budget-2014
-
సాక్షి కార్టూన్ (12-07-2014)
జైట్లీని తన పార్టీ కలర్ దుస్తుల్లో చూసే సరికి తట్టుకోలేక అలా అనేశాడేమో సార్! -
నమో మిడిల్ క్లాస్...
-
బడ్జెట్లో మెరుపులకు దూరంగానే
-
లోక్‌పాల్‌కు రూ. 2 కోట్లే..
న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన లోక్‌పాల్ వ్యవస్థకు కేంద్ర బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులే దక్కాయి. లోక్‌పాల్‌కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 2 కోట్లు మాత్రమే కేటాయించింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ ఈ మొత్తం లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటుకు సరిపోతుందని కేంద్రం పేర్కొంది. మరోవైపు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కి కేటాయింపుల్లోనూ స్వల్పంగా కోత విధించింది. సీవీసీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 21.29 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ. 94 లక్షలు కోత పెట్టి రూ. 20.35 కోట్లు కేటాయించింది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం 2013కు గత ఏడాది డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదం లభించగా.. ఈ ఏడాది జనవరి 1న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం లోక్‌పాల్ చైర్పర్సన్, ఇతర సభ్యుల ఎన్నికల ప్రక్రియకు కేంద్రం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైమానిక అనుసంధానాన్ని మరింత విస్తృతం చేసేందుకు విమానాశ్రయాల నిర్మాణం కోసం కొత్త పథకాన్ని ప్రకటించనున్నామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. ఇందులో భాగంగా పెద్ద నగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ‘పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)’ విధానంలో ఈ విమానాశ్రయాల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొంది. పౌర విమానయాన శాఖకు గత బడ్జెట్లో రూ. 8,502 కోట్లు కేటాయించగా... ఈ సారి 11.4 శాతం అధికంగా రూ. 9,474 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందులో రూ. 6,720 కోట్లను ప్రణాళికా పద్దు కింద ఇవ్వనుండగా.. రూ. 2,754 కోట్లను ప్రణాళికేతర వ్యయం కింద అందజేయనున్నట్లు చెప్పారు. దేశంలో ఎంతో మందికి విమానం ఎక్కాలనే కోరిక ఇంకా తీరకుండా ఉందన్నారు. అందువల్ల పెద్ద నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ భారీ సంఖ్యలో కొత్త విమానాశ్రయాలను నిర్మించి, విమాన సర్వీసులను పెంచనున్నట్లు తెలిపారు. మొత్తంగా పౌర విమానయాన శాఖకు కేటాయించిన బడ్జెట్లో ప్రభుత్వ వైమానిక సంస్థ ఎయిరిండియాకు రూ. 7,069 కోట్లు, విమానాశ్రయాల సంస్థకు రూ. 2,134 కోట్లు, పవన్ హాన్స్ హెలికాప్టర్ల సంస్థకు రూ. 46 కోట్లు ఇవ్వనున్నారు. అయితే ఎయిరిండియాకు గత బడ్జెట్లో కంటే కేవలం రూ. 6 కోట్లు మాత్రమే ఎక్కువగా ఇవ్వడం గమనార్హం. తొమ్మిది విమానాశ్రయాల్లో ఈ-వీసా.. పర్యాటకులను ఆకర్షించడం లక్ష్యంగా కేంద్రం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈ-వీసా)ను ప్రవేశపెట్టనుంది. దశలవారీగా దేశంలోని తొమ్మిది విమానాశ్రయాల్లో ఈ-వీసా ప్రక్రియను ప్రవేశపెడతామని జైట్లీ తెలిపారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను రాబోయే ఆరు నెలల్లో కల్పించనున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల సృష్టిలో పర్యాటక రంగం ఒకటని, ఈ-వీసా సదుపాయం దేశంలో పర్యాటక రంగానికి మరింత ఊపును తెస్తుందని ఆయన చెప్పారు -
ఇస్రోకు ఇం‘ధనం’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తన తొలి బడ్జెట్లో అంతరిక్ష పరిశోధనలకు పెద్దపీట వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు నిధుల కేటాయింపును తాజా బడ్జెట్లో ఒకేసారి 50 శాతం పెంచి రూ.6,000 కోట్లు కేటాయించింది. 2013-14 బడ్జెట్లో అంతరిక్ష శాఖకు తొలుత రూ.5,615 కోట్లు కేటాయించారు. అయితే తర్వాత దానిని రూ.4 వేల కోట్లకు సవరించారు. తాజాగా అంతరిక్ష పరిశోధనలకు రూ.3,545.63 కోట్లు, ఇన్శాట్ ప్రాజెక్టుకు రూ.1,412.98 కోట్లు కేటాయించారు. 2014-15 సంవత్సరంలో జీఎస్ఎల్వీ ఎంకే-3, పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలతోపాటు మరో రెండు నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అధిక బరువును మోసుకెళ్లే జీఎస్ఎల్వీ ఎంకే-3 రాకెట్ ప్రాజెక్టుకు రూ.378.76 కోట్లు, చంద్రయాన్-2 మిషన్ కొనసాగింపునకు రూ.60 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అలాగే గతేడాది ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం అంగారకుడి వైపుగా దూసుకెళుతోందని, ఆ ప్రాజెక్టు కొనసాగింపునకు తాజా బడ్జెట్లో రూ.65.93 కోట్లు కేటాయించామని చెప్పారు. కాగా, శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇటీవల ఐదు విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఇస్రో నింగిలోకి పంపడం, ఆ ప్రయోగానికి ప్రధాని మోడీ హాజరు కావడం తెలిసిందే. అంతరిక్ష రంగంలో విస్తృత సేవలు అందించేందుకు భారత్‌కు అవకాశాలున్నాయని, భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం కూడా ఇస్రో సాధించాలని ఆ సందర్భంగా సూచించిన మోడీ.. తాజాగా ఇస్రో పరిశోధనలకు ఊతమిచ్చేలా కేటాయింపుల్లో ప్రాధాన్యతను పెంచారు. -
అణుశక్తి శాఖకు రూ.10 వేల కోట్లు
అణు విద్యుత్ ఉత్పత్తి, పరిశోధనలకు ఊతమిచ్చేలాఅరుణ్ జైట్లీ తన తాజా బడ్జెట్లో అణుశక్తి శాఖకు రూ.10,446 కోట్లు కేటాయించారు. ఇందులో అణు విద్యుదుత్పత్తికి రూ. 1,709 కోట్లు అందనున్నాయి. ఈ మొత్తంలో రూ.30 కోట్లు కల్పక్కం వద్ద గల భారత తొలి ‘బాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ కోసం కేటాయించారు. అలాగే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్)కు రూ.203 కోట్లు, భారత నాభికీయ(అణు) విద్యుత్ నిగమ్ లిమిటెడ్(భావిని), మరో రెండు ప్రభుత్వ సంస్థలకు రూ.440 కోట్లు కేటాయింపుల నుంచి అందనున్నాయి. తాజా కేటాయింపుల్లో సింహభాగం రూ.8,737 కోట్లు అణు ఇంధన రంగంలో పరిశోధనలకే ఇచ్చారు. శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ.8 వేల కోట్లు బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ.8,768 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.3,544 కోట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం(డీఎస్టీ)కి, రూ.3,707 కోట్లు శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన విభాగం(డీఎస్ఐఆర్)కు, రూ.1,517 కోట్లు బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ)కి కేటాయించారు. -
ఈశాన్య రాష్ట్రాలకు 53 వేల కోట్లు..
న్యూఢిల్లీ: ఈశాన్య భారత ఒంటరితనానికి ముగింపు పలికేందుకు కేంద్రం సాధారణ బడ్జెట్లో వరాల వర్షం కురిపించింది. ఆ ప్రాంత అభివృద్ధి కోసం భారీగా రూ. 53,706 కోట్లు కేటాయించింది. ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేయడానికి రోడ్లు, రైలు మార్గాల విస్తరణ, సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధి తదితరాలను అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఈశాన్య భారతం వెనుకబాటుతనంతో కునారిల్లుతోందని, సరైన అనుసంధానం లేక పోవడంతో ఏకాకితనం భావన నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతానికి 10 శాతం ప్రణాళికా నిధుల కేటాయింపును అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఇదివరకటి ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరి చేసిందని గుర్తు చేశారు. తాజా బడ్జెట్ నుంచి ఈశాన్య ప్రాంతానికి కేటాయింపులపై ప్రత్యేక పత్రాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. బడ్జెట్లో ఈశాన్య రాష్ట్రాల కేటాయింపులు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.2,332.78 కోట్లు. బ జాతీయ రహదారుల సంస్థ, రాష్ర్ట్ర రహదారుల వ్యవస్థలో ప్రతిపాదించిన రూ. 38 వేల కోట్ల పెట్టుబడుల్లో రూ.3 వేల కోట్లు ఈశాన్యానికి. బ రైలు మార్గాల విస్తరణ కోసం మధ్యంతర బడ్జెట్ కేటాయింపులతోపాటు రూ. 1,000 కోట్లు. బ మణిపూర్‌లో క్రీడా విశ్వవిద్యాలయం. బ ‘అరుణ్ ప్రభ’ పేరుతో టీవీ చానల్.బ సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధికి రూ.100 కోట్లు. -
హోంశాఖకు నిధుల వరద..
కేంద్ర హోం శాఖకు అరుణ్‌జైట్లీ నిధుల వరదను పారించారు. నిరుటి కంటే 11శాతం అధికంగా రూ. 65,745 కోట్లను వివిధ కేటగిరీలలో హోం శాఖకు కేటాయించారు. దీంతో పాటుగా ప్రధాన నగరాల్లో మహిళల భద్రతపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహిళల భద్రత కోసం రూ. 150 కోట్లను కేటాయిస్తున్నట్టు జైట్లీ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో సంక్షోభ నియంత్రణ కేంద్రాలను(క్రైసిస్ మేనేజిమెంట్ సెంటర్లు) ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. వీటి కోసం నిర్భయ ఫండ్ నుంచి నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. దేశంలో అతిపెద్ద పారామిలటరీ దళాలైన సీఆర్పీఎఫ్కు రూ. 12,169.51 కోట్లను ఇస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా భారత్-పాక్, భారత్-బంగ్లా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ దళాలకు రూ. 11,242.02 కోట్ల ను కేటాయించారు. విమానాశ్రయాలతో పాటు కీలకమైన సంస్థలు, స్థావరాల పరిరక్షణలో భాగస్వామిగా ఉన్న సీఐఎస్ఎఫ్కు రూ. 4,729 కోట్లను కేటాయించారు. అస్సాం రైఫిల్స్‌కు 3585 కోట్లు, ఐటీబీపీకి 4729 కోట్లు అందనున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరోకి రూ. 1,176 కోట్లు ఇవ్వనున్నారు. ప్రధాని, రాష్ట్రపతి వంటి అత్యంత ప్రముఖులకు రక్షణ కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌కు 101 కోట్లను జైట్లీ అందించారు. ట్రాఫిక్ కమ్యునికేషన్ నెట్వర్క్ కోసం 11.37 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రతిపాదించారు. మావోయిస్టుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి: దేశంలోని 13 రాష్ట్రాల్లో విస్తరించిన మావోయిస్టులను నియంత్రించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మావోయిస్టుల ప్రభావం ఉన్న జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, పోలీసు బలగాలకు అన్నివిధాలా ఆధునిక సదుపాయాలను కల్పించటానికి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు జరిపారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు బలగాలకు నివాస గృహాలు, ఇతర సదుపాయాల కోసం 1745 కోట్ల రూపాయలను కేటాయించారు. అంతే కాకుండా ఎలాంటి దాడులనైనా ఎదుర్కునేందుకు వీలుగా దుర్భేద్యమైన పోలీసు స్టేషన్ల నిర్మాణానికి మరో 110 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. -
రక్షణ రంగానికి పెద్దపీట
న్యూఢిల్లీ: మోడీ సర్కారు తన తొలి బడ్జెట్లోనే రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2.29 లక్షల కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఈ కేటాయింపులు 12.5శాతం ఎక్కువని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 2013-14లో రూ.2,03,672 కోట్లు కేటాయించగా, మొన్నటి మధ్యంతర బడ్జెట్లో 2లక్షల 24 వేల కోట్లకు అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రతిపాదించారు. ప్రస్తుత బడ్జెట్లో జైట్లీ మరో రూ. 5 వేల కోట్లు పెంచారు. దేశ భద్రత విషయంలోరాజీ పడేది లేదని మంత్రి స్పష్టం చేశారు. సైనికదళాల ఆధునీకరణకు గత ఏడాది కేటాయించిన రూ.89,587.95 కోట్లకు అదనంగారూ.5వేల కోట్లు కేటాయించారు. రక్షణశాఖ మూలధన పెట్టుబడులను రూ.5వేల కోట్లకు పెంచుతున్నట్టు జైట్లీ ప్రకటించారు. ఇందులోనే వెయ్యి కోట్లను సరిహద్దు ప్రాంతాలకు రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయటానికి ఉద్దేశించారు. రక్షణ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి నిధికి వంద కోట్లను కేటాయించారు. భద్రతాబలగాలు తమ ఆయుధ సంపత్తిని ఆధునీకరించుకునే దిశగా 126 మల్టీరోల్ యుద్ధ విమానాల కాంట్రాక్టును ప్రభుత్వం త్వరలోనే కుదుర్చుకోనుంది. ఈ కాంట్రాక్టు విలువ రూ. 60 వేల కోట్లు. 22 అపాచే యుద్ధ హెలికాప్టర్లు, 15 చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు, గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సామర్థ్యం ఉన్న విమానాలు ఆరింటికి సంబంధించిన 40 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు కొద్ది వారాల్లో పూర్తి కావచ్చు . అంతర్గత భద్రత: వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి, దాని ప్రభావమున్న జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చనున్నట్టు జైట్లీ వివరించారు. ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలను బలోపేతం చేయడానికి రూ. 3వేల కోట్లు కేటాయించామన్నారు. ఒకేర్యాంకు.. ఒకే పింఛను భారత సైనికుల బాగోగుల పట్ల తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని జైట్లీ అన్నారు. మాజీ సైనికుల పింఛనులను ఒకే ర్యాంకు.. ఒకే పింఛను విధానం కిందకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది పింఛను అవసరాలు తీర్చేందుకు రూ. వెయ్యికోట్లు కేటాయించారు. వార్ మెమోరియల్ ఏర్పాటు.. దేశ రాజధాని ఢిల్లీలో వార్ మెమోరియల్, ఇండియాగేట్ సమీపంలో ఉన్న ప్రిన్సెస్ పార్కులో మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ. 100 కోట్లు కేటాయించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవానులు, అధికారులను ఈ దేశం రుణపడి ఉందని.. వారి స్మృతి చిహ్నంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు జైట్లీ తెలిపారు. అలాగే సైనికులతో సమానంగా దేశంలో అంతర్గతంగా శత్రువులతో పోరాడి ప్రాణాలు అర్పించిన పోలీసుల స్మారకార్థం జాతీయ పోలీస్ మెమోరియల్ ఏర్పాటు కోసం రూ. 50 కోట్లు కేటాయించామన్నారు. దేశ సరిహద్దుల్లో మౌలిక వసతుల పెంపుదలకు ఇప్పటికే కేటాయించిన 2,250 కోట్లకు మరో రూ. 990 కోట్లు కేటాయించామని తెలిపారు. -
ఉసూరుమనిపించిన కేంద్ర ఆర్థిక బడ్జెట్
చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు : దేశ ఆర్థికరంగం అభివృద్ధి చెందాలంటే చిన్నతరహా పరిశ్రమల పాత్ర ఎంతో కీలకమైంది. గురువారం బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి కేంద్ర బడ్జెట్ పరిశ్రమలకు ఆశించిన మేరకు ప్రయోజనం కలగలేదు. ఇప్పటికీ విద్యుత్‌కోతలతో పరిశ్రమలు సతమతమవుతూ కోట్లాదిరూపాయలు బ్యాంకులకు బకాయిలు పడ్డాయి. ఈ బడ్జెట్‌తో ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆశించాం. ఆశించిన మేర ప్రోత్సాహం ఏమీ కనిపించలేదు. పరిశ్రమలను ప్రోత్సహించకుంటే ప్రభుత్వం ఆశించిన మేర వృద్ధిరేటు నమోదు కాదు. ఎప్పుడైనా పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటే ప్రభుత్వానికి కూడా తగినంత ఆదాయం వస్తుంది. చిన్నపరిశ్రమలకు సంబంధించి బడ్జెట్ ఆశాజనకంగా లేదు. చిన్నపరిశ్రమల వారికి ఇబ్బందులు తప్పవు. - ఏపీకే రెడ్డి, రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు ధరల నియంత్రణకు చర్యలేవి?: పేద,మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్లో చోటులేదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పైగా విదేశీ పెట్టుబడులకు పెద్ద ఎత్తున ఆహ్వానం పలకడంతో స్వదేశంలో పేదల బతుకులు దయనీయంగా మారనున్నాయి. - ఉపేంద్ర, న్యాయవాది, నెల్లూరు ఆశించిన ఫలితం లేదు: నరేంద్రమోడీ నాయకత్వంలో యువతకు మం చి జరుగుతుందనుకున్నాం. అయితే బడ్జెట్లో యువత, విద్యార్థులకు సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపకపోవడం బాధాకరం.విద్యారంగానికి ఎక్కువగా బడ్జెట్ కేటాయిస్తే బాగుండేది. -బి లోకేష్‌రెడ్డి, విద్యార్థి, నెల్లూరు సామాన్యులకు అందుబాటులో లేదు: బడ్జెట్‌పై ఎంతో ఆశగా ఎదురు చూసిన సామాన్య ప్రజలకు నిరాశమిగిల్చింది. నిత్యవసర సరుకుల ధరలు తగ్గించేలా లేక పోవడం విచారకరం. ఏదైనా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సామాన్యులను దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది. - బాలచంద్ర, ఉద్యోగి, వెంకటగిరి ప్రత్యేక నిధులు నామమాత్రమే: విభజన నేపథ్యంలో రాజధాని కూడా లేకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బడ్జెట్లో పెద్దగా కేటాయించింది లేదు. ప్రత్యేకంగా నిధులు సమకూర్చి విభజనతో నష్టపోయిన ఆంధ్రులను ఆదుకోవాల్సిన బాధ్యత మోడీ సర్కారుదే. -చిల్లకూరు సుబ్రమణ్యంరెడ్డి, రియల్ వ్యాపారి, సూళ్లూరుపేట సీమాంధ్రకు నిరాశే: ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా సీమాంధ్ర రాష్ట్రానికి నిరాశాజనంగా ఉంది. ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాష్ట్రం అయినప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు చేయకపోవడం విచారకరం. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కేంద్రం చేయూత ఇవ్వదనే సందేహం కలుగుతోంది. ఉభయసభల్లో గత ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేరేలా లేవు. -కోవూరు వెంకటేశ్వర్లు, పొదలకూరు, వినియోగదారుల సేవాసంఘం మండల అధ్యక్షుడు బడ్జెట్ బాగుంది: అరుణ్‌జైట్లీ ఆర్థిక బడ్జెట్ బాగుంది. తక్కువ ఖర్చుతో వాణిజ్యపరంగా అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడే బకింగ్ కెనాల్‌కు పూర్వ వైభవం వచ్చేలా బడ్జెట్లో నిధులు విడుదల చేసి ఉంటే బాగుండేది. విశాఖ-చెన్నై కోస్టల్ కారిడార్ అభివృద్ధికి ఈ మార్గం ఎంతో ఉపయోగకరం. - ఎన్ జయచంద్ర, వ్యాపారి, సూళ్లూరుపేట ట్యాక్స్ మినహాయింపు రూ.ఐదు లక్షలకు పెంచాల్సింది: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశించిన స్థాయిలో లేదు. ఉద్యోగుల ఇన్‌కమ్‌ట్యాక్స్ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ రూ.2.50 లక్షలకు పెంచారు. దీనిని రూ.5 లక్షలకు పెంచి ఉంటే బాగుండేది. - మురళీకృష్ణ, ముత్తుకూరు , ఉపాధ్యాయుడు పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడే బడ్జెట్ అధిక ధరలను తగ్గిస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి కేంద్ర బడ్జెట్ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేలా ఉంది. పేదలు, కార్మికులు, కర్షకులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆచరణ సాధ్యంకాని విధానాలను బడ్జెట్లో ప్రవేశ పెట్టారు. బీజేపీ మాటలో స్వదేశీ నినాదం, ఆచరణలో విదేశీ విధానం. -చండ్ర రాజగోపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి -
మహిళల భద్రత కన్నా పటేల్ విగ్రహమే మిన్న!
న్యూఢిల్లీ: మహిళల భద్రత, వారి సంక్షేమం కన్నా గుజరాత్లో సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణమే ముఖ్యమైనదిగా మోడీ సర్కారు భావించింది. తాజా బడ్జెట్లో మహిళల భద్రత కోసం రూ. 150 కోట్లు, వారి సంక్షేమం కోసం రూ. 100 కోట్లు ప్రకటించిన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. ప్రధానమంత్రి సొంతరాష్ట్రంలో నిర్మించ తలబెట్టిన ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహ ఏర్పాటుకు మాత్రం రూ.200 కోట్లను కేటాయించారు. 182 మీటర్ల ఎత్తుతో, రూ. 2,500 కోట్ల ఖర్చుతో అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే ఎత్తై సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ‘ఐక్యతా ప్రతిమ’ పేరుతో నిర్మించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే మోడీ తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి రూ. 200 కోట్లను కేటాయించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైట్లీ ప్రతిపాదనల్లో ఇదే అత్యంత నచ్చని ప్రతిపాదనగా నెటిజన్లు అభిప్రాయపడ్డారు. -
అందరికీ ఆరోగ్యమే లక్ష్యం
బడ్జెట్లో రూ.39,237 కోట్లు న్యూఢిల్లీ: అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా అందరికీ ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు, ఉచిత మందులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం 2014-15 బడ్జెట్లో హామీ ఇచ్చింది. ఈ లక్ష్యసాధనకోసం ఆంధ్రప్రదేశ్‌తోపాటు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలోని విదర్భ, ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్‌లో రూ.500 కోట్ల వ్యయంతో మరో నాలుగు ఎయిమ్స్ తరహా సంస్థలు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆరోగ్య రంగానికి యూపీఏ ప్రభుత్వం గత బడ్జెట్లో రూ.37,330 కోట్లు కేటాయించగా, తాము ఐదుశాతం పెంచి మొత్తంగా రూ.39,237.82కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో రూ.21,912కోట్లు జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేటాయించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ. 8426 కోట్లు, ఆయుష్ విభాగానికి రూ. 689 కోట్లు, వైద్యపరిశోధనకు రూ. 726 కోట్లు, ఎయిడ్స్ నియంత్రణకు రూ. 857 కోట్లు కేటాయించారు. గ్రామీణ భారతంలో అత్యుత్తమ ఆరోగ్య సేవలందించేందుకు 15 ఆదర్శ గ్రామీణ వైద్య పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. స్థానిక ఆరోగ్య సమస్యలపై ఈ కేంద్రాలు పరిశోధనలు జరపడంతోపాటు అన్ని రకాల సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 58 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయని, త్వరలో మరో 12 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కొత్త కళాశాలల్లో దంతవైద్య సేవలు కూడా అందిస్తారని చెప్పారు. వృద్ధుల్లో టీబీ వ్యాధిని తొలి దశలోనే గుర్తించేందుకు ఢిల్లీ, చెన్నైల్లోని ఎయిమ్స్‌లలో రెండు జాతీయ వృద్ధుల సంస్థలు నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. అలాగే దంతవైద్యంలో ఉన్నత విద్యకోసం ఒక జాతీయ స్థాయి పరిశోధన, రిఫరల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం తొలిసారిగా కొత్త ఔషధ పరీక్ష కేంద్రాలను నెలకొల్పడంద్వారా రాష్ట్రాల్లో ఔషధ, ఆహార నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేస్తామని చెప్పారు. హైలైట్స్ {దవ్యలోటు లక్ష్యం ప్రస్తుత ఏడాదికి జీడీపీలో 4.1 శాతం. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 3.6 శాతంగా నిర్ణయం * పెద్ద నగరాల్లో మహిళల భద్రత పెంపునకు రూ. 150 కోట్లు * ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు మరింత చౌక * సిగరెట్లు, పాన్ మసాలా, టొబాకో, కూల్‌డ్రింక్‌లు ప్రియం * రూ. 500 నుంచి రూ.1,000 ఖరీదు చేసే పాదరక్షలపై ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు * హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, రాజస్థాన్‌లలో 5 ఐఐఎంల ఏర్పాటు * ఆంధ్రప్రదేశ్, జమ్మూ, చండీగఢ్, గోవా, కేరళల్లో 5 ఐఐటీల ఏర్పాటు * పట్టణ పేదలు / ఈడబ్ల్యూఎస్ / ఎల్ఐజీ విభాగంలో అందుబాటులో గృహ నిర్మాణం కోసం తక్కువ వడ్డీకి రుణాలు పెంపొందించేందుకు రూ. 4,000 కోట్లు * గంగా నదిపై ‘జల్ మార్గ్ వికాస్’ పథకం పేరుతో అలహాబాద్ నుంచి హల్దియా వరకూ అంతర్గత జలమార్గాల కోసం రూ. 4,200 కోట్లు గ్రామాలు, పాఠశాలల్లో సేవలు, ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ కోసం జాతీయ గ్రామీణ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కార్యక్రమం * లక్నో, అహ్మదాబాద్‌లలో మెట్రో ప్రాజెక్టుల కోసం రూ. 100 కోట్లు * యుద్ధ ప్రదర్శనశాల, యుద్ధ స్మారకం ఏర్పాటుకు రూ. 100 కోట్లు * రూ. 500 కోట్ల నిధితో పండిట్ మదన్మోహన్ మాలవీయ నూతన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం * నిర్వాసిత కాశ్మీరీ వలసల పునరావాసానికి రూ. 500 కోట్లు * దాదాపు 600 కొత్త, ప్రస్తుత కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు మద్దతుగా రూ. 100 కోట్లతో పథకం * సేంద్రియ వ్యవసాయం అభివృద్ధికి రూ. 100 కోట్లు * కిసాన్ వికాస్ పత్రాల పునఃప్రవేశం, బీమా సదుపాయంతో కూడిన జాతీయ పొదుపు ధురవీకరణపత్రాల ప్రారంభం * అల్ట్రా మోడర్న్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ టెక్నాలజీ ప్రతిపాదన * {పభుత్వ రంగ బ్యాంకుల మూలధనం కోసం రూ. 11,200 కోట్లు * పత్యక్ష పన్నుల ప్రతిపాదనల ఫలితంగా రూ.22,200 కోట్ల ఆదాయ నష్టం * పన్నుల ద్వారా రూ. 9.77 లక్షల కోట్ల ఆదాయం అంచనా * పరోక్ష పన్నుల ప్రతిపాదనల ద్వారా రూ.7,525 కోట్ల ఆదాయం -
ఫ్లాగ్‌షిప్‌కు మోడీ టచ్
పాత పథకాలు యథాతథం... ‘ఉపాధి’కి పెంపు లేదు... 2014-15 బడ్జెట్లో : రూ. 33,364 కోట్లు 2013-14 బడ్జెట్లో : రూ. 33,000 కోట్లు 2012-13 బడ్జెట్లో : రూ. 33,000 కోట్లు యూపీఏ ప్రభుత్వం తొలివిడత అధికారంలోకి వచ్చాక 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) అమల్లోకి వచ్చింది. గ్రామాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రత కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2006 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకాన్ని 2008 నాటికి దేశంలోని అన్ని జిల్లాలకూ విస్తరించారు. నిధుల కుమ్మరింపు భారీగానే ఉన్నా.. వనరుల కల్పనలో మాత్రం ఘోరంగా విఫలమవుతోందనే వాదనలు ఆరంభం నుంచీ వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నిధుల దారిమళ్లింపు, నాసిరకం పనులు, అవినీతి ఆరోపణలు ఇక సరేసరి. మోడీ సర్కారు దీన్ని వృద్ధికి లింకుపెట్టి కొత్తపుంతలు తొక్కిస్తామంటోంది. ‘ఉపాధి’ పనుల్లో నాణ్యత పెంపు, శాశ్వతప్రాతిపదికన నిర్మాణాలు, ఆస్తుల కల్పనతో పాటు వ్యవసాయం, తత్సంబంధ పనులకూ ఉపాధి హామీని జతచేస్తామని ప్రకటించింది. భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలొస్తాయో వేచిచూడాల్సిందే... పనితీరు ఇదీ.... పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 14 కోట్ల మేర జాబ్ కార్డులు జారీ అయ్యాయి.ఇప్పటివరకూ రూ.2,55,862 కోట్ల మొత్తాన్ని వెచ్చించారు. 1,720 కోట్ల పనిరోజుల్ని (పర్సన్ డేస్) సృష్టించినట్లు అంచనా.గతేడాది మొత్తం 4.85 కోట్ల కుటుంబాలకు పనికల్పించారు. ఇక ఉపాధి హామీలో పాల్గొన్న వ్యక్తుల సంఖ్య 7.46 కోట్లు మాత్రమే. గతేడాది 102 లక్షల పనులను (కొత్తవి, అంతక్రితం ఏడాది వదిలేసినవి కలిపి) చేపట్టారు. ఇందులో 32 శాతం మాత్రమే పూర్తయ్యాయి. 2013-14లో సగటు రోజువారీ వేతనం రూ.132.6గా (అంతక్రితం ఏడాది రూ.121.4) నమోదైంది. బడ్జెట్ కేటాయింపునకన్నా అధికంగా రూ.38,621 కోట్లు ఖర్చయినట్లు అంచనా.సగటున 45.2 రోజులు ఒక్కో కుటుంబానికి పని కల్పించారు. 100 రోజుల పని పూర్తిచేసుకున్న కుటుంబాల సంఖ్య కేవలం 46.5 లక్షలు మాత్రమే. భారత్ నిర్మాణ్ గ్రామాల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకమిది. ఇందులో ప్రధానంగా రోడ్లు, గృహకల్పన, తాగునీరు, సాగునీరు, టెలికం-ఐటీ సేవల కల్పన, విద్యుదీకరణ... ఇలా ఆరు స్కీమ్‌లున్నాయి. 2005-09 మధ్య భారత్ నిర్మాణ్ తొలి దశ అమలు చేశారు. దీనికి మొత్తం బడ్జెట్ రూ.1.74 లక్షల కోట్లు. ప్రస్తుతం రెండో దశ అమలవుతోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాలకు నిధులు భారీగానే కేటాయిస్తున్నా... లక్ష్యాలను అందుకోవడంలో చతికిలపడుతున్నాయి. ఈ స్కీమ్‌ల పరిస్థితి చూస్తే... ఇందిరా ఆవాస్ యోజన(ఐఏవై).. 2014-15 ⇒ 16,000 2013-14 ⇒ 15,184 2022కల్లా దేశవ్యాప్తంగా అందరికీ సొంతింటి కల సాకారం చేస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం.. ఈ పథకానికి నిధులైతే పెద్దగా పెంచలేదు.2002 జనాభా లెక్కల ప్రకారం దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు, ఎస్సీ/ఎస్టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్ధిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి.2013-14లో 25,21,242 ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 20,28,322 ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో 1,44,483 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.నిర్మాణ సామగ్రి ధరలు పెరగటంతో ఇళ్ల నిర్మాణం కుంటుపడుతోంది. కొన్ని చోట్ల నాసిరకంగా ఇళ్లను నిర్మించడం, నిధులను పక్కదారిపట్టించడం, అవినీతి బాగోతాలు భారీగానే వెలుగుచూస్తున్నాయి. గతేడాది బడ్జెట్లో మైదాన ప్రాంతాల్లో ఒకో ఇంటికి సాయాన్ని రూ.70,000కు, కొండ ప్రాంతాల్లో రూ.75,000కుపెంచుతున్నట్లు ప్రకటించారు. ఇంకా 82 మావోయిస్టుల ప్రభావిత జిల్లాల్లో ఒకో ఇంటికి సాయాన్ని రూ.48,500గా నిర్ణయించారు. 2013 ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. మోడీ సర్కారు దీన్ని యథాతథంగా కొనసాగించింది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన 2014-15 ⇒ 14,389 2013-14 ⇒ 21,700 ⇒ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వం.. తొలి బడ్జెట్లోనే నిధులను తగ్గించేసింది. ఈసారి 33 శాతం కోత పెట్టింది. ⇒ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో నాటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించగా, 2005లో దీన్ని యూపీఏ భారత్ నిర్మాణ్‌లోకి చేర్చింది. 500 మందికి పైగా జనాభా ఉన్న మైదాన ప్రాంతాలకు, 250 మందికి పైగా జనాభా గల కొండ, ఎడారి ప్రాంత గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని కల్పించాలనేది ప్రస్తుత లక్ష్యం.పథకం ప్రారంభం నుంచి 1,44,717 ఆవాస ప్రాంతాలను అనుసంధానించే లక్ష్యంతో సుమారు 5,44,462 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులను క్లియర్ చేశారు. ఇటీవలే ఈ పథకం రెండో దశను ప్రారంభించారు. ప్రస్తుత గ్రామీణ రోడ్డు నెట్‌వర్క్‌లో ఎంపిక చేసిన కొన్ని రోడ్లను మరింత అత్యున్నతంగా తీర్చిదిద్దడం లక్ష్యం. గ్రామీణ వృద్ధి కేంద్రాలు, హబ్‌లు, పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లు, ఇతరత్రా ముఖ్యమైన ప్రాంతాలను కలిపే రోడ్లను ఇందుకు ఎంపికచేస్తారు. గ్రామీణ మౌలిక సదుపాయాల పెంపు, పేదరికాన్ని తగ్గించడం దీని ఉద్దేశం. మొత్తంగా 50,000 కిలోమీటర్ల మేర రోడ్లను మెరుగుపరచడానికి రూ.33,030 కోట్లు వెచ్చిస్తారు. కేంద్రం 75 శాతం నిధులు ఇస్తుంది. మిగతాది రాష్ట్రాలు భరించాలి. రాజీవ్ గాంధీ తాగునీటి మిషన్... 2014-15 ⇒ 11,000 2013-14 ⇒ 11,000 భార జలాలు/హానికర మూలకాలు, ఫ్లోరైడ్, క్రిమిసంహారకాలు/ఎరువుల ప్రభావం ఉన్న సుమారు 20 వేల ఆవాస ప్రాంతాలకు కమ్యూనిటీ నీటిశుద్ధి ప్లాంట్ల ద్వారా వచ్చే మూడేళ్లలో సురక్షిత తాగునీరు కల్పించాలని తాజా బడ్జెట్లో ప్రకటించారు. నిధులను మాత్రం పెంచలేదు. దేశంలో తాగునీటి సౌకర్యం లేని మారుమూల గ్రామాలన్నిటికీ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. కేంద్ర- రాష్ట్రాల భాగస్వామ్యంతో ఇది అమలవుతుంది. గతేడాది మార్చి నాటికి దేశంలోని మొత్తం 16.92 లక్షల గ్రామీణ ఆవాస ప్రాంతాలకుగాను.. 11.61 లక్షల ప్రాంతాలకు మాత్రమే సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. వార్షిక లక్ష్యాలకు ఆమడదూరంలో పథకం నత్తనడకన అమలవుతోంది. రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన 2014-15 ⇒ 5,144 2013- 14 ⇒ 4,500 మోడీ సర్కారు ముద్ర కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన పేరుతో కొత్త పథకాన్ని తాజా బడ్జెట్లో జోడించింది. దీనికి రూ.500 కోట్లు కేటాయించారు. ఆర్జీజీవైకి కూడా నిధులను చెప్పుకోదగ్గ స్థాయిలోనే పెంచారు.విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... దారిద్య్రరేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న 2.34 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది. నోడల్ ఎజెన్సీగా ఆర్ఈసీ వ్యవహరిస్తోంది.ఈ పథకం ప్రారంభమైననాటినుంచి ఇప్పటివరకూ 2.16 కోట్ల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు అంచనా. ఇక 1,08,280 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ టెలిఫొనీ... 2014-15 ⇒ 3,553 2013-14 ⇒ 3,000 2017 నాటికి ఎన్ఓఎఫ్ఎన్ కింద బ్రాడ్‌బ్యాండ్ లక్ష్యాన్ని పూర్తిచేయాలని మోడీ సర్కారు నిర్దేశించుకుంది. ప్రస్తుత స్థాయి నుంచి 2017కల్లా గ్రామీణ టెలి డెన్సిటీని 70 శాతానికి, 2020నాటికి 100 శాతానికి చేర్చాలనేది తాజా లక్ష్యం.2014కల్లా గ్రామాల్లో ప్రతి 100 మందిలో 40 మంది టెలిఫోన్ వినియోగదారులుగా చేయాలనేది లక్ష్యం. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్(జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్-ఎన్ఓఎఫ్ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.టెలికం శాఖకు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధి(యూఎస్ఓఎఫ్) నుంచి ఈ స్కీమ్‌కు ఫండ్స్‌ను అందిస్తున్నారు. గ్రామీణ సాగునీటి పథకం 2014-15 ⇒ 41,510 2013-14 ⇒ 41,207 2014-15లో కేటాయింపు: భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు రూ.1,100 కోట్లు. చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.410 కోట్లు.2013-14లో కేటాయింపు: భారీ, మధ్యస్థాయి సాగునీటి ప్రాజెక్టులకు రూ.895 కోట్లు, చిన్న ప్రాజెక్టులకు రూ.312 కోట్లు. ఇంటి కలను నెరవేరుస్తాం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2022 నాటికి అందరికీ సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇంటి రుణాలపై ప్రత్యేకంగా యువతను దృష్టిలో పెట్టుకుని పన్ను రాయితీలు కల్పిస్తున్నట్లు ఆర్థికమంత్రి జైట్లీ చెప్పారు. జాతీయ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ) పథకం కింద చౌక ధరలో ఇళ్ల నిర్మాణం కోసం బడ్జెట్లో రూ.4,000 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో బలహీన వర్గాలు/తక్కువ ఆదాయం కలిగిన వర్గాల కోసం వీటిని నిర్మిస్తారు. గ్రామీణ హౌసింగ్ ఫండ్ కింద చాలా మందికి ప్రయోజనం చేకూరినట్లు జైట్లీ తెలిపారు. మురికివాడల అభివృద్ధిని కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద చేర్చారు. దీనివల్ల కార్పొరేట్లపై మరింత బాధ్యత పెరిగింది. 16 కొత్త పోర్టు ప్రాజెక్టులు జల రవాణా ద్వారా దేశీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, ఉద్యోగ కల్పనకు కేంద్రం ప్రాధాన్యమిచ్చింది. ఇందులోభాగంగా ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు ప్రకటిస్తూ.. దేశవ్యాప్తంగా 16 కొత్త పోర్టు ప్రాజెక్టులను ప్రతిపాదించింది. దేశంలోని ప్రధాన పోర్టుల అనుసంధానం, రూ. 11,635 కోట్లతో ట్యుటికోరిన్‌లో ఔటర్ హార్బర్ ప్రాజెక్టుతో పాటు కాండ్లా, జేఎన్పీటీ పోర్టుల వద్ద ఎస్ఈజెడ్ల ఏర్పాటు వం టివి ఇందులో ఉన్నాయి. నౌకా నిర్మాణ పరిశ్రమను ప్రోత్సహించేం దుకు కొత్త విధానాన్ని ప్రకటిస్తామని కూడా జైట్లీ ఈ సందర్భంగా తెలిపా రు. విచ్ఛిన్నం కోసం దిగుమతి చేసుకునే నౌకలపై వాణిజ్య పన్నును ఐదు నుంచి 2.5 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం దేశంలోని 12 ప్రధా న పోర్టుల ద్వారా 700 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు వీలుండగా.. 2020 కల్లా దీన్ని 3,130 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేశారు. ఐదు పర్యాటక సర్క్యూట్ల సృష్టికి రూ. 500 కోట్లు న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేం దుకు ప్రత్యేక ఇతివృత్తాలతో ఐదు పర్యాటక సర్క్యూట్లను సృష్టించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ ఐదు సర్క్యూట్ల సృష్టికి రూ.500 కోట్ల నిధులను ఆయన కేటాయించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా సార్నాథ్-గయ-వారణాసి బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. దేశంలో పర్యాటకాభివృద్ధి కోసం మంత్రి చేసిన ఇతర ప్రతిపాదనలు... మధుర, అమృత్సర్, గయ, కంచీపురం, అజ్మీర్ వంటి పట్టణాలలో వారసత్వ కట్టడాల పరిరక్షణకు ‘జాతీయ వారసత్వ పట్టణ అభివృద్ధి, పునరుద్ధరణ పథకం(హృదయ్)’ను అమలు చేస్తారు. ఇందుకు ప్రస్తుత బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. దేశంలో ‘తీర్థయాత్రల పునరుత్తేజం, ఆధ్యాత్మిక అభివృద్ధికి జాతీయ కార్యక్రమం(ప్రసాద్)’ నిర్వహించేందుకు రూ.100 కోట్లు కేటాయించారు. పురావస్తు కట్టడాల పరిరక్షణకు మరో రూ.100 కోట్లు ఇచ్చారు. గోవా అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారిందని, అక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలని, అందుకు కేంద్రం మద్దతు పూర్తిగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా విదేశీయులు దేశంలోకి వచ్చిన తర్వాత కూడా వీసా పొందేలా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్(ఈ-వీసా) సౌకర్యాన్ని ఆరునెలల్లో దశలవారీగా 9 విమానాశ్రయాల్లో అమలు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనిపై పరిశ్రమవర్గాలు స్పందిస్తూ.. ఈ-వీసాల కేటాయింపు నిర్ణయం దేశ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని హర్షం వ్యక్తం చేశాయి. గ్రామీణాభివృద్ధిపై దృష్టి ⇒ యువతకు చేయూతనిచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయించింది. గ్రామాల్లోని ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ⇒ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించేందు కోసం నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ)కి రూ. 8 వేల కోట్లు కేటాయింపు ⇒ ప్రాంతాల్లో వాటర్షెడ్ల అభివృద్ధి కోసం నీరాంచల్ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టిం ది. ఇందుకు రూ. 2,142 కోట్లు వెచ్చించనుంది. మరో 100 జిల్లాల్లో స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు 4 శాతం వడ్డీతో బ్యాంకు రుణాలను అందించనున్నట్లు జైట్లీ వెల్లడించారు. ప్రస్తుతం 150 జిల్లాల్లోనే ఇది అమలులో ఉంది. క్రీడలకు జోష్.. న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో యువజన సర్వీసులు, క్రీడల రంగానికి కేటాయింపులు రూ. 562 కోట్ల మేరకు పెరిగాయి. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కలిపి మొత్తం రూ.1,769 కోట్లను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కేటాయించారు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ. 1,643 కోట్లు కాగా.. ప్రణాళికేతర వ్యయం 126 కోట్లు. 2014-15 బడ్జెట్లో జమ్మూకాశ్మీర్‌కు పెద్ద పీట వేశారు. ఈ రాష్ట్రంలో క్రీడా వసతులు, ఇండోర్, అవుట్డోర్ స్టేడియాల అభివృద్ధికి రూ. 200 కోట్లను కేటాయించారు. మణిపూర్‌లో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లు కేటాయించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)కి రూ. 85 కోట్ల పెంపుతో 405.10 కోట్లు, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు 25 కోట్ల పెంపుతో 185 కోట్లు కేటాయించారు. కాగా, రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్‌కు కేటాయింపుల్లో భారీ కోత విధించారు. దీనికి గతంలో రూ. 104.85 కోట్లను కేటాయించగా.. ఇప్పుడు 20 కోట్లతో సరిపెట్టారు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పాలుపంచుకునే క్రీడాకారుల సన్నద్ధత కోసం రూ. 100 కోట్లను కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాలు, సిక్కింలో క్రీడల అభివృద్ధికి రూ. 192.65 కోట్లను కేటాయించారు. డోపింగ్ నిరోధక కార్యక్రమాలకు రూ. 11.60 కోట్లు.. నేషనల్ డోప్ టెస్ట్ ల్యాబొరేటరీకి రూ. 9 కోట్లు కేటాయించారు. జైట్లీ.. పేరాలకు పేరాల స్పీచ్ మన ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రవేశపెడుతూ మధ్యలో తిరువళ్లూరు నుంచి గాలిబ్ వరకు చాలా మంది సూక్తులను అలవోకగా చెప్పేస్తూ.. గంటలకు గంటలు మాట్లాడ్డం వింటూనే ఉంటాం. కానీ కొంతమంది మాత్రమే ‘సుత్తి కొట్టొద్దు.. సూటిగా చెప్పు’ అన్నట్టు సింపుల్‌గా ప్రసంగిస్తారు. అలాంటిదే మొన్న మొట్ట మొదటి బడ్జెట్ ప్రసంగం. ఈ ప్రసంగం కేవలం 39 పేరాలే. దీనికి భిన్నంగా ప్రస్తుత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 253 పేరాల స్పీచ్ ఇచ్చారు. ఇంతవరకు ఎక్కువ పేరాల ప్రసంగాలిచ్చిన ఆర్థిక మంత్రులందరినీ ఆయన మించిపోయారు. -
హామీలెక్కువ.. ఇచ్చింది తక్కువ
కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు అంతంతమాత్రమే సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రెవెన్యూ లోటు పూడ్చేందుకు నిధులు.. కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు.. ఐఐఎం, ఐఐటీ, ఎయిమ్స్, వివిధ యూనివర్సిటీలు.. విశాఖలో మెట్రో.. విజయవాడ - గుంటూరు - తెనాలి మెట్రో.. ఇలా ఎన్నో ఆశలు పెట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తామన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలన్నీ తీరుస్తామన్నారు. ఈ మాటలన్నీ విన్న ఏపీ ప్రజానీకం కేంద్ర బడ్జెట్ కోసం ఆత్రంగా ఎదురు చూసింది. కానీ ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగిందేమీ లేదు. ఏవో కొన్ని తాయిలాలు తప్ప.. చాలావరకు హామీలను నెరవేర్చలేదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి.. ప్రత్యేకించి కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు వస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 15,691 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడనుంది. దీనిని భర్తీ చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. కానీ, ఈ బడ్జెట్లో కేంద్రం రూ.1,180 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇంకా రూ.14,511 కోట్ల లోటు ఎలా భర్తీ చేస్తారో చెప్పలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం రూ. 250 కోట్లు కేటాయించింది. తెలంగాణ ఉద్యాన వన విశ్వవిద్యాలయం, సీమాంధ్రకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్లాన్ ఔట్ లే కింద రూ.100 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ వర్శిటీలకు నిధులు ఒకే ఏడాది కేటాయిస్తారా? లేక విడతలవారీగా కేటాయిస్తారో స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన ఐఐటీ, ఐఐఎం తదితర జాతీయ స్థాయి విద్యా సంస్థలకు ప్రాథమికంగా ఒక్కో కోటి చొప్పున కేటాయించారు. బీజేపే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా దేశంలో 100 స్మార్ట్ సిటీలను రూ. 7,060 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఘనంగా ప్రకటించినా.., ఆంధ్రప్రదేశ్‌కు అత్యావశ్యకమైన రాజధాని నిర్మాణం గురించి పట్టించుకోలేదు. రాజధాని నిర్మాణానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తినీ పట్టించుకోలేదు. ఏపీలో మెగాసిటీలు, స్మార్ట్ సిటీల నిర్మాణం గురించి బీజేపీ నేత వెంకయ్యనాయుడు పలుమార్లు చెప్పడమే తప్ప, బడ్జెట్లో వాటిని చేర్చడంలో కృతకృత్యులు కాలేకపోయారు. విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు ప్రకటన కొంత ఉపశమనం కలిగించింది. రాష్ట్రంలో ఆల్ట్రా మెగా సోలార్‌పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం పోర్టును పారిశ్రామిక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళిక రూపొందించనున్నట్లు ప్రకటించారు. కాకినాడ పోర్టు అభివృద్ధికి నిధులిస్తామన్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి మాత్రం ఇతరత్రా ఏమీ లేవు. ఆర్థికంగా చేయూత అనుమానమే! బడ్జెట్లో ఏపీని ఆర్థికంగా ఆదుకొనే అంశాన్ని ప్రస్తావించలేదు. ఆర్థిక లోటు, రాజధానికి కలిపి కొంచెం నిధులే కేంద్రం విదిలించింది. దీంతో కేంద్రం నుంచి నిధులు దక్కడంపై అధికారవర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవాణా కష్టమే ఏపీ కొత్త రాజధాని, హైదరాబాద్ మధ్య ర్యాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని పునర్వ్యవవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. కానీ బడ్జెట్లో ఈ ఊసే ఎత్త లేదు. -
జైట్లీ లెక్కలపై జనం మాట...
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిస్తుందనుకున్న కేంద్ర బడ్జెట్ నిరుత్సాహాన్ని నింపింది. బడా బాబులకు అండదండగా ఉంటానని నిరూపించింది. ఆదాయపు పన్ను మినహాయింపు భారీగా ఉంటుందని భావించిన ఉద్యోగ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లి పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్ జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించలేకపోయారన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా సంపన్నులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉందని పలువురు పేర్కొంటున్నారు. సామాన్యులకు అరకొరగా తాయిలాలు ప్రకటించి కంటికి కనిపించని రీతిలో భారాలు మోపే ప్రయత్నం కేంద్ర ఆర్థిక మంత్రి చేపట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. - సాక్షి నెట్ వర్క్ సబ్సిడీలు వద్దు.. ఎఫ్‌డీఐలు ముద్దు అన్నట్లుగా ఉంది.. ఎన్డీఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సబ్సిడీలు వద్దు.. ఎఫ్‌డీఐలు ముద్దు అన్న చందంగా ఉంది. సబ్సిడీలకు కోత వేసి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానం పలకడం సిగ్గుచేటు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు బడ్జెట్లో అరకొరగా కేటాయించారు. పెండింగ్ ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోలేదు. పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేసే బడ్జెట్ ఇది. పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారు. మొత్తానికి బడ్జెట్ చూస్తే బీమా రంగంలోని, రక్షణ రంగంలోనికి ఎఫ్‌డీఐలు ప్రవేశించేలా చేశారు. ప్రైవేట్ రంగాలకు పెద్దపీట వేశారు. - ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి. బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. గంగా, కావేరి అనుసంధానానికి సంబంధించి కెఎల్‌రావు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కేవలం రూ.100 కోట్లు కేటాయించడం అత్యంత దారుణం. కొత్త యూనివర్సిటీలు ఏవీ రాలేదు సరికదా.. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రస్తావన గానీ, రుణమాఫీ అంశం గానీ పొందుపరచలేదు. చేనేతకు ప్రత్యేక ప్యాకేజి లేదు. ముఖ్యంగా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగింది. గత రైల్వే బడ్జెట్లో కూడా రాయలసీమకు కొత్త రైళ్లు ఇవ్వలేదు. - ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే. సామాన్యులను విస్మరించారు.. బడ్జెట్లో సామాన్యులను విస్మరించారు. రక్షణ రంగంలో 49 శాతం విదేశీ పెట్టుబడులు ఆహ్వానించి దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించారు. పేదలకు సబ్సిడీలు కుదించి పెట్టుబడిదారులకు రాయితీలు కల్పించారు. ప్రజల కొనుగోలు శక్తి లేకపోవడం వలన ఆర్థిక వృద్దిరేటు సన్నగిల్లుతుంది. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి భారతదేశానికి తెప్పించాలి. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించలేదు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తగినన్నీ నిధులు కేటాయించలేదు. - రవిశంకర్‌రెడ్డి, సీపీఎం నగర కార్యదర్శి ప్రజల బడ్జెట్... ఇది ప్రజల బడ్జెట్. బిజెపి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌తో ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు అన్ని వర్గాలకు మేలు చేకూరుతుంది. అలాగే ఏపీకి కేంద్రానికి సంబంధించిన వ్యవసాయ తదితర విద్యాలయాలను కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. - అల్లపురెడ్డి హరినాథరెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు ధనికులకు మేలు చేసేవిధంగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఒరిగేదేమీలేదు. నిత్యావసరధరలను అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీజిల్, కిరోసిన్, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వాటితోపాటే నిత్యావసర ధరలు కూడా పైపైకి పోతున్నాయి. పోలవరం, ప్రత్యేక ప్రతిపత్తి వంటి వాటిపై స్పష్టమైన హామీలు ఇవ్వలేదు. - కె. సురేష్‌బాబు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మంచి బడ్జెట్ బిజెపి ప్రభుత్వం మంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యతను కల్పించింది. పారిశ్రామిక, విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు సంబంధించి సముచిత స్థానాన్ని కల్పించింది. ఉద్యోగులకు మేలును చేకూర్చారు. ఈ బడ్జెట్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో లబ్ధి చేకూరుతుంది. - లింగారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు. ‘సీమ’కు నిరాశే మిగిలింది ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొట్టమొదటి బడ్జెట్ రాయలసీమ వాసులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. యువత నైపుణ్యాలను పెంచే ‘స్కిల్ ఇండియా’ పథకాన్ని బడ్జెట్లో ప్రకటించినా, దాని అమలుకు నిధుల విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. అలాగే ఉపయోగపడే పథకాలకు అరకొర నిధులు మాత్రమే కేటాయించారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం రూపొందించిన ఈ బడ్జెట్లో ప్రజలకు ఉపయోగపడే పథకాలకు మోడీ ప్రభుత్వం అరకొర కేటాయింపులు చేసింది. - ఎమ్మెల్సీ గేయానంద్ సామాన్యులకు పెనుభారం.. బిజెపి సంపన్న వర్గాలకు మేలు చేకూర్చే బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు ఈ బడ్జెట్ వల్ల ఒరిగేది శూన్యం. మోడీ అధికారంలోకి వస్తే ఏపికి సపోర్టుగా నిలుస్తాం అన్నారు. కానీ రైల్వేబడ్జెట్‌లో గానీ, ఈ బడ్జెట్లోగానీ న్యాయం చేయలేదు. మొత్తం మీద ఇది సామాన్యులకు పెను భారం, సంపన్నులకు అనుకూలంగా ఉంది. - పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే కాంగ్రెస్ విధానాలనే కొనసాగించారు ఈ బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉంది. కాంగ్రెస్ విధానాలనే కొనసాగించారు. ధరల స్థిరీకరణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రైతుల మద్దతు ధర కల్పించడానికి కేవలం రూ. 500 కోట్లు కేటాయించడం దారుణం. కీలకమైన రక్షణ, ఆర్ధిక రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా మన సార్వభౌమత్వానికి నష్టం చేకూరుస్తున్నారు. ఇది కార్పొరేట్లకు, ధనికులకు మాత్రమే ఉపయోగపడే బడ్జెట్. - బి. నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి బంగారం ధర పెరిగింది .. కేంద్ర బడ్జెట్లో బంగారంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ కారణంగా గురువారం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.28వేల నుంచి రూ.28,700-రూ.29,000 వరకు చేరింది. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. -బుశెట్టి రామ్మోహన్రావు, ప్రముఖ వ్యాపారి , ప్రొద్దుటూరు మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదు.. జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నిత్యావసర ధరలను తగ్గించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ధరలకు కళ్లెం వేయకుండా సామాన్యులకు ఒరగబెట్టేది ఏమీ లేదు. రైల్వే బడ్జెట్లో మాదిరిగానే ఈ బడ్జెట్లో సైతం జిల్లాకు ఏ విధమైన మేలు జరగలేదు - చక్రాంతం శ్రీహరిగణేష్, కడప ఆదాయపన్ను పరిమితి ఆశించిన స్థాయిలో లేదు.. కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను పరిమితిని ఆశించిన స్థాయిలో పెంచలేదు. నాలుగు లక్షల వరకు పరిమితి విధిస్తారని పత్రికల్లో సైతం కథనాలు వచ్చాయి. ఉద్యో గ, ఉపాధ్యాయులు కూడా కనీసం రూ.3 లక్షల వరకైనా ఉంటుందని భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం రూ.2.5లక్షలకు పరిమితం చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వాలతో పోరాడి పీఆర్సీ ద్వారా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేలా కృషి చేస్తుండగా మరో వైపు ప్రభుత్వం ఈ విధంగా పన్ను వసూలు చేస్తోంది. - ఏ.నరసింహారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రొద్దుటూరు అంకెల గారడీ చేశారు.. బడ్జెట్ ద్వారా బిజెపి ప్రభుత్వం అంకెల గారడీ చేసింది. మార్కెట్ అంచనాలను ఇది ఏమాత్రం అందుకోలేక పోయింది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎంతిస్తారో చెప్పలేదు. తెలుగుజాతికి చంద్రబాబు, మోడీ క్షమాపణ చెప్పాలి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు జరపలేదు. రాష్ట్రానికి ఐఐటి, ఎయిమ్స్ ఇస్తామని ఇవ్వలేదు. - నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక ఛానెల్ ఏర్పాటు మంచి నిర్ణయం సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులకోసం ప్రత్యేక ఛానెల్ ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం. గతంలో ఉచిత టోల్‌ఫ్రీ నెంబరు ఉన్నప్పటికీ సమస్యలకు పరిష్కారం లభించేది కాదు. ప్రత్యేక ఛానెల్ అమలైతే వ్యవసాయ రంగానికి ఎంతో ఊరట. - శ్రీనివాసులు(రైతు), పులివెందుల మధ్యతరగతి ప్రజలకు మేలు లేదు.. పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరని బడ్జెట్. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాధారణంగా జీవించే ప్రజలకు ఎలాంటి మేలు చేకూరడంలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సామాన్యుడికి నిరాశే మిగిలింది. - శేఖర్ (స్థానికుడు), పులివెందుల భవిష్యత్తుపై ఆశ కల్పించేలా ఉంది సాధారణ బడ్జెట్ భవిష్యత్తు పట్ల ఆశ కల్పించేలా ఉంది. నూతనంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి ఎయిమ్స్, ఐఐటీ, వైజాగ్ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించడం శుభపరిణామం. సబ్బులు వంటి ధరలను తగ్గించడం, ఆరోగ్యానికి హాని కలిగించే సిగిరేట్, గుట్కా వంటి పదార్థాల ధరలు పెంచడం మంచి నిర్ణయం. అన్ని రకాల ధరలు పెరిగినందున ఆదాయ పరిమితి రూ.3 లక్షలకు పెంచి ఉంటే బాగుండేది. రాజధాని ఏర్పాటు విషయంలో బడ్జెట్లో చర్చించి ఉండాల్సింది. - ఎస్వీ రమణరావు, ప్రొఫెసర్, రాజంపేట వేతన జీవులకు మొండిచెయ్యి.. నూతన ప్రభుత్వంలో ఆదాయపు పన్ను మినహాయింపు రూ. 5 లక్షల వరకు పెంచుతారనుకున్న వేతన జీవులకు ఈ బడ్జెట్ నిరాశను కలిగించింది. 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు పెంచినట్లు కనిపిస్తున్నా వాస్తవానికి రూ. 30 వేలు మాత్రమే పెంచారు. గతంలో రూ. 2.20 లక్షల వరకు వర్తించేదని అటువంటిది ఇప్పుడు 2.5 లక్షలు పెంచడం ద్వారా కేవలం 30వేలు మాత్రమే పెంచినట్లు అయింది. - ఉద్దండం జయరామయ్య, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నిరాశ కలిగించింది.. కొత్త ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎంతో కొంత మేలు చేస్తుందని ఆశించాం. కానీ ఆదాయపు పన్ను మినహాయింపు కేవలం రూ. 30 వేలు మాత్రమే పెంచడం నిరాశ కలిగించింది. వృద్ధులకు రూ. 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచడం, పొదుపు రూ. 1 లక్ష నుంచి 1.50 లక్షలకు పెంచడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. మహిళా ఉద్యోగుల గురించి ప్రస్తావన లేకపోవడం విచారకరం. - వెంకటశివారెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఏపికి న్యాయం జరిగింది బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగింది. ఇదే తరహాలో ఇకపై ప్రవేశపెట్టే బడ్జెట్లు ఉంటాయని భావించవచ్చు. బడ్జెట్ ద్వారా ఏపికి అన్నిరంగాలలో తగిన మేరకు కేటాయింపులు జరిపారు. దీన్నిబట్టి రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్‌గా మారగలదని ఘంటాపథంగా చెప్పవచ్చు. - గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు -
కొత్తగా 5 ఐఐటీలు, 5 ఐఐఎంలు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా ఐదు ఐఐటీలు, మరో ఐదు ఐఐఎంల ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు తాజా బడ్జెట్లో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సహా ఛత్తీస్‌గఢ్, కేరళ, జమ్మూ, గోవా రాష్ట్రాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ )లను... అలాగే మహారాష్ర్ట, పంజాబ్, బీహార్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) విద్యా సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు ప్రాథమికంగా రూ. 500 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే ప్రపంచస్థాయి ఉన్నత విద్యా కేంద్రాల ఏర్పాటులో భాగంగా మధ్యప్రదేశ్‌లో జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ హ్యుమానిటీస్ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక విద్యా రంగానికి ఊతమిచ్చేలా ఈసారి రూ. 68,728 కోట్లను కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 11 శాతం అధికం. ఇందులో పాఠశాల విద్యకే అత్యధికంగా 51,828 కోట్లను వ్యయం చేయనుంది. ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలి దశలో దేశంలోని అన్ని బాలికల పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. మొత్తంగా లక్ష మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. పాఠశాలల స్థితిగతులపై అధ్యయనానికి రూ. 30 కోట్లతో పాటు సర్వశిక్షా అభియాన్‌కు రూ. 28,635 కోట్లు, మాధ్యమిక్ శిక్షా అభియాన్‌కు రూ.4,966 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. స్కూళ్లలో కొత్త శిక్షణా పద్ధతులను అమలు చేసేందుకు, ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లతో పండిట్ మదన్ మోహన్ మాలవ్య ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్ కోర్సుల కోసం వర్చువల్ తరగతి గదుల ఏర్పాటుకు రూ.వంద కోట్లు వెచ్చించనున్నట్లు జైట్లీ తెలిపారు. కాగా, ఉన్నత విద్య కోసం సులువుగా రుణాలు తీసుకునేందుకు వీలుగా నిబంధనలను సరళతరం చేస్తామని కూడా చెప్పారు. -
కేంద్ర బడ్జెట్‌పై భిన్నాభిప్రాయూలు
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లా వాసులు భిన్నాభిప్రా యూలు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకపోయిందని, వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళానికి వ్యవసాయ యూనివర్సిటీ కేటయించాలని, పారిశ్రామిక కారిడార్‌ను విస్తరింపజేయూలని పలువురు పేర్కొనగా, బడ్జెట్ బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా ఉంద ని, ఆయూ రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయించారంటూ మరికొందరు పెదవివిరిచారు. -సాక్షి, శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి నరేంద్రమోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రాకు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తామని ప్రకటించారు. బడ్జెట్లో ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయం. మధ్యతరగతి కుటుంబీకులకు తీవ్ర అన్యాయం జరిగింది. - కలమట వెంకటరమణ, ఎమ్మెల్యే, పాతపట్నం బీజేపీ పాలిత రాష్ట్రాలకే మొగు ఎన్డీఏ ప్రభుత్వం తన పరిపాలనకు అనుకూలంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బీజేపీ పాలిత ప్రాంతాలకు అధిక నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క అభివృద్ధి పనికి నిధులు కేటాయించలేదు. దీనివల్ల అభివృద్ధి పనులు జరగవు. రాష్ట్రానికి మొండియి చూపడం విచారకరం. - కంబాల జోగులు, ఎమ్మెల్యే, రాజాం ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. సీఎం చంద్రబాబునాయు డు సూచనల మేరకే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించా రు. నీటి పారుదలకు రూ. వెయ్యి కోట్లు కేటాయించడం, ధరల స్థిరీకరణకు రూ. 500 కోట్లు కేటాయించడం హర్షణీయం. -కింజరాపు అచ్చెన్నాయుడు, కార్మికశాఖ మంత్రి పదలకు నిరాశే.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ పేదలకు ప్రయోజనం చేకూర్చే రీతిలో లేదు. సాధారణ వస్తువులపై ధరాఘాతం పడింది. సబ్సిడీలు అంతంతమాత్రమే. రైతులకు కల్పించే రాయితీలను ఎత్తేసేందుకు నిర్ణరుుంచడం దారుణం. మొత్తం మీద నిరాశాజనకం. - విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే జిల్లాకు ప్రాధాన్యంలేదు అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరుగాంచిన శ్రీకాకుళంకు పారిశ్రామిక కారిడార్‌లో ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. అభివృద్ధి దిశలో ఉన్న జిల్లాలకే అన్నివనరులు కేటయించారు. బడ్జెట్లో అధిక ప్రాధాన్యమిచ్చారు. బడ్జెట్ వల్ల జిల్లాకు ఒరిగింది ఏమీలేదు. -కె.రామ్మూర్తి, ఉపాధ్యాయుడు సామాన్యుడికి అందుబాటులో... బడ్జెట్ సామాన్యుడికి అందుబాటులో ఉంది. గ్రామీణ, వ్యవసాయ, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులకు ప్రాధాన్యం కల్పిస్తూ పలు కేటాయింపులు చేయడం హర్షణీయం. తాగునీరు, గృహ, విద్యుత్, సదుపాయూల కల్పనకు పెద్దపీట వేశారు. - పైడి వేణుగోపాలం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్మార్ట్‌సిటీ కింద రాజధానిని అభివృద్ధి చేయాలి కేంద్రం పలు పట్టణాలను స్మార్ట్‌సిటీలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. ప్రస్తుతం ఏపీలో రాష్ట్ర రాజిధాని కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడి పట్టణాలను స్మార్ట్ సిటీల కింద అభివృద్ధి చేయాలి. ప్రగతికి బాటలు వేయూలి. - గొర్లె కిరణ్ కుమార్, వైఎస్సార్ సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయ కర్త అందుబాటులో లేదు నిత్యవసర ధరలు స్థిరీకరణపై అరుణ్‌జైట్లీ బడ్జెట్లో ఎటుంటి చర్యలు చేపట్టే దిశగా ప్రకటన చేయకపోవడంతో సామాన్యుడికి అందుబాటులో లేకుండ పోయింది.గత ప్రభుత్వ బడ్జెట్‌కి ఈ బడ్జెట్‌కు తేడా మరేముంది. - పిసిని లక్ష్మణమూర్తి, హోమియో వైద్య సహాయకుడు, పాతపట్నం ఏన్డీఏ ప్రభుత్వానికి అనుకూలం కేంద్ర బడ్జెట్ ఎన్డీ ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. నిర్మాణాత్మకమైన విధానాన్ని అవలంభిస్తూ అన్ని వర్గాలవారికి ఉపయోగపడేలా ఉంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్ పెరిగి ప్రతి వ్యక్తి యొక్క తలసరి ఆదాయం పెరగడం, తద్వారా ఖర్చుపెరిగి జాతీయ ఉత్పత్తి పెరుగుతుంది. -పొట్టా సత్యనారాయణగుప్త, సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్, రాజాం విలాస వస్తువులపై పన్నుపెంచితే బాగుండేది బడ్జెట్లో విలాస వస్తువులపై పన్ను పెంచితే బాగుండేది. అన్ని దుస్తులపై పన్ను తగ్గించడం మంచిదే అరుునా బ్రాండెడ్ దుస్తులకు పన్ను త గ్గించకపోతే సరిపోయేది. ఆదాయపు పన్ను పరిమితి రూ. 4 నుంచి 5 లక్షలకు పెంచితే బాగుండేది. - అల్లాడ సత్యనారాయణ, సీనియర్ అడ్వకేట్, ఇచ్ఛాపురం -
మెరుపుల్లేవ్.. మరకలూ లేవ్
సాదాసీదాగా మోడీ సర్కారు తొలి బడ్జెట్ శాయశక్తులా చాణక్యం ప్రదర్శించిన జైట్లీ ‘నొప్పింపక, తానొవ్వక’ రీతిలో గణాంక గారడీ ఆదాయపు పన్ను మినహాయింపు పరిధి పెంపు తగ్గిన రోజువారీ వినియోగ వస్తువుల ధరలు సిగరెట్లు, కూల్‌డ్రింక్స్ తదితరాలపై బాదుడు యూపీఏ ఫ్లాగ్షిప్ పథకాల కొనసాగింపు దేశీ, విదేశీ పెట్టుబడుల సాధనే లక్ష్యమన్న జైట్లీ న్యూఢిల్లీ: మోడీ సర్కారు తొలి బడ్జెట్ ఫర్వాలేదనిపించింది. వహ్వా అన్పించే రీతిలో జనాకర్షక విన్యాసాలు గానీ, మెరుపులు గానీ లేవు. అలాగని జనంపై మోయలేని భారాలూమోపలేదు. నొప్పింపక, తానొవ్వక అన్న రీతిలో చేతనైన మేరకు చాణక్యం చూపేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రయత్నించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి సాధారణ బడ్జెట్‌ను గురువారం ఆయన పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను కనీస మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచడమే గాక దానికి మరిన్ని పన్ను మినహాయింపు లనూ జోడించి మధ్యతరగతి వర్గాన్ని కాస్తంత మురిపించారు. అగ్గిపెట్టెలు మొదలుకుని టీవీలు, కంప్యూటర్ల దాకా పలు రకాలైన రోజువారీ వినియోగ వస్తువులపై పన్ను భారాలను ఓ మేరకు తగ్గించారు. అదే సమయంలో సిగరెట్ల నుంచి శీతల పానీయాల దాకా పలు ఉత్పత్తులపై ఓ మోస్తరు నుంచి భారీ స్థాయిలో పన్నుల మోత మోగించారు. చీటికీమాటికీ పన్ను విధానాలను మార్చబోమనే హామీతో దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు సానుకూల సంకేతాలు పంపారు. పన్ను చట్టాలకు ‘గతం నుంచి అమల్లోకి వచ్చేలా’ (రెట్రాస్పెక్టివ్) సవరణలు చేసే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటామంటూ వారికి హామీ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి పూర్తిస్థాయిలో పట్టాలకెక్కించేందుకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకున్నట్టు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం పీటీఐ వార్తా సంస్థతో జైట్లీ అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని పట్టాలకెక్కిస్తామన్నారు. వస్తువులు, సేవల పన్ను విధివిధానాలను కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పథకాల కొనసాగింపు... యూపీఏ హయాంలో మొదలైన జాతీయ ఉపాధి హామీ తదితర ఫ్లాగ్షిప్ పథకాలను మోడీ సర్కారు యథాతథంగా కొనసాగించింది. వాటిలో కొన్ని పథకాలకు నిధులను తగ్గించగా మరికొన్నింటికి యథాతథంగా కొనసాగించింది. వ్యవసాయ రంగానికి తమ సర్కారు ప్రాధాన్యమిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా రూ.100 కోట్లతో డీడీ కిసాన్ చానల్‌ను ప్రకటించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీ సహా పలు రాష్ట్రాలకు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ తరహా సంస్థలను ప్రకటించారు. గ్రామీణ భారతాన్ని ఆధునిక బాట పట్టిస్తామన్నారు. ఇందుకోసం డిజిటల్ ఇండియా వంటి పలు పథకాలు ప్రకటించారు. చిన్న మొత్తాల పొదుపును ఇతోధికంగా ప్రోత్సహిస్తాం. కిసాన్ వికాస్ పత్రాలను మళ్లీ ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. మోడీ కలల ప్రాజెక్టు గంగా నది ప్రక్షాళనకు పెద్ద పీట వేశారు. అందరికీ ఆరోగ్యమే సర్కారు లక్ష్యమన్నారు. పెరిగిన ప్రణాళికా వ్యయం మొత్తం రూ.17,94,892 కోట్లతో కూడిన 2014-15 బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయం రూ.12,19,892 కోట్లుగా ఉండొచ్చని జైట్లీ అంచనా వేశారు. అయితే ప్రణాళికా వ్యయం వాటా గతంతో పోలిస్తే 26 శాతం పెరిగి రూ.5.75 లక్షల కోట్లకు చేరింది. ఇది సానుకూల పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రక్షణ, బీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతానికి తమ సర్కారు పెంచుతోందని మంత్రి చెప్పారు. కాకపోతే ఆయా రంగాలు పూర్తిగా స్వదేశీ నిర్వహణ, నియంత్రణలోనే కొనసాగుతాయని హామీ ఇచ్చారు. కీలకమైన రక్షణ రంగానికి బడ్జెట్లో రూ.2.29 లక్షల కోట్లు (గత కేటాయింపులతో పోలిస్తే 12.5 శాతం అధికం) కేటాయించారు. స్థూల పన్ను వసూళ్లను రూ.13,64,524 కోట్లుగా అంచనా వేశారు. ‘‘ఇందులో కేంద్రం వాటా రూ.9,77,258 కోట్లు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం రూ.2,12,505 కోట్లుగా ఉండవచ్చు’’ అని మంత్రి అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు జీడీపీలో 4.1 శాతం ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అది 2015-16లో 3.6 శాతం, 2016-17లో 3 శాతానికి పరిమితమవుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనల ద్వారా రూ.22,200 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోనున్నామని, అదే సమయంలో పరోక్ష పన్ను ప్రతిపాదనలు రూ.7,525 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించి పెట్టనున్నాయని తెలిపారు. ‘‘మేం అధికారంలోకి వచ్చి 45 రోజులే అయింది. గత ప్రభుత్వం విధించుకున్న లక్ష్యాల కారణంగా తలెత్తిన పరిమితులకు లోబడి, ఈ స్వల్ప కాలంలో మేం చేయగలిగిందంతా చేశాం’’ అని చెప్పుకొచ్చారు. సబ్సిడీ వ్యవస్థను పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని ప్రకటించారు. ఆ క్రమంలో అణగారిన, బలహీనవర్గాల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. సబ్సిడీ సంస్కరణలను పరిశీలించేందుకు వ్యయ నిర్వహణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సకాలంలో విధాన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే వరుసగా రెండేళ్ల పాటు ఆర్థిక వృద్ధి రేటు 5 శాతం కంటే దిగువకు పడిపోయిందంటూ యూపీఏ ప్రభుత్వాన్ని జైట్లీ విమర్శించారు. రూ.6 లక్షల కోట్ల అప్పులు తెస్తాం: జైట్లీ ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి, గత రుణాలను తీర్చడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6 లక్షల కోట్ల దాకా రుణాలను సేకరించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. గతేడాది ఇది రూ.5.63 లక్షల కోట్లు. గత రుణాలు, వడ్డీల చెల్లింపులకు పోను నికరంగా రూ.4,61,204 కోట్ల రుణాలను సేకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. 2013-14తో పోలిస్తే ఇది రూ.7,700 కోట్లు తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో రూ.3.68 లక్షల కోట్ల రుణాలు సేకరిస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఖజానాకు చేరే ప్రతి రూపాయిలో 24 పైసలు మార్కెట్ నుంచి అప్పు రూపంలోనే సమకూరనుంది. ఇందులో 20 పైసలు వడ్డీల చెల్లింపుకే వెళ్తుంది. కేంద్ర ప్రణాళికా కేటాయింపులు ప్రతి రూపాయిలో 21 నుంచి 11 పైసలకు తగ్గాయి. నిరుడు 18 పైసలు న్న వడ్డీ చెల్లింపులు 20 పైసలకు పెరుగుతాయి. ఇది సవాలే.. అధిగమిస్తాం ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, మందగమనంతో కూడిన వృద్ధి నిజంగా సవాళ్లేనని జైట్లీ అన్నారు. ఈ పరిస్థితిని అధిగమిస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. ‘ఆశించిన వృద్ధి, అల్ప ద్రవ్యోల్బణం, రంగాలవారీగా అభిలషణీయ సమతౌల్యం, సమర్థమైన విధాన వైఖరులతో కూడిన వ్యవస్థను నెలకొల్పుతాం’ అని ప్రకటించారు. అయితే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ, ఉపాధి కల్పన దిశగా బడ్జెట్లో ఎన్నో చర్యలు తీసుకున్నామ న్నారు. హైవేల ఆధునీకరణకు రూ.38 వేల కోట్లు వెచ్చించనుండటానికి ఇదో కారణమన్నారు. దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల నుంచి దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఆర్ఈఐటీ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్లకు రూపకల్పన చేసి పన్ను రాయితీలు కల్పిస్తున్నామని అన్నారు. -
జైట్లీసారూ! ఇదేం తీరు..!
శ్రీకాకుళం సిటీ: శ్రీకాకుళం జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి పదేళ్లకోసారి జరిపే లెక్కల్లో లక్షల్లో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతోంది. జనాభా నియంత్రణపై ప్రభుత్వం అలక్ష్యం చేయడం, ప్రజల్లో అవగాహన కొరవడడమే జనాభా పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల తగ్గుతున్నా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం జీవనమే కష్టమైన రోజుల్లో కూడా సంచార జాతుల్లో అవగాహన లేమి జనాభా పెరగుదలకు కారణమవుతోంది. జనాభాలో జిల్లా పరిస్థితి... జిల్లాలో జనాభా రోజురోజుకూ పెరుగుతోందనడానికి జనాభా లెక్కలే ప్రామాణికం. 1991 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 23,21,126 మంది కాగా, 2001లో 25,37,593 మంది, 2011 జనాభా లెక్కల ప్రకారం 27,03,114 గా నమోదైంది. వృద్ధిరేటు దాదాపు 19 శాతం వరకు ఉంది. ఇందులో పురుషులు 13,41,738 కాగా, మహిళలు 13,61,376 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం కుటుంబాలు పట్టణ ప్రాంత ంలో 1,08,948, రూరల్‌లో 5,72,382, మొత్తంగా 6,81,330 కుటుంబాలున్నాయి. దేశాలనే అధిగమించేశాం... ప్రస్తుతం జిల్లా జనాభా ప్రపంచంలోని ఖతర్, బ్రూనే, నమీబియూ వంటి సుమారు 50 చిన్నదేశాలకంటే అధికం. ఇది ఆశ్చర్యకరంగా ఉన్నా నమ్మాల్సిన నిజం. దక్షిణ తూర్పు ఆసియాలోని బ్రూనై దేశంలో 3,93,162 మంది జనాభా ఉండగా, ఆఫ్రికా ఖండంలో నమీబియాలో 23,24,004 మంది, సౌదీ అరేబియాకు దగ్గరలో ఉండే ఖతర్ దేశంలో 18,70,041 మంది జనాభా ఉన్నారు. నియంత్రణలో అలక్ష్యం వాస్తవంగా కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలను ప్రోత్సహిస్తే జనాభా తగ్గుతుంది. అరుుతే, దీనిపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం జనాభా పెరుగుదలకు కారణమవుతోంది. 2001 నుంచి ఏటా సగటున 19,000 కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేయూలని లక్ష్యం కాగా ఏనాడూ లక్ష్యాలకు చేరుకోలేదు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ నలుగురు నుంచి ఐదుగురు పిల్లలకు జన్మనిస్తున్నా పట్టించుకునేవారే లేరు. వారిలో చైతన్యం నింపేవారే కరువయ్యూరు. జిల్లా వెనుకబాటు తనం, సంచార జాతులు అధికంగా ఉండం, నిరక్ష్యరాస్యత తదితర అంశాలు జనాభాను ప్రోత్సహిస్తున్నారుు. ఇలా చేయాలి.. శతశాతం అక్షరాస్యత జిల్లాగా మార్చాలి. జనాభా పెరుగుదల వల్ల కలిగే అనర్ధాలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వివరించాలి. వారిని అవగాహన కల్పిస్తూ ప్రచార బోర్డులు ఏర్పాటుచేయాలి. ఒకరు లేదా ఇద్దరు పిల్లల వల్ల కలిగే లాభాలపై ప్రచారం చేయూలి. చైతన్యవంతం చేయూలి. చిన్న కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలి. సంచార జాతుల్లో అవగాహన కల్పించాలి. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలకు జన్మనిచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలను ప్రోత్సహించాలి. ఒక బిడ్డతో శస్త్రచికిత్స చేసుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు పెంచాలి. విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది జనాభా నియంత్రణ కోరేవారి అభిప్రాయం. -
భారత దేశంలో మొట్టమొదటి బడ్జెట్
1947 ఇప్పుడు బడ్జెట్ లెక్కలన్నీ వేలు, లక్షల కోట్లలోనే.. మరి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కేంటి? అప్పుడు మన ఆదాయం ఎంత? రక్షణ శాఖ బడ్జెట్ ఎంత? ఆ వివరాలు తెలుసుకుందామా.. (అంకెలు రూ.కోట్లలో) మంత్రి: ఆర్కే షణ్ముగం చెట్టి, తేదీ: 1947, నవంబర్ 26 రెవెన్యూ అంచనా: 171.15 రెవెన్యూ వ్యయం: 197.39 రెవెన్యూ లోటు: 26.24 రక్షణశాఖకు: 92.74 ఆదాయపు పన్ను ద్వారా ఆదాయం: 119 కస్టమ్స్ ఆదాయం: 50.5 ఫారెక్స్ నిల్వలు: 1,547 గణతంత్ర భారత దేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను జాన్ మతాయ్ 1950 ఫిబ్రవరి 28న సభలో ప్రవేశపెట్టారు. -
సబ్సిడీ పెంపు స్వల్పమే.
ఎరువులకు పెంపు... పెట్రోలియానికి తగ్గింపు న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తాజా బడ్జెట్లో సబ్సిడీ బిల్లును స్వల్పంగా పెంచి రూ. 2.60 లక్షల కోట్లు కేటాయించారు. అయితే.. ఆహార, ఇంధన, ఎరువులకు కేటాయిస్తున్న సబ్సిడీలు లబ్ధిదారులకు మరింత ఖచ్చితత్వంతో చేరేలా సబ్సిడీ విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తామని.. ఈ క్రమంలో పేద, అణగారిన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని ప్రకటించారు. కొత్త ఎరువుల విధానాన్నీ రూపొందిస్తామని చెప్పారు. సబ్సిడీ బిల్లు 2013-14 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల మేరకు రూ. 2,55,516.00 కోట్లుగా ఉండగా.. దానిని 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,60,658 కోట్లకు పెం చారు. ఈ ఏడాది ఎరువుల రంగానికి కేటాయింపులు పెంచటం వల్ల సబ్సిడీ బిల్లు మొత్తంగా పెరిగింది. మధ్యం తర బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి రూ. 67,970 కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్లో దానిని రూ. 72,970.30 కోట్లకు పెంచారు. ఇందులో దిగుమతి చేసుకున్న ఎరువులకు (యూరియా) రూ. 12,300 కోట్లు, దేశీయంగా ఉత్పత్తి చేసిన ఎరువులకు (యూరియా) రూ. 36,000 కోట్లు, ఫాస్ఫేట్, పొటాసియం వంటి ఎరువుల విక్రయానికి రూ. 24,670.30 కోట్లు చొప్పున కేటాయించారు. ఆహార భద్రతకు రూ. 88,500 కోట్లు ఇక ఆహార సబ్సిడీ కింద మధ్యంతర బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ. 1,15,000 కోట్లనే యథాతథంగా ప్రతిపాదించారు. గత ప్రభుత్వమే ఆహార భద్రత చట్టం అమలులోకి తెచ్చిన నేపధ్యంలో ఆహార సబ్సిడీని గత ఆర్థిక సంవత్సరం కన్నా మధ్యంతర బడ్జెట్లో భారీగా రూ. 23,000 కోట్లు పెంచింది. మొత్తం ఆహార సబ్సిడీ బిల్లులో జాతీయ ఆహార భధ్రత చట్టం అమలు కోసం రూ. 88,500 కోట్లు కేటాయిం చారు. ఆహార భద్రత చట్టం అమలు గడువును మరో మూడు నెలలు పొడిగించి ఈ ఏడాది సెప్టెంబర్‌గా నిర్ణయించారు. ఇక ఇంధనం, ఎల్పీజీ గ్యాస్, కిరోసిన్‌లను వాస్తవ ధరకన్నా తక్కువ ధరకు విక్రయిస్తున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు అందించే పెట్రోలియం సబ్సిడీ రూ. 63,426.95 కోట్లుగా జైట్లీ ప్రతిపాదించారు. గత ఏడాది పెట్రోలియం సబ్సిడీ సవరించిన అంచనాలు రూ. 85,480 కోట్ల కన్నా తగ్గింది. మొత్తం మీద సబ్సిడీ బిల్లులో పెరుగుదల స్వల్పమే అయినప్పటికీ.. అది ఈ ఆర్థిక సంవ్సరంలో ద్రవ్యలోటుపై ప్రభావం చూపనుంది. -
తెలంగాణకు రిక్తహస్తమే..!
ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ హోదాపై ప్రకటన కరువు హామీలు గాలి కొదిలేశారు...! విభజన చట్టంలో తెలంగాణకు పలు అంశాల్లో కేంద్రం హామీలు ఇచ్చింది. వాటిలో కొన్నింటినే బడ్జెట్లో ప్రస్తావించారు. వివరాలు ఇవీ... గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం: బడ్జెట్లో ఎలాంటి ప్రకటన లేదు. ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటన. ఖమ్మం జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు బడ్జెట్లో ప్రస్తావన లేదు. అయితే, ఇప్పటికే సెయిల్ అధికారులు ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. బయ్యారంలో ఏర్పాటుకు అవకాశం ఉందనే నిర్ణయానికి వచ్చారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు: బడ్జెట్లో ప్రస్తావన లేకపోయినప్పటికీ... రెండు రోజుల క్రితమే సీఎం కేసీఆర్‌తో ఎన్టీపీసీ సీఎండీ సమావేశమయ్యారు. రామగుండం వద్ద భూమి ఇస్తామని, సింగరేణి నుంచి బొగ్గు కూడా ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ అభివృద్ధి గురించి ప్రస్తావించలేదు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన రైల్వే బడ్జెట్లో రాలేదు. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ర్యాపిడ్ రోడ్ కనెక్టివిటీ: హైదరాబాద్ నుంచి వరంగల్‌కు నాలుగు లైన్ల రహదారి మినహా పెద్దగా ఏమీ ప్రకటించలేదు. సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ తెలంగాణకు రిక్తహస్తాన్నే చూపింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల్లో కేవలం ఒక్క ఉద్యానవన యూనివర్సిటీ మినహా ఏ ఇతర హామీని కేంద్రం తన బడ్జెట్లో ప్రకటించలేదు. గిరిజన యూనివర్సిటీపై నామమాత్రపు ప్రస్తావన కూడా లేదు. తెలంగాణ ప్రజలు ఎంతో ఆశపెట్టుకున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఎలాంటి హామీ దక్కలేదు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అనే ప్రకటన మినహా పెద్దగా ఒరిగిందేమీ లేదు. డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను హైదరాబాద్‌కు మంజూరు చేసినా దానివల్ల ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదు. ప్రాణహిత-చేవెళ్లకు ఏదీ జాతీయ హోదా! ప్రాణహిత- చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు కూడా అధిష్టానాన్ని కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించారని కూడా వారు ప్రకటించారు. అయితే, బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా దీని ప్రస్తావన కనిపించలేదు. అంతేకాకుండా రాష్ట్రానికో ఎయిమ్స్ అని హామీ ఇచ్చినా కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ లేదు. హామీలు గాలి కొదిలేశారు...! విభజన చట్టంలో తెలంగాణకు పలు అంశాల్లో కేంద్రం హామీలు ఇచ్చింది. వాటిలో కొన్నింటినే బడ్జెట్లో ప్రస్తావించారు. వివరాలు ఇవీ... గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం: బడ్జెట్లో ఎలాంటి ప్రకటన లేదు. ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటన. ఖమ్మం జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు బడ్జెట్లో ప్రస్తావన లేదు. అయితే, ఇప్పటికే సెయిల్ అధికారులు ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. బయ్యారంలో ఏర్పాటుకు అవకాశం ఉందనే నిర్ణయానికి వచ్చారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు: బడ్జెట్లో ప్రస్తావన లేకపోయినప్పటికీ... రెండు రోజుల క్రితమే సీఎం కేసీఆర్‌తో ఎన్టీపీసీ సీఎండీ సమావేశమయ్యారు. రామగుండం వద్ద భూమి ఇస్తామని, సింగరేణి నుంచి బొగ్గు కూడా ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ అభివృద్ధి గురించి ప్రస్తావించలేదు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన రైల్వే బడ్జెట్లో రాలేదు. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ర్యాపిడ్ రోడ్ కనెక్టివిటీ: హైదరాబాద్ నుంచి వరంగల్‌కు నాలుగు లైన్ల రహదారి మినహా పెద్దగా ఏమీ ప్రకటించలేదు. నిరాశ కలిగించింది: సీఎం కేసీఆర్ బడ్జెట్లో రాష్ట్రానికి హార్టికల్చర్ యూనివర్సిటీ మినహా మరేది కొత్తగా కేటాయించకపోవడం సరికాదు. అది కూడా రాష్ట్ర పునర్విభజన బిల్లులో పొందుపరిచిందే. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎంతో కోరాం. అయినా న్యాయం చేయలేదు. పునర్విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. మొత్తంగా నిరాశ కలిగించింది. -
గంగా నది పరిరక్షణకు రూ. 2,037 కోట్లు
న్యూఢిల్లీ: గంగా నది పరిరక్షణకు ఓ సమీకృత పథకాన్ని కేంద్ర ప్రభుత ్వం ప్రకటించింది. ఇందుకు బడ్జెట్లో రూ. 2,037 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు భారీగా నిధులు వెచ్చించినప్పటికీ గంగా నది పరిరక్షణ కార్యక్రమం ముందుకు సాగడం లేదని, ఇందుకు తగిన కృషి జరగకపోవడమే కారణమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అభిప్రాయపడ్డారు. అందుకే ‘నమామి గంగా’ పేరుతో గంగా కన్సర్వేషన్ మిషన్‌ను చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే గంగా పరిరక్షణకు ఉత్సాహం చూపుతున్న ఎన్ఆర్ఐలను ప్రోత్సహించేందుకు ‘ఎన్ఆర్ఐ ఫండ్ ఫర్ గంగా’ పేరుతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక కేదార్నాథ్, హరిద్వార్, కాన్పూర్, వారణాసి, అలహాబాద్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లోని నదీ తీరాల అభివృద్ధి, అక్కడి పవిత్ర ఘాట్ల సుందరీకరణ కోసం రూ. వంద కోట్లు కేటాయించారు. వాటిలో చారిత్రక వారసత్వం ఇమిడి ఉందని ఈ సందర్భంగా జైట్లీ వ్యాఖ్యానించారు. అలాగే గంగా నదిని జల రవాణాకు అనువుగా అభివృద్ధి పరచనున్నట్లు ప్రకటించారు. కార్గో రవాణాకు వీలుగా మార్చేందుకు రూ. 4,200 కోట్లు కేటాయించారు. దీంతో ‘జల్ మార్గ్ వికాస్’ పేరిట తొలి దశలో అలహాబాద్-హల్దియా(1620 కిలోమీటర్లు) మధ్య 1500 టన్నుల బరువైన నౌకలు ప్రయాణించేలా జల మార్గం ఆరేళ్లలో అందుబాటులోకి రానుంది. మరోవైపు నదుల అనుసంధానం ద్వారా జల వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా ప్రాజెక్టును రూపొందిండంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం సత్వరమే సమగ్ర నివేదికను రూపొందించడానికి వీలుగా బడ్జెట్లో రూ. వంద కోట్లు కేటాయించింది. 4. -
మోడీ ‘మైనారిటీ’ మంత్రం
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మదర్సాల ఆధునీకరణకు రూ.100 కోట్లు కేటారుుంచింది. సంప్రదాయ కళల్లో మైనారిటీల నైపుణ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ.3,734.01 కోట్ల బడ్జెట్ కేటారుుంచింది. ఇది గత ఏడాది బడ్జెట్‌తో పోల్చుకుంటే 5.75% అధికం. కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం రూ.3,530.98 కోట్లు కేటారుుంచింది. కాగా మదర్సాల ఆధునీకరణ కోసం పాఠశాల విద్యా శాఖకు అదనంగా రూ.100 కోట్లు కేటారుుస్తున్నట్టు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. బాలికా శిశు రక్షణకు కొత్త పథకం దేశంలో బాలికలు, ఆడ శిశువులపై నిర్లక్ష్యం, వివక్షను రూపుమాపడానికి రూ.100 కోట్లతో కేంద్రం ‘బేటీ బచావో, బేటీ పఢావో యోజన’ను ప్రకటించింది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశం దూసుకుపోతున్నా.. ఆడ శిశువులు, మహిళలపై వివక్ష కొనసాగుతుండడం సిగ్గుపడాల్సిన అంశమని జైట్లీ వ్యాఖ్యానించారు. ఈసారి బడ్జెట్లో స్త్రీ,శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖకు రూ. 21,100 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆడపిల్లల చదువు, పెళ్లి కోసం ఒక ప్రత్యేక చిన్నమొత్తాల పొదుపు పథకాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు. ‘బేటీ బచావో...’ పథకంలో భాగంగా ఆడ శిశువులు, బాలికలపై వివక్షను రూపుమాపడం, వారి రక్షణపై దేశవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. ఇక పెద్ద నగరాల్లో మహిళలకు మరింత భద్రత నిమిత్తం రూ. 150 కోట్లు, ప్రజా రవాణా వ్యవస్థలో మహిళల భద్రత కోసం రూ.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతోపాటు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యాచార బాధితుల కోసం ‘సంక్షోభ నివారణ కేంద్రాల’ను ఏర్పాటు చేయాలని, ఇందుకు ‘నిర్భయ నిధి’ నుంచి కేటాయింపులు జరపాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. గిరిజన సంక్షేమం కింద ఎస్టీ పిల్లల విద్యా పథకానికి రూ.1,058 కోట్లు, వన బంధు కల్యాణ్ యోజనకు గాను రూ.100 కోట్లు గిరిజన వ్యవహారాల శాఖకు కేటారుుంచారు. ఇలా ఉండగా ఎస్పీ ప్రణాళిక కింద రూ.50,548 కోట్లు, టీఎస్పీ కింద రూ.32,387 కోట్లు ప్రతిపాదించారు. ‘అన్క్లెయిమ్డ్’ సొమ్ము వృద్ధులకు... సేవింగ్స్ స్కీముల్లో ‘అన్క్లెయిమ్డ్’ పేరిట మూలుగుతున్న భారీ మొత్తంలోని సొమ్మును ప్రత్యేకంగా వృద్ధుల(సీనియర్ సిటిజన్స్) సంక్షేమం కోసం వినియోగించనున్నట్టు జైట్లీ తెలిపారు. వివిధ పథకాల కింద పొదుపు చేసుకున్న వృద్ధులు మరణించిన సందర్భాల్లో.. చెల్లింపులకు సంబంధించి తగిన మార్గదర్శకాలకోసం వేచిచూస్తూ ఆ మొత్తా లు ‘అన్క్లెయిమ్డ్’ కింద మిగిలిపోతున్నాయన్నారు. ఈ సొమ్మును వృద్ధుల రక్షణకు, వారి ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు ఎలా ఉపయోగించవచ్చో సూచించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. -
మరో హరిత విప్లవం తెస్తాం
సాగులో ఆధునిక పరిజ్ఞానానికి, యాంత్రీకరణకు పెద్దపీట బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి ఊతమిస్తూ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా నూతన ప్రణాళికను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్లో పొందుపరిచారు. ఇందులో సాగును యాంత్రీకరణ దిశగా నడిపించి పంట దిగుమతులు పెంచేందుకు పలు కార్యక్రమాలను ప్రకటించారు. మొత్తమ్మీద వ్యవసాయ రంగానికి జవసత్వాలు అందించి 4 శాతం వృద్ధిని సాధిస్తామని, రెండో హరిత విప్లవానికి నాంది పలుకుతామని తెలిపారు. బీడుగా పడి ఉన్న భూములను వ్యవసాయానికి అనుగుణంగా తీర్చిదిద్దడంతోపాటు, భూసార పరిరక్షణ, పరిశోధన కార్యక్రమాలకు బడ్జెట్లో రూ.7,500 కోట్లు కేటాయించారు. అలాగే పంటలను నిల్వ చేసేందుకు శాస్త్రీయ పద్ధతిలో పెద్దఎత్తున గోదాములను అభివృద్ధి చేస్తామని, ఇందుకు రూ.5 వేల కోట్లు వెచ్చిస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)లో సమూల మార్పులు తీసుకువస్తామని, ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. మార్కెట్లో పంటల ధరలు తగ్గిపోయినప్పుడు రైతులను ఆదుకునేందుకు ‘ధరల స్థిరీకరణ నిధి’ కింద రూ.500 కోట్లు ఇస్తామని బడ్జెట్లో ప్రకటించినా దీనిపై వ్యవసాయరంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఈ నిధి దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ఏ మూలకు సరిపోతాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను బ్యాంకుల ద్వారా రైతులకు రూ.8 లక్షల కోట్ల రుణాలు ఇప్పిస్తామని ఆర్థికమంత్రి చెప్పారు. కిందటేడాది యూపీఏ సర్కారు తన బడ్జెట్లో రైతులకు రూ.7 లక్షల కోట్ల రుణాలు ఇప్పిస్తామని చెప్పగా.. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల రుణాలను లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు 3 శాతం వడ్డీ పథకాన్ని కొనసాగిస్తామని జైట్లీ పేర్కొన్నారు. దానికితోడు రూ.5 వేల కోట్ల కార్పస్ ఫండ్‌తో గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక రుణాలు అందిస్తామని వెల్లడించారు. ‘‘సాగును లాభసాటిగా మార్చేందుకు, ఇతర రంగాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు తక్షణమే ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పెంచాల్సిన అవసరముంది. అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి’’ అని జైట్లీ తన ప్రసంగంలో చెప్పారు. వ్యవసాయానికి కేటాయించిన రూ.7,500 కోట్లలో రూ.వెయ్యి కోట్లను ‘ప్రధానమంత్రి కృషి సించాయి యోజన’ పథకానికి ఇచ్చారు. ఈ పథకం కింద బీడు భూములను అభివృద్ధి చేయనున్నారు. ఇక రెండు రాష్ట్రాలుగా అవతరించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొత్తగా వ్యవసాయ విద్యా సంస్థలను నెలకొల్పుతామని ప్రకటించారు. బడ్జెట్ బాగుంది: నాబార్డ్ బడ్జెట్ బాగుందని నాబార్డ్(నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) చైర్మన్ హెచ్‌కే భన్వాలా పేర్కొన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సముచిత ప్రాధాన్యం కల్పించారన్నారు. బడ్జెట్లో సాగుకు కేంద్రం ఇచ్చిందేమిటంటే.. ► ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం. తెలంగాణ, హర్యానాలో ఉద్యాన వర్సిటీని నెలకొల్పుతాం. ఇందుకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నాం. హా భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) తరహాలో అస్సాం, జార్ఖండ్‌లలో రాష్ట్రానికి ఒకటి చొప్పున రూ.100 కోట్లతో రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేస్తాం. ► రూ.100 కోట్లతో అగ్రి-టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తాం. ► సాగుభూమి లేని 5 లక్షల కౌలు రైతుల బృందాలకు నాబార్డ్ ద్వారా ఆర్థికసాయం అందజేస్తాం. రైతులకు రుణాలు అందుబాటులో ఉండేలా చూసేందుకు సహకార బ్యాంకులకు నాబార్డ్ ద్వారా విడతల వారీగా రూ.50 వేల కోట్లు అందిస్తాం. ► భూసార పరిరక్షణకు పెద్దపీట వేస్తాం. ఇందుకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం. భూసారానికి సంబంధించి రైతులందరికీ ప్రత్యేక కార్డులు అందజేస్తాం. రూ.56 కోట్లు వెచ్చించి దేశవ్యాప్తంగా మరో 100 సంచార భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ► వర్షాభావ పరిస్థితుల్లో పంటల దిగుబడులు తగ్గిపోయినా ప్రజాపంపిణీ ద్వారా సరుకులను అందజేస్తాం. ► విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకాన్ని నియంత్రించేందుకు కొత్త యూరియా విధానాన్ని తీసుకువస్తాం. ► దేశీయ పాడి పశువుల అభివృద్ధికి రూ.50 కోట్లు వెచ్చిస్తాం. మత్స్యసంపద పెంచేందుకు మరో రూ.50 కోట్లు కేటాయిస్తున్నాం. రైతన్నల కోసం ‘టీవీ-కిసాన్’ న్యూఢిల్లీ: ఆరుగాలం శ్రమించే అన్నదాతల కోసం ‘టీవీ-కిసాన్’ పేరిట 24 గంటల టీవీ చానల్‌ను ఈ సంవత్సరమే ప్రారంభించనున్నారు. దీని ఏర్పాటుకుగాను బడ్జెట్లో రూ.100 కోట్లను కేటాయించారు. కిసాన్ టీవీలో.. వ్యవసాయ సంబంధిత సమాచారం, పంటల మెళకువలు, సాంకేతిక, పర్యావరణ పరిజ్ఞానం, జల వినియోగం, వాతావరణ పరిస్థితులు వంటివి 24 గంటలూ ప్రసారం కానున్నాయి. దీంతోపాటు ఈశాన్య రాష్ట్రాల ప్రజల కోసం ‘అరుణ ప్రభ’ పేరుతో మరో 24 గంటల టీవీ చానల్‌ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. కాగా, కమ్యూనిటీ రేడియోను పరిపుష్టం చేసేందుకు రూ.100 కోట్లతో 600 కొత్త రేడియో స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. సమాచార, ప్రసార శాఖకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం రూ. 3,316 కోట్లు కేటాయించింది. నూనె చెక్కలపై సుంకం రద్దు పశువులు, కోళ్లకు దాణాగా ఉపయోగించే తెలగపిండి వంటి నూనె చెక్కలపై ప్రస్తుతమున్న 15 శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ చెక్కలపై సుంకం వసూలు చేయబోమన్నారు. ఈ చర్యతో దాణా ధరలు దిగొస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. యూరియూ వినియోగానికి కళ్లెం! న్యూఢిల్లీ: యూరియూ అధిక వినియోగానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త యూరియూ విధానానికి రూపకల్పన చేయనుంది. ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం యూరియూ.. ఉత్పత్తి ఆధారిత సబ్సిడీ (పీబీఎస్) విధానంలో ప్రతి టన్ను యూరియూకు రైతులు గరిష్ట స్థిర చార్జీ రూ.5,360 మాత్రమే చెల్లిస్తుండటం, ప్రభుత్వం సబ్సిడీ కింద టన్నుకు రూ.11,760 చొప్పున చెల్లిస్తుండటంతో భారీగా నిధులు వృథా అవుతున్నట్లు ఆర్ధిక సర్వే వెల్లడించిన నేపథ్యంలో కొత్త యూరియూ విధానానికి కేంద్రం రూపకల్పన చేయనున్నట్టు జైట్లీ తెలిపారు. వివిధ రకాల ఎరువుల వినియోగంలో సమతూకం లోపించడం వల్ల భూసారం తగ్గుతుండటంపై కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు జైట్లీ తన ప్రసంగంలో చెప్పారు. పొలాలకు ప్రత్యేక ‘పవర్’ న్యూఢిల్లీ: వ్యవసాయ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసేందుకు గుజరాత్లో అనుసరిస్తున్న విధానాన్ని పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్తు మౌలిక వసతులను వేరు చేసేందుకు బడ్జెట్లో కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు ఫీడర్లను వేరు చేసేందుకు ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన’ పథకం కింద నిధులు ఇచ్చారు. గ్రామాల్లో విద్యుత్తు లైన్లు, సబ్-ట్రాన్స్మిషన్, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయటం దీని లక్ష్యమని అరుణ్‌జైట్లీ తెలిపారు. ఢిల్లీలో విద్యుత్తు కోతలు లేకుం డా సంస్కరణలు చేపట్టేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తామని, నీటి కొరత లేకుండా చర్యల కోసం మరో రూ.500 కోట్లు ఇస్తామన్నారు. విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలకు పదేళ్లపాటు టాక్స్ హాలిడే(2017 మార్చి 31 నుంచి వర్తిస్తుంది). -
ఫొటోలు దిగేది ఇందుకే..
పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి లెదర్ బ్రీఫ్‌కేస్‌ను పట్టుకుని.. మీడియా ముందుకొచ్చి ఫొటోలు దిగడం మనమెప్పుడూ చూస్తుంటాం. దీనికి ఓ కారణముంది. 1869లో బ్రిటిష్ కామన్స్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వచ్చిన జార్జి వార్డ్ హంట్ సభాధ్యక్షుడి నుంచి అనుమతి రాగానే లేచి నిలబడ్డాడు. తీరా చూస్తే.. బడ్జెట్ పత్రాలున్న తన బ్రీఫ్‌కేసు కనిపించలేదు. అప్పుడు గుర్తొచ్చింది మనోడికి.. దాన్ని ఇంట్లోనే మరిచిపోయి వచ్చానన్న విషయం.. దీంతో అప్పట్నుంచి ఆర్థిక మంత్రులు ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టటానికి సభకు వచ్చేముందు తమ వెంట పత్రాలన్నీ తెచ్చుకున్నామని, ఇంట్లో ఏవీ మర్చిపోలేదని పార్లమెంట్ వద్ద గుమికూడిన జనానికి తెలియజేస్తూ బాక్స్‌ను చూపించి లోపలికి వెళ్లడం మొదలు పెట్టారు. తర్వాత అదో సంప్రదాయంగా మారింది. పార్లమెంటు విధివిధానాలకు సంబంధించి చాలావరకూ బ్రిటన్ను ఫాలో అయ్యే మనం.. దీన్ని కూడా యథాతథంగా కాపీ కొట్టాం. -
ఎవరికి ఎంత లాభం?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆదాయపు పన్ను బేసిక్ లిమిట్‌ను పెంచటం వల్ల ఎవరికెంత లాభం? ఉద్యోగులు, స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారు, వృత్తి నిపుణులు వీరందరికీ ఎంత ప్రయోజనం కలుగుతుంది? ఇది తెలుసుకోవటానికి ట్యాక్సేషన్ నిపుణుల్ని ‘సాక్షి’ సంప్రదించింది. వారు సోదాహరణంగా చెప్పిన వివరణలివీ... 1) కృష్ణమోహన్ నెల జీతం రూ.25,000. అంటే ఏడాదికి రూ.3 లక్షలు. గతేడాది బేసిక్ లిమిట్ రెండు లక్షలుగా ఉండటంతో మిగిలిన లక్ష రూపాయల ఆదాయంపై పది శాతం అంటే రూ.10,000 పన్ను చెల్లించాల్సి ఉండేది. కానీ కృష్ణ మోహన్ ఈ భారాన్ని తగ్గించుకోవడానికి సెక్షన్ 80సీ పరిమితిని పూర్తిగా వినియోగించుకున్నాడు. దీంతో అతను ఒక్కపైసా కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు బడ్జెట్లో బేసిక్ లిమిట్‌ను రూ.2.5 లక్షలకు పెంచడంతో పన్నుకు గురయ్యే ఆదాయం రూ.50,000 తగ్గింది. దీంతో అతనికి నేరుగా రూ.5,000 పన్ను భారం తగ్గింది. అలాగే ఈ సారి కేవలం రూ.50,000 పొదుపు చేస్తే చాలు పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. ఆ విధంగా చూస్తే కృష్ణమోహన్ జేబులోకి ఈ ఏడాది ఖర్చు చేసుకోవడానికి అదనంగా రూ.55,000 వచ్చినట్లే. సెక్షన్ 80సీనే పూర్తిగా వినియోగించుకోలేదు కాబట్టి ఈ పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచినా, గృహరుణాలపై మినహాయింపు లభించే వడ్డీ పరిమితిని రూ. 2 లక్షలకు పెంచినా వీటి ప్రయోజనాలను కృష్ణ మోహన్ పొందలేడు. ఈ ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే అతని వార్షిక వేతనం కనీసం రూ.6 లక్షలు దాటి ఉండాలి. అంటే నెలకు రూ.50,000 జీతం దాటిన వారు మాత్రమే జైట్లీ ఫలాలను పూర్తిస్థాయిలో ఆస్వాదించగలరు. బేసిక్ లిమిట్‌ను పెంచడం... సెక్షన్ 80సీ, గృహ రుణ వడ్డీపై మినహాయింపుల పెంపువల్ల ఎవరెవరికి గరిష్ఠంగా ఎంత పన్ను భారం తగ్గుతుందో పై పట్టికలో చూడొచ్చు.. -
మెరుపులు... విరుపులు
పాతబాణీలోనే... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు సరైన నిర్ణయాలు లేవు. ధరల నియంత్రణ ఆశయంతో నిధులను కేటాయించినప్పటికీ సంచలనాత్మక మార్పులేవీ లేవు. సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు కేటాయించటం ద్వారా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనివ్వటం హర్షణీయం. ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించటం ద్వారా దేశాన్ని వ్యవసాయ రంగంలో ముందుకు నడిపేందుకు తగిన అవకాశాన్ని కల్పించారు. సిగరెట్స్, ఖైనీలు, గుట్కాలపై పన్నులను అధిక మొత్తంలో పెంచటం మంచిది. ఆదాయపు పన్ను పరిమితిని 2లక్షలనుంచి 2.50 లక్షలకు పెంచారు. ఈ పరిమితిని 3 లక్షలకు పెంచితే బాగుండేది. పవర్ సెక్టార్‌పై పన్ను మినహాయింపు మరో పదేళ్ల పాటు పెంచటం కుటీర, మధ్య తరహా పరిశ్రమలకు అనుకూలం. గంగానది ప్రక్షాళనకు రూ.2వేల కోట్లు కేటాయించారు. ఈ ప్రభావం ద్రవ్యోల్బణంపై పడే అవకాశం ఉంది. - ఈ.ఆర్ .సోమయాజులు (రాంజీ ), ప్రముఖ చార్డెట్ అకౌంటెంట్ రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ శాతం పెంచడమా...? రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడం వల్ల మనకు భవిష్యత్‌లో నష్టం కలుగుతుంది. ఈ రంగంలో పెట్టుబడుల శాతం 49 వరకు పెంచి కేంద్రం తప్పుచేస్తోంది. - గంగుల మదన్మోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, బొబ్బిలి మన రాష్ట్రానికి ప్రాధాన్యమేదీ? రాష్ట్ర విభజనతో కనీసం రాజధాని కూడా లేకుండా పోయిన మన రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. లోటుబడ్జెట్‌తో ఉన్నామని చెప్పుకుంటున్న రాష్ట్ర పాలకులు ఏమీ చేయలేకపోయారు. - జరజాపు సూరిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాలూరు పట్టణ కన్వీనర్, సాలూరు కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన బడ్జెట్ సంపన్నులకు మేలు చేసేదిగా ఉంది. పేదలకు మేలుకు బదులుగా కీడు కలిగించేదిగా ఉంది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు తగ్గితే అవి వాడేది డబ్బున్నవారు కాబట్టి వారికే అది ఉపయోగపడేలా ఉంది. - మజ్జి వెంకటేష్, పట్టణాధ్యక్షులు వైఎస్సార్ సీపీ, పార్వతీపురం మోడీ సర్కారు పేదలదన్నారు... మోడీ సర్కారు పేదల సర్కారని ఊదరగొట్టారు. మరి పేదలకు ఈ బడ్జెట్ ఒరిగిందేమీ లేదు. పేదలు ఉపయోగించే పలు వస్తువులపై సుంకం పెంచడం, ధరలు పెంచడం చేసింది. ఉపాధి, ఉద్యోగాలు కల్పించి వలసలు ఆపే పరిస్థితి లేదు. - జి.ఉదయభాను, వైఎస్సార్ సీపీ నాయకులు, పార్వతీపురం ఏదీ గిరిజన యూనివర్శిటీ ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ మంజూరు చేస్తామన్నారు. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు కూడా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. కానీ కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు. రాష్ట్ర విభజనకు పచ్చజెండా ఊపి, తనవంతు అభివృద్ధికి సహకరిస్తానని చెప్పిన బీజేపీ బడ్జెట్లో చిన్నచూపే చూపింది. - వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్, సాలూరు రైతుల మాటేంటి...? ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఎలాంటి ప్రయోజనాన్నీ చేకూర్చలేదు. రైతుల రుణమాఫీకి మనకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. చంద్రబాబుకు మోడీ ఎలాంటి సహాయం చేసినట్లు కనిపించలేదు బడ్జెట్లో. రాష్ట్ర నిర్మాణానికి నిధులేవీ..? వేమిరెడ్డి లక్ష్మునాయుడు, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, బొబ్బిలి మోడీ సర్కారు రాష్ట్ర పునర్నిర్మాణానికి నిధులు కేటాయించకుండా బడ్జెట్ ప్రవేశ పట్టింది. చంద్రబాబునాయుడు మోడీకి మంచి మిత్రుడేమో...? నిధులు మోడీ ఎందుకు విదల్చలేదో...? దీని వల్ల మన రాష్ట్రానికి ఇబ్బందే కదా.. ఈ బడ్జెట్ ఊహించినంత బాగోలేదు. - గోర్జ వెంకటమ్మ, ఎంపీపీ, బొబ్బిలి -
తొలి బడ్జెట్లో మెరుపులకు దూరంగానే...
100 స్మార్ట్ నగరాల ఏర్పాటుకు రూ. 7,060 కోట్లు ‘నమామి గంగ’ పేరుతో సమీకృత గంగా సంరక్షణ కార్యక్రమానికి రూ. 2,037 కోట్లు స్థూల రుణాలు రూ. 6 లక్షల కోట్లు రక్షణ, బీమా రంగాల్లో ఎఫ్‌డీఐ పరిమితి 49 శాతానికి పెంపు పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 58,425 కోట్లు నెలవారీ కనీస పెన్షన్ రూ. 1,000 కి పెంపు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ ఏర్పాటుకు రూ. 200 కోట్లు ధరలు పెరిగేవి సిగరెట్లు పాన్ మసాలా గుట్కా నమిలే పొగాకు ఉత్పత్తులు జర్దా శీతల పానీయాలు రేడియో ట్యాక్సీ దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు విరిగిన/హాఫ్ కట్ వజ్రాలు ధరలు తగ్గేవి సాదా (సీఆర్టీ) టీవీలు ఎల్ఈడీ/ఎల్సీడీ టీవీలు (ముఖ్యంగా 19 అంగుళాల కంటే తక్కువ సైజువి) పాదరక్షలు.. సబ్బులు ఇ-బుక్ రీడర్లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు ఆర్వో టెక్నాలజీ వాటర్ ప్యూరిఫయర్లు ఎల్ఈడీ లైట్లు, గృహోపకరణాలు {బాండెడ్ పెట్రోల్ సూక్ష్మ జీవిత బీమా పాలసీలు హెచ్ఐవీ/ఎయిడ్స్ ఔషధాలు, వ్యాధి నిర్ధారణ కిట్లు ఉద్యోగికి ఊరట ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు బేసిక్ లిమిట్ రూ.2 లక్షల నుంచి 2.5 లక్షలకు దీంతో జేబులోకి అదనంగా రూ.5,000 రెండు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట సెక్షన్ 80సీ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు దీంతో అదనంగా రూ. 50,000 పొదుపు గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు రూ. 1.5 లక్షల నుంచి 2 లక్షలకు... రూ. 15 వేల వరకూ ప్రయోజనం పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు మొత్తంగా జనానికి కలిగే లబ్ధి విలువరూ. 22,000 కోట్లు మధ్యతరగతికి ఊరటనిచ్చిన మోడీ సర్కారు తొలి బడ్జెట్ నరేంద్రమోడీని యావద్దేశంతో పాటు సొంత పార్టీ సైతం ‘నమో! నమామి!’ అనేలా చేసింది మధ్య తరగతి మహా భారతమే. ఆ రుణాన్ని మోడీ తొలి బడ్జెట్లోనే తీర్చుకున్నారు. తన తొలి బడ్జెట్లో పెద్దగా వాతలు వేయకుండానే...ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 50 వేల మేరకు పెంచి ఆ వర్గాన్ని ఆనందపరిచారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ. సెక్షన్ 80సీ పరిధిలో పొదుపు చేసే మొత్తాన్ని మరో రూ. 50వేలు పెంచటమే కాక... గృహ రుణాలపై చెల్లించే వడ్డీకీ మినహాయింపు పెంచారు. మొత్తమ్మీద మధ్య తరగతి చేతిలో కాస్తంత డబ్బు మిగిలేలా చేశారు. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరవటమే కాక.. బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతానికి పెంచారు. దేశాభివృద్ధిలో ప్రైవేటును విస్మరించలేమని స్పష్టంగా సంకేతమిచ్చారు. కొత్తగా ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎంలను ఏర్పాటు చేస్తూ తమ అభివృద్ధి ఎజెండాను చెప్పకనే చెప్పారు. ఒక కోణంలో మరీ గొప్పగా కాకున్నా మధ్యస్తంగా ఓకే అనిపించినా... పాతికేళ్ల సంకీర్ణ చరిత్రను బద్దలుగొడుతూ సొంతంగా మెజారిటీ సాధించిన సర్కారు స్థాయిలో మోడీ ప్రభుత్వం ఆలోచించలేదనే చెప్పాలి. కఠిన నిర్ణయాలు తప్పవంటూ నెలరోజులుగా ఊదరగొట్టినా... ద్రవ్యలోటుతో సహా అన్ని అంశాల్లోనూ యూపీఏ బాటలోనే నడిచారు. దాదాపు 28 పథకాలకు తలా రూ. 100 కోట్లు కేటాయిస్తూ పోయిన అరుణ్ జైట్లీ... తొలి బడ్జెట్లో మెరుపులకు దూరంగానే ఉన్నారు. -
ఉద్యోగికి ఊరట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మధ్య తరగతిని కేంద్రం మరచిపోలేదు. ఎన్నికల్లో గెలిచాక నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్లో మధ్య తరగతి జీవులకు ఊరటనిచ్చేలా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను కనీస మినహాయింపు పరిమితిని (బేసిక్ లిమిట్) ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్ల విషయంలోనైతే ఈ మినహాయింపు ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉంది. అది రూ.3 లక్షలకు చేరుతుంది. అలాగే గృహరుణాలకు చెల్లించే వడ్డీపై లభించే పన్ను ప్రయోజనాలను రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచారు. పన్ను శ్లాబుల్లో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదు. ‘‘బేసిక్ లిమిట్ పరిమితిని అదనంగా రూ. 50,000 పెంచుతున్నాం’’ అని జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరి జేబులోనూ కనిష్టంగా రూ.5,000 మిగులుతాయి. సుమారు రెండు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. పెరిగిన సేవింగ్స్ పరిమితి వివిధ పొదుపు పథకాల్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్, వ్యయాలపై లభించే పన్ను మినహాయింపుల పరిమితిని పెంచుతూ జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. సెక్షన్ 80సీ ద్వారా లభించే పన్ను మినహాయింపుల పరిమితిని రూ. లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. జీవిత బీమా ప్రీమియంలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్), ఐదేళ్ల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి పొదుపు పథకాలతో పాటు ట్యూషన్ ఫీజులు గృహరుణాలకు చెల్లించే అసలు (ప్రిన్సిపల్) వంటి వ్యయాలు ఈ సెక్షన్ 80సీ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఈ పరిధిని పెంచడంతో మరో రూ.50,000పై పన్ను ప్రయోజనాలను పొందచ్చు. దీనివల్ల పన్ను శ్లాబులను బట్టి కనిష్టంగా రూ.5,000 నుంచి గరిష్టంగా రూ.15,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. గృహరుణ దారులకు ఊరట గృహ రుణం తీసుకొని ఆ ఇంట్లో నివసించే తాము తీసుకున్న రుణానికి గాను ఈఎంఐలు చెల్లిస్తుంటారు. దీన్లో అసలు కొంత, వడ్డీ కొంత ఉంటుంది. అసలు మొత్తానికి సెక్షన్ 80సీ కింద మినహాయింపు లభిస్తుండగా... వడ్డీకి మాత్రం సెక్షన్ 24 కింద పన్ను మినహాయింపు ఉంటోంది. ఇప్పటిదాకా ఈ మినహాయింపు గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ మాత్రమే వర్తించేది. దీన్ని రూ. 2 లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గరిష్టంగా రూ.15,000 వరకు ప్రయోజనం లభించనుంది. పీపీఎఫ్ పరిమితి పెంపు దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ పథకాలను ప్రోత్సహించే విధంగా ఆర్థిక మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. 15 ఏళ్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకంలో ఇన్వెస్ట్మెంట్ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో పెట్టే పెట్టుబడులు సెక్షన్ 80సీ పరిధిలోకి వస్తాయి. వీటితో పాటు 2011లో నిలిపివేసిన కిసాన్ వికాస్ పత్రాలను తిరిగి ప్రవేశపెట్టారు. డీటీసీని సమీక్షిస్తున్నాం.. డెరైక్ట్ ట్యాక్స్ కోడ్‌ను (డీటీసీ) సమీక్షిస్తున్నామని, ఈ ఏడాది చివరికల్లా దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. చాలా సంక్లిష్టంగా ఉన్న 60 ఏళ్ల నాటి ప్రస్తుత ఇన్కమ్ ట్యాక్స్ స్థానంలో సులభతరంగా ఉండే డీటీసీని ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. డీటీసీ బిల్లును 2010లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా, దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అప్పటి ప్రతిపక్ష నేత యశ్వంత్ సిన్హా నాయకత్వంలో స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. డీటీసీపై వచ్చిన సూచనలు సలహాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని జైట్లీ పేర్కొన్నారు. రూ. 22 వేల కోట్ల ఆదాయ నష్టం ప్రత్యక్ష పన్నుల్లో చేసిన మార్పులతో భారీగా ఆదాయాన్ని నష్టపోతున్నట్లు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆదాయ పన్ను సవరణలతో పాటు ఇతర ప్రత్యక్ష పన్నుల్లో చేసిన మార్పుతో రూ.22,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు చెప్పారు. ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు బేసిక్ లిమిట్ రూ.2 లక్షల నుంచి 2.5 లక్షలకు ఈ నిర్ణయంతో జేబులోకి అదనంగా రూ.5,000 రెండు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట సెక్షన్ 80సీ పరిమితి రూ.1 లక్ష నుంచి 1.5 లక్షలకు గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు రూ.1.5 లక్షల నుంచి 2 లక్షలకు.. ఈ నిర్ణయంతో గరిష్టంగా 15వేల వరకూ ప్రయోజనం -
బడ్జెట్ భగవాన్
దేవుడా! ఈ సారైనా ఇన్‌కమ్‌ట్యాక్స్ బేసిక్ లిమిట్‌ను 3 లక్షలకు పెంచేలా చూడు!! భగవాన్! నేనో సొంతింటివాణ్ణి కావాలి. తక్కువ ధరలో ఇల్లు దొరికేలా చెయ్యి!! స్వామీ! పెరిగిన ధరలతో బతకలేకపోతున్నాం. ధరల్ని కిందికి దించు!! భగవంతుడా! నా పరిశ్రమ బతకాలంటే దిగుమతి సుంకాలు తగ్గేలా చెయ్యి!! బడ్జెట్ ముందు ఇలాంటి మొక్కులు మామూలే. రైతులు, సామాన్యుల నుంచి వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలు దాకా ఎవరి కోరికలువారు వినిపిస్తూ ఉంటారు. దేవుడు అందరికీ వరాలివ్వడు. అలాగే... బడ్జెట్ భగవాన్ అవతారమెత్తే ఆర్థిక మంత్రి కూడా కొందరినేకరుణిస్తుంటారు. మరి ఈసారి అరుణ్‌జైట్లీ వరాలిచ్చిందెవరికి? వాతలేసిందెవరికి? బడ్జెట్ భగవాన్ అందరికన్నా ఎక్కువ శిక్షించింది పొగరాయుళ్లు, గుట్కా బాబుల్నే. కనికరం మాట అటుంచితే... కక్ష గట్టినట్టుగా సిగరెట్‌తో వాతలు పెట్టారు. గుట్కా, పాన్ మసాలా ముట్టుకుంటే వాత పెడతానని వార్నింగిచ్చారు. ఎక్కువ కనికరించింది మధ్య తరగతిని, ఉద్యోగినే. పన్ను మినహాయింపు పెంచి ఉద్యోగి జేబులో నేరుగా రూ.5వేలు డిపాజిట్ చేసేశారు. మరింత పొదుపు చేసుకో! మరింత పన్ను మిగుల్చుకో అంటూ కరుణించేశారు. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారిని తొందరపెట్టారు. రుణం తీసుకుంటే దానిపై చెల్లించే వడ్డీకి ఐటీ మినహాయింపు మరింత పెంచుతున్నా! కాబట్టి త్వరపడండి అని బడ్జెట్ భగవాన్ పచ్చజెండా ఊపారు. పరిశ్రమలు పెడదామనుకుంటున్న ఔత్సాహికులకూ వరమే. పాతిక కోట్లకన్నా ఎక్కువ పెట్టి ఉత్పాదక పరిశ్రమ పెడితే 15 శాతం ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ప్రకటించారు. మూడేళ్లు ఈ వరం కొనసాగుతుందని కూడా చెప్పారు. ట ఇంట్లో టీవీ లేదని అల్లాడిపోయే దిగువ మధ్య తరగతికి చాన్సిచ్చారు జైట్లీ. సీఆర్టీ టీవీలు, 19 అంగుళాలకన్నా చిన్నగా ఉండే ఎల్సీడీ, ఎల్ఈడీల ధరలు కూడా తగ్గిస్తున్నా... ఇప్పుడే కొనుక్కోమని ప్రకటించేశారు. అరె! మీరేం తక్కువ తిన్నారంటూ ధనవంతులకు కూడా వరమిచ్చారు. విలువైన రాళ్ల ధరలు దించారు. అదే పనిగా శీతల పానీయాలు తాగే ఫుడ్ షాపర్లను కూడా జైట్లీ వదిలిపెట్టలేదు. మంచినీళ్లు తాగితే సరే! కూల్డ్రింకులేంటి? అంటూ పన్ను పోటు వేశారు.మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో దాచుకునేవారికి షాకిచ్చారు జైట్లీ. ఈక్విటీలు కాకుండా ఇతరత్రా పథకాల్లో ఇన్వెస్ట్‌చేసే ఫండ్లలో పెట్టుబడి పెడితే...లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును రెట్టింపు చేశారు. పాపం! ఇంట్లోకి స్టీలు సామాన్లు కొనుక్కోవాలనుకునే గృహిణులు ఇక కాస్త ఆలోచించాల్సిందే. పన్నులు పెంచటంతో వీటి ధర కూడా స్వల్పంగా పెరిగే చాన్సుంది. ఇంట్లో కారు లేదు... అద్దె ట్యాక్సీలో వెళ్లాలనుకునేవారి జేబులకు సైతం కత్తెర పెట్టారు బడ్జెట్ భగవంతుడు. రేడియో ట్యాక్సీలో వెళితే సౌండ్ పెంచే సర్వీసు తాను మొదలెడతానంటూ బాదేశారు. ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుని చవగ్గా ఆన్లైన్లో, మొబైల్స్‌లో ప్రకటనలిద్దామనుకునే వారినీ జైట్లీ వదిలిపెట్టలేదు. ‘మీరేమో ప్రకటనలకు కొత్త మార్గాలు వెదుక్కుంటున్నారు. మరి నేను కూడా పన్నులకు కొత్త మార్గాలు వెదకాలిగా’ అనే రీతిలో ఝలక్ ఇచ్చారు. దీన్ని కూడా సర్వీసేనంటూ పన్ను చట్రంలోకి తెచ్చేశారు.!! -
కార్మిక, ఉపాధికి 45% ఎక్కువ
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో కార్మిక, ఉపాధి శాఖకు కేటాయింపులు భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 45 శాతం అధికంగా నిధులు దక్కాయి. ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈసారి రూ. 2,496 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే ఉపాధి కల్పనా(ఎంప్లాయింట్ ఎక్స్ఛేంజ్) కేంద్రాలను కెరీర్ సెంటర్లుగా ఆధునీకరించడానికి మరో రూ. 50 కోట్లను కేటాయించారు. తమ పేర్ల నమోదుకు వచ్చే నిరుద్యోగులకు ఈ కేంద్రాల్లో తగిన కౌన్సెలింగ్, శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.యువతకు ఉపాధి కల్పన, కార్మికులకు నైపుణ్య శిక్షణ, అసంఘటిత రంగంలోకి కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం, పని సంస్కృతిని మెరుగుపరచడంతో పాటు మహిళా కార్మికులకు రక్షణ వంటి అంశాలకు పెద్దపీట వేయనున్నట్లు జైట్లీ తన ప్రసంగంలో పేర్కొన్నారు -
కార్మికుల కనీస పెన్షన్ ఇక నెలకు రూ. వెయ్యి
న్యూఢిల్లీ: వ్యవస్థీకృతరంగ కార్మికుల నెలవారీ పింఛన్ ఇక కనీసం రూ.వెయ్యి కానుంది. ఉద్యోగుల పెన్షన్ పథకం-1995 పరిధిలోని పెన్షన్‌దారుల కనీస పింఛన్‌ను రూ.1000 చేస్తూ నోటిఫై చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్లో ప్రకటించారు. దీంతో ప్రస్తుతం రూ.1000 కన్నా తక్కువ పెన్షన్ పొందుతున్న దాదాపు 28 లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధి చేకూరనుంది. ఇంతకుముందు పెన్షన్ పథకాల అర్హుల వేతన పరిమితి రూ.6,500గా ఉండేది. దీన్ని రూ.15 వేలకు పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. వ్యవస్థీకృత రంగ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నిర్ణయంతో ఖజానాపై అదనంగా పడబోయే భారాన్ని భరించేందుకు బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఈపీఎఫ్‌వో తన చందాదారులందరికీ ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఒకే పీఎఫ్ నంబర్(యూనియన్ అకౌంట్ నంబర్) అందజేస్తుందని తెలిపారు. దీని ద్వారా కార్మికులు/ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు వారి భవిష్య నిధి ఖాతాలను మార్చుకోవడంలో ఇబ్బందులు తప్పనున్నాయి -
సబ్సిడీ సిలిండర్లపై మళ్లీ పరిమితి!
న్యూఢిల్లీ: మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు సబ్సిడీల భారాన్ని క్రమంగా దించుకునే దిశగా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా డీజిల్, వంటగ్యాస్ సబ్సిడీల వల్ల ఏటా పడుతున్న రూ.1.40 లక్షల కోట్ల భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా డీజిల్ ధరపై నియంత్రణ పూర్తిగా ఎత్తివేయడంతోపాటు వంటగ్యాస్ సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను కుదించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘డీజిల్ మార్కెట్ ధరకు, అమ్మకపు ధరకు మధ్యనున్న వ్యత్యాసాన్ని 2014-15 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పూర్తిగా తొలగించాలని యోచిస్తున్నాం. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఉండదు. మార్కెట్ రేట్ల ప్రకారమే వాటి అమ్మకపు ధర ఉంటుంది’’ అని బడ్జెట్లో పేర్కొన్నారు. మొత్తమ్మీద 2013-14లో ఇంధన సబ్సిడీ రూ.1.40 లక్షల కోట్లు ఉండగా, ఇందులో ఒక్క డీజిల్‌పైనే రూ.62,800 కోట్లు వెచ్చిస్తున్నారు. ‘‘చమురు రంగంలో అంతర్జాతీయంగా ఎలాంటి షాకులూ లేకపోతే ఏడాదిలోగా డీజిల్ ధరలపై నియంత్ర ణ తొలగిపోతుంది. సబ్సిడీ పెరిగిపోతున్న నేపథ్యంలో సిలిండర్ల సంఖ్యపై వా స్తవ అంచనాతో పరిమితి విధించాల్సిన అవసరముంది’’ అని పేర్కొన్నారు. -
కొనసాగనున్న ‘ఆధార్’!
న్యూఢిల్లీ: ‘ఆధార్’ ప్రాజెక్టును కొనసాగించే అవకాశమున్నట్లు కొత్త ప్రభుత్వం బడ్జెట్లో సంకేతమిచ్చింది. ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండే ఆధార్ కార్డులను జారీ చేస్తున్న ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్)కు 2014-15 గాను రూ. 2,039 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం గత ఏడాది కేటాయింపులకంటే రూ. 1,550 కోట్లు ఎక్కువ. ఉడాయ్ మరో 10 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ప్రధాని మోడీ ఆధార్ ప్రాజెక్టుకు మద్దతిస్తున్నారని, ప్రభుత్వ సబ్సిడీలను నేరుగా అందించే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నారని సమాచారం. 70 కోట్ల మంది వివరాలు నమోదు చేసిన ఉడాయ్ 65 కోట్ల మందికి ఆధార్ కార్డులు మంజూరు చేయడం తెలిసిందే. జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్) కింద దేశ ప్రజలందరికీ బహుళార్థక జాతీయ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉడాయ్ వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని గత యూపీఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. -
ఒక్కో స్మార్ట్ సిటీకి 70 కోట్లు..!
100 స్మార్ట్ నగరాలకు రూ. 7,060 కోట్లు కేటాయించిన కేంద్రం న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 7,060 కోట్ల వ్యయంతో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ‘‘దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకూ చేరేకొద్దీ.. నగరాలకు గ్రామాల నుంచి వలసలు పెరుగుతాయి. ఇలా వలస వచ్చే వారికి అనువుగా నగరాలు అభివృద్ధి చెందాలి. లేకుంటే ప్రస్తుతం ఉన్న నగరాలు త్వరలోనే నివాసయోగ్యం కాకుండా పోతాయి’’ అని అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్మాణ విస్తీర్ణాన్ని 50 వేల చదరపు మీటర్ల నుంచి 20 వేల చదరపు మీటర్లకు.. ఎఫ్‌డీఐల మూలధన పరిమితిని పది మిలియన్ డాలర్ల నుంచి ఐదు మిలియన్ డాలర్లకు తగ్గించారు. వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు మూడేళ్ల కాల పరిమితిని నిర్దేశించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం నిధులను చౌక గృహ నిర్మాణాల కోసం ఖర్చు చేయనున్నారు. స్మార్ట్ స్మార్ట్‌గా... దేశం మొత్తమ్మీద వంద స్మార్ట్‌సిటీల నిర్మాణానికి సంకల్పం చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం... బడ్జెట్లో ఇందుకోసం రూ. 7,060 కోట్లను కేటాయించింది. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి మౌలిక సదుపాయాలకే మరమ్మతులు చేసుకుంటూ నెట్టుకొస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకోని కారణంగా నగరాలు సమస్యల కాసారాలుగా మారిపోయాయి. ఇప్పటికే ఉన్న మహా నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు అవకాశమున్నప్పటికీ అందుకోసం లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం కొత్త నగరాల సృష్టికి ప్రాధాన్యమిస్తోంది. అంతా బాగానే ఉందిగానీ.. ఇం తకీ ఈ స్మార్ట్‌సిటీల్లో ఉండే సౌకర్యాలేమిటి? వాటితో మనకొచ్చే లాభమేమిటి? నిజంగానే అలాంటి నగరాలు మనకు అవసరమా? అని ప్రశ్నించుకుంటే.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా నగరీకరణ వేగంగా పెరిగిపోతోంది. 2032 నాటికి మన దేశంలోని నగరాల జనాభా మరో 25 - 30 కోట్లు పెరిగిపోతుందని ఒక అంచనా. వచ్చే ఇరవయ్యేళ్ల పాటు నిమిషానికి 30 మంది గ్రామీణులు ఉపాధి, ఇతర కారణాలతో నగరబాట పడతారని అంచనా. ఇప్పటికే దేశంలోని పది ప్రధాన నగరాల్లో ఒక్కో చదరపు కిలోమీటర్ వైశాల్యంలో రెండు వేల మందికిపైగా జనాభా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరగనుంది. ఇక దేశంలో రోజంతా మంచినీరు సరఫరా చేసే నగరం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. నగరాల్లోని వాహనాలు కూడా 2021 నాటికి మూడురెట్లు ఎక్కువ అవుతాయి. వీటికి పరిశ్రమలూ తోడైతే కాలుష్యం కూడా పెరిగిపోవడం ఖాయం. 2015 నాటికి అత్యంత కాలుష్యభరిత దేశాల జాబితాలో భారత్ మూడోస్థానానికి చేరుకోనుందని.. ఇలాంటి పరిస్థితుల్లో నగరాల్లోని మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలంటే రూ. అరవై లక్షల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన నగరాల్లోని ప్రజలు ఎంతో కొంత సౌకర్యంగా జీవితం సాగించాలంటే కనీసం 500 కొత్త నగరాలను నిర్మించాల్సి ఉంటుందని ఐబీఎం లెక్కకట్టింది. అన్నీ స్మార్ట్: స్మార్ట్ సిటీ అన్న ఆలోచనకు ఒక ప్రత్యేక నిర్వచనమంటూ ఏదీ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది. స్థూలంగా చూసినప్పుడు మాత్రం.. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, ప్రజా జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవడం వంటివాటిని స్మార్ట్‌సిటీలకు చోదకాలుగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులన్నింటినీ పరిశీలించిన అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఎనిమిది కీలకాంశాలను గుర్తించింది. పరిపాలన, విద్యుత్, భవనాలు, రవాణా, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఆరోగ్య సేవలు ఆధునిక టెక్నాలజీల సాయంతో తెలివిగా పనిచేసే నగరం స్మార్ట్ సిటీ అవుతుందని తీర్మానించింది. ఇలాంటివి ప్రపంచంలో ఒకట్రెండు నగరాల్లోనే అమలవుతుండగా.. వాటికి ‘ఎకో ఫ్రెండ్లీ సిటీ’లుగా నామకరణం చేసింది ఫోర్బ్స్! - సాక్షి, హైదరాబాద్ ఈ సిటీల్లో ఏముంటాయి? 2025 నాటికి ప్రపంచం మొత్తమ్మీద అంతర్జాతీయ స్థాయి స్మార్ట్‌సిటీలు 26 వరకూ ఉంటాయని ఇప్పటివరకూ ఉన్న అంచనా. వీటిల్లో ఉండగల సౌకర్యాలు, ఇతర టెక్నాలజీలు...ట్రాఫిక్ లైట్లు మొదలుకొని భవంతుల వరకూ అన్నీ కంప్యూటర్ నెట్వర్క్ లేదా వైఫైతో అనుసంధానమై ఉంటాయి.వైర్లెస్ సెన్సర్ల నెట్‌వర్క్‌లు ఎప్పటికప్పుడు వాతావరణ, ఇతర పరిస్థితులను గమనిస్తూ ప్రజలకు, అధికారులకు సమాచారమిస్తాయి.నీటి పైపుల్లో లీకేజీలుంటే గుర్తించే వ్యవస్థలు. చెత్తకుండీ నిండిపోయిన వెంటనే కార్పొరేషన్ అధికారులకు అలారమ్.ట్రాఫిక్ రద్దీ.. వాతావరణ పరిస్థితులను బట్టి ట్రాఫిక్ లైట్ల వెలుతురులో హెచ్చుతగ్గులు ట్రాఫిక్ జామ్‌ల గురించి ఎప్పటికప్పుడు ప్రజ లకు సమాచారం. తద్వారా ప్రయాణ మార్గంలో మార్పులు చేసుకోవడమో లేదా సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలాన్నిగుర్తించి సేదతీరడమో చేయవచ్చు. ఇంధనం, సమయం కలిసొస్తాయి.వాననీటిని ఒడిసిపట్టి నగరాల్లో పచ్చదనం పెంపునకు ఉపయోగించడం.పనిచేసే చోటుకు దగ్గరగానే నివాస సముదాయాలు ఉండేలా చూడటం. మెట్రో రైలు వంటి అధునాతన రవాణా వ్యవస్థ.అవసరాన్ని బట్టి స్మార్ట్‌గా పనిచేసే విద్యుత్ గ్రిడ్. పౌర సేవల కోసం ప్రత్యేకమైన టెక్ ఆధారిత ప్రాజెక్టులు. -
అభినవ చాణక్యుడు.. అరుణ్ జైట్లీ
వ్యూహ రచనలో దిట్ట.. న్యాయ రంగంలో అపార అనుభవం సూటిగా, స్పష్టంగా మాట్లాడే వక్త.. బీజేపీలో ట్రబుల్ షూటర్‌గా పేరు కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోడీ తరువాత అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరు ఆర్థిక, రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ. ఎంతో ప్రాధాన్యమైన రెండు శాఖలు(ఆర్థిక, రక్షణ) ఆయన నిర్వహిస్తున్నారంటే సమర్ధత అర్థం చేసుకోవచ్చు. ఇతర పార్టీల అధికార ప్రతినిధులు సైతం పలు విషయాల్లో జైట్లీని సలహాలు అడుగుతారట. మోడీ క్యాబినెట్లో ఆయన ఓ తురుపు ముక్క. పార్టీ పరంగా ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత ఈయనకే అప్పగిస్తుంటారు. మోడీ మాటల్లో చెప్పాలంటే ఆయన ఓ అరుదైన వజ్రం. ప్రకాశ్‌జవదేకర్ మాటల్లో ఓ అద్భుత వ్యూహకర్త. ఐఎన్ఎస్ విక్రమాదిత్యను మోడీ సందర్శించిన సమయంలో రక్షణ మంత్రిగా ఉన్నా ఆయనతో పాల్గొనకుండా పలు సమస్యల పరిష్కారానికి జమ్మూకాశ్మీర్‌కు వెళ్లారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తడం జైట్లీకి అలవాటు లేదనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. న్యాయవాదిగా... 1980లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ భవనాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. దీన్ని కోర్టులో ఎదుర్కొనడంతో పాటు విజయం సాధించారు జైట్లీ. ఈ ఘటన రామనాథ్ గోయంకా, అరున్ శౌరీ, ఫాలీ నారీమన్, స్వామినాథన్ గురుమూర్తి లాంటి వారితో పరిచయానికి దోహదపడింది. 1977 నుంచి లాయర్‌గా పలు కోర్టుల్లో పనిచేశారు. 1990లో సీనియర్ లాయర్‌గా వ్యవహరిస్తు న్నారు. జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నేతలు శరద్ యాదవ్, ఎల్కే అద్వానీ, మాధవరావు సింధియాలకు పలు వివాదాల్లో లాయర్‌గా పనిచేశారు. బిర్లా గ్రూప్ ఆస్తుల వివాదాల్లో, జాతీయగీతం వివాదంపై రామ్‌గోపాల్ వర్మకు కూడా లాయర్‌గా వ్యవహరించారు. కుటుంబం... 1982లో సంగీతను వివాహం చేసుకున్నారు. రోహన్, సోనాలీ ఇద్దరు సంతానం. నిర్వహించిన పదవులు... 1986-87లో జనసంఘ్ పార్టీ(ఇప్పుటి భారతీయ జనతా పార్టీ)లో చేరారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఘటన వీపీసింగ్ దృష్టిలో పడేలా చేసింది. 1989లో సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అడిషనల్ సోలిసిటర్ జనరల్‌గా జైట్లీని నియమించారు. అప్పటికి ఆ పదవి నిర్వహించిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు ఈయనే. 1991 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. 1999లో తొలిసారి ఎన్డీఏ ప్రభుత్వంలో లా, సమచార, ప్రసార, పెట్టుబడులు, నౌకాయాన, పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశారు. స్వతహాగా లాయర్ కావడంతో లా శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు. లాయర్లకు వచ్చే ఫీజులో 10 శాతం మొత్తాన్ని వారి కింద పనిచేసే క్లర్కులకు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఫండ్‌తో ఎంతో మంది పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కాగలిగారని సీనియర్ లాయర్ ఓమ్ ప్రకాశ్ శర్మ చెప్పారు. 2004లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009లో పార్టీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. 2014 ఎన్నికల్లో అమృత్సర్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. గత మేలో కేంద్ర ఆర్థిక, రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వ్యక్తిగతం... 1952లో జన్మించిన జైట్లీ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. రతన్ప్రభ(అమృత్సర్), మహరాజ్ కిషన్ జైట్లీ(లాహోర్)లు తల్లిదండ్రులు. తండ్రి ప్రముఖ న్యాయవాది. దేశ విభజన తరువాత వీరు అమృత్‌సర్‌లో స్థిరపడ్డారు. అరుణ్ సెయింట్ గ్జావియర్స్ మిషనరీ స్కూల్ చదివారు. డిగ్రీ, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఎస్ఆర్సీసీ కాలేజీలో చదివే రోజుల్లో కరంజవాలా అండ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీనియన్ లాయర్ రయన పరిచయం అయ్యారు. వీరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగేవి. జైట్లీకి అప్పటి నుంచే ఏ అంశం మీదనైనా అనర్ఘళంగా మాట్లాడడం అలవాటైంది. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(ఏబీవీపీ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది జైట్లీ తొలి విజయం. అప్పుడు ఈయన లా చదువుతున్నారు. అంతేకాదు ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడంతో అరెస్టు అయ్యారు కూడా. 19 నెలల జైలులోనే ఉండాల్సి వచ్చింది. -
జైట్లీ వరాలు
సాక్షి, చెన్నై:కేంద్రంలో కొత్తగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో తమిళనాడుకు అనుకూలంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆశాభావం పెరిగింది. తమకు ఉన్న ఎంపీల సంఖ్యా బలం మేరకు కేంద్రంతో సానుకూలంగా మెలిగే పనిలో సీఎం జయలలిత పడటంతో ఇక నిధుల వరద పారుతుందన్న ధీమా పెరిగింది. అయితే, రైల్వే బడ్జెట్లో సదానంద ప్రకటన ఆశల్ని ఆవిరి చేసేంది. తమిళనాడుకు సదానంద హ్యాండివ్వడంతో ఆర్థిక బడ్జెట్‌లోను అదే పరంపర సాగొచ్చన్న నిరుత్సాహం ఆవహించింది. అయితే, పెద్దల్ని మరింత అందలం ఎక్కించడంతో పాటుగా పేద, మధ్య తరగతి వర్గాల మీద, రాష్ట్రాలు దృష్టి పెట్టేవిధంగా బడ్జెట్‌ను గురువారం పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించేశారు. సదానంద బాటలో: తమిళనాడు విషయంలో కొన్ని అంశాల్లో రైల్వే మంత్రి సదానంద బాట లోనే జైట్లీ నడిచారని చెప్పవచ్చు. చెన్నై నుంచి ఇతర రాష్ట్రాల్ని అనుసంధానించే విధంగా కొత్త రైళ్లను సదానంద ప్రకటిస్తే, పారిశ్రామిక కారిడార్ల విషయంలో అదే బాణిని అరుణ్ జైట్లీ అనుకరించారు. చెన్నై టూ విశాఖ, చెన్నై టూ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ప్రస్తావన తెచ్చిన ఆయన, మదురై - తూత్తుకుడి పారిశ్రామిక కారిడార్ ప్రస్తావనను మరిచారు. ఈ కారిడార్ ప్రస్తావనను తన బడ్జెట్లో తెచ్చి ఉంటే, దక్షిణాది జిల్లాల ప్రజల మన్ననలు అందుకుని ఉండేవారు. పారిశ్రామికంగా వెనుకబడి ఉన్న ఈ ప్రాంతాలు అభివృద్ధికి ఊతం ఇచ్చినట్లు ఉండేది. అయితే, దక్షిణ తమిళనాడు విషయంలో సదానందను అనుకరించడంతో అక్కడి ప్రజలనుంచి జైట్లీకి వ్యతిరేకత తప్పదు. విశాఖ - చెన్నై కారిడార్‌ను ఈస్ట్ కోస్ట్ కారిడార్‌గా మార్చి మదురై -తూత్తుకుడి వరకు పొడిగించాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. మెరుగు: చెన్నై వరకు కారిడార్లను తీసుకొచ్చి వదలి పెట్టిన జైట్లీ, మరి కొన్ని ప్రకటనలతో తమిళుల్ని ఆకర్షించారు. చెన్నై మహానగరానికి కూత వేటు దూరంలో, తమిళనాడు - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులో గుమ్మిడి పూండి సమీపంలో ఉన్న పొన్నేరిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దే జాబితాలోకి చేర్చడం విశేషం. అత్యధికంగా జనాభా కలిగి, రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ పొన్నేరిని ఆధునీకరించడం ద్వారా అక్కడి ప్రజల జీవన స్థితి మరింత మెరుగు పడే అవకాశాలు అధికం. మద్రాసు మెడికల్ కళాశాలలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజెన్సీ ఏర్పాటుతో పరిశోధనలను మరింత ప్రోత్సహించేం దుకు నిర్ణయించారు. తద్వారా రాష్ట్రంలో ఆధునిక వైద్య సేవలు, పేదలకు మరింత చేరువయ్యే అవకాశాలు ఉంటారుు. ఆధునిక వైద్య ఆస్పత్రులకు నిధుల ప్రకటించిన దృష్ట్యా, చెన్నైలో ఎయిమ్స్ తరహా ఆస్పత్రి రూపు దిద్దుకోవడం ఖాయం. ఇక, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తరచూ తెర మీదకు రావడం, అధికారుల శ్రమతో సమసి పోవడం జరుగుతూ వస్తున్న తరుణంలో సౌరశక్తి విద్యుత్ ప్లాంట్ ప్రకటన ప్రత్యేక ఆకర్షణగా మారింది. హార్బర్లకు నిధుల కేటాయింపుల ప్రస్తావనతో తూత్తుకుడి హార్బర్ మీద పెట్టుబడులు అధికంగా పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. సాంస్కృతిక పట్టణాలు: కాంచీపురం, వేలాంక న్ని, శ్రీరంగం పట్టణాలు ఆధ్యాత్మికంగా, పర్యాటకంగాను బాసిల్లుతున్నాయి. వీటికి మరింత వన్నె తెచ్చే రీతిలో సాంస్కృతిక (హెరిటేజ్) పట్టణాల జాబితాలో చేర్చడం ప్రశంసనీయం. మెగా క్లస్టర్‌కు తమిళనాడు వేదిక కానుండడం మరో విశేషం. దీని కోసం గిరిజన, వెనుకబడిన వర్గాల తండాల్లో ప్రగతి లక్ష్యంగా కేటాయిం పులు, గ్రామ సడక్ యోజన పథకాలు జాతీయ స్థాయిలో ప్రకటించారు. వీటి ద్వారా తమిళనాడులో లబ్ధి పొందే గ్రామాలు అనేకం ఉన్నాయి. ఇక, కేంద్ర బడ్జెట్ మేరకు రాష్ట్ర అన్నదాతలకు ఆర్థికంగా భరోసా దక్కడం ఖాయం. ప్రశంసలు, విమర్శలు డీఎండీకే అధినేత విజయకాంత్ పేర్కొంటూ, అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్‌ను రూపకల్పన చేశారని ప్రశంసించారు. పీఎంకే నేత రాందాసు పేర్కొంటూ, జాతీయ స్థాయి అభివృద్ధి నినాదంతో ఈ బడ్జెట్ ఉందని కితాబు ఇచ్చారు. సీపీఐ నేత టీ పాండియన్ పేర్కొంటూ, ప్రభుత్వ రంగ సంస్థలకు పెను ప్రమాదం సృష్టించే అంశాలు కొన్ని బడ్జెట్లో ఉన్నాయని విమర్శించారు. యాజమాన్యాలకు పెద్ద పీట వేస్తున్నట్టుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐజేకే నేత పచ్చముత్తు పారివేందన్ పేర్కొంటూ, ఉచితాల్ని పక్కన పెట్టి, దేశ భవిష్యత్తు, గ్రామాల అభ్యున్నతికి పెద్ద పీట వేయడం అభినందనీయమన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొంటూ, నదుల అనుసంధానం మీద దృష్టి పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే, పెద్దగా మార్పులు లేవని, తమిళనాడుకు పెట్టుబడులు, పరిశ్రమలు లేవంటూ విమర్శించారు. -
ఎలక్ట్రానిక్ వస్తువుల ధరల తగ్గుదల - వినియోగదారుల్లో ఆనందం
-
బడ్జెట్‌పై ప్రముఖుల స్పందన
-
బడ్జెట్‌పై ప్రముఖుల స్పందన
న్యూఢిల్లీ: లోక్‌సభలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన దేశ వార్షిక బడ్జెట్ (2014 -2015)పై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు బాగుందంటే, మరికొందరు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. జైట్లీ బడ్జెట్ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని ఆమ్ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ విమర్శించారు. ధరల భారం నుంచి ఉపశమనం కలుగుతుందని ఆశించిన సామాన్యుడి ఆశలను బడ్జెట్ అడియాశలు చేసిందని ఆయన ఆరోపించారు. కీలకమైన రంగాల్లో విదేశీ పెట్టుబడులకు అనుమతించడాన్ని జెడియు తప్పుబట్టింది. జైట్లీ బడ్జెట్ సామాన్యలకు కోతలు, సంపన్నులకు వరాలిచ్చిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. బడ్జెట్లో ఏపీకు కాస్తా న్యాయం జరిగిందని, ఇంకా న్యాయం జరగాల్సి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక చెప్పారు. భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని ఆశ ఉందని ఆమె అన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, సంపదలు వృద్ధిచెందాలని బడ్జెట్ కోరుకుంటోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అన్నిరంగాలు పునరుజ్జీవం చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీలేదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఈ బడ్జెట్‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, గాడితప్పిన భారతదేశ ఆర్ధిక వ్యవస్థను పట్టాలెక్కించే విధంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ హార్టీ కల్చర్ యూనివర్సిటీ రావడం సంతోషంగా ఉందని చెప్పారు. వచ్చే బడ్జెట్ లోపు తెలంగాణకు మరిన్ని నిధులు తెచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. దేశంలో మౌళిక సదుపాయాలు పెంచి ఉద్యోగకల్పన వచ్చే విధంగా, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగిందని ఆయన బడ్జెట్‌ను స్వాగతించారు. బడ్జెట్ తటస్దంగా వుందని ఎఫ్ఏపిసిసిఐ అధ్యక్షుడు శివకుమార్ అన్నారు. దేశం లోని ఆర్దిక స్దితి గతులను బట్టి అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ వుందని ఆయన ఆభిప్రాయ పడ్డారు. ప్రముఖుల అభిప్రాయాలు: ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు - కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జైట్లీ బడ్జెట్ అమోఘం. ఈ బడ్జెట్ వాస్తవిక దృక్పథంతో ఉంది- హోంమంత్రి రాజ్‌నాథ్ బడ్జెట్ దూరదృష్టితో వచ్చింది - రైల్వేమంత్రి సదానంద గౌడ వృద్ధిరేటుకు ఈ బడ్జెట్ చోదక శక్తి - కేంద్రమంత్రి అనంత్‌కుమార్ బడ్జెట్ నిరాశపరిచింది: బీహార్ మాజీ సీఎం నితీష్ పేదలను ఆదుకునేలా బడ్జెట్ లేదు: ఎన్సీపీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. హార్టికల్చర్ యూనివర్సిటీ తప్ప తెలంగాణకు కొత్తగా ఒరిగిందేమీ లేదు. - తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు బడ్జెట్ పేదలకు వ్యతిరేకంగా ఉంది. ప్రజలను చాలా నిరాశపరిచింది. ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న సగటుమనిషికి ఏ అండా దొరకలేదు. - లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే ఇదొక అచేతన బడ్జెట్. దూరదృష్టీ, కార్యాచరణలేని బడ్జెట్. విదేశీ పెట్టుబడుల కోసం, పెట్టుబడుల చేత, పెట్టుబడు కొరకు ఈ బడ్జెట్ వచ్చింది. - బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలు చాలా ఆశలు పెట్టుకుంటే, వారిని బడ్జెట్ వమ్ముచేసింది. సమాజంలో ఏ వర్గం క్షేమాన్ని బడ్జెట్ పట్టించుకోలేదు. - ఆమ్ఆద్మీ పార్టీ -
తెలంగాణకు అన్యాయం జరిగింది: కేసీఆర్
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హార్టికల్చర్ యూనివర్సిటీ తప్ప తెలంగాణకు కొత్తగా ఒరిగిందేమీ లేదని పెదవి విరిచారు. కేంద్రం కేటాయించిన ఉద్యాన విశ్వ విద్యాలయం కొత్తది కాదని.. పునర్విభజన చట్టంలో ఉన్నదే అని గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టానికి కేటాయింపులు ఎక్కువగా ఉంటాయిని ఆశించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా తెలంగాణకు కూడా ఎయిమ్స్‌ను ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్లో తెలంగాణకు నిధుల ప్రస్తావన లేకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు. -
బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్
లోక్‌సభలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన దేశ వార్షిక బడ్జెట్ (2014-2015)లో ఆంధ్రప్రదేశ్‌కు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రంలో కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, రాష్ట్ర విభజనకు ముందు ఇచ్చిన ప్రధాన హామీల ప్రస్తావనేలేదు. విభజన జరిగిన నేపధ్యంలో ఏపి ఎంతో నష్టపోయింది. అనేక అంశాలలో తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్ర రాజధాని నిర్మించుకోవలసి ఉంది. విద్య, వైద్యంతోపాటు మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవలసి ఉంది. అందుకు తగిన రీతిలో బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేవు. జాతీయ వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించినవి: * ఎయిమ్స్ - అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ * ఐఐటి - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ * వ్యవసాయ విశ్వవిద్యాలయం * అనంతపురం జిల్లా హిందూపురంలో జాతీయ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ * శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు * విశాఖపట్నం నుంచి చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు * హార్డ్‌వేర్ తయారీ లక్ష్యంగా కాకినాడ పోర్టు అభివృద్ధి బడ్జెట్లో ప్రస్తావించని ప్రధాన అంశాలు: * ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి ప్రధానమైన కొత్త రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు ప్రస్తావనేలేదు. * రాష్ట్ర విభజన సమయంలో చెప్పినవిధంగా ఐఐఎం(ఇండియన్ ఇస్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)ను ఏపికి ప్రకటించలేదు. * సెంట్రల్ యూనివర్సిటీని ప్రకటించలేదు * గిరిజన విశ్వవిద్యాలయ ప్రస్తావనలేదు * అందరూ ఊహించినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపాదన కూడా బడ్జెట్లో లేదు. * పోలవరం ప్రాజెక్టు ప్రస్తావనలేదు. * విభజన సమయంలో కేంద్రం చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించలేదు. * విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రోరైలు ప్రాజెక్టు ప్రకటించలేదు. -
అంకెలన్నీ ఆచరణ సాధ్యమా?
-
రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడులా?
గుంటూరు: రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యతిరేకించారు. రక్షణ శాఖలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు, దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకు రక్షణ రంగంలో 49 శాతం వరకు ఎఫ్‌డీఐలు అనుమతించాలని గురువారం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ లో కేంద్రం ప్రతిపాదించింది. కాగా, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి రుణమాఫీ ప్రస్తావన రాలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఊసే లేదన్నారు. ఏపీలో రూ.15,900 కోట్ల లోటు బడ్జెట్లో ఉందని, దీని భర్తీ విషయంలో కేంద్రం మౌనంగా ఉందని విమర్శించారు. విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రో రైలు ప్రస్తావన రాలేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. -
కేంద్రబడ్జెట్‌పై చర్చ
-
ధరలు - తగ్గేవేవి ? పెరిగేవేవి ?
-
పాత బడ్జెట్‌నే తిప్పి ప్రవేశ పెట్టారు!
-
వేతన జీవులకు పెద్దగా ఒరిగేదేం లేదు!
-
అంకెలన్నీ ఆచరణ సాధ్యమా?
హైదరాబాద్: నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి ఆర్థిక బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు అన్నారు. బడ్జెట్లో పేర్కొన్న అంకెలన్నీ ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో ప్రస్తావించిన అనేక అంశాలు బడ్జెట్ ప్రసంగంలో లేవని చెప్పారు. ఏపీకి కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేవని పెదవి విరిచారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఏపీ పరిస్థితి దుర్భరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విధాన పరమైన నిర్ణయాల్లో కొన్ని మాత్రమే సానుకూలంగా ఉన్నాయని అన్నారు. ఏపీకి స్పెషల్ కేటగిరి హోదా, రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్ట్ , ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలకు బడ్జెట్ ప్రసంగంలో చోటు దక్కలేదని సోమయాజులు తెలిపారు. -
రైతులకు, పేదలకు పెద్దపీట
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారిగా ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్(2014-2015) రైతులకు, పేదలకు పెద్దపీట వేయడంతోపాటు ఆర్థిక సంస్కరణలు - ఉత్పత్తి రంగాలపై దృష్టిసారించినట్లుగా భావిస్తున్నారు. కచ్చితమైన లక్ష్యాలతో పేదరిక నిర్మూలన పథకాలు రూపొందించినట్లు లోక్‌సభలో దేశ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బడ్జెట్లో రైతులకు, పేదలకు ప్రాధాన్యత ఇచ్చిన అంశాలు: * పట్టణాల్లో రైతుల కోసం మార్కెట్లు * ప్రతి రైతుకు భూపరీక్ష కార్డు, దీని కోసం రూ.100 కోట్లు * రైతుల పంట రుణాలపై వడ్డీ రాయితీ కొనసాగింపు * 100 కోట్ల రూపాయలతో రైతుల కోసం టీవీ * ధరల స్థిరీకరణ నిధికోసం 500 కోట్ల రూపాయలతో నిధి * వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 8 లక్షల కోట్లు * స్వల్పకాలిక పంటరుణాల రీషెడ్యూలింగ్ కోసం 5వేల కోట్ల రూపాయలు * రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహకాలు * 5వేల కోట్లతో శీతలీకరణ గిడ్డంగుల నిర్మాణం * భూములేని రైతులకు నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం * 2019 నాటికి ప్రతి ఇంటికీ టాయిలెట్ * కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా మురికివాడల అభివృద్ధి * బాలికా శిశుసంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు * తక్కువ ఖర్చుతో నిర్మితమయ్యే గృహాలకు 400 కోట్ల రూపాయలు * పట్టణ పునర్ నిర్మాణ పథకాలకు ప్రత్యేక లక్ష్యాలు * లింగ వివక్ష నిర్మూలనకు రూ.100 కోట్లు * జాతీయ తాగునీటి పథకానికి రూ.3600 కోట్లు * గ్రామీణ గృహ నిర్మాణానికి రూ.8 వేల కోట్లు * వికలాంగుల కోసం ప్రత్యేక పథకం * వృద్ధులకు వేయి రూపాయల పెన్షన్, దీని కోసం రూ.2050 కోట్లు * గ్రామీణ విద్యుత్ సదుపాయాల కోసం రూ.500 కోట్లు * 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ స్కీం * ఆడ పిల్లను రక్షించు - ఆడపిల్లను చదివించు పేరుతో కొత్త పథకం * ఎస్సీ, ఎస్టీల సంక్షేమంకోసం రూ.50,047 కోట్లు * గిరిజనుల కోసం రూ.100 కోట్లతో వనబంధు పథకం * సాగునీటి కాల్వల బలోపేతానికి వేయి కోట్లు * బాలికల విద్య, వివాహాల కోసం నిర్దేశించిన పొదుపు పథకాలకు ప్రోత్సాహం * కస్టమ్ డ్యూటీ తగ్గింపుతో చిన్నకలర్ టీవీలు తగ్గనున్నాయి * వ్యవసాయవర్శిటీల కోసం రూ.200 కోట్లు * ఈశాన్యంలో ఆర్గానిగ్ వ్యసాయం కోసం రూ.100 కోట్లు * జార్ఖండ్, అస్సాంలో వ్యవసాయ పరిశోధనా సంస్థలు * 20 వేల గ్రామాల్లో తాగునీటి కోసం రూ.3600 కోట్లు * 2019 కల్లా దేశంలో పూర్తిస్థాయి పారిశుధ్యం * గ్రామీణ అభివృద్ధికి రూ.30వేల కోట్లతో నిధి * వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి పథక పునర్ వ్యవస్థీకరణ * గృహనిర్మాణం పథకంలో మార్పులు * 2022 నాటికి అందరికీ ఇళ్లు -
శెట్టి గారి నుంచి జైట్లీ వరకు!
అది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం. 1947 నవంబర్ 26వ తేదీ. సరిగ్గా ఆ రోజున ఆర్థికమంత్రి ఆర్.కె. షణ్ముఖం శెట్టి స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు.. ఇన్నాళ్ల తర్వాత దేశానికి 84వ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. దేశ విభజన తర్వాత ఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మన దేశానికి సబంధించి ఏడున్నర నెలల కాలానికి గాను 171.15 కోట్ల రూపాయల అంచనాతో మన దేశ బడ్జెట్‌ను షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. అప్పటి ద్రవ్యలోటును రూ. 24.59 కోట్లుగా అంచనా వేశారు. -
బడ్జెట్ బాగుంది: టీడీపీ; బాగోలేదు: కాంగ్రెస్ ఎంపీలు
సాధారణ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని టీడీపీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని కాంగ్రెస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక కేటాయింపులు జరిగాయని టీడీపీ పార్లమంటరీ నేత సుజనాచౌదరి అన్నారు. బడ్జెట్‌ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, మొన్న ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ అసంతృప్తి కలిగించినా, ఈ బడ్జెట్ బాగుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రవేశపెట్టినది ఎనిమిది నెలల బడ్జెటైనా ఇప్పుడున్న నిధులు సరిపోతాయని, ఇది రైతు పక్షపాత బడ్జెట్ అని టీడీపీ ఎంపీ తోట నర్సింహం అన్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు అంశం మాత్రం ఈ బడ్జెట్లో ఎక్కడా లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సుబ్బరామిరెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్ విమర్శించారు. ఆర్భాటంగా ప్రకటనలు చేశారు గానీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాత్రం బడ్జెట్ లేదని వారు వ్యాఖ్యానించారు. -
కేంద్ర బడ్జెట్ హైలైట్స్ Part 2
-
బడ్జెట్ మీద ట్విట్టర్లో ప్రశంసలు.. విమర్శలు
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభించింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలను పెంచడాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన నెటిజన్లు.. సర్దార్ పటేల్ విగ్రహానికి 200 కోట్లు కేటాయించడం లాంటి అంశాల మీద మాత్రం మిశ్రమంగా స్పందించారు. అంధుల కోసం బ్రెయిలీ నోట్లను ముద్రించాలన్ని నిర్ణయాన్ని స్వాగతించారు. ఇంకా ఎలాంటి స్పందనలు వచ్చాయో ఒకసారి చూద్దామా.. నగరాల్లో మహిళల రక్షణకు కేవలం వంద కోట్లేనా? దీనికి ఇంకా ఏదైనా పెద్దస్థాయిలో చేస్తారేమో అనుకున్నాం -స్టెల్లా పాల్ గుజరాత్లో విజయవంతం అయిన అన్ని ప్రధాన పథకాలకు కేంద్ర బడ్జెట్లో స్థానం లభించింది -రవి ఘియర్ దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. రక్షణ రంగానికి 2.29 లక్షల కోట్ల రూపాయల కేటాయింపు -దేవేంద్ర ఫడ్నవిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కిసాన్ టెలివిజన్‌ను ప్రారంభించడం గణనీయమైన మార్పును తెస్తుంది -నీల్ సంఘవి ఉత్పాదక, మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, నీటిపారుదల రంగాలకు మంచి ఊతం ఇచ్చారు. ఇది భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంటుంది -ప్రకాష్ జవదేవకర్ #Budget2014 :expected something big in security for women. Got a vague 1bn INR for 'women's safety in cities'. Doesn't help! #India #gender — Stella Paul (@stellasglobe) July 10, 2014 All major tested and successful schemes of Gujarat Govt finds a place in #unionbudget2014 — Ravi Ghiyar (@ravighiyar) July 10, 2014 No compromise with defence of country . ₹ 2 lac 29 thousand crore for #defence . #Budget2014 — Devendra Fadnavis (@Dev_Fadnavis) July 10, 2014 This could be the game changer for India RT"@ANI_news: 'Kisan Television' will be launched in the current year-Arun Jaitley #Budget2014" — Neil Sanghavi (@NeilSanghavi) July 10, 2014 FM: govt to print currency notes with braille like signs to assist the visually impaired. Excellent move! — Arjun Datta Majumdar (@arjundm) July 10, 2014 #Budget2014 gives thrust on Manufacturing, Infrastructure, Housing & Irrigation. Its a Roadmap for Future. — Prakash Javadekar (@PrakashJavdekar) July 10, 2014 -
కేంద్ర బడ్జెట్ హైలైట్స్ Part 3
-
కేంద్ర బడ్జెట్ హైలైట్స్ Part 1
-
వ్యవసాయ రుణాల లక్ష్యం 8 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : భారతదేశానికి వ్యవసాయ రంగం వెన్నుముక. అయితే క్షీణించిపోతున్న వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ఆర్థిక మంత్రి జైట్లీ కీలక చర్యలు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 8 లక్షల కోట్లుగా ప్రకటించిన విత్తమంత్రి... నాబార్డ్ ద్వారా 5 లక్షల కోట్ల రుణాలు అందిస్తామని వెల్లడించారు. రైతులకు తక్కువ వడ్డీకే స్వల్ప కాలిక రుణాలు అందిస్తామని తెలిపిన ఆయన సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహకాలకు అందిస్తామని వెల్లడించారు. కొత్తగా కిసాన్ టీవీ ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు. -
పవర్ కంపెనీలకు పదేళ్ల టాక్స్ హాలీడే
న్యూఢిల్లీ: ఆర్థిక బడ్జెట్ లో విద్యుత్ రంగానికి సముచిత ప్రాధాన్యం కల్పించారు. విద్యుత్ ఉత్పాదన సంస్థలకు అమల్లోవున్న పదేళ్ల టాక్స్ హాలీడేను మరో ఏడాది పొడిగించారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80-1ఏ కింద విద్యుత్ ఉత్పాదన సంస్థలకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని మార్చి 31, 2015 వరకు పొడిగించారు. మార్చి 31, 2017లోపు ప్రారంభమయ్యే కంపెనీలకు పదేళ్ల టాక్స్ హాలీడే వర్తిస్తుంది. కాగా, ఢిల్లీలో విద్యుత్ సంస్కరణలకు రూ. 200 కోట్లు కేటాయించారు. రాజస్థాన్, తమిళనాడు, జమ్మూ-కాశ్మీర్ లోని సొలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రూ. 500 కోట్లు ప్రకటించారు. అల్ట్రా మోడరన్ సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్టు అరుణ్ జైట్లీ తెలిపారు. దేశంలో అన్ని గృహాలకు నిరంతర విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
భేటీ బచావో-భేటీ పడావోకు 500 కోట్లు
న్యూఢిల్లీ : ఆడశిశువుల రక్షణ, ఆడపిల్లల విద్యపై నరేంద్ర మోడీ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. 'భేటీ బచావో-భేటీ పడావో' పేరుతో కొత్త పథకం ప్రకటించింది. ఆడపిల్లలను రక్షించండి, చదివించండి పథకానికి రూ.500 కోట్లు నిధులు కేటాయించనున్నారు. అలాగే దేశంలో మహిళల భద్రత కోసం రూ.150 కోట్లు నిధులు ఖర్చు చేస్తామని అరుణ్ జైట్లో తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అదేవిధంగా లింగ వివక్షకు వ్యతిరేకంగా పాఠశాలల్లో బోధనలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. *నిర్భయ ఫండ్ నుంచి నిధులు *ఢిల్లీలో మహిళా రక్షణకు ఎమర్జెన్సీ సెంటర్ *నగరాల్లో మహిళల రక్షణకోసం రూ. 150 కోట్లు *బాలికా శిశుసంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు * బాలికల విద్య, వివాహాల కోసం నిర్దేశించిన పొదుపు పథకాలకు ప్రోత్సాహం * మహిళల రుణాల కోసం 'ఆ జీవిక' పథకం -
ప్రకటనలు ఘనం... కేటాయింపులు మితం
న్యూఢిల్లీ : ఎన్నో ఆశలు... మరెన్నో అంచనాలు... భవిష్యత్తుకు భరోసా ఇస్తారనే ఊహాగానాల నడుమ మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటనలు ఘనం... కేటాయింపులు మితం. ద్రవ్యలోటు, ప్రపంచ దేశాల్లో ఆర్థిక అస్థిరతను ప్రస్తావించిన విత్తమంత్రి జైట్లీ... పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని బడ్జెట్ ప్రసంగం ఆరంభంలోనే సంకేతాలిచ్చారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధి రేటు 5 కంటె తక్కువగా ఉందన్న ఆయన 7 నుంచి 8 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యమని ప్రకటించారు. అలాగే ఆర్థిక లోటుకు పగ్గాలు వేయడానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపిన జైట్లీ ప్రస్తుతం 4.1 శాతంగా ఉన్న ఆర్థిక లోటును వచ్చే మూడేళ్లలో 2016-17 ఆర్థిక సంవత్సరం నాటికి 3 శాతానికి తగ్గించడానికి కృషి చేస్తామని తెలిపారు. దాదాపు 17.90 లక్షల కోట్ల రూపాయలతో 2014-15 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదించిన ఆయన పన్ను వసూళ్ల ద్వారా 13న్నర లక్షల కోట్లు సాధించగలమని అంచనా వేశారు. -
క్రీడాకారుల శిక్షణకు రూ.100 కోట్లు
న్యూఢిల్లీ: మణిపూర్ లో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆసియా క్రీడలకు సన్నద్దమయ్యే క్రీడాకారుల శిక్షణకు రూ.100 కోట్లు కేటాయించారు. జమ్మా, కాశ్మీర్ లో అవుట్ డోర్, ఇండోర్ స్టేడియంల ఆధునీకరణకు రూ.200 కోట్లు ప్రకటించారు. -
తెలంగాణకు మాత్రం నిరాశ మిగిల్చారు!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలంగాణకు మాత్రం నిరాశ మిగిల్చారు. కంటితుడుపు చర్యగా కేవలం హార్టికల్చర్ (ఉద్యానవన) యూనివర్సిటీని మాత్రమే ప్రతిపాదించారు. వీటితో పాటు హైదరాబాద్‌లో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటును ప్రకటించారు. ఇక జైట్లీ పద్దులో ఏపీకీ మరో కేటాయింపు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ యూనివవర్సిటీ ఏర్పాటును ప్రతిపాదించిన ఆయన విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, కాకినాడ పోర్టు అభివృద్ధికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే అనంతపురం జిల్లా హిందూపూర్‌లో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీని ప్రతిపాదించారు. అయితే ఐతే రెండు రాష్ట్రాలకు ఐఐఎంలు మాత్రం దక్కలేదు. -
కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్ను విధానమిదే!
-
నాడు వద్దన్నదే... నేడు ముద్దైంది
న్యూఢిల్లీ : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వద్దన్నదే అధికారంలోకి వచ్చాక ముద్దైంది. విదేశీ పెట్టుబడులపై యూపీఏ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో నానా హడావుడి చేసిన వారే నేడు రారమ్మని స్వాగతం పలికారు. విదేశీ పెట్టుబడులతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది అంటూ గగ్గోలు పెట్టిన బీజేపీ నేతలు అధికారంలోకి రాగానే మాట మార్చారు. విదేశీ పెట్టుబడులకు ఎన్డీయే సర్కారు తలుపులు బార్లా తెరిచింది. కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. రక్షణ, బీమా రంగాల్లో ఇప్పటి వరకు ఉన్న ఎఫ్‌డీఐల శాతాన్ని 26 నుంచి 49 వరకు పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. తయారీ రంగంలోనూ ఎఫ్‌డీఐలకు సంకేతాలిచ్చారు. -
ధరలు తగ్గేవి... ధరలు పెరిగేవి...
న్యూఢిల్లీ: దేశీయ ఎలక్రానిక్ ఉత్పత్తులు ధరలు తగ్గనున్నాయి. అయితే దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులపై మోత మోగించారు. 2014-15 ఆర్థిక బడ్జెట్ లో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత, తగ్గింపుతో పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. మరికొన్ని వాటిపై పన్నులు పెంచడంతో వాటి ధరలు ప్రియం కానున్నాయి. పాదరక్షలపై ఎక్సైజ్ సుంకం 12 నుంచి 6 శాతానికి తగ్గించారు. 19 అంగుళాల టీవీలు తయారు చేసే దేశీయ కంపెనీలకు పన్ను రాయితీ ఇచ్చారు. పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం 12 నుంచి 16 శాతానికి పెంచారు. సున్నపురాయి, డోలమైట్ పై రాయితీ ప్రకటించారు. కలర్ టీవీ పిక్చర్ ట్యూబ్‌పై పన్ను తగ్గించారు. ధరలు తగ్గేవి... * 19 అంగుళాల ఎల్ సీడీ, ఎల్ఈడీ టీవీలు, కంప్యూటర్ మానిటర్లు, మొబైల్ ఫోన్లు * సబ్బులు, సౌందర్య సాధనాలు, పాదరక్షలు, బ్రాండెడ్ దుస్తులు * పిక్చర్ ట్యూబ్స్, రెడీ టూ ఈట్ ఫుడ్స్ * నూనెలు, పెట్రో కెమికల్స్, సిమెంట్, ఐరన్ * సోలార్ ప్యానెల్స్, క్రీడా వస్తువులు ధరలు పెరిగేవి... * పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, పాన్ మసాలా * దిగుమతి చేసుకున్న స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులు * దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులు * శీతలపానీయాలు -
పొగరాయుళ్ల జేబుకు చిల్లు
దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిగరెట్ల మీద ప్రస్తుతమున్న 11 శాతం పన్నును ఒకేసారి 72 శాతానికి పెంచారు. పాన్ మసాలా, గుట్కాల మీద కూడా పన్నును 60 శాతానికి పెంచారు. దీంతో సిగరెట్ ప్యాకెట్లు, పాన్ మసాలాలు, గుట్కాలు.. వీటన్నింటి ధరలు అత్యంత భారీగా పెరగబోతున్నాయి. సిగరెట్ల మీద ధరలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంతకుముందే ఆర్థిక మంత్రిని కోరింది. అదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ప్రజారోగ్యాన్ని పరిరక్షించే ఈ చర్యకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు కూల్ డ్రింకులు, సోడాల మీద కూడా పన్నును పెంచారు. దేశంలో కేన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో పాటు.. ప్రధానంగా పొగతాగేవాళ్లకే కేన్సర్, గుండెజబ్బుల లాంటివి వస్తున్నాయని వైద్యవర్గాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. అయినా పట్టణ, గ్రామీణ భారతాల్లో పొగాకు, పొగాకు ఉత్పత్తుల వాడకం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రధానంగా యువత వీటిపై ఎక్కువగా మక్కువ పెంచుకుంటున్నారు. ఆర్థికమంత్రి మోగించిన మోతతో.. పొగాకు, పొగాకు ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇప్పటికైనా వీటి వాడకాన్ని తగ్గిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది. -
2014 -సాధారణ బడ్జెట్ హైలైట్స్
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. * పాదరక్షల ధరలు తగ్గే అవకాశం * 19 ఇంచ్‌లు టీవీలు * పొగాకు ఉత్పత్తులపై 12 నుంచి 16 శాతం ఎక్సైజ్ సుంకం పెంపు * రేడియో టాక్సీలపై సేవా పన్ను * తగ్గనున్న కంప్యూటర్, మొబైల్ ఫోన్ల ధరలు * ఇనుము ధరలు తగ్గే అవకాశం * దేశంలో మరో 60 ఆదాయ పన్ను సేవా కేంద్రాలు * సున్నపురాయి, డోలమైట్ పై రాయితీ * సిగరెట్ల పై కూడా భారీగా వడ్డింపు * గుట్కా, పాన్ మసాలపై 60 శాతం పన్ను పెంపు * వజ్రాల ధర తగ్గింపు * ఎలక్ట్రానిక్ వస్తువులపై ఎడ్యుకేషన్ సెస్ * పెట్రో కెమికల్స్ పై కస్టమ్స్ తగ్గింపు * స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ పెంపు * పవన విద్యుత్ పరికరాలపై పన్ను తగ్గింపు * ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల ధర తగ్గింపు * కలర్ టీవీ పిక్చర్ ట్యూబ్‌పై పన్ను తగ్గింపు * ఫ్యాటీ ఆసిడ్స్, గ్లిజరిన్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు * ఉన్ని దుస్తులపై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు * గృహ రుణాల ఆదాయపన్ను పరిమితి లక్ష నుంచి రెండు లక్షలకు పెంపు * 80 సీసీ పరిమితి రూ.1.5 లక్షలకు పెంపు * సర్ ఛార్జీల్లో మార్పు చేయని జైట్లీ * పొదుపు పథకాల్లో లక్షన్నర వరకూ పన్ను మినహాయింపు * హైదరాబాద్ లో రుణాల వసూళ్లకు ట్రిబ్యునల్ * సీనియర్ సిటిజన్లకు పన్ను పరిమితి రూ.3లక్షలకు పెంపు * వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి రూ. 2 లక్షల నుంచి 2.5లక్షలకు పెంపు * హిందూపూర్ జాతీయ ఎక్సైజ్, కస్టమ్స్ అకాడమీ * సెజ్ ల పునరుద్దరణకు సమగ్ర చర్యలు * ప్రణాళికేతర వ్యయం రూ.12,90819 కోట్లు * తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం * టూరిజం అభివృద్ధికి రూ.500 కోట్లు * మహిళల రక్షణకు నిర్బయ ఫండ్ * అమరవీరుల స్మారకార్థం వార్ మ్యూజియంకు రూ. * మావోయిస్టు ప్రాంతాల్లో బలగాల ఆధునీకరణకు రూ.3వేల కోట్లు * గంగానది ప్రక్షాళనకు రూ.2,037 కోట్లు * రైతులకు మూడు శాతం వడ్డీతో పంట రుణాలు * రక్షణ రంగానికి రెండు లక్షల ఇరవై తొమ్మిదివేల కోట్లు కేటాయింపు * పీపీఎఫ్ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు పెంపు * డిసెంబర్ 31 నాటికి అన్ని మంత్రిత్వ కార్యాలయాలు అనుసంధానం * సకాలంలో ముంబై-బెంగళూరు కారిడార్ పూర్తి * గంగానదిలో జలరవాణా కోసం రూ.4వేల కోట్లు * జమ్మూ,కాశ్మీర్లో హస్తకళలకు రూ.50వేల కోట్లు * లక్నో, అహ్మదాబాద్ లకు మెట్రో ప్రాజెక్టులు * రూ.11,635 కోట్లతో పోర్టుల అభివృద్ధి * బాలికల సాధికారిత కోసం రూ.100 కోట్లు * బెనారస్ సిల్క్ అభివృద్ధికి రూ.50 కోట్లు * తక్కువ వడ్డీకే రైతులకు స్వల్పకాలిక రుణాలు * వ్యవసాయ రుణాల కోసం రూ.8వేల కోట్లు * రక్షణ మంచినీటి పథకం కోసం రూ.6,500 కోట్లు * ద్రవ్యోల్బణం కట్టడికి ధరల స్థిరీకరణ నిధి * పీపీసీ పద్ధతిలో ఎయిర్ పోర్టుల అభివృద్ధి, విస్తరణ * పట్టణాలలో రైతు మార్కెట్లు ఏర్పాటు * పుడ్ సెక్టార్లో పీపీసీలు ప్రోత్సహిస్తాం * పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.28వేల కోట్లు * ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి రూ.50వేల కోట్లు * 16 కొత్త నౌకాశ్రయాల అభివృద్ధి * ఫుడ్ కార్పొరేషన్ ఇండియాలో సంస్కరణలు * చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.200 కోట్లతో కార్ఫస్ ఫండ్ * భూసార పరీక్ష కేంద్రానికి రూ.56 కోట్లు * ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి * కృష్ణపట్నంలో ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు * విశాఖ నుంచి చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు * రైతుల కోసం కిసాన్ టెలివిజన్ ఛానల్ ఏర్పాటుకు రూ.100 కోట్లు * ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా జీఎస్టీ * సూరత్, రాయ్ బరేలీ, తమిళనాడులో టెక్స్ టైల్ పార్కులు * వాతావరణంలో అనూహ్య మార్పులను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లు * మూలధనం పెంపుకు జాతీయ బ్యాంకుల వాటా అమ్మకం * నాబార్డు ద్వారా 5లక్షల మంది భూమిలేని రైతులకు ఆర్థిక సాయం * తక్కువ ధరలకే ఇళ్లు నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు * సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహాలు * ఆంధ్రప్రదేశ్, హర్యానాలో అగ్రికల్చరల్ యూనివర్సిటీలు * హార్డ్‌వేర్ తయారీ లక్ష్యంగా కాకినాడ పోర్టు అభివృద్ధి * 2022 నాటికి అందరికీ ఇళ్లు * గోదాముల కోసం రూ.5కోట్లు * తెలంగాణలో హార్టీకల్చర్ యూనివర్సిటీ * ఆన్ లైన్ విద్యా బోధనకు రూ.100 కోట్లు * గిరిజనుల కోసం వనబంధు పథకానికి రూ.100 కోట్లు * సర్వశిక్ష అభియాస్ కు రూ.28,635 కోట్లు * 2019 నాటికి పరిశుభ్ర భారత్ * సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ.6000 కోట్లు * గ్రామీణ విద్యుద్దీకరణకు రూ.500 కోట్లు * మహిళల భద్రతకు రూ.150 కోట్లు * దశలవారీగా ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు * పబ్లిక్ ట్రాన్స్ పోర్టుల్లో మహిళల భద్రతకు రూ.50 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్ * యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్ ఇండియా కార్యక్రమం * మదర్సాల అభివృద్ధికి రూ.100 కోట్లు * ఈ-క్రాంతి పథకం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్లకు 500 కోట్లు * కొత్తగా 12 వైద్య, దంత కళాశాలలు * కమ్యూనిటీ రేడియో స్టేషన్ల అభివృద్ధికి రూ.100 కోట్లు * నగరాల్లో మెట్రో పనుల కోసం రూ.100కోట్లు * ఈపీఎఫ్ వడ్డీరేట్లు పెంపు కోసం * బాలిక రక్షణ కోసం రూ.100 కోట్లు * వాటర్ షెడ్ ప్రోగ్సామ్స్ కి 2,142 కోట్లు * గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.3,600 కోట్లు * గృహ నిర్మాణ పథకానికి రూ.800 కోట్లు * ఎంపిక చేసిన రంగాల్లో ఎఫ్‌డీఐలకు ప్రోత్సహం * ఆంధ్రప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో కొత్త ఐఐటీలు * గ్రామీణ రహదారుల అభివృద్ది కోసం 14,389 కోట్లు * గుజరాత్ తరహా పట్టణీకరణకు చర్యలు * ఎస్సీ, ఎస్టీ ప్రణాళికకు 50వేల కోట్లు * పెట్టుబడుల కోసం స్నేహపూరిత విధానం * సర్దార్ ఏక్తా విగ్రహానికి 200 కోట్లు * గ్రామ్ జ్యోతి పథకానికి రూ.500 కోట్లు * ఇందిరా వికాస్ పత్రాల ద్వారా పెట్టుబడుల * సుస్థిరమైన పన్నుల వ్యవస్థకు రూపకల్పన * ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కఠిన చర్యలు * గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా * ప్రధానమంత్రి నీటిపారుదల పథకానికి వెయ్యి కోట్లు * వ్యయ-యాజమాన్య కమిషన్ ఏర్పాటు * పర్యాటక రంగం ప్రోత్సాహానికి 9 ఎయిర్ పోర్టుల్లో ఈ-వీసాలకు అనుమతి * త్వరలో కొత్త యూరియా పాలసీ * ఎనిమిది శాతం వృద్ధిరేటు లక్ష్యం * ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా లేవు * 7060 కోట్లతో 100 స్మార్ట్ సిటీలు * ట్యాక్స్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ * తయారీ రంగంలో ఎఫ్‌డీఐలు అభివృద్ధికి ఆశాదీపాలు * బీమా రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది * బీమా రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐలకు కృషి * ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2లక్షల కోట్ల పెట్టుబడులు * నల్లధనం దేశానికి శాపంగా మారింది * మధ్య తరగతి ప్రజల జీవితాలను మార్చటమే లక్ష్యం * గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గిస్తాం * రెండేళ్లుగా ద్రవ్యోల్బణం వెంటాడుతోంది * అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది * ద్రవ్యలోటు 4.1 శాతానికి తీసుకు వస్తాం * అర్హులకే సబ్సీడీలు అందేలా చర్యలు * రక్షణ, బీమా రంగంలో 41 శాతం ఎఫ్‌డీఐ * రెండు,మూడేళ్లలో 7-8 శాతం వృద్ధిరేటు * 2015 ద్రవ్యలోటు 3.6 శాతం * భవిష్యత్ తరాలకు రుణభారాలు మిగల్చరాదు * అవసరానికి మించి ఖర్చులు చేయలేం * పన్ను వసూళ్లు మెరుగు పరచాలి * పన్ను, జీడీపీ రేటును పెంచాలి * అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ * బ్లాక్ మనీని అరికట్టేందుకు ప్రయత్నం * భారత్ మార్పు కోరుకుంటుంది * ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు * రానున్న కాలంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నాం * గత ప్రభుత్వాల నిర్ణయాల్లో లోపాల వల్ల అవకాశాలు కోల్పోయం *దారిద్ర్య రేఖ నుంచి బయటకు రావటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు -
'హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ'
అనంతపురం జిల్లా హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ప్రత్యేక నిధులతో ఇండస్ట్రియల్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. -
ఏపీ, తెలంగాణకు దక్కని ఐఐఎం
న్యూఢిల్లీ: దేశంలో 5 కొత్త ఐఐఎం, 5 కొత్త ఐఐటీ యూనివర్సిటీలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అయితే నూతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఐఐఎం దక్కలేదు. ఏపీలో ఐఐటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏపీ, రాజస్థాన్ లో వ్యవసాయ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. హర్యానా, తెలంగాణలో ఉద్యానవన విశ్వవిద్యాలయాలు నెలకొల్పనున్నట్టు వెల్లడించారు. వీటన్నింటి కోసం రూ.200 కోట్లు కేటాయించారు. రూ.100 కోట్లతో వ్యవసాయ౦ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేస్తామన్నారు. జార్కండ్, అసోం రాష్ట్రాల్లో వ్యవసాయ పరిశోధనా సంస్థలను నెలకొల్పుతామని జైట్లీ హామీయిచ్చారు. మదర్సాల ఆధునీకరణకు రూ. 100 కోట్లు కేటాయించారు. -
ఆదాయపన్ను ఊరట అంతంత మాత్రమే!!
ఆదాయపన్ను విషయంలో భారీ రాయితీలు ఇస్తారని భావించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఉద్యోగవర్గాలను కొంత నిరాశకు గురిచేశారు. వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని ఇప్పుడున్న 2 లక్షల రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయలకు పెంచారు. అదే సీనియర్ సిటిజన్ల విషయంలో అయితే ఈ పరిమితిని 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. అయితే, పొదుపును పెంచే ఉద్దేశంలో భాగంగా.. సెక్షన్ 80 సి కింద ఆదాయ పన్ను మినహాయింపు వచ్చే పొదుపు మొత్తాన్ని లక్ష రూపాయల నుంచి లక్షన్నరకు పెంచుతూ ఆర్థికమంత్రి ప్రకటించారు. ఇది కొంతవరకు ఊరట కల్పించే అంశమే అవుతుంది. అలాగే, గృహరుణాల వడ్డీ మీద పన్ను మినహాయింపును కూడా 1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచారు. ఈ లెక్కన గృహరుణాలు తీసుకుని, 80 సి లో కూడా పొదుపును పాటించే ఉద్యోగులకు సుమారు లక్షన్నర రూపాయల వరకు ఊరట లభించినట్లు అవుతుంది. పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని, ఎడ్యుకేషన్ సెస్ లాంటివన్నీ ఇప్పుడున్న స్థాయిలోనే ఉంటాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు. -
ఆదాయ పన్ను పరిమితి 2.5లక్షలకు పెంపు
-
డీడీలో 'కిసాన్ ఛానెల్' : జైట్లీ
దూరదర్శన్‌లో కిసాన్ ఛానెల్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. అందుకోసం రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు చెప్పారు. అలాగే కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అందుకు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించామని అరుణ్ జైట్లీ తెలపారు. -
పొదుపు పథకాలకు పెద్దపీట
చిన్నమొత్తాల పొదుపు పథకాలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పెద్దపీట వేశారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఇప్పటివరకు ఏడాదికి లక్ష రూపాయలు మాత్రమే గరిష్ఠంగా వేసుకునే అవకాశం ఉండగా, దాన్ని లక్షన్నరకు పెంచారు. అలాగే.. ఆడ పిల్లల చదువు, వాళ్ల పెళ్లికోసం ప్రత్యేకంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు క్రీడాభివృద్ధి మన దేశంలో చాలా ముఖ్యమని ఆర్థిక మంత్రి చెప్పారు. వివిధ క్రీడల్లో శిక్షణ సదుపాయాలకు నిధులు కేటాయించారు. దాంతో పాటు ప్రత్యేకంగా మణిపూర్ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి వంద కోట్లు కేటాయించారు. -
గ్రామాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా!
న్యూఢిల్లీ: నిరంతర విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. దేశంలోని అన్ని గృహాలకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. గ్రామాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకాన్ని ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. క్లీన్ థర్మల్ ఎనర్జీ పథకానికి రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. 'ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన'కు రూ.14,389 కోట్లు ఇవ్వస్తామని జైట్లీ హామీయిచ్చారు. -
తెలంగాణకు హార్టీకల్చర్ యూనివర్సిటీ
-
కాకినాడ కేంద్రంగా హార్డ్ వేర్ పార్క్
న్యూఢిల్లీ: కాకినాడ కేంద్రంగా హార్డ్ వేర్ పార్క్ ఏర్పాటు చేయనున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీయిచ్చారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు ఆయనకు పలు పథకాలు ప్రకటించారు. కృష్ణపట్నం ఓడరేవుకు అదనపు నిధులిస్తామన్నారు. విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో 20 పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌కు ఎయిమ్స్
-
కూర్చుని బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి!!
కేంద్ర బడ్జెట్ గానీ, రైల్వే బడ్జెట్ గానీ, రాష్ట్రాల బడ్జెట్లు గానీ.. ఏవైనా సరే అవి కొనసాగినంత సేపు సదరు మంత్రులు నిలబడే తమ బడ్జెట్ ప్రసంగం మొత్తాన్ని చదువుతుంటారు. అయితే.. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్లుగా, ఈమధ్య కాలంలో తొలిసారిగా ఎన్డీయే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. కూర్చుని తన బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు. తొలుత ఆయన నిలబడే ప్రసంగించారు. అయితే, బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన 45 నిమిషాల తర్వాత.. ఐదు నిమిషాల పాటు విరామం తీసుకున్న ఆర్థిక మంత్రి, ఆ తర్వాత నుంచి తన స్థానంలో కూర్చుని తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. మధ్యమధ్యలో మంచినీళ్లు తాగుతూ.. ఆయన కూర్చుని తన బడ్జెట్ వివరాలను చదివి వినిపించారు. నడుం నొప్పి తీవ్రంగా బాధిస్తుండటం వల్లే ఆయనిలా చేసినట్లు తెలుస్తోంది.