మహాసభలకు ఆహ్వానం పలికారు. ఆమె తన శిష్యురాళ్లైన కుమారి శ్రీసాయిజనని, శ్రీమేథా బృందంతో కలిసి జూలై మొదటి వారంలో అమెరికా అట్లాంటాలో జరిగే ‘నాటా’ సభల్లో ప్రదర్శనలివ్వనున్నారు. శిష్యురాళ్లకు అరుదైన ఆహ్వానం శ్రీదేవి దగ్గర హిందూస్థానీ క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ పొందుతున్న బీటెక్ 4వ సంవత్సరం విద్యార్థిని శ్రీసాయి జననీ, 9వ తరగతి చదువుచున్న శ్రీమేధాకు నాటా మహాసభల్లో కథక్ నృత్యం చేసే అవకాశం దక్కింది. వీరి తల్లిదండ్రులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులే.