‘నేను ఏలియన్‌ని’..మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | I Keep Saying Im An Alien, But Nobody Believes Me, Says Elon Musk | Sakshi
Sakshi News home page

Elon Musk: నేను ఏలియన్‌ను.. కానీ ఎవరూ నమ్మడం లేదే.. మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Sat, May 25 2024 9:07 AM | Last Updated on Sat, May 25 2024 10:32 AM

I Am An Alien Says Elon Musk

నేను ఏలియన్‌ అని చెబుతూనే ఉన్నా కానీ నా మాటల్ని ఎవరూ నమ్మడం లేదని టెస్లా సీఈఓ ఎలోన్‌ మస్క్‌ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.  పారిస్‌ వేదికగా జరిగిన వివా టెక్‌ ఈవెంట్‌లో మస్క్‌ వెబ్‌క్యామ్‌ ద్వారా రిమోట్‌గా పాల్గొన్నారు.  

వివా టెక్‌ ఈవెంట్‌ ప్రతినిధులు మస్క్‌తో కొంతమంది మీరు ఏలియన్‌ అని నమ్ముతున్నారు. మస్క్ నవ్వుతూ ‘అవును, నేను గ్రహాంతరవాసిని అని చెబుతూనే ఉంటాను, కానీ ఎవరూ నన్ను నమ్మడం లేదని అన్నారు.’ అంతేకాదు ఏలియన్స్‌ గురించి సమాచారం ఏదైనా తెలిస్తే నేను వెంటనే ఎక్స్‌ వేదికగా ఆ విషయాల్ని వెల్లడిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎలోన్ మస్క్ కృత్రిమ మేధస్సు (ఏఐ)పై తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఏఐ అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అయితే దాని అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement