injustice
-
పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇచ్చే సంప్రదాయానికి బాబు తిలోదకాలు
-
Maharashtra Politics: సుప్రీంకు వెళతాం: శరద్ పవార్
బారామతి(మహారాష్ట్ర): నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అన్యాయపూరితమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ శనివారం పేర్కొన్నారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలోని చీలికవర్గమే అసలైన ఎన్సీపీ అని, పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ ఈసీతోపాటు స్పీకర్ నర్వేకర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
‘ప్రత్యేక దేశం’ వ్యాఖ్యలపై పార్లమెంట్లో రగడ
న్యూఢిల్లీ: బడ్జెట్లో నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, వాటన్నింటినీ కలిపి ప్రత్యేక దేశం చేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో శుక్రవారం తీవ్ర రగడ చోటుచేసుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. దేశాన్ని ముక్కలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రకటనను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని, ఇది భారత రాజ్యాంగంపై దాడేనని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామని ఎన్నికల్లో గెలవగానే ఎంపీలతో ప్రమాణం చేయించాలని అభిప్రాయపడ్డారు. దేశ విభజనను కాంగ్రెస్ కోరుతోందా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు కాని వ్యక్తి వ్యాఖ్యలపై సభలో చర్చ ఎందుకని కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. విభజన ఆలోచనను తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని అన్నారు. డీకే అనుచితంగా మాట్లాడినట్లు తేలితే సభా హక్కుల కమిటీ చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు చాలా ఆదరణ ఉందంటూ ఎన్నికలను శాశ్వతంగా రద్దు చేయడం ఖాయమంటూ దుయ్యబట్టారు. లోక్‌సభ సభ్యుల వ్యాఖ్యలపై రాజ్యసభలో చర్చించవచ్చని గతంలోనే ఆదేశాలిచ్చానని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేశారు. -
ఆ పోలీసుల పేర్లను రాసి పెట్టండి..అధికారంలోకి రాగానే సంగతి చూద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తోందని, బీజేపీ నేతలను అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. గులాబీ కండువాలు కప్పుకున్న కార్యకర్తల మాదిరిగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా తమపై కక్ష సాధింపునకు పాల్పడుతున్న పోలీసు అధికారుల పేర్లను బీజేపీ కార్యకర్తలు రాసిపెట్టుకోవాలని కోరారు. ‘వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. అతి చేసిన పోలీసుల రుణం ఏ మాత్రం ఉంచుకోకుండా వారి సంగతి చూద్దాం..వారి లెక్కలు సరిచేద్దాం’ అని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్‌కు ఎందుకింత భయం? అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారా? మీ బెదిరింపులకు బీజేపీ భయపడదు. గత ఎన్నికల్లోనూ పోలీసులతోనే గెలిచామని, రాబోయే ఎన్నికల్లో కూడా గెలుస్తామనే అహంకారంతో ఉన్న మిమ్మల్ని భరించే ప్రసక్తే లేదు.. ఖబడ్దార్ కేసీఆర్.. నిన్ను ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు రోజులు లెక్క పెడుతున్నారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. వెంకటరమణారెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు? కామారెడ్డిలో జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డిని అరెస్ట్ చేసి రోజంతా ఎక్కడెక్కడో తిప్పారని, అసలు ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులను డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గజ్వేల్ అభివృద్ధి మాదిరే కామారెడ్డి కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పడంతో గజ్వేల్ అభివృద్ధిని చూసివద్దామని అనుకున్న వెంకటరమణారెడ్డిని అక్కడకు వెళ్లకుండా అక్రమంగా అడ్డుకున్నారని విమర్శించారు. ‘సీఎం కేసీఆర్ గజ్వేల్ ను నిజంగా అబివృద్ధి చేస్తే అయనను ఎందుకు అరెస్ట్ చేశారు? అక్కడ అభివృద్ధి జరగలేదనే విషయం బయట పడుతుందని భయపడ్డారా?’ అని ప్రశ్నించారు. గజ్వేల్ ఏమీ కేసీఆర్ ఫామ్‌హౌజ్ కాదు కదా... అని ఆమె నిలదీశారు. వెంటనే వెంకటరమణా రెడ్డిని విడుదల చేసి గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములన్నీ వెంచర్లుగా మార్చిన చరిత్ర కేసీఆర్‌దేనని ఆరోపించారు. -
జనశక్తి నేతలు రాజన్న, అమర్ విడుదల
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం విడుదల చేశారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గాజువాక సమీపంలోని ఓ బత్తాయి తోటలో ఆల్ ఇండియా కిసాన్ సంయుక్త మోర్చా రెండు రోజుల సమావేశం నిర్వహిస్తుండగా గురువారం మధ్యాహ్నం అందించిన సమాచారం మేరకు పోలీసులు రెక్కీ నిర్వహించి అరెస్ట్ చేశారు. సుమారు 3గంటల పాటు ఆ తోటలోనే విచారించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారుల సూచన మేరకు జిల్లా కేంద్రంలోని డీటీఎస్కు తరలించారు. శుక్రవారం జిల్లా పోలీసు అధికారుల ముందు ప్రవేశపెట్టారు. అరెస్ట్ అయిన వారిలో కూర రాజన్న, అమర్‌తో పాటు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు రైతు నాయకులు ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా జరగబోయే రైతు ఉద్యమాల గురించి చర్చించేందుకు రెండు రోజులపాటు ఇక్కడ సమావేశాలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న తరువాత వీరి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించగా ఎలాంటి ఆయుధాలు లభించలేదని తెలిసింది. అమర్‌కు సంబంధించిన బ్యాగులో ఒక లేఖ లభ్యమైనట్లు సమాచారం. సమావేశాలు ఎందుకు పెట్టుకున్నారు.. భవిష్యత్తులో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయబోతున్నారా.. రాబోయే ఎన్నికల సందర్భంగా ఏదైనా కుట్ర పన్నారా అనే అంశాలపై విచారించినట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం వారిని పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అన్యాయంగా అరెస్టు చేశారు: రాజన్న, అమర్ దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సమావేశం పెట్టుకుంటే పోలీసులు తమను అన్యాయంగా అరెస్ట్ చేశారని జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్ ఆరోపించారు. పోలీసుల వేధింపులు ఇటీవల ఎక్కువయ్యాయని విమర్శించారు. శుక్రవారం వారు తమను కలిసిన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలో ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్తే అక్కడ పోలీసులు ఇబ్బందులు పెట్టారని, ఖమ్మంలో జిల్లాలో కూడా పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. తమ సంఘం నిషే«ధితం కాదని, అలాంటప్పుడు తమను ఎందుకు ఇబ్బందులు గురిచేస్తున్నారో పోలీసులకే తెలియాలన్నారు. -
బాబు ప్రాజెక్టుల సందర్శన విడ్డూరం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల సందర్శన పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో ఎవరూలేరని పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టుల్లో ఒక్కటైనా చంద్రబాబు పూర్తిచేసి ప్రారంభించిన దాఖలాల్లేవన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శించి విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారాలు అందించి ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూస్తున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు వంశధార ఫేజ్–2, స్టేజ్–2ని, ఆఫ్‌షోర్ వంటి పనులను ప్రారంభించింది వైఎస్సార్ అని, వాటిని పూర్తిచేసేందుకు వైఎస్ జగన్ నిధులు కేటాయించారు. హిరమండలం రిజర్వాయర్‌లో 19 టీఎంసీల నీరు చేరేలా లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతులిచ్చారు. అలాగే, నేరడి బ్యారేజీ అడ్డంకులు తొలగించేందుకు ఒడిశా సీఎంతో మాట్లాడేందుకు జగనన్నే స్వయంగా వెళ్లారు. ఉద్దానం ప్రాంతంలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు అన్ని పనులు చేస్తున్నాం. జిల్లాలోని అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, కూన రవికుమార్‌లు ఏనాడైనా జిల్లాలో ప్రాజెక్టులపై దృష్టిపెట్టారా? నిర్వాసితుల పరిహారాలను తెలుగు తమ్ముళ్లు మింగేయలేదా? ఇక వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు శరవేగంగా చేస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వైఎస్సార్ హయాంలో ప్రారంభిస్తే ఇద్దరు సీఎంలు మారినా ఏ ఒక్కరూ పట్టించుకోకుండా గాలికొదిలేశారు. బాబు, పవన్‌లకు ఎందుకంత కోపం.. విశాఖలో రాజధాని ఏర్పాటుచేస్తున్నామనే అక్కసుతో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌లు రాద్ధాంతం చేస్తున్న తీరుచూస్తే ఉత్తరాంధ్ర ప్రజలపై ఎంత కోపం ఉందో అర్థమవుతోంది. విశాఖలో పవన్, శ్రీకాకుళం జిల్లాలో బాబు ఒకేరోజు సందర్శించి ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం వారి అవివేకం. తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి కారణం జగన్ అని అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రం విభజనకు చంద్రబాబే సహకరించి ఇప్పుడు ఏమీ తెలియనట్లు యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక విద్యుత్, గ్యాస్, పెట్రోలు, నిత్యావసర ధరల పెంపు దేశవ్యాప్తంగా ఉన్నాయా ఒక్క ఏపీలోనే ఉన్నాయా అనేది ప్రజలందరూ గమనించాలి. -
అన్యాయంపై పోరాటానికి ‘ఇన్సాఫ్’
న్యూఢిల్లీ: దేశంలో అడుగడుగునా జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకు ‘ఇన్సాఫ్’అనే వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ లాయర్, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించారు. తన ప్రయత్నానికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, నేతలు సహా ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. దేశంలో పౌరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం అధికారంలో ఉందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీని సంస్కరించడమే తప్ప, విమర్శించడం తమ ఉద్దేశం కాదని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం సమకూరాలని రాజ్యాంగం చెబుతున్నా, అన్ని చోట్లా అన్యాయమే జరుగుతోందన్నారు. -
తెలంగాణ భారత్‌లో భాగం కాదా? కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం
‘పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు వంటి హామీలను గాలికి వదిలేసింది. పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలనే డిమాండ్‌పై కేంద్రం స్పందించడం లేదు. బుల్లెట్ ట్రైన్, హైస్పీడ్ నెట్‌వర్క్‌లలోనూ తెలంగాణకు దక్కిందేమీ లేదు.’ - కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ కూడా కీలకమైన పారిశ్రామిక రంగంలో, న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రోత్సాహకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోంది. నవ జాత శిశువు లాంటి తెలంగాణ తన కాళ్ల మీద తాను నిలబడటానికి సాయం అందించాలని ఏళ్లుగా కోరుతున్నా కేంద్రం నుంచి స్పందన రావ డం లేదు. ఇలా వివక్ష చూపితే ఎలా.. మేం భారత్‌లో భాగం కాదా? ఇప్పుడు తెలంగాణ అభి వృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం మా గొం తును గట్టిగా విప్పాల్సిన అవసరం, సమయం వచ్చింది..’’ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వార్షిక సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. పారిశ్రామిక రంగంతో పాటు వివిధ రంగాల్లో తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. నినాదం ఇస్తేనే సరిపోదు.. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా అని నినాదం ఇస్తే సరిపోదని, చేతల్లో చూపాలని కేటీఆర్ అన్నారు. ‘‘ఇలా వివక్ష చూపితే తయారీ రంగంలో చైనాతో భారత్ ఎలా పోటీపడగలదు. మేం భారత్‌లో భాగం కాదా? ప్రాజెక్టులు, నిధుల విష యంలో రాజకీయాలను పక్కన పెట్టండి. మేకిన్ ఇండియా సాధ్యపడాలంటే రాష్ట్రాలు అడిగిన ప్రాజెక్టులు మంజూరు చేయండి. కేంద్రం మద్దతు ఉంటే మరింత మందికి ఉద్యోగావకాశాలు ఇవ్వ గలం. కేంద్రం రాష్ట్రాలతో కలిసి పనిచేయాల్సిందే’’ అని స్పష్టం చేశారు. సంక్షేమంతోపాటు పారి శ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. టీఎస్ఐపాస్ వంటి పారిశ్రామిక విధానాన్ని తెచ్చి.. రూ.1.12 లక్షల కోట్ల పెట్టుబడులతో 15 వేల కంపెనీలను రాష్ట్రానికి రప్పించామని, సుమారు 15 లక్షల ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ వివరించారు. గత ఆరేండ్లలో వ్యవసాయం మొదలుకుని ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో రాష్ట్రం ఎంతో ప్రగతి చూపినా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదని మండిపడ్డారు. వివిధ వేదికల మీద రాష్ట్రాన్ని ప్రశంసిస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణకు అణా పైసా సాయం చేయడం లేదని విమర్శించారు. విభజన హామీలు తుంగలో పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని కేటీఆర్ మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వంటి హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలనే డిమాండ్‌పై కేంద్రం స్పందించడం లేదని.. బుల్లెట్ ట్రైన్, హైస్పీడ్ నెట్‌వర్క్‌లలోనూ తెలంగాణకు దక్కిందేమీ లేదని చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాష్ట్ర ఏర్పాటుకంటే ముందే మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును అడ్డుకోవడం ద్వారా తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ఎన్డీయే ప్రభుత్వం మోకాలడ్డుతోందని విమర్శించారు. రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఆరేండ్లలో రూ.57 వేల కోట్ల నుంచి రూ.1.40 లక్షల కోట్లకు చేరినా.. కేంద్రం నుంచి ప్రోత్సాహం కరువైందని.. అదనపు ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, హైదరాబాద్ ఫార్మాసిటీలో మౌలిక వసతులకు రూ.3,900 కోట్లు ఇవ్వాలన్న విజ్ఞప్తులపై మౌనం పాటిస్తోందని తెలిపారు. జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడారు మంజూరు, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో రీసెర్చ్, ఇన్నోవేషన్ కోసం డిఫెన్స్ ఇంక్యుబేటర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎయిరో ఇంజన్ కారిడార్ మంజూరు వంటి విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోవడమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు విషయంలో మొండి చేయి చూపుతున్నారని కేటీఆర్ వివరించారు. గతేడాదితో పోలిస్తే ఎగుమతుల్లో 2020–21లో 15.5 శాతం వృద్ధిరేటును నమోదు చేసినా డ్రైపోర్టుపై స్పందన లేదని చెప్పారు. హైదరాబాద్ వెలుపలికి ఐటీని విస్తరిస్తం హైదరాబాద్ వెలుపల ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తామరని.. నల్గొండ, రామగుండం, సిద్దిపేటలో ఐటీ హబ్స్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడం ద్వారా కంపెనీలకు వ్యయం తగ్గడంతో పాటు స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఇప్పటికే కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో పలు ఐటీ కంపెనీలు అడుగుపెట్టాయని.. వరంగల్‌లో టెక్ మహీంద్రా, సైయంట్, మైండ్ట్రీతోపాటు పలు స్టార్టప్స్, ఎస్ఎంఈలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని వెల్లడించారు. కాగా సీఐఐ వార్షిక సదస్సులో భాగంగా పరిశ్రమలతో పాటు వివిధ కేటగిరీలకు చెందిన సంస్థలకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. -
ఘోర అన్యాయం: కేంద్రానికి ఘాటు లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ ఉ్యదమం చేస్తున్న రైతులకు మాజీ సివిల్ సర్వెంట్లు మద్దతుగా నిలిచారు. రైతులకు ఘోర అన్యాయం జరిగిందని, ఇది ఇంకా కొనసాగుతోంది అంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని మాజీ సివిల్ సర్వెంట్ల బృందం తప్పుబట్టింది. ఈ మేరకు 75 మంది మాజీ అధికారులు ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. హృదయపూర్వకంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో ఎప్పటికీ పరిష్కారం లభించదని స్పష్టం చేశారు. దేశంలో చాలా గందరగోళానికి కారణమైన సమస్యను ఇకనైనా పరిష్కరించాలని తమ లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. (‘చక్కా జామ్’ : 50 వేల మందితో భారీ భద్రత) రైతు ఉద్యమంలో పరిణామాలను తీవ్ర ఆందోళనతో గమనిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా జనవరి 26, రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న పరిణామాలు, సంఘటనలు, రైతులపై నిందలు వేయడానికి చేసిన ప్రయత్నాలపై మాజీ సివిల్ సర్వెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులకు తమ మద్దతును మరోసారి పునరుద్ఘాటించారు. తక్షణమే ఈ సమస్యను సంతృప్తికరంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. 18 నెలల పాటు చట్టాల అమలును నిలిపివేయడం లాంటి చర్యలను ప్రతిపాదించడానికి బదులుగా, ప్రభుత్వం ఒక స్నేహపూర్వక పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. చట్టాలను ఉపసంహరించు , లేదా ఇతర సాధ్యమైన పరిష్కారాల గురించి ఆలోచించాలన్నారు. వ్యవసాయం రాజ్యాంగంలో రాష్ట్ర జాబితాలో ఉందని గుర్తు చేయడం విశేషం. (రైతులకు మద్దతు : గ్రెటా థన్‌బర్గ్‌పై కేసు) రైతుల నిరసన పట్ల ప్రభుత్వం మొదటినుంచీ మొండిగానే వ్యవహరిస్తోందని, ఈ వైఖరి ఘర్షణ సృష్టించేదిగానే ఉందని ఆరోపించారు. రైతులను ప్రతిపక్షంగా చూస్తూ, అపహాస్యం చేస్తున్నతీరును ఖండించారు. అలాగే కొంతమంది జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీ ఎంపీలపై దేశద్రోహ ఆరోపణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కాన్స్టిట్యూషనల్ కండక్ట్ కమిటీ (సీసీజీ)లో భాగమైన మాజీ ఐఏఎస్ ఆధికారులు నజీబ్ జంగ్, జూలియో రిబెరియో, అరుణ రాయ్ లతో పాటు జవహర్ సిర్కార్, అరబిందో బెహెరా, మాజీ ఐఎఫ్ఎస్ అధికారులు కెబి ఫాబియన్, అఫ్తాబ్ సేథ్, మాజీ ఐపిఎస్ అధికారులు జూలియో రిబెరియో, ఎకె సమతా తదితరులు ఈ లేఖపై సంతకం చేశారు. -
బడ్జెట్: తెలంగాణ రాష్ట్ర ప్రస్తావనేది..!
ఆశలు అడియాసలయ్యాయి. సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా లేదు. విభజన హామీల ఊసులేదు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఉనికిలేదు. పన్నుల వాటా, జీఎస్టీ పరిహారం చెల్లింపులో ఊరట లేదు. పురపాలికలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాల జాడలేదు. మెట్రోరైలుకు మళ్లీ మొండిచేయి. స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ప్రతిపాదన కూడా కనిపించలేదు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ గాడిలో పడేందుకు అండగా నిలబడుతుందనుకున్నవారికి తెలుగింటి కోడలు నిర్మలాసీతారామన్ మొండిచెయ్యే చూపింది. – సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర సాగునీటి రంగానికి ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ నిధుల వరద పారించలేదు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయంపై రాష్ట్ర ప్రజల ఆశలను ఆవిరి చేసింది. కాళేశ్వరానికి జాతీ య హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ రాసిన లేఖ లను కేంద్రం పట్టించుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చులో సింహభాగం అప్పు ల ద్వారానే సమకూర్చుకుంటున్నామని, ఆర్థికసాయం చేయాలని రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోలేదు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు అందిస్తున్నందున భగీరథ అప్పుల చెల్లింపులకు నిధులివ్వాలని, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కోరినా స్పందన కరువైంది. చదవండి: (బడ్జెట్ 2021-22: ఓ లుక్కేయండి!) ఇక, నదుల అనుసంధాన ప్రక్రియకు కూడా నిధులు లేవు. అయితే, భగీరథ స్ఫూర్తితో కేంద్రం రూపొందించిన జల్‌జీవన్ మిషన్‌కు గత ఏడాది బడ్జెట్లో రూ.11,218 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది దాన్ని రూ.49,757 వేల కోట్లకు పెంచింది. పీఎంకేఎస్‌వై కింద కేటాయించిన రూ.11,588కోట్ల నుంచి కొమురంభీం, గొల్ల వాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులకు రావాల్సిన రూ.200 కోట్లలో ఏమైనా విదిలిస్తారేమోనని రాష్ట్రం ఎదురుచూడాల్సి వస్తోంది. పురపాలకం.. ఇదీ వాలకం పురపాలక శాఖ పరిధిలో అమలవుతున్న పలు ప్రాజెక్టులకుగాను రూ.1,950 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, ఒక్కరూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. సీవరేజీ మాస్టర్ ప్లాన్‌కు రూ.750 కోట్లు, నాలాల అభివృద్ధికి రూ.240 కోట్లు, వరంగల్ నియో మెట్రోకు రూ.210 కోట్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ.750 కోట్లు కావాలని అడిగినా, ఏ ఒక్క ప్రాజెక్టుకూ రూపా యి కూడా లేదు. మెట్రోరైలు ప్రాజెక్టు, జాతీయ రహదారులకు నిధులివ్వకుండా తెలుగింటి కోడలు నిరాశే మిగిల్చింది. పునర్విభజన.. ఏదీ ఆలోచన? ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర పన్నుల్లో వాటాను తగ్గించిన కేంద్రం అదే ఆర్థిక సంఘం రాష్ట్రానికి సిఫారసు చేసిన స్పెషల్ గ్రాంటును విస్మరించింది. రూ. 730 కోట్ల స్పెషల్ గ్రాంటుతోపాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 2019 నుంచి ఇవ్వాల్సిన రూ.900 కోట్లు, నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు సిఫారసు చేసిన వేల కోట్ల రూపాయల గురించి నిర్మలమ్మ పద్దులో ఒక్క సుద్ది కూడా లేదు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో స్వేచ్ఛ, పింఛన్ పెంపు కింద ఆసరాల గురించి రాష్ట్రం ఆశించినా వాటి గురించి ఏమీ చెప్పలేదు. పన్నుల్లో వాటా, జీఎస్టీ పరిహారం చెల్లింపులో తనకు అనుకూలంగా మార్పులు చేసుకుంటున్న కేంద్రం రాష్ట్రాలకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. ఐటీఐఆర్‌తో పాటు బయ్యారం స్టీల్‌ఫ్యాక్టరీ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు లాంటి విభజన హామీలు మళ్లీ అటకెక్కాయి. ఈ నేపథ్యంలో 2021–22గాను రాష్ట్రం రూపొందించే బడ్జెట్‌పై ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పరిశ్రమలు.. ఆశలు అడియాశలు పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో కనీసం ఒక్కటి కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావనకు నోచుకోలేదు. హైదరాబాద్ ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సదుపాయాల కోసం కనీసం రూ.870 కోట్లు, వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతుల కోసం కనీసం రూ.300 కోట్లు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసరాల్లో ఏర్పాటయ్యే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)లో మౌలిక వసతుల కల్పనకు తొలిదశలో రూ. 500 కోట్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటయ్యే నేషనల్ డిజైన్ సెంటర్‌కు రూ.200 కోట్ల ప్రాథమిక మూలధనం, ‘హైదరాబాద్– వరంగల్’ఇండస్ట్రియల్ కారిడార్‌కు రూ.3 వేల కోట్లు, ‘హైదరాబాద్– నాగపూర్’కారిడా ర్కు రూ.2 వేల కోట్లు.. ఇలా మొత్తంగా 2021–22 కేంద్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి రాసిన ఏ లేఖను కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక, రాష్ట్ర విభజనహామీల్లో కీలకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయాలని తాజాగా కేటీఆర్ చేసిన ప్రతిపాదనను కూడా కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో ఇక, ఈ ప్రాజెక్టు కోల్డ్‌స్టోరేజీలోకి నెట్టేసినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఎంఎస్ఎంఈ పరిశ్రమలను పునర్విచించడం, ఒకటి, రెండు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు రాష్ట్రంలోని పారిశ్రామిక రంగంపై కొంత మేర సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. రూ. 2.50 కోట్ల పెట్టుబడి ఉండే వాటిని ఎంఎస్ఎంఈలుగా గుర్తించాలన్న నిర్ణయంతో రాష్ట్రంలోని మరికొన్ని పరిశ్రమలకు ఈ జాబితా లో స్థానం లభించనుంది. పూర్తి నిరాశాజనకం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి ఉపయోగం లేదని, పూర్తి నిరాశాజనకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ లు, బీజేపీ నేతల అసమర్థత వల్లే రాష్ట్రం అన్యాయానికి గురైందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఎప్పటి మాదిరిగానే రైల్వే కేటాయింపుల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ప్రత్యేక డివిజన్ డిమాండ్‌పై కేంద్రం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని కేంద్ర సంస్థలకే నిధులు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో తెలంగాణకు మళ్లీ నిరాశే ఎదురైంది. కేవలం తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఈ బడ్జెట్ పద్దుల్లో ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలోని గిరిజన వర్సిటీకి రూ. 26.90 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌లో ఈఏపీ ప్రాజెక్టులకు రూ. 150 కోట్లు కేటాయించింది. జపాన్ ఆర్థికసాయంతో ఐఐటీ క్యాంపస్ అభివృద్ధికి రూ. 460.31 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్, రీసెర్చ్ సంస్థకు సర్వే, అణు ఖనిజాల అన్వేషణ నిమిత్తం రూ. 329.19 కోట్లు, హైదరాబాద్, మొహాలి, అహ్మాదాబాద్, గువాహటి, హజిపూర్, కోల్‌కతా, రాయ్‌బరేలి, మధురైల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ (నైపర్)కు రూ. 215.34 కోట్లు, హైదరాబాద్, కోల్‌కతా, గువాహటి, చెన్నైల్లోని డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థలకు రూ.30 కోట్లు, హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా ఉన్న 12 సీ–డాక్ కేంద్రాలకు రూ. 200 కోట్లు కేటాయించింది. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్, ఐటీ (సి–మెట్)లో హైదరాబాద్‌సహా మూడు కేంద్రాలకు రూ. 80 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయిం చారు. హైరరాబాద్ లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు రూ.23.84 కోట్లు, హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కు రూ.124 కోట్లు, హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్‌ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎన్సీఓఐఎస్)కు రూ. 24.50 కోట్లు, సింగరేణిలో పెట్టుబడులకు రూ. 2500 కోట్లు, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్ లిమిటెడ్ మూసివేత ఖర్చులకు రూ. 233.14 కోట్లు, మిథానిలో పెట్టుబడులకు రూ.1184.68 కోట్లు కేటా యించారు. తెలంగాణకు అన్యాయం జరిగింది: ఉత్తమ్ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు అన్యా యం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి బీజేపీ వల్ల నష్టం జరుగుతోందని చెప్పేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిదర్శనమన్నారు. ఢిల్లీలోని విజయ్‌చౌక్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనల్లో ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. ఆర్థిక మాం ద్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ పెంచడం దారుణమన్నారు. గత ఆరేళ్లలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా వారికి మేలు చేసే చర్యలు బడ్జెట్లో ఏమాత్రం లేవన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి చేసి న ప్రకటన పచ్చి అబద్ధమని మండిపడ్డారు. నయా క్యాపిటలిస్టులకు దోచిపెట్టే బడ్జెట్ : భట్టి సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని, కొద్దిమంది నయా క్యాపిటలిస్టులకు ప్రజల సొమ్మును దోచిపెట్టే విధంగా బడ్జెట్‌ను తయారుచేశారని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత భట్టివిక్రమార్క విమర్శించారు. కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రం పనిచేస్తోందని ఈ బడ్జెట్ నిరూపిస్తోందని, సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించకుండా బడ్జెట్ పెట్టారని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతి సంపదను కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం చేసేలా బడ్జెట్ ఉందన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన వర్సిటీ లాంటి విభజన హామీల గురించి కనీసం ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తుంటే టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు నిద్రపోతున్నారా.. గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది చరిత్రాత్మక బడ్జెట్: బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రాష్ట్ర బీజేపీ స్వాగతించింది. ప్రజాసంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించేలా ఈ బడ్జెట్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. అదనంగా మరో కోటి మంది మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల సాయంతో పాటు మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా బడ్జెట్ ఉంద న్నారు. ఈ బడ్జెట్ ద్వారా 2021–22లో భారత ఆర్థిక ప్రగతి పరుగు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రాష్ట్రానికి మొండి చేయి చాడ వెంకట్‌రెడ్డి తెలంగాణకు బడ్జెట్లో మొండిచేయి చూపారు. దీర్ఘకాలికంగా ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎంఎంటీఎస్ మెట్రో రైలు విస్తరణ ఊసే లేదు. కేంద్రం బరితెగించి కార్పొరేట్లకు అనుకూలంగా ప్రైవేటీకరణకు తలుపులు బార్లా తెరిచింది. ఈ ఏడాది 1.75 లక్షల కోట్ల మేర ఆస్తులను అమ్మకాల ద్వారా సమకూర్చుకోవా లని అనుకోవడం దారుణం. పెట్రోల్, డీజిల్‌పై సెస్ మోపడం దుర్మార్గం. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49 నుంచి 75 శాతానికి పెంచడం, మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవాలని నిర్ణయించడం దేశ భక్తులపనా? రాష్ట్రానికి నిధులు రాబట్టాలి: తమ్మినేని పేదలను మరింత పేదరికంలోకి, కార్పొరేట్లను మరింత లాభాల్లోకి నెట్టేలా ఈ బడ్జెట్ ఉంది. వ్యవసాయ చట్టాల రద్దుకు దేశ వ్యాప్తంగా ఉద్య మం జరుగుతుంటే టీఆర్ఎస్ కేంద్రానికి వత్తాసు పలికినా.. బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు వచ్చేలా చూడాలి. నిత్యావసర సరుకులపై ప్రభావం చూపే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతుంటే మళ్లీ సెస్ విధించి పేదల బతుకులతో చెలగాటమాడుతోంది. -
ఈ‘సారీ’ కూత లేదు
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా మీదుగా ప్రతిపాదించిన గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం ఎదురుచూస్తున్నజిల్లా ప్రజలకు మరోమారు నిరాశే మిగిలింది. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా..ఈ బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం కలను కలగానే మిగిల్చింది. తెలంగాణలోని గద్వాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వేలైన్ కోసం నిధులు కేటాయిస్తారని అంతా అనుకున్నామరోమారు మొండిచేయి చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయం లేకపోవడం వల్లనే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. దీంతో నాగర్‌కర్నూల్ నుంచి కల్వకుర్తి, అచ్చంపేట గుండా మాచర్ల వరకు రైల్వేలైన్ వస్తుందనుకున్న ప్రజల ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. 1980లో రైల్వేలైన్‌కు బీజం 1980లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు గద్వాల– మాచర్ల రైల్వేలైన్ వేయడం వల్ల కలిగే లాభాలను వివరి స్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీంతో అప్పట్లో రూ.919 కోట్ల బడ్జెట్‌తో 184.2 కి .మీ. మేర రైల్వేలైన్ కోసం ప్రతిపాదనలు తయారు చేయారు. ఈ రైల్వేలైన్ వనప ర్తి, నాగర్‌కర్నూల్, మిర్యాలగూడ మీ దుగా మాచర్ల వరకు చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్ వల్ల వ్యాపార పరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అప్పటి నుంచి మరుగున పడిపోయిన ఈ అంశంపై 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసి కేంద్రానికి అందించారు. దీంతో 2015లో కేంద్రం కంటి తుడుపు చర్యగా కేవలం నల్లగొండ– మాచర్ల వరకు సర్వే నిర్వహించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఇది మినహా ఇప్పటి వరకు ఈ రైల్వేలైన్‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న చొరవ ఏమీ లేదు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపైనే ఈ అంశం ఆధారపడి ఉందనేది అందరి వాదన. రైల్వేలైన్ కోసం అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభు త్వం ఒప్పుకుంటే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. భూ సేకరణ, ఇ తర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే చెల్లింపులు చేయాలి. ఫలితంగా రాష్ట్ర ప్ర భుత్వం చొరవ తీసుకుంటే తప్ప కేం ద్రం ఒప్పుకునే అవకాశం లేకపోలేదు. మొదటి దశ పూర్తి.. రెండో దశ? ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్టాలను కలుపుతూ రాయచూర్ నుంచి మాచర్లకు రైల్వేలైన్ కోసం ప్రతిపాదించారు. దీని వల్ల వ్యాపార పరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా మూడు రాష్ట్రాల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. దీంతో 2002లో అప్పటి కేంద్ర రైల్వే సహాయ మంత్రి హోదాలో దత్తాత్రేయ రాయచూర్– గద్వాల రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేశారు. గత రెండేళ్ల క్రితం డెమో కూడా పూర్తి చేసుకుని రాకపోకలు సైతం ప్రారంభమయ్యాయి. ఇక రెండో దశకు సంబంధించి గద్వాల నుంచి మాచర్ల వరకు రైల్వేలైన్ కోసం 151 నుంచి 154 కిలోమీటర్ల మేర ఉండే ఈ రైల్వే లైన్ కోసం దాదాపు రూ.1,160 కోట్లు అవుతుందని రైల్వేశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. సగం వాటా భరిస్తే కొత్త లైన్లు వేస్తామని కేంద్ర విధించిన నిబంధన మేరకు రాష్ట్రానికి చెందిన నేతలు, ఇక్కడి ఎంపీలు ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు రైల్వేలైన్‌కు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజకీయ నాయకులు రైల్వే లైన్ కోసం మరో ఉద్యమం చేస్తే తప్ప సాధ్యం కాదని ఇక్కడి ప్రజల అభిప్రాయం. ఏదేమైనా గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం ఇంకెన్ని దశాబ్దాలు వేచి చూడాలనేది ఈ ప్రాంత ప్రజల ప్రశ్న. ముఖ్యమంత్రి లేఖ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆమోదం పొందేలోపు రాష్ట్ర Ðముఖ్యమంతి గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం లేఖ ఇవ్వాలి. సప్లిమెంటరీ కింద కేంద్ర నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ రైల్వేలైన్ కోసం అయ్యే ఖర్చులో 50 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. కాబట్టి ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒప్పించి సమస్యను పరిష్కరించాలి. -సుధాకర్‌రెడ్డి, రైల్వే సాధన సమితి జిల్లా చైర్మన్ -
బాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ హంబక్
ప్రతిభ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరు పైసా ఖర్చు లేకుండా ఉన్నత చదువు చదివేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన బృహత్తర పథకాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్) పథకం ఒకటి. ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అంపశయ్యపైకి చేర్చింది. వైఎస్సార్ హయాంలో సజావుగా సాగిన ఈ పథకం మూడు సంవత్సరాలుగా గాడి తప్పింది. ఈ పథకం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గాడి తప్పడంతో తల్లిదండ్రులను, విద్యార్థులను మనస్థాపానికి గురిచేస్తోంది. సాక్షి,గూడూరు: జిల్లాలో 478 కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు 83,550 మంది వివిధ రకాల కోర్సుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరు 2018–19 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో స్కాలర్షిప్ రూ.90.92 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ రూ.266 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఫీజుల బకాయిలు రూ.495 కోట్లు ఉన్నాయి. గతేడాది బీసీ, ఈబీసీ బకాయిలు మరో రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే విద్యా సంవత్సరం ముగుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఫీజులను, స్కాలర్ షిప్‌లను 94 శాతం మంజూరు చేసినట్లు ఆన్లైన్లో చూపిస్తున్నా.. విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా జమ కాకపోవడం గమనార్హం. గడిచిన ఐదేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రూ.766.68 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా కేవలం రూ.271.68 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. పేదలకు వరం ఫీజు రీయింబర్స్మెంట్ పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయిబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేశారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి కళాశాల గ్రేడ్‌ను బట్టి ఎస్సీ, ఎస్టీలకు ప్రతి ఏడాది ట్యూషన్ ఫీజు కింద రూ.35 వేల నుంచి రూ.90 వేల వరకు, బీసీలు, మైనార్టీలకు సంబంధించి రూ.35 వేలు, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు రూ. 26 వేలకు పైగా ఆయా కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. దీంతో పాటు కళాశాలకు సంబంధించిన హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్ కింద రూ.13 వేలను అందజేసింది. వీటితో పాటు స్పెషల్ ఫీజు కింద రూ. 5,500 విడుదల చేశారు. కళాశాల ఫీజులతో సంబంధం లేకుండా మెయింటెనెన్స్ కింద ఒక్కో విద్యార్థికి నెలకు రూ.680 ఇచ్చారు. ఆ సమయంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. స్పెషల్ ఫీజు కింద ఇచ్చే రూ.5,500లను నిలిపివేశారు. కేవలం ఇంజినీరింగ్‌కు రూ.35 వేలు, ఎంసీఏ, ఎంబీఏకు రూ.27 వేలు విడుదల చేస్తున్నారు. దీంతో మిగతా మొత్తాన్ని ఆ పేదింటి తల్లిదండ్రులు కాయకష్టం చేసి, ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి చదివించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈయన పేరు కేఆర్‌రెడ్డి, గూడూరులోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల కరస్పాండెంట్. ఈ కళాశాలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి సుమారు రూ.2 కోట్ల మేర బకాయిలు ఉంది. అయితే ఈ నెల 18న కేవలం రూ.2,875 మాత్రమే కళాశాల అకౌంట్లో జమ చేశారు. కోట్లాది రూపాయలు బకాయి ఉంటే.. కేవలం నామమాత్రంగా ఇలా చిన్న మొత్తాన్ని జమ చేయడంతో ఆయన ఖంగుతిన్నారు. కళాశాలకు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించినట్లు భ్రమ కల్పించే విధంగా ఉంది. ఈ కళాశాల నుంచి రూ.45 లక్షలు ట్రెజరీకి బిల్లు పెట్టి నెలలు గడుస్తున్నా, వాటిని ఇప్పటి వరకు క్లియర్ చేయడం లేదని కేఆర్ రెడ్డి వాపోతున్నారు. కళాశాలలో పనిచేస్తున్న 110 మంది ఉద్యోగులకు జీతాలెక్కడి నుంచి ఇవ్వగలమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి కళాశాలను ఎన్నాళ్లు నెట్టుకురాగలమని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఒక కేఆర్ రెడ్డిది మాత్రమే కాదు.. జిల్లాలో వందలాది కళాశాలల యాజమాన్యాల పరిస్థితి ఇలాగే ఉంది. జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలు రాకపోవడంతో యాజమాన్యాలు అప్పులు చేసి కొన్నాళ్లు ఇచ్చారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఇవ్వలేమని, కొంత మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. నెలంతా కష్టపడినా.. నెల ఆఖరులో జీతాలు రాకపోతే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. – జీ శ్రీనివాసులు, అధ్యాపకులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలు చెల్లించకపోవడంతో పరీక్షలు రాయనిస్తారో లేదోనని ఆందోళనగా ఉంది. దీంతో చదువుపై దృష్టి పెట్టలేక పోతున్నాం. ఎలాగోలా పరీక్షలు రాయనిస్తున్నారు. లేదంటే మా పరిస్థితి ఎలా?. – బీ మునిరాజా, ఎంబీఏ తీవ్ర ఒత్తిడికి గురయ్యాం పరీక్షలు రాయనిస్తారో లేదో అని ప్రతి రోజు మేమంతా తీవ్ర ఒత్తిడికి గురయ్యాము. ఈ ప్రభుత్వానికి మాలాంటి పేద విద్యార్థులపై ఎంత విద్యార్థులపై ఎందుకింత చిన్న చూపు చూస్తుందో అర్థం కావడం లేదు. – జే వంశీ, ఎంబీఏ -
బాబు హయాంలో పింఛన్.. వంచన
సాక్షి, అనంతపురం: అర్హులైన సామాజిక పింఛన్‌దారులను కాదంటూ అనర్హులకు అధికారపార్టీ నేతలు న్యాయం చేశారు. ఈ ఐదేళ్ల వ్యవధిలో తమకు అనుకూలంగా ఉన్న వారికి ఏ అర్హత లేకున్నా పింఛన్ ఇప్పించేశారు. సామాన్యులను ఇబ్బందుల పాలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందజేస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే పథకం ప్రకారం పింఛన్‌దారులను జాబితా నుంచి తొలగిస్తూ వచ్చారు. పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారిని ఎందుకమ్మా తిరగడం అర్హత ఉన్నా.. మీకు పింఛన్ రాదు అంటూ అధికారులే తెగేసి చెబుతూ వచ్చారు. అన్ని అర్హతలు ఉన్న వారు ఎన్ని దఫాలు దరఖాస్తు చేసుకున్నా.. బుట్ట దాఖలు చేస్తూ వచ్చారు. ఆరు దఫాలుగా జిల్లాలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో తీసుకున్న అర్జీల్లో 8,500 అపరిష్కృతంగానే ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. పించన్ ఇవ్వడం లేదు నాకు గతంలో పింఛన్ వచ్చేది. కొన్ని నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. నాకు వయసు మీదపడడంతోపాటు కళ్లు పూర్తిగా కనిపించవు. వినికిడి సమస్య కూడా ఉంది. ఇతరుల సహాయం లేనిదే నేను ఏ పనీ చేసుకోలేను. పింఛన్ ఇవ్వాలని జన్మభూమి గ్రామసభలో దరఖాస్తు చేశా. అధికారులు ఇదిగో అదిగో అంటున్నారే తప్ప పింఛన్ ఇవ్వడం లేదు. – బి.అక్కులప్ప, గాడ్రాళ్లపల్లి పింఛన్ రాకుండా అడ్డుకున్నారు ఐదేళ్లుగా వితంతు పింఛన్ కోసం అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. జన్మభూమి, మీ కోసం కార్యక్రమాల్లో దరఖాస్తులు అందజేస్తున్నా ప్రయాజనం లేకుండా పోయింది. జన్మభూమి కమిటీ సభ్యులు నాకు పింఛన్ రాకుండా అడ్డుకున్నారు. ఈప్రభుత్వంలో పేదోళ్లకు న్యాయం జరగడం లేదు. డబ్బిచ్చినోళ్లకే పథకాలు అందుతున్నాయి. –ఓబులమ్మ చండ్రాయనిపల్లి -
భార్యాబిడ్డలు
థామస్ చెరియన్, కృష్ణ భగవాన్ ఇద్దరే ఉన్నారు ఆ గదిలో. అది భగవాన్ ఇల్లు. ఇంట్లో భగవాన్ గది. గది మధ్యలో ఖరీదైన పెద్ద సోఫా ఉంటుంది. ఆ సోఫా ఎదురుగా అంతే ఖరీదైన నాలుౖVð దు కుషన్ ఛైర్లు ఉంటాయి. భగవాన్ కోసం వచ్చే ఖరీదైన మనుషుల కోసం ఏర్పాటు చేసినవి అవి.థామస్ చెరియన్ ఖరీదైన వాడేం కాదు. నికార్సైనవాడు. నికార్సైనవాడు కాబట్టే నేరుగా భగవాన్ గదిలోకి వచ్చి కూర్చున్నాడు. భగవాన్ కూర్చోమనలేదు. కానీ చెరియన్ కూర్చున్నాడు! చెరియన్ వచ్చేటప్పటికి భగవాన్ తెల్లటి పంచె, తెల్లటి లాల్చీలో సోఫాపైన వెల్లకిలా పడుకుని రిలాక్స్డ్గా సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. ‘‘భగవాన్.. నువ్వు తెలివైనవాడివి కావచ్చు. నీ తెలివితేటలు నీ భార్యాబిడ్డలకు ఉపయోగపడినంత వరకు ఎవరికేం అభ్యంతరం ఉండదు. అయితే నీకొక్కడికే భార్యాబిడ్డలు ఉంటారనుకుంటునట్లు న్నావ్’’ అన్నాడు చెరియన్. మెల్లిగా సోఫాలోంచి లేచి కూర్చుని, కాలు మీద కాలు వేసుకున్నాడు భగవాన్. సోఫాలో తల పక్కనే పెట్టుకుని ఉన్న గన్ని తీసి పంచె కొసతో మృదువుగా తుడిచాడు. తన చేతిలో గన్ని చూశాక, చెరియన్ ఇంకొక్క మాట కూడా మాట్లాడడనే అనుకున్నాడు భగవాన్. కానీ చెరియన్ మాట్లాడాడు!‘‘భగవాన్.. నేనేం అన్యాయంగా అడగడం లేదు. నాకు రావలసింది నాకు ఇచ్చెయ్. ‘ఇంకో డీల్ చెయ్యి, రెండూ కలిపి ఇస్తాం’ అంటున్నారు మీ వాళ్లు. రోజు కూలీ లాంటి వాణ్ణి నేను. ఎప్పటిదప్పుడే ఇవ్వకపోతే శాటిస్ఫై కాను’’ అన్నాడు చెరియన్. ‘‘కోటి రూపాయల సెటిల్మెంట్ హైదరాబాద్‌లో చిల్లర సంగతి చెరియన్. అందులో నీ లక్ష ఇంకా చిల్లర. చిల్లర విషయాలు డీల్ చెయ్యడానికి నా దగ్గర తెలివైనవాళ్లు లక్షల్లో ఉన్నారు. నువ్వు నా వరకు రావడమే వింతగా ఉంది’’ అన్నాడు భగవాన్.‘‘నీ దగ్గరి తెలివైనవాళ్లకు తెలివి ఎక్కువైంది భగవాన్. నెల రోజుల నుంచీ తిరుగుతున్నాను. ముందు ఇస్తామని ఒప్పుకుని, తర్వాత ‘నువ్వు చేసిందేమీ లేదు’ అంటున్నారు.’’ ‘‘నాతోనూ అన్నారు.. ఈ సెటిల్మెంట్లో నువ్వు చేసిందేమీ లేదని. ఎవరిదో ఫోన్ నెంబరు ఇచ్చావట. అంతేగా! ‘దానికి లక్షేమిటి?’ అంటున్నారు’’ అన్నాడు భగవాన్. అతడి పంచె ఇప్పుడు గన్ ట్రిగ్గర్‌ని తుడుస్తోంది. ‘‘నేను ఎంత చేశాను అని కాదు భగవాన్. నా పేరు నీ దాకా వచ్చిందంటే నేను చెయ్యాల్సిందే చేశాననే కదా..’’ భగవాన్ విసుగ్గా చూశాడు. ‘‘వెళ్లు చెరియన్. నా చేతుల్తో ఇప్పుడు నీకు లక్ష ఇచ్చానంటే.. నా సిస్టమ్‌ని నేనే దెబ్బతీసినట్లు. నీకు న్యాయం జరిగినా, అన్యాయం జరిగినా.. జరగాల్సిందే జరుగుతుంది. వెళ్లు’’ అన్నాడు. ‘‘వెళ్లడానికి రాలేదు భగవాన్. తీసుకెళ్లడానికే వచ్చాను’’ అన్నాడు చెరియన్. భగవాన్‌కి తిక్కరేగింది. గన్ని పొజిషన్లోకి తీసుకున్నాడు. టప్.. టప్.. రెండు బులెట్లు దిగాయి. అయితే దిగింది భగవాన్ గుండెల్లోకి. సోఫాలోనే అతడు ఒరిగిపోయాడు. అరుపులు బయటికి వినిపించే గది కాదు అది. పోలీసు కుక్కలు వాసనపట్టే గది కూడా కాదు. తుపాకీని జేబులో పెట్టుకుని పైకి లేచాడు చెరియన్. భగవాన్‌కి దగ్గరగా వెళ్లి చూశాడు. చచ్చిపోయాడు. భగవాన్ గన్ భగవాన్ చేతిలోనే ఉంది. ఎవర్నో కాల్చబోతే ఎవరో కాల్చేశారు అన్నంత వరకు మొదట అర్థమైపోతుంది పోలీసులకు. ఆ గదిలో డబ్బు కోసం వెదికే అవసరం లేకపోయింది చెరియన్‌కి. సోఫాల వెనుక వరుసగా బస్తాలు పేర్చి ఉన్నాయి. ఒక బస్తా ఓపన్ చేశాడు. రెండువేల నోట్ల కట్టలు. వాటిని వదిలేశాడు. ఇంకో బస్తా తెరిచాడు. ఐదొందల నోట్ల కట్టలు. వాటిల్లోంచి రెండు కట్టలు తీసుకుని నడుము దగ్గర ప్యాంటు లోపలకి దోపుకున్నాడు. ‘‘ఏంటలా ఉన్నారు?’’ ఇంట్లోకి రాగానే అడిగింది చెరియన్ భార్య.‘‘పని ఎక్కువగా ఉంది’’ అని తన గదిలోకి, అక్కడి నుంచి స్నానానికి వెళ్లిపోయాడు చెరియన్. పిల్లలిద్దరూ నిద్రపోయారు. రాత్రి పన్నెండు కావస్తోంది. ‘‘భోజనం వడ్డించాను. రండి’’ అంది భార్య. ‘‘ఊరెళ్లాలి అంటున్నావ్ కదా. రేపు వెళ్తారా నువ్వూ, పిల్లలు’’ అన్నాడు భోం చేస్తూ. ‘‘రేపా! ఒక్క రోజులో అన్నీ సర్దుకోలేనండీ ’’ అంది భార్య.‘‘సరే.. ’’ అన్నాడు. ‘‘నిద్రొస్తోంది. వెళ్లి పడుకుంటాను’’ అందామె.. భర్త భోజనం పూర్తయ్యాక. తర్వాత తనూ వెళ్లి పడుకున్నాడు. పడుకున్నాడే కానీ నిద్ర పట్టలేదు. అతడి కళ్లల్లో భగవాన్ మెదులుతున్నాడు. టక్.. టక్.. టక్.. ఎవరో తలుపు తడుతున్నారు. టైమ్ చూశాడు చెరియన్. ఒంటి గంట దాటుతోంది. టక్ టక్.. టక్ టక్.. టక్.. తలుపు చప్పుడు ఎక్కువైంది. కనీసం ఉదయం వరకైనా పోలీసులు తనకు టైమ్ ఇస్తారనుకున్నాడు!లేదా.. భగవాన్ మనుషులు అయి ఉంటారు.మెల్లిగా పైకి లేచి, రివాల్వర్ తీసుకున్నాడు. తలుపు దగ్గరకు వెళ్లి ఒక్క క్షణం ఆగి, తలుపు తెరిచాడు. ఒక్కసారిగా షాక్ తిన్నాడు.ఎదురుగా.. భ.. గ.. వా.. న్!!!‘‘ప్ఛ్.. తొందరపడ్డావు చెరియన్’’ అన్నాడు భగవాన్. ‘‘నేను తొందరపడ్డం కాదు భగవాన్. నువ్వే ఆలస్యం చేశావ్.. నా డబ్బు నాకు ఇవ్వకుండా..’’అన్నాడు ధైర్యం తెచ్చుకుని.ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడుతున్నట్లుగానే ఉంది వాళ్ల సంభాషణ.‘‘దేవుడితో పోరాడుతూ నీ దగ్గరికి వచ్చాను చెరియన్. ఇదిగో, నీ ఉంగరం. నన్ను షూట్ చేస్తున్నప్పుడు పడిపోయింది. ఉంగరం మీద జీసెస్ ఉన్నాడు కదా... పట్టుకోలేకపోయాను. పైన పేరు వేయించుకున్నావ్. ఈజీగా దొరికిపోయేవాడివి. అందుకే ఎవరికీ దొరక్కుండా తెచ్చేశాను’’ అన్నాడు భగవాన్. తన వేళ్ల వైపు చూసుకున్నాడు చెరియన్. నిజమే. ఉంగరం పడిపోయింది! ‘‘ఒకటి కనుక్కున్నాను చెరియన్’’ అన్నాడు భగవాన్.. ఉంగరం ఇచ్చేశాక కూడా అక్కడి నుంచి కదలకుండా! మానవజన్మపై ప్రీతి అతడిని వదులుతున్నట్లు లేదు. ‘‘మనం తొందరపడినా, ఆలస్యం చేసినా.. బతుకును మాత్రం కోల్పోకూడదు.. కనీసం భార్యాబిడ్డల కోసమైనా. ఆ విషయం నాకు చనిపోయాక తెలిసింది’’ అని గాలిలోకి లేచాడు భగవాన్. లోపలికొచ్చాడు చెరియన్. భార్యాబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అవతలి వైపు భార్యాబిడ్డలు గుర్తొచ్చారు అతడికి. - మాధవ్ శింగరాజు -
ఆ రాష్ట్రాలకు అన్యాయం జరగదు
న్యూఢిల్లీ: జనాభాను సమర్థంగా నియంత్రించిన రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అన్యాయం జరగకుండా 15వ ఆర్థిక సంఘం తగిన విధానాన్ని అవలంబిస్తుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు. రాష్ట్రాలకు నిధులను కేటాయించేందుకు గత ఆర్థిక సంఘాల మాదిరి 1971 నాటి జనాభా లెక్కలను కాకుండా 15వ ఆర్థిక సంఘం 2011 నాటి జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటుండటం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలన్నీ జనాభాను సమర్థంగా నియంత్రించడం ద్వారా అభివృద్ధిలో ముందున్నాయనీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు నిధులు తగ్గి అన్యాయం జరుగుతుందని అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్ ప్రస్తావించారు. -
భూమిలేక.. భుక్తి దొరక్క
ఈ చిత్రంలోని రైతు ఎన్పీకుంటకు చెందిన మౌలాసాబ్(68). ఎన్పీకుంట పంచాయతీ పరిధిలో 10 ఎకరాల సాగుభూమి ఉండేది. అందులో బోరు వేసుకుని వేరుశనగతో పాటు పలు రకాల పంటలు పండించే వాడు. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం మౌలాసాబ్ 10 ఎకరబ్ను చంద్రబాబు సర్కారు బలవంతంగా లాక్కుంది. మొత్తం భూమికి రూ.లక్ష మాత్రమే ఇస్తామని చెప్పినా.. చివరకు అది కూడా ఇవ్వలేదు. పరిహారం అందక..బతికే మార్గం కనిపించక కుటుంబపోషణకు అప్పులు చేశాడు. రుణదాత ఒత్తిడి పెరగడంతో ఇల్లు విక్రయించి కొన్ని తీర్చాడు. ఇక బతికేదారి లేక ఏడాది క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి, కదిరి : ఎన్పీకుంట మండల కేంద్రంలో రూ. 12,500 కోట్లతో దేశంలోనే పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. మొత్తం 1,500 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసే బాధ్యతను ఎన్టీపీసీ సంస్థకు అప్పగించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్పీ కుంట పంచాయతీ పరిధిలో 2,079,38 ఎకరాలు, పి.కొత్తపల్లి పరిధిలో 5,094.87 ఎకరాలు కలిపి మొత్తంగా రెండు విడతల్లో 7,174.25 ఎకరాలను సేకరించారు. ఇందులో ప్రభుత్వ భూమి 4,581.84 ఎకరాలు, రైతు పట్టా భూమి 290.11 ఎకరాలు, అసైన్డ్ భూమి 2,302.30 ఎకరాలు ఉంది. ఇది కాకుండా మరో 1,840.77 ఎకరాల సాగుభూమిని సోలార్ ప్రాజెక్టు కోసం సర్కారు రైతుల నుంచి బలవంతంగా లాక్కుంది. న్యాయంగా లేని పరిహారం నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.40 లక్షలు నుంచి రూ. 50 లక్షలు దాకా ఇచ్చారు. కానీ ఎన్పీ కుంట రైతులకు మాత్రం ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. పట్టా భూమికి రూ.3 లక్షల నుంచి రూ.3.20 లక్షలు, అసైన్డ్ భూమికి రూ.2 లక్షల నుంచి రూ.2.10 లక్షలు చొప్పున మొత్తం 741 మంది రైతులకు రూ 44.44 కోట్లు చెల్లించింది. ఇంకా అసైన్డ్, పట్టా భూములు కోల్పోయిన 103 మంది రైతులకు రూ.6.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో పరిహారం పెండింగ్‌లో ఉంది. సాగురైతులు చేసుకున్న పాపమేంటి? తరతరాలుగా అక్కడ భూములు సాగుచేసుకుంటూ తెలిసో, తెలియకో వివిధ కారణాల వల్ల పట్టాలు పొందని 1,156 మంది రైతుల భూములను సోలార్ ప్రాజెక్టు కోసం బలవంతంగా లాక్కున్నారు. అయితే ఆ రైతులకు మాత్రం ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న ప్రతి రైతుకూ రూ.లక్ష మాత్రమే చెల్లిస్తామని అధికారులు చెప్పారు. చివరకు అది కూడా ఇవ్వలేదు. ఈ జాబితాలో అనర్హులున్నారంటూ నాలుగు రెవెన్యూ బృందాలు విచారించి 1,156 మందిలో 736 మందిని అర్హులుగా తేల్చారు. ఆ తొలగించిన జాబితాలో నిజంగా సాగుచేసుకుంటున్న రైతులు కూడా ఉన్నారన్న కారణంగా నాలుగేళ్లుగా పరిహారం చెల్లించకుండా నిలిపివేశారు. 26న మరోసారి సమావేశం కలెక్టర్ వీరపాండియన్ గత సోమవారం ‘మీకోసం’ కార్యక్రమంలో భాగంగా గాండ్లపెంటకు విచ్చేయగా...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి సిద్దారెడ్డితో పాటు ఇతర పార్టీల నాయకులు కలెక్టర్‌ను కలిసి సోలార్ బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్... ఈ నెల 26న జాయింట్ కలెక్టర్ డిల్లీరావు ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, రైతులంతా సహకరించాలని కోరారు. ఈసారైనా తమకు న్యాయం జరిగేనా అని సాగురైతులు ఎదురు చూస్తున్నారు. 750 మెగావాట్ల ఉత్పత్తికి టెండర్లు ఖరాలు రైతులందరికీ పరిహారం చెల్లించకముందే సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు. టాటా కంపెనీ 100 మెగావాట్లు, స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీ, ల్యాంకో, బీహెచ్ఈఎల్ కంపెనీలు 50 మెగావాట్లు చొప్పున మొత్తం 250 మెగావాట్ల విద్యుత్‌ను ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్నాయి. మరో 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. స్ప్రింగ్ ఎనర్జీ ప్రై.లిమిటెడ్ కంపెనీ, సాఫ్ట్బ్యాండ్ ఎనర్జీ ప్రై.లిమిటెడ్, అయాన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు 250 మెగావాట్లు చొప్పున 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి టెండర్లను దక్కించుకున్నాయి. జూలై 12వ తేదీ నుంచి ఈ రెండో విడత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. -
విభనలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది
-
‘కృష్ణా’లో రాష్ట్రానికి మళ్లీ అన్యాయమే?
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు మళ్లీ అన్యాయం జరగడం ఖాయంగా కనిపిస్తోంది! కృష్ణా జలాలపై విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకు తెలంగాణలోని పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా కేటాయింపులు పెంచాలన్న వినతిని కేంద్రం తిరస్కరించడం, బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల పాత వాటాయే ఈ ఏడాదీ కొనసాగుతుందని పేర్కొనడం రాష్ట్రానికి పెద్ద నష్టాన్నే తెచ్చిపెట్టనుంది. బచావత్ అవార్డుల ప్రకారమైనా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో ఎగువ తెలంగాణకు దక్కే నీటి వాటాలు తేల్చాలని కోరుతున్నా కుదరదన్న ధోరణి ప్రదర్శించడం రాష్ట్రానికి మింగుడు పడని అంశమే. జూన్ వర్షాలకు మరో రెండు నెలల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో కేంద్రంపై తెలంగాణ ఏ మేరకు ఒత్తిడి తెస్తుందన్నది కీలకంగా మారింది. పరీవాహకం ఎక్కువ ఉన్నా తక్కువ నీటి కేటాయింపు... రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం 68.5 శాతం, ఆయకట్టు 62.5 శాతం ఉంది. అయినప్పటికీ మొత్తం జలాల్లో 35 శాతమే తెలంగాణకు నీరు కేటాయించారు. ఏపీలో పరీవాహకం 31.5, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా 60 శాతానికి పైగా కేటాయింపులు జరిపారు. ఆ ప్రకారం మొత్తం 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీరు కేటాయించారు. పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా కేటాయింపులు పెరగాలని రాష్ట్రం ఎప్పటినుంచో కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. దీనికితోడు 1978లో గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే నాగార్జున సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఈ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, అలాగే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో మరో 45 టీఎంసీల వాటా ఇవ్వాలని కోరుతోంది. మొత్తంగా 575 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగిలిన 236 టీఎంసీలను ఏపీకి కేటాయించాలని అడుగుతున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడంలేదు. -
‘రిజర్వేషన్లలో ఎంబీసీలకు అన్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాలో కొన్ని కులాలకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని, అత్యంత వెనుకబడిన కులాలకు(ఎంబీసీ) అన్యాయం జరుగుతోందని ఆ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. కేంద్ర ఓబీసీ వర్గీకరణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రోహిణిని సంఘ ప్రతినిధులు సూర్యారావు, సత్యం, అంతయ్య తదితరులు బుధవారం ఢిల్లీలో కలసి ఎంబీసీలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. త్వరలోనే రెండు రాష్ట్రాల్లో పర్యటించి అత్యంత వెనుకబడిన కులాల స్థితిగతులపై అధ్యయనం చేసి వారికి న్యాయం చేస్తామని జస్టిస్ రోహిణి హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. -
‘చదువుకోవాలి’కి అన్యాయం జరిగింది
హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ‘చదువుకోవాలి’ చిత్రానికి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సినీవారం కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను రూపొందించిన ఎం. వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి దేశరాజు లలిత, కో డైరెక్టర్ సాయిశ్వేతను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ తరఫున సత్కరించి, అభినందించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘చదువుకోవాలి’ వంటి సందేశాత్మక చిత్రం వల్ల సమాజంలో మంచి మార్పులు వస్తాయి. పాత్రికేయునిగా అపార అనుభవం ఉన్న ఎం. వెంకటేశ్వరరావు సామాజిక బాధ్యతగా సినిమా తీయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘సినిమా తీసి ఐదేళ్లవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట విద్యార్థుల కోసం ఇంకా ప్రదర్శించబడుతోంది. విద్యపై చెతన్యంతో తీసిన సినిమా కావడమే ఇందుకు కారణం. ఐదు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన మా చిత్రానికి ఏపీ నంది అవార్డుల్లో అన్యాయం చేశారు’’ అన్నారు దర్శక నిర్మాత ఎం.వెంకటేశ్వరరావు. -
జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి
‘‘జీవితారాజశేఖర్గారంటే నాకు గౌరవం. ఆవిడ ‘నంది’ అవార్డుల ప్రకటన అవగానే బయటికొచ్చి ‘చంద్రబాబునాయుడుగారు రాకింగ్.. తెలుగుదేశం రాకింగ్’ అన్నారు. ‘మీరు తెలుగుదేశంలో చేరబోతున్నారా? అని కొందరు అడిగితే.. వాళ్లు చేరమంటే ఎందుకు చేరను? అని ఆమె అన్నట్టుగా కొన్ని పేపర్లలో నేను చదివాను. ఇది చదివాక ఆమెపై నాకు విశ్వసనీయత పోయింది. అది పోయినప్పుడు మనం వాళ్ల మాటలని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది’’ అని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నంది అవార్డులపై తన అభిప్రాయాలను చెప్పారు. వర్మగారిని నిందించడం తగదు దర్శకులు రామ్‌గోపాల్‌వర్మగారి మీద మరో దర్శకుడు మద్దినేని రమేశ్‌గారు చేసిన ఆరోపణలు, ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు సాటి దర్శకుడిగా బాధ కలిగించాయి. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన ఎందుకంత తీవ్ర పదజాలంతో వాడకూడని భాష వాడాల్సి వచ్చిందన్నదే నా బాధ. దాసరి నారాయణరావుగారి తర్వాత యువ దర్శకులందరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చారు వర్మ. ఆయనే మాకు స్ఫూర్తి అని ఈ రోజుకి కూడా కొత్త దర్శకులు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆయన్ను తీవ్ర పదజాలంతో మాట్లాడటం తగదు. దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని రమేశ్‌గారిని కోరుతున్నా. వర్మగారి మాటలు వ్యంగ్య బాణాల్లాంటివి. ఆయన మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. కానీ, మద్దినేని రమేశ్‌గారు ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఆయన వ్యంగ్య మాటల నుంచి కొన్ని రియలైజ్ అవ్వాలి, మరికొన్ని నవ్వి ఊరుకోవాలి తప్పితే ఇలా మాట్లాడకూడదు. ఆ మధ్య ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’ సినిమాలోని ఓ పాటలో ఆయన్ని ఆయనే విమర్శించుకుని మమ్మల్నీ తీవ్రంగా విమర్శించడంతో మేం నవ్వుకున్నాం. నా గురించి ఏం రాశారా? అని బోయపాటి శ్రీను తెలుసుకుని మరీ నవ్వుకున్నారట. వర్మలా ప్రశ్నించే వ్యక్తిని మనమెప్పుడూ దూషించకూడదు. మనం వాళ్లకీ, వీళ్లకీ భయపడుతుంటాం. కానీ, ఆయన కల్మషం లేకుండా మాట్లాడేస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఇక మాట్లాడకుండా చేయకూడదు. ఆయన లాంటోళ్లు మాట్లాడితే మంచిది. ఆర్కే లక్ష్మణ్‌గారు, కార్టూనిస్ట్ శ్రీధర్‌గారు, దర్శకుడు బాలాగారు.. వారివన్నీ వ్యంగ్యాస్త్రాలు. అవి హాని కలిగించేవి కావు. వాళ్ల ధోరణిలో సమాజాన్ని చూస్తుంటారు. మహామహులు దాన్ని స్పోర్టివ్‌గా తీసుకున్నారు. నా వెనక శక్తులేం లేవు! నిన్న, మొన్న చాలామంది అన్నారు. అస్సలు ఈ గుణశేఖర్ ఎవడు? ‘రుద్రమదేవి’ సినిమా రిలీజ్ అయి రెండు మూడేళ్లయింది. ఇప్పుడు మళ్లీ ట్యాక్స్ మినహాయింపు, నాకు అన్యాయం జరిగిందని అంటాడేంటి? అసలు తను దరఖాస్తు సరిగ్గా చేయలేదు. రిలీజ్ అయ్యాక చేశాడు. ముందే చేసుంటే పన్ను మినహాయింపు మా తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకివ్వదు? తప్పంతా ఆయనలోనే పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే ఆయన వెనక ఏమైనా శక్తులున్నాయా? అంటున్నారు. నా వెనుక శక్తులేమీ లేవు నేనొక్కడినే. జ్యూరీ సభ్యులు టి.ప్రసన్నకుమార్‌గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘రుద్రమదేవి’ విడుదలయ్యాక దరఖాస్తు చేశారని. నేను రిలీజ్‌కి ముందే అప్లై చేశాను. 2015 అక్టోబర్ 9న రిలీజ్. 7వ తేదీ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ ఉంటే తప్ప పన్ను మినహాయింపుకు దరఖాస్తు చేసుకోలేం. అక్టోబర్ 8న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు దరఖాస్తు చేశా. వాళ్లు ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. కానీ, ఏపీ స్పందించలేదు. 12న చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లంగారు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి ఒక నోటీస్ కూడా పంపించారు. నాకూ ఒక సీసీ పంపించారు. పన్ను మినహాయింపు కోసం ఒక స్క్రీనింగ్ కమిటీ వేసి పరిశీలించ మని ఆ నోటీస్‌లో ఉంది. కానీ, హైదరాబాద్ నుంచి ఆఫీసు విజయవాడకి సర్దుతున్నాం ఒక నెల ఆగమన్నారు. ఆ తర్వాత ఫైళ్లన్నీ సర్దుతున్నాం మరో నెల పడుతుందంటూ కాలయాపన చేశారు. మూణ్నెల్ల తర్వాత ఫైల్ క్లోజ్ చేయమని మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. షాక్ అయి, నేను దరఖాస్తు చేసిన, చీఫ్ సెక్రటరీగారు ఇచ్చిన కాపీలతో వైజాగ్ వెళ్లి మంత్రి అయ్యన్న పాత్రుడిని కలిశా. అజయ్ కల్లంగారిచ్చిన నోటీస్ చూసి, ‘ఆదేశాలున్నా ఎందుకు కమిటీ వేయలేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుందాం. నేను అమరావతికి వెళ్లినప్పుడు చెబుతాను నువ్వు కూడా రా’ అన్నారు. ఆ తర్వాత ఆయన్నుంచి నాకు కాల్ రాలేదు. నేనే ఫోన్ చేస్తే, లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ పెట్టినా స్పందించకపోవడంతో వదిలే శా. ఆ తర్వాత మంత్రి గంటా శ్రీనివాసరావుగారిని కలిశా. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చేందుకు అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ పెట్టారు. ఆ సమావేశంలోనే ‘రుద్రమదేవి’ సినిమా విషయాన్ని ప్రస్తావిస్తా అన్నారు. ఆ తర్వాత ఆయన్నుంచి కూడా రెస్పాన్స్ లేదు. దాదాపు 70–80 కోట్లతో ‘రుద్రమదేవి’ లాంటి చారిత్రాత్మక సినిమా నిర్మించాను కాబట్టి, ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తే, మంచి సపోర్ట్ అవుతుందని భావించా. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కదా.. ఏపీ కూడా ఇస్తే నాకు సపోర్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో నా వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేకుండా దరఖాస్తు చేశా. నాకు సమాధానం రాలేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా లేఖ రాశా. ఆయన్ని విమర్శించలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని వివరించా. ఆ నిబంధన తీసేయాలి నంది అవార్డుల విషయానికొస్తే ప్రతి సంవత్సరం విమర్శలుంటాయి. రానివాళ్లు అసంతృప్తి వెళ్లబుచ్చడం కరెక్టే. కానీ, ఈ ఏడాది.. మా అసంతృప్తిని వెళ్లగక్కడానికి కూడా వీలు లేకుండా ఓ నియమం పెట్టారు. అవార్డు రాకుంటే బహిరంగంగా విమర్శించకూడదనీ, అలా చేస్తే మరో మూడేళ్లు వారు దరఖాస్తు చేసుకోవడానికి కుదరదని దరఖాస్తులో పేర్కొనడం కరెక్ట్ కాదు. అందువల్ల బయటకి వచ్చి మాట్లాడాలంటే భయమేస్తోంది. మాలాంటి వాళ్లకి ఇప్పుడూ అవార్డులు రాక.. తర్వాత మరో మూడేళ్లు అవార్డులు రాకుంటే ఎలా సార్? అని అప్కమింVŠ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ నాతో అన్నారు. అడిగే హక్కు మాకు ఉంటుంది. ప్రతి సంవత్సరం విమర్శలు వస్తుంటాయి. నేను అవార్డు పొందినప్పుడు కూడా ఎవరో ఒక్కరు విమర్శించినవాళ్లే. ఎవరూ కూడా ఒక స్థాయికి మించి విమర్శించరు. ఓ స్థాయికి మించి విమర్శిస్తే సుమోటాగా స్వీకరించి చర్యలు తీసుకోవచ్చు. నాకు రాలేదు, ఎందుకు రాలేదు? అని ఎవరి హద్దులో వారు అడగొచ్చు. అది తప్పుకాదు? మెసేజ్ కనిపించలేదా? ‘రుద్రమదేవి’ సినిమా విడుదలైంది 2015లో. ఆ సంవత్సరం జ్యూరీ చైర్మన్ జీవితాగారు. మా విమర్శలను కొందరు మీడియా మిత్రులు ఆమె వద్ద ప్రస్తావించగా.. ఆవిడ స్పందించారు. ఉత్తమ చిత్రం విభాగంలో ‘బాహుబలి’తో ‘రుద్రమదేవి’ అన్ని విభాగాల్లో పోటీ పడలేకపోయింది. అందువల్ల ‘బాహుబలి’కి ఇచ్చాం అన్నారామె. పోటీ పడ్డప్పుడు ఉత్తమ చిత్రంగా రాకపోతే ఆ పోటీ పడ్డ సినిమా రన్నరప్ కింద అవుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం అవుతుంది కదా అని కొందరంటే.. జ్యూరీ కన్సిడర్ చేయడానికి కూడా చాలా గట్టి పోటీ ఉందని చెప్పారట. అంటే.. జ్యూరీలో ఉన్న సినిమాలకి కూడా మీరు తీసిన చారిత్రాత్మక చిత్రం పోటీ పడలేకపోయిందా? సార్ అని కొందరు నాతో అన్నారు. దర్శకత్వం విభాగంలో పోటీ పడలేదంటే డైరెక్టర్‌గా రాదు. టోటల్ సినిమాలో సమాజానికి మేలు చేసే ఒక మెసేజ్ ఉంది అనుకున్నప్పుడు కచ్చితంగా ఉత్తమ మూడు చిత్రాల విభాగంలో ఏదో ఒకటి ఇస్తారు. దీనికంటే వేరే సినిమాలు గొప్ప మెసేజ్ ఇస్తున్నాయంటే కనీసం జ్యూరీ కింద ఇస్తారు. మరి ‘రుద్రమదేవి’ కంటే మిగతా సినిమాల్లో ఏం సందేశం కనిపించిందో తెలియడం లేదు. జ్యూరీ బాధ్యతగా వ్యవహరించాలి. ఎక్కువ మంది సినిమావాళ్లనే పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. రాజకీయ లబ్ధి పొందేవారు అస్సలు ఉండకూడదు. అవార్డులు ప్రకటించి బయటికొచ్చి ఓ ప్రభుత్వాన్ని జీవితగారు మెచ్చుకున్నారంటే.. ఏదో రాజకీయ లబ్ధి ఆశించే అనుకుంటారు. రాజకీయ ప్రయోజనాల కోసం కళాభిమానుల కష్టాన్ని పణంగా పెట్టొద్దని విన్నవించుకుంటున్నా.అల్లు అర్జున్ విషయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్లై చేశారని చెప్పారు. సహాయ నటుడిగానే దరఖాస్తు చేశా. సహాయ నటుడిగానే అప్లయ్ చేసినా, ఎస్వీ రంగారావు పేరు మీద ఉంది కదా అని క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇచ్చాం అన్నారు. మేం ఏ కేటగిరీకి దరఖాస్తు చేశామో దాన్ని వారు మార్చడానికి లేదు. రంగారావుగారి పేరు మీద ఉంది కదా అని క్యారెక్టర్ ఆర్టిస్టు అవార్డు ఇచ్చామంటే సహాయ నటుడి అవార్డుని తగ్గించినట్లవుతుంది కదా? ఇప్పుడు చాలామంది జాతీయ అవార్డులని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. జాతీయ అవార్డు గైడ్‌లైన్స్ వేరు.. నంది అవార్డు గైడ్‌లైన్స్ వేరు. మనకి మన ప్రాంతీయత, సంస్కృతిపైన ఆధారపడి ఉంటాయి. అలా ‘రుద్రమదేవి’ విషయానికొస్తే.. కొన్నింటిలో వాళ్లకి కన్వీనెంట్‌గా ఉన్నవి జాతీయ అవార్డులతో కంపేర్ చేసుకుంటున్నారు. కన్వీనెంట్‌గా లేనివి మనది వేరు కదా అంటున్నారు. ‘రుద్రమదేవి’కి జాతీయ అవార్డులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం రానందుకు నాకు ఏమాత్రం అసంతృప్తి లేదు. ‘కంచె’ సినిమాకి ఇచ్చారు. ఆ సినిమా నా దృష్టిలో ‘రుద్రమదేవి’ కంటే గొప్ప సందేశం ఇచ్చిన సినిమా. అది కుల వ్యవస్థ మీద పోరాడే, ప్రశ్నించే సినిమా. ‘కంచె’కి అవార్డు రావడంతో తొలుత షాక్ అయ్యా. కథ విన్నాక కరెక్టే అనిపించింది. ‘రుద్రమదేవి’లో తెలుగువారు మరచిపోతున్న చరిత్రను చూపించా. దర్శకత్వమో, మరొకటో నాసిరకంగా కనిపించి ఉండవచ్చు. కానీ, సినిమా ఇచ్చిన సందేశం అందలేదా? అందువల్ల నేను అప్సెట్ అయ్యానే కానీ, ఉత్తమ దర్శకుడి అవార్డు రాలేదనే బాధ లేదు. ‘బాహుబలి’ బెటర్ సినిమానే. రాజమౌళికి అవార్డు ఇచ్చినందకు హ్యాపీ. కానీ, ‘రుద్రమ దేవి’లో సందేశం లేదా? సాటి మహిళ జ్యూరీలో ఉండి కూడా మహిళా సాధికారత మీద తీసిన సినిమాకి న్యాయం జరగలేదంటే ఏమనాలి? ఇండియా కాదు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ అన్నది మేల్ డామినేషన్. అలాంటిది 70–80 కోట్లు పెట్టి ఓ మహిళ మీద సినిమా తీశాడే. చెడగొట్టాడే. అయినా వీడి సందేశం బాగుందే. ప్రయత్నాన్ని చిన్నగా తట్టి ప్రోత్సహిద్దామనుకుంటే నాకు లక్షలు వచ్చేయవు కదా? పన్ను మినహాయింపు గురించి నేనిప్పుడు మాట్లాడింది కూడా అది తిరిగి ఇచ్చేస్తారని కాదు. అది సమాధి అయిపోయింది. కానీ, నాకు జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి. -
ఇష్టమొచ్చినట్లు అవార్డులిస్తే సినిమాలు తీయడమెందుకు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించిన విధానం, జ్యూరీ తంతు చూస్తుంటే వార్ వన్‌సైడ్ అన్నట్లే కనిపిస్తోంది. మంచి సినిమాలకు అన్యాయం జరిగిందనే బాధ కలిగింది. మూడేళ్ల అవార్డులు ప్రకటించిన తీరు చూస్తుంటే ముందుగా ఎంపిక చేసిన సినిమాల లిస్టును ముఖ్యమంత్రికి సమర్పించినట్లు అర్థమవుతోంది’’ అని నిర్మాత చంటి అడ్డాల విమర్శించారు. ఇంకా మాట్లాడుతూ –‘‘మనం’ వంటి కుటుంబ కథాచిత్రం, ‘రుద్రమదేవి’ వంటి చారిత్రాత్మక సినిమా, ‘రేసుగుర్రం’ లాంటి కమర్షియల్ సినిమాతో పాటు ఎన్నో హిట్ సినిమాలున్నాయి. అవార్డు తీసుకునే అర్హత వీటిలో దేనికీ లేదా? ‘సెలక్షన్ కమిటీ మన చేతిలో ఉంది కదా’ అని ఇష్టమొచ్చిన సినిమాలను ఎంపిక చేసి అవార్డులిచ్చేస్తే సినిమాలు తీయడమెందుకు? అవార్డుల ఎంపిక సమయంలో జ్యూరీలో తెలిసిన వ్యక్తిగానీ, ప్రభుత్వ పరిచయాలుగానీ, రెకమెండేషన్‌గానీ ఉండాలా? అనిపిస్తోంది. ఇకపైనా ఇలాగే కొనసాగితే నంది అవార్డు వృథా అనుకోవచ్చు. అప్పట్లో నేను చేసిన ‘ప్రేమ’ (2002) సినిమాకి నంది అవార్డు వచ్చిందని కెమెరామేన్ ఎస్. గోపాల్‌రెడ్డి ఫోన్లో చెప్పారు. కానీ, మరుసటి రోజు ఆ లిస్టులో మా సినిమా లేదు. రికమెండేషన్ ఉందని మరో సినిమాకి ఇచ్చారు. ఇక్కడ వ్యక్తిగత కాంపౌండ్లు ఉండకూడదు. ఉన్నది ఒక్కటే... అదీ సినిమా కాంపౌండ్’’ అన్నారు. -
ఇదేమి గ్రామస్వరాజ్యం ?
► పేరుకే పదవి ... పెత్తనం టీడీపీ నేతదే ► గిరిజన సర్పంచ్‌కు అన్యాయం ► నేటికీ కొనసాగుతున్న వివక్ష నిమ్నజాతికి ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వావలంబన కోసం రూపొందించిన చట్టాన్ని కూడా పెత్తందారు చుట్టంగా మార్చుకున్నారు. అతడిని ఎదిరించే సాహసం చేయలేక దీనస్థితిలో ఉన్న ఓ గిరిజన మహిళా ప్రజాప్రతినిధి దయనీయ గాథ అందుకు నిదర్శనమవుతోంది. రేణిగుంట: గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యంలో ఓ సర్పంచ్ అధికారాన్ని మరో నాయకుడు చెలాయిస్తున్నారు. రిజర్వేషన్ కేటగిరిలో గెలిచిన గిరిజన మహిళ పేరుకు సర్పంచ్ అయినా పెత్తనం మాత్రం ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేత చెలాయిస్తున్నాడు. రేణిగుంట మండలంలోని గురవరాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన శ్రీను భార్య లక్ష్మమ్మ 2013 లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలు పొందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె ఆ నాయకుని కన్నుసన్నల్లోనే రబ్బ రు స్టాంపు పాత్రను పోషిస్తోంది. లక్ష్మమ్మ సర్పంచ్ అయిన ఏడాదికే భర్త శ్రీను మృతి చెందడంతో రాజం పేట సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి చేరుకుని అక్కడే జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో, మండల కార్యాలయంలో ఏవైనా సమావేశాలుంటే వచ్చి వెళుతున్నారు. గ్రామంలో పంచాయతీకి నిధులు ఎంత వస్తున్నాయో ఆమెకు సమాచారం ఉండదు... ఏయే అభివృద్ధి పనులు చేస్తున్నారో తెలపరు. సర్పంచ్ గౌరవ వేతనం కూడా ఆ నాయకుడే తీసుకుంటూ ఆమె కుటుం బ అవసరాలకు అన్నట్లు నెలనెలా రూ.5 వేలు ఇస్తున్నా డు. సర్పంచ్ ఎవరని గ్రామంలో ఎవరైనా అడిగితే అత ని వైపు వేలు చూపుతున్న పరిస్థితి. సర్పంచ్ లక్ష్మమ్మ కదా అంటే ... ఆశ్చర్యంగా చూస్తారు. గ్రామంలో నిధులు ఏ మేరకు సద్వినియోగమవుతున్నాయో ఆమెకు తెలియదు. సొంత గూడులేని దౌర్భాగ్యం సొంత ఇల్లు కూడా లేని దయనీయ స్థితి లక్ష్మమ్మది. ఆమె కు కాలనీలో పక్కాగృహం కట్టించేందుకు టీడీపీ నేత హా మీ ఇచ్చినా, అది ఇప్పటికీ పునాదులకే పరిమితమైంది. సొంత ఇల్లు ఉంటే అంత దూరం వెళ్లి బతకాల్సిన ఖర్మ ఏ మిటని ఆమె దీనంగా ప్రశ్నిస్తున్నారు. అనధికారిక సర్పంచ్‌గా గ్రామపాలన సాగిస్తున్న టీడీపీ నేత నిధులు కాజేసే అ వకాశం ఉంది. ముందుగానే సర్పంచ్ వద్ద చెక్ పుస్తకాలపై సంతకాలు తీసుకుని బిల్లలు మంజూరైనప్పుడు డ్రా చేసుకుంటారనే ఆరోపణ ఉంది. భవిష్యత్తులో ఏవైనా అవకతవకలు జరిగితే మాత్రం సర్పంచ్ లక్ష్మమ్మపైనే చర్యలు తీసుకునే అధికార యంత్రాంగం మాత్రం ప్రస్తుతంఆమెకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదు. -
కంచే చేనును మేస్తే?
న్యాయ నియామకాలలోని, న్యాయ వితరణలోని అన్యాయాల గురించిన ఫిర్యాదులను, ఫిర్యాదుదారుల బాధలను, కష్టాలను వినే విధానమే లేని పాలనాపరమైన తీవ్ర లోపాల అన్యాయాలను నిలదీసి అడిగేవాడే లేడా? మన న్యాయవ్యవస్థపైన ఫిర్యాదులను, దాని చర్య లవల్ల కలిగే కష్టాలపైన విన్నపాలను, ఫలానా సౌక ర్యం లేదని చెప్పుకునే మహజర్లను స్వీకరించి, అందుకున్నామని రసీదు ఇచ్చి, ఫలానా కాలపరిమి తిలోగా ఆ విషయాన్ని వింటామని అభయమిచ్చి... అలాగే విని వాటిని తిరస్కరించామనో, పరిష్కరిస్తామనో చెప్పే విధా నంగానీ, ప్రక్రియగానీ, యంత్రాంగంగానీ మనకు లేదు. మన సుపరిపాలనలో ఇదొక అద్భుతం. మన న్యాయమంత్రిత్వ శాఖకు వెల్లువెత్తే ఫిర్యాదులలో కోర్టుల్లో అవినీతి గురించి 15 శాతం, అసమంజ çసమైన తీర్పులని 10 శాతం, తీర్పులు ఇవ్వడంలో ఆలస్యం గురించి 47 శాతం ఫిర్యాదులు వచ్చాయి. ఇతర అన్ని విభాగాల్లో ఉన్నట్టుగా, న్యాయవ్యవ స్థలో కష్టాలు చెప్పుకునే విధానం, ఫిర్యాదులు విని పరిష్కరించే విధానం దాదాపు మృగ్యం కావడం తీవ్ర లోపమని ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వం తమకు వచ్చిన ఫిర్యాదులను న్యాయవ్యవస్థకు పంపుతూ ఉంటుంది. కాని వాటికి ప్రతిస్పందన చాలా అరుదు. ఫిర్యాదుదారుల బాధలను పరిష్క రించకపోయినా, వారి ఫిర్యాదులను పరిశీలించి పలానా కారణాల వల్ల మీ దరఖాస్తు చెత్తబుట్టలో వేస్తున్నామని చెప్పే దిక్కు కూడా లేకపోతే ఎట్లా? ఇదేనా న్యాయం? సుప్రీంకోర్టులో కూడా ఇటువంటి వ్యవస్థ ఉండాలి కదా. జడ్జిల నియామక ప్రక్రియపై తెరలు పూర్తిగా తొలగించడాన్ని జస్టిస్ మదన్ బి లోకుర్ వ్యతిరేకించారు. అంతా బయట పెడితే కొందరు న్యాయ మూర్తులపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలు వారి భవి ష్యత్తును దెబ్బతీస్తాయని, ఆ పదవికి పరిశీలనదాకా వచ్చిన వ్యక్తుల ప్రైవసీని కొంతైనా కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, నియామకాల గురించి బయటకు ఏమీ పొక్క కుండా ఉండే గట్టి తెరలున్నాయనీ, ఇందువల్ల పలుకుబడి ఉన్నవారికే రాజ్యాంగ న్యాయస్థానాల పదవులు దక్కే లాబీయింగ్‌కు ఆస్కారం ఏర్పడిం దని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. జస్టిస్ కురియన్, కొలీజియం నియంతృత్వంగా వ్యవహరించే వీలుం దన్నారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) కేసు విచారణ జరు గుతుండగా... మాథ్యూ నెడుంపర అనే వ్యక్తి కొలీ జియం ద్వారా జడ్జిల పుత్రరత్నాలకు, పెద్ద న్యాయ వాదుల సుపుత్రులకు అవకాశాలు మెండుగా దక్కి, అర్హులై ఆసక్తి ఉన్నవారికి జడ్జిలుగా దరఖాస్తు పెట్టు కునే అవకాశం కూడా దక్కలేదని వాదించారు. బంధుప్రీతిని పెంచిపోషించే విధానాలను తొలగించేందుకే ఎన్‌జేఏసీని ప్రభుత్వం ప్రతి పాదించింది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు స్వయంగా ప్రమాణ పత్రాలలో తమ వివరాలు ప్రక టించిన రీతిలో జడ్జిలు కూడా ఆర్టికల్ 124(6) కింద తమ వ్యక్తిగత ఆస్తిపాస్తులు తదితర వివ రాలను ప్రమాణ పూర్వకంగా ప్రకటించాలని, అవా స్తవాలు చెబితే మహాభియోగం ద్వారా కాకుండా సులభరీతిలో జడ్జిలను తొలగించే వీలుండాలని పౌరసమాజం నుంచి ఒక సూచన వచ్చింది. వినే వారెవరయినా ఉన్నారా? తెలుసుకునే హక్కులాగే ప్రైవసీ హక్కు కూడా జీవించే హక్కులో భాగమే తప్ప ప్రాథమిక హక్కు కాదని జస్టిస్ లోకుర్ అన్నారు. కనుక పార దర్శకతకు, గోప్యతకు మధ్య సరైన సమతుల్యం ఉండాలన్నారు. ఎన్‌జేఏసీలో పూర్తి పారదర్శకత ఉంటుందని సమతుల్యం లేనట్టేననీ అన్నారు. అసలు కొలీజియంలో ఏం జరిగిందో ఎవరూ తెలు సుకునే వీల్లేదని, జనానికే కాదు చరిత్రకు కూడా ఆ వివరాలు అందబోవని, జడ్జిలుగా నియమితులైనా ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయిన దురదృష్ట వంతులకు కూడా రికార్డులు దొరకవని చలమేశ్వర్ తమ తీర్పులో వివరించారు. ఇటువంటి వ్యవస్థ ప్రజల్లో విశ్వాసం పెంచడం, ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. కొలీజి యంలో సర్వసమ్మతి ఉంటే ‘నీకది నాకిది’ అనే ఏర్పాటుకు దారి తీస్తుందనీ, అందువల్ల అన్యాయ మైన నియామకాలు జరిగి, న్యాయార్థుల పట్ల ప్రమాదకరమైన ప్రమాణాలను పాటించడం జరిగి న్యాయవ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆందోళన చెందారు. అంతేకాదు, లాబీయింగ్ వల్ల భజన సంస్కృతి పెరిగిపోయి న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిం చారు. అర్హులను వదిలేసి, సొంత కారణాలమీద, సామాజిక జాతీయ వాస్తవాలకు సంబంధం లేకుండా కొందరిని నియమించడం, మరికొందరి నియామకాన్ని కావాలని జాప్యం చేయడం, కొంద రికే ప్రయోజనం చేకూర్చడం, అనుయాయులు కాని వారికి అవకాశాలను దూరం చేయడం, అంతేవాసు లను ఆదరించడం... ప్రతిభలేని వారి నియామకా లకు దారితీస్తున్నాయని జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. అయితే నియామకాధికారాలను రాజకీయ నాయకులతో పంచుకోవడం వివేకవంతమైన చర్య అనడంలో ఇబ్బందులున్నాయని ప్రధాన న్యాయ మూర్తి జేఎస్ కేహార్ అన్నారు. భారతదేశంలో పౌర సమాజం తగినంతగా పరిపక్వత చెందలేదని, కనుక న్యాయమూర్తుల నియామకంలో ఏవైనా లోపాలు జరిగితే అవి దేశాన్ని సంక్షోభంలోకి పడదోస్తాయని ఆందోళన చెందారు. అయితే ఇప్పటి నియామక విధానాల్లో జడ్జిలయిన వారు ఏ విధంగా సంక్షోభం సృష్టిస్తున్నారో మనకు దృష్టాంతాలు కనిపిస్తూనే ఉన్నాయి. న్యాయ నియామకాలలోని అన్యా యాలు, న్యాయ వితరణలోని అన్యాయాల గురిం చిన ఫిర్యాదులను, ఫిర్యాదుదారుల బాధలను, కష్టాలను వినే విధానమే లేని పాలనాపరమైన తీవ్ర లోపాల అన్యాయాలను నిలదీసి అడిగేవాడే లేడా? (సుభాష్ చంద్ర అగర్వాల్ వర్సెస్ న్యాయ మంత్రిత్వ శాఖ, ఇఐఇ/VS/A/2014/000989– Sఅ కేసులో 3.5.2017 సీఈసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
ఆ నిధులు అయిన వారికే..!
► నిధుల కేటాయింపులో నియంతృత్వం ► వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు అన్యాయం ► అధికార పార్టీ ఎమ్మెల్యేలకే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ► మెజార్టీ ఎమ్మెల్యేలకు రెండు విడతలుగా రూ. 4కోట్లు చొప్పున మంజూరు ► తెలుగు తమ్ముళ్లకు ప్రయోజనంగా మారిన పనులు ► ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట ఓడిపోయిన పాలకపక్ష నేతలకు అవకాశం పథకాల అర్థాలు మారిపోతున్నాయి... నిబంధనలు అపహాస్యమవుతున్నాయి... ప్రజాస్వామ్యం పరిహాసమైంది. చట్టాల అమలు మొత్తం ప్రహసనంగా మారుతోంది. రాష్ట్రంలో పాలన అంతా ఏకపక్షంగా సాగుతోంది. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంటే పథకాలు రద్దు చేస్తున్నారు. నిబంధనల మేరకు అందరికీ అందాల్సిన నిధులు కొందరికే అందిస్తున్నారు. ప్రజలచే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రతిపక్షంవారైతే... అభివృద్ధి పనులు... నిధులు మంజూరు కావడంలేదు. చట్టాలను సైతం తమ ఇష్టానుసారం మార్చేసి... ఏకపక్ష నిర్ణయాలతో సాగుతున్న పాలన వల్ల జనం అవస్థలపాలవుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పథకం కాస్తా రద్దు చేశారు. ప్రత్యేక అభివృద్ధినిధులు పాలకపక్ష ఎమ్మెల్యేలకు మాత్రమే కేటాయించి... ప్రతిపక్షం ప్రాతినిధ్యం ఉన్నచోట వేరేవారికి అందజేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: శాసనసభ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధిపనులకు సాధారణంగా నియోజకవర్గ అభివృద్ధి పథకం(సీడీపీ) నిధులు మంజూరయ్యేవి. ఎమ్మెల్యేలు తమ కోటా ద్వారా వచ్చే నిధులను అవసరాల మేరకు ఖర్చు పెట్టేవారు. అధికార, ప్రతిపక్షం అని తేడా లేకుండా గతంలో ఉన్న ప్రభుత్వాలు వాటిని అమలు చేసేవి. కానీ చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విధానానికి స్వస్తి పలికారు. అందరికీ నిధులు ఇవ్వడం ఇష్టం లేక సీడీపీకి మంగళం పాడేశారు. దీనివల్ల ఎమ్మెల్యేలకు సొంతంగా రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. వాటి స్థానంలో తమ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) పేరుతో నిధులు విడుదల చేస్తున్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌పై సీఎంకు పూర్తి విచక్షణాధికారం ఉంది. వాటిని ఎలాగైనా ఖర్చు పెట్టొచ్చు. ఇప్పుడా నిధులను తమ ఎమ్మెల్యేలకు పంచి పెడుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాత్రం మొండి చేయి చూపుతున్నారు. ఒక్కో ఏడాదికి రూ. రెండేసి కోట్లు చొప్పున తమ ఎమ్మెల్యేలకు కేటాయిస్తున్నారు. జిల్లాలో పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి రెండు విడతలుగా రూ. 4కోట్లు వంతున విడుదల చేశారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీతకు మాత్రం రూ. రెండేసి కోట్లు చొప్పున విడుదల చేశారు. వీరికి కూడా రెండో విడతగా రూ. రెండు కోట్లు చొప్పున విడుదల చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చిల్లి గివ్వ కూడా విడుదల చేయకుండా నియంతృత్వ పోకడను చాటుకుంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయిన నేతలకు పెద్దపీట ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయిన నేతలకు ఇప్పటికే ప్రాధాన్యం ఇచ్చారు. సంక్షేమ పథకాలన్నీ ప్రజలచే ఎన్నికైన ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో కాకుండా ఓడిపోయిన తమ పార్టీ నేతల చేత మంజూరు చేయిస్తున్నారు. రుణాలు, ఇళ్లు, రేషన్‌కార్డులు, పింఛన్లు... ఇలా ప్రతీదానికీ వారి ద్వారానే లబ్ధిదారుల ఎంపిక చేయిస్తున్నారు. ఇప్పుడీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌ను కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయిన నేతల పేరుతో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పనుల ప్రతిపాదిత జాబితాను తీసుకున్నట్టు సమాచారం. ఆ జాబితాల ప్రకారం నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. అనుకూలంగా పనుల పందేరం మంజూరైన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌తో చేపట్టే పనులు ప్రతిపాదనల దగ్గరి నుంచి అంచనాలు రూపొందించేవరకు పాలకపక్ష ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. వారు ఏ జాబితాలైతే ఇచ్చారో వాటికే అధికారులు పచ్చజెండా ఊపారు. ఇదే అదనుగా నాయకులు సైతం సొంత లాభం లేనిదే ముందుకెళ్లకూడదనే దోరణికి వెళ్లిపోయారు. ప్రతీదానిలో స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. వచ్చిందే అవకాశమని స్పెషల్‌డెవలప్‌మెంట్ ఫండ్ పనులను టెండర్ల వరకు వెళ్లనీయకుండా తమకు లబ్ధి చేకూరేలా ముక్కలు ముక్కలుగా చేసి చేపడుతున్నారు. అత్యధిక పనుల విలువ సరాసరి రూ. 10లక్షలకు లోబడి ఉండేలా చూసుకుంటున్నారు. నిబంధనల మేరకైతే రూ. 10లక్షలు పైబడి పనులకు టెండర్లు పిలవాలి. వాటి ద్వారా పారదర్శకత పెరగనుంది. అలా చేస్తే తమకు పనులు దక్కవన్న భయంతో రూ. 10లక్షల లోబడి పనుల్నే ఎంపిక చేసి, నామినేటేడ్ పద్ధతిలో కట్టబెడుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు లబ్ధిపొందుతున్నారు. ప్రతిపాదించిన పనుల్లో దాదాపు సీసీ రోడ్లు, డ్రైనేజీలే ఎక్కువగా ఉన్నాయి. ఇవైతేనే గిట్టుబాటు అవుతాయన్న ఉద్దేశంతో జోరుగా ప్రతిపాదిస్తున్నారు.