Delhi CM Arvind Kejriwal
-
Supreme Court: బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిలు పిటిషన్‌పై విచారణలో భాగంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వి, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. తొలుత ఎస్వీ రాజు వాదనలు ప్రారంభిస్తూ... ఈ అంశాన్ని తొలుత ట్రయల్ కోర్టు విచారించాలని కోరారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల బెయిల్ ప్రస్తావన తీసుకొస్తూ....బెయిల్ మంజూరుకు ట్రయల్ కోర్టుకు వెళ్లమనడం సరికాదని సింఘ్వి పేర్కొన్నారు. బెయిల్ కోసం మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడం వైకుంఠపాళి ఆటలా ఉంటుందని సిసోడియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై ఎస్వీ రాజు అభ్యంతరం చెబుతూ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లి మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారని కేజ్రీవాల్ కూడా పద్ధతి ప్రకారం వ్యవహరించాల్సిందేనని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టును బైపాస్ చేయడం కేవలం ప్రత్యేక పరిస్థితుల్లోనే జరుగుతుందని ఇక్కడ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం తప్ప ఇంకేం లేదని రాజు తెలిపారు. బెయిల్ కోసం కేజ్రీవాల్ నేరుగా హైకోర్టుకు వెళ్లారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, సీబీఐ వైకుంఠపాళి ఆట ఆడాలని చూస్తోందని సింఘ్వి ఆరోపించారు. సుప్రీంకోర్టు ఒకవేళ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తే.. అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు నైతికస్థైర్యాన్ని అది దెబ్బతీస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అన్నారు. ‘అలా అనకండి. బెయిల్ ఇస్తే హైకోర్టును తక్కువ చేసినట్లు కాదు. ఎలాంటి ఆదేశాలు జారీచేసినా హైకోర్టుకు భంగం కలగనివ్వం’ అని ధర్మాసనం రాజుకు హామీ ఇచ్చింది. అనంతరం తీర్పు రిజర్వుచేస్తున్నట్లు ప్రకటించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటున్నారు
న్యూఢిల్లీ: తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. వైద్యులు సూచించిన మందులను కూడా ఆయన వాడకపోవచ్చని పేర్కొన్నారు. తీహార్ జైలు సూపరింటెండెంట్ నివేదికను ప్రస్తావిస్తూ ఎల్జీ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌కు లేఖ రాసినట్లు రాజ్‌భవన్ వర్గాలు శనివారం తెలిపాయి. కేజ్రీవాల్‌కు ఇంటి వద్ద నుంచి వచ్చిన ఆహారాన్ని సరిపోను అందజేస్తున్నా కూడా ఆయన కావాలనే తక్కువ కేలరీలున్న ఆహారం తింటున్నట్లుగా ఆధారాలున్నాయన్నారు. గ్లూకో మీటర్ టెస్ట్ రీడింగ్‌కు, కంటిన్యువస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టం రీడింగ్‌కు మధ్య కనిపిస్తున్న భారీ వ్యత్యాసంపై అధికారులు పరిశీలన జరపాలని సూచించారు.ఎల్జీ వైద్యుడనే విషయం తెలియదుఎల్జీ వీకే సక్సేనా రాసిన లేఖపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ.. నాకు తెలిసినంత మటుకు ఆయన గతంలో సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వారు. వీకే సక్సేనా డాక్టర్ అని, ఆరోగ్య అంశాల్లో మంచి నిపుణుడనే విషయం నాకు తెలియదు. ఎప్పుడైనా ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌ను చదివి ఉండేవాళ్లం’ అంటూ ఎద్దేవా చేశారు. తమ నేతను చంపేందుకు బీజేపీ దుర్మార్గపు పథకం పన్నిందని ఆరోపించారు. -
Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని కావాలన్న ఆశ తనకు అస్సలు లేదని ఆప్ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే ఇండియా కూటమి గెలిస్తే న్యాయ వ్యవస్థను ఒత్తిళ్ల నుంచి విముక్తం చేస్తామన్నారు. తన భార్య సునీతకు రాజకీయాలు నచ్చవని వెల్లడించారు. బెయిల్‌పై విడుదలయ్యాక బుధవారం ఆయన తొలిసారి పీటీఐ వీడియోస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సొంత రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌పై తన ఇంట్లోనే పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన ఉదంతంపై కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే... నియంతృత్వాన్ని నిలువరిస్తాం ‘‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే విపక్ష నేతలందర్నీ కట్టగట్టి జైలుకు పంపుతుంది. ఎన్నికలను హైజాక్ చేస్తుంది. రష్యా మాదిరే ఏకపక్ష ఎన్నికలుంటాయి. అక్కడ పుతిన్ విపక్ష నేతల్ని జైలుకు, కొందర్ని పైకి పంపారు. అందుకే తాజా ఎన్నికల్లో 87 శాతం ఓట్లు సాధించారు. పాకిస్థాన్‌లోనూ అంతే. ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపారు. సొంత పార్టీ గుర్తును కూడా ఎన్నికల్లో వాడుకోనివ్వలేదు. బీజేపీ మళ్లీ గెలిస్తే ఎవ్వరినీ వదలదు. కానీ మోదీ నియంతృత్వ పాలనను నిలువరిస్తాం. ఇండియా కూటమి 300 మార్కు దాటుతుంది. చక్కటి, సుస్థిర ప్రజాపాలన సాగిస్తాం. నాకు ప్రధాని కావాలనే ఆలోచనే లేదు. మాది (ఆప్) చాలా చిన్న పార్టీ. కేవలం 22 చోట్ల పోటీ చేస్తున్నాం. ప్రధానిగా రాహుల్‌ను నేను అంగీకరిస్తానా అన్నది ఊహాజనిత ప్రశ్న. అలాంటి అంశాలు చర్చకే గెలిచాక అందరం కలిసి కూర్చొని దీనిపై చర్చిస్తాం. సానుకూల పవనాలు ఊహించిందే ఆప్ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు సాధించింది. ఈసారి ఆప్–ఇండియా కూటమికి సానుకూల పవనాలు వీయడంలో ఆశ్చర్యమేమీ లేదు. నన్ను అరెస్టు చేయడంతో ఢిల్లీ ఓటర్లు భావోద్వేగానికి గురయ్యారు. ఆ ప్రజాగ్రహం బీజేపీ ఓటమికి కారణం కాబోతోంది. నాకు బెయిల్ దొరకడం నిజంగా దేవుడి మాయ. నన్ను జైలుకు పంపితే ఆప్ ముక్కలుచెక్కలవుతుందన్న బీజేపీ కల కలగానే మిగిలిపోయింది. మలివాల్ ఉదంతంలో బాధితులకు న్యాయం జరగాలి మలివాల్‌పై దాడి కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలి. రెండు వైపుల వాదనలను ఆలకించి పోలీసులు సరైన మార్గంలో దర్యాప్తు జరపాలి. నిజమైన బాధితులకు న్యాయం జరగా>లి. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడలేను. న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లుండవ్ఇండియా కూటమి అధికార పగ్గాలు చేపడితే న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేస్తాం. ఆ వ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుంది. అప్పుడు నాపై మోపిన కేసులన్నీ బోగస్ అని తేలుతాయి. అందుకే జూన్ 4 ఫలితాల తర్వాత విపక్షాల కూటమి గెలిచాక కేసుల నుంచి విముక్తుడినవుతా. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి బీజేపీ, ఈడీ ఆరోపించినట్లు నగదు అక్రమ బదిలీ జరగలేదు. ఈ కేసులో వాళ్లింతవరకు ఒక్క పైసా కూడా కనుక్కోలేకపోయారు. అవినీతి జరిగి ఉంటే ఆ నగదు అంతా ఎటు పోయినట్లు?సునీతది ధర్మాగ్రహం 2000 దశకంలో ఢిల్లీ మురికివాడల పరిధిలో ఐటీ కమిషనర్‌గా పని చేశా. పదవీ విరమణ చేసి ప్రజా జీవితంలోకి వచ్చా. సొంతంగా పార్టీ పెడతానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఏకంగా సీఎం అవుతానని అస్సలు ఊహించలేదు. నా భార్య సునీతకు రాజకీయాలపై ఆసక్తి లేదు. భవిష్యత్తులోనూ క్రియాశీల రాజకీయాల్లోకి రాదు. నన్ను అక్రమంగా అరెస్టు చేసినందుకే తను ఇల్లు దాటి బయటికొచ్చి ధర్మాగ్రహం చూపింది. సునీత భార్య కావడం నా అదృష్టం. జీవితంలో ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచింది. నేను జైల్లో ఉండగా నాకు, ఢిల్లీ ప్రజలకు వారధిగా నిలిచింది. కస్టడీ ముగిసి నేను జైలుకెళ్తే సీఎంగా బాధ్యతల నిర్వహణకు తగిన వసతులు కలి్పంచాలని కోర్టును కోరతా. -
రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
లక్నో: ఈ లోక్‌సభ ఎన్నికల్లో 400పైగా సీట్లు సాధించి రిజర్వేషన్లు తీసేయాలని బీజేపీ చూస్తోందని ఆప్ అగ్ర నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోమంత్రి అమిత్ షా ప్రధాని అవుతారని, యోగి ఆదిత్యనాథ్‌ను యూపీ సీఎం పదవి నుంచి తొలగిస్తారని పునరుద్ఘాటించారు. ‘అధికారంలోకి వస్తే భారీ కార్యక్రమం ఒకటుంటుందని బీజేపీ చెబుతోంది. రిజర్వేషన్లను తొలగించడమే ఆ కార్యక్రమం. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఎల్లప్పుడూ వ్యతిరేకమే. మళ్లీ ఆ పార్టీకే అధికార పగ్గాలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ముగింపు పలుకుతుంది’అని ఆయన అన్నారు. గురువారం కేజ్రీవాల్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీలో 75 ఏళ్లు దాటిన ఏ నేతకు కూడా ప్రభుత్వంతోపాటు పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వబోమని, అటువంటి వారు రిటైర్ కావాల్సిందేనంటూ ప్రధాని మోదీ నిబంధన తెచ్చారు. ఈ ప్రకారమే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలు కొందరు రిటైరయ్యారు. మరికొందరిని తొలగించడమో, ఎన్నికల్లో టికెట్ నిరాకరించమో జరిగింది. మోదీ ఈ నిబంధన అమలుకు కృషి చేస్తున్నారు’అని కేజ్రీవాల్ ఆరోపించారు. తనకు అడ్డుగా ఉంటారనుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజె, రమణ్ సింగ్, దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్‌లాల్ ఖట్టర్ వంటి వారి కథను మోదీ ముగింపునకు తెచ్చారని విమర్శించారు. ‘అమిత్ షాకు ఆదిత్యనాథ్ అడ్డుగా ఉన్నారు. బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తే రెండు నెలల్లోనే యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను సైతం పక్కన బెట్టడం ఖాయం’అని కేజ్రీవాల్ అన్నారు. చీపురుకు ఓటేస్తే..జైలుకెళ్లాల్సిన పనుండదు అమృత్సర్: తాను మళ్లీ జైలుకు వెళ్లరాదని భావిస్తే ఆప్కే ఓటేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలను కోరారు. గురువారం ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘నేను జైలుకు వెళ్లాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. చీపురు గుర్తు బటన్‌ను మీరు నొక్కితే నేను మళ్లీ జైలుకెళ్లాల్సిన అవసరం ఉండదు. కేజ్రీవాల్‌కు స్వేచ్ఛా లేక జైలా అనే విషయం ఆలోచించి మీరు బటన్ నొక్కండి. చీపురు గుర్తుపై నొక్కితే దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించినట్లేనని గుర్తుంచుకోండి’అని ఆయన అన్నారు. -
Delhi liquor scam: ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ పరిపాలన
న్యూఢిల్లీ: జైలులో ఉన్నా, బయట ఉన్నా ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తానని చెప్పిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ దిశగా తొలి ఉత్తర్వు జారీ చేశారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నుంచి శనివారం రాత్రి ఆదేశాలు అందాయని ఢిల్లీ నీటి మంత్రి అతీషి చెప్పారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ పంపించిన నోట్‌ను చూసిన తర్వాత తనకు కన్నీళ్లు వచ్చాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. అరెస్టై ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల బాగు కోసం ఆయన ఆలోచిస్తున్నారని తెలిపారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తగినన్ని వాటర్ ట్యాంకర్లు పంపించాలంటూ కేజ్రీవాల్ ఆదేశించారని పేర్కొన్నారు. వేసవి ఎండలు ముదురుతుండడంతో నీటి సరఫరాను మెరుగుపర్చాలని చెప్పారని అన్నారు. ఈ విషయంలో చీఫ్ సెక్రటరీతోపాటు సంబంధిత అధికారులకు సీఎం ఈడీ కస్టడీ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సాయం తీసుకోవాలని సూచించారని మంత్రి అతీషి చెప్పారు. కస్టడీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ జారీ చేసిన ఉత్తర్వుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పందించింది. ఈ ఉత్తర్వు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ పీఎంఎల్ఏ కోర్టు జారీ చేసిన ఆర్డర్‌కు అనుగుణంగా ఉందా? లేదా? అనేది పరిశీలించనున్నట్లు ఈడీ అధికార వర్గాలు ఆదివారం తెలియజేశాయి. -
Delhi liquor scam: 31న విపక్షాల మహా ర్యాలీ
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా విపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు చేతులు కలుపుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ, ఆయనకు సంఘీభావంగా ఈ నెల 31న తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో మహా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. కూటమి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దేశ ప్రయోజనాలతోపాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో మహా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించామని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. దేశంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యం పెను ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారంతా కేజ్రీవాల్ ఆరెస్టు పట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘‘ఇది కేవలం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన సమస్య కాదు. ప్రతిపక్షాలన్నీ బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి. అధికారంలో ఉన్న వ్యక్తులు మొదట విపక్షాలను డబ్బుతో కొనేయాలని చూస్తున్నారు. మాట వినకపోతే ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగిస్తున్నారు. అయినా లొంగకపోతే తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఇలాగే అరెస్టు చేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పైనా గురిపెట్టారు’’ అని గోపాల్ రాయ్ ఆరోపించారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను గృహ నిర్బంధంలో ఉంచారని, ఆప్ కార్యాలయాన్ని సీజ్ చేశారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని చెప్పారు. కేవలం రాజకీయ సభ కాదు ఢిల్లీలో ఈనెల 31న జరిగే మహా ర్యాలీ కేవలం రాజకీయ సభ కాదని, కేంద్రంలోని నిరంకుశ బీజేపీకి వ్యతిరేకంగా వినిపించే గొంతుక అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరి్వందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఖాతాలను స్తంభింపజేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. ఇండియా కూటమి పక్షాలకు అండగా నిలుస్తామని తెలిపారు. మోదీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై దాడులను సహించబోమని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ స్పష్టం చేశారు. -
‘లిక్కర్’కు దూరంగా ఉండాలని హెచ్చరించా: అన్నా హజారే
ముంబై: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు ఆయన చర్యలే కారణమని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చెప్పారు. మద్యం పాలసీకి సంబంధించిన అంశాలకు దూరంగా ఉండాలని కేజ్రీవాల్‌ను చాలా సందర్భాల్లో హెచ్చరించానని అన్నారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో అన్నా హజారే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మద్యం మనిషి ఆరోగ్యానికి హానికరమని చిన్న పిల్లలకు కూడా తెలుసు. లిక్కర్ పాలసీకి దూరంగా ఉండాలని కేజ్రీవాల్‌కు చాలాసార్లు చెప్పాను. లిక్కర్ పాలసీని రూపొందించడం మన ఉద్యోగం కాదని వివరించా. అయినా వినలేదు. పాలసీని రూపొందించి అమలు చేశారు. కేజ్రీవాల్ తప్పు చేయకపోతే అరెస్టై ఉండేవారే కాదు. మరింత ఎక్కువ డబ్బు సంపాదించడానికే మద్యం పాలసీని కేజ్రీవాల్ తయారు చేసి ఉంటారు. మద్యానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో నాతో కలిసి పనిచేసిన కేజ్రీవాల్ అదే మద్యం పాలసీకి సంబంధించిన వ్యవహారంలో అరెస్టు కావడం బాధ కలిగిస్తోంది’’ అని అన్నా హజారే పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా దశాబ్దం క్రితం జరిగిన ఉద్యమంలో అన్నా హజరే, అరవింద్ కేజ్రీవాల్ క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
ఆప్ తరఫున రాజ్యసభకు మలివాల్ సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలకు మళ్లీ అవకాశం
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించింది. అదేవిధంగా, పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలకు మరో విడత ఎగువసభ సభ్యులుగా కొనసాగించాలని నిర్ణయించింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ మేరకు ప్రకటించింది. హరియాణా రాజకీయాల్లో కీలకంగా ఉండాలన్న రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా అభిప్రాయం మేరకు ఆయన స్థానంలో స్వాతి మలివాల్‌కు మొదటిసారిగా అవకాశం కల్పిస్తున్నట్లు ఆప్ పేర్కొంది. ఆమె 2015లో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. పార్టీ నిర్ణయం మేరకు శుక్రవారం సాయంత్రం డీసీడబ్ల్యూ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఆప్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన వినతి మేరకు శుక్రవారం ప్రత్యేక కోర్టు..ఈ నెల 19న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు సంజయ్ సింగ్‌కు వెసులుబాటు కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలిచ్చింది. -
కేజ్రీవాల్‌కు ఏదో జరగబోతోంది
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఇరుకున పెట్టేందుకు పెద్ద కుట్ర జరగబోతోందని ఆప్ నేత సంజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన అనంతరం కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్‌ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోంది. ఆయన్ను అరెస్ట్ చేయడం మాత్రమే కాదు. అంతకంటే మించి ఏదో చేయడమే ఆ కుట్ర’ అని అన్నారు. మద్యం విధానం కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించని విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. -
ఆ మూడ్రోజులు ‘ఢిల్లీ’కి సెలవు..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జి–20 శిఖరాగ్ర సదస్సుకు సమాయత్తమవుతోంది. సెపె్టంబర్ 8, 9, 10వ తేదీల్లో జరిగే ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. సదస్సు దృష్ట్యా వచ్చే నెల 8 నుంచి మూడ్రోజుల పాటు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సుకు హాజరవుతున్న భాగస్వామ్య దేశాల నేతల భద్రత దృష్ట్యా ఆ మూడు రోజులూ లుటియన్స్ ఢిల్లీలోని అన్ని మాల్స్, మార్కెట్లను మూసి ఉంచాలన్న పోలీసు శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా ఆమోదం తెలిపారు. అంతేకాకుండా, రాజధానిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, దుకాణాలు, వాణిజ్య వ్యాపార సంస్థలను మూసివేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సుప్రీంకోర్టు, సెంట్రల్ సెక్రటేరియట్ సహా కొన్ని మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రభుత్వ బస్సుల రాకపోకలను గణనీయంగా తగ్గించనున్నారు. సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే అవకాశం ఉంది. హాజరయ్యే ముఖ్యుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, యూకే ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ల తదితరులున్నారు. హోటళ్లకు పెరిగిన గిరాకీ... జీ20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీ సహా, గురుగ్రావ్, నోయిడాల్లోని పెద్ద హోటళ్లకు గిరాకీ పెరిగింది. ప్రపంచ నాయకులతో పాటు వారి ప్రతినిధి బృందాలు, భారీ రక్షణ, మీడియా బృందాలు ముందుగానే భారత్ చేరుకుంటుండటంతో టాప్ ఫైవ్ స్టార్ హోటళ్లలో బుకింగ్‌లు పెరిగాయి. సెపె్టంబర్ 6 నుంచి 12 మధ్య అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లు పూర్తిగా బుక్ అయ్యాయని తెలుస్తోంది. హోటల్ గదుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఏరోసిటీలోని హోటల్లో ఉత్తమమైన సూట్ ఒక రాత్రికి రూ.20 లక్షల చొప్పున కోట్ చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్‌కు కూతవేటు దూరంలోని జన్‌పథ్ సమీపంలోని ఒక హోటల్లో ప్రధాన సూట్‌కు ఒక్క రాత్రికి రూ.15 లక్షలకు బుక్ అయిందని అవి వెల్లడించాయి. -
‘గ్యారంటీ కార్డు’
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ కోటలో పాగా వేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ శనివారం రాయ్‌పూర్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల కోసం 10 ఉచిత హామీ పథకాలను ప్రకటించారు. గృహాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు నిరుద్యోగులకు రూ.3,000 భృతి, స్కూలు విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, నిరుపేద మహిళలకు నెలకి రూ.1,000, తదితర 10 హామీలతో గ్యారంటీ కార్డును విడుదల చేశారు. త్వరలో రైతులకు హామీ ప్రకటిస్తామని చెప్పారు. ఆప్ మొదటి సారిగా 2018 ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకుగాను 85 స్థానాల్లో పోటీకి దిగి అన్ని చోట్లా «డిపాజిట్లు కోల్పోయింది. -
‘ఇన్సాఫ్ కె సిపాహి’కి కేజ్రీవాల్ మద్దతు
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ దేశంలో జరిగే అన్యాయాలపై పోరాటానికి ఏర్పాటు చేసిన ‘ఇన్సాఫ్ కె సిపాహి’వేదికకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ‘సిబల్ ప్రకటించిన ఇన్సాఫ్ సిపాహి చాలా ముఖ్యమైంది. అన్యాయంపై కలిసికట్టుగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ఇందులో చేరాలి’అని ఆదివారం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘ఇన్సాఫ్’కు శివసేన ఉద్ధవ్ వర్గం, ఆర్జేడీ చీఫ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మద్దతు దక్కింది. -
కర్ణాటకలో ఒక్క ఛాన్సివ్వండి: కేజ్రీవాల్
దావణగెరె: అవినీతి రహిత పాలన అందించే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క అవకాశమివ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కర్ణాటక ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్య, విద్యుత్తు, ప్రభుత్వ పాఠశాలలు, మంచి ఆరోగ్య వసతులు ప్రజలకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని మార్చేందుకు అవకాశమివ్వాలని కోరారు. శనివారం దావణగెరెలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని, పంజాబ్‌లోని తమ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేను, ఒక మంత్రిని అవినీతి ఆరోపణలపై జైలుకు పంపించిందని చెప్పారు. రాష్ట్రంలో 40% కమీషన్ ప్రభుత్వం పనిచేస్తోందంటూ బీజేపీ పాలనపై విరుచుకుపడ్డారు. మళ్లీ అధికారమిస్తే అవినీతి లేకుండా చేస్తామంటున్న హోం మంత్రి అమిత్ షా.. తన నాలుగేళ్లలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. లోకాయుక్త అధికారులు రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకోవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ ఎమ్మెల్యేను, అతడి కుమారుడిని అరెస్ట్ చేయలేదు. కానీ, ఢిల్లీలో మా నేత సిసోడియాను అరెస్ట్ చేశారు’అంటూ బీజేపీ తీరుపై మండిపడ్డారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కారుతో అవినీతి కూడా రెట్టింపయ్యిందని ఎద్దేవా చేశారు. -
కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. యువతి కుటుంబానికి రూ.10 లక్షలు..
న్యూఢిల్లీ: ఢిల్లీలో కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనలో మృతిచెందిన యువతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. బాధితురాలి కుటుంబసభ్యులకు రూ.10లక్షలు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ కేసు వాదించేందుకు ప్రముఖ న్యాయవాదిని నియమిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఢిల్లీలోని కంజవాలా ప్రాంతంలో జనవరి 1న ఓ యువతి మృతదేహం నగ్నంగా లభ్యమవ్వడం కలకలం రేపింది. ఐదుగురు యువకులు తాగిన మత్తులో కారు నడుపుతూ ఆమె స్కూటీని ఢీకొట్టారు. యువతి కారు చక్రాల మధ్య ఇరుక్కున్న విషయాన్ని గుర్తించుకుండా కిలోమీటర్లు తిప్పారు. దీంతో ఆమె చనిపోయింది. శరీర భాగాలు తెగిపోయాయి. ఈ ఘటనకు సంబధించి ఐదుగురు నిందితులను పోలీసులు మరునాడే అరెస్టు చేశారు. బాధితురాలిపై అత్యాచారం కూడా జరిగిఉంటుందని మొదట అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. కారు ఈడ్చుకెళ్లడం వల్లే ఆమె మరణించిందని, ఆమెపై లైంగిక దాడి జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. చదవండి: 'అంబానీ, అదానీ రాహుల్‌ను కొనలేరు.. నా అన్న వారియర్..' -
ప్రచారంలో కేజ్రీవాల్‌కు వింత ప్రశ్న.. ఆయన సమాధానమిదే..!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారంలో వింత ప్రశ్న ఎదురైంది. పార్టీని స్థాపించిన తొలినాళ్లలో తలపై టోపీ, మెడలో మఫ్లర్‌తో ఆయన మఫ్లర్ మ్యాన్‌గా పాపులర్ అవటమే అందుకు కారణం. ఎప్పుడూ మెడలో మఫ్లర్, తలపై టోపీతో కనిపించే ఆయన.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో అవి లేకుండా కనిపించారు. ఈ క్రమంలో చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తుండగా.. కేజ్రీవాల్ సర్ మీరు మఫ్లర్ ఎందుకు ధరించలేదు? అని ఓ మహిళ ప్రశ్నించింది. అయితే, ప్రస్తుతం వాతావరణం అంత చలిగా లేదు కదా అంటూ కేజ్రీవాల్ బదులిచ్చారు. ఈ ఆసక్తికర సంభాషణకు సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీపార్టీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. మఫ్లర్ లేకుండా కేజ్రీవాల్ కనిపించటంపై ప్రశ్నలు ఎదురవటం ఇదేం తొలిసారి కాదు. 2019లో ఓ ట్విటర్ యూజర్ మఫ్లర్ కనిపించకపోవటంపై ఆయన్ను ప్రశ్నించారు. చాలా రోజులుగా మఫ్లర్ కనిపించటం లేదని, కానీ, దానిని ప్రజలు గుర్తించటం లేదని గుర్తు చేశారు. డిసెంబర్ 4న జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే లక్ష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ ముమ్మర ప్రచారం చేస్తోంది. అందులో భాగంగానే కేజ్రీవాల్ ఆప్ అభ్యర్థి తరఫున బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే మఫ్లర్ అంశంపై ప్రశ్న ఎదురైంది. “सर, आपने Muffler नहीं पहना?”🧣 जनता का CM @ArvindKejriwal: अभी तक उतनी ठंड नहीं आई। 😊 pic.twitter.com/2LSjN25Y69 — AAP (@AamAadmiParty) November 29, 2022 ఇదీ చదవండి: ఆప్ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్ -
Gujarat assembly elections 2022: గుజరాత్ ఎన్నికల్లో గెలుపు మాదే: కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుపు ఖాయమని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి పాత పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని, తమకు ఓటేసి గెలిపించాలని ప్రభుత్వ ఉద్యోగులను ఆయన కోరారు. సూరత్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాదిరిగానే గుజరాత్ విషయంలోనూ అంచనాలు నిజమవుతాయని, ఆప్ అధికారంలోకి వస్తుందంటూ ఆయన కాగితంపై రాసి చూపారు. 27 ఏళ్ల తర్వాత గుజరాత్ ప్రజలు బీజేపీ దుష్టపాలన నుంచి విముక్తి కాబోతున్నారని అన్నారు. పాత పింఛను విధానం సహా ఇతర డిమాండ్లను తీరుస్తామని, తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని ప్రభుత్వ ఉద్యోగులను కోరారు. -
ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీ పథకం ప్రారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యుత్ సబ్సిడీ పథకం శనివారం నుంచి ప్రారంభమైంది. రాయితీ కావాలనుకునే వారు 7011311111 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు లేదా వాట్సాప్ మెసేజీ పంపొచ్చునంటూ గత నెలలో సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అక్టోబర్ ఒకటో తేదీ వరకు విద్యుత్ ఫీజు బకాయి లేని గృహ వినియోగదారులే రాయితీకి అర్హులు. అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా సబ్సిడీ వర్తిస్తుందని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం 200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఉచితంగా, 400 యూనిట్ల వరకు వినియోగించుకునే వారికి 50% సబ్సిడీతో ఢిల్లీ ప్రభుత్వం విద్యుత్ అందిస్తోంది. ఇందులో ఢిల్లీలోని మొత్తం 58 లక్షల గృహ విద్యుత్ వినియోగదారుల్లో 47 లక్షల మంది సబ్సిడీ పొందుతున్నారు. -
వేధింపులాపి.. మంచి పనులు చేయండి
న్యూఢిల్లీ: బీజేపీ నేతలు ఆరోపిస్తున్న మద్యం కుంభకోణం ఏమిటో తనకు ఇప్పటివరకు అర్థం కాలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీబీఐ, ఈడీలతో అందరినీ వేధించడం మానేసి, ఇకనైనా దేశం హితం కోసం మంచి పనులు చేయాలని కేంద్రానికి హితవు పలికారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ ఎక్సైజ్ విధానంలో అవకతవకల కేసులో భాగంగా ఈడీ శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేసింది. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. ‘మద్యం పాలసీలో రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ నేత ఒకరన్నారు. ఢిల్లీ బడ్జెట్ అంతా కలిపి రూ.70 వేల కోట్లు. మరిక రూ.1.5 లక్షల కోట్ల స్కాం ఎలా సాధ్యం? మరో బీజేపీ నేత రూ.8 వేల కోట్ల కుంభకోణమని, ఇంకొకరు రూ. 1,100 కోట్లని అంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నరేమో రూ.144 కోట్లని ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణం విలువ రూ.1 కోటి మాత్రమేనని సీబీఐ అంటోంది’’ అని ఆయన మీడియాతో అన్నారు. ‘‘మా మంత్రి మనీశ్ సిసోడియా సొంతూరులోని నివాసం, బ్యాంకు ఖాతాల సోదాల్లోనూ సీబీఐకి ఏమీ దొరకలేదు. మరి స్కాం ఎక్కడ జరిగినట్టు?’’ అని ప్రశ్నించారు. అనవసర అంశాలపై దృష్టి పెడితే దేశం వెనుకబడిపోతుందని కేంద్రానికి హితవు పలికారు. తెలంగాణ, ఏపీల్లోనూ దాడులు సాక్షి, న్యూఢిల్లీ/నెల్లూరు క్రైం: ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 40 చోట్ల ఈడీ శుక్రవారం సోదాలు చేసింది. సోదా బృందాలకు పోలీసులు, పారా మిలటరీ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన నెల్లూరు, ఢిల్లీ నివాసాల్లో తనిఖీలు జరిగాాయి. నెల్లూరు రాయాజీవీధిలోని మాగుంట శ్రీనివాసులరెడ్డి పాత నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. బీరువాలను తెరిపించి, అందులోని ఫైళ్లను పరిశీలించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో నివాసముంటున్న ఎంపీ బంధువు (భార్య చెల్లెలి భర్త) శివరామకృష్ణారెడ్డి ఇంటిలోను ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇదే కేసులో ఈ నెల 6న కూడా ఇలాగే దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. -
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
న్యూఢిల్లీ: భారత్‌లోనూ రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరిగిపోతోంది. వరసగా 8వ రోజు కేసుల సంఖ్య పెరిగింది. దేశ రాజధానిఢిల్లీలో ఒమిక్రాన్ వేరియెంట్ విస్తృతంగా వ్యాపిస్తూ ఉండడంతో శని, ఆదివారాల్లో కర్ఫ్యూ విధించాల ని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్టుగా ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం తెలిపారు. బస్సులు, మెట్రో రైళ్లు తిరిగి 100 శాతం సామర్థ్యంతో పని చేస్తాయన్నారు. బస్సులు, మెట్రోల కోసం వేచి చూసే వారు సూపర్ స్ప్రెడర్లుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 8.37%కు చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటూ ఉండడంతో కరోనా సోకింది. మరోవైపు పంజాబ్ రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలన్నీ మూసివేసింది. సినిమా హాల్స్, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. యూపీలో జనవరి 15 వరకు విద్యాసంస్థలను మూసివేశారు. 1892కి చేరుకున్న ఒమిక్రాన్ కేసులు గత 24 గంటల్లో దేశంలో 37,379 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య 1,892కి చేరుకుంది. -
మీడియాను భయపెడుతున్నారు: కేజ్రీవాల్
దైనిక్ భాస్కర్, భారత్ సంచార్‌లపై ఐటీ దాడులు మీడియాని భయపెట్టడమేనని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ విమర్శించారు. ఇలాంటి చర్యలు వెంటనే నిలిపివేయాలని, మీడియా స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణాన్ని కల్పించాలని ట్వీట్ చేశారు. ‘బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారు సహించలేరు. ఇలా దాడులకు దిగుతారు. ప్రతీ ఒక్కరూ కేంద్రం చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకించాలి’ అని కేజ్రివాల్ ట్వీట్‌చేశారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ దాడుల్ని అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ఈ దాడులు మీడియా గళాన్ని అణగదొక్కడానికేనని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పేర్కొన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర సంస్థల్ని బెదిరించడానికి వాడుకుంటోందని ధ్వజమెత్తింది. గంగానదిలో కరోనా రోగుల శవాలు తేలినట్టుగా కేంద్రం చేసిన తప్పిదాలు వెలుగులోకి రాకమానవని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. -
ఢిల్లీలో ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరే!
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అని తేల్చిచెప్పే బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్సీటీడీ)ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఢిల్లీ ప్రభుత్వం ఎవరనే అంశానికి సంబంధించి కొన్ని విషయాల్లో గందరగోళం నెలకొందని, దీన్ని తొలగించేందుకే ఈ బిల్లును తెచ్చామని చెప్పారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని లోక్‌సభలో ఆప్, కాంగ్రెస్ వ్యతిరేకించాయి. బిల్లు ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం అంటే ఎల్జీ అని ఖరారుకానుంది, అంతేకాక ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి ఎగ్జిక్యూటివ్ చర్యకైనా ఎల్జీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి కానుంది. ఇది రాజకీయ బిల్లు కాదని, కేవలం కొన్ని అంశాలపై స్పష్టత కోసం తెచ్చిన బిల్లని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈబిల్లు వల్ల ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. నిజానికి ఈ బిల్లు 1991లో కాంగ్రెస్ తెచ్చిందని గుర్తు చేశారు. ఎల్జీ కార్యనిర్వహణాధికారి కనుక రోజూవారీ కార్యకలాపాలు తెలుసుకునే హక్కు ఆయనకుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి అధికారాలు లాక్కొని ఎల్జీకి కట్టబెట్టలేదని వివరించారు. తమ తప్పుంటే విని దిద్దుకుంటామని, కానీ ఎలాంటి తప్పు లేనప్పుడు విమర్శలను సహించమని, ఈ బిల్లు మరింత పారదర్శకత కోసమే తెచ్చామని చెప్పారు. 2015 నుంచి ఢిల్లీ హైకోర్టులో కొన్ని అంశాలపై వేసిన కేసులు, వాటిపై కోర్టు ఇచ్చిన రూలింగ్స్‌తో కొంత గందరగోళం నెలకొందన్నారు. ఎల్జీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపని చెప్పి చేయాలని కోర్టు తీర్పులిచ్చిందన్నారు. రాజ్యాంగ వ్యతిరేకం రాష్ట్ర ప్రభుత్వ హక్కులను లాక్కునే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి విమర్శించారు. ఇది గతంలో అప్పటి హోంమంత్రి అద్వానీ ఇచ్చిన హామీలకు వ్యతిరేకమన్నారు. అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలను ప్రజా ప్రభుత్వం అమలు చేయకుండా అపేందుకే ఈ బిల్లు తెచ్చారన్నారు. ఢిల్లీ ప్రభుత్వంపై గందరగోళానికి కాంగ్రెస్, ఆప్ కారణమని బీజేపీ ఎంపీ మీనాక్షి లేకి దుయ్యబట్టారు. కావాలనుకుంటే కాంగ్రెస్ అప్పట్లోనే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందన్నారు. 2013లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఒక వ్యక్తి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ బ్రిజేందర్ సింగ్ పరోక్షంగా అరవింద్ క్రేజీవాల్‌ను విమర్శించారు. అరవింద్ హయాంలో ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇచ్చిఉంటే ఈ పాటికి సివిల్‌వార్ వచ్చేదన్నారు. రాష్ట్రాల హక్కుల హరణలో కేంద్రం స్పెషలిస్టని, ఢిల్లీని పాలించాలని భావిస్తోందని ఆప్ ఎంపీ భగవంత్‌మన్ విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లా అసెంబ్లీ ఉన్న యూటీలాగా ఢిల్లీని మార్చాలని కేంద్రం భావిస్తోందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఏ నిర్ణయాధికారం లేకుంటే, అసెంబ్లీకి ఎన్నికలెందుకన్నారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. -
కేంద్రం కాదంటే..మేమే ఉచితంగా ఇస్తాం : ఢిల్లీ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనరాష్ట్రప్రజలకు తీపి కబురుఅందించారు. కేంద్రం ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందించని పక్షంలో తమ ప్రభుత్వం ఢిల్లీ వాసులకు ఉచితంగా అందిస్తుందని బుధవారం వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు ఉచిత టీకా సరఫరా చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ఆయన మరోసారి ఇదే విషయాన్ని ధృవీకరించారు. కోవిడ్-19 విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ హితేష్ గుప్తా కుటుంబాన్ని పరామర్శించిన కేజ్రీవాల్ వ్యాక్సిన్ గురించి ఎవ్వరూ తప్పుగా ప్రచారం చేయవద్దని కోరారు. కరోనా టీకాను అందరికీ ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని, కేంద్రం దీనికి అంగీకరించకపోతే ఢిల్లీ ప్రజలకు తామే ఉచిత టీకా సౌకర్యాన్నిఅందిస్తామని ప్రకటించారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాను సరఫరా చేయాలని గతంలోఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 వ్యాక్సిన్‌ను దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలనిగతంలో ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. టీకా ప్రతి ఒక్కరి హక్కు అని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ నెల(జనవరి) 16 న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. -
రైతన్న నిరశన విజయవంతం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం రైతులు చేపట్టిన ఒక రోజు నిరశన దీక్ష విజయవంతమైంది. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద 32 రైతు సంఘాల నాయకులు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల్లోనూ నిరశన దీక్షలు జరిగాయని రైతు నేతలు తెలిపారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గత 18 రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. గత 18 రోజుల్లో ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలో పాల్గొంటున్న 20 కి పైగా నిరసనకారులు మరణించారు. వారికి నివాళిగా సోమవారం ఉదయం రైతు నేతలు, నిరసనకారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా రైతు నిరశన దీక్షలో పాల్గొన్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి ఆప్ కార్యాలయంలో ఆయన నిరాహార దీక్ష చేశారు. కొత్త సాగు చట్టాలు కొందరు కార్పొరేట్లకే ప్రయోజనకరమని, వాటి వల్ల ద్రవ్యోల్బణం భారీగా పెరిగే ప్రమాదముందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆ చట్టాలు రైతులకు, సామాన్యులకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో రైతులు జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలిపారని రైతు నేతలు తెలిపారు. ‘ఇది కేవలం పంజాబ్ రైతుల నిరసన కాదు. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల నిరసన ప్రదర్శన అన్న సందేశాన్ని ఇవ్వాలనుకున్నాం’ అని సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘం నేత శివ కుమార్ కక్కా పేర్కొన్నారు. నిరశన దీక్ష ముగిసిన తరువాత కూడా సింఘు సహా నిరసన కేంద్రాల్లో నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన కొనసాగాయి. ‘అన్నదాత ఇప్పుడు ఆకలితో నిరసనలో పాల్గొంటున్నాడన్న సందేశం దేశ ప్రజలకు ఇవ్వడానికే ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టాం’ అని మరో రైతు సంఘం నేత హరిందర్ సింగ్ లోఖావాల్ తెలిపారు. మహిళలతో పాటు, మరింత మంది రైతులు నిరసనల్లో పాల్గొనేందుకు ఢిల్లీ సరిహద్దులకు రానున్నారని, వారి వసతి కోసం ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. మరోవైపు, వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌పై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించామని సోమవారం ‘ఫిక్కీ’ సదస్సులో వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగం తల్లిలాంటిదని వ్యాఖ్యానించారు. చర్చలు కొనసాగించేందుకు, మరో విడత చర్చల తేదీని నిర్ణయించేందుకు రైతు నేతలను సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. కచ్చితంగా మళ్లీ చర్చలు ప్రారంభమవుతాయన్నారు. చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులు అంశాలవారీగా అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. అంతకుముందు, తోమర్ హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం, సాగు చట్టాలకు మద్దతిస్తున్న ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేసీసీ) ప్రతినిధులను కలుసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి పనిపై వచ్చి.. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమంపై వస్తున్న నకిలీ వార్తలను అడ్డుకోవడానికి వీలుగా ట్విట్టర్ ఖాతా పని చేస్తోంది. ‘ట్రాక్టర్2ట్విట్టర్’ అనే పేరుతో ఉన్న ఈ అకౌంట్‌ను ఆస్ట్రేలియాలో పని చేసే ఓ ఐటీ నిపుణుడు క్రియేట్ చేసి రైతులకు మద్దతుగా పోస్టులు చేస్తున్నాడు. పంజాబ్‌లోని లూధియానాకు చెందిన భావ్‌జిత్ సింగ్ ఆస్ట్రేలియాలో ఐటీ నిపుణుడిగా పని చేస్తున్నారు. గత అక్టోబర్‌లో వ్యక్తిగత పనిపై ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమించడం ప్రారంభమైంది. అయితే ఆ ఉద్యమంపై నకిలీ వార్తలు పుట్టుకొస్తుండటంతో వాటిని తిప్పి కొట్టాలని భావ్‌జిత్ నిర్ణయించుకున్నారు. అనంతరం ట్రాక్టర్2ట్విట్టర్ అకౌంట్‌ను ప్రారంభించారు. నవంబర్ 28న ప్రారంభించిన ఈ ట్విట్టర్ ఖాతాకు ప్రస్తుతం 10 వేల మందికి పైగా ఫాలోవర్లతో పాటు, 2.5 మిలియన్ల ఇంప్రెషన్లు దక్కాయని ఆయన వెల్లడించారు. హిందీ, ఇంగ్లీషు, పంజాబీ భాషల్లో ఫొటోలు, వీడియోలు, న్యూస్ పోస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ఘాజీపూర్ బోర్డర్లో రైతుతో నిరాహార దీక్ష విరమింపజేస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికీయత్ -
ఊపిరి పీల్చుకుంటున్న హస్తిన
ఒకప్పుడు కోవిడ్–19కి రాజధానిగా మారుతోందని సాక్షాత్తూ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు కరోనా కట్టడిలో ఢిల్లీ ఒక మోడల్‌గా మారి విజయ దరహాసం చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లో రాజధాని తరహా చర్యలు చేపట్టడానికి కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది. పరీక్షలు, రికవరీ, కేంద్ర రాష్ట్రాల సమన్వయం, ప్రజా సహకారం అనే నాలుగు సూత్రాలతో ఢిల్లీలో కరోనా నియంత్రణలోకి వచ్చింది. న్యూఢిల్లీ: వైరస్ వ్యాప్తి నెమ్మదిగా మొదలై, చూస్తూ ఉండగానే స్వైర విహారం చేసి, ఆ తర్వాత క్రమేపి తగ్గుముఖం పట్టడం అనేది చాలా చోట్ల చూస్తున్నాం. ఇప్పుడు దేశ రాజధాని ఆ తగ్గుముఖం పట్టే దశకి వచ్చింది. గత నెలరోజులుగా రోజు వారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. అలాగని పూర్తిగా ధీమాగా ఉండే పరిస్థితి లేదు. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం, ప్రజల సహకారంతో వైరస్ నియంత్రణలోకి తెచ్చామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటున్నారు కానీ ఆరోగ్య నిపుణుల్లో భిన్నాభిప్రాయాలైతే నెలకొన్నాయి. ‘భారత్‌లో చాలా ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పడుతోంది. అంత మాత్రాన కరోనా నియంత్రణలోకి వచ్చిందని భావించలేం. పరీక్షల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా నెలరోజుల్లో ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించగలిగారు. కానీ ఈ వైరస్ ఎప్పుడు ఎక్కడ ఎందుకు విజృంభిస్తుందో అర్థం కాని పరిస్థితులున్నాయి’ అని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ సోషల్ మెడిసిన్ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఏఎం ఖాద్రీ తెలిపారు. నెలరోజుల్లో ఎంత తేడా ! ఢిల్లీలో మార్చి 2న తొలి కేసు నమోదైన తర్వాత జూన్ 23న ఒకే రోజు అత్యధికంగా 3,947 కేసులు నమోదయ్యాయి. సరిగ్గా నెలరోజులకి జూలై 22న నమోదైన కొత్త కేసుల సంఖ్య 1,349గా ఉంది. నెల రోజుల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికతో కేసుల్ని నియంత్రించాయి. జూన్‌లో 36% ఉన్న రికవరీ రేటు, జూలై 25 నాటికి 87%కి పెరిగింది. కొత్త కేసులు కూడా తగ్గాయి. కేసులు ఎలా తగ్గుముఖం పట్టాయంటే..! ► ప్రభుత్వం కోవిడ్‌ను నిర్ధారించే ఆర్టీ–పీసీఆర్ టెస్టుల కంటే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు మూడు రెట్లు ఎక్కువగా చేసింది. రోజుకి 20 వేల వరకు పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్ పరీక్షల ద్వారా 18% ఫాల్స్ నెగెటివ్ వచ్చినా చేసిన వారికే మళ్లీ చేయడం ద్వారా రోగుల్ని సకాలంలో గుర్తించి, వెనువెంటనే క్వారంటైన్లో ఉంచడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టినట్టుగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ ఆర్. బాబు చెప్పారు. ► నగరాన్ని కంటైన్మెంట్ జోన్స్, మైక్రో కంటైన్మెంట్ జోన్స్‌గా విభజించి కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం పర్యవేక్షణను పెంచింది. యుద్ధ ప్రాతిపదికన ఆస్పత్రులు ఏర్పాటు చేసి, ఆక్సో మీటర్లను ప్రజలకు అందుబాటులో ఉంచింది. ► వైరస్ సోకి హోం క్వారంటైన్లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి రాకుండా నిఘా ఉంచింది. మొత్తం వెయ్యి మంది వారియర్లను రంగంలోకి దించి నగరంలో కరోనా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించింది. ► అన్నింటికీ మించి కోవిడ్ రోగులకి ప్లాస్మా థెరపీ ఇవ్వడం బాగా పనిచేసింది. దీంతో రికవరీ రేటు 87 శాతానికి పెరిగింది. జాతీయ సగటు (63%) కంటే ఇది చాలా ఎక్కువ. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య జూలై 25నాటికి 12,657కి పరిమితమైంది. ► రక్త పరీక్షల ద్వారా ఇటీవల ఢిల్లీవాసుల్లో దాదాపుగా 30శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టుగా తేలింది. దీంతో ఎక్కువమందిలో వైరస్‌ను తట్టుకునే హెర్డ్ ఇమ్యూనిటే అభివృద్ధి చెందిందని, అది కూడా కేసుల సంఖ్య తగ్గడానికి ఒక కారణంగా భావించవచ్చునని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. -
ఢిల్లీలో సర్వే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి తీరును పూర్తిగా తెలుసుకునేందుకు అధికారులు శనివారం నగరంలో సెరోలాజికల్ సర్వే ప్రారంభించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో 20 వేల మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. వారి శరీరంలో కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన యాంటీ బాడీలు ఉన్నాయో లేదో గుర్తించడానికే ఈ సర్వే చేపట్టినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తద్వారా ఎవరెవరూ ఈ వైరస్ బారినపడే అవకాశం ఉందో ముందే తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ), ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 10వ తేదీ వరకు సెరోలాజికల్ సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇంటింటికీ తిరిగి ప్రజల నుంచి నమూనాలు సేకరిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. -
కరోనాపై ఆందోళన అవసరం లేదు: ఢిల్లీ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరణపై భయపడాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన వైరస్ కట్టడికి ప్రభుత్వం నాలుగు దశల్లో కార్యక్రమాన్ని అమలు చేయబోతోందని ప్రకటించారు. ఢిల్లీలో కేసుల సంఖ్య భారీగా పెరిగిందని అంగీకరిస్తూనే.. చాలామంది ఇంట్లోనే కోలుకుంటున్నారు కనుక ఆందోళన చెందాల్సి అవసరం లేదంటూ హామీ ఇచ్చారు. కరోనా కట్టడికి లాక్డౌన్ ఒక్కటే పరిష్కాం కాదనీ, సుదీర్ఘ కాలం లాక్డౌన్ కొనసాగించలేమని ఆయన వెల్లడించారు. మే14వ తేదీతో పోలిస్తే కరోనా వైరస్ బాధితుల సంఖ్య రెట్టింపు అయింది. 15 రోజుల్లో 8,500 కేసులు పెరిగాయి..ఇది ఆందోళన కలిగించే అంశమే. కానీ భయపడాల్సిన పనిలేదని కేజ్రీవాల్ తెలిపారు. ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 500 మాత్రమేననీ, ఇంట్లోనే ఎక్కువ మంది కోలుకుంటున్నారన్నారు. అలాగే ఆసుపత్రిలో బెడ్ లకు ఎలాంటి కొరతలేదన్నారు. ప్రస్తుతం కేటాయించిన మొత్తం 6600 పడకల్లో 2100 రోగులున్నారని, మిగతావి అందుబాటులో ఉన్నాయన్నారు. జూన్ 5లోగా మరో 9,500 పడకలు సిద్ధంగా ఉంచుతామని కూడా సీఎం ప్రకటించారు. తాజా గణాంకాల ప్రకారం ఢిల్లీలో 17,386 కేసులు నమోదు కాగా, 398 మంది మరణించారు. (రెమెడిసివిర్‌పై గిలియడ్ మరో కీలక అడుగు) చదవండి : ఇక ఇంటి వద్దకే పెట్రోల్,సీఎన్జీ -
మెలానియా కార్యక్రమానికి కేజ్రీకి పిలుపేది?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా చేపట్టనున్న పాఠశాల సందర్శన కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలకు ఆహ్వానం అందలేదు. ఆ జాబితా నుంచి వీరి పేర్లను తొలగించినట్లు అమెరికా ఎంబసీ శనివారం సాయంత్రం ఢిల్లీ యంత్రాంగానికి తెలియజేసింది. కేజ్రీవాల్ ప్రారంభించిన ‘హ్యాపీనెస్ క్లాసెస్’ను పరిశీలించేందుకే మెలానియా పాఠశాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్శనకు కేజ్రీవాల్ హాజరై హ్యాపీనెస్ క్లాసెస్ గురించి వివరించాల్సి ఉంది. అయితే తాజాగా ఆయన పేరును తొలగించడంతో వాటి గురించి ఎవరు చెబుతారన్న సందేహం వ్యక్తమవుతోంది. ఢిల్లీ పాఠశాలల్లో మార్పులు తీసుకొచ్చింది తామేనంటూ సిసోడియా వరుస ట్వీట్లు చేశారు. తాము ప్రారంభించిన హ్యాపీనెస్ క్లాసులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రపంచమే ఉబలాటపడుతోందని అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం గురించి ప్రభుత్వం కాకపోతే మరెవరు చెబుతారంటూ ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది బీజేపీ పనే: ఆప్ కార్యక్రమం నుంచి కేజ్రీవాల్, సిసోడియాల పేర్లు తొలగించడంపై ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరధ్వాజ్ స్పందించారు. ఇలాంటి కార్యక్రమాలు జరిగినపుడు స్థానిక అధికారులు హాజరు కావడం ప్రొటోకాల్ అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ఉండటం వల్లే వారిద్దరి పేర్లు తొలగించినట్లు ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్, సిసోడియాల పేర్లు తొలగించాల్సిందిగా తాము యూఎస్ ఎంబసీని కోరలేదని బీజేపీ అంటోందని, అలా చెప్పడంలోనే ఏదో మతలబు ఉందని ఆరోపించారు. -
‘ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ సర్కార్ కురిపిస్తున్న ఉచిత వరాలపై విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తన చర్యలను సమర్ధించుకున్నారు. పరిమితంగా చేపట్టే ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఉపకరిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని, ఇవి పేదల చేతిలో డబ్బు ఉండేలా చేయడంతో వ్యవస్థలో డిమాండ్ పెరుగుతాయని వ్యాఖ్యానించారు. లోటు బడ్జెట్లకు, అధిక పన్నులకు తావివ్వని రీతిలో పరిమితంగానే ఉచిత వరాలు ఉండాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరోవైపు ఢిల్లీ ప్రజలకు అభివృద్ధి, భద్రత అవసరమని ఉచిత నీరు, విద్యుత్ వంటి వరాలు కాదని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఆరోపించారు. ఇక ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ తప్పుడు హామీలు గుప్పిస్తున్నారని కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా సైతం విమర్శలు గుప్పించారు. దేశంలో తప్పుడు వాగ్ధానాలపై పోటీ జరిగితే కేజ్రీవాల్ ముందువరసలో ఉంటారని ఎద్దేవా చేశారు. చదవండి : ఐదేళ్లలో పెరిగిన కేజ్రీవాల్ ఆస్తులు.. -
బీజేపీ నన్ను చంపాలనుకుంటోంది
న్యూఢిల్లీ: బీజేపీ తనను చంపాలను కుంటోందని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపినట్లే వ్యక్తిగత రక్షణ సిబ్బందే తనను హత్య చేయవచ్చని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అత్యున్నత జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న కేజ్రీవాల్ శనివారం పంజాబ్ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..‘బీజేపీ నన్ను చంపాలనుకుం టోంది. ఇందిరా గాంధీని చంపినట్లే ఏదో ఒక రోజు వ్యక్తిగత రక్షణ అధికారితో బీజేపీ నన్ను హత్య చేయిస్తుంది. నా వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా బీజేపీకే అనుకూలంగా ఉన్నారు’ అని ఆరోపించారు. కేజ్రీవాల్ ఆరోపణలను ఢిల్లీ పోలీసు విభాగం ఖండించింది. దేశ రాజధానిలో ఉండే సీఎం కేజ్రీవాల్ సహా అన్ని రాజకీయ పార్టీల నేతల భద్రతను తమ అధికారులు చూసుకుంటున్నారని, వీరంతా సమర్థులు, విధుల పట్ల అంకిత భావం ఉన్నవారేనని పేర్కొంది. వ్యక్తిగత భద్రత వంటి సీరియస్ అంశాలను సైతం ప్రజల మెప్పు పొందేందుకు వాడుకోవడం దిగజారుడుతనమని బీజేపీ మండిపడింది. వ్యక్తిగత భద్రతా అధికారిపై అనుమానం ఉంటే వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదంది. అనంతరం కేజ్రీవాల్ ట్విట్టర్లో..ఏం తప్పు చేశానని బీజేపీ నన్ను చంపాలనుకుంటోంది? తుది శ్వాస వరకు దేశం కోసం పనిచేస్తూనే ఉంటా’ అని తెలిపారు. -
నాన్న సీటు కోసం 6 కోట్లు ఇచ్చాం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన పశ్చిమ ఢిల్లీ అభ్యర్థి బల్బీర్ సింగ్ జాఖడ్ కొడుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రూ.6కోట్లు చెల్లించినట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ టికెట్ కోసం తన తండ్రి ఈ నగదును కేజ్రీవాల్‌కు ఇచ్చినట్లు బల్బీర్ కొడుకు ఉదయ్ చెప్పారు. అయితే విలేకరుల సమావేశంలో ఈ ఆరోపణలను బల్బీర్ ఖండించారు. ఉదయ్ తనతోపాటు ఎప్పుడూ కలిసి ఉండలేదని, తన భార్యతో విడాకుల అనంతరం ఉదయ్ తన తల్లి తరఫు బంధువులతో కలిసి ఉంటున్నాడని తెలిపారు. ఉదయ్ ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని బల్బీర్‌సింగ్ వ్యాఖ్యానించారు. అయితే బల్బీర్ విలేకరుల సమావేశం ప్రారంభించే సమయంలోనే ముగ్గురు పోలీసులు ఆప్ కార్యాలయంలోకి ప్రవేశించి సమావేశాన్ని అడ్డుకున్నారు. ఆప్ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులు విలేకరుల సమావేశాన్ని వీడియో తీయడానికి ప్రయత్నించడంతో ఆప్ కార్యకర్తలు పోలీసులను లోనికి రానివ్వకుండా తలుపులు వేసి సమావేశం నిర్వహించారు. అయితే పోలీసులు మాత్రం ఎన్నికల నియమావళి అమల్లో ఉందని, పోలింగ్‌కు ముందు 48 గంటలపాటు ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని, కాబట్టే సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశామని వివరించారు. ఆప్ చర్యను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. -
పాఠశాలలో ఎన్నికల ప్రచారంపై ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఢిల్లీలోని ఆప్ సర్కార్‌కు లేఖ రాసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇటీవల ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేపట్టిన నేపథ్యంలో ఎన్సీపీసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పాఠశాలలో రాజకీయ ప్రసంగాలు, ఎన్నికల ప్రచారం పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మంత్రులు, పార్టీ కార్యకర్తలు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల ప్రచారానికి రావడంతో చిన్నారుల చదువులకు ఆటంకం కలుగుతోందని పేర్కొంది. స్కూలు పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రచార సభలకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది. పాఠశాలలోకి వచ్చే విజిటర్ల గుర్తింపును, ఏ ఉద్దేశంతో స్కూల్‌కు వస్తున్నారో తెలుసుకుని మెయిన్ గేట్ల వద్ద ప్రవేశ రిజిస్టర్లలో నమోదు చేశాకే సందర్శకులను అనుమతించేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ సర్కార్‌కు రాసిన లేఖలో ఎన్సీపీసీఆర్ కోరింది. సర్వోదయ కన్యావిద్యాలయ పాఠశాలల్లో 11,000 నూతన తరగతులకు సోమవారం శంకుస్ధాపన చేసిన సందర్భంగా జరిగిన సభలో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాలో ఆమ్ ఆద్మీ పార్టీకి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరడం దుమారం రేపింది. మీరు ప్రధాని నరేంద్ర మోదీని ఇష్టపడతారా లేకుంటే మీ పిల్లలను ఎక్కువగా ఇష్టపడతారా అని తల్లితండ్రులను వారు ప్రశ్నించారు. మీ పిల్లల్నే మీరు ప్రేమిస్తే వారి అభ్యున్నతికి పనిచేసే వారికే ఓటేయాలని పిలుపు ఇచ్చారు. మీరు మీ పిల్లలను ఇష్టపడకుంటే మోదీకే ఓటు వేయాలని సలహా ఇచ్చారు. మోదీ పాఠశాలల్లో ఒక క్లాస్‌రూమ్‌ను సైతం నిర్మించలేదని వారు ఆరోపించారు. -
పరువునష్టం కేసులో కేజ్రీవాల్‌కు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ సహచరుడు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ రాజకీయ కార్యదర్శి పవన్ ఖేరా దాఖలు చేసిన పరువు నష్టం కేసు నుంచి కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం విముక్తి కల్పించింది. షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో 2012 అక్టోబర్‌లో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఖేరా పరువునష్టం దావా వేశారు. షీలా దీక్షిత్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తాను ఆమె రాజకీయ సహాయకుడిగా ఉన్నందున తన గౌరవాన్ని మంటగలిపేలా ఉన్నాయని ఖేరా ఈ కేసులో పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యలు నేరుగా ఖేరాను ఉద్దేశించి లేనందున ఆయన ప్రతిష్టకు నిర్ధిష్టంగా ఎలాంటి భంగం వాటిల్లలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో ఫిర్యాదుదారుపై నిందితుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ప్రాధమిక ఆధారాలు లేవని, ఫిర్యాదుదారు దాఖలు చేసిన పరువునష్టం దావాను కొనసాగించలేమని స్పష్టం చేసింది. -
ఆయన చదివింది ఐఐటీలోనేనా?
చండీగఢ్: ఢిల్లీలో వాయు కాలుష్యం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పంజాబ్‌లో పంట వ్యర్థాలను దహనంచేయడం వల్లే కాలుష్యం పెరుగుతోందన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకోసం కేజ్రీవాల్ ఉపగ్రహ చిత్రాల్ని రుజువుగా చూపడం హాస్యాస్పదమని అన్నారు. అసలు కేజ్రీవాల్ ఐఐటీలోనే చదివారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థికి ఇంత కన్నా మంచి అవగాహన ఉంటుందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ కాలుష్యానికి పంజాబ్‌ను నిందించడానికి ముందు కేజ్రీవాల్ వాస్తవాలు గ్రహించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం జరగని రోజుల్లో కూడా ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ మెరుగ్గా లేద న్నారు. ఢిల్లీ–ఎన్సీఆర్ మీదుగా వీస్తున్న గాలులు వాయవ్యం నుంచి తూర్పు దిశగా మళ్లాయని, కాబట్టి పంజాబ్, హరియాణాల పంట వ్యర్థాల దహన ప్రభావం ఢిల్లీపై లేదని వాతావరణ శాఖ నివేదిక ఇచ్చిందన్నారు. -
కేజ్రీవాల్ విద్యార్హతలపై కెప్టెన్ సందేహం..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విమర్శల దాడితో విరుచుకుపడ్డారు. దేశ రాజధానిలో కాలుష్య తీవ్రతకు పంజాబ్‌లో పంట వ్యర్ధాలరను తగులబెట్టమే కారణమని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను అమరీందర్ తప్పుపట్టారు. ఆప్ నేత నిజంగా ఐఐటీ గ్రాడ్యుయేట్‌యేనా అని సందేహం వ్యక్తం చేశారు. పంజాబ్‌లో పంట వ్యర్ధాల దగ్ధానికి శాటిలైట్ ఫోటోలే సంకేతమని కేజ్రీవాల్ చెబుతున్న తీరుతో కేజ్రీవాల్ కంటే పాఠశాల విద్యార్ధే నయమని చురకలు వేశారు. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలను తగులబెట్టని డిసెంబర్, జనవరి మాసాల్లోనూ ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకరస్ధాయిలో ఉంటోందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచిస్తోందని పంజాబ్ సీఎం స్పష్టం చేశారు. ఢిల్లీ కాలుష్యానికి వాహన ట్రాఫిక్, నిర్మాణ కార్యకలాపాలు, పారిశ్రామిక ప్రక్రియ సహా అక్కడి అంశాలే కారణమని ఈ సూచిక తేటతెల్లం చేస్తోందని వివరించారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేజ్రీవాల్ పొరుగు రాష్ట్రాలను తప్పుపట్టడం సరికాదని హితవు పలికారు. -
కాంగ్రెస్ రేసులో ఉండదన్న కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీకి తమ పార్టీకి మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్‌కు కేవలం తొమ్మిది శాతం ఓట్లే పోలవుతాయని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ నుంచి ఏడుగురు ఎంపీలు ఆప్‌కు చెందినవారైతే ఢిల్లీ మెట్రో చార్జీలు పెరిగిఉండేఇవి కాదని ప్రజలు భావిస్తున్నారని కేజ్రీవాల్ మంగళవారం ట్వీట్ చేశారు. ప్రజల హక్కుల కోసం తమ పార్టీ మాత్రమే పోరాడుతోందని ప్రజలు గమనిస్తున్నారని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎప్పుడూ ఢిల్లీ ప్రజల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. తమ పార్టీ ఎంపీలే ఉండిఉంటే ఢిల్లీ మెట్రో రైలు చార్జీలు పెరిగిఉండేవి కాదన్నారు. కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్లనూ బీజేపీ గెలుచుకుంది. -
దీక్ష ఎఫెక్ట్; అనారోగ్యం పాలైన ఆరోగ్యశాఖ మంత్రి
న్యూఢిల్లీ : గత ఏడురోజులుగా ఢిల్లీ లెఫ్నినెంట్ గవర్నర్ కార్యలయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్‌తో పాటు దీక్ష చేస్తున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం పూర్తీగా క్షీణించింది. దీంతో ఆదివారం రాత్రి చికిత్స నిమిత్తం ఆయనను లోక్‌నాయక్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం గురించి ఎల్ఎన్జీపీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ పాసీ ‘మా డాక్టర్ల బృందం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీక్ష చేస్తున్న మంత్రుల ఆరోగ్యాలను పరీక్షిస్తాము. ఈ క్రమంలో భాగంగా నిన్న మధ్యాహ్నం వరకూ కూడా సత్యేంద్ర జైన్ ఆరోగ్యం బాగానే ఉంది. కానీ ఆదివారం రాత్రి సమయానికి జైన్ కీటోన్ లెవల్స్ బాగా పడిపోయాయి. దాంతో జైన్ తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. విషయం తెలిసిన వెంటనే మేము జైన్‌ను ఆస్పత్రికి తరలించాము. ప్రస్తుతం అతనికి చికిత్ప అందిస్తున్నాం ’ అన్నారు. కాగా కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీకి సీపీఎం కూడా మద్దతు తెలపడమే కాక ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా హాజరవడంతో ర్యాలీలో పాల్గొన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎల్జీ తీరుపై నిరసన తెలుపుతున్న కేజ్రీవాల్‌కు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ నాలుగో సమావేశ కార్యక్రమంలో పాల్గోనేందుకు ఢిల్లీ వెళ్లిన పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి.. ఢిల్లీ సీఎంకు సంఘీభావం ప్రకటించారు. -
కేజ్రీకి సీఎంల సంఘీభావం
సాక్షి, న్యూఢిల్లీ: లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ) తీరుపై నిరసన తెలుపుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నలుగురు ముఖ్యమంత్రుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఆదివారం నాటి నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారమే ఢిల్లీ చేరుకున్న పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి.. ఢిల్లీ సీఎంకు సంఘీభావం ప్రకటించారు. ఈ విషయంపై సత్వరమే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులు తమ సమ్మెను విరమించాలని, పేదలకు ఇంటివద్దకే రేషన్ అందించే ప్రతిపాదనకు ఆమోదం తెలపాలనే ప్రధాన డిమాండ్లతో కేజ్రీవాల్, తన మంత్రివర్గ సహచరులతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలోని సందర్శకుల గదిలో గత ఆరు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. నలుగురు ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి శనివారం సాయంత్రం కేజ్రీవాల్‌ను కలిసే అవకాశం కల్పించాలంటూ ఎల్జీని కోరారు. ఆయన అనుమతించకపోవడంతో.. కేజ్రీవాల్ నివాసంలో ఆయన భార్య సునీతను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించి, కేంద్రప్రభుత్వం, ప్రధాని మోదీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అంతకుముందు ఆ నలుగురు ఏపీ భవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానిపై మండిపడ్డ సీఎంలు దేశ రాజధాని అయిన ఢిల్లీ సమస్యనే పరిష్కరించలేని వారు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రధాని మోదీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘చంద్రబాబు, కుమారస్వామి, పినరయి విజయన్‌లతో కలిసి కేజ్రీవాల్ ఇంటికి వచ్చాను. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి. విపక్ష పార్టీలకు కూడా గౌరవం ఇవ్వాలి. ఢిల్లీలో ప్రజల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వంపై ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. దేశ రాజధానిలో సమస్య ఇలా ఉంటే ఎలా? దేశం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాల భవిష్యత్తు ఏమవుతుంది? ఎల్జీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలుండాలి. అది స్వపక్షమా? విపక్షమా? అని చూడరాదు. ఒక సీఎంను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడానికి వీలుకానప్పుడు ఇదేం ప్రజాస్వామ్యం?’ అని తీవ్రంగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘మేం కేజ్రీవాల్‌ను కలవాలనుకున్నాం. ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితి కల్పించాలి. అంతిమంగా మా డిమాండ్ ఒక్కటే. ఈ సమస్యను పరిష్కరించాలి. ఎన్నికైన ప్రభుత్వాన్ని పనిచేసుకోనివ్వాలి. కేంద్రం–రాష్ట్రం కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రజలకు సేవ చేయగలం’ అని పేర్కొన్నారు. కుమారస్వామి మాట్లాడుతూ ‘ఢిల్లీ సీఎంకు మద్దతు తెలిపేందుకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వచ్చాం. ఢిల్లీ దేశ రాజధాని. కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలి’ అని పేర్కొన్నారు. ‘కేంద్రం వైఖరి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. ఇది ప్రజాస్వామిక దేశం. కేంద్రం సమాఖ్య వ్యవస్థను గౌరవించాలి. కేజ్రీవాల్‌కు మా మద్దతుంటుంది’ అని విజయన్ పేర్కొన్నారు. మండిపడ్డ కేజ్రీవాల్ సీఎంల వినతిని ఎల్జీ తిరస్కరించడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘లెఫ్టినెంట్ గవర్నర్ సొంతగా ఈ నిర్ణయం తీసుకుంటారనుకోను. కచ్చితంగా ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక సీఎంను.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడాన్ని ప్రధాని అడ్డుకోగలరా? రాజ్ నివాస్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది దేశ ప్రజలది. ఈ ఆందోళన మరింత తీవ్రతరం అవుతుంది’ అని ట్వీట్ చేశారు. శనివారం ఏం జరిగింది? పశ్చిమబెంగాల్, కేరళ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదట ఆంధ్రా భవన్లో సమావేశమమయ్యారు. కేజ్రీవాల్‌కు మద్దతును సమీకరించేందుకు కావాల్సిన ప్రయత్నాలపై చర్చించారు. అనంతరం రాజ్ నివాస్ (లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం, కార్యాలయం)లో నిరసన చెబుతున్న కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు అనుమతించాలని ఎల్జీ బైజాల్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్‌ను కలిసేందుకు అనుమతివ్వబోనని ఎల్జీ స్పష్టంచేశారు. తర్వాత వీరంతా కేజ్రీవాల్ నివాసంలో కుటుంబ సభ్యులను కలుసుకుని సంఘీభావం తెలిపారు. అప్పుడు ఏమయ్యారు: బీజేపీ నలుగురు సీఎంలు కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలపడంపై బీజేపీ మండిపడింది. ‘కేజ్రీవాల్ నివాసంలో, ఆయన సమక్షంలోనే సీఎస్ అన్షు ప్రకాశ్‌పై దాడి జరిగింది. అప్పుడు ఈ నలుగురు ఏమయ్యారు? ఆ నాలుగు రాష్ట్రాల సీఎస్‌లు కూడా అన్షు ప్రకాశ్‌కు సంఘీభావంగా ముందుకు వస్తే వీళ్లేం చేస్తారు?’ అని బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయెల్ ప్రశ్నించారు. -
పిల్లల్నీ విడిచిపెట్టరా..?
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లింలు, దళితులను మట్టుబెట్టిన వారు ఇప్పుడు మన పిల్లల్నీ విడిచిపెట్టడం లేదంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురుగ్రామ్‌లో చిన్నారులపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పద్మావత్ మూవీకి వ్యతిరేకంగా గురుగ్రామ్‌లో నిరసనకారులు స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేజ్రీవాల్ స్పందిస్తూ ‘ముస్లింలు, దళితులను ఊచకోత కోసిన వారు ఇప్పుడు మన పిల్లలపై రాళ్లు రువ్వుతున్నారు..మన ఇళ్లలోకి దూసుకొస్తున్నారు..ఇక ఇప్పుడు మనం మౌనం వీడి గొంతెత్తాల్సి ఉంద’ని వ్యాఖ్యానించారు. సమాజాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం తలెత్తిందన్నారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడారు. స్కూల్ చిన్నారులపై రాళ్లు విసరడం సిగ్గుచేటని, నిందితులకు రావణుడికి రాముడు ఇచ్చిన శిక్ష కంటే కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చిన్నారులపై హింసను ఏ మతం ప్రోత్సహిస్తుందని కేజ్రీవాల్ నిలదీశారు. -
నీటి బిల్లు మోత
సాక్షి, న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీలోని ఆప్ సర్కార్ నీటి బిల్లులనూ మోతెక్కించింది. వాటర్ టారిఫ్‌ను 20 శాతం పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్ధాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 20,000 లీటర్ల పైన ఒక్క లీటర్ అధికంగా వాడుకున్నా మొత్తం వాడిన నీటిపై బిల్లు భారం పడనుంది. ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన నీటి చార్జీలు అమల్లోకి రానున్నాయి. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీ జల్ బోర్డ్ నీటి చార్జీలను పెంచాలని ప్రతిపాదించింది. గత ఏడాది రూ.209 కోట్ల నష్టాలు మూటగట్టుకున్న జల్ బోర్డ్ ప్రస్తుత నష్టాలు రూ.516 కోట్లకు పెరిగాయి. -
శిష్యుడి ‘అవినీతి’పై హజారే ఏమన్నారంటే..
-
శిష్యుడి ‘అవినీతి’పై హజారే ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: ఓ ల్యాండ్ సెటిల్మెంట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రూ.2కోట్లు లంచం తీసుకున్నారన్న మాజీ మంత్రి కపిల్ మిశ్రా వ్యాఖ్యలతో రాజధానిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కపిల్ ఆరోపణల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆప్ ఆరోపిస్తుండగా, అవినీతిని చీపురుతో ఊడ్చిపారేస్తానన్న కేజ్రీవాల్ తానే అవినీతిపరుడయ్యాడంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇక కేజ్రీపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై ఆయన గురువు అన్నా హజారే ఆచితూచి స్పందించారు. ఆదివారం రాలేగావ్‌సిద్ధిలో మీడియాతో మాట్లాడిన అన్నా హజారే.. కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు బాధాకరమన్నారు. ‘అవినీతిని రూపుమాపేందుకే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటిది ఆయనే లంచం తీసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. నిజంగా ఇది బాధాకరం’ అని హజారే అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ గరం గరం.. కేజ్రీవాల్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఆదివారం ఉదయం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీఎంపై తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన తర్వాత పొలిటికల్ సీన్ వేగంగా మారింది. కేజ్రీవాల్‌ను తూర్పారపట్టడంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీపడ్డాయి. యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు సీఎం కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించగా, సీఎంను బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు వినతిపత్రం అందించారు. (కేజ్రీవాల్‌పై బాంబు పేల్చిన మిశ్రా) -
నాపై రోజుకో బుల్లెట్ పేలుస్తున్నారు: సీఎం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. బైజాల్ ప్రతి రోజూ తనపై ఓ బుల్లెట్ పేలుస్తున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. గతేడాది డిసెంబర్ 31న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అనిల్ బైజాల్ నియమితులయ్యాక కేజ్రీవాల్ ఆయనపై నేరుగా విమర్శలు చేయడం ఇదే తొలిసారి. కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌తో తాము సత్సంబంధాలు కొనసాగించామని, ఆయన మాత్రం మొదటి మూడు నెలలు సఖ్యతగా ఉన్నారని కేజ్రీవాల్ చెప్పారు. ఆయనకు వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా, ఆయన రోజుకో బుల్లెట్ తనపై పేలుస్తున్నారని, తమ తప్పిదమేంటో చెప్పాలని కేజ్రీవాల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్ కార్యాలయాన్ని సాధ్యమైనంత త్వరగా ఖాళీచేయాలని అనిల్ బైజాల్ ఇటీవల సీఎం కేజ్రీవాల్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ను సంప్రదించకుండా పార్టీ కోసం భూమి కేటాయించుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. -
పరువు నష్టం కేసులో సీఎంకు అరెస్ట్ వారెంట్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన ఆరోపణలకు సంబంధించి పరువు నష్టం కేసులో విచారణకు హాజరు కానందుకు కేజ్రీవాల్‌కు అసోం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 'ప్రధాని మోదీ ఇంటర్ వరకే చదివారు. ఆ తర్వాత ఆయన డిగ్రీలు నకిలీవి' అంటూ గతంలో కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ విద్యార్థతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ఆయనను కించపరిచేలా కేజ్రీవాల్ ట్వీట్ చేశారని ఆరోపిస్తూ కర్బి అంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ సూర్జో రోంగ్‌ఫర్.. అసోంలోని దీఫు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేయగా కేజ్రీవాల్ వెళ్లలేదు. దీంతో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
ఈవీఎంలపై సీఎం సందేహం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఈవీఎంలపై సందేహం వ్యక్తంగా చేయగా.. తాజాగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వరం కలిపారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని కోరుతూ కేజ్రీవాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ మద్దతు పలికారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించవద్దని, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని మాకెన్ కోరారు. ఉత్తప్రదేశ్ ఎన్నికల్లో ప్రతి ఓటు బీజేపీకి పడేలా ఈవీఎంలను టాంపరింగ్ చేశారని, దీని వల్లే తమ పార్టీ ఓడిపోయిందని మాయావతి ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఆరోపణల్ని ఈసీ ఖండించింది. ఓటింగ్ ప్రారంభానికి ముందు ఈవీఎంలను పరిశీలించేందుకు అభ్యర్థులను అనుమతించామని పేర్కొంది. -
కేజ్రీవాల్‌పై కేసు పెట్టండి: ఈసీ
-
కేజ్రీవాల్‌పై కేసు పెట్టండి: ఈసీ
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్నికల సంఘం(ఈసీ) కొరడా ఝుళిపించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించడమేకాక, హెచ్చరికలను సైతం ఖాతరుచేయని ఆయనపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదివారం ఆదేశాలు జారీచేసింది. కేజ్రీవాల్‌పై కేసు పెట్టి, ఆ ఎఫ్ఐఆర్ కాపీని జనవరి 31(మంగళవారం) సాయంత్రం 3 గంటలలోగా తనకు పంపాలని సంబంధిత అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. జనవరి 8న గోవాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అరవింద్ కేజ్రీవాల్.. ‘ప్రత్యర్థి పార్టీలు డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే వెయ్యండి’ అని ఓటర్లకు సలహా ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు.. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు జారీచేసింది. జనవరి 19న ఈసీకి వివరణ ఇవ్వాల్సి ఉండగా, కేజ్రీవాల్.. ఆ పని చేయకుండా కోర్టును ఆశ్రయించారు. ఈసీవి తప్పుడు చర్యలు అని ఆక్షేపించారు. కేజ్రీవాల్ తీరును గర్హిస్తూ జనవరి 21న ఈసీ ఒక ప్రకటన చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించింది. అయినాసరే కేజ్రీవాల్ దిగిరాకపోవడంతో చట్టపరమైన చర్యలకు నేడు ఆదేశాలు జారీచేసింది. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా రాష్ట్రంలో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీ సమీపించిన తరుణంలో ఆప అధినేతపై ఈసీ తీసుకున్న నిర్ణయం ఏమేరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాలి. (సీఎం తీరుపై ఈసీ మండిపాటు) -
'పెద్ద నోట్ల రద్దుతో బీజేపీకే ప్రయోజనం'
-
వచ్చే 50 రోజులు జనం ఏలా బతకాలి?
న్యూఢిల్లీ: ‘పాల ప్యాకెట్ల దగ్గర్నుంచి ప్రయాణాల దాకా అత్యవసరమైన ఏ చోటా రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవట్లేదు. నవంబర్ 8 ప్రకటనలో.. నాలుగైదు రోజుల్లో అంతా సర్దుకుంటుందని ప్రధాని చెప్పారు. ఇవ్వాళేమో 50 రోజులు టైమ్ కావాలని అడుగుతున్నారు. చేతిలో చెల్లుబాటయ్యే డబ్బులు లేకుండా 50 రోజుల పాటు జనం ఏం తిని బతకాలి? అసలీ మాట చెప్పడానికి మోదీకి నోరెలా వచ్చింది?’ అని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దును సమర్థించుకుంటూ ప్రధాని మోదీ ఆదివారం గోవాలో చేసిన ప్రసంగం ప్రజలను కించపర్చేలా ఉందని, కుంభకోణాలు చేసినవాళ్లూ బ్యాంకుల ముందు క్యూలైన్లో నిలబడ్డారు అనడం దారుణమని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన సీఎం.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి? స్విస్ బ్యాంకు నుంచి తెస్తానన్న బ్లాక్ మనీ ఏమైంది? అని ప్రధానిని ప్రశ్నించారు. అవినీతిపరులు బ్యాంకుల ముందు నిల్చున్నారన్న ప్రధాని ఒక్కసారైనా లైన్ లో నిలబడితే బాధేంటో తెలుస్తుందని అన్నారు. గతంలో రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తానన్న మోదీ ఇప్పుడాయనతో దోస్తానా చేస్తున్నారని, నల్లకుబేరులపై చర్యలకు కేంద్రం జంకుతోందని ఆరోపించారు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన నాటి నుంచి మోదీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న కేజ్రీవాల్.. రూ.500, 1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రూ.2000 నోటుతో నల్లకుబేరులకు మేలు జరుగుతుందని, సామాన్య జనం సమస్యలు ఎప్పటిలాగే ఉంటాయని అన్నారు. 2011లో వెల్లడైన నల్లబాబుల జాబితోని 6000 మందిలో కనీసం కొందరిపైనైనా చర్యలు తీసుకోవాలని, తద్వారా మోదీ తన నిజాయితీని నిరూపించుకోవాలని కేజ్రీవాల్ అన్నారు. (బీజేపీ ‘మిత్రులకు’ ముందే తెలుసు) -
వచ్చే 50 రోజులు జనం ఏలా బతకాలి?
-
బీజేపీ ‘మిత్రులకు’ ముందే తెలుసు
- పెద్ద నోట్ల రద్దు పెద్ద స్కామ్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ - సామాన్యులపై సర్జికల్ స్ట్రైక్స్ అని వ్యాఖ్య న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు పెద్ద స్కామని... కేంద్రంలోని అధికార బీజేపీ ‘మిత్రులకు’ దీనిపై ముందే సమాచారముందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులు, చిన్నమొత్తాల పొదుపులపై సర్జికల్ స్ట్రైక్స్ అని... నల్ల ధనం, బ్లాక్ మార్కెటర్లపై కాదని పేర్కొన్నారు. ‘బీజేపీ పంజాబ్ లీగల్ సెల్ అధినేత సంజీవ్ కాంబోజ్ నోట్ల రద్దుకు ఒక రోజు ముందే రూ.2,000 నోటును సామాజిక మాధ్యమంలో పెట్టారు. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య బ్యాంకుల్లో ఒక్కసారిగా భారీ స్థారుులో డబ్బు డిపాజిటరుుంది. అధికార పార్టీ వారికి నోట్ల రద్దుపై ముందే సమాచారం అందడం వల్లే డిపాజిట్లు జరిగాయని స్పష్టమవుతోంది’ అని ఆరోపించారు. ‘నల్ల ధనం పేరుతో దేశంలో పెద్ద కుంభకోణం జరుగుతోంది. ఏటీఎంలలో డబ్బు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రూ.500, రూ.2,000 నోట్లను ఇప్పుడున్న ఏటీఎంలు పంపిణీ చేయలేవు. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను కేంద్రం ఎలా మార్చగలదు? విషయం తెలిసే సంక్షోభం సృష్టించారు. మోదీ దృష్టిలో నల్లధనం అంటే ఏది? అంబానీ, అదానీ, శరద్‌పవార్, సుభాష్ చంద్ర, బాదల్ వంటి బడా పారిశ్రా మికవేత లు కూడబెట్టిన నల్లధనమా? లేదంటే రైతులు, రిక్షావారు, కూలి చేసుకు బతికేవారు సంపాదిం చిందా..’ అని ప్రశ్నించారు. కొత్త నోట్లు ఇచ్చేం దుకు ప్రజల నుంచి కమీషన్లు తీసుకొంటున్న వారితో పాటు ముందుగానే విషయం తెలుసు కుని బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకున్న ‘మిత్రు ల’ జాబితా బయటపెట్టాలన్నారు. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం... ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, చివరకు నిరుద్యో గానికి దారితీస్తుందని హెచ్చరించారు. ‘ప్రజ ల్లో భయాందోళనలు నెలకొన్నారుు. వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతే అది సరైన నిర్ణయ మనిపించుకోదు’ అని అన్నారు. నల్ల ధనాన్ని మళ్లీ పంపిణీ చేసుకోవడానికే ఇది ఉపయో గపడుతుందన్నారు. ‘నల్ల’కుబేరులకు ఆప్ వత్తాసు: బీజేపీ నల్ల కుబేరులకు మద్దతు తెలుపుతోందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొ ట్టింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వారిని ప్రజలు పట్టించుకోరని బేజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇది బీజేపీ మరో జిమ్మిక్కు: కాంగ్రెస్ పెద్ద నోట్ల రద్దు బీజేపీ మరో జిమ్మిక్కని... నిజంగా నల్ల ధనం వెలికి తీయాలనే ఆలోచనే ఉంటే రాబోయే యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పెట్టే ఖర్చెంతో బహిర్గతం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2014 ఎన్నికల ఖర్చుపై లెక్క తేల్చేందుకు విచారణ కమిషన్‌ను వేయాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కోరారు. ఎలాంటి ప్రణాళికా లేకుండా బీజేపీ తీసుకున్న తొందరపాటు నిర్ణయమి దన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2005కు ముందు నోట్లను రద్దు చేయాలనుకొం టున్నామని ప్రకటిస్తే బీజేపీ దాన్ని పేదల వ్యతిరేక నిర్ణయమని అభివర్ణించిందన్నారు. పూర్తిస్థారుులో కరెన్సీ ముద్రణ: ఆర్బీఐ ముంబై: ప్రస్తుతమున్న భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రింటింగ్ ప్రెస్సుల్లో పూర్తి స్థారుులో నోట్లను ముద్రిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా కేంద్రాల్లో నోట్లు అందుబాటులో ఉంచామని, వాటిని బ్యాంకుల బ్రాంచీలతో అనుసం ధానించామని తెలిపింది. ఏటీఎంలు, బ్యాంకు లపై ఒత్తిడి తగ్గించడానికి ప్రజలు క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో లావాదేవీలు జరపాలని కోరింది. -
బ్యాంక్ క్యూలైన్లో నల్ల కుబేరులు కనిపించారా?
న్యూఢిల్లీ: నల్లధనం, నకిలీ కరెన్సీలను పూర్తిగా నిర్మూలించడంలో భాగంగా రూ.500, రూ.1000 నోట్లు రద్దుచేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో దేశంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో చూస్తున్నాం.. అనుభవిస్తున్నాం. సోషల్ మీడియాలో, టీవీ చర్చల్లో కేంద్రం చర్యను సాహసోపేత నిర్ణయంగా పలువురు అభివర్ణిస్తున్నారు. మంగళవారం నాటి ఆకస్మిక నిర్ణయంతో ప్రజలు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. రాత్రికి రాత్రే ఏటీఎంలో వందనోట్లు తీసుకునే విఫలయత్నం చేశారు. పెట్రోల్ బంకుల్లో క్యూలైన్ల సంగతి చెప్పనవసరమేలేదు. బుధవారం బ్యాంకుల బంద్ తో సమస్యలు ఇంకా ఝటిలం అయ్యాయి. దీంతో గురువారం ఉదయం బ్యాంకులు తెరిచే సమచానికే వందల మీటర్ల దూరం వరకు ఖాతాదారులు నిలుచున్న దృశ్యాలు కనిపించాయి. శుక్రవారం ఏటీఎంలలో నగదు నింపుతామని ప్రభుత్వం ప్రకటించినా ఆమేరకు చర్యలు తీసుకోలేదు. ప్రజలు మళ్లీ బ్యాంకులవైపు పరుగులు తీశారు. ఇక్కడ ఉత్పన్నం అయ్యే ఒకేఒక్క ప్రశ్న.. బ్యాంక్ క్యూలైన్లలో ఒక్క నల్ల కుబేరుడైనా కనిపించాడా? కనీసం పెద్ద స్థాయి ఉద్యోగి ఒక్కరైనా దర్శనమిచ్చారా? ఉన్న కరెన్సీలో అధికశాతం రద్దయినా వారు భేషుగ్గా ఎలా మనగలుగుతున్నారు? రూ.500 నోటిస్తే రూ.400 చిల్లర ఇచ్చి, వంద కమిషన్ గా ఇస్తున్నవారికి ఆ డబ్బులు ఎక్కడివి? ఇవే ప్రశ్నలను ఘాటుగా సంధిస్తున్నారు ఒకప్పటి అవినీతి వ్యతిరేక ఉద్యమనేత, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దేశవ్యాప్తంగా పలు బ్యాంకుల్లో చోటుచేసుకున్న తోపులాటలు, నిరీక్షణల కారణంగా శుక్రవారం సుమారు నలుగురు ఖాతాదారులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లంతా ఏ వెయ్యో, పదివేలో తీసుకోవడానికి వచ్చినవారే తప్ప నోట్లు డిపాజిట్ చేసినవాళ్లు కారు. ‘రోజువారీ కూలీలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, రైతులు, పేద పెన్షనర్లు.. వీళ్లు తప్ప బ్యాంకుల ముందు క్యూలైన్లలో ఎవరున్నారు? బడాబాబులు బయటికి రాలేదేం? కొందరి వద్దకే రూ.100 నోట్ల బండిళ్లు ఎలా వెళ్లాయి? వాళ్లు 20 శాతం కమిషన్ తీసుకుని పేదలకు డబ్బులివ్వడమేంటి? 500,1000 నోట్లు రద్దవుతాయని వాళ్లకు ముందే తెలుసు అనడానికి ఇంతకంటే రుజువు కావాలా?’అని కేజ్రీవాల్ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ప్రశ్నించారు. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్నవారితోపాటు దేశీయంగా నల్లధనం కలిగి ఉన్న 6000 మంది పైచిలుకు నల్ల బాబుల జాబితా 2011లోనే బయటపడిందని, జాబితా వెల్లడిలో స్వయంగా తానే కీలక పాత్ర పోశించానని కేజ్రీవాల్ అన్నారు. నాటి జాబితాలోని పేర్లను ప్రభుత్వాలు, కోర్టులు కూడా నిర్ధారించాయని, 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ కూడా నల్ల ధనం అంశాన్నే ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నారని గుర్తుచేశారు. ‘ఎన్నికలకు ముందు మోదీ చెప్పిన మాటలన్నీ అధికారంలోకి రాగానే మర్చిపోయారు. ఎందుకంటే ఆ 6000 మందిలో ఆయన సన్నిహితులు కూడా ఉన్నారు. ఇంకా దారుణం ఏమంటే పాత నోట్ల రద్దుకు సంబంధించిన నిర్ణయం కూడా ఆ బడాబాబులకు ముందే చెప్పేశారు. దీంతో వాళ్లు ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు చేసుకున్నారు. అందుకే క్యూలైన్లలో వాళ్లు మచ్చుకైనా అగుపించడం లేదు’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘మన దేశంలో నల్లధనం ఎవరెవరి దగ్గర ఉందో చిన్న పిల్లాడికి సైతం తెలుసు’అని గత డిసెంబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ను గుర్తుచేస్తూ.. ఆ విషయం తెలిసన తర్వాత కూడా మోదీ ఏమీ చెయ్యకుండా ఉండటం కుట్రలో భాగమేనని కేజ్రీవాల్ అన్నారు. పెద్ద నోట్లు రద్దు ఆహ్వానించదగ్గ పరిణామామే అయినా, దాని స్థానంలో రూ.2000 నోటు తీసుకురావడం ఘోరాతిఘోరమని, దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. 2000 నోట్లు వల్ల నల్లధనం పెరుగుతుందే తప్ప తగ్గే సమస్యేలేదని ఆయన అంటున్నారు. ‘పాతనోట్లు రద్దవుతాయని ముందే తెలిసిన ఆ కొందరికే.. కొత్త 2000 నోట్లు అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. కమిషన్ తీసుకుని నేరుగా బడాబాబుల ఇళ్లకు కోత్త నోట్లు చేరవేసే కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. నల్ల బాబుల జోలికి పోకుండా దేశానికి ఏదో మేలు చేస్తున్నట్లు ప్రధాని భ్రమలు కల్పిస్తున్నారని, సామాన్యులను ఇన్ని ఇక్కట్లు పెడుతోన్న మోదీని దేవుడు కూడా క్షమించడని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బ్యాంక్ క్యూలైన్లో నల్ల కుబేరులు కనిపించారా?
-
ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ రాజీనామా
-
ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ రాజీనామా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ అన్ని పదవుల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శనివారం రాజీనామా లేఖను పంపారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నానని, అయితే పార్టీలో కొందరికి తన అంకితభావం, సహృదయత నచ్చలేదని అమనతుల్లా ఖాన్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇదిలావుండగా, ఓ మహిళను బెదిరించిన కేసులో ఢిల్లీ పోలీసులు ఇటీవల అమనతుల్లా ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మంత్రి సందీప్ కుమార్ ఓ మహిళతో అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నట్టు ఇటీవల ఓ సీడీ బయటకురావడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించడంతో పాటు ఆప్ నుంచి బహిష్కరించారు. సీడీలో ఉన్న మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు సందీప్‌పై రేప్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. -
ఢిల్లీని నాశనం చేయాలని చూస్తున్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీని నాశనం చేయాలని భావిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఇద్దరు కీలక బ్యూరోక్రాట్లను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అకస్మాత్తుగా బదిలీ చేయడంపై కేజ్రీవాల్ నిరసన వ్యక్తం చేశారు. నజీబ్ జంగ్ మంగళవారం ఢిల్లీ ఆరోగ్య శాఖ కార్యదర్శి తరుణ్ సేన్, పీడబ్ల్యూడీ సెక్రటరీ శ్రీవాత్సవను బదిలీ చేశారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. 'లెఫ్టినెంగ్ గవర్నర్ ఈ రోజు కొంతమంది అధికారులను బదిలీ చేశారు. ముఖ్యమంత్రికి కానీ ఇతర మంత్రులకు కానీ ఫైల్స్ చూపలేదు. మోదీ తరహా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా?' అని ప్రశ్నించారు. లెఫ్టినెంగ్ గవర్నర్ ద్వారా ఢిల్లీని నాశనం చేసేందుకు మోదీ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. అధికారులను బదిలీ చేయవద్దంటూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పలుమార్లు విజ్ఞప్తి చేసినా జంగ్ పట్టించుకోలేదని విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ చూస్తున్నారని మంత్రులు ఆరోపించారు. -
'అద్భుతమైన రాష్ట్రాన్ని ఆగం చేశారు'
అమృత్ సర్: డ్రగ్స్ బానిసలు కావచ్చు.. అక్రమ రవాణాదారులు కావచ్చు.. ఏదో ఒకవిధంగా పంజాబ్ లో మాదకద్రవ్యాల ప్రభావం పడని కుటుంబం లేదని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అన్ని రకాలుగా అద్భుతమైన రాష్ట్రాన్ని అధికార అకాలీదల్- బీజేపీలు ఆగం చేశాయని, పంజాబ్ ను డ్రగ్స్ హబ్ గా మార్చేశాయని విమర్శించారు. తనపై దాఖలైన పరువునష్టం కేసులో విచారణ ఎదుర్కొనేందుకు అమృత్ సర్ వచ్చిన కేజ్రీవాల్ కోర్టులో బెయిల్ మంజూరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అకాలీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు. 'పంజాబ్ లోని ప్రతి ఇల్లు డ్రగ్స్ సమస్యను ఎదుర్కొంటోంది. ఎవరైనా దీనిని ఎదిరిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి నోరుమూయిస్తున్నది' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ అక్రమ సరఫరా ముఠాతో పంజాబ్ రెవెన్యూ మంత్రి బిక్రమ్ జిత్ సింగ్ కు సంబంధాలున్నాయంటూ కేజ్రీవాల్, పంజాబ్ ఆప్ నేత సంజయ్ సింగ్ గతంలో చేసిన ఆరోపణలపై పరువునష్టం కేసు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం తన ముందు హాజరైన కేజ్రీవాల్, సంజయ్ లకు కోర్టు బెయిల్ మంజూరు చేసి, విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. ఆరు నెలల్లోగా అరెస్టు చేయండి, లేదా.. రెవెన్యూ మంత్రి బిక్రమ్ జిత్ సింగ్ ముమ్మాటికీ డ్రగ్స్ సరఫరాదారుడేనన్న వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటానని, అక్రమ కేసులకు బెదరనని కేజ్రీవాల్ అన్నారు. 'బిక్రమ్ సింగ్.. మీరు మరో ఆరు నెలలు అధికారంలో ఉంటారు. ఈలోగా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయడండి. లేదంటారా.. ఎన్నికలు అయిపోయిన ఆరు నెలల్లోగా అరెస్టుకు సిద్ధంగా ఉండండి'అని పంజాబ్ రెవెన్యూ మంత్రిని ఉద్దేశించి హెచ్చరించారు. 2017లో జరగనున్న ఎన్నికల్లో అకాలీదళ్- బీజేపీ కూటమికి ఓటమి తప్పదని, ఆప్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిని అరికట్టి కొత్త పంజాబ్(నయా పంజాబ్)ను సృష్టిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా, విచారణ సందర్భంగా కోర్టు వద్దకు ఆప్, అకాలీదళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. -
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బేడీ
న్యూఢిల్లీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. బేడీ గతంలో ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేశారు. రిటైరైన తర్వాత సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏడాది క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి ఘోరంగా ఓడారు. కృష్ణానగర్ నుంచి పోటీచేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు బీజే పీ ప్రభుత్వం ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని కట్టబెట్టింది. ఎల్జీగా నియమితులైన బేడీకి కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. తాజాగా పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లకు గాను కాంగ్రెస్ డీఎంకే కూటమి 17 సీట్లను గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. -
పార్లమెంట్లో ముఖ్యమంత్రిపై తీవ్రవ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సభలో లేనివారి గురించి మాట్లాడటం సభ్యత కాదని తెలిసినా, స్పీకర్ స్థానం వారిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి. 'ఆ ముఖ్యమంత్రి అరచకవాది.. నాటకాలాడుతున్నారు.. ఈ సీఎంను ఏదోఒకటి చెయ్యాలి..' అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం లోక్ సభలో జీరోఅవర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో అమలవుతున్న 'సరి-బేసి' విధానంపై జీరో అవర్ లో చర్చను లేవనెత్తిన ఎంపీ రమేశ్.. ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలను దాటవేస్తున్నారని కేజ్రీవాల్ పై మండిపడ్డారు. 'కేజ్రీవాల్ ఒక అచారకవాది. ముఖ్యమైన సమస్యలేవీ ఆయనకు పట్టవు. అన్నీ వదిలేసి 'సరి బేసి' విధానమంటూ నాటకాలాడుతున్నారు. ఢిల్లీలో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. దానిపై సీఎం మాట్లాడరు. రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకోసం మెట్రోరైల్ పొడగించాలంటే ఆయన ముందుకు కదలరు' అని ఎంపీ రమేశ్ సభలో ఆవేశపూరితంగా మాట్లాడారు. జనవరి నాటికి ఢిల్లీ మెట్రో నాలుగో ఫేస్ పనులు మొదలుకావాల్సి ఉండగా, సీఎం నిర్లక్ష్యం వల్లే నేటికి పనులు ప్రారంభంకాలేదని, ఆ పనిని త్వరగా పూర్తిచేయగలిగితే దక్షిణ ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కీలక ఫైళ్లు సీఎం కార్యాలయంలో మగ్గుతున్నాయన్నారు. కేజ్రీవాల్ తీరు చూస్తే కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించాలని ఆయన కోరుకుంటున్నట్లుందని ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రిని ఏదో ఒకటి చెయ్యాలని సభద్వారా కోరుకుంటున్నట్లు రమేశ్ వ్యాఖ్యానించారు. ఆయన మాటలకు సహచర బీజేపీలు బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు. -
'ఆ సీన్ రిపీటవనివ్వను'
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి రాష్ట్రపతి పాలనకు అవకాశం ఇవ్వబోనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అరుణా చల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం ఈ పరిస్ధితి తలెత్తిన నేపథ్యంలో అలాంటిది ఢిల్లీలో పునావృతం కానివ్వబోనని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న చట్టప్రతినిధులు ఏం చెప్తున్నారో అనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పనిసరిగా వినాలని, ప్రజల అవసరాల మేరకే ప్రతిపక్షాల డిమాండ్లు ఉండాలని హితవు పలికారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై స్పందన కోరగా 'ఢిల్లీలో మేం ఎప్పటికీ అలాంటి పరిస్థితికి అవకాశం ఇవ్వబోం. వచ్చే రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో ఒక్క సీటుకూడా గెలుచుకోలేదని బీజేపీకి తెలుసు. అందుకే గుంఢాగిరి మార్గాన్ని ఎంచుకుంది. దానిని హిమాచల్ ప్రదేశ్‌లో తర్వాత ఢిల్లీలో ప్రయోగించాలనుకుంటున్నారు. ఢిల్లీలో తొలుత 21మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి.. మరో 23మంది ఎమ్మెల్యేలను కొనేయాలని అనుకుంటున్నారు' అని కేజ్రీవాల్ ఆరోపించారు. -
క్షమాపణ కోసం అడుక్కుంటోంది
♦ బీజేపీ డిమాండ్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ♦ ఎవరికీ క్లీన్చిట్ ఇవ్వలేదన్న ఢిల్లీ ప్రభుత్వం ♦ డీడీసీఏపై సీబీఐ, ఈడీ విచారణకు కీర్తి ఆజాద్ డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ క్లీన్చిట్ ఇవ్వలేదని, అందువల్ల తాను జైట్లీకి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. జైట్లీపై ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని, అందువల్లే ఆయనపై ఆరోపణలు చేసినందుకు కేజ్రీవాల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదివారం బీజేపీ డిమాండ్ చేసింది. దీనిపై కేజ్రీవాల్ ట్విట్టర్లో స్పందిస్తూ.. బీజేపీ క్షమాపణల కోసం తనను అడుక్కునే పరిస్థితికి వచ్చిందని ఎద్దేవా చేశారు. పరువు నష్టం కేసు దాఖలు చేసిన జైట్లీ క్రాస్ ఎగ్జామిన్‌ను ఎదుర్కోవాలని చెప్పారు. డీడీసీఏలో పలు అవకతవకలు జరిగినట్టు కమిషన్ నిర్ధారించిందని, అయితే దీనికి ఎవరినీ బాధ్యులుగా గుర్తించలేదని స్పష్టం చేశారు. ఎవరికీ క్లీన్చిట్ ఇవ్వలేదు: ఢిల్లీ ప్రభుత్వం తాము ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ జైట్లీకి క్లీన్చిట్ ఇచ్చిందంటూ బీజేపీ ప్రకటించడాన్ని ఢిల్లీ ప్రభుత్వం తప్పుపట్టింది. డీడీసీఏపై దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అన్నారు. జైట్లీ హయాంలో అక్రమాలు జరగనట్లయితే విచారణకు ఎందుకు భయపడుతున్నారని బీజేపీని ప్రశ్నించారు. విచారణ కమిషన్ ఎవరి పేర్లను ప్రస్తావించలేదని, కానీ అవకతవకలు జరిగినట్టు గుర్తించిందని, అంటే దెయ్యాలు వచ్చి అవినీతికి పాల్పడ్డాయా? అని ఎద్దేవా చేశారు. జైట్లీని తప్పించేందుకు ఎందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. విచారణ ప్రక్రియ లైవ్ టెలికాస్ట్ చేయాలి: సుబ్రహ్మణియమ్ కాగా, డీడీసీఏ విచారణ ప్రక్రియను లైవ్‌టెలికాస్ట్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రహ్మణియమ్ కోరారు. దీనివల్ల విచారణ ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని అంటున్నారు. బహిరంగ విచారణ జరపుతామని తాము ముందే చెప్పామని, విచారణ ఎలా సాగుతుందనే విషయాన్ని ప్రపంచంలో ఎక్కడివారైనా సరే చూసేలా టెలికాస్ట్ చేయాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఓ లేఖ రాశారు. మరోవైపు డీడీసీఏ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్లతో విచారణ జరిపించాలని బీజేపీ నుంచి సస్పెండెడ్ ఎంపీ కీర్తి ఆజాద్ డిమాండ్ చేశారు. తాను అరుణ్‌జైట్లీని మాత్రమే టార్గెట్ చేసుకోవడం లేదని, డీడీసీఏ డెరైక్టర్లుగా ఉన్న కాంగ్రెస్ నేతలు రాజీవ్‌శుక్లా, నవీన్ జిందాల్, అర్వీందర్‌సింగ్ లవ్లీ తదితరులు కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
కేజ్రీ! ఆ అధికారెవరో చెప్పండి: సీబీఐ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అసత్య ఆరోపణలతో తప్పుదోవ పట్టిస్తున్నారని సీబీఐ మండిపడింది. ‘కేంద్రం మాట వినని పార్టీలపై సీబీఐ దాడులు చేయాలని కేంద్ర ఆదేశించిందని.. ఓ సీబీఐ అధికారి నాతో చెప్పారు’ అని శుక్రవారం కేజ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ అధికారెవరో చెప్పాలని సీబీఐ అధికార ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్.. కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. భారత అత్యున్నత విచారణ సంస్థను అవమానించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. 'మీకు అలా చెప్పిన అధికారెవరో చెప్పండి చట్ట ప్రకారం చర్యలు ప్రారంభిస్తాం' అని ఆమె అన్నారు. కాగా, ఐఏఎస్ అధికారుల బృందం.. శనివారం కేజ్రీవాల్‌ను కలిసింది. ప్రశాంతంగా, తటస్థంగా పనిచేసే వాతావరణాన్ని కలిపించాలని ఢిల్లీ సీఎంను కోరింది. -
ఢిల్లీ సీఎంఓలో సీబీఐ దాడులు
కేజ్రీవాల్ కార్యదర్శి ఆఫీసులో సోదాలు నన్ను లక్ష్యంగా చేసుకునే దాడులు.. కార్యదర్శి సాకు మాత్రమే: కేజ్రీ ♦ జైట్లీ అక్రమాలపై ఫైలు కోసమే సీబీఐ సోదాలు చేసింది ♦ నన్ను ఎదుర్కోలేక మోదీ పాల్పడుతున్న పిరికి చేష్టలివి ♦ మోదీ పిరికిపంద.. ఉన్మాది: ఢిల్లీ సీఎం ధ్వజం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో రాజకీయ దుమారం చెలరేగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి కార్యాలయంపై సీబీఐ మంగళవారం దాడులు చేసింది. సీబీఐ తన కార్యాలయంలో సోదాలు చేసిందని.. దీనికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని కేజ్రీవాల్ పరుష పదజాలంతో ఆరోపణలు గుప్పించారు. మోదీ ఒక పిరికిపంద, ఉన్మాది అని అభివర్ణించారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆ సంఘానికి గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పాత్రపై తాము దర్యాప్తు చేయిస్తుండటంతో.. దానికి సంబంధించిన ఫైలు కోసం సీబీఐ ఈ దాడులు చేసిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. డజనుకు పైగా సీబీఐ అధికారులు ఉదయం ఢిల్లీ సచివాలయానికి వచ్చారు. కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్రకుమార్గుప్తా సహా ఆరుగురిపై నమోదైన అవినీతి కేసుకు సంబంధించి కుమార్ ఆఫీసు, ఇల్లు సహా 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సచివాలయంలోని మూడో అంతస్తులో కేజ్రీవాల్ ఆఫీసు ఉంది. ఆ పక్కనే కుమార్ ఆఫీసు కూడా ఉంది. సీబీఐ అధికారులు తమ అంతస్తులో సోదాలు నిర్వహిస్తుండగానే కేజ్రీ.. తన కార్యాలయంపై సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నారని ట్విటర్లో తెలిపారు. తాము సీఎం ఆఫీసులో సోదాలు నిర్వహించలేదని, ముఖ్య కార్యదర్శి కుమార్ ఆఫీసులో సోదాలు చేస్తున్నామని సీబీఐ చెప్పగా.. కేజ్రీవాల్ అవి కేవలం సాకులేనంటూ.. సీబీఐ చర్యలు అప్రకటిత అత్యవసర పరిస్థితని అభివర్ణిస్తూ ట్వీట్లు చేశారు. ‘‘సీబీఐ అబద్ధం చెప్తోంది. నా సొంత ఆఫీసులో సోదాలు చేశారు. సీఎం ఆఫీసులో ఫైళ్లను పరిశీలిస్తున్నారు. మోదీ తనకు ఏ ఫైలు కావాలో చెప్పాలి’ అని పేర్కొన్నారు. ఈ సోదాల అనంతరం సీబీఐ అధికారులు గుప్తాను తమ కార్యాలయానికి తీసుకువెళ్లి ప్రశ్నించారు. ఏడు గంటల విచారణ అనంతరం రాత్రి 10:30కు ఆయనను పంపించారు. ఈ కేసులో ఇంటెలిజెంట్ కమ్యునికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ మాజీ ఎండీలు ఎ.కె.దుగ్గల్, జి.కె.నందా, ఆ సంస్థ ప్రస్తుత ఎండీ ఆర్.ఎస్.కౌశిక్, మెసర్స్ ఎండీవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డెరైక్టర్లు సందీప్‌కుమార్, దినేశ్ కె. గుప్తాలను నిందితులుగా సీబీఐ పేర్కొంది. కాగా, ‘కేజ్రీవాల్ అవినీతి కేసులో పాత్రధారి అయిన ఒక అధికారిని కాపాడుతుండటం సిగ్గుచేటు. ఆయన కార్యాలయాన్ని సీబీఐ కనీసం అంటుకోనైనా లేదు’ అని బీజేపీ పేర్కొంది. మోదీని విమర్శించిన కేజ్రీ క్షమాపణ చెప్పాలంది. కాగా, ‘‘కేజ్రీవాల్ ఉదయం చెప్పింది (తన ఆఫీసుపై దాడులు)సరి కాదని తెలుస్తోంది. ఆయన ఇప్పుడు చెప్తున్నది (జైట్లీ హయాంలో డీడీసీఏలో అక్రమాలపై విచారణ ఫైలు కోసమే సీబీఐ సోదాలు) చెత్త’ అని జైట్లీ అన్నారు. జైట్లీ అక్రమాలపై విచారణ ఫైలు కోసం సోదాలు: కేజ్రీవాల్ ‘‘మోదీ నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఈ పిరికి చర్యలకు దిగారు. మోదీ పిరికిపంద, ఉన్మాది. నేను ఎలాంటి సీబీఐ దాడులకూ భయపడేవాణ్ని కాదు.. మోదీగారూ మీకు చెప్తున్నా, మీరు వేరే వాళ్లను భయపెట్టి ఉండొచ్చు. కానీ అలా భయపడే వారిలో నేను లేను. నా తుదిశ్వాస వరకూ పోరాడుతాను. నన్ను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు చేశారు. నా ముఖ్య కార్యదర్శి రాజేంద్రకుమార్ ఆఫీసులో సోదాలు అనటం సాకు మాత్రమే. సీబీఐ ఈ రోజు నా ఆఫీసుకు ఎందుకు వచ్చిందో.. వారు వెదుకుతున్న ఫైల్ ఏమిటో నేను చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అది జైట్లీకి ఉచ్చు బిగిస్తున్న డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) ఫైలు. జైట్లీ చాలా ఏళ్లు డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన హయాంలో డీడీసీఏలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నా ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. అది నివేదిక ఇచ్చింది. దానిపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. సంబంధిత ఫైలు నా ఆఫీసులో ఉంది. నేను హరియాణాలోని సివాన్ గ్రామంలో పుట్టా.. నా మాటలు బాగోలేకపోవచ్చు. కానీ మీ చర్యలు బాగోలేదు. మీ తప్పులకు మీరు దేశానికి క్షమాపణ చెప్పండి.. నా మాటలకు నేను క్షమాపణ చెప్తా’’ - సీబీఐ దాడుల నేపథ్యంలో ట్విటర్లోను, మీడియా ఎదుట కేజ్రీవాల్ వ్యాఖ్యలు కార్యదర్శి ఆఫీసులోనే.. సీఎం ఆఫీసులో కాదు: సీబీఐ ‘‘రాజేంద్రకుమార్ ఆఫీసులోనే సోదాలు నిర్వహిస్తున్నాం. ఢిల్లీలోను, యూపీలోని పలు ప్రాంతాల్లో మొత్తం 14 చోట్ల సోదాలు చేపట్టాం. 2.4 లక్షల నగదు సహా రూ. 16 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. కుమార్ ఇంటి నుంచి రూ. 3 లక్షల విలువైన విదేశీ కరెన్సీనీ స్వాధీనం చేసుకున్నాం. 2007-14 మధ్య అధికారాన్ని దుర్వినియోగంతో ఢిల్లీ ప్రభుత్వ విభాగాల నుంచి రూ. 9.5 కోట్ల విలువైన 5 కాంట్రాక్టుల టెండర్లు కొన్ని సంస్థలకు దక్కేలా చూశారాన్న ఆరోపణలపై కుమార్, తదితరులపై కేసు పెట్టాం. ఢిల్లీ డైలాగ్ కమిషన్ మాజీ సభ్య కార్యదర్శి ఆశిష్‌జోషి ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 120-బి, 13(2), అవినీతి నిరోధక చట్టం 13(1)డి కింద అభియోగాలు నమోదు చేశాం. ఢిల్లీ సీఎం ఆఫీసులో సోదాలు జరిగినట్లు వచ్చిన వార్తలు నిరాధారం.’ -
'వాళ్లను చూస్తుంటే రక్తం మరిగిపోతోంది'
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం చోటుచేసుకున్న సిక్కుల ఊచకోత అంశాన్ని బీజేపీ సహా ఇతర పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నాయే తప్ప, బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం చేయలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 1984 అల్లర్లు జరిగి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సిక్కుల కుటుంబాలకు కేజ్రీవాల్ చెక్కులు అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ నాడు ఊచకోత బాధితులకు న్యాయం దొరికేదుంటే, 2002లో గుజరాత్ అల్లర్లు, తాజాగా దాద్రీ సంఘటన లాంటి ఉదంతాలు చోటుచేసుకుని ఉండేవికావన్నారు. 'అల్లర్లు జరిగి 31 ఏళ్లు గడిచాయి. సిక్కులను దారుణంగా చపినవాళ్లు దర్జాగా తిరుగుతున్నారు. వాళ్లను చూస్తే మన రక్తం మరిగిపోతుంది. ఇంకా ఘోరమైన విషయమేమంటే ఈ ఏడాది ప్రారంభంలో ఆమ్ ఆద్మీపార్టీ అధికారంలోకి వచ్చాకగానీ 1984 అల్లర్లపై సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటుచేయలేదు' అని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో దాదాపు 3 వేల మంది హత్యకుగురైన సంగతి తెలిసిందే. -
ఎమ్మెల్యేల కుటుంబాలతో సీఎం భేటీ
బలం.. కావాల్సిన దానికంటే ఎక్కువే. ఇంకా చెప్పాలంటే చట్టసభలో ప్రత్యర్థులే లేరు. కానీ.. పార్టీలో ఏదో అలజడి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ. గెలిచిన కొద్ది రోజులకే ఒకరిద్దరు ఎమ్మెల్యేల తిరుగుబావుటా, వరుసగా ఉద్వాసనకు గురవుతున్న మంత్రులు, వారిలో కొందరి అరెస్టులు.. ఇలా మలుపులతో సాగిపోతోన్న ఆమ్ ఆద్మీ పార్టీ నౌక.. ఈ సాయంత్రం కాస్తంత సేద తీరింది. పార్టీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలతో సీఎం, సీఎంతో ఎమ్మెల్యేలు మనసువిప్పి మాట్లాడటంతో సర్వత్రా ఊరట లభించింది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో, మరి కొదరిని ఎందుకు పట్టించుకోలేదో తదితర అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేలకు వివరించినట్లు తెలిసింది. అనూహ్యపరిణామాలపట్ల ఆయా కుటుంబాల్లో ఆందోళన చెలరేగడం సహజమేనని, అయితే, రాజకీయాల్లో ఇలాంటివి సహజంగానే భావించాలని ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు సీఎం కేజ్రీవాల్ సూచించారని సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాదిన్నర తర్వాతైనా కుటుంబాలతోసహా తమతో కేజ్రీవాల్ మనసువిప్పి మాట్లాడటం ఆనందం కలిగించిందని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇటీవలే అవినీతి కేసులో ఇరుక్కున్న ఆరోగ్య, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ఆసిమ్ అహ్మద్ ఖాన్ పదవీచ్యుతుడయ్యారు. ఈయనతో కలిపి గడిచిన ఎనిమిది నెలల్లో కేజ్రీవాల్ మంత్రివర్గం నుంచి ఆరుగురు సభ్యులు బయటకు వచ్చారు. భార్యపై హత్యాయత్నం కేసులో సోమనాథ్ భారతి జైలుపాలయ్యారు. జూన్ నెలలో నకిలీ డిగ్రీల కేసులో జితేందర్ సింగ్ తోమర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
'రాష్ట్రపతి పాలన ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు'
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారని చెప్పారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆయన ప్రభుత్వాధికారుల నియామకాలు జరుపుతున్నారని చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య కొంతకాలంగా నియామకాల రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రిన్సిపల్ సెక్రటరీగా రాజేంద్ర కుమార్‌ను నియమిస్తూ జారీ చేసిన కేజ్రీవాల్ ఆదేశాలను నజీబ్ జంగ్ తిరస్కరిస్తూ లేఖ రాయడంతో ఆయన ఈ వివాదంపై మంగళవారం సాయంత్రం రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి సిసోడియా మీడియాతో మాట్లాడుతూ చీఫ్ సెక్రటరీని లెఫ్టినెంట్ గవర్నర్ నియమించినప్పుడు తాము అంగీకరించామని, అయితే, ఆయన అంతటితో ఆగకుండా తమను సంప్రదించకుండా.. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా వేరే మార్గాల ద్వారా ప్రభుత్వాధికారులను నియమిస్తున్నారని చెప్పారు. ఆయన నేరుగా ప్రభుత్వాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని, అయినదానికి కానిదానికి ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే వారిని బెదిరిస్తున్నారని ఈవిషయాలన్నీ రాష్ట్రపతికి విన్నవించామని చెప్పారు. ఇదిలా ఉండగా, తాజా వివాదాల నేపథ్యంలో తమ ప్రధాన కార్యదర్శితో సహా మిగితా కార్యదర్శులందరితో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు కార్యదర్శులంతా ఆ సమావేశానికి రావాలని సిసోడియా ఆదేశించారు. ఇదిలా ఉండగా, అంతకు ముందే నజీబ్ జంగ్ రాష్ట్రపతిని, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిసిన విషయం తెలిసిందే.