Bonuses
-
చందా కొచర్‌కు మరిన్ని చిక్కులు
సాక్షి,ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ కుంభకోణంలో ఐసీఐసీఐ బ్యాంకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈస్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎండీ చందా కొచర్ నుంచి తామిచ్చిన బోనస్‌ను రికవరీ చేయాలని కోరింది. అలాగే తన తొలగింపు అక్రమమంటూ చందా కొచర్ గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. తన తొలగింపు ద్వారా ఆర్బిఐ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొనడం, బ్యాంకు విలువైన స్టాక్ ఆప్షన్‌ను పొందేందుకు, తప్పు దారి పట్టించే ప్రయత్నమని ఐసీఐసీఐ బ్యాంకు తన అఫిడవిట్లో పేర్కొంది. ఈ మేరకు జనవరి 10 న దావా వేసింది. దీనిపై తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా పడింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీగా ఆమెను తొలగించిన తరువాత ఏప్రిల్ 2006- మార్చి 2018 వరకు ఆమెకిచ్చిన బోనస్ క్లాబ్యాక్ చేయాలని కోరుతోంది. (క్లాబ్యాక్ అంటే ఏదైనా దుష్ప్రవర్తన లేదా క్షీణించిన లాభాల విషయంలో ఒక ఉద్యోగి నుండి బోనస్ తదితర ప్రోత్సాహక-ఆధారిత వేతనాన్ని కంపెనీ తిరిగి తీసుకోవచ్చు) బ్యాంకు వ్యాపార ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి బ్యాంకుతోపాటు వాటాదారులందరికీ తీవ్రమైన ఇబ్బందిని కలిగించిందనీ, బ్యాంకుకు ప్రతిష్టకు తీరని నష్టం కలిగిందని ఆరోపించింది. తన భర్త దీపక్ కొచర్‌కు లబ్ధి చేకూర్చడం కోసమే వీడియోకాన్ గ్రూపునకు రూ .2,250 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో చందా కొచర్ పాత్ర ఉందని బ్యాంకు ఆరోపించింది. కాగా చందా కొచర్ తన పదవీకాంలో వీడియోకాన్‌కు క్విడ్ ప్రో కో ద్వారా చట్టవిరుద్ధంగా రూ.3250 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. అయితే మొదట్లో చందా కొచర్‌కు బాసటగా నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు జస్టిస్ (రిటైర్డ్) బిఎన్ శ్రీకృష్ణ కమిటీని 2019 జనవరిలో ఏర్పాటు చేసింది. ఈ కమిటి నివేదిక ఆధారంగా ఆమెను పదవినుంచి తొలగించడంతోపాటు ఏప్రిల్ 2009- మార్చి 2018 మధ్య ఆమెకు చెల్లించిన అన్ని బోనస్, స్టాక్ ఆప్షన్లను తిరిగి తీసుకోవాలని బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. మరోవైపు తన తొలగింపు చట్టవిరుద్ధమని పేర్కొంటూ బ్యాంకు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ (నవంబర్ 30, 2019న)చందా కొచర్ బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
రెండేళ్లు.. రూ.లక్ష కోట్లు..!
న్యూఢిల్లీ: దేశీ టాప్ 5 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) దిగ్గజాలు షేర్హోల్డర్లకు గత రెండేళ్లలో సుమారు రూ. 1.17 లక్షల కోట్లు తిరిగి చెల్లించాయి. 2017 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో షేర్ల బైబ్యాక్, డివిడెండ్స్ రూపంలో ఈ నిధులను చెల్లించాయి. సగటున డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 67గా లెక్కిస్తే దాదాపు 17.5 బిలియన్ డాలర్లు చెల్లించినట్లవుతుంది. ఇందులో అయిదింట నాలుగొంతుల వాటా టాప్ రెండు ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్దే ఉంది. అయిదు టాప్ కంపెనీల్లో మూడు కంపెనీలు బోనస్‌లు కూడా ఇచ్చాయి. ఈ రెండేళ్ల వ్యవధిలో ఈ ఐదు ఐటీ సంస్థల షేర్లు సుమారు 16–68 శాతం మేర పెరిగాయి. ఇలా షేర్హోల్డర్లకు తిరిగిచ్చిన మొత్తం నిధుల్లో దాదాపు 61 శాతం షేర్ల బైబ్యాక్ రూపంలోనే జరిగింది. టీసీఎస్ రూ. 32,000 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 21,200 కోట్ల మేర బైబ్యాక్స్ జరిపాయి. అటు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా అదే బాటలో నడవగా.. టెక్ మహీంద్రా ఒక్కటి మాత్రమే బైబ్యాక్ చేపట్టలేదు. మరోవైపు, టాప్ 4 కంపెనీలు చేసిన చెల్లింపుల్లో మొత్తం షేర్ల బైబ్యాక్ వాటా 54 శాతం నుంచి 89 శాతం దాకా ఉంది. బైబ్యాక్స్కే ఎందుకు ప్రాధాన్యం.. డివిడెండ్ల కన్నా షేర్ల బైబ్యాక్ వైపే కంపెనీలు ఎక్కువగా మొగ్గు చూపుతుండటానికి 2016 కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలే ప్రధాన కారణం. సాధారణంగా కార్పొరేట్ ట్యాక్స్‌లు గట్రా కట్టేసిన తర్వాత వచ్చే నికర లాభం నుంచే డివిడెండ్ల చెల్లింపు ఉంటుంది. కానీ 2016 బడ్జెట్లో రూ. 10 లక్షల పైగా డివిడెండ్ అందుకునే హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్లు ఆ మొత్తంపై పది శాతం ట్యాక్స్ కట్టాల్సి వచ్చేలా ప్రతిపాదనలు చేశారు. ఇక కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేస్తే.. దానిపై దాదాపు 20% దాకా (అసలు 15%, సర్‌చార్జి, సెస్సు మొదలైనవన్నీ కలిపి) డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) కట్టాల్సి వస్తుంది. ఈ కారణాలతో డివిడెండ్లకు ఆకర్షణీయత తగ్గింది. మరోవైపు, బైబ్యాక్ మార్గంలో షేర్లను తిరిగి కంపెనీకే విక్రయించినప్పుడు వచ్చే లాభాలను దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. దీనిపై పది శాతం మేర లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించినా.. డివిడెండ్లతో పోలిస్తే తక్కువే ఉంటుంది. అందుకే డివిడెండ్ల కన్నా బైబ్యాక్లవైపే కాస్త ఎక్కువ మొగ్గు ఉంటోందని నిపుణులు తెలిపారు. ఈపీఎస్ ప్రయోజనాలు కూడా.. డివిడెండ్ చెల్లించడం కన్నా షేర్లను బైబ్యాక్ చేయడం వల్ల కంపెనీలకు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డివిడెండును కంపెనీ నికర లాభం నుంచి నగదు రూపంలో చెల్లించాల్సి వస్తుంది. దీంతో.. కంపెనీ నికర విలువ, ఫలితంగా మార్కెట్ విలువ కూడా ఆ మేరకు కాస్త తగ్గుతుంది. అయితే, షేర్లను బైబ్యాక్ చేసినప్పుడు చలామణీలో ఉన్న మొత్తం షేర్ల సంఖ్య తగ్గడం వల్ల షేరువారీ ఆర్జన (ఈపీఎస్) పెరిగి, వేల్యుయేషన్ కూడా ఆ మేరకు పెరుగుతుంది. అంతే కాకుండా నిర్దిష్ట రేటు ప్రకారం కొనుగోలు ఉంటుంది కాబట్టి.. ఆ స్థాయిలో సంస్థ షేరు స్థిరపడేందుకు కూడా చాలా సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. బైబ్యాక్ ప్రకటించినా ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించకుండా దూరంగా ఉంటే.. కంపెనీలో తమ వాటాలను మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. బోనస్‌లు కూడా.... షేర్ల బైబ్యాక్, డివిడెండ్లతో పాటు ఈ కంపెనీలు బోనస్ షేర్లు కూడా ప్రకటించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు షేరు ఒక్కింటికి ఒక షేరు ఇచ్చాయి. విప్రో మాత్రం రెండు సార్లు బోనస్ ఇష్యూలు ప్రకటించింది. 2017లో షేరు ఒక్కింటికి ఒకటి చొప్పున ఇవ్వగా.. తాజాగా జనవరిలో మరో బోనస్ ఇష్యూకి బోర్డు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రతి 3 షేర్లకు ఒక్క షేరు చొప్పున బోనస్‌గా ఇవ్వనుంది. -
కాంట్రాక్ట్ కార్మికులందరికీ బోనస్ చెల్లించాలి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థకు చెందిన భూగర్భ గనుల్లో టన్నెల్, బెల్ట్ క్లీనింగ్, రూఫ్ బోల్టింగ్ తదితర పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ 2018 ఏప్రిల్ నుంచి 8.33 శాతం బోనస్ చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు యర్ర గాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే-7షాఫ్ట్, పీవీకే-5బీలో కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రొడక్షన్ సైడ్ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ చెల్లించాల్సి ఉండగా, కాంట్రాక్టరు చెల్లించటంలేదని ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్ కార్మికుల శ్రమను దోచుకుంటుంటే గని అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల 9న ఏరియా జీఎం కార్యాలయం ఎదుట నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మి కులు ఆందోళనలో పాల్గొని విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కె కిరణ్, బాలకృష్ణ, మోహన్, సురేష్, సత్యనారాయణ, విజయ్, కిరణ్, రాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
చందా కొచర్, శిఖా శర్మలకు ఆర్బీఐ షాక్
ముంబై : దేశీయ టాప్ ప్రైవేట్ బ్యాంకు అధినేతలకు బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఆర్బీఐ షాకిచ్చింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచర్‌కు, యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీఈవో ఆదిత్య పురిలకు ఏడాది చివరన ఇచ్చే బోనస్‌లను ఆలస్యం చేస్తోంది. బ్యాంకుల్లో చోటు చేసుకుంటున్న కుంభకోణాల నేపథ్యంలో బోనస్‌లపై ఆర్బీఐ వేటు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బ్యాంకుల సీఈవోలు 2017 మార్చి 31 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకా బోనస్‌లను అందుకోలేదు. ఈ బోనస్‌లు 2018 మార్చి 31 కంటే ముందే అందుకోవాల్సి ఉంది. కానీ ప్రతిపాదిత చెల్లింపులపై ఆర్బీఐ ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. బోనస్‌లు ఇవ్వకుండా ఆర్బీఐ ఎందుకు ఆలస్యం చేస్తుందనే విషయంపై స్పందించడానికి సంబంధిత వర్గాలు నిరాకరించాయి. చందాకొచర్‌కు రూ.2.2 కోట్ల బోనస్ ఇవ్వాలని ఐసీఐసీఐ బోర్డు ఆమోదించింది. శిఖా శర్మ రూ.1.35 కోట్ల బోనస్ అందుకోవాల్సి ఉంది. ఆదిత్య పురి కూడా రూ.2.9 కోట్ల బోనస్‌ను పొందాల్సి ఉందని ఎక్స్చేంజ్ ఫైలింగ్స్‌లో తెలిసింది. అయితే ఈ విషయంపై స్పందించడానికి యాక్సిస్ బ్యాంకు నిరాకరించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల అధికార ప్రతినిధులు కూడా ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్‌పై స్పందించలేదు. ఆర్బీఐ సైతం బోనస్‌లపై స్పందించడం లేదు. వీడియోకాన్‌కు ఇచ్చిన రుణాల విషయంలో చందాకొచర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. క్విడ్ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్‌కు రూ.3250 కోట్ల రుణాలు జారీచేశారని, చందాకొచర్ భర్త దీపక్ కొచర్‌తో బిజినెస్ వ్యవహారాల్లో భాగంగానే వీడియోకాన్ గ్రూప్‌కు రుణాలిచ్చారనే ఆరోపణలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. కాగ, ఈ వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. మరోవైపు తొలి నుంచి శిఖాశర్మపై మొండిబాకీల విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇటీవలే ఆమె పదవీ కాలం పొడిగింపుపై ఆర్బీఐ విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాజాగా ఏడాది చివర బోనస్‌లను కూడా ఆలస్యం చేస్తోంది. గత కొన్నేళ్లుగా దేశీయ ప్రైవేట్ బ్యాంకులు కఠినతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మొండిబకాయిలు పెరగడం, కార్పొరేట్ గవర్నెన్స్ లోపించడం బ్యాంకులను బాధిస్తోంది. ముందు నుంచి చూసుకుంటే 2018 మార్చి 31 కంటే ముందే ఈ బోనస్‌లను ఆర్బీఐ ఆమోదించాల్సి ఉందని ముంబైకి చెందిన బ్యాంకింగ్ విశ్లేషకుడు అసుతోష్ కుమార్ మిశ్రా తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఈ ఆలస్యాన్ని తాము ఎన్నడూ చూడలేదన్నారు. -
రైల్వే ఉద్యోగులకు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఉద్యోగుల్లో మనోధైర్యం, ఉత్సాహం పెంచడానికి ప్రత్యేక రివార్డులు, ప్రోత్సాహకాలు, బోనస్‌లు ఇవ్వాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఉత్తమ పనితీరు కనబరిచే వారికి మెరుగైన రివార్డులు ఇచ్చేలా పదోన్నతుల ప్రాతిపదికల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. నిపుణుల కమిటీ పలు సిఫార్సులతో సమర్పించిన నివేదిక రైల్వే బోర్డుకు చేరింది. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు వార్షిక పనితీరు మదింపు నివేదికలకు బదులు చివరి ఏడేళ్లలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఐదేళ్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సిబ్బంది తల్లిదండ్రులకూ వైద్య, ఉచిత ప్రయాణ సదుపాయాలు కల్పించాలంది. ఉన్నత విద్య కొనసాగించే ఉద్యోగులకు ఆర్థిక సాయం, దిగువ స్థాయి సిబ్బందికే కాకుండా ఏ, బీ గ్రేడ్ ఉద్యోగులకు బోనస్‌లు ఇవ్వాలని పేర్కొంది. కాగా, రైల్వేల్లో నిర్వహణ సమయంలో పాటిస్తున్న ప్రమాదకరమైన పద్ధతుల గురించి తెలియజేయాలని ఉద్యోగులందరికీ రైల్వే బోర్డు చైర్మన్ లేఖ రాశారు. -
బోనస్‌లపై సీలింగ్ ఎత్తివేయాలి: ఐఎన్టీయూసీ
జ్యోతినగర్ (కరీంనగర్): ఉద్యోగులకు సంస్థలు ఇచ్చే బోనస్‌లపై పరిమితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేయాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడేందుకు వీలుగా కంపెనీలకు సబ్సిడీలు ప్రకటించి, వాటి మనుగడకు తోడ్పడాలని కోరారు. -
దివీస్ బోనస్ ఇష్యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని దివీస్ ల్యాబ్ నిర్ణయించింది. శనివారం సమావేశమైన బోర్డు తొలి త్రైమాసిక ఫలితాలను ఆమోదించడంతోపాటు, బోనస్ ఇష్యూను ప్రతిపాదించింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ. 809 కోట్ల ఆదాయంపై రూ. 243 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 45 శాతం వృద్ధి నమోదయ్యింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 640 కోట్ల ఆదాయంపై రూ. 168 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. -
కోటిన్నర బోనస్.. వీడేరా బాస్!
చాలా కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని ఉద్యోగులకు బోనస్‌లు ఇవ్వడం చూశాం.. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం (రెసిషన్) కొనసాగుతున్నా కూడా క్రమం తప్పకుండా బోనస్ లు ఇచ్చిన బాస్లనూ చూశాం. పండగలకు, పబ్బాలకు స్వీట్ డబ్బాలు పంచి ఇవ్వడం చూశాం.... కానీ ఏకంగా కోటిన్నర రూపాయల బోనస్ ఇచ్చిన బాస్‌ను ఎక్కడైనా చూశారా? సాధారణంగా యజమానులు ఇచ్చే చిన్నా చితకా కానులకలతోనే సంబరాలు చేసుకునే ఉద్యోగులు చాలామందే ఉన్నారు. అలాంటి వారికి ఏకంగా కోటిన్నర బోనస్ ఇస్తే ఎలా ఉంటుంది? ఎగిరి గంతు లేస్తారు. కలా! నిజమా, అని గిచ్చుకుని చూసుకుంటారు కదా. సరిగ్గా టర్కీకి చెందిన ఓ కంపెనీ ఉద్యోగులు కూడా ఇలాగే ఆనందంతో కేకలు పెట్టారట... కేరింతలు కొట్టారట. సంతోషం పట్టలేక ఆనంద బాష్పాలు రాల్చారట. బాస్‌ను పొగడ్తలతో ముంచేస్తూ ఉత్తరాలు రాశారట. ఈ ప్రపంచంలో మా బాస్ అంతటి గొప్ప యజమాని ఇంకెవరున్నారు చెప్పండంటూ మురిసిపోతున్నారట. టర్కీకి చెందిన ఆన్లైన్ కంపెనీ యేమేక్సెపేత్ అధిపతి నెవ్జాట్ అద్విన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ సర్వీస్ రంగంలో సేవలందిస్తున్న తమ కంపెనీ విజయానికి, లాభాలకు కారణం ఉద్యోగులేనని పేర్కొన్నారు. అందుకే తమ లాభాలను వారికి పంచి ఇవ్వాలని నిర్ణయించానని తెలిపారు. 2000 సంవత్సరంలో యాభై లక్షలతో స్థాపించిన తమ సంస్థ అనేక మైలు రాళ్లను అధిగమించడానికి కారణం ఉద్యోగులేనన్నారు. జర్మనీ చెందిన మార్కెట్ దిగ్గజం డెలివరీ హీరో కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 3 75 మిలియన్ పౌండ్ల విలువైన ఈ ఒప్పందంతో తమ కంపెనీ ప్రతిష్ట మరింత పెరిగిందని ఆయన వెల్లడించారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమంటే ఒప్పందానికి ముందే ఆయన ఈ బోనస్ ప్రకటించారు. ఆ తరువాత పేరెంటల్ కంపెనీ డెలీవరీ హీరో దాన్ని యథాతథంగా అంగీకరించింది. తన ప్రకటన వినగానే ఉద్యోగులు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారన్నారు. తామిచ్చే బోనస్‌తో వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోనున్నాయన్నారు. -
అనుకోని ఆదాయంతో అత్యవసర నిధి...
అనుకోకుండా బోనస్‌ల రూపంలోనో, గిఫ్టుల్లాగానో లేదా వారసత్వంగా ఆస్తిపాస్తులో వచ్చి పడితే? ఊహించుకోవడానికి బాగానే ఉన్నా, నిజంగానే వచ్చి పడితే ఆ డబ్బును ఏ విధంగా ఉపయోగిస్తాం అన్నది ముఖ్యం. సాధారణంగానైతే ఊహించని విధంగా వచ్చింది కాబట్టి అదనపు ఆదాయం కింద లెక్కేసుకుని అడ్డదిడ్డంగా అనవసరమైన వాటన్నింటిపైనా ఖర్చు చేసేస్తుంటాం. అలా కాకుండా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆ డబ్బును సద్వినియోగం చేసుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి.. ఎమర్జెన్సీ ఫండ్‌కు కొంత మొత్తం అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం అటూ, ఇటూ పరుగెత్తాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక ఫండ్ అంటూ ఉండటం చాలా ముఖ్యం. ఇప్పటిదాకా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే .. కొత్తగా చేతికొచ్చిన అదనపు సొమ్మును ఇందుకోసం ఉపయోగించవచ్చు. ఈ నిధి పరిమాణం ఎంత ఉండొచ్చనేది మీ వయసు, ఆర్థిక పరిస్థితులు, మీ కుటుంబసభ్యుల సంఖ్య తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీపై ఆధారపడిన వారెవరూ లేకుండా.. మీరు సింగిల్ అయిన పక్షంలో కనీసం మూడు నెలల ఖర్చులకు సరిపడా డబ్బును ఈ అత్యవసర నిధిలో ఉంచుకోవాలి. అదే, కుటుంబం.. ఇతర బాధ్యతలు ఉన్న పక్షంలో ఇది 6 నెలలకు పెరుగుతుంది. ఇక రిటైర్మెం ట్కి దగ్గరవుతున్నా లేదా రిటైరయిపోయినా.. కనీసం రెండేళ్లకు సరిపడా ఖర్చులైనా ఫండ్‌లో ఉండాలి. అప్పులు తీర్చేయొచ్చు పరిమితికి మించి అప్పుల భారం ఎక్కువగా ఉండటం ఆర్థిక పరిస్థితికి ఎప్పుడూ ముప్పే. అది కూడా వ్యక్తిగత రుణాలపై ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి వస్తుంటే మరింత కష్టం. కనుక, అనుకోకుండా వచ్చిన డబ్బుతో సాధ్యమైనంత మేర అప్పులను తీర్చేసి, భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అత్యవసర నిధి, కొంతైనా అప్పులు తీర్చివేయడం.. ఇవన్నీ చూసుకున్నాక ఇంకా కాస్త మిగిలిన పక్షంలో పెట్టుబడులవైపు చూడొచ్చు. స్టాక్‌మార్కెట్లు, షేర్లు వంటి వాటిల్లో ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేయకపోయినట్లయితే ఇకపైనైనా కొద్దో గొప్పో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని పరిశీలించవచ్చు. ఎందుకంటే ఓర్పుగా ఉండగలిగితే దీర్ఘకాలికంగా షేర్లు మంచి రాబడులే ఇస్తుంటాయి. అయితే, స్టాక్‌మార్కెట్ పరిజ్ఞానం లేకుండా నేరుగా షేర్లలో పెట్టడం కన్నా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిది. మంచి రాబడులు అందిస్తున్న ఫండ్స్‌ని చూసి కావాలంటే నెలవారీగా కూడా పెట్టుబడి పెట్టొచ్చు. ఇందుకోసం ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) అంటూ ప్రత్యేక పథకాలు అందిస్తున్నాయి కూడా. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, ఎంత రిస్కు తీసుకోగలరు అన్నదాన్ని బట్టి అత్యంత తక్కువగా రూ. 500- రూ.1,000 నుంచి కూడా వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి వీలుంది.