బాలీవుడ్ నటి మౌని రాయ కథక్ డ్యాన్స్‌తో మమేకమవుతుంది. ఇది ఆమెకు రోజువారీ దినచర్యలో భాగం. బహ్మాస్త్ర మూవీలో శివగా నటించిన మౌనికి కథక్ ప్రియమైన భాష. ఆ డ్యాన్స్‌కి తగ్గ భంగిమ, ముఖాకవళికలతో తాను చెప్పాలనుకున్నది చెబుతుంటుంది. నిజానికి శాస్త్రియ నృత్యం కథక్‌లోని కదలికలు ఫిట్‌నెస్ పరంగా కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇది ముఖ్యంగా శరీరంలోని కండరాలను ప్రభావితం చేస్తుంది. అసలు నృత్యం మొత్తం కండరాల కదలికే ప్రధానం. దీన్ని చేయడం వల్ల కలిగే లాభాలేంటో నిపుణుల మాటల్లో సవివరంగా చూద్దామా..!.
ఫిట్‌నెస్ ప్రయోజనాలు..
కథక్‌లో నిటారుగా ఉన్న భంగిమపై ఒత్తిడిని కలుగజేస్తుంది అందువల్ల కోర్ కండరాలు బలోపేతం అయ్యేందుకు తోడ్పడుతుంది.
అలాగే ఈ నృత్యంలో ఎక్కువసేపు పాదాలపైన ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల పాదాల్లోని కండరాలు సులభంగా కదపగలిగే శక్తి లభిస్తుంది.
దీంతో పాటు ప్రధానంగా కడుపును లాగడం, నియంత్రిత శ్వాస తదితరాలు ఉదర కండరాలను బలోపేతం చేసి..పొట్ట భాగంలో కొవ్వు పేరుకోకుండా నివారిస్తుంది. అలాగే ఉదర కండరాలు స్ట్రాంగ్‌గా మారతాయి.
నృత్యం చేసేటప్పడు చేతి ముద్రలు అత్యంత ప్రధానం. వీటివల్ల చేతి మణికట్టు వద్ద కండరాల్లో సులభంగా కదిలకలు ఉంటాయి.
ఈ కథక్‌ని రోజువారి దినచర్యలో భాగం చేసుకోవడం శరీరంలోని అన్ని భాగాల్లో కదలిక చక్కగా ఉంటుంది.
అలాగే శరీరంలోని భాగాలన్నింటికి చక్కటి సమన్వయం ఉంటుంది.
శారీరకం దృఢంగా ఉంటారు
ఒత్తిడిని దూరం చేస్తుంది.
ఇది ఒకకరంగా మానసిక స్థితిని ఆహ్లాదంగా ఉంచుతుంది.
అందువల్ల ఇలాంటి కళను నేర్చుకునే ప్రయత్నం తోపాటు రోజువారి దినచర్యలో భాగం చేసుకోవడం వర్కౌట్లకు మించిన ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: స్లిమ్‌గా నటి హిమాన్షి ఖురానా.. పరాఠాలు మాత్రం తప్పనిసరి!)
Comments
Please login to add a commentAdd a comment