జాన్వీ కపూర్
ఒకవైపు కథక్ డ్యాన్స్ క్లాస్‌లు, మరోవైపు ఉర్దూ పాఠాలను బ్యాలెన్స్ చేస్తూ శ్రద్ధగా నేర్చుకుంటున్నారు జాన్వీ కపూర్. కరణ్ జోహార్ తెరకెక్కించనున్న చారిత్రాత్మక చిత్రం ‘తక్త్’ కోసమే ఈ శిక్షణ. మొఘల్ చరిత్రకు సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందనుంది. కరీనా కపూర్, అనిల్ కపూర్, రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. మార్చిలో ఈ సినిమా ప్రారంభం కానుంది. ‘‘ఈ సినిమా అవకాశం వచ్చినప్పటి నుంచే ఉర్దూ, కథక్ నేర్చుకోవడం ప్రారంభించా. నాకు చారిత్రాత్మక సినిమాలంటే చాలా ఇష్టం. ‘మొఘల్–ఈ–ఆజామ్, పాకీజా, ఉమ్రో జాన్’ వంటి సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు నాకు చారిత్రాత్మక చిత్రానికి అవకాశం రాగానే ఇలాంటి ఛాన్స్ ఊరికే రాదు అనుకున్నాను’’ అన్నారు జాన్వీ.
Comments
Please login to add a commentAdd a comment