
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ దేశంలో జరిగే అన్యాయాలపై పోరాటానికి ఏర్పాటు చేసిన ‘ఇన్సాఫ్ కె సిపాహి’వేదికకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ‘సిబల్ ప్రకటించిన ఇన్సాఫ్ సిపాహి చాలా ముఖ్యమైంది.
అన్యాయంపై కలిసికట్టుగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ఇందులో చేరాలి’అని ఆదివారం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘ఇన్సాఫ్’కు శివసేన ఉద్ధవ్ వర్గం, ఆర్‌జేడీ చీఫ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మద్దతు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment