
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారిగా ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్(2014-2015) రైతులకు, పేదలకు పెద్దపీట వేయడంతోపాటు ఆర్థిక సంస్కరణలు - ఉత్పత్తి రంగాలపై దృష్టిసారించినట్లుగా భావిస్తున్నారు. కచ్చితమైన లక్ష్యాలతో పేదరిక నిర్మూలన పథకాలు రూపొందించినట్లు లోక్సభలో దేశ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
బడ్జెట్లో రైతులకు, పేదలకు ప్రాధాన్యత ఇచ్చిన అంశాలు:
* పట్టణాల్లో రైతుల కోసం మార్కెట్లు
* ప్రతి రైతుకు భూపరీక్ష కార్డు, దీని కోసం రూ.100 కోట్లు
* రైతుల పంట రుణాలపై వడ్డీ రాయితీ కొనసాగింపు
* 100 కోట్ల రూపాయలతో రైతుల కోసం టీవీ
* ధరల స్థిరీకరణ నిధికోసం 500 కోట్ల రూపాయలతో నిధి
* వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 8 లక్షల కోట్లు
* స్వల్పకాలిక పంటరుణాల రీషెడ్యూలింగ్ కోసం 5వేల కోట్ల రూపాయలు
* రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహకాలు
* 5వేల కోట్లతో శీతలీకరణ గిడ్డంగుల నిర్మాణం
* భూములేని రైతులకు నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం
* 2019 నాటికి ప్రతి ఇంటికీ టాయిలెట్
* కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా మురికివాడల అభివృద్ధి
* బాలికా శిశుసంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు
* తక్కువ ఖర్చుతో నిర్మితమయ్యే గృహాలకు 400 కోట్ల రూపాయలు
* పట్టణ పునర్ నిర్మాణ పథకాలకు ప్రత్యేక లక్ష్యాలు
* లింగ వివక్ష నిర్మూలనకు రూ.100 కోట్లు
* జాతీయ తాగునీటి పథకానికి రూ.3600 కోట్లు
* గ్రామీణ గృహ నిర్మాణానికి రూ.8 వేల కోట్లు
* వికలాంగుల కోసం ప్రత్యేక పథకం
* వృద్ధులకు వేయి రూపాయల పెన్షన్, దీని కోసం రూ.2050 కోట్లు
* గ్రామీణ విద్యుత్ సదుపాయాల కోసం రూ.500 కోట్లు
* 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ స్కీం
* ఆడ పిల్లను రక్షించు - ఆడపిల్లను చదివించు పేరుతో కొత్త పథకం
* ఎస్సీ, ఎస్టీల సంక్షేమంకోసం రూ.50,047 కోట్లు
* గిరిజనుల కోసం రూ.100 కోట్లతో వనబంధు పథకం
* సాగునీటి కాల్వల బలోపేతానికి వేయి కోట్లు
* బాలికల విద్య, వివాహాల కోసం నిర్దేశించిన పొదుపు పథకాలకు ప్రోత్సాహం
* కస్టమ్ డ్యూటీ తగ్గింపుతో చిన్నకలర్ టీవీలు తగ్గనున్నాయి
* వ్యవసాయవర్శిటీల కోసం రూ.200 కోట్లు
* ఈశాన్యంలో ఆర్గానిగ్ వ్యసాయం కోసం రూ.100 కోట్లు
* జార్ఖండ్, అస్సాంలో వ్యవసాయ పరిశోధనా సంస్థలు
* 20 వేల గ్రామాల్లో తాగునీటి కోసం రూ.3600 కోట్లు
* 2019 కల్లా దేశంలో పూర్తిస్థాయి పారిశుధ్యం
* గ్రామీణ అభివృద్ధికి రూ.30వేల కోట్లతో నిధి
* వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి పథక పునర్ వ్యవస్థీకరణ
* గృహనిర్మాణం పథకంలో మార్పులు
* 2022 నాటికి అందరికీ ఇళ్లు