గుంతకల్లు : భారతీయ రైల్వేలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న గుంతకల్లు డీజిల్‌షెడ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యుదీకరణ ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో విద్యుత్ లోకోషెడ్ నిర్మాణం త్వరితగతిన సాగుతోంది. ఇది పూర్తి కాగానే ఇక్కడి డీజిల్‌షెడ్‌ను గుత్తిలో ఉన్న షెడ్‌లో విలీనం చేయడం దాదాపు ఖాయం. దక్షిణ మధ్య రైల్వేలో ఏకైక మీటర్ గేజ్ షెడ్‌గా కొనసాగి.. డీజిల్‌షెడ్ రూపాంతరం చెంది, డీఆర్‌ఎం స్థారుు నుంచి రాష్ట్రపతి వరకు అనేక మంది నుంచి అవార్డులు పొందింది.
నాటి నుంచి నేటి వరకు..
గుంతకల్లులో మీటర్‌గేజ్ డీజిల్‌షెడ్ నిర్మించాలని 1963 జూన్‌లో రైల్వే శాఖ నిపుణుల కమిటీ గుర్తించడంతో అదే ఏడాది నవంబర్‌లో రైల్వే బోర్డు అనుమతి మంజూరు చేసింది. అప్పటి సదరన్ రైల్వే జీఎం హెచ్‌డి సింగ్ ఆధ్వర్యంలో 1964 ఆగస్టు 30న డీజిల్ షెడ్ ఏర్పాటు పనులు ప్రారంభించి ఎనిమిది మాసాల్లో పూర్తి చేశారు. తొలుత 11 మీటర్ గేజ్ మార్గపు రైలింజన్లతో షెడ్ ప్రారంభమైంది. ఈ డీజిల్‌షెడ్‌కు చెందిన ఎంజీ రైలింజన్లు గుంతకల్లు, బెంగుళూరు, హుబ్లీ, గోవా, గుంటూరు, బెజవాడ, ధర్మవరం, పాకాల, తిరుపతి, తిరుచనాపల్లితోపాటు దేశంలోని సుదూర ప్రాంతాలైన ఔరంగబాద్, ఖాండవ, అంకోలాకు ప్రయాణించేవి. యూనిగేజ్ ప్రభావంతో గుంతకల్లు డీజిల్‌షెడ్‌ను 1995 అక్టోబర్ 18న అప్పటి దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ ఎం.ఎం.ఫరూఖ్ బ్రాడ్‌గేజ్‌గా మార్పు చేశారు. ఆ సమయూనికి 120 ఎంజీ రైలింజన్లు ఉండేవి. కాలక్రమంలో గుంతకల్లుకు 28 కిలోమీటర్ల దూరంలోని గుత్తిలో బ్రాడ్‌గేజ్ రైలింజన్ షెడ్‌ను ప్రారంభించారు. గుంతకల్లు షెడ్ నుంచి ప్రయాణీకులను రవాణా చేసే రైలింజన్లు, గుత్తి షెడ్ నుంచి గూడ్స్ రైళ్ల ఇంజన్లు షంటింగ్ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం గుంతకల్లు డీజిల్‌షెడ్‌లో 112 రైలింజన్లు డివిజన్ పరిధిలోని అనేక రైళ్లకు సేవలందిస్తున్నాయి. స్థానిక డీజిల్‌షెడ్‌లోని డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్‌లో అసిస్టెంట్ లోకో పెలైట్ (ఏఎల్‌పి), లోకో పెలైట్ తదితర రన్నింగ్ విభాగపు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. అయితే విద్యుదీకరణ వేగవంతమైనందున గుంతకల్లు డీజిల్‌షెడ్‌ను గుత్తి డీజిల్‌షెడ్‌లోకి విలీనం చేసి గుంతకల్లులో విద్యుత్ లోకో షెడ్‌ను కొనసాగించాలని రైల్వే యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. పైగా కేవలం 28 కి.మీల దూరంలో రెండు డీజిల్ షెడ్లు కొనసాగించడంపై కూడా అభ్యంతరాలు రావడంతో త్వరలో ఇక్కడి డీజిల్‌షెడ్‌కు మంగళం పాడనున్నారని కార్మిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారుు.
ఇప్పటికైతే ప్రమాదం లేదు
గుంతకల్లు డీజిల్‌షెడ్ ఎత్తివేత అంశం వల్ల ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం లేదు. డివిజన్ పరిధిలో బ్రాడ్‌గేజ్ లైన్ల నిర్మాణం పుంజుకుంటే ఈ డీజిల్‌షెడ్‌ను కొనసాగించే అవకాశం ఉంది.
- గోపాల్, సీనియర్ డీఎంఈ (డీజిల్)
డీజిల్ షెడ్‌కు టాటా!
Published Fri, Feb 6 2015 2:31 AM | Last Updated on Wed, Sep 5 2018 1:47 PM
Advertisement
Advertisement