జైట్లీసారూ! ఇదేం తీరు..!
శ్రీకాకుళం సిటీ: శ్రీకాకుళం జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి పదేళ్లకోసారి జరిపే లెక్కల్లో లక్షల్లో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతోంది. జనాభా నియంత్రణపై ప్రభుత్వం అలక్ష్యం చేయడం, ప్రజల్లో అవగాహన కొరవడడమే జనాభా పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల తగ్గుతున్నా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం జీవనమే కష్టమైన రోజుల్లో కూడా సంచార జాతుల్లో అవగాహన లేమి జనాభా పెరగుదలకు కారణమవుతోంది.
జనాభాలో జిల్లా పరిస్థితి...
జిల్లాలో జనాభా రోజురోజుకూ పెరుగుతోందనడానికి జనాభా లెక్కలే ప్రామాణికం. 1991 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 23,21,126 మంది కాగా, 2001లో 25,37,593 మంది, 2011 జనాభా లెక్కల ప్రకారం 27,03,114 గా నమోదైంది. వృద్ధిరేటు దాదాపు 19 శాతం వరకు ఉంది. ఇందులో పురుషులు 13,41,738 కాగా, మహిళలు 13,61,376 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం కుటుంబాలు పట్టణ ప్రాంత ంలో 1,08,948, రూరల్‌లో 5,72,382, మొత్తంగా 6,81,330 కుటుంబాలున్నాయి.
దేశాలనే అధిగమించేశాం...
ప్రస్తుతం జిల్లా జనాభా ప్రపంచంలోని ఖతర్, బ్రూనే, నమీబియూ వంటి సుమారు 50 చిన్నదేశాలకంటే అధికం. ఇది ఆశ్చర్యకరంగా ఉన్నా నమ్మాల్సిన నిజం. దక్షిణ తూర్పు ఆసియాలోని బ్రూనై దేశంలో 3,93,162 మంది జనాభా ఉండగా, ఆఫ్రికా ఖండంలో నమీబియాలో 23,24,004 మంది, సౌదీ అరేబియాకు దగ్గరలో ఉండే ఖతర్ దేశంలో 18,70,041 మంది జనాభా ఉన్నారు.
నియంత్రణలో అలక్ష్యం
వాస్తవంగా కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలను ప్రోత్సహిస్తే జనాభా తగ్గుతుంది. అరుుతే, దీనిపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం జనాభా పెరుగుదలకు కారణమవుతోంది. 2001 నుంచి ఏటా సగటున 19,000 కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేయూలని లక్ష్యం కాగా ఏనాడూ లక్ష్యాలకు చేరుకోలేదు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ నలుగురు నుంచి ఐదుగురు పిల్లలకు జన్మనిస్తున్నా పట్టించుకునేవారే లేరు. వారిలో చైతన్యం నింపేవారే కరువయ్యూరు. జిల్లా వెనుకబాటు తనం, సంచార జాతులు అధికంగా ఉండం, నిరక్ష్యరాస్యత తదితర అంశాలు జనాభాను ప్రోత్సహిస్తున్నారుు.
ఇలా చేయాలి..
శతశాతం అక్షరాస్యత జిల్లాగా మార్చాలి.
జనాభా పెరుగుదల వల్ల కలిగే అనర్ధాలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వివరించాలి. వారిని అవగాహన కల్పిస్తూ ప్రచార బోర్డులు ఏర్పాటుచేయాలి. ఒకరు లేదా ఇద్దరు పిల్లల వల్ల కలిగే లాభాలపై ప్రచారం చేయూలి. చైతన్యవంతం చేయూలి. చిన్న కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలి. సంచార జాతుల్లో అవగాహన కల్పించాలి. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలకు జన్మనిచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలను ప్రోత్సహించాలి. ఒక బిడ్డతో శస్త్రచికిత్స చేసుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు పెంచాలి. విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది జనాభా నియంత్రణ కోరేవారి అభిప్రాయం.