రైల్వే బోర్డు సభ్యులు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అంశం ఇంకా తమ పరిశీలనలోనే ఉందని రైల్వే బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.శుక్రవారం తెలుగు మీడియా ప్రతినిధులతో బోర్డు సభ్యులు మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై బోర్డు సభ్యులు స్పందిస్తూ.. ‘రైల్వే జోన్ ఇవ్వడం వల్ల ఏపీకి ఏం లాభం? జోన్ ఏర్పాటు వల్ల ఏపీకి ఉద్యోగాలు కానీ, ఆదాయం కానీ రాదు కదా? అని ఎదురు ప్రశ్నించారు. దీనిపై రైల్వే బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటైందని చెప్పారు.
భువనేశ్వర్ – మైసూర్, హౌరా – యత్వంత్‌పూర్ మధ్య నడిచే అంత్యోదయా రైళ్లకు ఏపీలో పలుచోట్ల హాల్ట్ ఇస్తున్నట్టు తెలిపారు. ఏపీకి రాజధాని రైలును ఎప్పుడు కేటాయిస్తారని ప్రశ్నించగా.. ‘ముందు మీ రాష్ట్ర రాజధాని నిర్మాణం పూర్తి కానివ్వండి.. తర్వాత మా రాజధాని రైలును కేటాయిస్తామ’ని సభ్యులు చమత్కరించారు.
పరిశీలనలో విశాఖ రైల్వే జోన్
Published Sat, Feb 18 2017 1:10 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM
Advertisement