అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన లోక్‌పాల్ వ్యవస్థకు కేంద్ర బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులే దక్కాయి. లోక్‌పాల్‌కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 2 కోట్లు మాత్రమే కేటాయించింది
న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన లోక్‌పాల్ వ్యవస్థకు కేంద్ర బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులే దక్కాయి. లోక్‌పాల్‌కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 2 కోట్లు మాత్రమే కేటాయించింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ ఈ మొత్తం లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటుకు సరిపోతుందని కేంద్రం పేర్కొంది. మరోవైపు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కి కేటాయింపుల్లోనూ స్వల్పంగా కోత విధించింది.
సీవీసీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 21.29 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ. 94 లక్షలు కోత పెట్టి రూ. 20.35 కోట్లు కేటాయించింది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం 2013కు గత ఏడాది డిసెంబర్‌లో పార్లమెంట్ ఆమోదం లభించగా.. ఈ ఏడాది జనవరి 1న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం లోక్‌పాల్ చైర్‌పర్సన్, ఇతర సభ్యుల ఎన్నికల ప్రక్రియకు కేంద్రం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.