
న్యూఢిల్లీ: ఉద్యోగుల్లో మనోధైర్యం, ఉత్సాహం పెంచడానికి ప్రత్యేక రివార్డులు, ప్రోత్సాహకాలు, బోనస్‌లు ఇవ్వాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఉత్తమ పనితీరు కనబరిచే వారికి మెరుగైన రివార్డులు ఇచ్చేలా పదోన్నతుల ప్రాతిపదికల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. నిపుణుల కమిటీ పలు సిఫార్సులతో సమర్పించిన నివేదిక రైల్వే బోర్డుకు చేరింది.
ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు వార్షిక పనితీరు మదింపు నివేదికలకు బదులు చివరి ఏడేళ్లలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఐదేళ్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సిబ్బంది తల్లిదండ్రులకూ వైద్య, ఉచిత ప్రయాణ సదుపాయాలు కల్పించాలంది. ఉన్నత విద్య కొనసాగించే ఉద్యోగులకు ఆర్థిక సాయం, దిగువ స్థాయి సిబ్బందికే కాకుండా ఏ, బీ గ్రేడ్ ఉద్యోగులకు బోనస్‌లు ఇవ్వాలని పేర్కొంది. కాగా, రైల్వేల్లో నిర్వహణ సమయంలో పాటిస్తున్న ప్రమాదకరమైన పద్ధతుల గురించి తెలియజేయాలని ఉద్యోగులందరికీ రైల్వే బోర్డు చైర్మన్ లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment