న్యూఢిల్లీ: ఈశాన్య భారత ఒంటరితనానికి ముగింపు పలికేందుకు కేంద్రం సాధారణ బడ్జెట్‌లో వరాల వర్షం కురిపించింది. ఆ ప్రాంత అభివృద్ధి కోసం భారీగా రూ. 53,706 కోట్లు కేటాయించింది. ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేయడానికి రోడ్లు, రైలు మార్గాల విస్తరణ, సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధి తదితరాలను అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు.
ఈశాన్య భారతం వెనుకబాటుతనంతో కునారిల్లుతోందని, సరైన అనుసంధానం లేక పోవడంతో ఏకాకితనం భావన నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతానికి 10 శాతం ప్రణాళికా నిధుల కేటాయింపును అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఇదివరకటి ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరి చేసిందని గుర్తు చేశారు. తాజా బడ్జెట్ నుంచి ఈశాన్య ప్రాంతానికి కేటాయింపులపై ప్రత్యేక పత్రాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. బడ్జెట్‌లో ఈశాన్య రాష్ట్రాల కేటాయింపులు.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.2,332.78 కోట్లు. బ జాతీయ రహదారుల సంస్థ, రాష్ర్ట్ర రహదారుల వ్యవస్థలో ప్రతిపాదించిన రూ. 38 వేల కోట్ల పెట్టుబడుల్లో రూ.3 వేల కోట్లు ఈశాన్యానికి. బ రైలు మార్గాల విస్తరణ కోసం మధ్యంతర బడ్జెట్ కేటాయింపులతోపాటు రూ. 1,000 కోట్లు. బ మణిపూర్‌లో క్రీడా విశ్వవిద్యాలయం. బ ‘అరుణ్ ప్రభ’ పేరుతో టీవీ చానల్.బ సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధికి రూ.100 కోట్లు.
ఈశాన్య రాష్ట్రాలకు 53 వేల కోట్లు..
Published Fri, Jul 11 2014 3:30 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement