మీరు క్రెడిట్ కార్డ్‌తో లావాదేవీ జరిపిన ప్రతిసారీ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) ప్రత్యేకమైన రివార్డ్‌లను అందిస్తుంది. ఈ రివార్డ్ పాయింట్లను ఇష్టమైన బ్రాండ్‌లపై అద్భుతమైన డీల్‌లు లేదా ఆఫర్‌ల కోసం రీడీమ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్లతో మీకు కావాల్సిన వాటిని కొనుగోలు చేస్తూ.. ఖర్చులను కూడా ఆదా చేయవచ్చు. అయితే కొందరికి ఈ రివార్డ్ పాయింట్లను ఎలా చెక్ చేసుకోవాలి? ఎలా రీడీమ్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుండకపోవచ్చు. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకోవచ్చు..
ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్లను ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, కస్టమర్ కేర్ ద్వారా కూడా రీడిమ్ చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking)
➤కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి ఎస్‌బీఐ అధికారిక కార్డ్ పోర్టల్ లాగిన్ చేసిన తరువాత.. మెను బార్‌లో 'రివార్డ్‌లు' ఎంచుకుని, ఆపై 'రివార్డ్‌లను రీడీమ్ చేయి' ఆప్షన్ ఎంచుకోండి.
➤రివార్డ్ పాయింట్స్, సిటీ, కేటగిరీ వంటి వాటిని ఎంచుకోవాలి.
➤'రివార్డ్స్ కేటలాగ్' నుంచి మీకు కావలసిన వస్తువును ఎంచుకున్న తరువాత.. 'రీడీమ్ నౌ'పై క్లిక్ చేయడం ద్వారా మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు.
మొబైల్ యాప్ (Mobile App)
●మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎస్‌బీఐ కార్డ్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
●యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత.. కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయాలి.
●లాగిన్ పూర్తయిన తరువాత 'రివార్డ్‌లు' విభాగానికి వెళ్లి, ఆపై 'రివార్డ్‌లను రీడీమ్ చేయి' ఎంచుకోవాలి.
●రివార్డ్ పాయింట్స్, సిటీ, కేటగిరీ వంటి వాటిని ఎంచుకోవాలి.
●'రివార్డ్స్ కేటలాగ్' నుంచి మీకు కావలసిన వస్తువును ఎంచుకున్న తరువాత.. 'రీడీమ్ నౌ'పై క్లిక్ చేయడం ద్వారా మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు.
ఇదీ చదవండి: ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?
కస్టమర్ కేర్ ద్వారా ఆఫ్‌లైన్
▶ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి.. మీ రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేయడంలో సహాయం కోసం అడగండి.
▶కస్టమర్ ఎగ్జిక్యూటివ్ మీకు రీడీమ్ చేసుకోవడంలో సహాయం చేస్తారు.
▶పూర్తిగా రీడీమ్ చేసుకున్న తరువాత మీకు కావలసిన వస్తువును కొనుగోలు చేసుకోవచ్చు.
ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్లను చెక్ చేసుకోవడం ఎలా?
ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్లను చెక్ చేసుకోవడానికి ఏఐ చాట్‌బాట్‌ను, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా కాల్ చేయడం, వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్స్ సాయంతో చెక్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment