న్యూఢిల్లీ : తమ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం మాములే. కానీ రైల్వే విషయంలో మాత్రం నేతల నుంచి కేంద్రానికి అధిక డిమాండ్లు వస్తున్నాయి. కేవలం మూడేళ్ల కాలంలో ఏకంగా 174 మంది ప్రముఖలు తమ పాంతాల్లో కొత్త రైల్వే జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరడం జరిగింది. అందులో మాజీ రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్, శశి థరూర్ వంటి ప్రముఖలు ఉన్నారు. ఇందులో 55 మంది కొత్త రైల్వే జోన్ల అంశాన్ని ప్రస్తావించగా, 119 మంది రైల్వే డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. వీరిలో రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహేన్ కూడా ఉండటం విశేషం.
ఈ డిమాండ్లపై రైల్వే బోర్డు మాజీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘రైల్వే జోన్లు ఏర్పాటు చేయడం రాజకీయాలతో ముడిపడిన అంశం. కమిటీలను ఏర్పాటు చేయడం.. వాటి అనుకూలతలను తెలుసుకోవడం జరుగుతుంది. కానీ అలా ఏర్పాటు చేసిన కమిటీలే రైల్వే జోన్ల సంఖ్యను తగ్గించాలని చెబుతున్నాయి. 2002-2003 మధ్య కాలంలో కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత రాజకీయ కారణాలతో నేతలు ఆయా ప్రాంతాల్లో రైల్వే జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నారు. 2009-2013 మధ్య కాలంలో రైల్వే జోన్లకు సంబంధించి 92, డివిజన్లకు సంబంధించి 45 డిమాండ్లు వచ్చాయి. వీటిపై కమిటీ వేసి పరిశీలన జరపగా.. అందులో ఏ ఒక్క డిమాండ్ కూడా సముచితమైనది కాదని తేలిందని’ అన్నారు
కొందరు ప్రముఖల డిమాండ్లు :
1. నితిన్ గడ్కరీ- నాగ్‌పూర్ కొత్త రైల్వే జోన్‌తో పాటు రైల్వే డివిజన్
2. రాజేన్ గోహేన్- ఈశాన్య ప్రాంతాలకు కొత్త రైల్వే జోన్
3. సచిన్ టెండూల్కర్- ముంబై సబ్ అర్బన్ రైల్వే జోన్
4. శశి థరూర్- తిరువనంతపురం కొత్త రైల్వే జోన్, కానూర్ రైల్వే డివిజన్
5. ఎల్‌కే అద్వానీ- గుజరాత్‌లో కొత్త రైల్వే జోన్
6. యోగీ ఆదిత్యనాథ్- గోరఖ్‌పూర్ రైల్వే డివిజన్
7. జితేంద్ర సింగ్- ఉదంపూర్‌లో రైల్వే డివిజన్
Comments
Please login to add a commentAdd a comment