రాంచీ: జార్ఖండ్‌లో సోమవారం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతిచెందారు. ఛాత్రా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఏకే47 తుపాకులతోపాటు భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేతలు హతమైనట్లు తెలుస్తోంది. ఇద్దరు నక్సల్స్‌పై రూ.25 లక్షల రివార్డు,మరో ఇద్దరు నక్సల్స్‌పై 5 లక్షల రివార్డు ఉన్నట్లు జార్ఖండ్ పోలీసులు తెలిపారు. సంఘటన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
కాగా ఆదివారం ఉదయం చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని సుమన్ సింగ్ అంచల(42), సంజయ్ కుమార్ ఉసెండి(27), పరుశరాం ధనుగల్(57)గా గుర్తంచారు.. ఈ ముగ్గురిపై చాలా కేసులు ఉన్నట్లు అదనపు ఎస్పీ కోమన్ సిన్హా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment