
రివార్డు స్వీకరిస్తున్న సీఐ వసంత్‌కుమార్
కూసుమంచి: న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన గుండాల ఏరియా దళ కమాండర్ బోడ భీముడు అలియాస్ సుధాకర్‌ను పట్టుకున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి రివార్డులను మంగళవారం పోలీస్ కమిషనర్(సీపీ) తఫ్సీర్ ఇక్బాల్ అందించారు.
మండలంలోని చౌటపల్లి శారు బండమీదితండాలో ఈ నెల 9న బీముడు అలియాస్ సుధాకర్‌ను ఖమ్మం రూరల్ ఏసీపీ నరేష్‌రెడ్డి మార్గదర్శకత్వంలో కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకుగాను ఏసీపీ నరేష్‌రెడ్డితోపాటు కూసుమంచి సీఐ వసంత్‌కుమార్, ఎస్‌ఐ రఘు, కానిస్టేబుల్ కృష్ణకు రివార్డులను సీపీ అందజేశారు. వారిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment