Divi s Lab
-
చిప్పాడలో నిరసనకారుల అరెస్టులు
భీమిలి మండలం చిప్పాడలో దివీస్ ల్యాబ్ విస్తరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దివీస్ ల్యాబ్ విస్తరణ వ్యతిరేక కమిటీ నేడు నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మాజీ సైనికులను సోమవారం తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకు నిరసనగా చిట్టినగర్ వద్ద ఉద్యమకారులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
దివీస్ బోనస్ ఇష్యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని దివీస్ ల్యాబ్ నిర్ణయించింది. శనివారం సమావేశమైన బోర్డు తొలి త్రైమాసిక ఫలితాలను ఆమోదించడంతోపాటు, బోనస్ ఇష్యూను ప్రతిపాదించింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ. 809 కోట్ల ఆదాయంపై రూ. 243 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 45 శాతం వృద్ధి నమోదయ్యింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 640 కోట్ల ఆదాయంపై రూ. 168 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.