భువనేశ్వర్: ఇటీవలే ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బహనాగ వద్ద మూడు రైళ్లు ఒక్కదానినొకిటి ఢీకొనడంతో పెను ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై కుట్ర కోణంలో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగిన మూడు వారాల తర్వాత అధికారులపై రైల్వే బోర్డు చర్యలకు తీసుకుంది. ఈ నేపథ్యంలో సౌత్ ఈస్టర్ రైల్వేస్‌కు చెందిన ఐదుగురు ఉన్నతాధికారులపై బోర్డు వేటు వేసింది. సిగ్నలింగ్, ఆపరేషన్స్, సేఫ్టీ విభాగాలను చూసే ఈ అధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. ఇక, వేటు పడిన వారిలో ఖరగ్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ శుజాత్ హష్మీ, ఎస్‌ఈఆర్ జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ పీఎం సిక్దర్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ చందన్ అధికారి, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ డీబీ కేసర్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎండీ ఓవైసీ ఉన్నారు. అయితే, ఇది సాధారణ బదిలీల్లో భాగమేనని అధికారులు వెల్లడించారు.
జేఈ ఇంటి సీల్ వేసిన సీబీఐ
మరోవైపు.. ఒడిషా రైలు ప్రమాదం తర్వాత భారతీయ రైల్వేస్‌లో సిగ్నల్ జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమీర్ ఖాన్, అతని కుటుంబం కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు హడావిడిగా అతను ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంటికి తాళం ఉన్నది గమనించక.. సీల్ వేసి మరీ వెళ్లడం గమనార్హం. ఆపై సోరోలోని తెంటెయ్ ఛక్‌లో ఉన్న బాహానాగా స్టేషన్ మాస్టర్ ఇంటికి సైతం సీబీఐ బృందం వెళ్లింది.
అయితే.. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సిగ్నల్ జేఈ అయిన అమీర్ ఖాన్ బాలాసోర్ ప్రమాద ఘటన జరిగిన రీజియన్‌లోనే పని చేస్తున్నాడు. జూన్ 2వ తేదీ రాత్రి బాలాసోర్ రైలు ప్రమాద ఘటన జరగ్గా.. రంగంలోకి దిగిన సీబీఐ సిగ్నల్ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు అతనిపై అనుమానాలు ఉన్నాయి. అందుకే నిఘా వేసింది. ఆ తర్వాతే అతను కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు.
ఇది కూడా చదవండి: ఎదురొచ్చి మరీ మోదీకి బైడెన్ దంపతుల సాదర స్వాగతం.. ప్రత్యేక విందు
Comments
Please login to add a commentAdd a comment