మావోయిస్ట్ మృతదేహం లభ్యం | maoist dead body identify in khammam distirict | Sakshi
Sakshi News home page

మావోయిస్ట్ మృతదేహం లభ్యం

Published Wed, Apr 1 2015 1:31 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

maoist dead body identify in khammam distirict

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఓ మావోయిస్ట్ మృతదేహాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తిస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా చింతగుహ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎలమగొండ అడవి ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలకు, మావోయిస్ట్‌లకు భీకర పోరు జరిగింది. ఈ కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్‌కు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే.. తాజాగా ఈ రోజు ఉదయం ఎలమగొండ అడవి ప్రాంతంలోఓ మావోయిస్ట్ మృతదేహం, ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, రెండు మ్యాగ్‌జైన్లు లభించాయి. మావోయిస్ట్ మృతదేహాన్ని గుర్తించడం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement