తిరుపతి క్రైం : ఆమెకు చిన్ననాటి నుంచి కళలంటే పంచప్రాణాలు. తండ్రి స్ఫూర్తితో బాల్యం నుంచే కళల పట్ల మక్కువ పెంచుకున్నారు. కథక్‌లో శిక్షణ తీసుకుని అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుని అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. ఆమే తిరు పతికి చెందిన ధర్మవరం శ్రీదేవి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీ పరిపాలనా భవనం శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
ఈమె తండ్రి డాక్టర్ కృష్ణమూర్తి (డిక్కి) ఎస్వీ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి దివంగతులయ్యారు. తండ్రి హిందూస్తానీ సింగర్. తన పిల్లలూ ఏదో ఒక కళలో నైపుణ్యం సంపాదించాలని కలలుగనేవారు. అందులో భాగంగా కుమార్తె శ్రీదేవి నృత్యం పట్ల మక్కువ ఉన్నట్లు గ్రహించారు. కథక్‌లో ఆయనే స్వయంగా శిక్షణ ఇచ్చారు. ఆమె పాఠశాల స్థాయి నుంచే అనేక ప్రదర్శలిచ్చారు.
పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు
శ్రీదేవి హైదరాబాద్, ఢిల్లీ, గుంటూరు, శ్రీకాళహస్తి, తిరుమల, తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అనేక మార్లు కథక్ నృత్య ప్రదర్శనలిచ్చారు. ఉత్తమ డాన్సర్‌గా అవార్డులను సొంతం చేసుకున్నారు.
డాన్స్ అకాడమీ స్థాపన
తిరుపతి సిరిపురం కాలనీలో తన సొంత ఇం ట్లోనే శ్రీదేవి తండ్రి స్వర్గీయ డాక్టర్ డిక్కిస్ అకాడ మీ ఆఫ్ డాన్స్ పేరుతో అకాడమీని స్థాపించా రు. ఇప్పటి వరకు 38 మందికి శిక్షణ ఇచ్చా రు. ప్రముఖ నాట్యకళాకారిణి శోభరాజ్, నాగేశ్వరనాయుడు ఆమె దగ్గర శిక్షణతీసుకున్న వారే.
నాటా ఆహ్వానం
శ్రీదేవి ప్రతిభను గుర్తించి నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు మహాసభలకు ఆహ్వానం పలికారు. ఆమె తన శిష్యురాళ్లైన కుమారి శ్రీసాయిజనని, శ్రీమేథా బృందంతో కలిసి జూలై మొదటి వారంలో అమెరికా అట్లాంటాలో జరిగే ‘నాటా’ సభల్లో ప్రదర్శనలివ్వనున్నారు.
శిష్యురాళ్లకు అరుదైన ఆహ్వానం
శ్రీదేవి దగ్గర హిందూస్థానీ క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ పొందుతున్న బీటెక్ 4వ సంవత్సరం విద్యార్థిని శ్రీసాయి జననీ, 9వ తరగతి చదువుచున్న శ్రీమేధాకు నాటా మహాసభల్లో కథక్ నృత్యం చేసే అవకాశం దక్కింది. వీరి తల్లిదండ్రులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులే.
కళలే ఆమెకు ప్రాణం
Published Sun, Jun 29 2014 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM
Advertisement