సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై పోరాటం చేయాలనిపిస్తుంది. కానీ ఇంట్లో వారు, బంధువులు ఎవరికీ లేని బాధ మీకెందుకు? అంటూ నాపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏమీ చేయలేక ఓ పిరికిపందలా ఒంటరిగా జీవిస్తున్నా’ అని సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఎం.మోహన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అవయవ దాతల పిల్లలకు తన విద్యా సంస్థలో ఉచిత విద్యనందిస్తానని ప్రకటించారు. వ ందేళ్లు కూడా బతుకుతామో లేదో తెలియదు. కానీ కొంతమంది వెయ్యేళ్లకు సరిపడినంత సంపాదిస్తున్నారు. దీని కోసం అక్రమాలకు, భూకబ్జాలకు పాల్పడుతూ పేదల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. ప్రపంచ అవయవ దానం దినోత్సవాన్ని పురస్కరించుకుని అవయవ దాతల కుటుంబ సభ్యులను గురువారం కిమ్స్‌లో సన్మానించారు.