విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ లేనట్టే?!
రైల్వే బోర్డుకు నివే దిక ఇచ్చిన కమిటీ భగ్గుమన్న ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు
విశాఖపట్నం సిటీ: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుకు జోన్ రీ ఆర్గనైజేషన్ కమిటీ బ్రేక్ వేసింది. ఇటీవల రైల్వే బోర్డుకు కమిటీ తన నివేదికను అందజేసింది. ఆ నివేదికలో మూడు డివి జన్లతోనే కొత్త జోన్ ఉండాలని ప్రతిపాదించిం ది. ప్రస్తుతమున్న తూర్పు కోస్తా రైల్వేలోనే విశాఖను కొనసాగించాలని స్పష్టం చేసింది. తూర్పు కోస్తా నుంచి వాల్తేరు రైల్వే డివిజన్‌ను విడదీయ డం సరికాదంది. వాల్తేరు, సంబల్‌పూర్, కుర్దా రైల్వే డివిజన్లతో కూడిన తూర్పు కోస్తా రైల్వే ఇతర జోన్లకు సమఉజ్జీగా వుందని అభిప్రాయపడింది.
వాల్తేరును తూర్పుకోస్తా నుంచి తొలగిం చడంతో కొత్తగా ఏర్పాటయ్యే జోన్‌కు ఎలాంటి ప్రయోజనం వుండదని పేర్కొంది. పైగా గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లతో బాటు వాల్తేరును కలిపితే ఏర్పాటయ్యే జోన్ మరింత పెద్దదిగా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రస్తుతమున్న తూర్పు కోస్తాను ఎటూ కదపకుండానే కొత్త జోన్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖ ప్రాధాన్యతను ఏ మాత్రం పట్టించుకోకపోవడం నగరవాసులను తీవ్రంగా కలచివేస్తోం ది. విశాఖ కేంద్రంగా జోన్ ప్రకటించకపోతే మళ్లీ ఆందోళనలు ఉధృతం చేస్తామని జోన్ సాధన కమిటీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఆదాయమే అడ్డంకి..!
వాల్తేరు రైల్వే డివిజన్‌ను వదులుకోవడానికి తూర్పు కోస్తా రైల్వే ఇష్టపడడం లేదు. బంగారు బాతులాంటి ఈ డివిజన్ వదులుకుంటే ఏటా రూ.6300 కోట్లు ఆదాయం కోల్పోవాల్సి వస్తుం దని తూర్పు కోస్తా ఆందోళన చెందుతోంది. కోచింగ్ రైళ్లు(ప్రయాణికుల రైళ్లు) కన్నా గూడ్సు రైళ్లు ద్వారానే వాల్తేరు డివిజన్ ఏటా దాదాపు రూ.6 వేల కోట్లు ఆర్జిస్తోంది. పెట్టుబడి తక్కువ గా ఉండి ఆదాయం ఎక్కువగా వుండే ఈ డివి జన్‌ను వదులుకునేందుకు ఒడిశా కనుసన్నల్లోని రైల్వే అధికారుల బృందం ససేమిరా అంటోంది.