న్యూఢిల్లీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) ఆధునీకరణలో భాగంగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్పీఎఫ్ పోలీసులకు బాడీ కెమెరాలు, డ్రోన్లు, స్పై కెమెరాలు, వాయిస్ రికార్డర్ వంటి అత్యాధునిక పరికరాలు అందించేందుకు అంగీకరించింది. అలాగే ఈ అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసే అధికారాన్ని రైల్వే డివిజినల్, జోనల్ అధికారులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం డ్రోన్ కెమెరాలు, బ్యాగేజ్ స్కానర్లు, డ్రాగన్ సెర్చ్‌లైట్లు, ఫైరింగ్ సిమ్యులేటర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్‌ఎఫ్‌ఐడీ) ఆధారిత వ్యవస్థలు, కాల్ డేటా రికార్డర్, నైట్ విజన్ వంటి పరికరాలను డివిజినల్, జోనల్ అధికారులు కొనుగోలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment