Vizag center
-
'రైల్వే జోన్ విశాఖ కేంద్రంగానే వస్తుంది'
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే బాగుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విశాఖలో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేశ్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగానే వస్తుందని అన్నారు. దీనిపై తాము ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని సురేశ్‌రెడ్డి తెలిపారు. -
విశాఖ కేంద్రంగా ఏపీలో పాస్‌పోర్ట్ సేవలు
మర్రిపాలెం(విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా పాస్‌పోర్ట్ సేవలు ఉంటాయని పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విశాఖతో పాటు విజయవాడ, తిరుపతి కేంద్రాలలో ప్రజలు సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల ప్రజలు తిరుపతి కేంద్రంలో, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు విజయవాడ కేంద్రంలో, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలు విశాఖ కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవలు అందుకోవచ్చని వివరించారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు విజయవాడ కేంద్రంలో ప్రత్యేక కౌంటర్లతో సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో అధికారులు విశాఖలో పాస్‌పోర్ట్ సేవలు అన్నట్లు చేసిన ప్రకటన అపోహలకు దారి తీసిందన్నారు. ఇప్పటి వరకూ హైదరాబాద్ కేంద్రంగా సేవలు అందుతోన్న రాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను విశాఖ కేంద్రానికి అనుసంధానం చేసినట్టు తెలిపారు. ఆయా జిల్లాల ప్రజలకు ఎప్పటి మాదిరిగానే విజయవాడ, తిరుపతిలలో పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. విశాఖలో పాస్‌పోర్ట్ కార్యాలయం ‘పాస్‌పోర్ట్ సేవ ఎట్ యువర్ డోర్ స్టెప్’గా పనిచేస్తుందన్నారు. -
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ లేనట్టే?!
రైల్వే బోర్డుకు నివే దిక ఇచ్చిన కమిటీ భగ్గుమన్న ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు విశాఖపట్నం సిటీ: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుకు జోన్ రీ ఆర్గనైజేషన్ కమిటీ బ్రేక్ వేసింది. ఇటీవల రైల్వే బోర్డుకు కమిటీ తన నివేదికను అందజేసింది. ఆ నివేదికలో మూడు డివి జన్లతోనే కొత్త జోన్ ఉండాలని ప్రతిపాదించిం ది. ప్రస్తుతమున్న తూర్పు కోస్తా రైల్వేలోనే విశాఖను కొనసాగించాలని స్పష్టం చేసింది. తూర్పు కోస్తా నుంచి వాల్తేరు రైల్వే డివిజన్‌ను విడదీయ డం సరికాదంది. వాల్తేరు, సంబల్పూర్, కుర్దా రైల్వే డివిజన్లతో కూడిన తూర్పు కోస్తా రైల్వే ఇతర జోన్లకు సమఉజ్జీగా వుందని అభిప్రాయపడింది. వాల్తేరును తూర్పుకోస్తా నుంచి తొలగిం చడంతో కొత్తగా ఏర్పాటయ్యే జోన్‌కు ఎలాంటి ప్రయోజనం వుండదని పేర్కొంది. పైగా గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లతో బాటు వాల్తేరును కలిపితే ఏర్పాటయ్యే జోన్ మరింత పెద్దదిగా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రస్తుతమున్న తూర్పు కోస్తాను ఎటూ కదపకుండానే కొత్త జోన్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖ ప్రాధాన్యతను ఏ మాత్రం పట్టించుకోకపోవడం నగరవాసులను తీవ్రంగా కలచివేస్తోం ది. విశాఖ కేంద్రంగా జోన్ ప్రకటించకపోతే మళ్లీ ఆందోళనలు ఉధృతం చేస్తామని జోన్ సాధన కమిటీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆదాయమే అడ్డంకి..! వాల్తేరు రైల్వే డివిజన్‌ను వదులుకోవడానికి తూర్పు కోస్తా రైల్వే ఇష్టపడడం లేదు. బంగారు బాతులాంటి ఈ డివిజన్ వదులుకుంటే ఏటా రూ.6300 కోట్లు ఆదాయం కోల్పోవాల్సి వస్తుం దని తూర్పు కోస్తా ఆందోళన చెందుతోంది. కోచింగ్ రైళ్లు(ప్రయాణికుల రైళ్లు) కన్నా గూడ్సు రైళ్లు ద్వారానే వాల్తేరు డివిజన్ ఏటా దాదాపు రూ.6 వేల కోట్లు ఆర్జిస్తోంది. పెట్టుబడి తక్కువ గా ఉండి ఆదాయం ఎక్కువగా వుండే ఈ డివి జన్ను వదులుకునేందుకు ఒడిశా కనుసన్నల్లోని రైల్వే అధికారుల బృందం ససేమిరా అంటోంది. -
ఒడిశా ఒత్తిడితోనే జోన్ గల్లంతు!
సాక్షి, విజయవాడ బ్యూరో: విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు దాదాపు ఖాయమైనా, దాని ప్రస్తావన ఈ బడ్జెట్లో లేకపోవడానికి ఒడిశా ప్రభుత్వం ఒత్తిడే కారణమని తెలిసింది. వాల్తేరు డివిజన్లో భాగంగా ఉన్న విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉంది. ఇక్కడ కొత్త జోన్ ఏర్పాటు చేస్తే ఒడిశా ప్రాంతాలను వాల్తేరు డివిజన్‌ను నుంచి వేరుచేసి, తెలుగు ప్రాంతాలను మాత్రమే అందులో కొనసాగిస్తారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఈ డివిజన్ లేకపోతే ఆ జోన్‌కు ఆదాయం దారుణంగా పడిపోయి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధాని నరేం ద్ర మోడీని కలిసి ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరినట్టు సమాచారం. వాల్తేరు డివిజన్‌ను వేరే చేస్తే నార్త్ కోస్ట్ జోన్ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని ఆయన ప్రధానికి చెప్పినట్లు తెలిసింది.