తెలంగాణకు రిక్తహస్తమే..! | Injustice for Telangana state in Arun Jaitley's Budget | Sakshi
Sakshi News home page

తెలంగాణకు రిక్తహస్తమే..!

Published Fri, Jul 11 2014 2:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

తెలంగాణకు రిక్తహస్తమే..! - Sakshi

తెలంగాణకు రిక్తహస్తమే..!

  • ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ హోదాపై ప్రకటన కరువు
  •  హామీలు గాలి కొదిలేశారు...!
  •  విభజన చట్టంలో తెలంగాణకు పలు అంశాల్లో కేంద్రం హామీలు ఇచ్చింది. వాటిలో కొన్నింటినే బడ్జెట్‌లో ప్రస్తావించారు. వివరాలు ఇవీ...
  •   గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం: బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన లేదు.
  •   ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటన. 
  •   ఖమ్మం జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. అయితే, ఇప్పటికే సెయిల్ అధికారులు ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. బయ్యారంలో ఏర్పాటుకు అవకాశం ఉందనే నిర్ణయానికి వచ్చారు. 
  •   ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు: బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోయినప్పటికీ... రెండు రోజుల క్రితమే సీఎం కేసీఆర్‌తో ఎన్‌టీపీసీ సీఎండీ సమావేశమయ్యారు. రామగుండం వద్ద భూమి ఇస్తామని, సింగరేణి నుంచి బొగ్గు కూడా ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
  •   తెలంగాణలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ అభివృద్ధి గురించి ప్రస్తావించలేదు.
  •   రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన రైల్వే బడ్జెట్‌లో రాలేదు. 
  •   హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ర్యాపిడ్ రోడ్ కనెక్టివిటీ: హైదరాబాద్ నుంచి వరంగల్‌కు నాలుగు లైన్ల రహదారి మినహా పెద్దగా ఏమీ ప్రకటించలేదు.
  •  
     సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ తెలంగాణకు రిక్తహస్తాన్నే చూపింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల్లో కేవలం ఒక్క ఉద్యానవన యూనివర్సిటీ మినహా ఏ ఇతర హామీని కేంద్రం తన బడ్జెట్‌లో ప్రకటించలేదు. గిరిజన యూనివర్సిటీపై నామమాత్రపు  ప్రస్తావన కూడా లేదు. తెలంగాణ ప్రజలు ఎంతో ఆశపెట్టుకున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఎలాంటి హామీ దక్కలేదు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అనే ప్రకటన మినహా పెద్దగా ఒరిగిందేమీ లేదు. డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను హైదరాబాద్‌కు మంజూరు చేసినా దానివల్ల ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదు.
     
     ప్రాణహిత-చేవెళ్లకు ఏదీ జాతీయ హోదా!
     ప్రాణహిత- చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు కూడా అధిష్టానాన్ని కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించారని కూడా వారు ప్రకటించారు. అయితే, బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా దీని ప్రస్తావన కనిపించలేదు. అంతేకాకుండా రాష్ట్రానికో ఎయిమ్స్ అని హామీ ఇచ్చినా కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ లేదు. 
     
    హామీలు గాలి కొదిలేశారు...!
    •  విభజన చట్టంలో తెలంగాణకు పలు అంశాల్లో కేంద్రం హామీలు ఇచ్చింది. వాటిలో కొన్నింటినే బడ్జెట్‌లో ప్రస్తావించారు. వివరాలు ఇవీ...
    •   గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం: బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన లేదు.
    •   ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటన. 
    •   ఖమ్మం జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. అయితే, ఇప్పటికే సెయిల్ అధికారులు ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. బయ్యారంలో ఏర్పాటుకు అవకాశం ఉందనే నిర్ణయానికి వచ్చారు. 
    •   ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు: బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోయినప్పటికీ... రెండు రోజుల క్రితమే సీఎం కేసీఆర్‌తో ఎన్‌టీపీసీ సీఎండీ సమావేశమయ్యారు. రామగుండం వద్ద భూమి ఇస్తామని, సింగరేణి నుంచి బొగ్గు కూడా ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
    •   తెలంగాణలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ అభివృద్ధి గురించి ప్రస్తావించలేదు.
    •   రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన రైల్వే బడ్జెట్‌లో రాలేదు. 
    •   హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ర్యాపిడ్ రోడ్ కనెక్టివిటీ: హైదరాబాద్ నుంచి వరంగల్‌కు నాలుగు లైన్ల రహదారి మినహా పెద్దగా ఏమీ ప్రకటించలేదు.
     
     నిరాశ కలిగించింది: సీఎం కేసీఆర్ 
     బడ్జెట్‌లో రాష్ట్రానికి హార్టికల్చర్ యూనివర్సిటీ మినహా మరేది కొత్తగా కేటాయించకపోవడం సరికాదు. అది కూడా రాష్ట్ర పునర్విభజన బిల్లులో పొందుపరిచిందే. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎంతో కోరాం. అయినా న్యాయం చేయలేదు. పునర్విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. మొత్తంగా నిరాశ కలిగించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement