
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ బుధవారం కేపీఐ రివార్డ్స్ అందించారు. కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాలకు సంబంధించి ట్రాఫిక్ ఏసీపీ–3 బి.కోటేశ్వరరావు, ఈస్ట్, సౌత్‌జోన్ల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు ఎస్.మోహన్‌కుమార్, కె.మధుమోహన్‌రెడ్డి బేగంపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ముత్తు తదితరులు వీటిని అందుకున్నారు. ఈ రెండు నెలలకు కలిపి మొత్తం 291 మందిని కేపీఐ రివార్డ్స్ వరించాయి.
Comments
Please login to add a commentAdd a comment