న్యూఢిల్లీ: రైల్వే బోర్డులో సమర్థతను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బోర్డు అధికారుల సంఖ్యను 200 నుంచి 150కి తగ్గించింది. డైరెక్టర్, ఆ పై స్థాయికి చెందిన 50 మంది అధికారులను వివిధ జోన్లకు బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పరిపాలన అనే ప్రధాని ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ అధికారుల సేవలను గరిష్టంగా వినియోగించుకునేందుకు వారిని వివిధ జోన్లకు బదిలీ చేశాం’ అని రైల్వే ఉన్నతాధికారి చెప్పారు.
బోర్డులో అవసరమైన మేరకే సిబ్బంది ఉండాలన్నది నాటి ప్రధాని వాజ్‌పేయి ఆలోచన. బోర్డును పునర్వ్యవస్థీకరించాలని 2015లో డెబ్రాయ్ కమిటీ సిఫారసు చేసింది. రైల్వే శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వేసిన తొలి అడుగే రైల్వే బోర్డులో సిబ్బందిని తగ్గించడమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment