న్యూఢిల్లీ: పెళ్లి వేడుకలకు, విహార యాత్రలకు ఇకమీదట రైల్వే బోగీలను, ప్రత్యేక రైళ్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. ‘సింగిల్ విండో బుకింగ్’ విధానంలో ఫుల్ టారిఫ్ రేట్ (ఎఫ్‌టీఆర్) చెల్లించి బుక్ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఇలాంటి బుకింగ్‌లపై 30 శాతం సేవా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద ప్రతి బోగీకి రూ.50,000 చెల్లించాలి. గతంలో కోచ్‌లు, రైళ్లను బుక్ చేసేందుకు సంబంధిత స్టేషన్ సూపర్‌వైజర్, స్టేషన్ మాష్టర్‌ను సంప్రదించాలి. ప్రయాణవివరాలన్నీ ఎఫ్‌టీఆర్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. డబ్బులు డిపాజిట్ చేశాక రసీదు ఇస్తారు. అయితే ఈ విధానమంతా గందరగోళంగా ఉందని, దీన్ని సవరించాలని ఫిర్యాదులు రావడంతో కొత్తగా ఈ విధానం తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment