నిధుల కేటాయింపు పరంగా గుంతకల్లు డివిజన్‌కు నిరాశ ఎదురైనా.. కొత్త రైళ్ల మంజూరు మాత్రం కాస్త ఊరట కల్గిస్తోంది. వాస్తవానికి రాయలసీమ జిల్లాల అవసరాలు తీర్చడం కోసం కొత్త రైళ్లను మంజూరు చేయాలని గుంతకల్లు డివిజన్ అధికారులు, ఎంపీలు మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. వీటిని రైల్వే మంత్రి గానీ, రైల్వే బోర్డు గానీ పరిగణనలోకి తీసుకోలేదు. అయితే..
దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రవేశపెడుతున్న కొత్త రైళ్లలో దాదాపు ఎనిమిది రైళ్లు గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా పరుగులు తీయనున్నాయి. రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం ఓట్ ఆన్ అకౌంట్ రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 72 కొత్త రైళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు రైళ్లకు పొడిగింపులు, మరో మూడు రైళ్లకు ఫ్రీక్వెన్సీ పెంచుతున్నట్లు తెలిపారు.
కొత్తగా ప్రవేశపెట్టనున్న రైళ్లలో ఎనిమిది గుంతకల్లు డివిజన్ మీదుగా వెళ్లనున్నాయి. వీటిలో రెండు ప్రీమియం, ఆరు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నట్లు రైల్వే అధికార వర్గాలు వెల్లడించాయి. సొంత రాష్ట్రమైన కర్ణాటకకు మేలు చేయడానికి రైల్వే మంత్రి ఖర్గే చేసిన ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఎనిమిది రైళ్లు గుంతకల్లు డివిజన్ మీదుగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్రీక్వెన్సీ పెంచిన మూడు రైళ్లలో రెండు ఎక్స్‌ప్రెస్‌లు డివిజన్ మీదుగా పరుగులు తీయనున్నాయి.
..కాస్త ఊరట
Published Thu, Feb 13 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement