రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) బోర్డు 1:1 బోనస్ ఇష్యూని ఆమోదించింది. 2017 సెప్టెంబర్ తర్వాత కంపెనీ మొదటి బోనస్ ఆఫర్ ఇదే. దీని ద్వారా షేర్ హోల్డర్‌లు ప్రతి షేర్‌కు ఒక షేరును ఉచితంగా పొందుతారు.
భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు తేదీకి సంబంధించిన వివరాలను తర్వాత తెలియజేయనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ అధీకృత వాటా మూలధనాన్ని రూ.15,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు పెంచే ప్రతిపాదనకు ఆర్‌ఐఎల్ బోర్డు ఆమోదం తెలిపింది.
షేర్‌హోల్డర్‌లకు బోనస్ షేర్లను బహుమతిగా ఇవ్వడానికి కంపెనీ ప్రణాళికలను ప్రకటించడం ఇది ఐదవసారి. 1983, 1997, 2009, 2017లో ఇలాగే బోనస్ షేర్లను రిలయన్స్ అందించింది.
Comments
Please login to add a commentAdd a comment