వ్యవసాయ రుణాల లక్ష్యం 8 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : భారతదేశానికి వ్యవసాయ రంగం వెన్నుముక. అయితే క్షీణించిపోతున్న వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ఆర్థిక మంత్రి జైట్లీ కీలక చర్యలు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 8 లక్షల కోట్లుగా ప్రకటించిన విత్తమంత్రి... నాబార్డ్ ద్వారా 5 లక్షల కోట్ల రుణాలు అందిస్తామని వెల్లడించారు. రైతులకు తక్కువ వడ్డీకే స్వల్ప కాలిక రుణాలు అందిస్తామని తెలిపిన ఆయన సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహకాలకు అందిస్తామని వెల్లడించారు. కొత్తగా కిసాన్ టీవీ ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు.