
న్యూయార్క్: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ జాక్ పాట్ కొట్టేశారు. రూ.4.5లక్షల కోట్లు (56 బిలియన్ డాలర్లు) పారితోషికం ఇచ్చేందుకు ఆ సంస్థ వాటా దారులు మస్క్‌కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆనందానికి అవదుల్లేని మస్క్ తన డ్యాన్స్‌తో సందడి చేశారు.
టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సమావేశంలో వాటా దారులు మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల భారీ వేతనం ఇవ్వాలా? వద్ద అన్న అంశంపై ఓటింగ్ జరిగింది. ప్రాథమిక ఓట్ల ఫలితాల ఆధారంగా మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల పారితోషికం ఇచ్చేలా పెట్టుబడి దారులు మద్దతు ఇచ్చారని కార్పొరేట్ సెక్రటరీ బ్రాండన్ ఎర్‌హార్ట్ తెలిపారు.
ఎలోన్ మస్క్ 2018లో అన్ని రకాల ప్రయోజనాలు కలిపి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) వార్షిక వేతనం అందుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అత్యధిక పారితోషికం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్‌కు అధికంగా చెల్లించారంటూ వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన డెలావర్ కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా సీఈవోకి భారీ వేతనాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చారు. తాజాగా, టెస్లా వాటాదారులు మస్క్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నారు.
Elon Musk dance is 🔥. Tesla shareholders have spoken. pic.twitter.com/GiLWOtt8ZI
— Tesla Owners Silicon Valley (@teslaownersSV) June 13, 2024