సాక్షి, విజయవాడ బ్యూరో: విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు దాదాపు ఖాయమైనా, దాని ప్రస్తావన ఈ బడ్జెట్‌లో లేకపోవడానికి ఒడిశా ప్రభుత్వం ఒత్తిడే కారణమని తెలిసింది. వాల్తేరు డివిజన్‌లో భాగంగా ఉన్న విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో ఉంది. ఇక్కడ కొత్త జోన్ ఏర్పాటు చేస్తే ఒడిశా ప్రాంతాలను వాల్తేరు డివిజన్‌ను నుంచి వేరుచేసి, తెలుగు ప్రాంతాలను మాత్రమే అందులో కొనసాగిస్తారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది.
ఈ డివిజన్ లేకపోతే ఆ జోన్‌కు ఆదాయం దారుణంగా పడిపోయి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధాని నరేం ద్ర మోడీని కలిసి ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరినట్టు సమాచారం. వాల్తేరు డివిజన్‌ను వేరే చేస్తే నార్త్ కోస్ట్ జోన్ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని ఆయన ప్రధానికి చెప్పినట్లు తెలిసింది.
ఒడిశా ఒత్తిడితోనే జోన్ గల్లంతు!
Published Wed, Jul 9 2014 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
Advertisement