
దివీస్ బోనస్ ఇష్యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని దివీస్ ల్యాబ్ నిర్ణయించింది. శనివారం సమావేశమైన బోర్డు తొలి త్రైమాసిక ఫలితాలను ఆమోదించడంతోపాటు, బోనస్ ఇష్యూను ప్రతిపాదించింది.
జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ. 809 కోట్ల ఆదాయంపై రూ. 243 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 45 శాతం వృద్ధి నమోదయ్యింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 640 కోట్ల ఆదాయంపై రూ. 168 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.