
కేంద్ర బడ్జెట్‌పై భిన్నాభిప్రాయూలు
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లా వాసులు భిన్నాభిప్రా యూలు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకపోయిందని, వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళానికి వ్యవసాయ యూనివర్సిటీ కేటయించాలని, పారిశ్రామిక కారిడార్‌ను విస్తరింపజేయూలని పలువురు పేర్కొనగా, బడ్జెట్ బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా ఉంద ని, ఆయూ రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయించారంటూ మరికొందరు పెదవివిరిచారు.
-సాక్షి, శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి
నరేంద్రమోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రాకు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తామని ప్రకటించారు. బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయం. మధ్యతరగతి కుటుంబీకులకు తీవ్ర అన్యాయం జరిగింది.
- కలమట వెంకటరమణ,
ఎమ్మెల్యే, పాతపట్నం
బీజేపీ పాలిత రాష్ట్రాలకే మొగు
ఎన్‌డీఏ ప్రభుత్వం తన పరిపాలనకు అనుకూలంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బీజేపీ పాలిత ప్రాంతాలకు అధిక నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క అభివృద్ధి పనికి నిధులు కేటాయించలేదు. దీనివల్ల అభివృద్ధి పనులు జరగవు. రాష్ట్రానికి మొండియి చూపడం విచారకరం.
- కంబాల జోగులు, ఎమ్మెల్యే, రాజాం
ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. సీఎం చంద్రబాబునాయు డు సూచనల మేరకే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించా రు. నీటి పారుదలకు రూ. వెయ్యి కోట్లు కేటాయించడం, ధరల స్థిరీకరణకు రూ. 500 కోట్లు కేటాయించడం హర్షణీయం.
-కింజరాపు అచ్చెన్నాయుడు, కార్మికశాఖ మంత్రి
పదలకు నిరాశే..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ పేదలకు ప్రయోజనం చేకూర్చే రీతిలో లేదు. సాధారణ వస్తువులపై ధరాఘాతం పడింది. సబ్సిడీలు అంతంతమాత్రమే. రైతులకు కల్పించే రాయితీలను ఎత్తేసేందుకు నిర్ణరుుంచడం దారుణం. మొత్తం మీద నిరాశాజనకం.
- విశ్వాసరాయి కళావతి,
పాలకొండ ఎమ్మెల్యే
జిల్లాకు ప్రాధాన్యంలేదు
అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరుగాంచిన శ్రీకాకుళంకు పారిశ్రామిక కారిడార్‌లో ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. అభివృద్ధి దిశలో ఉన్న జిల్లాలకే అన్నివనరులు కేటయించారు. బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చారు. బడ్జెట్ వల్ల జిల్లాకు ఒరిగింది ఏమీలేదు.
-కె.రామ్మూర్తి, ఉపాధ్యాయుడు
సామాన్యుడికి అందుబాటులో...
బడ్జెట్ సామాన్యుడికి అందుబాటులో ఉంది. గ్రామీణ, వ్యవసాయ, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులకు ప్రాధాన్యం కల్పిస్తూ పలు కేటాయింపులు చేయడం హర్షణీయం. తాగునీరు, గృహ, విద్యుత్, సదుపాయూల కల్పనకు పెద్దపీట వేశారు.
- పైడి వేణుగోపాలం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి
స్మార్ట్‌సిటీ కింద రాజధానిని అభివృద్ధి చేయాలి
కేంద్రం పలు పట్టణాలను స్మార్ట్‌సిటీలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. ప్రస్తుతం ఏపీలో రాష్ట్ర రాజిధాని కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడి పట్టణాలను స్మార్ట్ సిటీల కింద అభివృద్ధి చేయాలి. ప్రగతికి బాటలు వేయూలి.
- గొర్లె కిరణ్ కుమార్,
వైఎస్సార్ సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయ కర్త
అందుబాటులో లేదు
నిత్యవసర ధరలు స్థిరీకరణపై అరుణ్‌జైట్లీ బడ్జెట్‌లో ఎటుంటి చర్యలు చేపట్టే దిశగా ప్రకటన చేయకపోవడంతో సామాన్యుడికి అందుబాటులో లేకుండ పోయింది.గత ప్రభుత్వ బడ్జెట్‌కి ఈ బడ్జెట్‌కు తేడా మరేముంది.
- పిసిని లక్ష్మణమూర్తి,
హోమియో వైద్య సహాయకుడు, పాతపట్నం
ఏన్‌డీఏ ప్రభుత్వానికి అనుకూలం
కేంద్ర బడ్జెట్ ఎన్‌డీ ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. నిర్మాణాత్మకమైన విధానాన్ని అవలంభిస్తూ అన్ని వర్గాలవారికి ఉపయోగపడేలా ఉంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్ పెరిగి ప్రతి వ్యక్తి యొక్క తలసరి ఆదాయం పెరగడం, తద్వారా ఖర్చుపెరిగి జాతీయ ఉత్పత్తి పెరుగుతుంది. -పొట్టా సత్యనారాయణగుప్త,
సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్, రాజాం
విలాస వస్తువులపై పన్నుపెంచితే బాగుండేది
బడ్జెట్‌లో విలాస వస్తువులపై పన్ను పెంచితే బాగుండేది. అన్ని దుస్తులపై పన్ను తగ్గించడం మంచిదే అరుునా బ్రాండెడ్ దుస్తులకు పన్ను త గ్గించకపోతే సరిపోయేది. ఆదాయపు పన్ను పరిమితి రూ. 4 నుంచి 5 లక్షలకు పెంచితే బాగుండేది.
- అల్లాడ సత్యనారాయణ,
సీనియర్ అడ్వకేట్, ఇచ్ఛాపురం