![నాడు వద్దన్నదే... నేడు ముద్దైంది - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/61404983113_625x300.jpg.webp?itok=Z3uo84wl)
నాడు వద్దన్నదే... నేడు ముద్దైంది
న్యూఢిల్లీ : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వద్దన్నదే అధికారంలోకి వచ్చాక ముద్దైంది. విదేశీ పెట్టుబడులపై యూపీఏ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో నానా హడావుడి చేసిన వారే నేడు రారమ్మని స్వాగతం పలికారు. విదేశీ పెట్టుబడులతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది అంటూ గగ్గోలు పెట్టిన బీజేపీ నేతలు అధికారంలోకి రాగానే మాట మార్చారు. విదేశీ పెట్టుబడులకు ఎన్డీయే సర్కారు తలుపులు బార్లా తెరిచింది.
కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. రక్షణ, బీమా రంగాల్లో ఇప్పటి వరకు ఉన్న ఎఫ్‌డీఐల శాతాన్ని 26 నుంచి 49 వరకు పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. తయారీ రంగంలోనూ ఎఫ్‌డీఐలకు సంకేతాలిచ్చారు.