ఢిల్లీ: దేశ చర్రితలోనే మొదటిసారిగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా తొలిసారిగా మహిళను నియమించింది. జయవర్మ సిన్హాను కేంద్రం రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది.
వివరాల ప్రకారం.. రైల్వే బోర్డు సీఈవో, చైర్‌పర్సన్‌గా జయవర్మ సిన్హా నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దేశ చరిత్రలోనే రైల్వే బోర్డు సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళా అధికారి జయవర్మనే కావడం విశేషం. కాగా, ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అధికారిణి అయిన జయవర్మ.. ప్రస్తుతం రైల్వే బోర్డు సభ్యురాలిగా(ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్) ఉన్నారు.
Congratulations 🌹🎉🙂 Jaya Verma Sinha, Indian Railway Management Services (IRMS), Member (Operations & Business Development), Railway Board appointed as Chairman & Chief Executive Officer (CEO), Railway Board: Govt of India. @RailMinIndia #WomenEmpowerment #RakshaBandangift pic.twitter.com/3kRFq3OesJ
— Uppal Shah (@uppalshah) August 31, 2023
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31వ తేదీ వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జయవర్మ సీఈవోగా కొనసాగనున్నారు. 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో సిన్హా చేశారు. నార్తర్న్ రైల్వే, సౌత్ ఈస్ట్ రైల్వే, ఈస్టర్న్ రైల్వేలో ఆమె పని చేశారు. ఆమె అలహాబాద్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావడం విశేషం. కాగా, నేటి వరకు రైల్వే బోర్డు సీఈవోగా అనిల్ కుమార్ లహాటీ కొనసాగారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రధాని మోదీ చంద్రయాన్-3 విజయం సందర్భంగా మహిళల శక్తి గురించి ప్రత్యేకంగా చర్చించారు. మహిళలను అభినందించారు. మహిళల పాత్ర అనిర్వచనీయమని ప్రధాని మోదీ వారిని అభినందించి, మెచ్చుకున్నారు. అలాగే వారితో కలిసి గ్రూపు ఫోటో కూడా దిగారు. అటు మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మహిళా సాధికారతపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా డాటర్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఉంటే భారత్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోగలరు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధి మన దేశ స్వాభావిక లక్షణంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటే మహిళా శక్తితో సుసాధ్యంగా చేయవచ్చు అని చెప్పారు.
ఇది కూడా చదవండి: జాబిల్లి పెరట్లో రోవర్ ఆటలు.. చంద్రయాన్ 3 న్యూ వీడియో..
Comments
Please login to add a commentAdd a comment