న్యూఢిల్లీ: దేశంలో అడుగడుగునా జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకు ‘ఇన్సాఫ్’అనే వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ లాయర్, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించారు. తన ప్రయత్నానికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, నేతలు సహా ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు.
దేశంలో పౌరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం అధికారంలో ఉందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీని సంస్కరించడమే తప్ప, విమర్శించడం తమ ఉద్దేశం కాదని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం సమకూరాలని రాజ్యాంగం చెబుతున్నా, అన్ని చోట్లా అన్యాయమే జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment