న్యూఢిల్లీ: పొగమంచు వంటి అననుకూల వాతావరణ పరిస్థితుల్లోనూ రైళ్లను గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడపాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. పొగమంచు వంటి అవాంతరాలు ఎదురైన సందర్భాల్లో ప్రస్తుతం ఉన్న 60 కిలోమీటర్లకు బదులు 75 కి.మీ వరకు వేగంతో రైళ్లను నడిపేలా డ్రైవర్లకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు రైల్వే బోర్డు అన్ని జోన్ల అధికారులకు లేఖలు రాసింది.
ఇలాంటి పరిస్థితుల్లో ట్రాక్ స్పష్టంగా కనిపించేందుకు అవసరమైన పరికరాలను వాడుకోవాలని సూచించింది. ఆర్థికంగా లాభసాటి కాని స్టేషన్లలో రైళ్లను ఆపవద్దని, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ పాయింట్లను, సమయాన్ని తగ్గించటం వంటి చర్యలతో వేగం పెంచుకోవాలని జోన్లకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment