తెలంగాణకు మాత్రం నిరాశ మిగిల్చారు!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలంగాణకు మాత్రం నిరాశ మిగిల్చారు. కంటితుడుపు చర్యగా కేవలం హార్టికల్చర్ (ఉద్యానవన) యూనివర్సిటీని మాత్రమే ప్రతిపాదించారు. వీటితో పాటు హైదరాబాద్‌లో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటును ప్రకటించారు.
ఇక జైట్లీ పద్దులో ఏపీకీ మరో కేటాయింపు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ యూనివవర్సిటీ ఏర్పాటును ప్రతిపాదించిన ఆయన విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, కాకినాడ పోర్టు అభివృద్ధికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే అనంతపురం జిల్లా హిందూపూర్‌లో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీని ప్రతిపాదించారు. అయితే ఐతే రెండు రాష్ట్రాలకు ఐఐఎంలు మాత్రం దక్కలేదు.