Railway Board
-
పేదోడి రైళ్లకు సెలవు!
రాజంపేట: తిరుపతి– గుంతకల్ మధ్య ఉన్న రెండు వేర్వేరు మార్గాల్లో పేదోడి రైళ్లకు బ్రేక్ వేశారు. ఏకంగా రెండునెలలపాటు పల్లె రైళ్లకు రాబోయే కుంభమేళా–2025 (Maha Kumbh Mela 2025) నేపథ్యంలో సెలవు ఇచ్చేశారు. పేదవాడి కోసం ఉన్నదే ఒకరైలు, దానిని కూడా రద్దు చేశారు. దీంతో పేద ప్రయాణిక వర్గాల్లో రైల్వేబోర్డు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. దేశంలో ఎక్కడా రైళ్లు లేన్నట్లుగా రాయలసీమలో (Rayalaseema) ప్రతి గ్రామీణ రైల్వేస్టేషన్లో ఆగుతూ, పరుగులుతీసే పల్లెరైళ్లను కుంభమేళా–2025కు దారిమళ్లించడం ఇప్పుడు సీమలో వివాదాస్పదంగా మారుతోంది. దీంతో తిరుపతి–గుంతకల్ మధ్య వేర్వేరు రెండు రైలుమార్గాల్లో నడిచే పల్లె రైలును రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే డిప్యూటీ సీవోఎం కె.మనికుమార్ పేరిట ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. అడిగే నాథుడు లేన్నట్లుగా రైల్వే ఉన్నతాధికారులు గుంతకల్ డివిజన్ (Guntakal Division) పరిధిలో తీసుకుంటున్న నిర్ణయాలు పరోక్షంగా కేంద్రప్రభుత్వంపై పేదవర్గాల్లో అసంతృప్తిని పెంపొందిస్తోంది. తిరుపతి– గుంతకల్(కడపమీదుగా) మార్గంలో.. తిరుపతి– గుంతకల్(కడపమీదుగా) మార్గంలో తిరుపతి–హుబ్లీ మధ్య నడిచే (07657/07658) ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. తక్కువ ధరతో గమ్య చేరడానికి పేదవర్గాలకు ఈరైలు అనుకూలంగా ఉంది. తిరుపతి (Tirupati) నుంచి బయలుదేరుతుంది. ప్రతి గ్రామీణస్టేషన్లో ఆగుతుంది. దీనిని రద్దు చేయడంతో ఉద్యోగులు, అధికారులు, విద్యార్థులు, వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గుంతకల్–తిరుపతి(ధర్మవరంలైన్)మార్గంలో.. గుంతకల్– తిరుపతి (ధర్మవరంలైన్) మార్గంలో 07589/07590 నంబరుగల తిరుపతి నుంచి కదిరి దేవరపల్లెకు నడిచే పల్లెరైలును కూడా రద్దు చేశారు. ఈ రైలు అనంతపురం, బెంగళూరుతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉండేది. డివిజన్ కేంద్రం గుంతకల్‌కు పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి ప్యాసింజర్ రైలు నడిచేది. ఈ రైలు కూడా ఆ మార్గంలో ఉన్న పీలేరు, మదనపల్లె, కదిరి తదితర ప్రాంతాలకు చెందిన పల్లె వాసులకు అనుకూలంగా ఉండేది. ఇప్పుడు ఆ రైలు రద్దు కావడంతో ఎక్స్ప్రెస్రైళ్లే దిక్కయ్యాయి రెండునెలలపాటు ప్రయాణానికి గ్రహణం కుంభమేళా–2025 కోసం రెండునెలల పాటు తిరుపతి నుంచి కడప మీదుగా, అటు ధర్మవరం మార్గంలో నడిచే ఆరు రైళ్లను రద్దు చేశారు. అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం జిల్లాల మీదుగా ఉండే రైలుమార్గంలో నడిచే ప్యాసింజర్ రైళ్లపై ఆధారపడి ప్రయాణించే వేలాదిమంది పేదలకు పల్లెరైళ్లను దూరం చేశారు. ప్రత్యామ్నాయం చూపని రైల్వేబోర్డు ఏకంగా రెండు రైలుమార్గాల్లో ఆరు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసే గ్రామీణులు ఇబ్బందులను రైల్వేబోర్డు పరిగణనలోకి తీసుకోలేదన్న అపవాదును మూటకట్టుకుంది. రైల్వేబోర్డు కుంభమేళాకు రేక్స్ కేటాయించాలని కోరితే, దక్షిణమధ్య రైల్వే అధికారులు రాయలసీమలో పేదలకు అందుబాటులో ఉండే రైళ్లను కేటాయించడంపై విమర్శలు వెలువడుతున్నాయి. ఇతర రైల్వేజోన్‌తోపాటు మరికొన్ని డివిజన్లలో రేక్ పొజిషన్ పుష్కలంగా ఉన్నప్పటికి ‘సీమ’పల్లెరైళ్లను కేటాయించారు. ఈ ప్రాంతానికి చెందిన కూటమి ఎంపీలు నోరుమెదిపే పరిస్థితిలో లేరని పేదప్రయాణికులు ఎద్దేవా చేస్తున్నారు. మార్చి 1వరకు పల్లె రైళ్లకు సెలవురైల్వేబోర్డు ఆదేశాలతో దక్షిణమధ్య రైల్వే వారు తిరుపతి–కదిరిదేవరపల్లె ప్యాసింజర్ రైలు, గుంతకల్–తిరుపతి ప్యాసింజర్‌రైలు, తిరుపతి–హుబ్లీ మధ్య నడిచే ఇంటర్సిటి ఎక్స్‌ప్రెస్ రైలును వచ్చేయేడాది మార్చి01 వరకు రద్దు చేశారు. ఆదివారం నుంచి ఈరైళ్లు రెండు మార్గాల్లో కూడా నడవవు. సామాన్యుడు అంటే చిన్నచూపు పేదోడి రైళ్లను రద్దు చేస్తే అడిగేవారు లేరన్న ధీమాలో కేంద్రప్రభుత్వం ఉంది. ఎక్స్‌ప్రెస్‌రైళ్లలో జనరల్బోగీలు వేయడంలో రైల్వే వివక్షను ప్రదర్శిస్తోంది. ప్యాసింజర్‌రైళ్లు రద్దు చేస్తే ప్రత్యామ్నాయంగా రైళ్లను నడపాలి. సామాన్యుడు అంటేనే కేంద్రానికి చిన్నచూపు. – టీఎల్ వెంకటేశ్, సీపీఐ నేత, పీలేరుపేదలను ఇబ్బందులు పెట్టారు... తక్కువ ధరతో పల్లెవాసులకు అనుకూలంగా ఉన్న ఇంటర్సిటీ రైలును రద్దు చేయడం అన్యాయం. తిరుపతి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ వరకు పేదవర్గాలు తక్కువ వ్యయంతో వెళ్లే వారు. ఉన్న ప్యాసింజర్ రైళ్ల రద్దు చేశారు. ప్రత్యామ్నాయంగా ప్యాసింజర్‌రైలును నడపాలన్న ఆలోచన కేంద్రానికి లేదు. పేదలంటే మోదీ సర్కారుకు చిన్నచూపు. – పులివేల రమణయ్య, నాగిరెడ్డిపల్లె, నందలూరు -
రైల్వే ఘనకార్యం! మూడు రోజుల్లో రిటైరయ్యే ఉద్యోగి బదిలీ
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ డివిజన్‌కు చెందిన ఒక సీనియర్ ఇంజనీర్ విషయంలో రైల్వేబోర్డ్ ఘనకార్యం చేసింది. మరో మూడు రోజుల్లో రిటైరవుతున్న కేపీ ఆర్యను ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే జోన్‌కు బదిలీ చేసింది. ఖంగుతిన్న ఆయన బదిలీపై నిరాశను వ్యక్తం చేస్తూ రైల్వే బోర్డు సెక్రటరీకి ఘాటు లేఖ రాశారు. బదిలీ ఆర్డర్‌ను ఆయన బుద్ధిలేని పనిగా పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వు ప్రకారం కేపీ ఆర్య నవంబర్ 28న హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్‌పై నార్తర్న్ రైల్వేలో చేరాల్సి ఉంది. అయితే ఆయన పదవీ విరమణ నవంబర్ 30న ఉంది. ఈ ఆర్డర్ పైకి బాగానే మూడు రోజుల్లో రిటైరవుతున్న తనను బదిలీ చేయడంలో పిచ్చితనమే కనిపిస్తోందని ఆర్య అన్నారు. ఇది జీవితమంతా ఇండియన్ రైల్వే సంస్థకు సేవ చేసిన ఒక ఉద్యోగిని పదవీ విరమణ సమయంలో కావాలని బదిలీ చేయడమే తప్ప మరొకటి కాదు అన్నారు. దీని వల్ల పదవీ విరమణ సెటిల్మెంట్కు అంతరాయం ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లో హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్ ఖాళీగా ఉన్నప్పటికీ, రైల్వే బోర్డు తనను నార్తర్న్ రైల్వే జోన్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌కు బదిలీ చేసిందని ఆర్య పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. పదవీ విరమణకు ముందు కేవలం మూడు రోజులు తాను న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం రైల్వే శాఖ తనకు దాదాపు రూ. 3 లక్షలు చెల్లిస్తుందని, ఇది ప్రజాధనాన్ని పూర్తిగా వృధా చేయడమేనని ఆయన ఆక్షేపించారు. ఇది ప్రమోషనల్ ట్రాన్స్‌ఫర్‌గా చెబుతున్నప్పటికీ దీని వల్ల తనకు అదనపు ఆర్థిక ప్రయోజనాలేవీ అందించలేదని ఆర్య పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనకు ఇప్పటికే ఆర్థిక ప్రయోజనాలకు అర్హత ఉన్నప్పటికీ తన పదోన్నతిని ఆరు నెలలు ఆలస్యం చేశారని ఆరోపించారు. -
కేంద్రం అనూహ్య నిర్ణయం.. హిస్టరీ క్రియేట్ చేసిన జయవర్మ సిన్హా
ఢిల్లీ: దేశ చర్రితలోనే మొదటిసారిగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా తొలిసారిగా మహిళను నియమించింది. జయవర్మ సిన్హాను కేంద్రం రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. రైల్వే బోర్డు సీఈవో, చైర్‌పర్సన్‌గా జయవర్మ సిన్హా నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దేశ చరిత్రలోనే రైల్వే బోర్డు సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళా అధికారి జయవర్మనే కావడం విశేషం. కాగా, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ అధికారిణి అయిన జయవర్మ.. ప్రస్తుతం రైల్వే బోర్డు సభ్యురాలిగా(ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్) ఉన్నారు. Congratulations 🌹🎉🙂 Jaya Verma Sinha, Indian Railway Management Services (IRMS), Member (Operations & Business Development), Railway Board appointed as Chairman & Chief Executive Officer (CEO), Railway Board: Govt of India. @RailMinIndia #WomenEmpowerment #RakshaBandangift pic.twitter.com/3kRFq3OesJ — Uppal Shah (@uppalshah) August 31, 2023 ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31వ తేదీ వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జయవర్మ సీఈవోగా కొనసాగనున్నారు. 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో సిన్హా చేశారు. నార్తర్న్ రైల్వే, సౌత్ ఈస్ట్ రైల్వే, ఈస్టర్న్ రైల్వేలో ఆమె పని చేశారు. ఆమె అలహాబాద్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావడం విశేషం. కాగా, నేటి వరకు రైల్వే బోర్డు సీఈవోగా అనిల్ కుమార్ లహాటీ కొనసాగారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రధాని మోదీ చంద్రయాన్-3 విజయం సందర్భంగా మహిళల శక్తి గురించి ప్రత్యేకంగా చర్చించారు. మహిళలను అభినందించారు. మహిళల పాత్ర అనిర్వచనీయమని ప్రధాని మోదీ వారిని అభినందించి, మెచ్చుకున్నారు. అలాగే వారితో కలిసి గ్రూపు ఫోటో కూడా దిగారు. అటు మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మహిళా సాధికారతపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా డాటర్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఉంటే భారత్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోగలరు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధి మన దేశ స్వాభావిక లక్షణంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటే మహిళా శక్తితో సుసాధ్యంగా చేయవచ్చు అని చెప్పారు. ఇది కూడా చదవండి: జాబిల్లి పెరట్లో రోవర్ ఆటలు.. చంద్రయాన్ 3 న్యూ వీడియో.. -
తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: డోర్నకల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేకు (ఎఫ్ఎల్ఎస్) రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెల 26న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రాజెక్టుల మౌలిక వసతులు, డబ్లింగ్, మల్టీ ట్రాకింగ్ తదితర పనులకు అనుమతులు ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా 296 కిలోమీటర్ల పొడవున డోర్నకల్– గద్వాల మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం ఎఫ్ఎల్ఎస్ చేపట్టేందుకు రూ.7.40 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు 2013–14 నుంచే ప్రతిపాదనల్లో ఉన్న డోర్నకల్– మిర్యాలగూడ (93.10 కిలోమీటర్ల పొడువు) రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్రం 2013–14లోనే ఓకే చెప్పింది. ఆ తరువాత దక్షిణ మధ్య రైల్వే చేసిన సూచనల మేరకు సర్వే కోసం రైల్వే శాఖ ఆర్థిక విభాగం 2020లోనే ఓకే చెప్పింది. టెండర్లను పిలిచి ఓకే చేసింది. ఇక, భూసేకరణ, పునరావాసానికి రూ. 1,294.12 కోట్లు అవసరం అవుతాయనే లెక్కలతో సర్వే పూర్తి చేసి 2022 నవంబర్ 10వ తేదీన అందజేసిన నివేదిక ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉంది. దానిపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త లైన్ ఎఫ్ఎస్ఎల్కు ఓకే.. ఇదిలా ఉండగానే.. ఇప్పుడు రైల్వే బోర్డు డోర్నకల్ నుంచి గద్వాలకు సూర్యాపేట మీదుగా కొత్త లైన్ ఎఫ్ఎస్ఎల్కు ఓకే చెప్పింది. దీంతో డోర్నకల్–గద్వాలలో భాగంగా సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా కొత్త లైన్ కోసం సర్వే చేయనుంది. మిర్యాలగూడ దీని పరిధిలోకే తీసుకువస్తారా లేదా? అన్నది తేలాల్సి ఉంది. గతంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు డోర్నకల్ – మిర్యాలగూడ లైన్ కోసం రైల్వే బోర్డుకు విజ్ఞప్తులు చేశారు. ఇటీవల బోర్డు ఆమోదించిన ప్రాజెక్టుల్లో మాత్రం డోర్నకల్–గద్వాల లైన్ సర్వే ఓకే చెప్పింది. దీనిపై ఎంపీ ఉత్తమ్‌ని సంప్రదించగా దీనిపై తనకు సమాచారం లేదని, రైల్వే బోర్డు అధికారులతో మాట్లాడతానని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వీఆర్ఏల విలీనానికి నో -
‘అందుకే ఒడిశా దుర్ఘటన జరిగింది’.. రైల్వే బోర్డుకు నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు 300 మందిని బలిగొన్న ఒడిశా బాలాసోర్ రైల్వే దుర్ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషన్ తన స్వతంత్ర నివేదిక సమర్పించింది. రాంగ్ సిగ్నలింగ్ వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డుకు సమర్పించిన తన నివేదికలో పేర్కొంది. ప్రమాదానికి రాంగ్ సిగ్నలింగ్ ప్రధాన కారణమని వెల్లడించిన సీఆర్ఎస్ నివేదిక.. అనేక స్థాయిలో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు రైల్వే బోర్డుకు నివేదించింది. అలాగే.. భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే దుర్ఘటన జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాన్ని నివేదికలు వ్యక్తం చేసింది. గతేడాది సైతం ఇదే తరహా దుర్ఘటన జరిగిందని.. 2022 మే 16న సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ఖార్గ్‌పూర్ డివిజన్ బ్యాంక్రనాయబాజ్ స్టేషన్ వద్ద తప్పు వైరింగ్, కేబుల్ లోపం కారణంగా జరిగిన ఘటనను నివేదికలో ప్రస్తావించింది కమిషన్. అలాగే.. లోపం సరిచేస్తే ఈ ప్రమాదం జరిగేది కాదని నివేదికలో వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని రైల్వే బోర్డుకు సూచించింది కమిషన్. జూన్ 2వ తేదీ రాత్రి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరగ్గా.. 292 మంది మృతి చెందగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఇదీ చదవండి: దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు.. అతి త్వరలో ప్రారంభం! -
ఒడిషా రైలు ప్రమాదం.. రైల్వే బోర్డు సంచలన నిర్ణయం
భువనేశ్వర్: ఇటీవలే ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బహనాగ వద్ద మూడు రైళ్లు ఒక్కదానినొకిటి ఢీకొనడంతో పెను ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై కుట్ర కోణంలో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగిన మూడు వారాల తర్వాత అధికారులపై రైల్వే బోర్డు చర్యలకు తీసుకుంది. ఈ నేపథ్యంలో సౌత్ ఈస్టర్ రైల్వేస్‌కు చెందిన ఐదుగురు ఉన్నతాధికారులపై బోర్డు వేటు వేసింది. సిగ్నలింగ్, ఆపరేషన్స్, సేఫ్టీ విభాగాలను చూసే ఈ అధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. ఇక, వేటు పడిన వారిలో ఖరగ్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ శుజాత్ హష్మీ, ఎస్ఈఆర్ జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ పీఎం సిక్దర్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ చందన్ అధికారి, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ డీబీ కేసర్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎండీ ఓవైసీ ఉన్నారు. అయితే, ఇది సాధారణ బదిలీల్లో భాగమేనని అధికారులు వెల్లడించారు. జేఈ ఇంటి సీల్ వేసిన సీబీఐ మరోవైపు.. ఒడిషా రైలు ప్రమాదం తర్వాత భారతీయ రైల్వేస్‌లో సిగ్నల్ జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమీర్ ఖాన్, అతని కుటుంబం కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు హడావిడిగా అతను ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంటికి తాళం ఉన్నది గమనించక.. సీల్ వేసి మరీ వెళ్లడం గమనార్హం. ఆపై సోరోలోని తెంటెయ్ ఛక్‌లో ఉన్న బాహానాగా స్టేషన్ మాస్టర్ ఇంటికి సైతం సీబీఐ బృందం వెళ్లింది. అయితే.. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సిగ్నల్ జేఈ అయిన అమీర్ ఖాన్ బాలాసోర్ ప్రమాద ఘటన జరిగిన రీజియన్‌లోనే పని చేస్తున్నాడు. జూన్ 2వ తేదీ రాత్రి బాలాసోర్ రైలు ప్రమాద ఘటన జరగ్గా.. రంగంలోకి దిగిన సీబీఐ సిగ్నల్ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు అతనిపై అనుమానాలు ఉన్నాయి. అందుకే నిఘా వేసింది. ఆ తర్వాతే అతను కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. ఇది కూడా చదవండి: ఎదురొచ్చి మరీ మోదీకి బైడెన్ దంపతుల సాదర స్వాగతం.. ప్రత్యేక విందు -
రైల్వే బోర్డు కీలక నిర్ణయం..సిగ్నలింగ్ వ్యవస్థకు రెండేసి తాళాలు..
ఒడిశా:ఒడిశా రైలు ప్రమాద ఘటనతో మేల్కొన్న రైల్వే శాఖ రైళ్ల భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లు నడవడానికి కీలకంగా పనిచేసే సిగ్నలింగ్ వ్యవస్థలను రెండేసి తాళాలు వేసి రక్షించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రిలే రూమ్‌లు, రిలే హట్లు,లెవల్ క్రాసింగ్ టెలికమ్యునికేషన్ పరికరాలు, ట్రాక్ సర్క్యూట్ సిగ్నల్స్‌లను జాగ్రత్తగా కాపాడుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ పరికరాలు ఉండే వ్యవస్థకు రెండు తాళాలు వేసైనా కాపాడాలని తీర్మానించింది.ఒడిశా రైలు ప్రమాదం జరగడానికి సిగ్నల్ వ్యవస్థలో దుండగులు చొరబడడమే కారణమని ప్రాథమికంగా తేలిన నేపథ్యంలో రైల్వేబోర్డు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రెండు తాళాలు విధానం తీసుకువచ్చేవరకు ప్రస్తుతం ఉన్న ఒక తాళాన్ని స్టేషన్ మాస్టర్ వద్దే ఉంచాలని రైల్వే బోర్డు తెలిపింది. ఏ తాళాన్ని ఎవరు వేశారు? ఎవరు తీశారు? వంటి అంశాలను ఎప్పటికప్పుడు పేర్కొనే విధంగా ఓ పట్టికతో కూడిన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. కాగా.. ఒడిశా రైలు ప్రమాదంలో 280 మంది మరణించారు. 12 వందలకు పైగా క్షతగాత్రులయ్యారు. ఇదీ చదవండి:ఒడిశా రైలు ప్రమాద బాధితుల వింత ప్రవర్తన.. ఎందుకలా చేస్తున్నారు? -
ఐరన్ ఓర్‌తో ఉన్న గూడ్స్‌ను కోరమండల్ ఢీకొట్టింది: జయవర్మ సిన్హా
ఢిల్లీ: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన కీలక విషయాలు వెల్లడించారు రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా. సిగ్నలింగ్ సమస్య వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బహనాగ స్టేషన్ వద్ద ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. కాగా, రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జయవర్మ సిన్హా మాట్లాడుతూ.. ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణం కాదు. ఈ ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ గంటకు 124 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. రెండు రైళ్లు నిర్ధేశిత వేగంతోనే వెళ్తున్నాయి. #WATCH | The goods train did not get derailed. Since the goods train was carrying iron ores, the maximum damage of the impact was on Coromandel Express. This is the reason for a huge number of deaths and injuries. The derailed bogies of Coromandel Express came on the down line,… pic.twitter.com/DnjheT8NSn — ANI (@ANI) June 4, 2023 కోరమండల్ రైలు లూప్ లైన్లోకి వెళ్లింది. బహనాగ స్టేషన్ వద్ద రెండు లూప్లైన్లు, రెండు మెయిన్ లైన్స్ ఉన్నాయి. లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలులో భారీగా ఐరన్ ఓర్ ఉంది. గూడ్స్ రైలును కోరమండల్ రైలు ఢీకొట్టింది. దీంతో, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే, సిగ్నలింగ్ సమస్యల వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: రైలు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్.. పరిహారం వివరాలు ఇవే.. -
సూపర్‌ఫాస్ట్ రైల్వే లైన్లకు పచ్చ జెండా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక రైల్వే ప్రాజెక్టుకు బీజం పడింది. ఇరు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం – విజయవాడ – తెలంగాణలోని శంషాబాద్ మధ్య మొదటిది, విశాఖపట్నం – విజయవాడ – కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ.. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్టంగా 220 కేఎంపీహెచ్ వేగంతో ప్రయాణించేలా) రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నారు. ఈ సూపర్‌ఫాస్ట్ రైల్వేలైన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తాజాగా ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది. -
తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు పునాది
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం - విజయవాడ - తెలంగాణలోని శంషాబాద్ మధ్యలో మొదటిది, విశాఖపట్నం - విజయవాడ - కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ.. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది. ఈ రైల్వే లైన్లకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్‌ను కలిసి, లేఖలు సమర్పించారు. ఈ సూపర్‌ఫాస్ట్ రైల్వేలైన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తాజాగా ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్టంగా 220 kmph వేగంతో ప్రయాణించేలా) రైల్వై లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్రప్రభుత్వం.. అనుసంధాతను మెరుగుపరిచే దిశగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: ఆరో తరగతిలో నాన్న మృతి.. అమ్మ కళ్లలో ఆనందం కోసం ఐఏఎస్‌గా ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వై-ఫైలు, రూ.30వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను కేంద్రం తెలుగు రాష్ట్రాలకు అందించింది. వీటికి అదనంగా తెలంగాణలో వ్యాగన్ తయారీ & ఓవర్‌హాలింగ్ కేంద్రాన్ని, ఎంఎంటీఎస్ (రెండోదశ), సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, చర్లపల్లి టర్మినల్ వంటి ప్రాజెక్టులను కేంద్రం చేపడుతున్న సంగతి తెలిసిందే. -
త్వరలో సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మధ్య.. వందేభారత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాబోతోంది. హైదరాబాద్–నాగ్‌పూర్ మధ్య ఈ రైలు ప్రారంభం కానుంది. ఈ సంవత్సరారంభంలో దక్షిణమధ్య రైల్వేకు మూడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే బోర్డు మంజూరు చేసింది. అందులో తొలి రైలు సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య సంక్రాంతి రోజున ప్రారంభమవగా ఏప్రిల్‌లో సికింద్రాబాద్–తిరుపతి మధ్య రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది. మూడో వందేభారత్ రైలు హైదరాబాద్–పుణే మధ్య ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పుడు దానికంటే ముందు నాగ్‌పూర్‌తో అనుసంధానం తెరపైకి వచ్చింది. దీనికి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ కూడా సానుకూలత వ్యక్తం చేశారు. ఈ రెండు నగరాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకొని వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడపాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. తగ్గనున్న ప్రయాణ సమయం.. నాగ్‌పూర్–హైదరాబాద్ మధ్య ఇప్పటివరకు శతాబ్ది, రాజధాని లాంటి ప్రీమియర్ కేటగిరీ రైళ్లు లేవు. సాధారణ రైళ్లు ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగిస్తున్నా ఇరు నగరాల మధ్య 581 కి.మీ. దూరం ఉండటంతో ప్రయాణ సమయం 11 గంటలుగా ఉంటోంది. దీంతో ప్రయాణ సమయాన్ని తగ్గిస్తే వ్యాపార బంధం మరింత దృఢంగా మారుతుందన్న ఉద్దేశంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతానికి చెందిన ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుదీర్ ముంగంటివార్ ఇటీవల రైల్వే మంత్రిని కలిసి వందేభారత్ రైలును కోరారు. విదర్భలోని వార్ధా ఎంపీ రామ్‌దాస్ కూడా ఈ మేరకు విన్నవించారు. వాటికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాత్కాలిక టైంటేబుల్ ఇలా... ప్రతిపాదిత వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తాత్కాలిక టైంటేబుల్‌ను అధికారులు రూపొందించారు. దీని ప్రకా రం రైలు నాగ్‌పూర్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30కు సికింద్రాబాద్ చేరుకోనుంది. మళ్లీ మధ్యాహ్నం 1:30కు సికింద్రాబాద్‌లో బయలుదేరి రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. వారంలో ఆరు రోజులు ఈ రైలు తిరగనుంది. బల్లార్షా, సిర్పూర్, కాగజ్‌నగర్, రామగుండం, కాజీపేటల్లో ఈ రైలుకు తాత్కాలిక స్టాప్‌లను కేటాయించారు. ఎకానమీలో రూ.1,450– రూ.1,550, ఎగ్జిక్యూటివ్‌లో రూ.2,750–రూ.2,850 వరకు చార్జీలను ఖరారు చేసే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
విశాఖ టూ విజయవాడ ఇక నాలుగు గంటలే
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరుని ఊరిస్తున్న వందేభారత్ రైలును అతి త్వరలోనే పట్టాలెక్కించేందుకు ముహూర్తం సిద్ధమవుతోంది. బుల్లెట్లా దూసుకెళ్తూ.. నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేలా ప్రవేశపెట్టిన అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్‌ను విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు డిసెంబర్లో ప్రారంభించేందుకు అ«ధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడకు దాదాపు 2 గంటల ప్రయాణాన్ని తగ్గించేలా ట్రాక్ పరిశీలనల్లో వాల్తేరు డివిజన్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే డివిజన్‌కు వందేభారత్ రేక్ కేటాయించినట్టు రైల్వే బోర్డు తెలిపింది. త్వరలో విశాఖకు రానున్న ఈ ట్రైన్ ట్రయల్ రన్ వచ్చే నెలలో నిర్వహించనున్నారు. 160 కి.మీ. వేగంతో.. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటకు 80 కి.మీ. గరిష్ట వేగంతో నడుస్తుండగా.. వందేభారత్ రైళ్లు గంటకు 160 కి.మీ. వేగంతో దూసుకెళ్లనున్నాయి. ఈ లెక్కన విశాఖపట్నం నుంచి విజయవాడకు ప్రస్తుతం రైలు ప్రయాణానికి 6 గంటల సమయం పడుతుండగా.. వందేభారత్ రైలు రాకతో కేవలం 4 గంటల్లోనే విజయవాడ చేరుకోవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల కంటే రెట్టింపు వేగంతో వందేభారత్ దూసుకుపోతుంది కాబట్టి ట్రాక్ పటిష్టత ఎలా ఉంది, దాని సామర్థ్యం సరిపోతుందా లేదా తదితర అంశాలను వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) అనూప్‌కుమార్ సత్పతి, ఇతర డివిజనల్ అధికారులు, ట్రాక్ నిపుణులతో కలసి గురువారం పరిశీలించారు. ఇందుకోసం విశాఖపట్నం–తిరుపతి మధ్య నడిచే డబుల్ డెక్కర్ రైలుని వినియోగించారు. వందేభారత్ రైల్ కోచ్‌ల నిర్వహణ సామర్థ్యాలు, సౌకర్యాలు ఇక్కడి ట్రాక్‌పై ఉన్నాయా లేవా అనేది పరిశీలన జరిపారు. ‘వందేభారత్’లో అత్యాధునిక సౌకర్యాలు వీటిలో ఎమర్జెన్సీ లైటింగ్ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కోచ్‌కు 4 లైట్లు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా ఇబ్బంది లేకుండా ఈ లైట్లు ఉపయోగపడతాయి. కోచ్‌లకు బయటవైపు నుంచి 4 కెమెరాలు ఉంటాయి. వెనుక వైపు నుంచి మరొకటి ఉంటుంది. ప్రతి కోచ్‌కు 4 అత్యవసర ద్వారాలు ఉంటాయి. అన్ని కోచ్‌లు పూర్తిగా ఏసీ సదుపాయంతో ఉంటాయి. ప్రతి కోచ్‌లో 32 ఇంచిల స్క్రీన్‌తో ప్రయాణికుల సమాచార వ్యవస్థ ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటుచేసిన అగ్నిమాపక పరికరాలు కొద్దిపాటి పొగను కూడా వెంటనే పసిగట్టి ప్రయాణికులను అప్రమత్తం చేస్తాయి. ఇందులో చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న వందేభారత్ రైళ్లలో నిర్దేశించిన ధరల ప్రకారం చూస్తే విజయవాడకు చైర్‌కార్‌లో దాదాపు రూ.850, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో రూ.1,600 నుంచి రూ.1,650 వరకూ ఉండే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్‌లో పరిధి పెంచుతాం ఇప్పటికే విశాఖపట్నం డివిజన్‌కు 8 కోచ్‌లతో కూడిన రెండు యూనిట్స్ వందేభారత్ రైలుని కేటాయించినట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. దానికనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ రైలు డిసెంబర్ రెండో వారంలో వచ్చే అవకాశం ఉంది. వచ్చిన వెంటనే ట్రయల్ చేపట్టి సర్వీసును ప్రారంభిస్తాం. భవిష్యత్‌లో మరో రేక్ కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ రేక్ వస్తే తిరుపతి లేదా హైదరాబాద్ వరకూ డిమాండ్‌ను బట్టి నడపాలని భావిస్తున్నాం. – అనూప్‌కుమార్ సత్పతి, డీఆర్ఎం, వాల్తేరు -
తెలంగాణకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్?!
న్యూఢిల్లీ: దక్షిణ భారత దేశంలో తాజాగా తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. చెన్నై(తమిళనాడు) నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూరు రూట్లో ఈ రైలు ప్రయాణించిన విషయం తెలిసిందే. నేడో రేపో పూర్తి స్థాయిలో రాకపోకలకు సిద్ధమైంది. ఈ తరుణంలో.. మరో రైలు కేటాయింపు జరిగినట్లు సమాచారం అందుతోంది. తెలంగాణకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాక దాదాపు ఖరారు అయ్యింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే బోర్డు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సికింద్రాబాద్ నుంచి ఏ రూట్లో రైలును నడిపించాలనే విషయంపై కసరత్తులు మొదలైంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, వైజాగ్, బెంగళూరు, ముంబై మార్గాలను రైల్వే బోర్డు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2019లో న్యూఢిల్లీ-వారణాసి రూట్లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టింది. పూర్తిగా స్వదేశీయంగా తయారయ్యే ఈ సెమీ-హై-స్పీడు రైలు.. గంటకు 160 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుందని ప్రకటించారు. అయితే.. ప్రస్తుతానికి ఆ వేగం గంటకు 130 కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతం దేశంలో.. నాలుగు రూట్లలో ఈ రైళ్లు నడుస్తుండగా.. చెన్నై-మైసూర్ రైలు ఐదవది కానుంది. ఇదీ చదవండి: ‘వందేభారత్’కు వరుస ప్రమాదాలు.. కీలక నిర్ణయం -
ఈ–టెండర్ స్థానంలో ఈ–ఆక్షన్
సాక్షి, అమరావతి: రాబడికి సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపుల కోసం దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఈ–ఆక్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ–టెండర్ల విధానం స్థానంలో ప్రవేశపెట్టిన ఈ–ఆక్షన్ విధానానికి నెల రోజుల్లోనే సానుకూల స్పందన లభిస్తోంది. పూర్తి పారదర్శకతతో సత్వరం కాంట్రాక్టులు కేటాయించేందుకు వీలుగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ–టెండర్ల విధానంలో ఎవరు ఎంతకు బిడ్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసే అవకాశం లేదు. దాంతో కొన్ని అవకతవకలకు ఆస్కారం ఉండేది. ఇక బిడ్లు తెరవడం, ఖరారు మొదలైన వాటికి ఎక్కువ సమయం పట్టేది. దీనికి పరిష్కారంగా ఈ–టెండర్ల స్థానంలో ఈ–ఆక్షన్ విధానానికి రైల్వే బోర్డు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేలో తొలుత సికింద్రాబాద్ డివిజన్ ఈ–ఆక్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇటీవల విజయవాడ డివిజన్‌లోనూ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. ఎవరైనా పాల్గొనవచ్చు.. అన్ని రకాల రాబడికి సంబంధించిన కాంట్రాక్టులన్నీ ఈ–ఆక్షన్ ద్వారానే కేటాయిస్తారు. వాహనాల పార్కింగ్, పార్సిల్ సర్వీసులు, ఏటీఎంలు, ఏసీ వెయిటింగ్ రూమ్ సర్వీసు, క్లాక్ రూమ్ సర్వీసులు, రుసుము చెల్లింపు విధానంలో టాయిలెట్ల నిర్వహణ మొదలైన కాంట్రాక్టుల కేటాయింపునకు ఈ–ఆక్షన్ నిర్వహిస్తారు. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న వారైనా ఈ–ఆక్షన్‌లో పాల్గొనవచ్చు. అన్ని రకాల చెల్లింపులు ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తారు. ఈ–ఆక్షన్ ప్రక్రియను గరిష్టంగా 72 గంటల్లోగా పూర్తి చేస్తారు. ఈ–ఆక్షన్ ప్రక్రియకు బిడ్డర్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. నెల రోజుల్లోనే 220 మంది కాంట్రాక్టర్లు ఈ–ఆక్షన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు రూ.77.51 కోట్ల విలువైన 54 కాంట్రాక్టులను ఈ–ఆక్షన్ ద్వారా కేటాయించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత, ప్రజా ధనాన్ని పొదుపు చేయడంలో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఇదే తరహాలో ఇప్పటికే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తద్వారా ఇప్పటికే వందల కోట్ల రూపాయల మేర ప్రజా ధనం ఆదా అయిన విషయమూ విదితమే. ఒక పనికి సంబంధించి జ్యుడీషియల్ ప్రివ్యూ అనంతరం.. కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెంచి, తక్కువ ధరకే నాణ్యతతో పనులు అప్పగిస్తోంది. -
మల్కన్‌గిరి–భద్రాచలం కొత్త రైల్వే లైన్
సాక్షి, హైదరాబాద్: ఒడిశా–తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం కాబోతోంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు ఇది ఏర్పాటుకానుంది. రెండు రాష్ట్రాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానిస్తూ ఈ కొత్త లైన్ వేయనున్నారు. గిరిజన ప్రాంతాలకు రవాణా వసతిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణం కానున్నట్టు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. 173.416 కిలోమీటర్ల నిడివి ఉండే ఈ లైన్ నిర్మాణానికి రూ.2,800 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. నదులు, వాగులు వంకలు ఉన్న నేపథ్యంలో ఈ మార్గంలో ఏకంగా 213 వంతెనలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిల్లో 48 భారీ వంతెనలు ఉన్నాయి. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గతేడాది సెప్టెంబర్‌లో రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. ఇటీవలి బడ్జెట్లో ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) కోసం రూ.3 కోట్లు ప్రతిపాదించారు. ఈ మేరకు మొదలైన సర్వే జూన్ నాటికి పూర్తి కానుంది. సర్వే నివేదికను పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి ఇవ్వగానే పనులు ప్రారంభించనున్నారు. తెలంగాణలోకి ఇలా.. ఒడిశాలోని జేపూర్ నుంచి మల్కన్‌గిరికి గతంలో రైల్వే లైన్ మంజూరు కాగా, ప్రస్తుతం ఆ పనులు సాగుతున్నాయి. దాన్ని మరింత విస్తరించే క్రమంలో, ఈ కొత్త మార్గానికి ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రతిపాదనలు రూపొందించింది. కొత్త లైన్ ఒడిశాలోని మల్కన్‌గిరి, బదలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహారాజ్‌పల్లి, లూనిమన్‌గూడల మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామ, భద్రాచలం వరకు సాగుతుంది. ఇప్పటికే ఉన్న భద్రాచలం – పాండురంగాపురం లైన్‌తో దీనిని అనుసంధానించనున్నారు. ప్రస్తుతానికి ప్రయాణికుల కోసమే.. రైల్వే కొంతకాలంగా సరుకు రవాణాకు బాగా ప్రాధాన్యం ఇస్తోంది. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ప్రత్యేకంగా సరుకు రవాణా కారిడార్లను కూడా నిర్మిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సింగరేణి కార్పొరేషన్‌తో కలిసి సంయుక్తంగా భద్రాచలం–సత్తుపల్లి లైన్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఇది కేవలం బొగ్గు తరలింపును దృష్టిలో పెట్టుకునే నిర్మిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చేపట్టబోయే మల్కన్‌గిరి–భద్రాచలం మార్గాన్ని ప్రస్తుతానికి ప్రయాణికుల రైళ్ల కోసమే అని పేర్కొంటున్నప్పటికీ, భవిష్యత్తులో దీన్ని సరుకు రవాణాకు కూడా వినియోగించే అవకాశం ఉంది. సర్వే వేగవంతం చేయండి: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం మల్కన్‌గిరి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు ఆయనకు మల్కన్‌గిరి–భద్రాచలం లైన్ పురోగతిని మ్యాప్‌ల సాయంతో వివరించారు. కొత్తలైన్ పనులు వీలైనంత త్వరగా చేపట్టేలా సర్వేలో వేగం పెంచాలని మంత్రి సూచించారు. -
ఇక అన్నీ కరెంటు ఇంజన్లే..
సాక్షి, హైదరాబాద్: త్వరలో రైళ్ల డీజిల్ ఇంజిన్లు కనుమరుగుకాబోతున్నాయి. వాటి స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ ఇంజిన్లే రానున్నాయి. ఈమేరకు అన్ని రైల్వే లైన్లను విద్యుదీకరించే పనులను కేంద్రం వేగవంతం చేసింది. గత ఏడాది కాలంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 770 కి.మీ. మేర విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఇది జోన్ ఆల్‌టైం రికార్డు. అదీగాక ఇంత విస్తృతంగా మరే జోన్లో పనులు జరగలేదు. ఇందులో తెలంగాణ పరిధిలో 326 కి.మీ. ఎలక్ట్రిఫికేషన్ పూర్తి కావటం విశేషం. వచ్చే సంవత్సరం డిసెంబరు నాటికి జోన్ యావత్తు విద్యుదీకరణ పూర్తి చేయాలని రైల్వే బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులు పూర్తయితే 20 నెలల్లో అన్నిలైన్లలో విద్యుత్ లోకోమోటివ్‌లే నడనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1,850 కి.మీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ భూభాగం పూర్తిగా ఉంటుంది. రాష్ట్రం పరిధిలో 1,850 కి.మీ. మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. మనోహరాబాద్–కొత్తపల్లి లాంటి కొత్త ప్రాజెక్టుల పనులు జరుగుతున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్టు నిడివి ఇందులో కలపలేదు. గత ఏడాది పూర్తయిన 326 కి.మీ. కలుపుకొంటే ఇప్పటివరకు 1450 కి.మీ. మేర విద్యుదీకరణ పూర్తయింది. ఇక 400 కి.మీ.మేర మాత్రమే పనులు జరగాల్సి ఉంది. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో త్వరలో వందశాతం విద్యుదీకరణ పూర్తవుతుందని జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. డీజిల్ ఇంజిన్‌తో భారీ వ్యయం ఖర్చు పరంగా చూస్తే డీజిల్ ఇంజిన్‌తో రైల్వేకు భారీగా వ్యయమవుతోంది. ప్రతి వంద కిలోమీటర్ల ప్రయాణానికి డీజిల్ ఇంజిన్‌తో రూ.65 వేలు ఖర్చు అవుతుండగా, ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో రూ.45 వేలు అవుతోంది. అంటే ప్రతి వంద కి.మీ.కు ఎలక్ట్రిక్ వినియోగంతో రూ.20 వేలు ఆదా అవుతుంది. అదీగాక పొగరూపంలో కాలుష్యం కూడా ఉండదు. కన్వర్షన్‌పై దృష్టి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీకి రూ.18 కోట్లు అవుతుంది. అదే డీజిల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్‌గా కన్వర్ట్ చేసుకోవటం తక్కువ ఖర్చుతో కూడుకున్న ది. రూ.2కోట్లతో ఓ ఇంజిన్‌ను కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న డీజిల్ ఇంజిన్లు బాగా పాతబడి ఉన్నాయి. వచ్చే ఏడెనిమిదేళ్లలో అవి పనికిరాకుండా పోయే పరిస్థితి. వాటిని మెరు గుపరిస్తే మరో పదేళ్లు వాడే వీలుందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఉన్న డీజిల్ ఇంజిన్లను కన్వ ర్ట్ చేయటం ద్వారా తక్కువ వ్యయంతో కరెంటు ఇంజిన్లను పట్టాలెక్కించాలని రైల్వే భావిస్తోంది. -
వృద్ధులకు రాయితీ ఎందుకు ఇవ్వట్లేదో చెప్పండి
సాక్షి, అమరావతి: రైళ్లు, ఆర్టీసీ బస్సు చార్జీల్లో వృద్ధులకు ఇచ్చిన రాయితీని కోవిడ్ తగ్గిన తరువాత ఎందుకు పునరుద్ధరించడం లేదో తెలపాలని రైల్వే బోర్డు, ఏపీఎస్ ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను మార్చి 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఒమిక్రాన్ కేసులు.. రైల్వే గుండెల్లో ‘రైళ్లు’
సాక్షి, హైదరాబాద్: రేపో మాపో పట్టాలెక్కుతాయనుకున్న ప్యాసింజర్ రైళ్లకు బ్రేక్ పడింది. వేగంగా వ్యాపిస్తుందని భావిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లోనూ వెలుగు చూడటంతో, ప్యాసింజర్ రైళ్లు నడిపే విషయంలో రైల్వే బోర్డు వెనక్కి తగ్గింది. దేశవ్యాప్తంగా 2020 మార్చి చివరలో కోవిడ్ మొదటి లాక్డౌన్ సందర్భంగా రైళ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దశలవారీగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను పట్టాలెక్కిస్తూ వస్తున్న రైల్వేబోర్డు ప్యాసింజర్ రైళ్లను మాత్రం ప్రారంభించలేదు. ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణికుల నియంత్రణకు అవకాశం లేకపోవటం, ఎక్కువ స్టాపుల్లో ఆగాల్సి ఉండటంతో ఎక్కేవారు, దిగేవారు సైతం ఎక్కువగా ఉంటారనే ఉద్దేశంతో వీటిని నడిపే విషయంలో వెనుకంజ వేస్తూ వచ్చింది. అలా చూస్తుండగానే 20 నెలలు గడిచిపోయాయి. కోవిడ్ రెండో దశ పూర్తిగా తగ్గిపోయినందున ఇక అన్ని రైళ్లను ప్రారంభించాలని అక్టోబర్ చివరలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. పది రోజు ల క్రితం పాత పద్ధతిలో రైళ్లను పునరుద్ధరిస్తూ పాత నంబర్లతో, పాత సమయాల్లో నడపటం మొదలుపెట్టింది. రైళ్లు మామాలుగా తిరుగుతున్నా.. ఎక్కడా కోవిడ్ కేసుల పెరుగుదల లాంటి సమస్యలు రాలేదు. దీంతో ఈ వారం లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లు ప్రారంభిద్దామనుకున్న సమయంలో తొలిసారిగా కర్ణాటక లో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. కొత్త కేసుల పెరుగుదల లేకుంటే.. కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి అనేకమంది ప్రయాణికులు మన దేశానికి వచ్చారని, వారిలో కొందరు కోవిడ్ పాజిటివ్‌గా ఉన్నారని తేలింది. అలాగే మూడో దశ పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో ఎక్కడా ప్యాసింజర్ రైళ్లు ప్రారంభించొద్దని రైల్వేబోర్డు తాజాగా ఆదేశించింది. మరికొన్ని రోజులు వేచిచూసి, కొత్త కేసుల పెరుగుదల లేకుంటే ప్రారంభించాలని నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 250 ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయి. ప్రస్తుతం వీటిల్లోంచి 50 రైళ్లను మాత్రం ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో నడుపుతున్నారు. ఇక నగరంలో 121 ఎంఎంటీఎస్ రైళ్లు తిరగాల్సి ఉండగా, దశలవారీగా 60 రైళ్లను ప్రారంభించారు. తాజాగా మరో 25 రైళ్లను గురువారం పట్టాలెక్కించారు. ఎంఎంటీఎస్ రైళ్ల విషయంలో నిర్ణయం జోన్ స్థాయిలో తీసుకునే వీలున్నందున స్థానిక అధికారులు వీటికి పచ్చజెండా ఊపారు. కానీ ప్యాసింజర్ రైళ్ల విషయంలో మాత్రం రెడ్ సిగ్నల్ రావటంతో వీటి ప్రారంభాన్ని వాయిదా వేశారు. -
ప్యాసింజర్ రైళ్లకు.. మరో 2 వారాలు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ రెండో దశ పూర్తిగా తగ్గినందున ఇక అన్ని రైళ్లను ప్రారంభించాలని యోచిస్తున్న సమయంలో రైల్వేను మూడో దశ హెచ్చరికలు తిరిగి పునరాలోచనలో పడేశాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మూడో దశపై వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో అక్టోబర్ చివరి నాటికి అన్ని రకాల రైళ్లను పునరుద్ధరించాలన్న నిర్ణయంతో ఉన్న రైల్వే బోర్డు మళ్లీ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. దీపావళి పర్వదినం సందర్భంగా ప్రజలు ఒకరింటికి మరొకరు వెళ్లి ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఒకవేళ కోవిడ్ మూడో దశ మొదలైనట్టయితే.. ఈ వేడుకల మాటున కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో దీపావళి తర్వాత రెండు వారాల పాటు ఎదురు చూసి అప్పటి పరిస్థితికి తగ్గట్లు రైళ్ల విషయంలో నిర్ణయం తీసుకోవాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ బారిన పడ్డవారికి చేరువుగా మెలిగినవారిలో రెండు వారాల్లో లక్షణాలు వెలుగుచూసే అవకాశం ఉన్నందున అప్పటి వరకు ఎదురు చూడాలన్న యోచనలో రైల్వే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కటమనేది దీనిపైనే ఆధారపడి ఉందని అంటున్నారు. పట్టాలెక్కని ప్యాసింజర్ రైళ్లు.. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 250 ప్యాసింజర్ రైళ్లు నిత్యం పరుగుపెడుతుంటాయి. కోవిడ్ నేపథ్యంలో 2020 మార్చి చివరలో మొదటిసారి లాక్డౌన్ విధించినప్పుడు ఆగిన ఈ రైళ్లు ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ రైళ్లు దశలవారీగా ప్రారంభమై దాదాపు గరిష్ట స్థాయిలో నడిపారు. మళ్లీ రెండో దశలో లాక్డౌన్ విధించినప్పుడు కొంతకాలం అవి నిలిచిపోయినా.. మళ్లీ ఆ తర్వాత ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దాదాపు అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇక దాదాపు 15 నెలలపాటు షెడ్లకే పరిమితమైన హైదరాబాద్ సిటీ ఎంఎంటీఎస్ రైళ్లు కూడా పరిమిత సంఖ్యలో ప్రారంభమై దశలవారీగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌లో మొత్తం 121 ఎంఎంటీఎస్ రైళ్లు ఉండగా, ప్రస్తుతం 60 రైళ్లు నడుస్తున్నాయి. వీటి సంఖ్య పెంచుతూ ఇక ప్యాసింజర్ రైళ్లకు కూడా పచ్చజెండా ఊపొచ్చని గత నెలలో నిర్ణయించారు. కానీ, వారం రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. దీపావళి ముగిసిన తర్వాత కొన్ని రోజులు పరిస్థితిని గమనించిన తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చన్న అభిప్రాయాలు రైల్వే వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నాయి. అయితే, అన్ని ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయేలా ఉన్నా... వాటిలోంచి 50 రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా నడుపుతుండటం విశేషం. వీటి స్టాపుల సంఖ్య తగ్గించి, అన్ రిజర్వ్డ్ సీట్లకు బదులు ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో టికెట్లు జారీ చేస్తూ నడుపుతున్నారు. తదుపరి రైల్వే బోర్డు నిర్ణయం తీసుకునే వరకు.. అన్ని స్టాపుల్లో ఆగుతూ, అతి తక్కువ టికెట్ ధరతో ప్రయాణించే వెసులుబాటు ఉండే ప్యాసింజర్ రైళ్లు ఎక్కే అవకాశం లేనట్లే. -
ఆర్థిక వృద్ధిలో ‘దూసుకుపోతున్న’ వాల్తేరు డివిజన్
సాక్షి, విశాఖపట్నం/ తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): కోవిడ్ మహమ్మారి వెంటాడుతున్న సమయంలోనూ వాల్తేరు రైల్వే డివిజన్ సాధించిన ఆర్థిక ప్రగతి అద్భుతమని రైల్వే బోర్డు మెంబర్ ఫైనాన్స్ (ఫైనాన్స్ కమిషనర్) నరేష్ సలేచా ప్రశంసించారు. విశాఖలోని డీఆర్ఎం కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. డివిజన్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు 2020–21లో కోవిడ్ సమయంలో వాల్తేర్ డివిజన్ ప్రగతి, ఆదాయ వనరులు, డివిజన్ పరిధిలో చేపట్టిన వినూత్న ప్రాజెక్టులు, ప్రయాణికుల సదుపాయాలు, భద్రతాపనులు, ఇతర అభివృద్ధి పనుల గురించి డీఆర్ఎం చేతన్‌కుమార్ శ్రీ వాస్తవ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రైల్వే స్థలాలు, స్టేషన్ పరిసరాల ద్వారా ఆదాయ వనరులను సమీకరించుకోవడంలో వాల్తేర్ డివిజన్ వినూత్న పద్ధతుల్ని అవలంభిస్తున్నదని నరేష్ సలేచా కొనియాడారు. అన్ని విభాగాల్లోనూ మిగిలిన త్రైమాసికాల్లో ఇదే తరహా వృద్ధి సాధించాలని సూచించారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్స్ అడ్వయిజర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్.ఎస్.మిత్రా, వాల్తేర్ డివిజన్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ రాజారామ్, ఏడీఆర్ఎం అక్షయ్ సక్సేనా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, విశాఖ డివిజన్‌ని కొనసాగిస్తూ.. తూర్పు కోస్తా రైల్వే జోన్‌ని ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందించేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నించగా.. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. -
రైల్వే స్టేడియానికి మంగళం!
సాక్షి, హైదరాబాద్: ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను అందించిన చారిత్రక సికింద్రాబాద్ రైల్వే స్టేడియాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. రైల్ నిలయాన్ని అనుకొని ఉన్న సుమారు 30 ఎకరాలలోని స్టేడియం స్థలాలను వ్యాపార, వాణిజ్య సంస్థలకు లీజుకు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన విధి వి«ధానాలురూపొందించవలసిందిగా రైల్వేశాఖ తాజాగా రైల్వే లాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ)ను ఆదేశించింది. లీజుకు ఇవ్వడం ద్వారా రైల్వేకు ఎంత మేరకు ఆదాయం లభిస్తుందనే అంశంపైనా అధ్యయనం చేయాలని రైల్వేశాఖ ఈ ఆదేశాల్లో ఆర్‌ఎల్‌డీఏను కోరింది. వడివడిగా అడుగులు రైళ్లు, రైల్వే కార్యకలాపాల ప్రైవేటీకరణకు పెద్ద ఎత్తు న కార్యాచరణ చేపట్టిన రైల్వేశాఖ విలువైన స్థలాల ను ప్రైవేట్ సంస్థలకు లీజు రూపంలో దారాదత్తం చేసే కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైల్వే లాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్థలాలను ఎంపిక చేసింది. కొన్నింటికీ ప్రీ బిడ్ టెండర్లను కూడా ఆహ్వానించారు. మౌలాలీ ఆర్పీఎఫ్, చిలకలగూడ రైల్వే క్వార్టర్స్, మెట్టుగూడ రైల్ కళారంగ్, సంగీత్ చౌరస్తాలోని రైల్వే ఆఫీసర్స్ క్వార్టర్స్, తదితర స్థలాల్లో షాపింగ్‌మాల్స్, థియేటర్లు, హోటళ్లు, తదితర వ్యాపార, వాణిజ్య భవన సముదాయాలకు లీజుకు ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లను ఎయిర్‌పోర్టు తరహాలో అభివద్ధి చేసే కార్యాచరణలో భాగంగా ఈ రైల్వేస్టేషన్ల చుట్టూ ఉన్న స్థలాల ప్రైవేటీకరణకు కూడా రంగం సిద్ధమైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ల వద్ద దక్షిణమధ్య రైల్వేకు ఉన్న స్థలాలను కూడా ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వనున్నారు. ఇందుకోసం నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్యపార్కు, లక్డీకాఫూల్ స్టేషన్లను గతంలోనే ఎంపిక చేశారు. ఎకరా అదనంగా ఉన్నా సరే లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేపట్టింది. మొదట్లో కొన్ని స్థలాలను 33 ఏళ్లకు లీజుకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు సంస్థల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో లీజు గడువును 49 ఏళ్లకు పెంచారు. ఆ తరువాత కొన్ని విలువైన స్థలాలను 99 ఏళ్లకు సైతం లీజుకు ఇచ్చేందుకు ఆర్ఎల్డీఏ ప్రణాళికలను రూపొందించింది. తాజాగా దేశంలోనే ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ రైల్వేస్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కార్పొరేట్ శక్తుల జాబితాలో చేర్చడం గమనార్హం. ఎంతో ఘన చరిత్ర సికింద్రాబాద్ రైల్వేస్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. సుమారు ఆరున్నర దశాబ్దాలుగా ఎందరో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు సికింద్రాబాద్ స్టేడియం వేదికగా నిలిచింది. ఎంతోమంది అర్జున అవార్డు గ్రహీతలు దక్షిణమధ్య రైల్వే క్రీడాకారులు కావడం గమనార్హం. మిథాలీరాజ్, జేజే శోభ, అనురాధారెడ్డి వంటి ఎందరో ఈ వేదిక నుంచే ఎదిగారు. సికింద్రాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రికెట్ స్టేడియం, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఫుట్‌బాల్,బాస్కెట్‌బాల్, వాలీబాల్ స్టేడియంలు, స్విమ్మింగ్‌పూల్, టెన్నిస్‌లాంజ్, ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియంలు, వాకింగ్ ట్రాక్, అంతర్జాతీయ స్థాయి సింథటిక్ హాకీ గ్రౌండ్, తదితర సదుపాయాలు ఉన్నాయి. -
రైలు పట్టాలే యమపాశాలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ వల్ల 2020లో వలస కార్మికుల వెతలు వర్ణనాతీతం. చాలామంది నగరాలు, పట్టణాల నుంచి కాలినడకన సొంతూళ్లకు పయనమయ్యారు. రైలు పట్టాలపై నడక సాగించారు. రైళ్లు ఢీకొట్టడం వల్ల, అనారోగ్యంతో వలస కార్మికులు పట్టాలపైనే ప్రాణాలు విడిచారు. గత ఏడాది దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై 8,733 మంది మృతి చెందారని, వీరిలో అత్యధిక శాతం మంది వలస కార్మికులేనని రైల్వే బోర్డు ప్రకటించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక ఉద్యమకారుడు చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు రైల్వే బోర్డు తాజాగా సమాధానమిచ్చింది. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు 2020లో జనవరి నుంచి డిసెంబర్ వరకు రైలు పట్టాలపై 8,733 మంది మరణించారని, 805 మంది గాయపడ్డారని పేర్కొంది. రోడ్లతో పోలిస్తే రైల్వే మార్గాలపై ప్రయాణం తక్కువ దూరం కావడంతో వలస కార్మికులు వీటినే ఎంచుకున్నారని, పట్టాలపై కాలిన నడకన వెళ్తూ చాలామంది మార్గంమధ్యలో వివిధ కారణాలతో మృతి చెందారని అధికార వర్గాలు వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో రోడ్లపై పోలీసుల నిఘా అధికంగా ఉండడంతో చాలామంది రైల్వే ట్రాకులపై నడుస్తూ సొంతూళ్లకు పయనమయ్యా రని అన్నారు. దేశవ్యాప్తంగా 70 వేల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాకులు విస్తరించి ఉన్నాయి. నిత్యం 17 వేల రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తుంటాయి. 2016, 2017, 2018, 2019తో పోలిస్తే 2020లో రైలు పట్టాలపై చోటుచేసుకున్న మరణాలు తక్కువేనని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. 2016లో 14,032 మంది, 2017లో 12,838 మంది, 2018లో 14,197 మంది, 2019లో 15,204 మంది రైలు పట్టాలపై ప్రాణాలు విడిచారు. (చదవండి: భార్యను చంపి నాటకం.. ఘరానా ఎస్సై అరెస్ట్) -
ఒడిశా నుంచి ఏపీకి ఆక్సిజన్ రైళ్లు నడపాలి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఆక్సిజన్ రవాణాకు తగినన్ని ట్యాంకర్లు అందుబాటులో లేనందున ఒడిశా నుంచి ప్రత్యేక ఆక్సిజన్ రైళ్లను నడపాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి రైల్వేబోర్డు చైర్మన్ సునీత్‌శర్మకు మంగళవారం లేఖ రాశారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ రవాణాలో ఎదురవుతున్న ఆటంకాలు, ఇబ్బందులను లేఖలో వివరించారు. సకాలంలో ప్రాణవాయువు రవాణా చేయడం ద్వారా వేలాదిమంది కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో భారతీయ రైల్వేలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఆక్సిజన్ రైళ్లు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. సెకండ్‌వేవ్ రాష్ట్రంలో కూడా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ అవసరం అపరిమితంగా పెరిగిపోయిందని, కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో ప్రాణవాయువు అవసరం కీలకంగా మారిందని తెలిపారు. ఒడిశా నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ రవాణా కోసం 10 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కేటాయించాలని ఎంపవర్డ్ గ్రూప్ చైర్పర్సన్ సునితాదావ్రాను కోరగా 2 కేటాయించారని తెలిపారు. ట్యాంకర్లు అందుబాటులో లేనందున ఒడిశా నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ నిల్వలను రవాణా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ రైళ్లను నడిపేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే లేదా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు వెంటనే ఆదేశాలు జారీచేయాలని కోరారు. -
దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ
దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తున్నట్లు హిందుస్తాన్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆ రైల్వే స్టేషన్లలో ఎయిర్‌పోర్టు తరహా భద్రతా, మౌలిక సదుపాయాలను అందించాలని భారతీయ రైల్వే ఆలోచన చేస్తోంది. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగిన భారతీయ రైల్వే, 2019లో ప్రైవేట్-కంపెనీలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య(పిపిపి) కింద కొన్ని స్టేషన్లను నడుపుటకు అనుమతి ఇచ్చింది. ఇప్పడు మరికొన్ని రైల్వే స్టేషన్లలో మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు, భద్రతాపరమైన వసతులు కల్పించేందుకు చూస్తుంది. ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐఆర్ఎస్ డిసి) ఆ రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ భాద్యతలను పర్యవేక్షిస్తుంది. ఈ 90 రైల్వే స్టేషన్లలో భద్రతా, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలనే దానిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పిఎఫ్), అన్ని రైల్వే జోన్ల ప్రధాన చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ల నుంచి అభిప్రాయాలను కోరుతూ రైల్వే బోర్డు లేఖ రాసింది. ప్రస్తుతం విమానాశ్రయాలలో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్ఎఫ్) మాదిరిగానే ఈ స్టేషన్లలో అలాంటి భద్రతా బలగాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని రైల్వే బోర్డు తన అభిప్రాయాన్ని తెలిపింది. అలాగే, ప్రైవేట్ సంస్థలే సీఐఎస్ఎఫ్ బలగాలకు వేతనాలు చెల్లించాలి. ప్రస్తుతం విమానాశ్రయాలలో ఉన్న భద్రతాపరమైన వ్యవస్థను ప్రైవేట్ స్టేషన్లలో అమలు చేయాలనీ బోర్డు చూస్తుంది. ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను మార్చి 15లోగా తెలపాలంటూ రైల్వే బోర్డు కోరింది. 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం కోసం బ్లూప్రింట్ రూపొందించడానికి ఒక కమిటీని 2019 అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. నాగ్‌పూర్, గ్వాలియర్, అమృత్ సర్, సబర్మతి, నెల్లూరు, పుదుచ్చేరి, డెహ్రాడూన్, తిరుపతి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం బిడ్డింగ్ అర్హత ప్రక్రియను సెప్టెంబర్‌లో ప్రారంభించినట్లు గతేడాది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే గాంధీనగర్, హబీబ్‌గంజ్ వంటి స్టేషన్లలో పునరాభివృద్ధిపై పనులు ప్రారంభమయ్యాయి. ఆనంద్ విహార్, బిజ్వాసన్, చండీగఢ్ వంటి రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధికి కాంట్రాక్టులు ఇచ్చారు. రైల్వే పునరాభివృద్ధి చేస్తున్న స్టేషన్లలో రైలు ఛార్జీలపై అదనపు రుసుము వసూలు చేయాలనీ చూస్తుంది. ఇంకోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదట 12 ప్రైవేట్ రైళ్లు, 2027 నాటికి 151 రైళ్లను ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తుంది. చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ -
రైల్వే బోర్డు కొత్త ఛైర్మన్ నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేబోర్డు నూతన ఛైర్మన్, సీఈఓగా సునీత్ శర్మను నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ గురువారం ఆమోదం తెలిపింది. దీంతో పునర్నిర్మించిన బోర్డు తొలిసీఈవోగా సునీత్ వర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ పదవీ కాలం నేటితో (2020 డిసెంబరు 31) ముగియనుంది. దీంతో తాజా నియామకం జరిగింది. ఇప్పటికే వినోద్ కుమార్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించిన సంగతి తెలిసిందే. కాగా 1978 బ్యాచ్‌కు చెందిన సునీత్ శర్మ స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ ఆఫీసర్. ఇంతకుముందు రాయబరేలి, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్‌గాను, పూణే, సెంట్రల్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్‌గా విధులు నిర్వహించారు. -
మెట్రోసేవల పునరుద్దరణకు సిద్ధంగా ఉన్నాం
కోల్‌కతా : అన్‌లాక్‌లో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మెట్రో సర్వీసులకు అనుమతివ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైల్వే బోర్డుకు లేఖ రాశారు. అన్ని భద్రతా ప్రమాణాల మధ్య పరిమిత సంఖ్యలో మెట్రో సేవలను తిరిగి ప్రారంభించేలా అనుమతివ్వాలని కోరారు. ఈ విషయంపై రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అలపన్ బండియోపాధ్యాయ మాట్లాడుతూ పూర్తి భద్రతా ప్రమాణాల మధ్య నాలుగోవంతు సబర్బన్ రైళ్ల సర్వీసులను, మెట్రో సేవలను ప్రారంభించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. (కోవిడ్ నిబంధనలను పాటించకపోతే భారీ జరిమానాలు) ఇప్పటికే బస్సు సర్వీసులకు అనుమతి కల్పించిన నేపథ్యంలో మెట్రో సేవలను కూడా పునః ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అయితే ఈ సేవలను ఎప్పటినుంచి తిరిగి ప్రారంభించాలన్నదానిపై బెంగాల్ ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఇక కరోనా వ్యాప్తిని నివారించే ప్రయత్నంలో భాగంగా బెంగాల్లో మరో రెండు వారాల పాటు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించింది. అంతేకాకుండా జూలై 23 నుంచి ప్రతీవారం కంప్లీట్ లాక్‌డౌన్‌ను ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే రాష్ర్ట ఆర్థిక పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్నందున మెట్రో సేవలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రైల్వే బోర్డుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. (స్వీయ నిర్బంధంలోకి పంజాబ్ ముఖ్యమంత్రి) -
రైల్వేలో ‘ప్రైవేట్’ కూత
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ రైళ్లకు రైల్వేబోర్డు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం పలు మార్గాల్లో ఐఆర్సీటీసీ నడుపుతున్న తేజాస్ రైళ్ల తరహాలోనే ప్రైవేట్ సంస్థలకు చెందిన రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ప్రయాణికులకు మరింత వేగవంతమైన, పారదర్శక రైల్వే సదుపాయాన్ని అందజేసేందుకే ప్రైవేట్ రైళ్లకు అనుమతినిస్తున్నట్లు రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటుచేసి, 109 మార్గాలను ఖరారు చేశారు. అందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ క్లస్టర్లో 10 మార్గాల్లో ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయి. వీటిలో ముంబై– ఔరంగాబాద్, విశాఖ–విజయవాడ రైళ్లు మినహా మిగతావి సికింద్రాబాద్ కేంద్రంగానే రాకపోకలు సాగించనున్నాయి. త్వరలో సాంకేతిక టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి, వచ్చే ఆరు నెలల్లో ఆర్థిక టెండర్లను కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు బడా ప్రైవేట్ వ్యాపార సంస్థలు, కన్సార్షియంల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే మూడేళ్లలో ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కుతాయని అంచనా. డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ విమానాలు నడిపే ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థల తరహాలోనే ఈ ప్రైవేట్ రైళ్లూ నడవనున్నాయి. ఈ సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ప్రయాణ సదుపాయాలను అందజేస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. కచ్చితమైన సమయపాలన పాటిస్తారు. ప్రస్తుతం రైళ్లలో ఐఆర్సీటీసీ కేటరింగ్ నిర్వహిస్తుండగా, ప్రైవేట్ రైళ్లలో ఆ సంస్థలే ఈ సదుపాయాన్ని కల్పిస్తా యి. ముంబై–లఖ్‌నవూ మధ్య నడు స్తున్న తేజా స్ ట్రైన్ తరహాలోనే ఈ ప్రైవేట్ రైళ్లు ఉంటాయి. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యో గులై ఉంటారు. మిగతా సిబ్బంది మొత్తం ప్రైవే ట్ సంస్థలకు చెందిన వాళ్లే ఉంటారు. రైళ్ల రాక పోకలు, సిగ్నలింగ్ మాత్రం రైల్వేశాఖే పర్య వేక్షి స్తుంది. రైల్వే పట్టాలపై తమ రైళ్లను నడుపు కొన్నందుకు ప్రైవేట్ సంస్థలు నిర్ధారిత మొత్తా న్ని రైల్వేలకు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేట్ సంస్థలతో ఏర్పాటు చేసుకొనే ఒప్పం దంలో భాగంగా ఆయా సంస్థలకు చెందిన రైళ్ల నిర్వహణకు 35 ఏళ్ల అనుమతులు లభిస్తాయి. రైల్వేల నిర్వీర్యానికే.. ప్రైవేట్ రైళ్లకు అనుమతినివ్వడాన్ని కార్మిక సంఘాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడతారని, భవిష్యత్తులో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించవని దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న రైల్వేలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుందన్నారు. ప్రయాణికులకు ప్రస్తుతం అతి తక్కువ చార్జీల్లో రైల్వే ప్రయాణం లభిస్తుండగా, ప్రైవేట్ రైళ్ల వల్ల చార్జీలు భారీగా పెరుగుతాయని చెప్పారు. సికింద్రాబాద్ క్లస్టర్లో నడవనున్న ప్రైవేటు రైళ్లివే.. సికింద్రాబాద్ – శ్రీకాకుళం సికింద్రాబాద్ – గుంటూరు సికింద్రాబాద్ – తిరుపతి సికింద్రాబాద్ – ముంబై సికింద్రాబాద్ – హౌరా సికింద్రాబాద్– తిరుపతి – వారణాసి విశాఖ – బెంగళూరు తిరుపతి – సికింద్రాబాద్ ముంబై – ఔరంగాబాద్ విశాఖ – విజయవాడ -
ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రెగ్యు లర్ రైళ్లతోపాటు సబర్బన్ రైళ్లను ఆగస్టు 12 వరకు రద్దుచేస్తున్నట్లు తెలిపింది. గతంలో ఈ రైళ్లను జూన్ 30 వరకు రద్దు చేసింది. తాజా నిర్ణయంతో ఆగస్టు 12 వరకు పొడిగించినట్లయింది. కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. మే 12వ తేదీ నుంచి రాజధాని మార్గాల్లో నడిచే 15 జతల ప్రత్యేక రైళ్లు, జూన్ ఒకటో తేదీ నుంచి నడుపుతున్న 100 జతల రైళ్లు మాత్రం కొనసాగుతాయని వివరించింది. రద్దయిన రైళ్లకు జూలై 1 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు చేసిన టికెట్ రిజర్వేషన్లకు రద్దు చేసి, ఆ సొమ్మును వాపసు చేయనున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. రైల్వే స్టాళ్లలో కరోనా నిత్యావసరాలు కరోనా నిత్యావసరాలైన మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు ఇకపై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉండే స్టాళ్లలో లభించనున్నాయని రైల్వే అధికారులు గురువారం తెలిపారు. ప్రస్తుతం అమ్ముతున్న పుస్తకాలు, తినుబండారాలు, మందులతో పాటు వీటిని అమ్మవచ్చని, అయితే అవి ఎమ్మార్పీ ధరను మించరాదని స్పష్టంచేశారు. ఇంటి నుంచి వచ్చేటపుడు మాస్కు, శానిటైజర్ మర్చిపోయేవారు వీటిలో కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. రైళ్లలో ఇచ్చే బెడ్‌రోల్ కిట్స్ ఇకపై ఉండవని, ప్రయాణికులు వాటిని స్టాల్స్‌లో కొనుక్కోవాలని తెలిపారు. -
రైల్వే టీటీఈలకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: 137 ఏళ్లుగా రైల్లో తెల్ల డ్రెస్సుపై నల్ల కోటు ధరించి దగ్గరికొచ్చి టికెట్ చెక్ చేసే రైల్వే టికెట్ కలెక్టర్ రూపం కరోనా కారణంగా మారిపోనుంది. వీరికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను రైల్వే బోర్డు విడుదల చేసింది. ఇకపై వారు చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించి దూరంగా నిలబడి భూతద్దం ద్వారా టికెట్లను పరిశీలించనున్నారు. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న 100 జంట రైళ్లలో వీరు ఈ విధంగా కనిపించే అవకాశం ఉంది. కరోనా ముప్పును తగ్గించేందుకు టై, కోటును ధరించకుండా విధులు నిర్వహించాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అయితే పేరు కలిగిన ప్లేట్ మాత్రం ధరిస్తారని చెప్పింది. విధుల్లోకి వెళ్లే ముందు వీరికి థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఒకవేళ ఉద్యోగులకు శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉంటే ముందే చెప్పాల్సిందిగా కోరింది. వారికి తగిన మాస్కులు, ముఖానికి అడ్డు పెట్టుకునే కవచాలు, గ్లౌజులు, తలకు ధరించే కవర్లు, శానిటైజర్లు, సోపులు అందించనున్నట్లు చెప్పింది. టికెట్లను పరిశీలించేందుకు భూతద్దం ఇవ్వనున్నట్లు చెప్పింది. టికెట్లను తాకకుండా పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సీనియర్ టికెట్ కలెక్టర్ ఇంచార్జ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అవి రెగ్యులర్ రైళ్లు కాదు వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేరవేయడానికి ప్రవేశపెట్టిన శ్రామిక్ ప్రత్యేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లువెత్తుతున్న విమర్శలపై రైల్వేశాఖ వివరణ ఇచ్చింది. అవి రెగ్యులర్ రైళ్లు కాదని, వలస కూలీల అవసరాన్ని బట్టి వాటి గమ్యస్థానాన్ని పొడిగించడం లేదా కుదించడం.. దారి మళ్లించడం వంటివి చేస్తున్నామని, అందువల్లే కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. మే 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 3,840 ప్రత్యేక రైళ్లు నడిపామని, వీటిలో 52 లక్షల మంది ప్రయాణించారని రైల్వేబోర్డు చైర్మన్ వి.కె.యాదవ్ చెప్పారు. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు శ్రామిక్ రైళ్లలో ప్రయాణించకపోవడమే మంచిదని సూచించింది. మే 27న ఈ రైళ్లలో మరణించిన తొమ్మిది మందికి అంతకు ముందే ఆరోగ్య సమస్యలున్నట్టు తేలిందని వెల్లడించింది. ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నంబర్లు 139, 138కు ఫోన్ చేయాలని కోరింది. -
కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలనలో భాగంగా..
న్యూఢిల్లీ: రైల్వే బోర్డులో సమర్థతను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బోర్డు అధికారుల సంఖ్యను 200 నుంచి 150కి తగ్గించింది. డైరెక్టర్, ఆ పై స్థాయికి చెందిన 50 మంది అధికారులను వివిధ జోన్లకు బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పరిపాలన అనే ప్రధాని ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ అధికారుల సేవలను గరిష్టంగా వినియోగించుకునేందుకు వారిని వివిధ జోన్లకు బదిలీ చేశాం’ అని రైల్వే ఉన్నతాధికారి చెప్పారు. బోర్డులో అవసరమైన మేరకే సిబ్బంది ఉండాలన్నది నాటి ప్రధాని వాజ్‌పేయి ఆలోచన. బోర్డును పునర్వ్యవస్థీకరించాలని 2015లో డెబ్రాయ్ కమిటీ సిఫారసు చేసింది. రైల్వే శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వేసిన తొలి అడుగే రైల్వే బోర్డులో సిబ్బందిని తగ్గించడమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
రైల్వే బోర్డులో సంస్కరణలు
న్యూఢిల్లీ: రైల్వే బోర్డు త్వరలో పలు సంస్కరణలు చేపట్టనుంది. దీనిలో భాగంగా బోర్డు సభ్యుల సంఖ్యకు కోత విధించనుంది. బోర్డులో డైరెక్టర్, ఆపై స్థాయి అధికారులను వివిధ జోన్లకు బదిలీ చేయాలని భావిస్తోంది. రైల్వేల నిర్వహణ తీరును మెరుగుపరచడం కోసం ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైల్వే బోర్డులో 200 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో డైరెక్టర్, ఆపై స్థాయి అధికారులుగా ఉన్న 50 మందిని (25 శాతం) రైల్వే జోన్లకు బదిలీ చేయాలని భావిస్తున్నట్లు ఓ అధికారి ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం బోర్డులో చాలా మంది సభ్యులు ఉన్నారని వీరంతా దాదాపు ఒకేలాంటి పనులు చేస్తున్నారని తెలిపారు. జోన్లలో సీనియర్ ఆఫీసర్ల కొరత కూడా ఉండటంతో వీరిని అక్కడికి బదిలీ చేయాలని భావిస్తున్నామన్నారు. వంద రోజుల ఎజెండాలో భాగంగా ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రైల్వే బోర్డు చైర్మన్‌కు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. -
విశాఖ రైల్వే జోన్ లాభదాయకమే!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా (సౌత్ కోస్ట్) రైల్వే జోన్ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రైల్వే బోర్డుకు చేరింది. వాల్తేరు డివిజన్లోని ఏ ఒక్క ఉద్యోగినీ కదల్చనవసరం లేకుండా.. ఏడాదికి రూ.13 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చేలా ఓఎస్డీ ధనుంజయులు డీపీఆర్‌ను రూపొందించి రైల్వే బోర్డుకు అందించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆ నివేదిక ప్రతులను ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులకు, వివిధ విభాగాలకు అందించింది. వారి నుంచి రెండు వారాల్లో అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించనుంది. వీటన్నింటినీ క్రోడీకరించి తుది నివేదిక సిద్ధం చేస్తారు. అనంతరం కేంద్ర కేబినెట్లో ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత జోన్ కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభించాలని నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని వాల్తేరు రైల్వే అధికారులు చెబుతున్నారు. అంతా సక్రమంగా సాగితే.. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ జోన్ సేవలు ప్రారంభం కానున్నాయి. డీపీఆర్‌లో ముఖ్యాంశాలివీ - జోన్ కేంద్రంతో పాటు వాల్తేరు డివిజన్‌ను విభజించి, కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్‌ను రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. దీంతోపాటు ఏటా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వ్యయంతో అదనపు హంగులు సమకూర్చాలి - జోన్ ప్రధాన కార్యాలయానికి రూ.100 కోట్లు వెచ్చిస్తే సరిపోతుంది - జోన్ ఏర్పడితే రూ.13 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది - వాల్తేరు డివిజన్‌ను విభజించి.. రాయగడ డివిజన్ ఏర్పాటు చేసి.. మిగిలిన భాగాన్ని విజయవాడ డివిజన్లో విలీనం చేయాల్సి ఉంటుంది - వాల్తేరు డీఆర్ఎం కార్యాలయాల్ని జోన్ తాత్కాలిక ప్రధాన కార్యాలయంగా చేయాలి. ఏడాదిలోపు పూర్తి సదుపాయాలతో జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మించవచ్చు. - రాష్ట్రాల సరిహద్దుల్ని పరిగణనలోకి తీసుకోకుండా జోన్ హద్దుల నిర్ణయం - విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్‌తో కలిపి సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో 50 వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు - వాల్తేరు డివిజన్లో 18 వేల మంది ఉద్యోగులుండగా.. వీరిలో 930 మంది డీఆర్ఎం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. జోన్ వస్తే.. జోన్ కార్యాలయంలో 1,250 మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. అదనంగా ఉద్యోగులు అవసరం కాగా.. కేవలం 930 మందికి ఆప్షన్లు ఇస్తే సరిపోతుంది. క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది విశాఖ కేంద్రంగా ఉన్న జోన్లోనే పనిచేస్తారు - వాల్తేరు నుంచి కొత్త డివిజన్‌కు వెళ్తే.. ఉద్యోగులు కొత్త జోన్ పరిధిలోకే వస్తారు. వారి సీనియారిటీలో ఏ మాత్రం మార్పు లేకుండా ప్రమోషన్లు పొందేలా విధివిధానాలు - వాల్తేరు డివిజనల్ రైల్వే ఆస్పత్రిని ఆధునికీకరించి అత్యాధునిక వైద్య సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేయాలి - రాయగడ డివిజన్ ఏర్పాటు అంశాన్ని కూడా డీపీఆర్‌లో ప్రధానంగా పొందుపరిచారు - డివిజన్లోని డీజిల్, ఎలక్ట్రికల్ లోకో షెడ్లు, మెకానికల్ వర్క్ షాపులు, కోచ్ మెయింటెనెన్స్‌లను అప్‌గ్రేడ్ చేయాలి - జోన్ తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే రాష్ట్ర పరిధిలో 5 రైళ్లు, ఇతర ప్రాంతాలకు మరో 5 కలిపి మొత్తం 10 సర్వీసులు ప్రారంభించాలని భావిస్తున్నారు. -
ఈ బంధం ఇంతేనా?!
శతాబ్దానికిపైగా మహోజ్వల చరిత్ర.. ఆదాయంలో బంగారు బాతు.. ఎన్నో ప్రతిష్టాత్మక వ్యవస్థలు.. ఇవన్నీ వాల్తేర్ రైల్వే డివిజన్ సొంతం. ఇప్పుడవన్నీ చరిత్రలో కలిసిపోక తప్పదా?.. వాల్తేర్ డివిజన్ ఉనికి ఇక చరిత్రగానే మిగిలిపోనుందా??.. విశాఖతో డివిజన్ బంధం తెగిపోక తప్పదా???.. రైల్వే బోర్డు నుంచి వస్తున్న ఆదేశాలు.. ఈ ప్రశ్నలన్నింటికీ అవననే సంకేతాలనే ఇస్తున్నాయి. వాల్తేర్ డివిజన్ విభజన తథ్యమని చెబుతున్నాయి. ఆంధ్రుల చిరకాల డిమాండ్, రాష్ట్ర విభజన చట్టంలోని కీలక హామీ అయిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన కేంద్ర ప్రభుత్వం.. అదే సమయంలో.. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో మొట్టిన చందంగా.. వాల్తేర్ డివిజన్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ డివిజన్‌ను రెండుగా విభజించి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్లో కలపడం.. మరో భాగంతో ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయడం.. వంటి దురదృష్టకర నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఆగస్టు 31లోగా రాయగడ డివిజన్ ఏర్పాటుకు అవసరమైన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ దిశగా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ విచ్ఛిన్నాన్ని స్థానికులు, ప్రజాసంఘాలతోపాటు రైల్వే యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే జోన్ వచ్చిందన్న ఆనందం.. అదే ఉత్తర్వుల్లో కేంద్రం పెట్టిన మెలికతో నీరుగారిపోయింది. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను అడ్డంగా విడదీసి ఒక భాగాన్ని కొత్త జోన్ పరిధిలోకి వచ్చే విజయవాడ డివిజన్లో కలపాలని నిర్ణయించారు. మిగిలిన భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌గా మార్చాలని నిర్ణయించడం ద్వారా వాల్తేర్ డివిజన్ ఉనికే లేకుండా చేస్తున్నారు. ఆగస్టు 31లోగా కొత్త డివిజన్ తూర్పు కోస్తా జోన్ పరిధిలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు రైల్వే బోర్డు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వాల్తేరు డివిజన్ విభజన, కొత్త డివిజన్ ఏర్పాటు, నిర్వహణకు విధివిధానాలు రూపొందించాలని రైల్వేబోర్డు నుంచి తూర్పు కోస్తా జోన్ జనరల్ మేనేజర్‌కు ఆదేశాలు అందాయి. కొత్త డివిజన్ డీపీఆర్‌తోపాటు ఇతర వ్యవహారాల పర్యవేక్షణకు వెంటనే ఒక నోడల్ అధికారిని నియమించాలని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్రసింగ్ ఆదేశించారు. వాల్తేరు డివిజన్ అధికారులు, దక్షిణ కోస్తా జోన్ ఓఎస్డీతో కొత్తగా నియమితులయ్యే నోడల్ అధికారిని సమన్వయం చేసుకుంటూ కొత్త డివిజన్‌కు రూపకల్పన చేయాలని సూచించారు. దీనికి సంబంధించి పూర్తి నివేదికను ఆగస్టు 31లోగా తమకు అందించాలని సూచించారు. ఈ పరిణామాలతో వాల్తేరు డివిజన్ విభజన ఖరారయినట్లే. సింహభాగం ఆదాయం వాల్తేరుదే.. తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ బంగారు బాతులాంటిది. అతిపెద్దదైన ఈ డివిజన్ పరిధిలో ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు ఏటా సుమారు రూ. 15 వేల కోట్ల ఆదాయం వస్తుండగా.. ఇందులో రూ.7 వేల కోట్లు ఒక్క వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది తూర్పుకోస్తా ప్రధాన కేంద్రం భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. డివిజన్ ఆదాయంలో సింహభాగం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా ఇప్పుడు రాయగడ డివిజన్ సొంతమవుతుంది. ఉద్యోగులకూ తీవ్ర ఇబ్బందులు వాల్తేరు డివిజన్ ఉనికి కోల్పోతే దీని పరిధిలోని ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం డివిజన్లో 16,600 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నివాసముంటున్నారు. డివిజన్‌ను విడదీసి అటో ముక్క.. ఇటో ముక్క కలిపేస్తే వీరికి డివిజన్ కేంద్రం ఉండది. జోనల్ హెడ్ క్వార్టర్స్‌తో పనీ ఉండదు. జీత భత్యాలు, అలవెన్సుల్లో తేడాలొచ్చినా, సెలవు పెట్టాలన్నా, ఇతర సమస్యలున్నా విజయవాడ డివిజన్‌కు పరుగులు తీయాల్సిందే. ఇక రాయగడ డివిజన్‌కు కేటాయించే ఉద్యోగులు కుటుంబాలతో సహా అక్కడికి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఉద్యోగులకు ఇబ్బందికరమైన పరి ణామాలేనని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో అఖిల భారత ఓబీసీ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్‌తో పాటు వివిధ యూనియన్లు.. వాల్తేర్ డివి జన్ను కొనసాగించాలంటూ ఉద్యమాలు నిర్వహించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. డివిజన్ కొనసాగించాల్సిందే శతాబ్దానికిపైగా చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌ను ఉనికి లేకుండా విడదీయాలనుకోవడం సరికాదు. దీనివల్ల ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ డివిజన్‌కు భారతీయ రైల్వే చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ విషయంలో రాజీలేని పోరాటం చేస్తాం. ప్రజలు, అన్ని యూనియన్లు, వివిధ ప్రజాసంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. – డా. పెదిరెడ్ల రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి, ఆలిండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఇది సరైన నిర్ణయం కాదు వాల్తేరు డివిజన్ రద్దును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు. జోన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి.. ఆ సాకుతో చారిత్రక నేపథ్యం ఉన్న డివిజన్‌ను విడదీయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. వాల్తేరును విజయవాడలో విలీనం చెయ్యడం అవగాహన రాహిత్యం. దీని వల్ల వేల మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనిపై మరోసారి ఉద్యమాన్ని ఉధ్ధృతం చేస్తున్నాం. డివిజన్ విభజనను వ్యతిరేకిస్తూ.. బుధవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం. – బమ్మిడి దామోదరరావు, కార్యదర్శి, ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ -
రంగులేస్తారట.. వాటిపై యాడ్స్ అతికిస్తారట!
రైలు బోగీలకు అందమైన రంగులేస్తారట.. వాటిపై వ్యాపార ప్రకటనల స్టిక్కర్లు అతికిస్తారట.. స్టిక్కర్లు అతికిస్తే రంగులెలా కనిపిస్తాయి? ఇప్పుడు రైల్వేలో జరుగుతున్న వ్యవహారంపై వస్తున్న అనుమానమిది. ఇదేదో చిన్న విషయమైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. రూ.కోట్లలో ఖర్చయ్యే భారీ ప్రాజెక్టు కావటంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే జరిగితే రైల్వేలో చోటుచేసుకోబోతున్న భారీ దుబారా వ్యవహారమే కానుంది. సాక్షి, హైదరాబాద్: రైలు అనగానే.. ముదురు నీలం రంగులో ఉండే బోగీలు స్ఫురణకు వస్తాయి. అంతకుముందు ముదురు ఎరుపు రంగులో ఉండే బోగీలను, 1990లలో ముదురు నీలం రంగులోకి మార్చారు. దశాబ్దంనర దాటి పోవటంతో బోగీల రంగు మార్చాలని ఇటీవల మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ రైల్వే అనగానే.. తక్కువ వేగం, వసతులు అంతగా లేని అపరిశుభ్ర బోగీలు, కుదుపుల ప్రయాణం, మట్టిగొట్టుకుపోయిన స్టేషన్లు అనే అపవాదు ఉండటంతో, దీన్ని సమూలంగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం వేగంగా ప్రయాణించే రైళ్లను ప్రారంభించటంతోపాటు మెరుగైన వసతులు, శుభ్రంగా ఉండే బోగీలను కూడా అందుబాటులోకి తెచ్చారు. స్టేషన్లను కూడా శుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ రైల్వే కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీనికి తోడు బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి, ప్రధాన నగరాల మధ్య సెమీ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఇన్ని మార్పులతో రైల్వే శాఖ కొత్త రూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో రైళ్ల రూపు కూడా మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం శతాబ్ది, దురంతో, రాజధాని, వందేభారత్ లాంటి ప్రీమియర్ రైళ్లు మినహా మిగతా రైళ్లకు కొత్త రంగులద్దాలని నిర్ణయించారు. వేగం ఆధారంగా ఆయా కేటగిరీ రైళ్లకు వేర్వేరు రంగులు వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా ఏడెనిమిది డిజైన్లతో కొన్ని బోగీలకు రంగులద్దారు. వీటిని గతేడాది చివర్లో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పరిశీలించి కొన్ని మార్పులు సూచించి దాదాపు ఖరారు చేశారు. ఈలోపు ఎన్నికలు రావటంతో తాత్కాలికంగా దాన్ని నిలిపేశారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే కొత్త రంగులతో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఆదాయ పెంపు ఆలోచనతో... రైల్వేలో సమూల మార్పుల నేపథ్యంలో భారీగా వ్యయం అవుతుండటంతో ఆదాయాన్ని పెంచుకోవాలని రైల్వే బోర్డు తాపత్రయపడుతోంది. ఇందుకోసం సరుకు రవాణాపై దృష్టి పెట్టడంతోపాటు వాణిజ్య పరంగా కొత్త ఆలోచనలకు తెరదీసింది. ఇందులో భాగంగా బోగీలను పెద్ద కంపెనీలకు కాంట్రాక్టుకు ఇవ్వాలని నిర్ణయించింది. కాంట్రాక్టు సమయంలో ఆ కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రకటనల స్టిక్కర్లను బోగీలకు అతికించి ప్రచారం చేసుకుంటాయి. గతంలోనే ఈ ప్రయోగం జరిగినా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రకటనల గిరాకీ బాగా ఉంది. కానీ సాధారణ రైళ్ల విషయంలో అది ఆశించిన స్థాయిలో లేకపోవటంతో దాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు పెద్ద స్థాయిలో దాన్ని చేపట్టి బడా కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు. అలాంటప్పుడు రంగులేయడం ఎందుకు? బోగీలకు భారీ వ్యయంతో కొత్త రంగులు వేసిన తర్వాత వాటిపై కంపెనీల ప్రకటనల స్టిక్కర్లు అతికిస్తే రంగులు కనిపించే అవకాశం ఉండదు. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి రంగులేయటం ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇటీవల ఓ సమావేశంలో రైల్వే బోర్డులో కూడా ఇదే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. కానీ కేంద్ర ప్రభుత్వం రంగులేయాల్సిందేనన్న నిర్ణయం తీసుకున్నందున ఇప్పుడు ఈ వ్యవహారం భారీ దుబారాకు దారి తీస్తోందన్న విమర్శలు మొదలయ్యాయి. ప్రకటనలకు సంబంధించి ఇంకా రైల్వే మంత్రి స్థాయిలో సమీక్షించనందున, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ప్రకటనల రంగులతో బోగీలు కొత్త రూపు సంతరించుకున్నట్టు అనిపిస్తే ఇక రంగులేయాల్సిన అవసరం లేదని, కానీ ప్రకటనలు లేని బోగీలు పాత రంగులతో కనిపిస్తే ఉపయోగం ఏంటని ఆ అధికారి ప్రశ్నించారు. -
మహిళా అభ్యర్థులకు షాక్..!!
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వేలో ఉద్యోగం సాధించుకుందామనే మహిళా అభ్యర్థులకు రైల్వే శాఖ షాక్‌నిచ్చింది. కొన్ని రకాల ఉద్యోగాల్లోకి మహిళలను తీసుకోవద్దని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది నియామకాలు మరియు శిక్షణ శాఖ (డీఓపీటీ)కు లేఖ రాసింది. డ్రైవర్ (లోకో పైలట్), గార్డు, ట్రాక్‌మెన్, పోర్టర్ ఉద్యోగాల్లో కఠినమైన పరిస్థితులు, భద్రతా లోపాలు ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొంది. ఇప్పటికే ఆయా విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు కఠినమైన పని పరిస్థితులు ఎదుర్కొంటున్నామని తమ దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో భవిష్యత్‌లో సదరు ఉద్యోగాల్లో పురుషులకు మాత్రమే అవకాశం కల్పించాలని చెప్పింది. మహిళలపై వివక్షతో ఈ నిర్ణయం తీసుకోలేదని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఎస్ఎన్ అగర్వాల్ స్పష్టం చేశారు. కాగా, భారతీయ రైల్వేలో 13 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారిలో 2 నుంచి 3 శాతం మహిళా ఉద్యోగులున్నారు. వారిలో ఎక్కువ మంది కార్యాలయాల్లో పనిచేస్తుండటం గమనార్హం. విధి నిర్వహణలో ఇబ్బందులున్నాయని మహిళలకు మొండిచేయి చూపే బదులు.. వారి రక్షణకు రైల్వే శాఖ తగిన చర్యలు చేపడితే బాగుంటుందని పలువురు అధికారులు హితవు పలికారు. మహిళల రక్షణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఇండియన్ రైల్వేస్ లోకో రన్నింగ్ మెన్ సంస్థ ప్రెసిడెంట్ సంజయ్ పాండీ చెప్పారు. -
ఆర్పీఎఫ్కు అత్యాధునిక పరికరాలు
న్యూఢిల్లీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) ఆధునీకరణలో భాగంగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్పీఎఫ్ పోలీసులకు బాడీ కెమెరాలు, డ్రోన్లు, స్పై కెమెరాలు, వాయిస్ రికార్డర్ వంటి అత్యాధునిక పరికరాలు అందించేందుకు అంగీకరించింది. అలాగే ఈ అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసే అధికారాన్ని రైల్వే డివిజినల్, జోనల్ అధికారులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం డ్రోన్ కెమెరాలు, బ్యాగేజ్ స్కానర్లు, డ్రాగన్ సెర్చ్లైట్లు, ఫైరింగ్ సిమ్యులేటర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) ఆధారిత వ్యవస్థలు, కాల్ డేటా రికార్డర్, నైట్ విజన్ వంటి పరికరాలను డివిజినల్, జోనల్ అధికారులు కొనుగోలు చేయవచ్చు. -
పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల విధ్వంసం
ముంబై : తేజాస్ ఎక్స్‌ప్రెస్ విధ్వంసం గుర్తుండే ఉంటుంది. ఆకతాయిలైన ప్రయాణికులు, సీట్లకు ముందున్న ఎల్సీడీ స్క్రీన్లను ధ్వంసం చేయగా.. మరికొందరు హెడ్ఫోన్లను ఎత్తుకెళ్లారు. వ్యాక్యూమ్ టాయిలెట్‌ను కంపు కంపు చేశారు. ఈ సంఘటన ఇంకా మర్చిపోనే లేదు. అప్పుడే ముంబై-నాసిక్ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోనూ ఇదే రకమైన విధ్వంసకర వాతావరణం చోటు చేసుకుంది. ఈ రైలు సర్వీసును అప్‌గ్రేడ్ చేసిన నాలుగు నెలల్లోనే, ట్రే టేబుల్స్‌ను, కర్టెన్లను చెల్లాచెదురు చేశారు. అంతేకాక కిటికీలను పగులగొట్టారు. హెల్త్‌కు చెందిన రెగ్యులేటర్లను, కుళాయిలను, లగేజ్ ర్యాక్‌ల గ్లాస్‌లను ప్రయాణికులు బ్రేక్ చేశారు. చెత్తాడబ్బాలను, అద్దాలను ఎత్తుకుపోయారు. రైళ్లలో తరుచూ జరుగుతున్న ఈ సంఘటనలతో, సెంట్రల్ రైల్వే ఇప్పటికీ రిఫైర్ బిల్లుగా రూ.9 లక్షల మేర ఖర్చు చేసింది. ప్రయాణికులు వారికి అందిస్తున్న సౌకర్యాలను సరిగ్గా వినియోగించుకోవడం లేదని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఫిబ్రవరి 7న రైల్వే మంత్రిత్వశాఖ అన్ని జోనల్ రైల్వేస్‌కు ఒక లేఖ రాసింది. ఈ విషయాన్ని రైల్వే బోర్డు విచారణ జరుపుతుందని తెలిపింది. గంటకు 200 కిలోమీటర్ల స్పీడుతో, తేజాస్ ఎక్స్‌ప్రెస్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సెమీ-లగ్జీర ట్రైన్ అయిన దీన్ని గోవా నుంచి ప్రారంభించారు. గోవా నుంచి ఇది ముంబైకు ఒక ట్రిప్ వేసింది. ఇక అంతే తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు ఈ రైలు విండోలను పగలగొట్టారు. హెడ్ఫోన్లను దొంగలించారు. ఈ సంఘటనలతో రైళ్లలో అందిస్తున్న సౌకర్యవంతమైన సర్వీసులను తీసివేయాలని రైల్వే శాఖ భావించింది. అయితే రోజూ ట్రాక్‌లపై చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారని, అలాగని ముంబై సబ్అర్బన్ సర్వీసులను రైల్వే ఆపివేస్తుందా అని రైల్ యాత్రి పరిషద్ అధ్యక్షుడు సుభాష్ గుప్తా ప్రశ్నించారు. అలాగే పగిలిపోయిన ఎల్సీడీ స్క్రీన్లను మొత్తంగా తీసివేయడం కంటే, వాటిని బాగు చేయడం మంచిదని పేర్కొన్నారు. ఒకవేళ ఆ సౌకర్యాలను తీసివేస్తే, టిక్కెట్ ఛార్జీలను కూడా తగ్గించాలని ప్రయాణికుల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. -
రైల్వే కోచ్‌లపై స్వచ్ఛభారత్ లోగో
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మహా త్ముడిని స్మరిస్తూ అన్ని రైలు కోచ్‌లపై స్వచ్ఛభారత్ లోగోతో పాటు జాతీయ జెండాను ముద్రించనున్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. దీనికి సంబంధించి ‘స్వచ్ఛతా పక్వారా’పేరుతో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. దీని కోసం మహాత్మునితో ప్రత్యేక అను బంధం ఉన్న ప్రాంతాల్లోని 43 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. -
9న రైల్వే లోకోపైలట్, టెక్నీషియన్ పరీక్ష
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 26,502 అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ పోస్టులకు ఆగస్టు 9న మొదటి విడత కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. ఈ పరీక్షకు నాలుగురోజుల ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చంది. సాధారణ అభ్యర్థులకు 60 నిమిషాలు, దివ్యాంగులకు అదనంగా 20 నిమిషాల సమయాన్ని కేటాయించనున్నట్లు పేర్కొంది. -
వందేళ్లు నిండినవి 37 వేలు
న్యూఢిల్లీ : వందేళ్లు దాటిని రైలు బ్రిడ్జ్‌లు దేశంలో 37వేలు ఉన్నాయని, వీటలో 32శాతం ఉత్తర రైల్వే జోన్ పరిధిలోనే ఉన్నట్లు రాష్ట్ర రైళ్లశాఖ మంత్రి రాజెన్ గోహెయిన్ ప్రకటించారు. మొత్తం 37,162 బ్రిడ్జ్‌ల్లో ఉత్తర రైల్వే జోన్లో 8,691, సెంట్రల్ జోన్లో 4,710, తూర్పు జోన్లో 3,119, దక్షిణ సెంట్రల్ జోన్లో3,040, పశ్చిమ జోన్లో 2,858 బ్రిడ్జ్‌లు ఉన్నట్లు లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. రాజెన్ గోహెయిన్ మాట్లాడుతూ ‘వందేళ్లు పూర్తయినప్పటికి ఈ బ్రిడ్జ్‌లు మంచి స్థితిలోనే ఉన్నాయి. వీటిని పర్యవేక్షించడానికి ఆధునాతన సాంకేతికను వాడుతున్నాం. ప్రతి సంవత్సరం వర్ష కాలనికి ముందు ఒకసారి, తరువాత ఒకసారి పరిక్షిస్తాం. అవసరమయిన చోట ఈ బ్రిడ్జ్‌లకు మరమ్మత్తులు కూడా చేస్తాం. ఆ సమయంలో రైళ్ల వేగాన్ని తగ్గిస్తాం. గత 5 సంవత్సరాలలో 3,675 బ్రిడ్జ్‌లకు మరమత్తులు చేశారు. ఏప్రిల్1, 2017నాటికి 3,017 బ్రిడ్జ్‌ల మరమత్తులకు అనుమతించినట్టు’తెలిపారు. 2017, అక్టోబరులో దేశంలో మరమత్తుల అవసరం వున్న రైలు బ్రిడ్జ్‌లు సమాచారాన్నిఇవ్వాల్సిందిగా రైల్వేబోర్డు ఆదేశాలు జారీ చేసింది. క్షీణ స్థితిలో ఉన్న 252 బ్రిడ్జ్‌ల మీద రైళ్లు నిత్యం ప్రయాణిస్తున్నాయని, ఇది ప్రమాదకరం అని తెలిపింది. రైలు బ్రిడ్జ్‌లు నాణ్యతకు సంబంధించి మూడు రకాల రేటింగ్లను పాటిస్తారు. దీన్ని ఒవర్ ఆల్ రేటింగ్ (ఓఆర్ఎన్) 1, 2, 3గా విభజించారు. ఓఆర్ఎన్ - 1ఉన్న బ్రిడ్జ్‌లకు తక్షణ మరమత్తులు అవసరం. ఓఆర్ఎన్ - 2 ఉన్న బ్రిడ్జ్‌లను ప్రణాళి ప్రకారం మరమత్తులు చేయాలి. ఓఆర్ఎన్ - 3 ఉన్న బ్రిడ్జ్‌లకు ప్రత్యేక మరమత్తులు అవసరం ఉన్నట్టు అర్థం. -
జైపూర్‌లో ‘మహిళా’ రైల్వే స్టేషన్
జైపూర్: రాజస్తాన్ రాజధాని జైపూర్‌లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్‌ను ఇకపై పూర్తిగా ఉద్యోగినులే నిర్వహించనున్నారు. స్త్రీలకు సాధికారత కల్పించే ఉద్దేశంతో రైల్వే బోర్డు ఈ స్టేషన్లో టికెట్ తనిఖీ, ఆర్పీఎఫ్, రిజర్వేషన్ కార్యాలయం తదితర అన్ని విభాగాల్లోని ఉద్యోగాల్లోనూ మొత్తం మహిళలనే నియమించినట్లు వాయవ్య రైల్వే అధికారి చెప్పారు. శానిటరీ న్యాప్కిన్ వెండింగ్ మెషీన్లను ఈ స్టేషన్లో ఏర్పాటు చేశారు. గాంధీనగర్ స్టేషన్ గుండా రోజుకు 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. -
రైల్వే ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
న్యూఢిల్లీ: బిహార్‌లో నిరసనల నేపథ్యంలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని రైల్వే బోర్డు రెండేళ్లు పెంచింది. తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహించేందుకు ఓకే చెప్పింది. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, ట్రాక్‌మెన్ తదితర కేటగిరీల్లో దాదాపు 90 వేల ఉద్యోగాల భర్తీకి రైల్వే ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయోపరిమితిని తొలుత రైల్వే బోర్డు జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లుగా (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంది) నిర్ణయించింది. ఆందోళనల నేపథ్యంలో అన్ని కేటగిరీలకు గరిష్ట వయోపరిమితిని రెండేళ్లు పెంచింది. -
ఆన్లైన్లో రైళ్లు, బోగీల బుకింగ్
న్యూఢిల్లీ: పెళ్లి వేడుకలకు, విహార యాత్రలకు ఇకమీదట రైల్వే బోగీలను, ప్రత్యేక రైళ్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. ‘సింగిల్ విండో బుకింగ్’ విధానంలో ఫుల్ టారిఫ్ రేట్ (ఎఫ్టీఆర్) చెల్లించి బుక్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. ఇలాంటి బుకింగ్‌లపై 30 శాతం సేవా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద ప్రతి బోగీకి రూ.50,000 చెల్లించాలి. గతంలో కోచ్‌లు, రైళ్లను బుక్ చేసేందుకు సంబంధిత స్టేషన్ సూపర్వైజర్, స్టేషన్ మాష్టర్‌ను సంప్రదించాలి. ప్రయాణవివరాలన్నీ ఎఫ్‌టీఆర్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. డబ్బులు డిపాజిట్ చేశాక రసీదు ఇస్తారు. అయితే ఈ విధానమంతా గందరగోళంగా ఉందని, దీన్ని సవరించాలని ఫిర్యాదులు రావడంతో కొత్తగా ఈ విధానం తెచ్చారు. -
రైల్వే ఉద్యోగులకు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఉద్యోగుల్లో మనోధైర్యం, ఉత్సాహం పెంచడానికి ప్రత్యేక రివార్డులు, ప్రోత్సాహకాలు, బోనస్‌లు ఇవ్వాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఉత్తమ పనితీరు కనబరిచే వారికి మెరుగైన రివార్డులు ఇచ్చేలా పదోన్నతుల ప్రాతిపదికల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. నిపుణుల కమిటీ పలు సిఫార్సులతో సమర్పించిన నివేదిక రైల్వే బోర్డుకు చేరింది. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు వార్షిక పనితీరు మదింపు నివేదికలకు బదులు చివరి ఏడేళ్లలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఐదేళ్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సిబ్బంది తల్లిదండ్రులకూ వైద్య, ఉచిత ప్రయాణ సదుపాయాలు కల్పించాలంది. ఉన్నత విద్య కొనసాగించే ఉద్యోగులకు ఆర్థిక సాయం, దిగువ స్థాయి సిబ్బందికే కాకుండా ఏ, బీ గ్రేడ్ ఉద్యోగులకు బోనస్‌లు ఇవ్వాలని పేర్కొంది. కాగా, రైల్వేల్లో నిర్వహణ సమయంలో పాటిస్తున్న ప్రమాదకరమైన పద్ధతుల గురించి తెలియజేయాలని ఉద్యోగులందరికీ రైల్వే బోర్డు చైర్మన్ లేఖ రాశారు. -
పొగమంచులోనూ రైళ్లకు మరింత వేగం
న్యూఢిల్లీ: పొగమంచు వంటి అననుకూల వాతావరణ పరిస్థితుల్లోనూ రైళ్లను గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడపాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. పొగమంచు వంటి అవాంతరాలు ఎదురైన సందర్భాల్లో ప్రస్తుతం ఉన్న 60 కిలోమీటర్లకు బదులు 75 కి.మీ వరకు వేగంతో రైళ్లను నడిపేలా డ్రైవర్లకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు రైల్వే బోర్డు అన్ని జోన్ల అధికారులకు లేఖలు రాసింది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాక్ స్పష్టంగా కనిపించేందుకు అవసరమైన పరికరాలను వాడుకోవాలని సూచించింది. ఆర్థికంగా లాభసాటి కాని స్టేషన్లలో రైళ్లను ఆపవద్దని, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ పాయింట్లను, సమయాన్ని తగ్గించటం వంటి చర్యలతో వేగం పెంచుకోవాలని జోన్లకు తెలిపింది. -
ఎంపీలు ఒత్తిడి తెస్తే ‘జోన్’ ఖాయం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఎంపీలు సహకరిస్తే విశాఖ రైల్వే జోన్ త్వరగా వస్తుందని రైల్వే బోర్డు మెంబర్ జాన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్లో రైల్వేకు అధిక కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు వెయ్యి కోట్లు అవసరం ఉంటుందని, జోన్ నిర్ణయం జరిగితే ఈ బడ్జెట్లో కొంత కేటాయింపులు జరుగుతాయని వివరించారు. జోన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ విశాఖ ఎంపీలు రైల్వే బోర్డుపై ఒత్తిడి తేవడం లేదని, వారు ఒత్తిడి తెస్తే జోన్ సమస్య పరిష్కారం అవుతుందని వ్యాఖ్యానించారు. ఎంపి హరిబాబు బోర్డు వద్ద జోన్ అంశం ప్రస్తావనకు తేలేదని, వేరే సమస్యలు తప్ప విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ఆయన కూడా మాట్లాడటం లేదని ఆయన అన్నారు. -
ముందస్తు’తో చౌక ప్రయాణం
న్యూఢిల్లీ: ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న రైలు ప్రయాణికులు విమాన ప్రయాణికుల మాదిరిగా రాయితీలు పొందే అవకాశాలున్నాయి. టికెట్ ధరల సమీక్షపై ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సూచనలతో ఇటీవల తన నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. కమిటీ ప్రతిపాదించిన వాటిలో ముఖ్యమైనవి.. ► నెలరోజుల ముందుగా సీట్లు బుక్ చేసుకునే వారికి అప్పటికి ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్యను బట్టి టికెట్ ధరలో 50 శాతం నుంచి 20 శాతం వరకు రాయితీ. ► రైలు ప్రయాణానికి రెండు రోజుల నుంచి రెండు గంటల ముందు వరకు బుక్ చేసుకున్న టికెట్లపైనా స్లాట్ ప్రకారం తగ్గింపు. ► ప్రయాణానికి రెండు రోజుల ముందు నుంచి రెండు గంటల ముందు వరకు బుక్ చేసుకున్న వారికి రాయితీ. ► దివ్యాంగులు, గర్భిణులు, వృద్ధులకు మాత్రం ఎలాంటి అదనపు చార్జీ లేకుండానే లోయర్ బెర్తు. ► అర్ధరాత్రి నుంచి వేకువజాము 4 గంటల మధ్య, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటలకు మధ్య కాకుండా సౌకర్యంగా ఉండే ఉదయం వేళల్లో గమ్య స్థానానికి చేరుకునే రైలు ప్రయాణికులపై అదనపు చార్జీ. ► ప్రయాణికుల డిమాండ్, రైళ్లను బట్టి జోనల్ స్థాయిలో టికెట్ ధర నిర్ణయం. ► రద్దీ ఉండే పండుగ రోజులు, సెలవు దినాల్లో ఎక్కువ ఛార్జీలు. అంతగా రద్దీ ఉండని సమయాల్లో టికెట్ ధరపై తగ్గింపు. ► ప్రీమియం రైళ్లు, ప్యాంట్రీకార్ ఉండే రైళ్లలో టికెట్ ధర 50 శాతం వరకు పెంపు. -
సిబ్బందిలో జవాబుదారీతనం పెంచాలి
హైదరాబాద్: సమయానుకూలమైన మార్పు చేర్పులు, పటిష్టమైన సంస్థాగత నిర్మాణం, చక్కటి పని సంస్కృతితో సంస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని భారత రైల్వే బోర్డ్ చైర్మన్ అశ్వనీ లోహాని అన్నారు. సిబ్బందికి పూర్తి పని స్వేచ్ఛ ఇస్తూ జవాబుదారీతనం పెంచడం ద్వారా చక్కటి పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఎర్రమంజిల్‌లోని ఆస్కీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ‘ఆస్కీ 61వ ఫౌండేషన్ డే లెక్చర్’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సిబ్బందిలో నీతి, నిజాయితీతో పనిచేసే సంస్కృతిని ప్రోత్సహించాలని కోరారు. ఉద్యోగులను ప్రోత్సహించడం, వారి ప్రతిభకు తగిన అవకాశాలు కల్పించడం ద్వారా సంస్థను అద్భుతంగా ముందుకు నడపవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య, డైరెక్టర్ ఆర్‌హెచ్.ఖ్వాజా లోహానిని సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఇక నుంచి రైల్వే ఉద్యోగులకు ఆస్కీలో శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బాగుంది.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బాగుందని అశ్వనీ లోహాని కితాబిచ్చారు. బుధవారం ఆయన సికింద్రాబాద్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల సదుపాయాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది సేవలను అభినందించారు. రూ.లక్ష నగదు బహుమతిని అందజేశారు. అనంతరం చీఫ్ మెకానికల్ ఇంజనీర్ అర్జున్ ముండియా, చీఫ్ వర్క్‌షాపు మేనేజర్ ఎం.విజయ్‌కుమార్ ఆయనకు లాలాగూడలోని సీడబ్ల్యూఎస్ వర్క్‌షాప్ పనితీరును వివరించారు. అనంతరం రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డివిజినల్ రైల్వేమేనేజర్లతో మాట్లాడారు. -
ఇక బోగీలపై రిజర్వేషన్ చార్టులుండవ్..!
సాక్షి, హైదరాబాద్: ప్లాట్‌ఫాంపైకి ఎక్స్‌ప్రెస్ రైలొచ్చి ఆగింది.. ప్రయాణికులు హడావుడిగా తలుపు వద్ద అతికించిన రిజర్వేషన్ చార్టులో సీటు నంబర్ చూసుకుని తీరిగ్గా కోచ్‌లోకి చేరుకున్నారు.. మరికొద్ది రోజుల్లో ఈ దృశ్యం కనిపించకపోవచ్చు. బోగీలపై రిజర్వేషన్ చార్టు అతికించే విధానాన్ని ఎత్తేయాలని కేంద్రం నిర్ణయించింది. ‘క్లీన్ రైల్వే’లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశంలోని 7 స్టేషన్లలో 4 రోజుల క్రితం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రయాణికుల స్పందన ఆధారంగా అమలుపై నిర్ణయం తీసుకోనుంది. ఖర్చు భారీగానే.. పైకి చిన్న విషయంగానే కనిపిస్తున్నా.. చార్టులకు భారీగానే ఖర్చవుతోంది. రూ.లక్షల్లో ఖర్చుతోపాటు వేల సంఖ్యలో పేపర్ రోల్స్ వాడాల్సి వస్తోంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరే రైళ్లపై చార్టులు అతికించేందుకు సాలీనా రూ.35 లక్షలకుపైగా ఖర్చవుతోంది. ఇందుకు దాదాపు 6,000 పేపర్ రోల్స్ వినియోగిస్తున్నారు. ఇప్పుడు క్షణాల్లో సెల్‌ఫోన్‌కు.. సాధారణంగా రైలు టికెట్ బుక్ చేసుకున్నపుడు కన్ఫర్మ్ ఐతే సీటు/బెర్తు నంబరు తెలిసేది. వెయిటింగ్ లిస్టులో ఉండి అనంతరం కన్ఫర్మ్ ఐతే సీటు/బెర్తు తర్వాత తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారి కోసం బోగీలపై రిజర్వేషన్ చార్టులు అతిచించడాన్ని రైల్వే ప్రారంభించింది. కొద్ది కాలం తర్వాత దీన్ని ప్రైవేటీకరించి కాంట్రాక్టర్లకు అప్పగించింది. అయితే ఇప్పుడు బెర్తుల వివరాలు క్షణాల్లో సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో అందుతున్నందున చార్డుల ఖర్చు, కాగితం వృథా సరికాదని.. కాబట్టి చార్టుల విధానం ఎత్తేయాలని కేంద్రం తీర్మానించింది. బెంగళూరులో గతేడాదే.. ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్, సెంట్రల్ ముంబై, ఛత్రపతి శివాజీ టెర్మినస్, హౌరా, వాల్దా, చెన్నై సెంట్రల్, ఎగ్మోర్ స్టేషన్లలో 4 రోజుల క్రితం ప్రయోగాత్మకంగా చార్టుల ఎత్తివేతను రైల్వే ప్రారంభించింది. బెంగళూరు డివిజన్ అధికారులు గతేడాది నుంచే దీన్ని అమలు చేస్తున్నారు. ఈ ఏడు స్టేషన్ల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి పూర్తిస్థాయిలో అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించి అన్ని జోన్లకు సమాచారం అందించింది. స్వచ్ఛ భారత్‌కు వ్యతిరేకం.. రోజూ పాత చార్టు తొలగించి కొత్త చార్టు అతికించే క్రమంలో ఆ ప్రాంతం అసహ్యంగా మారడంతో కడగాల్సి వస్తోంది. అందుకు సిబ్బంది వినియోగం కూడా పెరుగుతోంది. పైగా ‘చార్టు’ విధానం స్వచ్ఛ భారత్‌కు విరుద్ధమని రైల్వే బోర్డు అభిప్రాయపడుతోంది. చార్టు లేకున్నా సెల్‌ఫోన్‌కు వచ్చే సమాచారం, స్టేషన్లలో డిస్ప్లే బోర్డుల్లో ఉంచటం, 139 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకునే వెసులుబాటు ఉన్నందున ఆ విధానం ఎత్తేయటం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని బోర్డు భావిస్తోంది. అయితే సెల్‌ఫోన్ వినియోగించని వారికి చార్టు లేకుంటే ఇబ్బంది ఉంటుందన్న వాదనా ఉంది. -
నిరుద్యోగులతో రైల్వే బోర్డు చెలగాటం
అనంతపురం ఎడ్యుకేషన్ : సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు ఇటీవల ఐటీఐ కోర్సుల అర్హతతో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17లోగా దర ఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులు నేరుగా కాకుండా జిల్లా కేంద్రంలోని ఎంప్లాయింట్ అధికారి కార్యాలయం, లేదా ప్రభుత్వ ఐటీఐ ద్వారా పంపాలని పేర్కొంది. దీంతో జిల్లాలో ఐటీఐ పూర్తయిన అభ్యర్థులు రోజూ వందలాది మంది ఎంప్లాయిమెంట్, ఐటీఐ కళాశాలకు వస్తున్నారు. అయితే ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో వారు దరఖాస్తులు తీసుకోకుండా తిరస్కరిస్తున్నారు. ఐటీఐ, ఎంప్లాయిమెంట్ కార్యాలయం అధికారుల వాదన మరోలా ఉంది. తమకు రైల్వే నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని ఈ పరిస్థితుల్లో తాము దరఖాస్తులు తీసుకునేందుకు వీలుకాదని స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థుల నుంచి తాము దరఖాస్తులు స్వీకరించి వాటిని బోర్డుకు పంపితే ఒకవేళ తిరస్కరణకు గురైతే అభ్యర్థులు నష్టపోతారని, అందుకు బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
పరిశీలనలో విశాఖ రైల్వే జోన్
రైల్వే బోర్డు సభ్యులు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అంశం ఇంకా తమ పరిశీలనలోనే ఉందని రైల్వే బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.శుక్రవారం తెలుగు మీడియా ప్రతినిధులతో బోర్డు సభ్యులు మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై బోర్డు సభ్యులు స్పందిస్తూ.. ‘రైల్వే జోన్ ఇవ్వడం వల్ల ఏపీకి ఏం లాభం? జోన్ ఏర్పాటు వల్ల ఏపీకి ఉద్యోగాలు కానీ, ఆదాయం కానీ రాదు కదా? అని ఎదురు ప్రశ్నించారు. దీనిపై రైల్వే బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటైందని చెప్పారు. భువనేశ్వర్ – మైసూర్, హౌరా – యత్వంత్‌పూర్ మధ్య నడిచే అంత్యోదయా రైళ్లకు ఏపీలో పలుచోట్ల హాల్ట్ ఇస్తున్నట్టు తెలిపారు. ఏపీకి రాజధాని రైలును ఎప్పుడు కేటాయిస్తారని ప్రశ్నించగా.. ‘ముందు మీ రాష్ట్ర రాజధాని నిర్మాణం పూర్తి కానివ్వండి.. తర్వాత మా రాజధాని రైలును కేటాయిస్తామ’ని సభ్యులు చమత్కరించారు. -
2019కి ‘వ్యాగన్ పిరియాడికల్’ పూర్తి
డిప్యూటీ సీఎం కడియంకు రైల్వే బోర్డ్ మెంబర్ గుప్తా హామీ సాక్షి, న్యూఢిల్లీ: కాజిపేట్లో వ్యాగన్ పిరియా డికల్ ఓవరాలింగ్ యూనిట్‌ను 2019 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి రైల్వే బోర్డు మెంబర్ రవీంద్ర గుప్తా హామీ ఇచ్చారు. మంగళవారం ఈ మేరకు కడియం, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతి నిధులు రామచంద్ర తేజోవత్, వేణుగోపాల చారి, ఎంపీ సీతారాం నాయక్ తదితరులు రవీంద్ర గుప్తాతో సమావేశమై రాష్ట్రంలోని వివిధ రైల్వే డిమాండ్లపై చర్చించారు. అలాగే కాజీపేటలో వ్యాగన్ పిరియాడికల్ ఓవరాలింగ్ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్రం తరఫున 160 ఎకరాల కేటాయింపునకు సంబంధిం చిన ఉత్తర్వులను ఆయనకు అందించారు. గుప్తా స్పందిస్తూ.. రూ.300 కోట్ల నిధులతో 2019 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు పెరుగు తున్న రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి వద్ద మూడో టెర్మినల్‌ను ఏర్పా టు చేయాలని కోరినట్టు కడియం తెలిపారు. చర్లపల్లి వద్ద కేంద్ర ప్రభు త్వానికి చెందిన భూమి ఉందని, అందులో 250 ఎకరాలను టెర్మినల్ ఏర్పాటుకు రైల్వేకు ఇవ్వాలని ఇప్పటికే కోరామన్నారు. ఇల్లం దుకు సింగరేణి ప్యాసింజర్ రైలును పునః ప్రారంభించాలని కోరినట్టు ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. పాండురంగపురం– సారపాకకు మధ్య 13 కిలోమీటర్ల ట్రాక్ వేస్తే భద్రాచలం దేవాలయానికి దేశవ్యాప్తంగా ప్రజలు రావడానికి అవకాశం ఉంటుందని వివరించినట్టు చెప్పారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గుప్తా హామీ ఇచ్చారని తెలిపారు. -
సిగ్నలింగ్ పనుల్లో జాగ్రత్త అవసరం
రైల్వే బోర్డు డెరైక్టర్ జనరల్ అఖిల్ అగర్వాల్ సాక్షి, హైదరాబాద్: రైల్వేలో సిగ్నలింగ్, టెలికం వ్యవస్థల లక్ష్యం భద్రతే అరుునందున దానికి సంబంధించిన పనులను జాగ్రత్తగా నిర్వహించాలని రైల్వే బోర్డు డెరైక్టర్ జనరల్ (సిగ్నల్, టెలికం) అఖిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆ పనులు ప్రామాణికంగా ఉంటున్నాయా? లేదా? అన్న విషయాన్ని బాధ్యులైన అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఆదివారం రైల్ నిలయంలో అఖిల భారత రైల్వే సిగ్నల్, టెలికం ఇంజనీర్ల సమావేశంలోనూ.. అలాగే తార్నాకలోని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలి కమ్యూనికేషన్స(ఇరిసెట్) 59వ వార్షికోత్సవంలోనూ అఖిల్ అగర్వాల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ రైల్వే రవాణాలో కీలక మార్పులు తేవడంలో ఇరిసెట్ అందిస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. సిగ్నలింగ్ వ్యవస్థ మరింత పటిష్టమైన సేవలు అందించేందుకు కావాల్సిన నిపుణులకు తర్ఫీదును ఇవ్వడంలో తన వంతు పాత్ర పోషిస్తోందన్నారు. 1957లో ప్రారంభమైన ఇరిసెట్ ఇప్పటి వరకు సుమారు 7,260 మందికి సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహణలో శిక్షణ ఇచ్చిందన్నారు. ఇక్కడ 121 కోర్సుల్లో శిక్షణ ఇస్తూ.. సిగ్నలింగ్ వ్యవస్థలో నూతన మార్పులకు ఇరిసెట్ శ్రీకారం చుట్టిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా మాట్లాడుతూ.. సిగ్నలింగ్ వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన ఇరిసెట్ సేవలను మరింత విస్తరించాలని కోరారు. ఈ సందర్భంగా ఇరిసెట్ సావనీర్‌ను విడుదల చేశారు. అలాగే సిగ్నలింగ్ వ్యవస్థలో ఉత్తమ సేవలు అందించిన 18 మంది అధికారులను ఘనంగా సన్మానించారు. సమావేశంలో రైల్వే బోర్డు అదనపు సభ్యుడు(సిగ్నలింగ్) కాశీనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు అరవింద్ మిట్టల్, గోయల్, శోభన్ చౌదరి, సునీల్‌గుప్తా, ఇరిసెట్ డెరైక్టర్ ఎంఎస్ మహబూబ్అలీ తదితరులు పాల్గొన్నారు. -
డబుల్ డెక్కర్ రైలు ఔట్!
- భాగ్యనగరం నుంచి తిరుపతి, గుంటూరు సర్వీసుల ఉపసంహరణ - హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు తరలించాలని రైల్వే బోర్డు నిర్ణయం - జూన్ 30 వరకు విశాఖ-తిరుపతి మధ్య ట్రయల్ రన్ - ఆక్యుపెన్సీ రేషియో లేదని ఈ నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డబుల్ డెక్కర్ రైలు దారిమళ్లింది. దానిని విశాఖపట్నానికి తరలించాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. వేరే రాష్ట్రాల లాబీయింగ్‌ను అధిగమించి సాధించుకున్న ఈ సూపర్‌ఫాస్ట్ రైలుకు రైల్వే యంత్రాంగం ప్రణాళికాలోపం కారణంగా ఆదరణ కరువైంది. హైదరాబాద్ (కాచిగూడ) నుంచి వారంలో రెండు రోజులు తిరుపతి, మరో రెండు రోజులు గుంటూరుకు తిరుగుతున్న ఈ రైలు ఆక్యుపెన్సీ రేషియో అతి తక్కువగా నమోదవుతోంది. దీంతో హైదరాబాద్ నుంచి శాశ్వతంగా దాన్ని రద్దు చేసి విశాఖపట్నం నుంచి తిరుపతికి నడపాలని తాజాగా నిర్ణయించింది. దీంతో ఈ నెల 12 నుంచి 30 వరకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయాన్ని వెల్లడించకుండా సాంకేతిక కారణాల రీత్యా 12 నుంచి 30 వరకు తాత్కాలికంగా హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-గుంటూరు మధ్య సర్వీసులు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దీలేని మార్గంలో నడపడం వల్లే.. హైదరాబాద్-విజయవాడ, విశాఖపట్నం మధ్య నిత్యం విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు చాలకపోవడంతో నెలరోజుల ముందే వెయిటింగ్ జాబితా సిద్ధమవుతుంది. దీంతో ఈ మార్గంలో అదనంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో డబుల్‌డెక్కర్ రైలును ఈ రద్దీ మార్గంలో నడపాలి. కానీ అధికారులు ముందస్తు సర్వే నిర్వహించకుండా కాచిగూడ-గుంటూరు మార్గంలో దానిని నడిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా విజయవాడ, ఆ తర్వాత గుంటూరుకు నడిపినామెరుగ్గా ఉండేది. కానీ నడికుడి మీదుగా గుంటూరు వరకే నడపడంతో ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉంది. తిరుపతి వంటి దూరప్రాంతానికి రాత్రిపూట ఎక్కువగా ప్రయాణిస్తారు. కానీ, సీటింగ్ వసతి మాత్రమే ఉన్న డబుల్ డెక్కర్ రైళ్లనేమో పగటివేళ నడుపుతారు. దీంతో ఈ మార్గంలో ఆక్యుపెన్సీ 30 శాతం నమోదవుతోంది. మార్గం, సమయాల్లో మార్పులు చేయకుండా ఏకంగా హైదరాబాద్ నుంచి సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించడం గమనార్హం. తరలిన డబుల్ డెక్కర్ రైలును తొలుత విశాఖపట్టణం, దువ్వాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుపతి వరకు నడపనున్నారు. రూట్ సర్వే నిర్వహించిన తర్వాత దాన్ని రోజూ నడపాలా... లేదా.. వారంలో రెండు పర్యాయాలు నడిపి మరో రెండు రోజులు వేరే రూట్లో నడపాలా అనే దానిని నిర్ణయిస్తారు. -
నేడు విశాఖలో ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
-
అదిగదిగో ఏపీ ఎక్స్‌ప్రెస్
ఏపీ ఎక్స్‌ప్రెస్ నేడు ప్రారంభం ఎట్టకేలకు కల సాకారం నగరం నుంచే పట్టాలపైకి.. ఆగమేఘాల మీద ఏర్పాట్లు ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు ముహూర్తం ఖరారైంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కనుంది. విశాఖ వాసులు ఆశించినట్లుగానే ఇక్కడ నుంచే నడవనుంది. నేటి ఉదయం ఈ రైలును ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. 16 బోగీల ఈ ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం రాత్రి విశాఖ కోచింగ్ కాంప్లెక్స్ చేరుకుంది. గత బడ్జెట్లో విజయవాడ నుంచి బయలుదేరుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడి ఒత్తిళ్లకు రైల్వే బోర్డు తలొగ్గింది. విశాఖ నుంచే నడపాలని పచ్చజెండా ఊపింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ఈ రైలును ప్రారంభించినట్టు ప్రకటిస్తారు. 14 నుంచి అధికారికంగా టికెట్లుజారీ అవుతాయయి. ప్రారంభోత్సవం రోజు జనరల్ టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు రైలులో రిజర్వేషన్‌ఛార్జీ వసూలు చేస్తారు. - విశాఖపట్నం సిటీ ఆగే స్టేషన్లు: దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, రామగుండం, తిరుపూర్, కాగజ్‌నగర్, బల్లార్స, చంద్రపూర్, నాగపూర్, ఇటార్సి, బోపాల్, జాన్సీ, గ్వాలియర్, ఆగ్రా స్టేషన్లమీదుగా.. విశాఖపట్నం-ఢిల్లీ ఏసీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (22415) విశాఖ నుంచి : బుధ,శుక్ర, ఆదివారాలు సమయం: ఉదయం7.45 గంటలు ఢిల్లీ చేరిక: మర్నాడు రాత్రి 7 గంటలు బోగీలు: ఫస్ట్ ఏసీ 1, సెకండ్ ఏసీ 5, థర్డ్‌ఏసీ 7, కిలోమీటర్లు : 2099 తిరుగు ప్రయాణం ఢిల్లీ-విశాఖపట్నం ఏసీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (22416): ఢిల్లీ నుంచి: సోమ, బుధ, శుక్రవారాల్లో సమయం: ఉదయం 6.40 గంటలకు విశాఖ చేరిక: మర్నాడు సాయంత్రం 6.45 గంటలకు -
ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎటు?
- ప్రయాణ మార్గంపై ఇంకా రాని స్పష్టత - రెండు జోన్ల మధ్య సమన్యయ లోపం - ఫలితంగా ఆలస్యమవుతున్న వైనం - అంతా ఓకే అయితే సెప్టెంబర్‌లో కూత విశాఖపట్నం సిటీః ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను విశాఖ నుంచి నడిపేందుకు రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. దక్షిణ మధ్య రైల్వేకి ఈమేరకు బోర్డు నివేదించినట్లు తెలిసింది. అయితే విశాఖ నుంచి ఏ మార్గంలో నడపాలో స్పష్టత కొరవడింది. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు 18 నుంచి 20 గంటలు పడుతుంది. రాయగడ మీదుగా అయితే రెండు మూడు గంటల సమయం తగ్గుతుంది. విజయవాడ మీదుగా ప్రయాణిస్తే 20 గంటల సమయం తీసుకుంటుంది. విశాఖ నుంచి ఇప్పటికే నాలుగు రైళ్లు రాజధానికి నడుస్తున్నాయి. సమతా, హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌లు రాయగడ మీదుగా నడుస్తున్నాయి. దక్షిణ్ లింక్, స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లు విజయవాడ మీదుగా నడుస్తున్నాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్ కూడా తోడయితే అయిదు రైళ్లు అవుతాయి. ఇప్పుడు ఈ రైలు ఏ మార్గం గుండా బయల్దేరుతుందనేది సమస్యగా తయారైంది. 2014లో బడ్జెట్లో ప్రకటించిన ఈ రైలు ఎటు నడపాలో తెలియక ఆలస్యమవుతోందని రైల్వే వర్గాలంటున్నాయి. మార్గంపై స్పష్టత రాకపోవడం వెనుక దక్షిణ మధ్య, తూర్పు కోస్తా రైల్వేల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. విజయవాడ మీదుగా నడిపితే తూర్పు కోస్తా రైల్వేకు భారమవుతుంది. అందుకే రాయగడ మీదుగా నడిపేందుకు ప్రయత్నిస్తోంది. విజయవాడ మీదుగా నడిపితే నిర్వహణ విశాఖకే వస్తుంది. ఆదాయం మాత్రం దువ్వాడ వరకే అంటే 20 కిలోమీటర్లే ఉండడంతో ఆశించినంత ఆదాయం రాదని భావిస్తున్నట్టు తెలిసింది. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉండేలా రైలును తూర్పు కోస్తాకే ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.ఎంపీ హరిబాబు ఈ రైలును విజయవాడ మీదుగా నడిపేందుకే మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ భాగం కవరవుతుందనేది ఆయన వాదన.ఏమైనప్పటికీ రెండు జోన్ల మధ్య సమన్వయం కుదిరితే సెప్టెంబర్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కవచ్చంటున్నారు. ఆగస్టు ఆఖరి వారంలోనైనా ప్రారంభమయ్యే అవకాశముంది. రైల్వే టైం టేబుల్ పట్టికలో ఇంతవరకూ ఈ రైలుకు స్థానం కల్పించలేదు. వచ్చే సెప్టెంబర్‌లో విడుదలయ్యేపట్టికలో ఈ రైలు రాకపోకల వేళలు ప్రకటించే అవకాశాలున్నాయి. అప్పటికి గానీ ఈ రైలు ఏ మార్గంలో ఎన్ని గంటలకు ఎక్కడి నుంచి ఎక్కడికి బయల్దేరుతుందో తెలియదంటున్నారు. -
ఏపీ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కేది ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చడం, నవంబరు 15 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో ఇప్పుడు ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కడ్నుంచి నడపాలనే అంశం తెరపైకి వచ్చింది. విజయవాడ నుంచి నడపాలా? విశాఖ నుంచి నడిపించాలా? అన్న అంశంలో తకరారు నడుస్తోంది. ఈ పంచాయితీ తాజాగా రైల్వే బోర్డుకు చేరింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గతేడాది రైల్వే బడ్జెట్లోనే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచే నడుపుతామని రైల్వేశాఖ ప్రకటించింది. అప్పట్లోనే రెండు మూడు నెలల్లో ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచే నడుపుతామని ప్రకటించారు. ఈ మేరకు రైల్వే రేక్‌లను కేటాయించారు. విజయవాడ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు అంతా సిద్ధం చేసిన తర్వాత విశాఖపట్టణం నుంచే రైలును నేరుగా ఢిల్లీ నడపాలని అక్కడి ప్రజా ప్రతినిధులు పట్టుబడుతున్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్ కూడా రాదా? విశాఖకు రైల్వేజోన్ సాధించుకొస్తామని ప్రతిజ్ఞ చేసిన టీడీపీ, బీజేపీ నేతలు అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు కనీసం దేశ రాజధానికి వేళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను విశాఖనుంచే నడపాలనే డిమాండ్ తేవడంతో రైలును ఎక్కడ్నుంచి నడపాలనే అంశంలో పీటముడి పడింది. అటు రాయలసీమ నుంచి, ఇటు ఉత్తరాంధ్ర నుంచి కొన్ని బోగీలు కలిపి విజయవాడ నుంచి నడిపేందుకు ఇక్కడి రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఉత్తరాంధ్ర వాసులు పట్టుబట్టడంతో పంచాయితీ రైల్వే బోర్డుకి చేరింది. తిరుపతి నుంచి, విశాఖపట్టణం నుంచి బోగీలను విజయవాడలో కలిపి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని విజయవాడ ప్రాంత ప్రతినిధులు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి. -
డీజిల్ షెడ్‌కు టాటా!
గుంతకల్లు : భారతీయ రైల్వేలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న గుంతకల్లు డీజిల్‌షెడ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యుదీకరణ ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో విద్యుత్ లోకోషెడ్ నిర్మాణం త్వరితగతిన సాగుతోంది. ఇది పూర్తి కాగానే ఇక్కడి డీజిల్షెడ్ను గుత్తిలో ఉన్న షెడ్లో విలీనం చేయడం దాదాపు ఖాయం. దక్షిణ మధ్య రైల్వేలో ఏకైక మీటర్ గేజ్ షెడ్‌గా కొనసాగి.. డీజిల్‌షెడ్ రూపాంతరం చెంది, డీఆర్ఎం స్థారుు నుంచి రాష్ట్రపతి వరకు అనేక మంది నుంచి అవార్డులు పొందింది. నాటి నుంచి నేటి వరకు.. గుంతకల్లులో మీటర్‌గేజ్ డీజిల్‌షెడ్ నిర్మించాలని 1963 జూన్‌లో రైల్వే శాఖ నిపుణుల కమిటీ గుర్తించడంతో అదే ఏడాది నవంబర్‌లో రైల్వే బోర్డు అనుమతి మంజూరు చేసింది. అప్పటి సదరన్ రైల్వే జీఎం హెచ్డి సింగ్ ఆధ్వర్యంలో 1964 ఆగస్టు 30న డీజిల్ షెడ్ ఏర్పాటు పనులు ప్రారంభించి ఎనిమిది మాసాల్లో పూర్తి చేశారు. తొలుత 11 మీటర్ గేజ్ మార్గపు రైలింజన్లతో షెడ్ ప్రారంభమైంది. ఈ డీజిల్‌షెడ్‌కు చెందిన ఎంజీ రైలింజన్లు గుంతకల్లు, బెంగుళూరు, హుబ్లీ, గోవా, గుంటూరు, బెజవాడ, ధర్మవరం, పాకాల, తిరుపతి, తిరుచనాపల్లితోపాటు దేశంలోని సుదూర ప్రాంతాలైన ఔరంగబాద్, ఖాండవ, అంకోలాకు ప్రయాణించేవి. యూనిగేజ్ ప్రభావంతో గుంతకల్లు డీజిల్షెడ్ను 1995 అక్టోబర్ 18న అప్పటి దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ ఎం.ఎం.ఫరూఖ్ బ్రాడ్‌గేజ్‌గా మార్పు చేశారు. ఆ సమయూనికి 120 ఎంజీ రైలింజన్లు ఉండేవి. కాలక్రమంలో గుంతకల్లుకు 28 కిలోమీటర్ల దూరంలోని గుత్తిలో బ్రాడ్‌గేజ్ రైలింజన్ షెడ్‌ను ప్రారంభించారు. గుంతకల్లు షెడ్ నుంచి ప్రయాణీకులను రవాణా చేసే రైలింజన్లు, గుత్తి షెడ్ నుంచి గూడ్స్ రైళ్ల ఇంజన్లు షంటింగ్ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం గుంతకల్లు డీజిల్‌షెడ్‌లో 112 రైలింజన్లు డివిజన్ పరిధిలోని అనేక రైళ్లకు సేవలందిస్తున్నాయి. స్థానిక డీజిల్షెడ్లోని డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్లో అసిస్టెంట్ లోకో పెలైట్ (ఏఎల్పి), లోకో పెలైట్ తదితర రన్నింగ్ విభాగపు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. అయితే విద్యుదీకరణ వేగవంతమైనందున గుంతకల్లు డీజిల్షెడ్ను గుత్తి డీజిల్షెడ్లోకి విలీనం చేసి గుంతకల్లులో విద్యుత్ లోకో షెడ్‌ను కొనసాగించాలని రైల్వే యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. పైగా కేవలం 28 కి.మీల దూరంలో రెండు డీజిల్ షెడ్లు కొనసాగించడంపై కూడా అభ్యంతరాలు రావడంతో త్వరలో ఇక్కడి డీజిల్‌షెడ్‌కు మంగళం పాడనున్నారని కార్మిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారుు. ఇప్పటికైతే ప్రమాదం లేదు గుంతకల్లు డీజిల్‌షెడ్ ఎత్తివేత అంశం వల్ల ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం లేదు. డివిజన్ పరిధిలో బ్రాడ్‌గేజ్ లైన్ల నిర్మాణం పుంజుకుంటే ఈ డీజిల్షెడ్ను కొనసాగించే అవకాశం ఉంది. - గోపాల్, సీనియర్ డీఎంఈ (డీజిల్) -
ప్రతిపాదనలు పట్టాలెక్కేనా..
రైల్వేబోర్డుకు ఎంపీల ప్రతిపాదనలు వచ్చేనెలలో సాధ్యాసాధ్యాలపై చర్చ ఏటా మిగులుతున్న నిరాశ ఈసారైనా ప్రజాకాంక్షలకు బడ్జెట్ పట్టంకట్టేనా.. విశాఖపట్నం సిటీ: ఈసారైనా బడ్జెట్లో తమ డిమాండ్లు నెరవేరాలని రైల్వే ప్రయాణికులు కోరుకుంటున్నారు. బడ్జెట్‌కు ముందస్తు కసరత్తు దగ్గరపడ్డంతో ప్రజాప్రతినిధులు ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారోనని వీరంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలాగే ఇండియన్ రైల్వే టైంటేబుల్ కమిటీ(ఐఆర్‌టిటిసి) నవంబర్‌లో ఎంపీల నుంచి ప్రతిపాదనలను కోరింది. దీనిపై కొందరిప్పటికే నివేదికలు సమర్పించారు. మరి కొందరు ఇవ్వాల్సి వుంది. ఈనెల మొదటి వారంలో ఎంపీలు కోరిన ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారులు సర్వే చేస్తారు. సర్వే అనంతరం వచ్చే నెలలో వీటిపై చర్చించి కొన్నింటిని ఆమోదిస్తారు. ఆమోదం పొందిన అంశాలను బడ్జెట్లో పొందుపరుస్తారు. ఈసారి ఎంపీలు ఐఆర్‌టిటిసికి ఇచ్చిన ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇవీ ప్రయాణికుల డిమాండ్లు వారణాసికి రెగ్యులర్ రైలు అవసరముంది. లేకుంటే భువనేశ్వర్, సికింద్రాబాద్ వెళ్లి అక్కడి నుంచి మరో రైలు మారి ప్రయాణించాల్సి వస్తోంది. ఢిల్లీకి నాన్ స్టాప్ ఎక్స్‌ప్రెస్ రైలు కావాలి. విశాఖ నుంచి అవృతసర్‌కు వెళుతున్న హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌ను రెగ్యులర్ చేయాలి. ప్రతీ సోమ, గురు, శుక్రవారాల్లో విశాఖ నుంచి బయల్దేరుతున్న ఈ రైలును రెగ్యులర్ చేస్తే ప్రస్తుతానికి కాస్త రద్దీని నియంత్రించేనట్టేనని రైల్వే వర్గాలంటున్నాయి. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నాన్‌స్టాప్ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్ ఆది, మంగళ, గురువారాల్లో బయల్దేరుతుంది. ఈ రైలును రెగ్యులర్ చేస్తే కాస్త హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగకరంగా వుంటుంది. నగరం నుంచి బెంగుళూరుకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే దిక్కయింది. మరొక రైలు కోసం ఎంపీలు పట్టుబడితే ప్రయోజనం వుంటుంది. రైల్వేబోర్డును ఎంపీలడిగిన రైళ్లివి: ఎంపీ కె. హరిబాబు ఢిల్లీకి విశాఖ నుంచి రైలు కావాలని అడుగుతున్నారు. రైల్వే జోన్ డిమాండ్‌ను ఆయన ప్రస్తావించలేదని తెలిసింది. విజయవాడ నుంచి తెలంగాణా మీదుగా వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ ను విశాఖ మీదుగా మళ్లించాలని కోరారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు నర్సీపట్నం నుంచి వయా చోడవరం మీదుగా కొత్తవలసకు కొత్త రైల్వే లైన్ కావాలంటున్నారు. అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారాలు పొడవు, ఎత్తు పెంచాలని, రైల్వే జోన్ కావాలని లేఖ రాశారు. అరుకు ఎంపీ కొత్తపల్లి గీత అరుకు రైలుకు విస్టాడూమ్ అద్దాలున్న బోగీలు కావాలంటూ పాత ప్రతిపాదనే చేసినట్టు తెలిసింది. విజయనగరం ఎంపీ పి. అశోక్ గజపతి రాజు విశాఖ రైళ్లపై కన్నేశారు. విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ-తిరుపతి తిరుమల ఎక్స్‌ప్రెస్‌లను విజయనగరం వరకూ పొడిగించాలని కోరుతున్నారు. -
రైల్వే జోన్‌కు పచ్చజెండా
స్మార్టు సిటీగా ప్రకటించిన నేపథ్యంలో విశాఖకు మరింత బలం రైల్వేమంత్రి సానుకూల స్పందన పార్లమెంటు సమావేశాల్లోనే నిర్ణయముంటుందా.. విశాఖపట్నం సిటీ: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కసరత్తు తొందర్లోనే ముగియనుంది. రైల్వే జోన్ ఏర్పాటు అంశం పూర్తిగా రాజకీయ నిర్ణయమే అయినా ఎలా వెలువడుతుందోననే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే జోన్ భవిష్యత్ ఓ కొలిక్కి రానుందని రైల్వే వర్గాలంటున్నాయి. జోన్ కమిటీ రైల్వే బోర్డుకు ఇప్పటికే తమ నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే. కానీ రైల్వే బోర్డు దాన్ని గోప్యంగా వుంచింది. నివేదిక ముఖ్యాంశాలు బయటకు పొక్కకమునుపే రైల్వే మంత్రి సదానంద గౌడ స్థానంలో సురేష్ ప్రభాకర్ ప్రభును రైల్వే మంత్రిగా నియమించి బాధ్యతలు అప్పగించింది. ఆయన రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రతీ కార్మికునికీ ఓ లేఖ రాసి ఆకట్టుకుంటున్నారు. సురేష్ప్రభాకర్ను కొందరు ఎంపీలు శుక్రవారం పార్లమెంట్లో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విశాఖ కేందంగా జోన్‌పై సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. రైల్వే సహాయ మంత్రి సిన్హా కూడా సానుకూలంగా వుండడంతో విశాఖకు రైల్వే జోన్ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. అమెరికా అభివృద్ది చేయనున్న మూడు స్మార్ట్ సిటీల్లో అహ్మదాబాద్, విశాఖలు వుండడంతో జోన్ కేంద్రం కూడా విశాఖకే అన్న భావన వ్యక్తమవుతోంది. డిసెంబర్ మొదటి వారంలోగా కేంద్రం దీనిపై ఓ ప్రకటన చేయొచ్చని అంచనా. ఇదిలా వుండగా రైల్వే బోర్డులో గానీ,రైల్వే జోనల్ కేంద్రమైన భువనేశ్వర్‌లో గానీ కొత్త రైల్వే జోన్ అంశంపై ఎలాంటి సమాచారం లేదని అధికారిక వర్గాలు అంటున్నాయి. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు నివేదిక ఇచ్చిన కమిటీ ఎలాంటి బలమైన సాంకేతిక అడ్డంకులను ప్రస్తావించలేదని భోగట్టా. జోన్ కేంద్రం విశాఖలో ఏర్పాటుకు అవసరమైన సాంకే తిక అడ్డంకులు లేకపోవడంతో నివేదికను మరోసారి లోతుగా పరిశీలించి నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. జోన్ మాటెలాఉన్నా కనీసం వాల్తేరును దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేసినా ఫర్వాలేదని కొందరంటున్నారు. -
పట్టాలెక్కనున్న ‘ఏటీపీఎస్’
ప్రమాదాల నివారణ ప్రయోగాలకు రైల్వే బోర్డు పచ్చజెండా లింగంపల్లి-వాడీ, వికారాబాద్-బీదర్ సెక్షన్లలో అమలు తాండూరు: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా.. వెనుక నుంచి రైళ్లు ఢీకొనకుండా ప్రమాదాలను నివారించేందుకు రైల్వే అధికారులు చేపట్టిన ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీఎస్) ప్రయోగాలు ఎట్టకేలకు పట్టాలెక్కనున్నాయి. హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్, మేథా, కర్నెక్స్ కంపెనీల ఆధ్వర్యంలో రెండేళ్లుగా చేసిన ప్రయోగాలకు రైల్వే బోర్డు సభ్యులు పచ్చజెండా ఊపారు. సోమవారం రైల్వే బోర్డు సభ్యులు ఏకే మిట్టల్(ఎలక్ట్రికల్), మరో అడిషనల్ మెంబర్ మనోహరన్( సిగ్నల్స్), సికింద్రాబాద్ డీఆర్ఎం ఎస్ కే మిశ్రా, మూడు కంపెనీల ప్రతినిధులు కుర్గుంట, నవాంద్గీ, మంతట్టి రైల్వే స్టేషన్ల మధ్య రైలులో వెళ్లి ప్రయోగాల తీరును పరిశీలించారు. ఈ ప్రయోగాల అమలుకు మొదటగా రైల్వేబోర్డు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను ఎంపిక చేసింది. లింగంపల్లి- వాడీ వరకు, వికారాబాద్-బీదర్ సెక్షన్ల మధ్య ఏటీపీఎస్‌ను మొదట అమలు చేయనున్నారు. ఈ రెండు సెక్షన్ల మధ్య సుమారు 40కి పైగా రైల్వేస్టేషన్ల పరిధిలో 40 రైలు ఇంజిన్లలో ఏటీపీఎస్ సాంకేతిక పరికరాలను అమర్చనున్నారు. వచ్చే ఏడాది మార్చి- జూన్ మధ్య ఏటీపీఎస్‌ను అమలు చేయనున్నట్టు రైల్వే బోర్డు అడిషనల్ మెంబర్ (టెలి కమ్యూనికేషన్స్) మహేష్ మంగళ్ తెలిపారు. ప్రయోగాలకు రూ.22 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రైన్ కొలిజన్ అవైడింగ్ సిస్టమ్(టీకాస్)లో ఉన్న అన్ని అంశాలు ఏటీపీసీలో ఉంటాయన్నారు. ఇప్పటి వరకు చేసిన 32 ప్రయోగాలు విజయవంతం అయ్యాయని ఆయన వివరించారు. -
పట్టాలపైకి కలల లైన్
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు అనుమతి ప్రాజెక్టు వ్యయం 925 కోట్లు మూడోవంతు భారం రాష్ట్రంపైనే రైల్వే లైన్ పొడవు 149 కి.మీ. భూసేకరణ జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి బోర్డు లేఖ సికింద్రాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కరీంనగర్ వరకూ.. సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: కరీంనగర్ జిల్లా ప్రజల దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది. జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర రాజధానితో అనుసంధానించే రైల్వే లైన్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. కరీంనగర్ నుంచి సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రైల్వే బోర్డు కార్యనిర్వాహక సంచాలకుడు అంజుమ్ పర్వేజ్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో దాదాపు 149 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. దాదాపు పదేళ్ల కింద కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒత్తిడి మేరకు రైల్వే శాఖ ఈ లైన్ సర్వేకు సమ్మతించగా.. ఇప్పుడు తెలంగాణ సీఎం హోదాలో ఆయన ప్రయత్నం ఫలించి పనులు ప్రారంభించేందుకు రైల్వే సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 925 కోట్లు అవసరమవుతాయని తాజా అంచనా. మనోహరాబాద్ లైన్‌తో అనుసంధానం.. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కరీంనగర్‌కు ఈ రైల్వేలైన్ నిర్మించనున్నారు. అయితే హైదరాబాద్ శివారులోని బొల్లారంలో రక్షణ శాఖ భూములుండటంతో... ఈ లైన్‌ను నేరుగా సికింద్రాబాద్ స్టేషన్‌తో అనుసంధానం చేయడం సాధ్యం కాలేదు. దీంతో సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వేలైన్‌కు మనోహరాబాద్ వద్ద అనుసంధానిస్తారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ దాటిన తరువాత మనోహరాబాద్ వస్తుంది. అక్కడి నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి మండలాల నుంచి కరీంనగర్ శివారులోని కొత్తపల్లికి ఈ రైల్వేలైన్ చేరుకుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు నేరుగా వేములవాడ పుణ్యక్షేత్రానికి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. 3 షరతులకు ఓకే అన్నాకే..: ఈ ప్రాజెక్టును పట్టాలెక్కేందుకు రైల్వే శాఖ అంత సులభంగా అంగీకరించలేదు. నష్టాలను బూచిగా చూపి షరతుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపింది. వాటి ప్రకారం నిర్మాణ వ్యయంలో మూడోవంతు (33 శాతం) భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత లెక్కన దాదాపు రూ. 308 కోట్లను రాష్ట్రం భరించాలి. ఇక భూసేకరణ భారం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. దీనికితోడు ఐదేళ్లదాకా ఏవైనా నష్టాలు వస్తే.. వాటిని రాష్ట్రప్రభుత్వమే భరించాలనే (యాన్యుటీ విధానం) షరతు కూడా ఉంది. వీటన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో... రైల్వే లైన్‌కు ఆమోదం వచ్చింది. కేసీఆర్ ప్రతిపాదన ఇది... ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలల ప్రాజెక్టు ఇదని, 2004లో ఆయన కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు దీనికి ప్రతిపాదన చేశారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలచారి, తేజావత్ రాంచ ంద్రు, ఎంపీ వినోద్‌కుమార్ బుధవారం వెల్లడించారు. 2006-07 బడ్జెట్లోనే సర్వేకోసం దీన్ని పొందుపరిచారని, దక్షిణ మధ్య రైల్వే సమగ్ర అంచనా నివేదికను తయారు చేసి రైల్వే బోర్డుకు ఇచ్చిందని వారు చెప్పారు. ‘‘సాధారణంగా రేట్ ఆఫ్ రిటర్న్ (ఆర్ఓఆర్) 14 శాతం ఉంటే గానీ కొత్త రైల్వేలైన్ మంజూరు చేయరు. ఈ లైన్ ఆర్ఓఆర్ 2.64 శాతం మాత్రమే ఉండడంతో.. కేంద్రం పలు షరతులు పెట్టింది. టీఆర్ఎస్ 2006లో యూపీఏ నుంచి వైదొలిగింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులో కదలిక లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. మేం ముగ్గురం తరచుగా రైల్వే బోర్డు అధికారులను కలిసి ఒత్తిడి తెచ్చాం. దాంతో పాటు షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో దీనికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. వెనకబడిన ప్రాంతంలో కొత్త రైల్వే లైను రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రైలు మార్గం ద్వారా భవిష్యత్‌లో సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా ఢిల్లీకి రైలు సౌకర్యం ఏర్పడే అవకాశముంది.’’ అని వారు పేర్కొన్నారు. -
అంచనాలు మించిన దక్షిణ మధ్య రైల్వే ఆదాయం
హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ఆదాయం 18.5 శాతం వృద్ధి చెందింది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో రూ. 6,915 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇది రూ. 5,835 కోట్లు. హుద్‌హుద్ తుపాను కారణంగా అక్టోబర్ రెండో వారంలో కార్యకలాపాలకు ఆటంకం కలిగినప్పటికీ తాజాగా రైల్వే బోర్డు నిర్దేశించిన రూ. 6,589 కోట్ల లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని ఆర్జించినట్లు ఎస్సీఆర్ తెలిపింది. కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల్లో సరకు రవాణా భారీగా ఎగియడం, రైలు సర్వీసులను సమర్ధమంతంగా నిర్వహించడం తదితర అంశాల కారణంగా ఇది సాధ్యపడినట్లు వివరించింది. ఈ వ్యవధిలో దాదాపు 21 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసినట్లు, 65.4 మిలియన్ టన్నుల సరకు రవాణా జరిపినట్లు తెలిపింది. కొత్తగా భారతి సిమెంట్స్, మైహోమ్ సిమెంట్స్ తదితర సంస్థల సిమెంటు రవాణా జరిపినట్లు ఎస్సీఆర్ పేర్కొంది. మొత్తం మీద ప్రధానమైన సరకు రవాణా విభాగం ద్వారా రూ. 4,810 కోట్లు, ప్రయాణికుల విభాగం నుంచి రూ. 1,784 కోట్ల ఆదాయం వచ్చినట్లు వివరించింది. -
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ లేనట్టే?!
రైల్వే బోర్డుకు నివే దిక ఇచ్చిన కమిటీ భగ్గుమన్న ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు విశాఖపట్నం సిటీ: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుకు జోన్ రీ ఆర్గనైజేషన్ కమిటీ బ్రేక్ వేసింది. ఇటీవల రైల్వే బోర్డుకు కమిటీ తన నివేదికను అందజేసింది. ఆ నివేదికలో మూడు డివి జన్లతోనే కొత్త జోన్ ఉండాలని ప్రతిపాదించిం ది. ప్రస్తుతమున్న తూర్పు కోస్తా రైల్వేలోనే విశాఖను కొనసాగించాలని స్పష్టం చేసింది. తూర్పు కోస్తా నుంచి వాల్తేరు రైల్వే డివిజన్‌ను విడదీయ డం సరికాదంది. వాల్తేరు, సంబల్పూర్, కుర్దా రైల్వే డివిజన్లతో కూడిన తూర్పు కోస్తా రైల్వే ఇతర జోన్లకు సమఉజ్జీగా వుందని అభిప్రాయపడింది. వాల్తేరును తూర్పుకోస్తా నుంచి తొలగిం చడంతో కొత్తగా ఏర్పాటయ్యే జోన్‌కు ఎలాంటి ప్రయోజనం వుండదని పేర్కొంది. పైగా గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లతో బాటు వాల్తేరును కలిపితే ఏర్పాటయ్యే జోన్ మరింత పెద్దదిగా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రస్తుతమున్న తూర్పు కోస్తాను ఎటూ కదపకుండానే కొత్త జోన్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖ ప్రాధాన్యతను ఏ మాత్రం పట్టించుకోకపోవడం నగరవాసులను తీవ్రంగా కలచివేస్తోం ది. విశాఖ కేంద్రంగా జోన్ ప్రకటించకపోతే మళ్లీ ఆందోళనలు ఉధృతం చేస్తామని జోన్ సాధన కమిటీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆదాయమే అడ్డంకి..! వాల్తేరు రైల్వే డివిజన్‌ను వదులుకోవడానికి తూర్పు కోస్తా రైల్వే ఇష్టపడడం లేదు. బంగారు బాతులాంటి ఈ డివిజన్ వదులుకుంటే ఏటా రూ.6300 కోట్లు ఆదాయం కోల్పోవాల్సి వస్తుం దని తూర్పు కోస్తా ఆందోళన చెందుతోంది. కోచింగ్ రైళ్లు(ప్రయాణికుల రైళ్లు) కన్నా గూడ్సు రైళ్లు ద్వారానే వాల్తేరు డివిజన్ ఏటా దాదాపు రూ.6 వేల కోట్లు ఆర్జిస్తోంది. పెట్టుబడి తక్కువ గా ఉండి ఆదాయం ఎక్కువగా వుండే ఈ డివి జన్ను వదులుకునేందుకు ఒడిశా కనుసన్నల్లోని రైల్వే అధికారుల బృందం ససేమిరా అంటోంది. -
రైల్వే బోర్డును ఏర్పాటు చేసిన సంవత్సరం?
బ్రిటిష్ ఇండియా - పారిశ్రామిక అభివృద్ధి ప్రాచీన కాలం నుంచే భారతదేశం పరిశ్రమలకు ప్రసిద్ధి గాంచింది. పారిశ్రామికాభివృద్ధి కోసం నియమించిన కమిషన్ తన నివేదికలో ‘పశ్చిమ దేశాల నుంచి మొదటిసారి వ్యాపారులు ఇక్కడకు వచ్చినప్పుడు, భారతదేశంలో పారిశ్రామికాభివృద్ధి ఏవిధంగానూ అభివృద్ధి చెందిన దేశాలకు తీసిపోనివిధంగా ఉంది’ అని వ్యాఖ్యానించింది. భారత్‌లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తులు, సహజసిద్ధంగా లభించే ముత్యాలు, సుగంధ ద్రవ్యాలను విదేశాలకు ఎగుమతి చేసేవారు. బంగారం, రాగి, జింకు, తగరం, సీసం, మత్తుపానీయాలు, గుర్రాలను ప్రధానంగా దిగుమతి చేసుకునేవారు. దిగు మతుల కంటే ఎగుమతులే ఎక్కువగా ఉండేవి. పత్తి, సిల్క్, ఉన్ని నాటి ముఖ్యమైన పరిశ్రమలు. బెంగాల్‌లోని అనేక ప్రాంతాలు, లక్నో, అహ్మదాబాద్, నాగ్‌పూర్, మధుర పత్తి పరిశ్రమకు పేరుగాంచాయి. పంజాబ్, కాశ్మీర్లో నాణ్యమైన కంబళ్లు ఉత్పత్తి చేసేవారు. భారతదేశం అంతటా ఇత్తడి, రాగి, బెల్‌మెటల్ ఉత్పత్తయ్యేవి. వీటికి బెనారస్, తంజావూరు, పుణె, నాసిక్, అహ్మదాబాద్ ముఖ్యమైన కేంద్రాలు. ఆభరణాల తయారీ, బంగారు, వెండి నగిషీ పనులు, చందనం, దంతపు, గాజు పరిశ్రమలు కూడా ఉండేవి. వ్యాపారాన్ని ఎక్కువగా భారతీయులే నిర్వహిస్తుండేవారు. 18వ శతాబ్దం ప్రారంభం వరకు నౌకా నిర్మాణ పరిశ్రమ ఇంగ్ల్లండ్ కంటే భారతదేశంలోనే అధికంగా ఉండేది. భారతదేశ వస్త్ర పరిశ్రమాభివృద్ధి బ్రిటిష్ ఉత్పత్తిదారుల అసూయకు కారణమైంది. 19వ శతాబ్దం అర్ధ భాగం నాటికి భారతదేశంలో చాలా పరిశ్రమలు గడ్డు పరిస్థితిని ఎదుర్కున్నాయి. తక్కువ ధరకు లభించే యంత్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులు, భారతీయ కళలను ప్రోత్సహించే ఉద్దేశం బ్రిటిష్ ప్రభుత్వానికి లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. అందువల్ల భారతదేశంలో వ్యాపార వాణిజ్యాలు దాదాపుగా అంతరించిపోయాయి. ఆధునిక పారిశ్రామికాభివృద్ధి భారతదేశంలో ఆధునిక పారిశ్రామికాభివృద్ధి లేదా భారీ పరిశ్రమల స్థాపన 19వ శతాబ్దపు రెండో భాగంలో ప్రారంభమైంది. 1850 ప్రాంతంలో నూలు దుస్తులు, జనపనార మిల్లులు, గనుల నుంచి బొగ్గు తవ్వి తీసే పరిశ్రమలతో భారత్‌లో యంత్ర యుగం ప్రారంభమైంది. ఈ పరిశ్రమల్లో ఎక్కువ భాగం బ్రిటిషర్లే పెట్టుబడి పెట్టారు. అందువల్ల ఇవి వారి ఆధిపత్యం కిందే ఉండేవి. అధిక లాభాలు ఆర్జించే అవకాశాలు కనిపించడంతో భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు విదేశీ పెట్టుబడిదారులు ఆకర్షితమయ్యారు. కార్మికులు చౌకగా దొరకడం, ముడిసరుకుల సరఫరాకు కొదవ లేకపోవడం, ఉత్పత్తులకు దేశంలో గిరాకీ ఉండటం వీరికి కలిసి వచ్చింది. వాస్తవానికి బ్రిటన్‌లో మిగులు మూలధనం ఉండి, దాన్ని విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనే అభిప్రాయం ఏర్పడిన సమయంలో ఇక్కడ పారిశ్రామికాభివృద్ధి ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధం భారతదేశంలో పారిశ్రామికాభివృద్ధికి ఒక చక్కటి అవకాశం కల్పించింది. యుద్ధకాలంలో విదేశీ పోటీ లేకపోవడం వల్ల అవసరమైన ప్రతి వస్తువును ఇక్కడే ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. ఈ అవకాశం ఎంతో కాలం కొనసాగలేదు. యుద్ధానంతరం ఏర్పడిన ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం భారతదేశంపై కూడా పడింది. రెండో ప్రపంచయుద్ధం ఒక కొత్త పారిశ్రామిక ఘట్టాన్ని ఆవిష్కరించింది. దిగుమతులు పరిమితమ య్యాయి. యుద్ధానికి సంబంధించిన వస్తువుల గిరాకీ బాగా పెరిగిపోయింది. ప్రభుత్వం చాలా పరిశ్రమలకు యుద్ధం ముగిసిన తర్వాత కూడా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. వస్త్ర పరిశ్రమ భారతీయ వ్యాపారస్థులు మొదటిసారిగా 1818లో కలకత్తాలో పత్తి, తర్వాత బొంబాయి ప్రాంతంలో వస్త్ర పరిశ్రమను స్థాపించారు. ‘కౌస్జీ నానాభాయి’ 1853లో బొంబాయిలో మొదటి దుస్తుల మిల్లును నెలకొల్పాడు. 1879 నాటికి మనదేశంలో 56 వస్త్ర పరిశ్రమలు ఉండేవి. వీటిలో 43 వేల మంది కార్మికులు పనిచేసేవారు. 1851లో బొంబాయిలో నూలు మిల్లులను స్థాపించారు. వీటిలో వడకటం, నేతపని రెండూ జరిగేవి. 1861 నాటికి 12 మిల్లులు వచ్చాయి. 1860-70 దశాబ్దంలో ఈ పరిశ్రమకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అమెరికా అంతర్యుద్ధం వల్ల ముడి పత్తి ధర పెరిగింది. ఇది చేనేత పరిశ్రమను, దానిపై ఆధారపడి ఉన్న ఇతర రంగాలను దెబ్బతీసింది. రవాణా ఖర్చులు, దిగుమతి సుంకాలు పెరిగాయి. 1934 కాటన్ టెక్స్టైల్స్ యాక్ట్ ద్వారా బ్రిటిష్యేతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రభుత్వం సుంకాలను పెంచింది. జౌళి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఆది నుంచే జనపనార పరిశ్రమకు ప్రాధాన్యం ఉండేది. 1830 వరకు ‘కిత్తనార’ సంచులు, జనపనార గుడ్డ, బెంగాల్ చేనేత పనివాళ్ల సొంత వ్యవహారంగా ఉండేవి. భారతదేశంలో తొలి జనపనార మిల్లును 1854లో స్థాపించినా, 1863 -64 వరకు ఆ పరిశ్రమ అభివృద్ధి చెందలేదు. 1882 నాటికి భారతదేశంలో 20 జనపనార మిల్లులు ఉండేవి. వీటిలో ఎక్కువగా బెంగాల్లోనే ఉండేవి. దేశీయంగా మార్కెట్ లేకపోవడంతో పత్తి, జనపనార పరిశ్రమలు ఎగుమతులపైనే ఆధారపడేవి. పత్తి కంటే జనుము వ్యాపారంలో అస్థిరత్వం ఎక్కువ. 1895 -96లో 28 జనపనార మిల్లులుండగా.. 1913-14 నాటికి 64కు, 1947 వరకు 113కు పెరిగాయి. తేయాకు టీ తోటలు: బ్రిటిష్ పాలనలో దీనికి అత్యంత ప్రాధాన్యం ఉండేది. 19వ శతాబ్దపు చివరి 30 ఏళ్లలో నిరంతరాభివృద్ధి చెందిన ఒకే ఒక పరిశ్రమ ఇదే. టీ తోటల వైశాల్యం 1885లో 2 లక్షల 84 వేల ఎకరాలు ఉండగా 1896 నాటికి 4,33,133 ఎకరాలకు విస్తరించింది. 1896 నాటికి బ్రహ్మపుత్ర, సుర్మా నదుల లోయల ప్రాంతంలో 67.4 శాతం టీ సాగులో ఉంది. దీంట్లో ఎక్కువ భాగం అస్సాంలో ఉండగా, బెంగాల్ వాటా 27.4 శాతం. పంజాబ్, హిమాలయ పర్వతాలు, దక్షిణాదిన నీలగిరిలోనూ ఈ తోటలను సాగు చేశారు. భారతదేశం, శ్రీలంక, తూర్పు ఇండియా దీవులు 1933 నుంచి టీ ఉత్పత్తి చేసే ముఖ్యమైన ప్రాంతాలుగా పేరుగాంచాయి. కాఫీ తోటలు: కాఫీ సాగు కూర్గ, మైసూర్, మలబారు ప్రాంతాలకే పరిమితమైంది. 1879 వరకు ఈ పరిశ్రమ లాభసాటిగానే ఉంది. 1889 తర్వాత బాగా దెబ్బతింది. బొగ్గు పరిశ్రమ ఇది 1880లో ఒక చిన్న పరిశ్రమగా ప్రారంభమైంది. 1886 తర్వాత రైల్వేల వ్యాప్తితో అభివృద్ధి చెందింది. 1885లో బొగ్గు ఉత్పత్తి 1,294,221 టన్నులు ఉండగా, 1894 నాటికి 2,800,562 టన్నులకు పెరిగింది. ఇనుము-ఉక్కు భారతదేశంలో ఇనుము-ఉక్కు ఉత్పత్తి 19వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. 1830లో ‘హీత్’ ఆధునిక పద్ధతుల్లో ఇనుము-ఉక్కు పరిశ్రమలను స్థాపించడానికి ప్రయత్నించాడు. 1875లో దుక్క ఇనుము ఉత్పత్తి కర్మాగారాన్ని స్థాపించారు. 1907 నాటికి సంవత్సరానికి 50 వేల టన్నుల దుక్క ఇనుము ఉత్పత్తి అయ్యేది. జంషెడ్జీ టాటా 1907లో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు. ఇదే టాటా - ఉక్కు కర్మాగారంగా ప్రసిద్ధి చెందింది. దీంట్లో 1913లో ఉక్కు ఉత్పత్తి ప్రారంభమైంది. ఇతర పరిశ్రమలు ఇతర పరిశ్రమల్లో పంచదార, నూనెగింజలు, తోలు, మాంగనీస్, పెట్రోలియం, అభ్రకం ముఖ్యమైనవి. వీటిలో కొన్ని విదేశీ మార్కెట్‌ను కూడా సంపాదించాయి. బ్రిటిషర్లు భారతదేశం నుంచి వెళ్లేనాటికి ఈ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. మాదిరి ప్రశ్నలు 1. రైల్వే బోర్డును ఏర్పాటు చేసిన సంవత్సరం? 1) 1905 2) 1906 3) 1907 4) 1908 2. భారతదేశంలో మొదటిసారిగా 1818లో పత్తి మిల్లును ఎక్కడ స్థాపించారు? 1) బొంబాయి 2) కలకత్తా 3) సూరత్ 4) మద్రాస్ 3. బొంబాయిలో ఏ సంవత్సరంలో మొదటి పత్తి మిల్లును స్థాపించారు? 1) 1882 2) 1863 3) 1880 4) 1854 4. ‘స్వదేశీ ఉద్యమం’ ద్వారా భారతదేశంలో ఏ పరిశ్రమ అభివృద్ధి చెందింది? 1) పత్తి 2) వస్త్ర 3) తేయాకు 4) బొగ్గు 5. మొదటిసారిగా బెంగాల్లో జనపనార పరిశ్రమ స్థాపించిన సంవత్సరం? 1) 1853 2) 1855 3) 1854 4) 1856 6. 1899లో భారతీయుడి సగటు తలసరి జాతీయ ఆదాయం ఎంత? 1) రూ. 39 2) రూ. 25 3) రూ. 36 4) రూ. 30 7. దాదాబాయ్ నౌరోజీ అండ్ కంపెనీని ఎప్పుడు స్థాపించారు? 1) 1867 2) 1868 3) 1869 4) 1870 8. తిలక్ ఏ పరిశ్రమలో భాగస్వామిగా ఉండేవారు? 1) కాటన్, జిన్నింగ్ పరిశ్రమలు 2) తేయాకు 3) ఇనుము - ఉక్కు 4) బొగ్గు పరిశ్రమ 9. {పయాగ చక్కెర కంపెనీ యజమాని ఎవరు? 1) నెహ్రూ 2) లాలా లజపతిరాయ్ 3) తిలక్ 4) మదన్మోహన్ మాలవ్య 10. కాఫీలో భారత్‌తో పోటీ పడిన దేశం? 1) రష్యా 2) చైనా 3) బ్రెజిల్ 4) అమెరికా సమాధానాలు: 1) 1; 2) 2; 3) 4; 4) 1; 5) 2; 6) 1; 7) 3; 8) 1; 9) 4; 10) 3. -
రైలు టిక్కెట్ల జారీకి ప్రైవేట్ ఆపరేటర్లు
-
కూత పెట్టేనా?
సింగిల్ లైన్‌తో ప్రయాణికుల అవస్థలు... క్రాసింగ్ వస్తే గంటల తరబడి వెయిటింగ్... ప్రతి బడ్జెట్లో అరకొర నిధుల కేటాయింపు... ఊరిస్తున్న మాచర్ల-గద్వాల రైల్వే లైన్... ఇదీ పాలమూరు జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి. దశాబ్దాకాలంగా రైల్వే బడ్జెట్లో జిల్లా అన్యాయానికి గురవుతోంది. గత పాలకుల నిర్లక్ష్యం, జిల్లా ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగా కొత్త ప్రాజెక్టులే కాదు కనీసం నిధులు కూడా రావడం లేదు. జిల్లాలో రైల్వే స్టేషన్లు సమస్యల నిలయంగా మారాయి. కొత్త రైళ్ల రాక, రైళ్ల పొడిగింపు, బ్రిడ్జిల నిర్మాణం కలగా మారింది. ఈసారైనా మన ఎంపీలు రైల్వే బోర్డుకు పంపిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకున్నారా? లేదా బుట్టదాఖలయ్యాయా?.. ఈ విషయం నేడు కేంద్రమంత్రి సదానందగౌడ ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌తో తేలనుంది. నేడు రైల్వే బడ్జెట్ * సదానందా...కరుణ చూపేనా? * నిర్లక్ష్యానికి గురవుతున్న పాలమూరు రైల్వే ప్రాజెక్టులు * ముందుకు సాగని ఫలక్‌నుమా-మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులు * నడిగడ్డ రైల్వే ప్రతిపాదనలకు మోక్షం లభించేనా? * గద్వాల- మాచర్ల నూతన లైన్‌కు మంజూరు ఎప్పుడో? ముందుకు సాగని డబ్లింగ్ పనులు... ఫలక్నామా-మహబూబ్‌నగర్ డబ్లింగ్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ లైన్ కేవలం సర్వేలకే పరిమితమవుతోంది. ప్రతి బడ్జెట్లో డబ్లింగ్ లైన్‌కు నిధులు కేటాయించడంలో వివక్ష కొనసాగుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ 1996-97లో మంజూరైన మహబూబ్‌నగర్- మునీరాబాద్ రైల్వే లైన్ పనులు మాత్రమే చురుగ్గా సాగుతున్నాయి. అదికూడా కర్ణాటక రాష్ట్ర ప్రతినిధుల చొరవ వల్లే పనులు జరుగుతున్నాయి. జిల్లా ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంతోనే ఫలక్‌నుమా-మహబూబ్‌నగర్ డబుల్ రైల్వేలైన్ వెనక్కి పోతోంది. స్టేషన్ల అభివృద్ధిపై కనిపించని కరుణ మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ స్టేషన్ల అభివృద్ధికి గత బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన కనిపించలేదు. మహబూబ్‌నగర్, గద్వాల రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించి నాలుగేళ్లు గడిచినా జరిగిన పనులు ఏమిలేవు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జిల్లా రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా మార్చాలనే డిమాండ్ ఉంది. ఇక రద్దీవేళల్లో మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ స్టేషన్లలో టికెట్లు తీసుకోవడానికి కూడా ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మహబూబ్‌నగర్-గుత్తి డబుల్‌లైన్‌కు మోక్షం కలిగేనా... గద్వాల-రాయచూర్‌ల మధ్య మరిన్ని రైళ్లు పెరుగుతాయన్న ఆశ రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉంది. గత ఫిబ్రవరి 12న ప్ర వేశ పెట్టిన రైల్వే బడ్జెట్లో అప్పటి కర్నూలు ఎంపీ సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వేశాఖ సహాయ మంత్రిగా ఉండటంతో కేవలం కాచిగూడ-తిరుపతి డబుల్ డెక్కర్ రైలు మాత్రమే మంజూరై ప్రారంభమైంది. మిగతా పెండింగ్ సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. ప్రస్తుతం డబుల్ డెక్కర్ రైలుకు ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. 2013-14 బడ్జెట్లో మహబూబ్‌నగర్ -గుత్తి వరకు డబుల్ ట్రాక్ నిర్మాణానికి సర్వే అనుమతి ఇచ్చారు. ఇప్పటికే డబుల్‌లైన్‌కు సంబంధించిన సర్వేలను అధికారులు పూర్తి చేసి రైల్వే శాఖకు పంపించారు. ఈసారి ట్రాక్ నిర్మాణానికి అ నుమతి లభిస్తుందనే ఆశతో ఆ ప్రాంత వాసులు ఉన్నారు. వీటికి స్థానం దక్కేనా! పేద, మధ్య తరగతి రథంగా పేరొందిన రైలు బండి కూత వినేందుకు నాగర్‌కర్నూల్, కల్వకుర్తి వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. రాయచూరు నుంచి వయా గద్వాల మీదుగా మా చర్ల దాకా రైల్వే లైన్ పూర్తి అయితే ప్రజల ఆశలు నెరవేరుతాయి. మొదటిదశలో భాగంగా రాయచూరు నుంచి గద్వాల వరకు దాదాపు 59 కిలోమీటర్ల దూరం గల రైల్వే లైన్ పూర్తిచేయడానికే సరిగ్గా పుష్కరకాలం పట్టింది. మిగతా గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మీ దుగా మాచర్ల దాకా వేయాల్సిన రైలు లైన్‌కు సంబంధించి దశాబ్ద కాలంగా కేవలం ప్రతి పాదనలకు మాత్రమే పరిమితమవుతున్నా యి. గతేడాది కూడా వీటిపై ప్రతిపాదనలు పంపినా ఈప్రాజెక్టుకు మోక్షం లభించలేదు. గత అక్టోబర్‌లో ప్రారంభమైన గద్వాల- రాయచూరు నూతన బ్రాడ్‌గేజ్ లైన్లో ప్రస్తుతం ఒక్క డెమో రైలు మాత్రమే ప్రయాణికులకు సేవలు అందిస్తోం ది. ఈ లైన్లో కొత్త రైళ్లను ప్రవేశ పెడితే రాయచూరు, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య మరింతగా రైల్వే రవాణా సౌకర్యం పెరుగుతుంది. ద్రోణాచలం నుంచి వయా గద్వాల మీదుగా రాయచూరు ద్వారా ముంఠియి వరకు ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెడతామని గతంలో హామీ ఉన్నా ఇప్పటి వరకు మోక్షం లేదు. గద్వాల జంక్షన్‌గా అభివృద్ధి చెందినందున గద్వాల మీదుగా వెళ్తున్న దూర ప్రాంత ఎక్స్‌ప్రెస్‌లు గోర ఖ్‌పూర్, కోర్బా, ఇండోర్ తదితర ఎక్స్‌ప్రెస్‌లను గద్వాలలో ఒక నిమిషం ఆపాలని ఇప్పటికే డిమాండ్లు ఉన్నాయి. గద్వాల రైల్వే జంక్షన్ వద్ద దాదాపు 110 ఎకరాల స్థలం ఉన్నందున, రైల్వే శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర రైల్వేమంత్రి ఆమోదం తెలిపితే ఈ ప్రాంత రైల్వేల అభివృద్ధి మరింతగా పెరిగే అవకాశం ఉంది. గతేడాది పంపిన ప్రతిపాదనలు * చెన్నై, ముంబాయి మెట్రో నగరాలకు అతి తక్కువ మార్గంలో కలిపే రాయచూర్-గద్వాల మధ్య రైల్వే ట్రాక్ అంతా సిద్ధమైంది. కానీ రైళ్ల రాకపోకలు జరగడం లేదు. గద్వాల మీదుగా చెన్నై-షిర్డి మధ్య రైళ్ల రాకపోకలు సాగిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. * గద్వాల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న 110 ఎకరాల స్థలంలో రైల్వే డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటీ ఆచరణలోకి రావడం లేదు. * జిల్లాలో రైల్వే లైన్ సింగిల్ కావడంతో రైళ్ల రద్దీ కారణంగా తరచూ క్రాసింగ్ ఏర్పడుతోంది. రైల్వే లైన్ డబ్లింగ్ చేయాలి. * వాణిజ్య కేంద్రమైన జడ్చర్లలో గూడ్స్ రైళ్ల కారణంగా తరచూ రైల్ గేట్ పడటంతో వాహనాల రాకపోకలకు అటంకాలు ఏర్పడుతున్నాయి. దీని పరిష్కారం కోసం వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మించాలి. ఎంపీ జితేందర్‌రెడ్డి రైల్వే బోర్డు ముందు ఉంచిన ప్రతిపాదనలు * ఉందానగర్ (శంషాబాద్)- డోన్ డబ్లింగ్ లైన్ ఏర్పాటు * మహబూబ్‌నగర్ నుంచి రాయచూర్ వయా మక్తల్-మునీరాబాద్ లైన్ * జడ్చర్ల నుంచి నంద్యాల వయా నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ రైల్వేలైన్ * గద్వాల-మాచర్ల వయా నాగర్‌కర్నూల్, దేవరకొండ కొత్త రైల్వే లైన్ * ఫలక్నామా దాకా ఉన్న ఎలక్ట్రికల్ లైన్‌ను మహబూబ్‌నగర్ వరకు పొడగించాలి * జడ్చర్లలో ఆర్వోబీ నిర్మాణం * రైల్వే ట్రాక్‌లను బలోపేతం చేయాలి -
ఇక రైల్వే చార్జీల బాదుడు
న్యూఢిల్లీ: సంస్కరణల పేరుతో మోడీ సర్కార్ ప్రజలపై వడ్డనకు సిద్ధమవుతోంది. రైలు చార్జీలను పెంచడానికి కసరత్తు మొదలుపెట్టింది. చార్జీల పెంపుతో పాటు రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) పచ్చజెండా ఊపాలని భావిస్తోంది. చార్జీల పెంపు, ఎఫ్‌డీఐలపై రెండు మూడు రోజుల్లో ఓ నిర్ణయానికి రానున్నట్టు రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు. ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం, సరుకు రవాణాపై 6.5 శాతం మేర చార్జీలు పెంచాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను రెండు రోజుల్లో సదానందగౌడ ప్రధాని మోడీ ముందుంచనున్నారు. జూలై రెండో వారంలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే వీటిపై ఓ నిర్ణయానికి రానున్నారు. రైల్వే అభివృద్ధి కోసమే ఎఫ్‌డీఐలకు అనుమతివ్వాలని భావిస్తున్నట్టు సదానందగౌడ తెలిపారు.ఎఫ్‌డీఐల వల్ల హైస్పీడ్ రైళ్లు, రైల్వే స్టేషన్లు అభివ ృద్ధి చెందుతాయన్నారు. -
మెట్రోకు రైల్వేసిగ్నల్
ఆమోదముద్ర వేసిన రైల్వే బోర్డు మరో వారం రోజుల్లో పరుగు ప్రారంభం? సీఎం చవాన్ ప్రారంభించే అవకాశం టికెట్ల ధరపై ఇంకా రాని స్పష్టత నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు ప్రయాణం మరికొన్ని రోజుల్లో సాకారం కానుంది. రైల్వే బోర్డు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మరో వారం రోజుల్లో మెట్రో సేవలు నగరవాసులకు అందుబాటుకి వస్తాయని ముంబై మహానగర ప్రాంతీయాభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) చెబుతోంది. అయితే ముహూర్తం ఎప్పుడా అన్నది ఇంకా నిర్ణయించలేదని, అది ఖరారైతే వర్సోవా- అంధేరి-ఘాట్కోపర్ మార్గంలో ఇక పరుగులు తీయడమే ఆలస్యమంటోంది. కేంద్రానికి చెందిన రైల్వేబోర్డు సభ్యులు పరీక్షలు నిర్వహించి ఇటీవలే సేఫ్టీ సర్టీఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే రైల్వేబోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేపోయింది. ఎట్టకేలకు రైల్వే బోర్డు కూడా పచ్చజెండా ఊపడంతో త్వరలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎమ్మెమ్మార్డీయే ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం... ఈ రైళ్లను ఎవరి చేతుల మీదుగా, ఎప్పుడు ప్రారంభించాలనేదానిపై ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖుల అపాయింట్మెంట్ లభించగానే ముహూర్తం ఖరారు చేస్తారు. గతంలో మోనోకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దేశంలో మొదటిసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోనో రైళ్లను కేంద్ర మంత్రి ద్వారా ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. కాని అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో చివరకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిపించాల్సి వచ్చింది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, రాష్ట్రంలో కాంగ్రెస్-ఎన్సీపీల నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ప్రధాని, రైల్వేశాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలు తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి కూడా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేతులమీదుగా ప్రారంభించే అవకాశముందంటున్నారు. ప్రచారాంశంగా మారనున్న మెట్రో... నగరవాసులకు మెట్రోసేవలను తామే అందుబాటులోకి తెచ్చామంటూ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందుకే ప్రత్యర్థి కూటమిలోని వారికి అవకాశం ఇవ్వకుండా మెట్రో క్రెడిట్‌ను పూర్తిగా తామే సొమ్ము చేసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్, ఎన్సీపీలు యోచిస్తున్నాయి. దీంతో సీఎం చేతుల మీదుగానే మెట్రోరైలు సేవలను ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. కోడ్ కూయకముందే... మెట్రోసేవలు గత కొన్ని నెలలుగా ప్రారంభానికి నోచుకోలేకపోతున్నాయి. ఎప్పుడో పనులు పూర్తయినప్పటికీ లోక్‌సభ ఎన్నికలు రావడం, ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో అవసరమైన అనుమతులు లభించక ప్రారంభానికి నోచుకోలేదు. ఇకపై కూడా ఆలస్యం చేస్తే రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మెట్రోరైలు పరుగుకు మరోసారి అడ్డుపడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అసెంబ్లీ ఎన్నికల నియమావళి అడ్డురాకముందే ఈ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నారు. చార్జీలపై రాని స్పష్టత... మెట్రో చార్జీలు ఎంత ఉంటాయనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. కనీస చార్జీలు రూ. 9, గరిష్ట చార్జీలు రూ.13గా నిర్ణయించాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఖరీదైన సేవలు ఇంత తక్కువ చార్జీలతో అందించడం సాధ్యం కాదంటూ ఎమ్మెమ్మార్డీయే నిరాకరించింది. కనీస చార్జీలు రూ.13, గరిష్ట చార్జీలు రూ.28గా నిర్ణయించాలని ఎమ్మెమ్మార్డీయే భావిస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ముహూర్తం లభించగానే చార్జీలపై కూడా స్పష్టత వస్తుందని ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యూపీఎస్ మదన్ తెలిపారు. పెరగనున్న రియల్ ఎస్టేట్ ధరలు.. నగరంలోని అన్ని ప్రాంతాలకు మెట్రో సేవలు విస్తరిస్తుండడంతో రియల్ఎస్టేట్ వ్యాపారం కూడా జోరందుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే మెట్రో మార్గం నిర్మాణంలో ఉన్న ప్రాంతాల్లో ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయని, సేవలు అందుబాటులోకి వస్తే వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. -
జూన్‌లో మెట్రో పరుగు
సాక్షి, ముంబై: మెట్రోరైలు సేవలను ప్రారంభించేందుకు జూన్ ఒకటిన రైల్వే బోర్డు నుంచి అనుమతి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ పరీక్షలు నెగ్గడంతో ఎమ్మెమ్మార్డీయేకు రైల్వే సేఫ్టీ విభాగం నుంచి ఇటీవల ధ్రువపత్రం కూడా అందింది. దీంతో మెట్రో రైలు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కొన్నిరోజులుగా రైల్వే అనుమతి కోసం వేచిచూస్తున్న మెట్రోకు జూన్ ఒకటిన గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశాలుండడంతో అధికారులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చార్జీలు ఎలా నిర్ధారించాలనేదానిపై ఇటు ప్రభుత్వం, అటు ఎమ్మెమ్మార్డీయే తుది నిర్ణయానికి రాలేదు. ఈ సమస్య పరిష్కరించేందుకు మరోవారం రోజుల సమయం పట్టవచ్చు. అంటే జూన్ 10లోపు మెట్రో రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రావొచ్చని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తిచేయడానికి పలు ఆలయాలను నేలమట్టం చేయడం తెలిసిందే. దీనికితోడు నిర్వాసితులకు పరిహారం, స్థలసేకరణ వంటి అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటన్నింటిని చేధించుకుని ఎట్టకేలకు మెట్రోరైలుకు తుది మెరుగులు దిద్ది ప్రారంభానికి సిద్ధం చేశారు. మే ఒకటో తేదీన నిర్వహించిన పరీక్షలు సఫలీకృతం కావడంతో రైల్వే సేఫ్టీ కమిషనర్ ధ్రువపత్రం జారీ చేశారు. రైల్వే బోర్డు నుంచి తుది అనుమతి లభించాల్సి ఉంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మార్గంలో 11.40 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 12 స్టేషన్లు ఉన్నాయి. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం మెట్రో రైలు 2010లో ప్రారంభం కావాలి. స్థలసేకరణ, పరిహారం చెల్లింపు వంటి సమస్యల కారణంగా తీవ్ర జాప్యం జరిగింది. ప్రాజెక్టు వ్యయం రూ.4,321 కోట్లకు చేరుకుంది. ఇదిలాఉండగా 2013 మేలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మెట్రోకు పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఫలితంగా 2013 డిసెంబరు వరకు మెట్రోరైళ్ల సేవలు అందుతాయని అంతా భావించారు. అనివార్య కారణాల వల్ల ఏకంగా 11 సార్లు రైలు సేవల ప్రారంభం ఆలస్యమయింది. దీంతో ముంబైకర్లు మెట్రోపై ఆశలు వదులుకున్నారు. ఈ ఏడాది మేలో ధ్రువపత్రం జారీ కావడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇవన్నీ ఇలా ఉంటే చార్జీల ఖరారుపై ప్రభుత్వం, ఎమ్మెమ్మార్డీయే మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. కనీస చార్జీలు రూ.9, గరిష్ట చార్జీలు రూ.24గా నిర్ణయించాలని ప్రభుత్వం పట్టుబట్టింది. ఇంత తక్కువ చార్జీలతో సేవలు అందించడం కుదరదని ఎమ్మెమ్మార్డీయే వాదిస్తోంది. కనీస చార్జి రూ.22 గరిష్ట చార్జి రూ.33 వరకు ఉండాలని స్పష్టం చేసింది. మెట్రోరైలు ప్రారంభోత్సవానికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపినా, చార్జీల ఖరారుకు వారం పట్టవచ్చు. -
కొత్త రైల్వే జోన్‌తో చాలా సమస్యలు: ద.మ.రై జీఎం
కొత్త రైల్వేజోన్ ఏర్పాటు వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం డి.కె.శ్రీవాస్తవ మంగళవారం హైదరాబాద్‌లో తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందని చెప్పారు. నెలరోజుల్లో ఆ కమిటీ తన నివేదికను రైల్వేబోర్డుకు అందనుందని వెల్లడించారు. అయితే కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై తుది నిర్ణయం మాత్రం రైల్వే బోర్డుదే అని డి.కె.శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేను తెలంగాణకు కేటాయించాలని... అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. అందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులతో పాటు పలు నగరాలను ఆ ఉన్నత స్థాయి కమిటీ కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కోసం పరిశీలించనుంది. నెలరోజుల్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై వివిధ అంశాలతో కూడిన నివేదికను ఆ కమిటీ రైల్వే బోర్డుకు నివేదించనుంది. -
సీమాంధ్రకు కొత్త రైల్వేజోన్
విజయవాడ కేంద్రంగా ఏర్పాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే రెండు ముక్కలు కోస్తా పరిధిలోని విశాఖకూడా అందులోకే.. ఉన్నతాధికారులు వద్దన్నా నేతల ఒత్తిడితో కేంద్రం పచ్చజెండా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను కూడా విభజించాలని కేంద్రం నిర్ణయిం చింది. దీనికి రైల్వే బోర్డు కూడా పచ్చజెండా ఊపింది. తెలంగాణ ప్రాంతం సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వేజోన్‌గా ఉండనుండగా, విజయవాడ ప్రధాన కేంద్రంగా సీమాంధ్ర ప్రాంతం ప్రత్యేక జోన్‌గా ఆవిర్భవించనుంది. రాష్ట్ర విభజన ఖాయంగా మారిన నేపథ్యంలో.. సీమాంధ్రకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలంటూ వివిధ పార్టీల నేతలు కేంద్రాన్ని గట్టిగా కోరారు. ఆ సమయంలో కేంద్రం దీనిపై రైల్వే ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. రైల్వే జోన్లు రాష్ట్ర సరిహద్దులను ఆధారం చేసుకొని ఉండవని, రాష్ట్రం విడిపోయినంత మాత్రాన రైల్వేజోన్‌ను కూడా విభజించాలనటం సరికాదం టూ రైల్వే అధికారులు కేంద్రం దృష్టికి తెచ్చారు. ప్రత్యేక జోన్ వల్ల కొత్తగా ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఒకేజోన్ పరిధిలో రెండు రాష్ట్రాలుండటం వల్ల ఎలాంటి నష్టం ఉండదని పేర్కొంటూ.. జోన్‌ను విభజించటం వల్ల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉన్నందున ఆ ప్రతిపాదన విరమించుకోవటమే మంచిదంటూ స్పష్టం చేశారు. దీంతో కేంద్రప్రభుత్వం నేతల విన్నపాన్ని తిరస్కరించింది. తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం తెలిపే సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేయటంతో వారిని బుజ్జగించే చర్యల్లో భాగంగా కేంద్రం మళ్లీ ఈ రైల్వే జోన్ విభజను పరిశీలిస్తానని హామీ ఇచ్చింది. కొత్త జోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఆరునెలల్లో నివేదిక కోరుతున్నట్టు విభజన బిల్లులో చేర్చింది. అప్పటికే అధికారులు వ్యతిరేకంగా ఉన్నందున ఆరునెలల తర్వాత జోన్‌పై అనుకూల నిర్ణయం రాదనే ఉద్దేశంతో సీమాంధ్ర నేతలు దీనిపై గట్టిగా పట్టుబట్టారు. దీంతో రెండు జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం రైల్వే అధికారులను ఆదేశించటంతో ప్రస్తుతం ఆ దిశగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావటంతో అధికారికంగా దీనిపై ప్రకటన విడుదల చేయలేదు. కానీ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆ పార్టీ నేతలకు సూచించటంతో ప్రస్తుతం వారు ఆ పనిలో ఉన్నారు. కొత్తజోన్ పరిధిలోకి విశాఖ ప్రస్తుతం తూర్పుకోస్తా (ఈస్ట్‌కోస్ట్) జోన్ పరిధిలో ఉన్న విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలను కూడా కొత్త జోన్ పరిధిలోకి తేనున్నారు. ఈ మూడు ప్రాంతాలను ప్రత్యేక డివిజన్‌గా చేసి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి తేవాలని చాలాకాలంగా గట్టి డిమాండ్ ఉన్నా రైల్వే శాఖ పట్టించుకోలేదు. ఇప్పుడు పనిలోపనిగా ఆ ప్రాంతాలను తూర్పుకోస్తా నుంచి తప్పించి విజయవాడ కేంద్రంగా ఏర్పడే కొత్త జోన్ పరిధిలోకి చేర్చాలని నిర్ణయించారు. ఆస్తులు, అప్పుల పంపిణీ కోసం ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వ విభాగాల్లో జరుగుతున్న తరహాలోనే రైల్వే కూడా కసరత్తు ప్రారంభించింది. కొత్త జోన్ పరిధిలో ఏయే తరహా సంస్థలను ఏర్పాటు చేయాలి, ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమైన వాటిని ఎలా విభజించాలి.. తదితర పనులు మొదలుపెట్టింది. -
..కాస్త ఊరట
నిధుల కేటాయింపు పరంగా గుంతకల్లు డివిజన్‌కు నిరాశ ఎదురైనా.. కొత్త రైళ్ల మంజూరు మాత్రం కాస్త ఊరట కల్గిస్తోంది. వాస్తవానికి రాయలసీమ జిల్లాల అవసరాలు తీర్చడం కోసం కొత్త రైళ్లను మంజూరు చేయాలని గుంతకల్లు డివిజన్ అధికారులు, ఎంపీలు మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. వీటిని రైల్వే మంత్రి గానీ, రైల్వే బోర్డు గానీ పరిగణనలోకి తీసుకోలేదు. అయితే.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రవేశపెడుతున్న కొత్త రైళ్లలో దాదాపు ఎనిమిది రైళ్లు గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా పరుగులు తీయనున్నాయి. రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం ఓట్ ఆన్ అకౌంట్ రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 72 కొత్త రైళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు రైళ్లకు పొడిగింపులు, మరో మూడు రైళ్లకు ఫ్రీక్వెన్సీ పెంచుతున్నట్లు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న రైళ్లలో ఎనిమిది గుంతకల్లు డివిజన్ మీదుగా వెళ్లనున్నాయి. వీటిలో రెండు ప్రీమియం, ఆరు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నట్లు రైల్వే అధికార వర్గాలు వెల్లడించాయి. సొంత రాష్ట్రమైన కర్ణాటకకు మేలు చేయడానికి రైల్వే మంత్రి ఖర్గే చేసిన ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఎనిమిది రైళ్లు గుంతకల్లు డివిజన్ మీదుగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్రీక్వెన్సీ పెంచిన మూడు రైళ్లలో రెండు ఎక్స్‌ప్రెస్‌లు డివిజన్ మీదుగా పరుగులు తీయనున్నాయి. -
మహిళా బోగీల్లో కెమెరాలు
న్యూఢిల్లీ: మహిళా బోగీల్లో సీసీ టీవీ కెమెరాలు, అత్యవసర అలారమ్ బెల్స్ ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ కమిటీ రైల్వే శాఖకు సిఫార్సు చేసింది. మహిళా రక్షణకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఈ సిఫార్సులు చేసింది. సీసీటీవీ కెమెరాల వల్ల ప్రయాణికుల ఏకాంతానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని, అలారమ్ బెల్స్‌ను లోకో పైలట్, గార్డ్ క్యాబిన్‌కు అనుసంధానం చేయాలని సూచించింది. రైల్వేపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం పలు కీలక సిఫార్సులు చేసింది. 31 మంది సభ్యులున్న ఈ కమిటీకి డీఎంకే ఎంపీ టీఆర్ బాలు నేతృత్వం వహించారు. కమిటీ సూచనల్లో మరికొన్ని ముఖ్యాంశాలు... - మహిళల బోగీలకు ప్రత్యేకమైన రంగును కేటాయించాలి. దీనివల్ల మహిళా బోగీలను గుర్తించడానికి వీలు కలుగుతుంది. చదువురాని ప్రయాణికులకు ఇది సులువుగా అర్థమవుతుంది. - మహిళా బోగీల్లోకి అనధికార వ్యాపారులను, యాచకులను అనుమతించరాదు. - అన్ని రైళ్లలోని మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేయాలి. జోన్ల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఉన్నందున ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నందున ఒకే నంబర్ ఏర్పాటు చేయాలి. - రైల్వే స్టేషన్లలో తగినంత మంది భద్రతా సిబ్బందిని ఉంచడం ద్వారా మహిళల్లో విశ్వాసం పెంపొందించవచ్చు. రాత్రి వేళల్లోనూ భద్రతా సిబ్బంది విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలి. - ఆర్పీఎఫ్లో మహిళా క్యాడెట్ల సంఖ్యను పెంచాలి. - రైళ్లలో ప్రయాణించే వారికి కనీస వసతులు కల్పించడంపై దృష్టిసారించాలి. తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలి. స్టేషన్ పరిసరాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా, తగినంత వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. - ప్రతి స్టేషన్లో ఎలక్ట్రానిక్ ఇండికేటర్ బోర్డులు ఏర్పాటు చేయాలి. -
టెర్మినస్‌గా పరేల్!
సాక్షి, ముంబై: పరేల్ రైల్వేస్టేషన్ త్వరలో టెర్మినస్‌గా మారనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సెంట్రల్ రైల్వే పరిపాలనా విభాగం రైల్వే బోర్డుకు పంపించింది. ఈ ప్రతిపాదనకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇందువల్ల ప్రస్తుతం దాదర్ స్టేషన్‌పై పడుతున్న ప్రయాణికుల భారం 50 శాతానికి తగ్గుతుంది. పరేల్-ఎల్ఫిన్స్టన్ రోడ్ స్టేషన్ల మధ్య వృథాగా ఉన్న ట్రాక్‌లను తొలగించి టెర్మినస్‌ను నిర్మించనున్నారు. ఇందుకు దాదాపు రూ.80 కోట్లు ఖర్చవుతాయని సంబంధిత అధికారులు అంచనా వేశారు. నగరంలో అత్యధికంగా రద్దీగా ఉండే స్టేషన్లలో దాదర్ ఒకటి. ఇక్కడ పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలు కలుస్తాయి. దీంతో ఈ రెండు మార్గాల్లో స్లో లేదా ఫాస్ట్ రైళ్లలో వచ్చిన ప్రయాణికులు రైలు మారాలంటే దాదర్ స్టేషన్లో తప్పనిసరిగా దిగాల్సిందే. అంతేకాకుండా దూరప్రాంతాలకు వెళ్లే, వచ్చే ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలో 95 శాతం ఇక్కడ ఆగుతాయి. దీంతో ఈ స్టేషన్‌పై ప్రయాణికుల భారం విపరీతంగా పడుతోంది. ఉదయం నుంచి అర్ధరాత్రిదాకా ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటపడేందుకు కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతోంది. దీన్ని బట్టి ఇక్కడ రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో పరేల్ స్టేషన్‌ను టెర్మినస్‌గా మార్చాలనే ప్రతిపాదన కొద్ది సంవత్సరాల క్రితమే తెరపైకొచ్చింది. ప్రతి రోజూ 30 లోకల్ రైళ్లు దాదర్ నుంచి బయల్దేరతాయి. నానాటికీ రద్దీ పెరుగుతుండడంతో ఇక ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), దాదర్ నుంచి అదనంగా రైళ్లు నడపడం సాధ్యం కావడం లేదు. దీంతో పరేల్‌ను టెర్మినస్‌గా మారిస్తే అక్కడి నుంచి కొన్ని లోకల్ రైళ్లను నడిపేందుకు వీలవుతుంది. భవిష్యత్తులో పరేల్ నుంచి ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నడిపే యోచనలో రైల్వే శాఖ ఉంది. దీంతో ఈ స్టేషన్ రాబోయే కాలంలో ఎంతో కీలకపాత్ర పోషించనుంది. పరేల్ టెర్మినస్ ప్రత్యేకతలివే {పస్తుతం ఉన్న అప్ స్లో మార్గం ప్లాట్‌ఫాం పొడవు సీఎస్టీ దిశగా పెంచి ఎల్ఫిన్స్టన్ రోడ్ స్టేషన్‌తో కొత్త వంతెనను కలుపుతారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంకు అనుకుని వృథాగా ఉన్న ట్రాక్‌లను తొలగిస్తారు. అక్కడ మరో ప్లాట్‌ఫాం నిర్మించి అక్కడి నుంచి లోకల్ రైళ్లను నడుపుతారు. ఒకటి, రెండో నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ) కి ఇరువైపులా మెట్లు ఏర్పాటు చేస్తారు. (ప్రస్తుతం ఒకేవైపు ఉన్నాయి.) ప్లాట్‌ఫాం మధ్యలో మరో ఎఫ్ఓబీని నిర్మించి తూర్పు దిశగా దిగేందుకు దానికి మెట్లు ఏర్పాటు చేస్తారు. దీంతో ఒకే బ్రిడ్జిపై ప్రయాణికుల భారం పడదు. -
హైస్పీడ్ రైళ్లలో ఆహారం ప్రియం
సాక్షి, హైదరాబాద్: హైస్పీడ్ రైళ్లుగా పేరుగాంచిన శతాబ్ది, దురంతో, రాజధాని రైళ్లలో భోజనం ధర మరింత ఖరీదు కానుంది. తరగతుల వారీగా భోజనం ధరలను రైల్వే బోర్డు తాజాగా సవరించింది. గురువారం నుంచే కొత్త ధరలు అమల్లోకి రానున్నట్టు రైల్వేవర్గాలు తెలిపాయి. మొదటి తరగతి ఏసీ, ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో బ్రేక్‌ఫాస్ట్ ధర 35 శాతం, లంచ్, డిన్నర్ రేట్లు 15 శాతం పెరగనున్నాయి. రెండవ తరగతి ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్లో బ్రేక్‌ఫాస్ట్ 60 శాతం, లంచ్, డిన్నర్ 50 శాతం మేర పెరగనున్నాయి. పెరిగిన భోజనం ధరలు పాత ధరలతో పోల్చితే ఒక్కొక్క దానికి రూ.25 నుంచి రూ. 27 వరకు ఉంటుందని అంచనా. అయితే, టీ ధరలను మాత్రం తగ్గించారు. రెండవ తరగతి ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్లలో ఉదయం టీ ధర 40 శాతం, సాయంత్రం టీ ధర 10 శాతం మేర తగ్గించారు. రైల్వే బోర్డు అఖరిగా 1999లో భోజనం ధరలను పెంచింది.