శర్మిష్ఠ కథక్ కాంతులు | Kathak sarmistha Lights | Sakshi
Sakshi News home page

శర్మిష్ఠ కథక్ కాంతులు

Published Fri, Sep 13 2013 2:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

Kathak sarmistha Lights

విశాఖకల్చరల్,న్యూస్‌లైన్: భారతీయ నృత్య వైభవం నగరంలో సాక్షాత్కరించింది.  అఖిల భారతీయ శాస్త్రీయ నృత్యోత్సవాల ప్రారంభ కార్యక్రమంగా ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయ శర్మిష్ఠా ముఖర్జీ కథక్ ప్రవాహ్‌లో ఓలలాడిన నృత్యకళాభిమానులు తదుపరి అంశంగా జొన్నలగడ్డ సూర్యఈశ్వర ప్రసాద్ చేసిన భజన్ నృత్యంతో పరవశించారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కళాభారతిలో గురువారం 6వ అఖిలభారత శాస్త్రీయ నృత్యోత్సవాలు ఆరంభమయ్యాయి.

ఉత్సవాల తొలి ప్రదర్శనగా భారత రాష్ట్రపతి కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ కథక్ నృత్యం ప్రదర్శించారు. కథక్ ప్రవాహ్ పేరున గంటపాటు ఆమె ప్రదర్శించిన నృత్య విన్యాసాలు ప్రేక్షకులను రంజింపజేశాయి. శర్మిష్ఠతో పాటు ఆమె బృంద సభ్యులు తృప్తీ సన్యాల్, శివానీ మల్హోత్రా, దివ్యలు నృత్య సహకారం అంచిందారు. రెండవ అంశంగా జొన్నలగడ్డ సూర్యఈశ్వర ప్రసాద్ భజన్ నృత్యం కళా ప్రియులను అలరించింది. మరాఠీ అభంగ్, పాండురంగ భజన కీర్తనలతో నాట్యం ఆరంభమైంది. అన్నమాచార్య కృతులు, రామదాసు కీర్తనలు అలరించాయి.

ఈ సందర్భంగా శర్మిష్ఠకు నాట్యశ్రీ బిరుదు ప్రదానం చేశారు. ముందుగా జరిగిన ప్రారంభ సభలో బి.విక్రమ్‌గౌడ్ స్వాగతం పలికారు.  కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తి, ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, విజయ నిర్మాణ్  ఎస్. విజయకుమార్, లా కాలేజీ ప్రిన్సిపాల్ ఎ.సుబ్రహ్మణ్యం, శ్రీధర్ బిత్రా, ఒ.నరేష్‌కుమార్, సుదీప్తా, కె.ఎస్.కోటేశ్వరరావు, యు.నాగభూషణం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement