నిజామాబాద్ అర్బన్: రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు నిరాశ త ప్పలేదు. నిధులు, రైళ్లు ఏ మాత్రం కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో జిల్లాకు రైల్వే బడ్జెట్‌లో మంచి ప్రాధాన్యం లభిస్తుందని అందరూ ఆశించారు. కానీ, ఈ ప్రాంతంపై రైల్వే మంత్రి ఏ మాత్రం కనికరించలేదు. ఉన్నవాటికే నిధులు కేటాయించ లేదు. కొత్త పథకాల ఊసే లేకుండా పోయింది. నానాటికి రై ల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా, అందుకు అనుగుణంగా రైల్వే సేవలు, సౌకర్యలు విస్తరిస్తాయని భావించినవారికి అసంతృప్తే మిగిలింది.
హామీల ప్రస్తావనేదీ!
ఇంతకు ముందు ప్రకటించిన హామీల అమలు విషయాన్ని ఈ బడ్జెట్‌లో ప్రస్తావించే లేదు. జిల్లాలో ఆర్మూర్, ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ వేయడానికి గతంలో కేంద్రం అనుమతి ఇచ్చింది. నిజామాబాద్-పెద్దపల్లి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. బోధన్-బీదర్ రైలు మార్గం గురించి ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డిలను ఆదర్శ రైల్వేస్టేషన్లుగా మారుస్తామని ప్రకటించి ఎనిమిదేళ్లు గడిచింది. వీటిలో ఏ ఒక్కదానిపైనా రైల్వే మంత్రి స్పందించలే దు.
ఒక్క కొత్త రైలు కూడా జిల్లాకు కేటాయించలేదు. మహారాష్ట్రను ఆనుకొని ఉన్న ఈ జిల్లా వ్యా పారపరంగా వేరువేరు ప్రాంతాలకు మంచి ప్రయాణమార్గంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రైల్వే సౌకర్యాలను పెంచవల్సిన అవసరం ఉంది. అయినా, గతంలోలాగే ఈసారి కూడా కొత్త పాసింజర్ రైళ్ల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదు. గత ఏడాది ప్రవేశ పెట్టిన రైల్వేబడ్జెట్ ప్రస్తుత బడ్జెట్ కంటే మేలు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ 2014 వరకు పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించినా, ఈ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి.
పెండింగ్ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో నిధులు భారీగా వచ్చే అవకాశం ఉందని జిల్లా ప్రజలు ఎదురుచూశారు. కాని వీటికి కేటాయింపు జరగలేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వేప్రాజెక్టులను కేంద్రం పట్టించుకోకపోవడం నిరుత్సాహపరిచింది. ఆధునికీకరణ పనులు, నిధుల కేటా యింపు , రైళ్ల పొడగింపు, కొత్త రైళ్ల ఏర్పాటులో జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చే అవసరం ఎం తైన ఉంది. కాని వీటిని రైల్వే బడ్జెట్‌లో పూర్తిగా విస్మరించారు.
ఢిల్లీలో మకాం వేసినా
నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కె.కవిత, బీబీ పాటిల్ రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు సౌకర్యాలు, నిధులు కేటాయించాలని ఢిల్లీలో రైల్వే అధికారులను, మం త్రులను కలిసి విన్నవించారు. దాదాపు 15 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి శ్రమించారు. అయినా, రై ల్వేబడ్జెట్‌లో మాత్రం ఏమాత్రం ప్రాధాన్యం లభించలేదు. వీరి విన్నపాలను కేంద్రం పట్టించుకోలేదు. కనీసం నిధులు, రైళ్లను కూడా కేటాయించలేదు. ఉత్త ర తెలంగాణ జిల్లాలన్నింటికీ నిరాశే మిగిలింది.
రైలు రాలే!
Published Wed, Jul 9 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
Advertisement