Kathak
-
అత్యంత అద్భుతంగా నాట్య తోరణం (ఫోటోలు)
-
కథక్‌తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మెస్మరైజ్ చేసిన మౌనీ రాయ్
బాలీవుడ్ నటి మౌని రాయ కథక్ డ్యాన్స్‌తో మమేకమవుతుంది. ఇది ఆమెకు రోజువారీ దినచర్యలో భాగం. బహ్మాస్త్ర మూవీలో శివగా నటించిన మౌనికి కథక్ ప్రియమైన భాష. ఆ డ్యాన్స్‌కి తగ్గ భంగిమ, ముఖాకవళికలతో తాను చెప్పాలనుకున్నది చెబుతుంటుంది. నిజానికి శాస్త్రియ నృత్యం కథక్లోని కదలికలు ఫిట్నెస్ పరంగా కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇది ముఖ్యంగా శరీరంలోని కండరాలను ప్రభావితం చేస్తుంది. అసలు నృత్యం మొత్తం కండరాల కదలికే ప్రధానం. దీన్ని చేయడం వల్ల కలిగే లాభాలేంటో నిపుణుల మాటల్లో సవివరంగా చూద్దామా..!.ఫిట్నెస్ ప్రయోజనాలు..కథక్‌లో నిటారుగా ఉన్న భంగిమపై ఒత్తిడిని కలుగజేస్తుంది అందువల్ల కోర్ కండరాలు బలోపేతం అయ్యేందుకు తోడ్పడుతుంది. అలాగే ఈ నృత్యంలో ఎక్కువసేపు పాదాలపైన ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల పాదాల్లోని కండరాలు సులభంగా కదపగలిగే శక్తి లభిస్తుంది. దీంతో పాటు ప్రధానంగా కడుపును లాగడం, నియంత్రిత శ్వాస తదితరాలు ఉదర కండరాలను బలోపేతం చేసి..పొట్ట భాగంలో కొవ్వు పేరుకోకుండా నివారిస్తుంది. అలాగే ఉదర కండరాలు స్ట్రాంగ్‌గా మారతాయి. నృత్యం చేసేటప్పడు చేతి ముద్రలు అత్యంత ప్రధానం. వీటివల్ల చేతి మణికట్టు వద్ద కండరాల్లో సులభంగా కదిలకలు ఉంటాయి. ఈ కథక్ని రోజువారి దినచర్యలో భాగం చేసుకోవడం శరీరంలోని అన్ని భాగాల్లో కదలిక చక్కగా ఉంటుంది. అలాగే శరీరంలోని భాగాలన్నింటికి చక్కటి సమన్వయం ఉంటుంది. శారీరకం దృఢంగా ఉంటారుఒత్తిడిని దూరం చేస్తుంది. ఇది ఒకకరంగా మానసిక స్థితిని ఆహ్లాదంగా ఉంచుతుంది. అందువల్ల ఇలాంటి కళను నేర్చుకునే ప్రయత్నం తోపాటు రోజువారి దినచర్యలో భాగం చేసుకోవడం వర్కౌట్లకు మించిన ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by mon (@imouniroy) (చదవండి: స్లిమ్‌గా నటి హిమాన్షి ఖురానా.. పరాఠాలు మాత్రం తప్పనిసరి!) -
దేశ నలుమూలల నుంచి నాట్య తోరణంలో పాల్గొన్న నృత్యకారులు
-
ఇలాంటి ఛాన్స్ ఊరికే రాదు
ఒకవైపు కథక్ డ్యాన్స్ క్లాస్‌లు, మరోవైపు ఉర్దూ పాఠాలను బ్యాలెన్స్ చేస్తూ శ్రద్ధగా నేర్చుకుంటున్నారు జాన్వీ కపూర్. కరణ్ జోహార్ తెరకెక్కించనున్న చారిత్రాత్మక చిత్రం ‘తక్త్’ కోసమే ఈ శిక్షణ. మొఘల్ చరిత్రకు సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందనుంది. కరీనా కపూర్, అనిల్ కపూర్, రణ్వీర్ సింగ్, ఆలియా భట్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. మార్చిలో ఈ సినిమా ప్రారంభం కానుంది. ‘‘ఈ సినిమా అవకాశం వచ్చినప్పటి నుంచే ఉర్దూ, కథక్ నేర్చుకోవడం ప్రారంభించా. నాకు చారిత్రాత్మక సినిమాలంటే చాలా ఇష్టం. ‘మొఘల్–ఈ–ఆజామ్, పాకీజా, ఉమ్రో జాన్’ వంటి సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు నాకు చారిత్రాత్మక చిత్రానికి అవకాశం రాగానే ఇలాంటి ఛాన్స్ ఊరికే రాదు అనుకున్నాను’’ అన్నారు జాన్వీ. -
నృత్య నీరాజనం
శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో ప్రఖ్యాత కథక్ నృత్యకారణి రచనాయాదవ్(హర్యానా) బృందం వారు ప్రదర్శించిన కథక్ నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కళానీరాజనంలో భాగంగా దేవస్థానం ఈ నెల 28 నుంచి వారం రోజులపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఆలయ ఆవరణలోని నాగులకట్ట కళావేదికపై గురువారం రాత్రి 8.30 గంటలకు ప్రదర్శించిన దేవతా మూర్తులు వారి లీలా విశేషాలను స్తూతిస్తూ కథక్ నృత్యం ఆద్యంతం మైమర్పించింది. ఆమెతో పాటు శ్లేతామిశ్రా, అవినాష్ ముఖర్జీ, త్రిపాటిశల్హాన్, నీలాక్షి ఖండేకర్, ముఖేష్ గంగాని, వైదేహి ఒబేరాయ్ తదితరులు కథక్ నృత్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి కిషోర్గంగాని, మహానీల్ గంగావి, కమల్, రవీందర్గాత్ర వాయిద్య సహకారాన్ని అందించారు. కాగా ఉత్తర భారతదేశంలో కథక్ సాంప్రదాయక నృత్యానికి ఎంతో ప్రత్యేకత ఉందని, ముఖ్యంగా మధ్య యుగంలో ఈ సాంప్రదాయ నృత్యానికి రాజుల ఆదరణ ఎంతగానో ఉందని ఈఓ భరత్ గుప్త తెలిపారు. పూర్వపు రోజుల్లో స్వామివార్ల నిత్య కైంకర్యాలలో భాగంగా నృత్యప్రదర్శన ఇచ్చే వారని పేర్కొన్నారు. శుక్రవారం ముంబాయ్ సంజయ్ విద్యార్థి చే భక్తి సంగీతం ఏర్పాటు చేసినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, ఏఈఓ ధనుంజయ, శ్రీశైల ప్రభ ఎడిటర్ డాక్టర్ కడప అనిల్‌కుమార్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గణేశ్ స్తుతి, దుర్గావతరణ, దుర్గాస్తుతి, ఆరాధన,ఆరాధ్య, మొదలైన అంశాలకు నృత్యాలు చేశారు. -
ఆ సినిమాలు చూసి... కథక్ నేర్చుకున్నా!
రాఖీ, జల్సా, రెడీ, బొమ్మరిల్లు, నువ్వే, క్లాస్మేట్స్, నేనొక్కడినే చిత్రాలతో నటునిగా మంచి పేరు తెచ్చుకున్న రవివర్మ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘కాలింగ్ బెల్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని రవివర్మ అన్నారు. మరిన్ని విషయాలు పంచుకుంటూ, ‘‘చిన్నతనం నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. అందు లోనూ కమల్‌హాసన్, చిరంజీవి అంటే ఇంకా ఇష్టం. కమల్ హాసన్ ‘సాగరసంగమం’, చిరంజీవి ‘అభిలాష’ చిత్రాలు చూసి స్కూల్లో ఉన్నప్పుడే కథక్ నేర్చుకున్నా. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్సు చేశా. ఇప్పటిదాకా 26 చిత్రాలలో నటించా. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’, నాగచైతన్య ‘దోచేయ్’ , నారా రోహిత్ ‘అసుర’, పీవీపీ బ్యానర్లో ‘క్షణం’, శ్రీకాంత్ ‘హోప్’ చిత్రాలలో నటిస్తున్నా. వీటిలో చేస్తున్నన్నీ విభిన్న తరహా పాత్రలే’’ అన్నారు. ‘‘పాత్ర బాగుంటే ప్రతినాయకుడిగా చేయడానికీ రెడీ’’ అని రవివర్మ తెలిపారు. -
జన్మ జన్మకీ ఇలాగే..
బ్రిజ్మోహన్ మిశ్రా.. అందరూ గౌరవంగా పిలిచుకునే బిర్జూ మహారాజ్! కథక్కు కదులుతున్న రూపం! ఈ శాస్త్రీయ నృత్యాన్ని సరికొత్త ప్రయోగాలతో సామాన్యులకూ దగ్గర చేశాడు.. కళ.. వసుధైక కుటుంబ భావనకు ఓ వారధి అని రుజువు చేశాడు.. ఆ దిగ్గురువు కళాకృతి నిర్వహిస్తున్న కృష్ణకృతి ఆర్ట్ ఫెస్టివల్లో తన అందెల సవ్వడి వినిపించడానికి హైదరాబాద్ విచ్చేశాడు. ఆ ములాఖాత్ ముచ్చట్లు... ..:: సరస్వతి రమ మా మామయ్య రామ్‌కిషన్ శుక్లా (సవతి తల్లి తమ్ముడు) ఇక్కడి మ్యూజిక్ అకాడమీలో కథక్ టీచర్. అలా హైదరాబాద్‌తో నాకు అనుబంధం ఉంది. అదీగాక నా స్వస్థలమైన లక్నోకి, హైదరాబాద్‌కి చాలా పోలికలున్నాయి. ఇక్కడా ఉర్దూ ప్రధానం.. మాకూ ఉర్దూ ప్రధాన భాషే. నా చిన్నప్పుడు మా ఇంట్లో ఉర్దూనే మాట్లాడే వాళ్లం. మా అమ్మ పెళ్లయి నానమ్మ వాళ్లింటికొచ్చాక.. వాళ్లంతా ఉర్దూ మాట్లాడుతుంటే.. నేను ముస్లిం ఇంట్లో పడ్డానా ఏంటీ అనుకుందట. దానికితోడు మా నాన్న నానమ్మను ‘అమ్మీజాన్’, తాతయ్యను ‘అబ్బా’ అని పిలిచేసరికి (నాన్న నానమ్మను చివరి వరకు అలాగే పిలిచేవారు) ఆమె అనుమానం బలపడింది. దాంతో ఆ రాత్రి నానమ్మ వాళ్లు వండిన వంటలను తినక బయటి నుంచి తెప్పించుకొని తిని నిద్రపోయిందట. తెల్లవారే దేవుడి హారతులు, శంకు నాదం, ఘనఘన గంటల మోతతో మెలకువ వచ్చిందట అమ్మకి. ఈ చప్పుళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని పనమ్మాయిని అడిగిందట. ‘ఎక్కడి నుంచి ఏంటమ్మా.. మనింట్లోవే.. పైన పెద్దయ్యగారు పూజ చేస్తున్నారు’ అని చెప్పేసరికి అప్పుడు నమ్మకం కుదిరిందట ఇది హిందువుల ఇల్లే.. మా అత్తగారు హిందువులే అని. ఒక్క భాషే కాదు.. తెహ్జీబ్ (సంస్కృతి) కూడా అలాంటిదే. హిందూముస్లిం ఐక్యతే హైదరాబాద్ సంస్కృతి. అదే తెహ్జీబ్ లక్నోలోనూ కనిపిస్తుంది. మొహర్రం పదిహేను రోజులు కాళ్లకు గజ్జెలు కట్టనివ్వకుండా ప్రాక్టీస్ చేయించేవారు నాన్నగారు (అచ్చన్ మహారాజ్). అలాగే హోలీ రోజు ముస్లింలూ మాతో కలిసి రంగులాడేవారు. ఏ పండుగలైనా కలిసే చేసుకునేవాళ్లం. ఇవన్నీ లక్నో, హైదరాబాద్‌కున్న పోలికలు. అందుకే హైదరాబాద్‌కి రావడమంటే నాకు మా ఇంటికొచ్చినట్టే. ముంబై, కోల్‌కతా వెళ్తే ప్రోగ్రామ్ అయిపోగానే అక్కడ ఉండాలనిపించదు. కానీ ఇక్కడికొస్తే.. వెళ్లాలనిపించదు. వెళ్లినా పదేపదే రావాలనిపిస్తుంది. ఈ నేల అలాంటిది. అద్భుతమైన శక్తి ఉంది దీనికి. సాధారణంగా సౌత్ ఇండియాలో భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మోహినీ ఆట్టం లాంటి వాటికున్నంత ఆదరణ కథక్కు లేదు. కానీ హైదరాబాద్.. మొదటి నుంచీ ఈ నాట్యాన్ని పోషిస్తోంది. అందుకే హైదరాబాద్‌లోనూ నా శిష్యులు (రాఘవరాజ్ భట్, మంగళాభట్) కథక్ పరంపరను అద్భుతంగా కొనసాగిస్తున్నారు. ఇవన్నీ ఈ ఊరుతో నాకున్న అనుబంధాన్ని బలపరుస్తున్నాయి. కథక్.. కామన్ మ్యాన్ నాట్యమైనా, సంగీతమైనా.. ఏ కళ అయినా సామాన్యుడిని చేరితేనే సాఫల్యం అయినట్టు. అప్పుడే ఆ కళ కలకాలం వర్ధిల్లుతుంది. అందుకే నేను శాస్త్రీయ కథక్‌తో ప్రయోగాలు చేశాను. డ్యాన్స్ డ్రామా రూపంలో ఆవిష్కరించాను. అపూర్వ ఆదరణ పొందింది. ఈ రోజు నా శిష్యగణం చైనా, జపాన్ మొదలు అమెరికా, ఆస్ట్రేలియా దాకా అంతటా ఉన్నారు. కళ.. ప్రపంచంలోని మనుషుల మధ్య దూరాలను చెరిపి వసుధైక కుటుంబంగా మారుస్తుందని చెప్పడానికి ఇంతకన్నా రుజువేం కావాలి! అన్నీ ఇష్టమే కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, ఒడిస్సీ.. లాంటి అన్ని నృత్యరీతులూ ఇష్టమే. అసలైన జానపద నాట్యమంటే కూడా.. అంటే ఫిల్మీవాలా జానపదం కాదు అసలైన జానపద నాట్యం.. చాలా ఇష్టం. అన్నిటినీ ఆస్వాదిస్తా. కళాకారులందరితో మంచి అనుబంధం ఉంది. వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో తన డ్యాన్స్ స్కూల్‌ను నాచేతే ప్రారంభం చేయించారు. ఇక ఒడిస్సీ నాట్యాచారుడు కేళూ బాబా (కేళూ చరణ్ మహాపాత్రా) నాకు అత్యంత ఆప్తుడు. ‘బిర్జూ మనిద్దరం కలిసి రాధాకృష్ణులుగా అభినయించాలి. నేను రాధగా.. నువ్వు కృష్ణుడిగా’ అన్నాడు. అభినయించాం. మేం చేసిన ఆ ఫ్యూజన్ (ఒడిస్సీ, కథక్) చూసిన ప్రేక్షకులు మైమరిచిపోయారు. ఆత్మానందంతో వాళ్ల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సినిమాకు కొంచెం దూరమే.. మా ఇంట్లో మా చిన్నాన్న (లచ్చు మహారాజ్) ఒక్కరే సినిమా వైపు వెళ్లారు. అయినా సినిమాల కోసం ఎక్కడా తన నాట్యాన్ని పలుచన చేయలేదు. మొఘల్ ఏ ఆజం, పాకీజా, తీస్రీ కసమ్లాంటి ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫి అందించారు. అదీ క్లాసికల్వేలోనే. నేనూ కొరియోగ్రఫి చేశాను దిల్‌తో పాగల్ హై, దేవదాసు, విశ్వరూపం లాంటి కొన్ని సినిమాలకు. విశ్వరూపం సినిమాకు నాకు జాతీయ అవార్డూ వచ్చింది. అయినా సినిమా డ్యాన్స్‌కు నేను కొంచెం దూరమే. ఇప్పుడు సంజయ్‌లీలా భన్సాలీ ‘భాజీరావ్ మస్తాన్’ సినిమాలోనూ దీపికా పదుకొనే నటించే ఓ పాటకు కొరియోగ్రఫి చేయమని అడుగుతున్నారు. చూడాలి. ఏమైనా నా కథక్‌ను సినిమా ఫ్రేమ్‌లో ఇమిడ్చే కన్నా విశాలమైన వేదిక మీద ప్రదర్శించడమే ఎక్కువిష్టం. కథక్ కోమలత్వాన్ని అంతే లాలిత్యంగా బోధించడమే నాకు ఆసక్తి. ఆత్మస్నానం నాట్యమే నా జీవితం.. నా జీవితమే నాట్యం. ఇది నాకో తపస్సు. ఇంతకు మించి నాకు మరో లోకం లేదు. ఈ జన్మకి.. మరుజన్మకి.. జన్మజన్మకి! వచ్చే జన్మలో కూడా కథక్ కళాకారుడిగానే పుట్టాలని కోరుకుంటున్నా. ఆ మాటకొస్తే ప్రతి వ్యక్తీ ఏదో ఒక కళను నేర్చుకోవాలి. అది ఆ వ్యక్తిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను.. పట్నాలో శివనారాయణసింగ్ అని ఓ మిత్రుడుండేవాడు. ఆయన డాక్టర్. సితార్ బాగా వాయిస్తాడు. పేషంట్లనూ చూస్తూ స్ట్రెస్ ఫీలయినప్పుడల్లా కన్సల్టెంట్ గది పక్కనే ఉన్న ఇంకో గదిలోకి వెళ్లి కాసేపు సితార్ వాయించి రిలాక్స్ అయి మళ్లీ పేషంట్లను చూడ్డానికి వచ్చేవాడు. కళ.. రోజూవారి ఒత్తిళ్ల నుంచి ఎంత విశ్రాంతినిస్తుందంటే.. ఆత్మస్నానం చేసినంత! జీవన పరమార్థం కూడా అదేకదా! -
కళలే ఆమెకు ప్రాణం
తిరుపతి క్రైం : ఆమెకు చిన్ననాటి నుంచి కళలంటే పంచప్రాణాలు. తండ్రి స్ఫూర్తితో బాల్యం నుంచే కళల పట్ల మక్కువ పెంచుకున్నారు. కథక్‌లో శిక్షణ తీసుకుని అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుని అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. ఆమే తిరు పతికి చెందిన ధర్మవరం శ్రీదేవి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీ పరిపాలనా భవనం శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె తండ్రి డాక్టర్ కృష్ణమూర్తి (డిక్కి) ఎస్వీ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి దివంగతులయ్యారు. తండ్రి హిందూస్తానీ సింగర్. తన పిల్లలూ ఏదో ఒక కళలో నైపుణ్యం సంపాదించాలని కలలుగనేవారు. అందులో భాగంగా కుమార్తె శ్రీదేవి నృత్యం పట్ల మక్కువ ఉన్నట్లు గ్రహించారు. కథక్‌లో ఆయనే స్వయంగా శిక్షణ ఇచ్చారు. ఆమె పాఠశాల స్థాయి నుంచే అనేక ప్రదర్శలిచ్చారు. పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు శ్రీదేవి హైదరాబాద్, ఢిల్లీ, గుంటూరు, శ్రీకాళహస్తి, తిరుమల, తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అనేక మార్లు కథక్ నృత్య ప్రదర్శనలిచ్చారు. ఉత్తమ డాన్సర్‌గా అవార్డులను సొంతం చేసుకున్నారు. డాన్స్ అకాడమీ స్థాపన తిరుపతి సిరిపురం కాలనీలో తన సొంత ఇం ట్లోనే శ్రీదేవి తండ్రి స్వర్గీయ డాక్టర్ డిక్కిస్ అకాడ మీ ఆఫ్ డాన్స్ పేరుతో అకాడమీని స్థాపించా రు. ఇప్పటి వరకు 38 మందికి శిక్షణ ఇచ్చా రు. ప్రముఖ నాట్యకళాకారిణి శోభరాజ్, నాగేశ్వరనాయుడు ఆమె దగ్గర శిక్షణతీసుకున్న వారే. నాటా ఆహ్వానం శ్రీదేవి ప్రతిభను గుర్తించి నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు మహాసభలకు ఆహ్వానం పలికారు. ఆమె తన శిష్యురాళ్లైన కుమారి శ్రీసాయిజనని, శ్రీమేథా బృందంతో కలిసి జూలై మొదటి వారంలో అమెరికా అట్లాంటాలో జరిగే ‘నాటా’ సభల్లో ప్రదర్శనలివ్వనున్నారు. శిష్యురాళ్లకు అరుదైన ఆహ్వానం శ్రీదేవి దగ్గర హిందూస్థానీ క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ పొందుతున్న బీటెక్ 4వ సంవత్సరం విద్యార్థిని శ్రీసాయి జననీ, 9వ తరగతి చదువుచున్న శ్రీమేధాకు నాటా మహాసభల్లో కథక్ నృత్యం చేసే అవకాశం దక్కింది. వీరి తల్లిదండ్రులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులే. -
శర్మిష్ఠ కథక్ కాంతులు
విశాఖకల్చరల్,న్యూస్‌లైన్: భారతీయ నృత్య వైభవం నగరంలో సాక్షాత్కరించింది. అఖిల భారతీయ శాస్త్రీయ నృత్యోత్సవాల ప్రారంభ కార్యక్రమంగా ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయ శర్మిష్ఠా ముఖర్జీ కథక్ ప్రవాహ్‌లో ఓలలాడిన నృత్యకళాభిమానులు తదుపరి అంశంగా జొన్నలగడ్డ సూర్యఈశ్వర ప్రసాద్ చేసిన భజన్ నృత్యంతో పరవశించారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కళాభారతిలో గురువారం 6వ అఖిలభారత శాస్త్రీయ నృత్యోత్సవాలు ఆరంభమయ్యాయి. ఉత్సవాల తొలి ప్రదర్శనగా భారత రాష్ట్రపతి కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ కథక్ నృత్యం ప్రదర్శించారు. కథక్ ప్రవాహ్ పేరున గంటపాటు ఆమె ప్రదర్శించిన నృత్య విన్యాసాలు ప్రేక్షకులను రంజింపజేశాయి. శర్మిష్ఠతో పాటు ఆమె బృంద సభ్యులు తృప్తీ సన్యాల్, శివానీ మల్హోత్రా, దివ్యలు నృత్య సహకారం అంచిందారు. రెండవ అంశంగా జొన్నలగడ్డ సూర్యఈశ్వర ప్రసాద్ భజన్ నృత్యం కళా ప్రియులను అలరించింది. మరాఠీ అభంగ్, పాండురంగ భజన కీర్తనలతో నాట్యం ఆరంభమైంది. అన్నమాచార్య కృతులు, రామదాసు కీర్తనలు అలరించాయి. ఈ సందర్భంగా శర్మిష్ఠకు నాట్యశ్రీ బిరుదు ప్రదానం చేశారు. ముందుగా జరిగిన ప్రారంభ సభలో బి.విక్రమ్‌గౌడ్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తి, ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, విజయ నిర్మాణ్ ఎస్. విజయకుమార్, లా కాలేజీ ప్రిన్సిపాల్ ఎ.సుబ్రహ్మణ్యం, శ్రీధర్ బిత్రా, ఒ.నరేష్కుమార్, సుదీప్తా, కె.ఎస్.కోటేశ్వరరావు, యు.నాగభూషణం పాల్గొన్నారు.